Home Blog Page 2252

Another Divorce in Tollywood: విడాకులు తీసుకోనున్న శ్రీను వైట్ల – రూపా వైట్ల?

0

సినిమా ఇండస్ట్రీలో ఎన్ని రంగులు.. హంగులు ఉంటాయో వారి వ్యక్తిగత జీవితంలో బయటకి కనిపించని కొన్ని చేదు సంఘటనలు, అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే వారు వృత్తి పరంగా స్టార్స్ అయినప్పటికీ వాళ్ళు కూడా సాధారణ మనుషులే కదా. వాళ్ళకి కూడా సమస్యలు, ఇబ్బందులు ఉంటాయి. అందులో హీరో హీరోయిన్లు పెళ్ళి చేసుకోవడం అనుకోని పరిస్థితుల్లో విడిపోవడం కూడా మాములు విషయంలా అయిపోయింది.

తాజాగా బెస్ట్ కపుల్ అనబడే విధంగా నడుచుకున్న నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అదే కోవలో ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ కూడా చేరారు. ఇక ఈ లిస్ట్ లో మరో జంట చేరింది. అయితే వారు హీరో హీరోయిన్లు కారు. ఆ జంట దర్శకుడు శ్రీను వైట్ల – రూపా వైట్ల.

ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల నుంచి విడాకులు కావాలని ఆయన భార్య రూపా వైట్ల కోర్టును ఆశ్రయించారు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె నాంపల్లి కోర్టులో ఈ మేరకు డైవర్స్ కు ఫైల్ చేసారని చెప్పుకుంటున్నారు. అది మాత్రమే కాదని, గత నాలుగు సంవత్సరాలుగా ఈ దంపతులు విడిగా ఉంటున్నారని చెప్తున్నారు. అభిప్రాయ భేధాలు విపరీతంగా పెరిగి పోవటమే విడాకులుకు కారణంగా వినపడుతోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఈ విషయం నిజమో కాదో తెలియాలంటే ఇరు పక్షాలలో ఎవరో ఒకరు పెదవి విప్పాల్సిందే.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. శ్రీనువైట్ల ప్రస్తుతం పూర్వ తన వైభవాన్ని అందుకోవడం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు, బాద్ షా లాంటి బ్లాక్ బస్టర్ హిట్‌లతో ఒక దశలో తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుల జాబితాలో ఉండేవారు. అయితే ఆ తరువాత వరుస పరాజయాల వల్ల వెనక్కి తగ్గిపోయారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తీసిన ‘మిస్టర్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అవగా.. రవితేజ హీరోగా ‘అమర్ అక్బర్ ఆంటోని’ అనే చిత్రం కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శ్రీను వైట్ల మంచు విష్ణుతో ఢీ అండ్ ఢీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. వారి కాంబినేషన్లో వచ్చిన ఢీ సీక్వెల్ గా ఆ సినిమా ఉంటుందనే మాట వినిపించినా తరువాత అదేమీ లేదని కేవలం టైటిల్ అలా ఉంది తప్ప పార్ట్ 2 కాదని మంచు విష్ణు తెలిపారు.

NBK-108: ఆ టైటిల్ వద్దు అంటున్న బాలయ్య

0

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌‌ భలే ఆసక్తికరంగా ఉంటాయి. ఆ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ ఏ బాలకృష్ణ – అనిల్ రావిపూడి. త్వరలో వీరిద్దరి కలిసి చేస్తున్న సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఫ్ 3 సినిమా తర్వాత అనిల్ రావిపూడి, తన తదుపరి చేయబోయే చిత్రం బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పిన విషయం తెలిసిందే.

ఇది వరకే ఒకసారి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాల్సింది. బాలకృష్ణ 100వ సినిమా అనిల్ రావిపూడి చేయనున్నారని అప్పట్లో వార్తలు వచ్చినా.. ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. ఇక ప్రస్తుతం బాలకృష్ణ – అనిల్ రావిపూడి చేయబోయే సినిమా కథ తండ్రి కూతుళ్ళ మధ్య ఉండబోతోందని సమాచారం.

