Home Blog Page 2055

రీమేక్‌లు చేయడం వల్ల చాలా మంది ప్రేక్షకులను కోల్పోతాం అంటున్న రామ్ చరణ్

0

ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. అయితే అందులో ఒక ప్రశ్న మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రీమేక్‌ సినిమాలు సాధారణంగా సినిమాకు చూసే కొంత మంది ప్రేక్షకుల శాతాన్ని కోల్పోతున్నాయని ఇంటర్వ్యూ హోస్ట్ చరణ్‌ ను అడిగారు. అందుకు మెగా పవర్ స్టార్ ఇచ్చిన స్పందనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

OTT యుగంలో రీమేక్‌లు ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కొంటాయని చరణ్ అంగీకరించారు. ఆయన ప్రకారం, ఒకసారి OTTలో సినిమా చూసిన ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లలోకి అదే సినిమా వస్తే చూడటానికి ఆసక్తి చూపకపోవచ్చు. అయితే, సూపర్‌స్టార్ వంటి ఇమేజ్ ఇన్న హీరోలు రీమేక్‌లు చేయడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని తన వాదనను సమర్ధించుకునెందుకు ఆయన పేర్కొన్నారు.

నిజానికి రీమేక్‌లు ఎక్కువ చేస్తారని మెగా ఫ్యామిలీకి పేరుంది. చిరంజీవి గత నాలుగు సినిమాల్లో రెండు రీమేక్‌లు చేశారు. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ స్క్రిప్ట్‌ని చాలా అరుదుగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రీమేక్‌ల పై అడిగిన ప్రశ్నకు చరణ్‌ స్పందించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి లూసిఫర్‌ రీమేక్‌ని చిరంజీవికి సూచించింది ఆయనే.

అభిమానులు కూడా రీమేక్‌లకు వ్యతిరేకంగా ఉన్నారు మరియు వారు రీమేక్‌లకు తక్కువ ఓపెనింగ్స్‌ని ఆపాదిస్తున్నారు. పేలవమైన బజ్ కారణంగా గాడ్ ఫాదర్ స్టార్ హీరో స్థాయి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. లూసిఫర్‌ను చాలా మంది తెలుగు యువత OTTలో వీక్షించడమే అందుకు కారణం. ఇక పింక్, అయ్యప్పనుమ్ కోషియం సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుంది.

ఇంట్లో తీరిగ్గా సెల్ ఫోన్ లోనే ఒరిజినల్‌ని చూసే అవకాశం ఉన్నప్పుడు, రీమేక్‌లు చేయడం ఇప్పుడు పాత కాన్సెప్ట్‌గా మారాయి. అయితే రీమేక్‌లో చాలా వరకు ఒరిజినల్‌లోని సారాంశం పోతుందని.. ఒరిజినల్‌ కంటే రీమేక్‌లు బెటర్‌గా ఉంటాయని, రిస్క్‌తో కూడుకున్నవి అని చిరంజీవి ఈ వాదనలను సమర్థించారు.

కానీ, ఒరిజినల్ ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు, రీమేక్ చూడటానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది? మెగా హీరోలు రీమేక్‌లు చేయడాన్ని అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి వారు లోతుగా ఆలోచించాలి.

We miss a large chunk of audience by doing remakes, says Ram Charan

0

In a recent interview with Hindustan Times, Ram Charan was asked several questions, but one question had caught everyone’s attention. The host of the interview complained Charan regarding remakes losing a section of audience. Mega Power star’s response is the hot topic now.

Charan accepted that remakes in OTT era definitely will face issues. According to him, audiences who already watched the movie may not be interested to watch the movie coming to theaters. However, in his defense he added that Superstars doing remakes might bring audiences to theaters.

Mega family is known for doing remakes. Chiranjeevi has done two remakes in last four movies. Pawan Kalyan is rarely doing original script. In this scenario, Charan responding to a question on remakes is interesting. In fact, he was the one who suggested Lucifer remake to Chiranjeevi.

Fans are also against remakes, and they are attributing fewer openings to remakes. Godfather hasn’t garnered star hero level openings due to poor buzz. Lucifer was watched by lot of Telugu youth on OTT, so as Pink Or Ayyapanum Koshiyum.

Remakes are an outdated concept, when there is a chance for watching original with subtitles. Most of the time, the essence of the original is lost in the remake. Chiranjeevi defended these arguments by saying that remakes can be better than original and are more risky.

