Home Blog Page 2054

ఇండియాలో రికార్డు టికెట్ ధరలతో ప్రారంభమైన అవతార్ 2 బుకింగ్స్

0

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవతార్ 2 బుకింగ్స్ భారీ స్థాయిలో ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ అవుతుందని అంచనా వేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాతో భారీ లాభాలు సాధించడానికి టిక్కెట్ ధరలను విపరీతంగా పెంచుతున్నారు. మల్టీప్లెక్స్ దిగ్గజం PVR సంస్థ చాలా ఖరీదైన టిక్కెట్ ధరలతో బుకింగ్‌లను ప్రారంభించింది.

టిక్కెట్ ధరలు కనిష్టంగా 500 నుండి ప్రారంభమవగా.. అవి 1200, 1300 మరియు 1500 వరకు కూడా కొనసాగుతున్నాయి. IMAX మరియు 4DXలో రేట్లు ఇంకా ఎక్కువగా ఉన్నాయి, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో చూపబడిన కొన్ని రేట్లు 1650, 1550, 1450, 1350, 1250, 1150 , 1050, 950, 870 వంటి రేట్లతో ఉన్నాయి. (ఇవి బెంగుళూరు IMAX మరియు 4D టిక్కెట్ ధరలు) మల్టీప్లెక్స్‌ల ప్రామాణిక ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఇవి చాలా భారీగా ఉన్నాయి.

ముఖ్యంగా ద్రవ్యోల్బణం తీవ్రంగా దెబ్బతింటున్న సమయంలో మరియు ఆర్థిక మాంద్యం వంటి పరిస్థితుల కారణంగా ప్రజలు థియేటర్‌లకు రాలేని సమయంలో, ఈ అధిక ధరలు వారిని మరింత నిరుత్సాహపరుస్తాయి. సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉందన్న కారణంతో వినియోగదారులను ఇలా దోచుకోవడం మంచిది కాదు.

అవతార్ మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించిన 13 ఏళ్ల తర్వాత అవతార్2 వస్తోంది. జేమ్స్ కామెరాన్ హై-ఎండ్ టెక్నాలజీతో అవతార్ యూనివర్స్‌లో అండర్ వాటర్ అడ్వెంచర్ మూవీని రూపొందించారు.

ఇంతవరకూ ఆయన తెరకెక్కించిన సినిమా ఎప్పుడూ పరాజయం చెందలేదు. అవతార్ 2 కూడా భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టేస్తుందని ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే కామెరూన్ విశ్వసనీయతను దోపిడీ చేస్తూ టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీని వల్ల సినిమాకి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం కూడా ఉంది.

అవతార్ 2 మొదటి ట్రైలర్ ప్రేక్షకులను ఊహించిన విధంగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఈరోజు విడుదలైన రెండో ట్రైలర్‌కు మాత్రం మంచి స్పందన వచ్చింది. మరి ఈ సినిమా ఎలాంటి ప్రశంసలు అందుకుంటుందో.. బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులు సాధిస్తుందో చూడాలి.

Avatar 2 Bookings opened in india with Record ticket prices

0

Avatar 2 bookings have started on a high note. The movie is expected to become the highest grosser of all time, the distributors are hiking the ticket prices exponentially to achieve this feat. Multiplex giant PVR has opened the bookings with ticket prices that are far too costly.

The ticket prices start at a minimum of 500, and it goes on to 1200, 1300 and even 1500. The rates in IMAX and 4DX are even higher, some rates shown in online platforms are 1650, 1550, 1450, 1350, 1250, 1150, 1050, 950, 870 (these are Bangalore IMAX and 4D ticket prices) These are huge considering standard rates for the multiplexes.

Especially in the time when inflation is hitting hard and people aren’t coming to theaters due to recession like situations, these exorbitant prices are even more discouraging. It’s not a good idea to fleece consumers just because there is massive demand for the movie.

Avatar2 is coming after 13 years since the first part created havoc at the box office across the world. James Cameron has made an underwater adventure movie in avatar universe with high-end technology.

Never his movie failed and people are super confident that this will strike gold as well. Exploiting the credibility of Cameron, ticket prices are skyrocketing. This would backfire as well.

Meanwhile, the first trailer of Avatar the way of Water’s first trailer wasn’t celebrated as it was expected. But its second trailer which was released today got some positive response.