బాలకృష్ణ కూతురుగా లేటెస్ట్ క్యూట్ గాళ్ శ్రీ లీల కనిపిస్తుండటం విశేషం. ఈ సినిమాలో బాలకృష్ణ యాభై ఏళ్ల వయసు గల పెద్ద మనిషి పాత్రలో కనిపిస్తారట. అయితే ఆయన పాత్రకు మంచి హీరోయిజం మరియు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉంటాయని, అభిమానులను అలరించే విధంగా ఆయన పాత్రను తీర్చిదిద్దుతున్నారని సమాచారం.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి “బ్రో ఐ డోంట్ కేర్” (Bro I Don’t Care) అనే టైటిల్ ను పెట్టాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించారట. అయితే ఆ టైటిల్ అంతగా బాగోలేదని, తెలుగు ప్రేక్షకుల అభిరుచికి, అలాగే అభిమానులకు నచ్చేలా పక్కా మాస్ సినిమా అనిపించేలా టైటిల్ ఉండాలని రావిపూడికి బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది.

బాలకృష్ణ సినిమా అంటే అటు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా పక్కా మాస్ యాక్షన్ సినిమాను ఆశిస్తారు. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి కామెడీ, యాక్షన్ ను చక్కగా మిళితం చేసి ఆకట్టుకుంటూ ఉంటారు. మరి వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమాలో కామెడీకి పెద్ద పీట వేస్తారా లేక యాక్షన్ డామినేట్ చేస్తుందో చూడాలి.

Another divorce in Tollywood, Star director wife applied for the divorce

0

Star director Srinu Vaitla and wife Roopa Vaitla are getting divorced. Roopa had earlier filed for divorce in Nampally court as pr reports. The couple has been staying apart for around 4 years now. Several clashes and misunderstandings have led to this situation and after many years, they have decided to part ways.

On a professional front as well, Vaitla is not doing that great. The director who once directed superhit films like Dookudu, Ready, Baadshah, Venky, and Dhee has been struggling with constant flops. His last few films, Bruce Lee, Mister and Amar Akbar Anthony were disasters at the box office and he has been away from the direction for 4 years now.

Earlier this year he had announced Dhee 2 as his next project. But that too is shelved now and he is now not a part of any big project.

The Warrior is another nightmare for exhibitors and distributors

0

Looks like Tollywood’s troubles at the box office will continue for some more time. This week’s release The Warrior has entered into its 4th day and is performing terribly much to the exhibitors and distributors’ disappointment.

The Warrior is heading towards the biggest disaster for Ram in his career. The 3 days Worldwide share is approx Rs 10Cr and the theatricals are valued at Rs35Cr. Only 28.5 % recovery has been made so far and with weekdays coming and poor word of mouth continuing, a breakeven looks highly impossible.

As per the current trends, the film is expected to give more than 50% loss to all the involved parties.

Lingusamy has directed this action entertainer which featured Ram as a cop for the first time. Krithi Shetty played the female lead while Aadhi Pinnisetty featured in a negative role. The Warrior opened to mostly negative reviews and the film continued the Tollywood slump which saw recent films like Ante Sundaraniki and Pakka Commercial failing as well.

Did Netflix cancel the deal of Nayanthara- Vignesh wedding ceremony?

0

A few months back it was reported that the much-awaited Nayanthara- Vignesh wedding will be streamed on Netflix. The star-studded wedding evoked great interest from all circles and this is why Netflix was interested in a deal that was estimated to be of Rs 25 crores.

However, as per fresh reports, Netflix has canceled the deal and is no longer taking this project ahead. Vignesh Shivan shared photos of the wedding on the completion of one month, in which some celebrities including Shahrukh Khan, Rajinikanth, filmmakers Mani Ratnam and Atlee were also seen.

Netflix, as per the deal was planning to keep these appearances under wraps and wanted to reveal these star appearances straight in the documentary. With already so much revealed through social media, the OTT giant sees little value in going ahead with the project.