Still, when the original is freely available what is the point of watching a remake? These questions have to be deeply thought about when fans are against the idea of mega heroes doing remakes.

Rishab Shetty’s remarks on Rashmika surprise fans

0

Post the massive success of Kantara, Rishab Shetty is being hounded by media houses from all over India for his special bytes or interviews. A large section of Bollywood media and national news channels eagerly awaits an exclusive spot with Rishab Shetty to know more about Kantara.

Meanwhile, during one such interview, Rishab Shetty’s statement made some news and surprised many fans. Answering a question about who he would like to work with for his next film among Rashmika, Samantha, Sai Pallavi, and Keerthy Suresh, Rishab Shetty made his choice abundantly clear.

He said, ‘I don’t want to work with a “certain type of actresses”. However, out of the list that you have given, I really like Sai Pallavi and Samantha’s work.’ This response in a sarcastic manner is being perceived by many as an indirect dig towards Rashmika. He added that he doesn’t choose actors before finishing the script. In fact, it is only after completing the script work does he think of casting.

Th actor/ director added that he always prefers working with newcomers as they come without baggage or image.

మసూదా మొదటి వారాంతం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు

0

టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా మసూదా చిన్న సినిమా నిలుస్తుంది. ఈ హారర్ మూవీకి విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం అద్భుతమైన సమీక్షలను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. మొదటి మూడు రోజుల వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి మరియు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఈ చిత్రం నిజానికి తక్కువ స్క్రీన్‌లతో బాక్సాఫీస్ వద్ద సాధారణ ఓపెనింగ్స్ తో ప్రారంభమైంది. అయితే పాజిటివ్ టాక్ కారణంగా సినిమా మొదటి రోజు కంటే రెండవ రోజు.. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ కలెక్షన్లతో ట్రెండ్ అయింది. మూడవ రోజు ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల కంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది. హైదరాబాద్ నగరం మసూదాకు అతిపెద్ద ఆదాయ ప్రాంతంగా నిలిచింది. నైజాంలో ఈ చిత్రం మొదటి వారాంతంలో దాదాపు 1.3 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది.

ఒకప్పటి హీరోయిన్ సంగీత తన యుక్తవయస్సులో ఉన్న కుమార్తెను దుష్టశక్తుల నుండి రక్షించే లక్ష్యంతో తల్లి పాత్రను ఈ చిత్రంలో పోషించారు. ఆమె నటిగా ఎప్పుడూ మంచి ఇమేజ్‌ని కలిగి ఉండగా.. ఈ పాత్రలో ఆమె అద్భుతమైన నటనతో మరోసారి తన సామర్థ్యాన్ని చూపించారు.

ఇక వర్ధమాన నటుడు తిరువీర్ కూడా తన సహజమైన నటనతో మెప్పించారు, బాంధవి శ్రీధర్ దెయ్యం చేత భాదింపబడే అమ్మాయి పాత్రలో మెప్పించారు. అలాగే ముఖ్య పాత్రల్లో సీనీయర్ నటుడు శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ సినిమాకి మరో బలంగా నిలిచారు.

సెకండాఫ్‌లో ప్రేక్షకులను అయోమయంలో ఉంచే ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను డీల్ చేయడంలో తొలి దర్శకుడు సాయి కిరణ్ అద్భుతంగా పని చేశారు. కొన్ని సంవత్సరాల నుండి హార్రర్ శైలిని కామెడీతో మిళితం చేసి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ నూతన దర్శకుడు చాలా కాలం తర్వాత నిజమైన హారర్ జానర్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చారు.

ఫలితంగా మౌత్ టాక్ బలంగా పెరగడంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. మూడో రోజు మొదటి రోజు కంటే మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఎప్పటికైనా కంటెంట్‌ యే కింగ్ అని మసూదా చిత్రం మరోసారి నిరూపించింది.

హారర్ జానర్‌కు తెలుగులో మంచి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కానీ ఆ మార్కెట్‌ను ఎందుకో ఎవరూ పెద్దగా అన్వేషించలేదు. ఇంతకుముందు అరుంధతి వంటి సినిమాలు ఆ కాలంలో అద్భుతమైన వసూళ్లను సాధించాయి. మసూదా విజయంతో హారర్ సినిమాల ట్రెండ్ మరోసారి మొదలవుతుందని ఆశిద్దాం.