ఈ వారం OTTలో తప్పక చూడాల్సిన 5 ప్రముఖ విడుదలలు

0

ఈ వారం, OTT వేదికలలో ప్రేక్షకులను అలరించడానికి 5 ప్రముఖ విడుదలల జాబితా సిద్ధంగా ఉంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ జాబితాలో 4 సినిమాలు మరియు ఒక వెబ్ సిరీస్ ఉన్నాయి. శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్, రిషబ్ శెట్టి యొక్క కాంతార, దుల్కర్ సల్మాన్ మరియు సన్నీ డియోల్ ల చుప్, నీరజ్ పాండే యొక్క వెబ్ సిరీస్ ఖాకీ మరియు నివిన్ పౌలీ యొక్క పడవెట్టు ఈ వారం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించబోతున్నాయి.

ఇటీవలే థియేటర్లలో విడుదలైన ప్రిన్స్, శివ కార్తికేయన్ చిత్రం నవంబర్ 25 నుండి డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం కానుందని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించింది.

శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో, అనుదీప్ కెవిఎస్ దర్శకత్వంలో, ప్రిన్స్ తమిళం మరియు తెలుగు రెండింటిలోనూ ఒకేసారి విడుదలైంది. గతంలో తెలుగులో జాతి రత్నాలు చిత్రానికి దర్శకత్వం వహించిన అనుదీప్ కి తమిళ చిత్ర పరిశ్రమలో ఇదే తొలి చిత్రం. ప్రిన్స్ తెలుగు మరియు తమిళ భాషలలోని విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను పొందింది.

ఇక గత రెండు నెలలు గా ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన తెచ్చుకున్న రిషబ్ శెట్టి యొక్క కాంతార, చిత్రం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సెప్టెంబర్ 30 న విడుదలైనప్పటి నుండి, కాంతార చిత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది మరియు ప్రేక్షకుల నుండి అలాగే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన స్పందనను అందుకుంది. కాంతార చిత్రం OTTలో నవంబర్ 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది.

సన్నీ డియోల్, శ్రేయ ధన్వంతరి మరియు దుల్కర్ సల్మాన్ యొక్క అసాధారణమైన సైకలాజికల్ రివెంజ్ థ్రిల్లర్, చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, అతి త్వరలోనే OTT అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆర్ బాల్కీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 న విడుదలైంది మరియు ఇది అభిమానుల నుండి మరియు సమీక్షకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది.

స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5 ఇటీవలే సినిమా విడుదల తేదీని ప్రకటించింది. చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్ నవంబర్ 25 నుండి ZEE5లో అందుబాటులో ఉంటుంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ ఇలా మొత్తంగా అయిదు భాషల్లో అందుబాటులో ఉంటుంది.

నీరజ్ పాండే తాజాగా నెట్‌ఫ్లిక్స్ సిరీస్, ఖాకీ: ది బీహార్ చాప్టర్‌ను నిర్మించారు, ఇది నవంబర్ 25, 2022న విడుదల కానుంది. ఈ షోలో కరణ్ టాకర్ మరియు అవినాష్ తివారీ కీలక పాత్రల్లో నటించారు మరియు అమిత్ లోధా రాసిన బీహార్ డైరీస్ అనే పుస్తకం ఆధారంగా ఈ వెబ్ సిరీస్ రూపొందించబడింది.

మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలి నటించిన పడవెట్టు సినిమా కూడా OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది. లిజు కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం మరియు రచనా బాధ్యతను నిర్వర్తించారు. ఇది అతనికి దర్శకుడిగా తొలి చిత్రం. ఈ చిత్రం ఫిబ్రవరి 2020 నుండి మార్చి 15, 2022 మధ్య ఉత్తర కేరళలో చిత్రీకరించబడింది.

ఈ చిత్రానికి దర్శకుడు మరియు రచయిత అయిన లిజు కృష్ణ ఈ చిత్రాన్ని తన స్వగ్రామమైన మలూర్, కన్నూర్ కేరళ మరియు గ్రామానికి చెందిన సుమారు వెయ్యి మందితో చిత్రీకరించినట్లు వెల్లడించారు. కాగా ఈ సినిమా కోసం వారందరికీ నటనలో శిక్షణ ఇప్పించారట. ఈ సినిమా థియేట్రికల్ రన్‌లో పెద్దగా ఆడకపోయినా, OTTలో రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.