Nayanthara and Vignesh got married on June 9th at a resort in Mahabalipuram in Tamil Nadu. It was a royal yet low-key event in presence of close friends and family members followed by a lavish wedding reception in Chennai. The actress and the director have been dating for quite several years and worked together on films like Naanum Rowdy Dhaan, Kaathuvaakula Rendu Kaadhal

సౌత్ ఇండియన్ సినిమాకి ఐకాన్ గా నిలిచిన అల్లు అర్జున్

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. అంతకంటే ముందు అతను తెలుగు సినిమా పరిశ్రమతో పాటు మలయాళ పరిశ్రమలో కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి.ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చి తనదైన నటన, స్టైల్ మరియు డాన్స్ లతో ప్రాంతాలకు.. భాషలకు అతీతంగా ఇమేజ్ ను, స్టార్డం ను పెంచుకుంటూ వచ్చారు అల్లు అర్జున్.

ఇక గత ఏడాది విడుదలైన “పుష్ప” చిత్రంతో అల్లు అర్జున్ తొలిసారి పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు. ఈ సినిమా హిందీ ప్రేక్షకులను విపరీతంగా అలరించి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. అలాగే ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి. సామీ సామీ, ఊ అంటావా ఉ ఊ ఊ అంటావా పాటలు సోషల్ మీడియాలో సాధారణ ప్రేక్షకుల నుండి సెలబ్రిటీల దాకా అత్యంత విశేష స్థాయిలో ఆదరణ పొందాయి.

ఇప్పుడు ప్రేక్షకులు, ట్రేడ్ మరియు ఇండస్ట్రీ వర్గాలు “పుష్ప -2” కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఇన్ని భారీ అంచనాల మధ్య సినిమా వస్తుండటం వల్ల మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని మరింత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించబోతున్నారు.

ఇదిలా ఉంటే… ఇవాళ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రంగాలు, అందరి ప్రేక్షకుల దృష్టి దక్షిణ భారతీయ సినిమా పైనే ఉంది. కేవలం తెలుగు సినిమానే కాకుండా ఇప్పుడు పెద్ద హీరోలు చిన్న హీరోలు అని తేడా లేకుండా అందరూ ద్విభాషా చిత్రాలు, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తెరకెక్కిస్తున్నారు.

ఈ విషయం పైనే ప్రముఖ వార పత్రిక ‘ఇండియా టు డే’ ఒక కవర్ స్టోరీని ప్రచురించింది. తాజా ఇష్యూ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడం విశేషం. తొలి పాన్ ఇండియా సినిమా ‘పుష్ప’తోనే అల్లు అర్జున్ అపారమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు.

ఆ చిత్రంలోని “తగ్గేదేలే” అనే మ్యానరిజం ఇవాళ ప్రతి ప్రేక్షకుడు అలవాటు చేసుకున్నాడు అంటే అది అతిశయోక్తి కాదు. ఇండియా టుడే పత్రిక బన్నీ కవర్ పేజీగా అల్లు అర్జున్ స్టిల్ ను ప్రచురించడంతో.. ఆయన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఐకాన్ గా నిలిచారు అని అభిమానగణం తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.ఈ కవర్ పేజీ ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Mega – 154: మెగాస్టార్ – మాస్ మహరాజ్ కాంబో కన్ఫర్మ్

0

మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు అని మొదటినుంచి వార్తలు వస్తున్నాయి. గతంలో అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ.. తాజాగా మరోసారి మెగాస్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రుతి హాసన్ నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ అనధికారికంగా ప్రచారంలో ఉంది.

ఇక ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో గురువారం రవితేజ అడుగుపెట్టారని సమాచారం. చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపిస్తున్నారని రకరకాల పుకార్లు మరియు ఊహగానాలు వస్తున్నాయి. అన్నయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా మెప్పించిన మాస్ మహారాజా.. శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో ఓ పాటలో కూడా కనిపించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మెగాస్టార్‌తో నటించబోతుండడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కలిస్తే ఆ దృశ్యం ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ నటిస్తున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా.. ఎట్టకేలకు ఈరోజు ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ధృవీకరించింది.

https://twitter.com/MythriOfficial/status/1548254915964719106?t=A2eHiPc2s8nJDL9Ah_eG_w&s=19

ఈ మేరకు మైత్రి మూవీ మేకర్స్ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్టర్ మరియు వీడియోను విడుదల చేసింది. మెగాస్టార్ మరియు మాస్ మహరాజ్ చేతులు కలిసిన పోస్టర్ చాలా బాగుంది.