Masooda 1st weekend Telugu States Box office collections

0

Masooda a small movie is the latest sensation in Tollywood. Critics and audiences are getting glued to this horror movie. The movie has received excellent reviews and also doing well at box office. The first three days have been terrific and the returns at the boxoffice are only growing day by day.

The film started with less screens and ordinary start at Box office. But with positive WOM the movie has jumped over day2 and trended like Day1 << Day2 << Day3 . On Day3 the film has collected more than triple of 1st day collections. Hyderabad city is the biggest revenue territory for Masooda. In nizam the film has collected around 1.3Cr gross for the 1st weekend , in Andhra pradesh the film has collected around 1Cr gross for the weekend.

Yesteryear actress Sangeetha has played a mother role in the movie who is on a mission to save her adolescent daughter from evil forces. She had always a good image as an actor and with this role she showed her potential once at again with a terrific performance.

Upcoming Actor Thiruveer also has impressed with his natural act while Bandhavi Sridhar was convincing in the role of a possessed girl.

The debut director Sai Kiran had did a fantastic job in dealing an interesting screenplay that keeps audience puzzled in second half. Horror genre was mixed with comedy from few years and its glory has been brought back by this debutant director.

As a result the collections are increasing as word of mouth is strongly growing. The third day has seen collections that are thrice that of day 1. This shows that content is the king any day.

Horror genre has good target audience in Telugu but the market hasn’t been explored much. Previously movies like Arundhati went on to become one of the leading grossers of that time. Hope the trend begins once again with the success of Masooda.

బాక్సాఫీస్ వద్ద యశోద ను డామినేట్ చేసిన సుడిగాలి సుధీర్ గాలోడు

0

జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనూహ్యంగా ఇప్పటివరకూ 4 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి సంచలనం సృష్టించింది. బ్రేక్ ఈవెన్ మార్కును దాటసి లాభాల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో గాలోడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ వారాంతంలో యశోదను మించిపోయింది.

ఈ చిత్రం 2.5 కోట్లకి బిజినెస్ జరుపుకోగా.. ఇప్పటికే 80% థియేట్రికల్ హక్కులను రికవరీ చేసింది. జీరో హైప్‌తో విడుదలైన ఈ చిత్రం సుధీర్‌కు గణనీయమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉందని ఇది చూపిస్తుంది. ప్రమోషన్‌లు ఏమీ పెద్దగా లేకుండానే ఇంతటి ఘన విజయం సాధించడం విశేషం. సూపర్ హిట్ అయిన నీ కళ్లే దీపావళి పాట ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరోవైపు, సమంత నటించిన యశోద ప్రారంభ వారాంతంలో మంచి కలెక్షన్లు తెచ్చుకున్నా, ఆ తర్వాత వారం రోజులలో అకస్మాత్తుగా పడిపోయింది. యశోద వదిలిన ఖాళీని గాలోడు వాడుకుంటున్నాడు. టాలీవుడ్‌లో మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. అలాంటి కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

సుడిగాలి సుధీర్ ఈ ఇమేజ్ ను పొందడానికి చాలా కష్టపడ్డారు మరియు జబర్దస్త్ షో వరకూ తను ఎల్లప్పుడూ బలమైన అభిమానులను ఆస్వాదించారు. అయితే ఆ పాపులారిటీని సినిమాల్లోకి అనువదించలేదు, తన మొదటి రెండు సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కాలేకపోయారు.

సుధీర్ నటించిన తొలి సినిమా సాఫ్ట్‌వేర్ సుధీర్, తర్వాత కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించిన వాంటెడ్ పండుగాడ్.. ఈ రెండు సినిమాలను అందరూ ఏకగ్రీవంగా పూర్తిగా కొట్టిపారేశారు. కానీ గాలోడు సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో సఫలం అయింది.

‘గాలోడు’ సినిమాతో సుధీర్ మాస్ ఆడియన్స్‌లో బలమైన మార్కెట్‌ని ఏర్పరచుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ అతను తన రాబోయే సినిమాల ఎంపికలలో చాలా తెలివిగా ఉండాలి కాని ఏదో సినిమాలు చేయాలి కాబట్టి కొంతమందిని సంతోషపెట్టడానికి సాధారణ స్క్రిప్ట్‌లను ఎంచుకోకూడదు. అందివచ్చిన ఈ మార్కెట్‌ను సుడిగాలి సుధీర్ తెలివిగా ఉపయోగించుకుంటారని మరియు రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన కథలతో సినిమాలు చేస్తారని ఆశిద్దాం.