Must Watch : 5 Notable OTT releases this week

0

This week, a list of 5 Notable releases are ready to entertain the audience in OTT. Platforms. What’s more interesting is the list contains 4 movies and a web series. Prince of Siva Karthikeyan, Rishabh Shetty’s Kantara, Dulquer Salman and Sunny Deol’s Chup, Neeraj Pandey’s Web Series Khakhee and Nivin Pauly’s Padavettu are going to attract the attention of audience this week.

Prince, the Siva Karthikeyan’s film which recently released in theaters, is set to stream on Disney+ Hot star from November 25, the streaming platform announced on social media recently.

Starring Siva Karthikeyan in the lead role, under Anudeep KV’S directorial, Prince had a simultaneous release in both Tamil and Telugu. The film marks the debut for the filmmaker in Tamil film industry, who has previously helmed Jathi Ratnalu in Telugu. Prince opened to mixed reviews from critics and audience from both Telugu and Tamil languages.

Another film is Rishabh Shetty’s Kantara, the film which no needs a special introduction. Since its release on September 30, Kantara has surprised everyone and received an outstanding response from the audience as well as at the box office worldwide. Kantara film will stream on OTT from November 24th on Amazon Prime Video.

Sunny Deol, Shreya Dhanwantari and Dulquer Salman’s unconventional psychological revenge thriller, Chup: Revenge of the Artist, is all set to make its OTT debut very soon. Directed by R Balki, the movie was released on September 23 of this year, and it got rave reviews from fans and reviewers alike.

Streaming platform ZEE5 has recently announced the release date of the movie. Chup: Revenge of the Artist will be available on ZEE5 from November 25. The movie will be made available in five languages: Malayalam, Kannada, Tamil, Telugu, and Hindi.

Neeraj Pandey produced a Netflix series, Khakee: The Bihar Chapter, which is all set to release on November 25, 2022. The show stars Karan Tacker and Avinash Tiwary in pivotal roles and is based on a book by Amit Lodha titled Bihar Diaries.

Padavettu is a Malayalam political drama film directed and written by Liju Krishna. It is his directorial debut. The film was shot in North Kerala between February 2020 to March 15, 2022. Liju Krishna who is the director and writer of the movie revealed that the film was shot in his native village Maloor, in Kannur Kerala and around a thousand people from the village were trained in acting for the film. While the movie didn’t do well in its theatrical run, it will be good to see how it performs on OTT.

పుష్ప.. బాహుబలి లా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి అంటే హిట్ 2 బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాలి

0

శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం హిట్ 2. ఈ చిత్రం యొక్క మొదటి భాగం మంచి టాక్ తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే హిట్ మొదటి భాగం ఓవర్సీస్‌లో తప్ప బాక్సాఫీస్ వద్ద గణనీయమైన విజయం సాధించలేకపోయింది.

హిందీలో రాజ్‌కుమార్‌రావుతో రీమేక్‌ చేసినప్పుడు కూడా అదే ఫలితం వచ్చింది. కానీ ప్రొడక్షన్ టీమ్ ఈ సీరీస్ పై పెద్ద ఎత్తున పందెం వేస్తోంది. సీరియల్ కిల్లర్స్ చుట్టూ తిరిగే ఈ థ్రిల్లర్‌ల ఆధారంగా వరుస సీక్వెల్స్‌ను ప్లాన్ చేస్తోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో పుష్ప లేదా బాహుబలి వంటి బెంచ్‌మార్క్‌ని చేరుకోవడానికి, హిట్ సిరీస్ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి.

అడివి శేష్ విభిన్న పాత్రలు పోషించడంతో పాటు తన సినిమాలకు కథ/స్క్రీన్‌ప్లే కూడా రాయడం అలవాటుగా పెట్టుకున్నారు. బహుశా అతను రచయితగా కాకుండా కేవలం హీరోగా నటిస్తున్న కొన్ని సినిమా ఇదేనేమో.

థ్రిల్లర్ జానర్‌లో ఆయన చేసే సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. హిట్ 2 ఇప్పటికే టీజర్‌తో కొంత సంచలనం సృష్టించింది మరియు ట్రైలర్‌ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఈ సినిమా ట్రైలర్‌ని నాని, అడివి శేష్‌లు ఆసక్తికరంగా ప్రకటించారు. హిట్2 ట్రైలర్ నవంబర్ 23న విడుదల కానుంది. ట్రైలర్ తేదీని ప్రకటిస్తూ, మేకర్స్ నాని మరియు అడివి శేష్‌లతో కూడిన వీడియోను పంచుకున్నారు. వారి సరదా సంభాషణ అందరినీ ఆకర్షించింది. హిట్ 2 ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంటుందని నాని నమ్మకంగా చెప్పారు.