ఇక వీడియోలో రవితేజ కార్ దిగే ఘట్టాన్ని ఒక సినిమాలో సీన్ లాగా ఎలివేట్ చేశారు. మాస్ తో పెట్టుకుంటే మడతడి పొద్ది పాట రీమిక్స్ లాగా బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ ఎంట్రీ ఇచ్చిన రవితేజ. “అన్నయ్యా “అంటూ మెగాస్టార్ కారావాన్ డోర్ తెరవడం.. దానికి శంకర్ దాదా మ్యూజిక్ తో చిరంజీవి వెల్కమ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడం చూస్తేనే ఒక రకమైన చక్కని అనుభూతి కలుగుతుంటే.. ఇక వెండితెరపై వీరిద్దరి కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు ఎలా ఉంటుంది అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగించేలా విడియో అద్భుతంగా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నారు. గాడ్ ఫాదర్, భోళాశంకర్, మెగా 154 చిత్రాలను చకచకా పూర్తి చేసే పనిలో ఉన్నారు వీటిలో ముందుగా గాడ్ ఫాదర్ సినిమా రానుంది. మోహన్ రాజా దర్శకత్వంతో మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్‌కు రీమెక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమా కూడా చేస్తున్నారు.ఇక రవితేజ రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉంది. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సముద్రఖని విలన్ గా నటిస్తుండగా.. 9 ఏళ్ళ తరువాత హీరో వేణు ఈ సినిమలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తుందటం విశేషం.

రామారావు అన్ డ్యూటీ ట్రైలర్: సీరియస్ రోల్ లో రవితేజ

0

మాస్ మహారాజ్ రవితేజ .. వయసు పైబడుతున్నా, వరుస సినిమాలతో యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఏకబిగిన సినిమా చేయడమే పనిగా పెట్టుకున్నారు . ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఉన్న రవితేజ.. తాజాగా నటించిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ క్రమంలో ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టారు చిత్ర బృందం. ఇందులో భాగంగా ఒక్కో అప్‌డేట్ వదులుతూ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను జులై 16న విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు.

ఇక ఈరోజు కాస్త ఆలస్యంగా విడుదలైంది ట్రైలర్. ట్రైలర్ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే రవితేజ ఈ సినిమాలో డిప్యూటీ కలెక్టర్ గా కనిపించటం విశేషం. తప్పిపోయిన కొందరు వ్యక్తులను వెతకడం ఆయన బాధ్యతగా తీసుకున్నట్లు అర్థం అవుతుంది. మొదట్లో కాస్త సాత్వికంగా ఉండి.. ఆ తరువాత దూకుడుగా మారే హీరో పాత్రలో రవితేజ కనిపిస్తున్నారు. అలాగే ట్రైలర్ లో ఒకప్పటి హీరో వేణు కూడా కనిపించారు. అయితే మాస్ మహారాజ్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఈ ట్రైలర్ లో అసలు కనపడక పోవటం గమనార్హం.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, రవితేజ టీం వర్క్స్ బ్యానర్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా జూలై 29న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. 1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేణు తొట్టెంపూడి చాలా గ్యాప్ తర్వాత ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.

నయనతార – విఘ్నేష్ శివన్ ల వివాహ ఒప్పందాన్ని రద్దు చేసిన నెట్ఫ్లిక్స్ ?

0

తెలుగు,తమిళ, మలయాళ భాషల్లో నటించి తనదైన శైలిలో ఇమేజ్ ను స్టార్డం ను సంపాదించుకున్నారు నయనతార. ప్రాంతాలకి అతీతంగా ఒక వెలుగు వెలిగిన ఆమె కేవలం ఒక సాధారణ హీరోయిన్ గానే కాదు.. మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మార్కెట్ తెచ్చిపెట్టిన హీరోయిన్ గా తనకంటూ ఒక స్థాయిని ఏర్పరచుకుని లేడీ సూపర్ స్టార్ గా ఎదిగారు.