Jabardasth Sudheer’s Gaalodu dominated Samantha’s Yashoda at this weekend box office

0

Gaalodu is an unexpected sensation at 4 crores gross until now. It is racing towards profits. With this rage at box office, it has surpassed Yashoda this weekend. The film has already recovered 80% of the theatrical rights, valuing at 2.5 crores.

This shows that Sudheer enjoys considerable following, as the movie released with zero hype. The promotions are below par. Nee Kalle Diwali song which became super hit was the only thing which drawn attention from the audience before the movie’s release.

On the other hand, though, Samantha’s Yashoda has seen sharp opening weekend, but it suddenly dropped on weekdays. The space Yashoda left is being used by Gaalodu. This shows that mass entertainment still has relevance in tollywood. Audiences are waiting for such content.

Sudigali Sudheer worked hard to get the fame, and he has always enjoyed a strong fan base when it comes to the Jabardasth show. But the popularity wasn’t translated into the movies, he was not successful in bringing the audience to the theaters for his first two movies. Whether it was Software Sudheer or Wanted PanduGod, both movies were utterly dismissed by everyone.

With Gaalodu, it looks like Sudheer has set himself a strong market for mass audiences. But he must be wise in his upcoming choices and not choose routine scripts to just please a few people. We can only hope that he uses this market wisely and goes for some unique stories.

ఆదిపురుష్ కంటే హనుమాన్ టీజర్ ఏ బాగుంది – ప్రభాస్ ఫ్యాన్స్ తో సహా అందరిదీ ఇదే మాట

0

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం హనుమాన్, ఈ ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ తాజాగా విడుదలైంది. కాగా విడుదలయిన అప్పటి నుండి ఈ టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఏదో చిన్న సినిమా అని అందరూ భావించగా.. టీజర్ లోని అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

అయితే, ఎంకి పెళ్ళి సుబ్బి గాడి చావుకు వచ్చినట్టు హనుమాన్ టీజర్ తర్వాత ఆదిపురుష్ సినిమా పై విమర్శలు కూడా అదే స్థాయిలో మళ్ళీ తెర పైకి వచ్చాయి. హనుమాన్ టీజర్ చూసిన వారంతా ఆదిపురుష్ టీజర్ ను గుర్తు చేసుకుంటున్నారు.

ప్రభాస్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా హనుమాన్ తో పోలిస్తే ఆదిపురుష్ టీజర్ నాణ్యత చాలా తక్కువగా ఉందని, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ఏమాత్రం ఒక పెద్ద సినిమా స్థాయికి తగ్గట్టుగా లేవని ఫిర్యాదు చేస్తున్నారు. ఆదిపురుష్ దర్శకుడు ఓం రౌత్ 300 కోట్లకు పైగా బడ్జెట్ తీసుకున్నప్పటికీ తక్కువ క్వాలిటీ చూపించడం వల్ల విమర్శలు పొందుతున్నారు. ఈ సందర్భంగా కొన్ని ఫన్నీ మీమ్స్ మరియు ట్వీట్లు వైరల్ అయ్యాయి.

ఇక తక్కువ బడ్జెట్‌తోనే ప్రశాంత్ వర్మ మెరుగైన నాణ్యతను సాధించగలిగారని ఆయన పై ప్రేక్షకులు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. ఓం రౌత్ అసమర్థుడని, ప్రశాంత్ నుంచి తనను నేర్చుకోమని సలహా ఇస్తున్నారు ప్రేక్షకులు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్యాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న హనుమాన్ చిత్రంలో తేజ సజ్జ ప్రధాన నటుడు కాగా, అమృత అయ్యర్ హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. ఇక వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా, టీజర్‌లో ఆమె పాత్రకు సంబంధించిన సంగ్రహావలోకనం ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో వరలక్ష్మికి మరో పవర్ ఫుల్ రోల్ దొరికినట్లు కనిపిస్తోంది.