దీనికి నిర్మాతగా వ్యవహరిస్తున్న నేచురల్ స్టార్ నానికి ఈ చిత్రం చాలా డబ్బు తెచ్చిపెడుతుందని మరియు భవిష్యత్తులో ఈ సిరీస్‌ని పొడిగిస్తుందని ఆశిద్దాం. తద్వారా ఈ కాప్ సీరీస్ నుంచి అద్భుతమైన సినిమాలను చూడవచ్చు.

రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ మాగంటి, కోమలి ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు.

వాల్ పోస్టర్ సినిమా పతాకం పై నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్యారీ బిహెచ్ ఎడిటర్ మరియు ఎస్ మణికందన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు.

Hit 2 needs to do Big at Box office to create the brand like Puhspa and Baahubali

0

Hit 2 is the latest movie of Adivi Sesh under the direction of Sailesh Kolanu. Its first part has grabbed attention with decent word of mouth, but it didn’t become a considerable success at box office except at the overseas.

The same was the result in Hindi when it was remade with Rajkumar Rao. But the production team is betting big on this and planning a series of sequels based on these thrillers revolving around serial killers. To reach a benchmark like Pushpa Or Bahubali on a pan India level, it still has a long way to go.

Adivi sesh is known to play different roles and also writes story/screenplay for his movies. This is perhaps one of the few movies he is just acting. His movies in thriller genre are something to look forward.

Hit 2 has already created some buzz with its teaser, and anticipation for the trailer is huge.The trailer announcement of the movie was done interestingly by Nani and Adivi Sesh. The trailer of Hit2 will release on November 23Rd. Announcing the trailer date, the makers shared a video featuring Nani and Adivi Sesh. Their funny conversation attracted all. Nani confidently said that HIT 2 trailer will be going to be an impressive one.

Hit 2 Trailer Announcement

We hope this movie brings lot of money for Natural Star Nani who is the producer for this and fortunately extend the series so that we may see him as a cop.

Meenakshi Chaudhary is the heroine in the film which stars Rao Ramesh, Posani Krishna Murali, Tanikella Bharani, Srikanth Maganti, and Komalee Prasad in important roles.

Prashanti Tipirneni is bankrolling the film, while Natural Star Nani is the presenter under Wall Poster Cinema. Garry BH is the editor and S Manikandan, the cinematographer respectively.

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా రీ-రిలీజ్

0

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ కెరీర్ లోనే భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ.. ఆయన జీవితంలో బాబా సినిమా చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. ఈ చిత్రాన్ని స్వయంగా రజినీకాంత్ రాశారు. ఆయన ఈ సినిమాని ఎన్నో రోజులుగా కలగన్ని తీశారు. కాగా ఈ సినిమాలో జీవితం గురించి తన తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించారు.

ఇక వచ్చే నెల ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. బాబాలో రజనీని చూడాలని మరియు ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని థియేటర్లలో అనుభవించాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన ప్ర‌స్తుత తరానికి మ‌ళ్లీ చూసే అవ‌కాశం కూడా దొరుకుతుంది.

బాషా, అన్నామలై వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబా సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ చేసిన చిత్రం కావడంతో ఆ సమయంలో విడుదలకు ముందే బ్రహ్మాండమైన బజ్ సృష్టించింది. ఎందుకంటే రజినీకాంత్ మళ్లీ సినిమాలు చేస్తాడా అనే సందేహం చాలామందిలో ఉండింది. ఆ నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న పరిస్థితుల్లో విడుదలైన బాబా సినిమా భారీ పరాజయాన్ని చవి చూసింది.

బాబా సినిమాలో మాస్ మసాలా అంశాలు లేవు కానీ చక్కని హీరోయిజంతో కూడిన ఫిలాసఫికల్ డైలాగ్స్‌తో కొన్ని విజిల్స్ వేయడానికి విలువైన సందర్భాలు ఉన్నాయి. బాబా జీవితం గురించి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి కానీ తన జీవితంలో ఎదీ సాధించకుండా వీధి యుద్ధాలలో మునిగిపోతూ మద్యపానం కూడా చేస్తాడు. అలాంటి మనిషి మనసు మార్చుకుని స్వచ్ఛమైన మనిషిగా ఎలా మారాడు అనేది బాబా సినిమా కథ.