ఇక ఇటీవలే నయనతార వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ – నయనతార చాలా కాలంగా ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.చెన్నై సమీపంలోని మహాబలేశ్వరంలో ఒక ప్రైవేట్ రిసార్ట్ లో వీరి విహహం జరిగింది. ఈ వివాహ వేడుకను తమిళ స్టార్ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక సినిమా తెరకెక్కించిన స్థాయిలో షూట్ చేయడం విశేషం. ఈ పెళ్లి వేడుకకు సంభందించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏవీ బయటకు రాలేదు.నయన్, విఘ్నేష్ తో కొంత మంది సినీ ప్రముఖులు దిగిన ఫోటోలు మాత్రమే బయటకు వచ్చాయి.

మిగతా ఫోటోలు, వీడియోలు బయటకి రాలేదు. ఎందుకంటే ఈ పెళ్ళి వేడుక ప్రసార హక్కులను ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధర చెల్లించి కొనుగోలు చేయడమే అందుకు కారణం. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ ఒప్పందాన్ని నెట్ఫ్లిక్స్ సంస్థ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అందుకు నయన్ – విఘ్నేష్ శివన్ లే కారణం అట. వివాహం జరిగి నెల రోజులు అయిన తరువాత దంపతులు కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అలా ఫోటోలు షేర్ చేయడం నెట్ఫ్లిక్స్ ఒప్పందానికి విరుద్ధం అట. నిభందనలు ఉల్లంఘించిన కారణంగా నెట్ఫ్లిక్స్ తమ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ విషయంపై అటు నయనతార దంపతులు కానీ.. నెట్ఫ్లిక్స్ సంస్థ కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి నిజం ఏదో తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.

అమీర్ ఖాన్ సినిమాను తెలుగులో సమర్పించనున్న మెగాస్టార్ చిరంజీవి

0

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ ఆగస్టు 11న విడుదలకు సిద్ధమవుతోంది. కరీనా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హీరో అమీర్‌ఖాన్‌ హైదరాబాద్‌లోని మెగాస్టార్ చిరంజీవి నివాసంలో ప్రత్యేకంగా ప్రీమియర్ షోను ప్రదర్శించారు. ఈ ప్రివ్యూ షోకు అమీర్‌ఖాన్, చిరంజీవితో పాటు నాగార్జున, రాజమౌళి, సుకుమార్‌ కూడా హాజరయ్యారు.

ఈ సినిమా వీక్షించిన అనంతరం మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో అమీర్ ఖాన్, నాగచైతన్య నటనను ఆయన ఎంతగానో ప్రశంసించారు. ఇది అమీర్ డ్రీమ్ ప్రాజెక్టు అని.. ఇంత అద్భుతమైన సినిమాను వీక్షించే అవకాశం ఇచ్చినందుకు బదులుగా ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

అయితే లాల్‌సింగ్ చద్దా సినిమా తెలుగులో కూడా విడుదలవుతోంది. తెలుగు వెర్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యహరిస్తున్నారు. ఈ విషయాన్ని చిరంజీవే స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ సందర్భంగా ‘లాల్ సింగ్ చద్దా’ తెలుగు పోస్టర్‌ను ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. తన ఆప్తమిత్రుడు అమీర్ ఖాన్ నటించిన ఎమోషనల్ చిత్రాన్ని తెలుగులో సమర్పించాడన్ని అదృష్టంగా భావిస్తున్నానని చిరు తెలిపారు. అమీర్‌ను మరోసారి తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని కూడా పేర్కొన్నారు.

“లాల్ సింగ్ చద్దా” హాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కింది. ఆ చిత్రం ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకోవడం విశేషం. అమీర్ ఖాన్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ఈ చిత్ర విజయం పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కరీనా కపూర్, మోనా సింగ్, మానవ్ విజ్, ఆర్యా శర్మ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తో కలిసి వయాకామ్18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.