సినిమా నిర్మాణంలో డబ్బు మాత్రమే ప్రధానం కాదు అనడానికి హనుమాన్ టీజర్ నిదర్శనంగా నిలిచింది. క్రియేటివిటీ, ప్లానింగ్‌తో పాటు చక్కని విజన్ ఉంటే చిన్న బడ్జెట్‌తో కూడా మంచి సినిమాలు తీయవచ్చు అని ఈ టీజర్ నిరూపించింది. టాలీవుడ్‌లో ఈ మధ్య తక్కువ బడ్జెట్ చిత్రాల నిర్మాతలు మంచి క్వాలిటీని సాధించడం విశేషం. భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలే ఎక్కువ వస్తే అది తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతగానో మేలు చేస్తుంది.

Everyone including Prabhas fans feel Hanuman teaser quality is better than Adipurush

0

Hanuman is the latest movie of Prashanth Varma, the teaser of this fantasy action thriller has just dropped. The teaser is creating ripples in social media and impressed with stunning visual effects.

Hanuman Teaser

However, the criticism on Adipurush has equally resurfaced after Hanuman teaser. Fans of Prabhas and even common audiences are complaining about the poor quality of teaser, especially the visual effects. Director of Adipurush Om raut is getting the backlash for the below par quality despite him getting budget more than 300 crores. There are some funny memes and tweets which have gone viral.

Prashant Varma could achieve better quality with shoestring budget. Fans of Prabhas are furious now that Om Raut is incapable, and advising him to learn from Prashant.

Teja sajja is the lead actor and Amrita Aiyer is his romantic interest. Varalakshmi Sharathkumar is playing a key role and the glimpse of her role seen in the teaser felt striking. Looks like Varalakshmi got another powerful role in Telugu films.

The teaser of Hanuman is an evidence that money isn’t everything in filmmaking. Creativity, imagination, and planning can make better films even with tiny budgets. It’s good to see low-budget filmmakers achieving good quality in tollywood. Such movies will be the future.

NTR30: ఎట్టకేలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కాస్త ఆనందాన్ని ఇచ్చిన కొరటాల శివ

0

ఎన్టీఆర్30వ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి అభిమానులు ఆ సినిమా యొక్క అప్ డేట్స్ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆ మోషన్ పోస్టర్ అభిమానులను థ్రిల్ చేసింది. అయితే ఆ తర్వాత నుంచి ఈ ప్రాజెక్టు పై పూర్తి నిశ్శబ్దం నెలకొంది.

ఆచార్య డిజాస్టర్ అవ్వడంతో ఎన్టీఆర్30 సినిమా ఆగిపోయిందని చాలా ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే ఇటీవలే అన్ని రూమర్‌లకు స్వస్తి పలికిన చిత్ర బృందం.. త్వరలోనే షూటింగ్ ప్రారంభించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటుందని ప్రకటించింది.

దర్శకుడు కొరటాల శివ ఇటీవల కెమెరామెన్ రత్నవేలు మరియు ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌లతో కలిసి కనిపించారు. ఆ ఫోటో చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆనందించారు. ఇక అదే కోవలో ఎన్టీఆర్30 మ్యూజిక్ కోసం అనిరుధ్‌తో కొరటాల చర్చిస్తున్న తాజా చిత్రం ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది.

ఎట్టకేలకు సినిమా పనులు వేగంగా జరుగుతూ ఉండటం చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారు ఒక్క అప్‌డేట్ కోసం టీమ్‌ని రిక్వెస్ట్ చేస్తూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు నిర్మాణ సంస్థ యువసుధ మరియు చిత్ర బృందం ఒకదాని తర్వాత ఒకటి అప్‌డేట్‌లను విడుదల చేస్తూ ప్రీ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతోందనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

కొరటాలతో ఎన్టీఆర్‌కి ఇది రెండవ సినిమా. వారిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం జనతా గ్యారేజ్ ఆ సమయంలో ఎన్టీఆర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈసారి ఆల్ ఇండియా లెవల్‌లో రిపేర్లు చేస్తామని దర్శకుడు హామీ ఇవ్వడంతో జనతా గ్యారేజ్ కంటే సినిమా చాలా పెద్దదిగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఆచార్య ఫెయిల్యూర్ తాలూకు ప్రభావం నుంచి దర్శకుడు కొరటాల చక్కగా కోలుకుని ఎన్టీఆర్ 30లో తన సత్తా చాటాలని ఆశిద్దాం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి దేవర అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.