సినిమాలో రజినీకాంత్ నటన ఎంతో సహజంగా ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కలు లేకుండా సినిమా కోసం సూపర్‌స్టార్లు తమ హృదయాన్ని మరియు ఆత్మను పెట్టి సినిమాలు తీయడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

బాబా కోసం ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులకి ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా బాబా టైటిల్ ర్యాప్ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేటికీ ప్రేక్షకులచే విశేషమైన ఆదరణ పొందుతుంది.

కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తున్న దృశ్యం 2

0

ఎట్టకేలకు బాలీవుడ్ కి అజయ్ దేవగన్ యొక్క దృశ్యం 2 రూపంలో ఒక నికార్సైన హిట్ సినిమా లభించింది. కరోనా మహమ్మారి తర్వాత, స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ లేదా రెస్పాన్స్‌ను పొందలేక.. హిందీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడ్డదని మనందరికీ తెలుసు.

బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం, శుక్రవారం 15.38 కోట్లతో మొదలైన దృశ్యం 2.. శనివారం 21.59 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ చిత్రం యొక్క ఆదివారం కలెక్షన్‌లను పంచుకుంటూ, సోమవారం ఆయన ట్విట్టర్‌లో దృశ్యం2 వీకెండ్ ని భారీ బ్యాంగ్‌తో ముగించింది. 3వ రోజు సంచలనం సృష్టించింది అని చెప్తూ, బాలీవుడ్ బిజ్‌ని తిరిగి పునరుద్ధరిస్తుంది అని అలాగే ఆనందం, ఆశ, విశ్వాసం, ఆశావాదాన్ని తిరిగి తెస్తుంది అని కొనియాడారు.

https://twitter.com/taran_adarsh/status/1594922150271619079?t=5eG6UhXf7DQSRpvhuwYebg&s=19

ఇక కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే మొదటి వారంలోనే 100 కోట్ల టార్గెట్ చేస్తుందని, ఇది స్మాష్-హిట్ అని తెలిపారు. మొత్తంగా మూడు రోజుల దృశ్యం 2 ఇండియా బిజ్ చూసుకుంటే.. శుక్రవారం 15.38 కోట్లు, శనివారం 21.59 కోట్లు, ఆదివారం 27.17 కోట్లు, సోమవారం 11.87 కోట్లు ఇలా మొత్తంగా 76.01 కోట్ల నెట్ వసూలు చేసింది.

అద్భుతమైన మొదటి వారాంతం తర్వాత, ఈ చిత్రం సోమవారం అద్భుతమైన హోల్డ్‌ను కొనసాగించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 12 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తే.. 11 కోట్లు కలెక్ట్ చేసి అంచనాలకి తగ్గట్టుగా నిలిచింది అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల పాటు దృశ్యం 2 గ్రాస్ దాదాపు 110 కోట్లకు పైనే చేరుకుంటుంది మరియు ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

కొత్త OTT యుగంలో రీమేక్‌లు సాధ్యం కాదనే బలమైన భావన అన్ని సినీ పరిశ్రమలలో ఉంది. అయితే రీమేక్‌లు బాక్సాఫీస్ వద్ద హిట్ కావనే అపోహను దృశ్యం 2 చిత్రం బద్దలు కొట్టింది.ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రదర్శింపబడుతుంది.

కొంత మంది ఇప్పటికీ అన్ని రీమేక్‌లు పనిచేయవని చెబుతున్నారు. ఎందుకంటే దృశ్యం 2 ఇప్పటికే హిందీలో మొదటి భాగాన్ని రూపొందించింది. దృశ్యం రెండవ భాగం OTTలో మలయాళం మరియు తెలుగు వెర్షన్‌లలో విడుదలైంది, హిందీ వెర్షన్ అందుబాటులో లేదు కాబట్టి చాలా మంది ప్రేక్షకులు దృశ్యం 2 యొక్క అసలు వెర్షన్‌ను చూడలేదు. అది సినిమా యొక్క విజయానికి అతిపెద్ద కారణంగా పరిగణించబడుతుంది.

ఏది ఏమైనప్పటికీ, అన్ని వాదనలు మరియు చర్చలను పక్కన పెడితే, దృశ్యం 2 సినిమా నంబర్లు మొత్తం బాలీవుడ్ ట్రేడ్‌ను సంతోషపరుస్తున్నాయి. వరుణ్ ధావన్ యొక్క భేదియా ఈ వారం విడుదల కానుంది. ఆ సినిమా కూడా విజయం సాధించి ఈ ట్రెండ్ఇ లాగే కొనసాగుతుందని వారు ఆశిస్తున్నారు, భేదియా చిత్రం భారతీయ సినిమా చరిత్రలో మొట్ట మొదటి క్రియేచర్ కామెడీ అనే ప్రత్యేకమైన అంశాన్ని కలిగి ఉంది.

అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన దృశ్యం 2లో టబు, అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా, శ్రియా శరణ్ మరియు సౌరభ్ శుక్లా కూడా నటించారు. విజయ్ సల్గౌంకర్ కుటుంబం తమను వెంటాడుతున్న ఒక హత్య కేసును తిరిగి తెరవగా.. ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా లైఫ్‌టైమ్‌లో ఇండియాలో 200 కోట్ల నెట్‌ని వసూలు చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Superstar Rajinikanth’s cult film is planning to re-release in theaters

0

Baba is one of the most important movies in Superstar Rajinikanth’s life, though it was a massive flop. The movie was written by Rajinikanth, and it’s his brain child, as he tried to tell his philosophy about life in the movie.

The movie is now getting re released for Thalaiva’s birthday on December 12th. Fans are excited to watch Rajini in Baba and experience this spiritual movie in theaters. The current generation who had missed it in the theaters would find an opportunity to see it again.

The film was directed by Suresh Krishna who delivered massive blockbusters like Basha, Annamalai etc. Baba created gigantic buzz before the release as it was the movie done by Rajinikanth after taking a long break. Many were doubtful whether Rajinikanth would do movies again. In that context, the movie came with huge expectations.

The movie doesn’t have mass masala elements but certainly has few whistle worthy moments with Philosophical Dialogues mixed with heroism as well. Baba is like a life journey of a man who has a Good knowledge of life but is not serious with his life and indulges in street wars and is an alcoholic too. How he changes his mind and becomes a pure man is the story of the film.

Acting of Rajinikanth and his real self comes out in the movie. It’s good to see superstars putting out their heart and soul for a movie without box office calculations. Movies like these stay forever in the hearts of fans.

AR Rahman’s music for Baba is meditative and deeply engaging. The background score of the title rap is fondly recalled by the audience even today.

Drishyam 2 is heading towards Huge blockbuster and crosses 100Cr mark in 4 days

0

Finally Bollywood has found a sureshot hit film with Ajay Devgn’s Drishyam 2. We all know that after the corona pandemic, the Hindi industry didn’t had a good time with films if Star Heroes not able to get good openings or response at the box office.

The film had opened with 15.38 crores net on Friday and collected 21.59 crores net on Saturday. Sharing the Sunday collections of the film, film trade analyst Taran Adarsh wrote on Twitter on Monday, “#Drishyam2 ends *Weekend 1* with a big bang… Creates havoc on Day 3… Reboots and revives biz… Brings joy, hope, confidence, optimism back… Targets ₹ 100 cr in *Week 1*… This one’s a SMASH-HIT… Fri 15.38 cr, Sat 21.59 cr, Sun 27.17 cr. Total: ₹ 64.14 cr. #India biz.

https://twitter.com/taran_adarsh/status/1594560685463072769?t=9FEhl7sfJSim5hABli-QKQ&s=19

After excellent 1st weekend, The film maintained terrific hold on Monday. The early estimates are more than 12Cr range which is very huge . For 4 days worldwide gross of Drishyam 2 will be around 110 Crores and the film is heading towards Huge Blockbuster.

There was a strong feeling in all the movie industries that remakes are not feasible in the New OTT era. But Drishyam 2 movie broke the myth of remakes will not perform at box office.The film is performing the way which no one expected.

While some people are still saying that all remakes won’t work, because Drishyam 2 has already made its first part in Hindi. The second part of Drishyam was released in Malayalam and Telugu versions in OTT, there was no Hindi version available so most of the audience didn’t watched the original version of Drishyam 2. That can be considered as one of the biggest reason for the movie’s success.

Anyways, putting all the arguments and discussions aside, Drishyam 2 movie numbers are making entire Bollywood trade happy. They are hoping that the good trend will continue with the next release of Varun Dhawan’s Bhediya which has a unique plotline being a first Indian creature comedy.

Directed by Abhishek Pathak, Drishyam 2 also stars Tabu, Akshaye Khanna, Ishita Dutta, Shriya Saran and Saurabh Shukla. It revolves around how Vijay Salgaunkar ‘s family copes with the reopening of a murder case which refuses to stop haunting them. The Bollywood trade circles are expecting the film to collect a 200 crore net in India in lifetime.