Home Blog Page 1920

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ పుట్టిన రోజు సందర్భంగా బాబా సినిమా రీ-రిలీజ్

0

సూపర్‌స్టార్ రజినీకాంత్‌ కెరీర్ లోనే భారీ ఫ్లాప్‌గా నిలిచినప్పటికీ.. ఆయన జీవితంలో బాబా సినిమా చాలా ముఖ్యమైనది అని చెప్పచ్చు. ఈ చిత్రాన్ని స్వయంగా రజినీకాంత్ రాశారు. ఆయన ఈ సినిమాని ఎన్నో రోజులుగా కలగన్ని తీశారు. కాగా ఈ సినిమాలో జీవితం గురించి తన తత్వాన్ని చెప్పడానికి ప్రయత్నించారు.

ఇక వచ్చే నెల ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ఈ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు. బాబాలో రజనీని చూడాలని మరియు ఈ ఆధ్యాత్మిక చిత్రాన్ని థియేటర్లలో అనుభవించాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. థియేట‌ర్ల‌లో మిస్స‌యిన ప్ర‌స్తుత తరానికి మ‌ళ్లీ చూసే అవ‌కాశం కూడా దొరుకుతుంది.

బాషా, అన్నామలై వంటి భారీ బ్లాక్‌బస్టర్‌లను అందించిన సురేష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాబా సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్ చేసిన చిత్రం కావడంతో ఆ సమయంలో విడుదలకు ముందే బ్రహ్మాండమైన బజ్ సృష్టించింది. ఎందుకంటే రజినీకాంత్ మళ్లీ సినిమాలు చేస్తాడా అనే సందేహం చాలామందిలో ఉండింది. ఆ నేపథ్యంలో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న పరిస్థితుల్లో విడుదలైన బాబా సినిమా భారీ పరాజయాన్ని చవి చూసింది.

బాబా సినిమాలో మాస్ మసాలా అంశాలు లేవు కానీ చక్కని హీరోయిజంతో కూడిన ఫిలాసఫికల్ డైలాగ్స్‌తో కొన్ని విజిల్స్ వేయడానికి విలువైన సందర్భాలు ఉన్నాయి. బాబా జీవితం గురించి మంచి జ్ఞానం ఉన్న వ్యక్తి కానీ తన జీవితంలో ఎదీ సాధించకుండా వీధి యుద్ధాలలో మునిగిపోతూ మద్యపానం కూడా చేస్తాడు. అలాంటి మనిషి మనసు మార్చుకుని స్వచ్ఛమైన మనిషిగా ఎలా మారాడు అనేది బాబా సినిమా కథ.

సినిమాలో రజినీకాంత్ నటన ఎంతో సహజంగా ఉంటుంది. బాక్సాఫీస్ లెక్కలు లేకుండా సినిమా కోసం సూపర్‌స్టార్లు తమ హృదయాన్ని మరియు ఆత్మను పెట్టి సినిమాలు తీయడం చాలా అరుదు. ఇలాంటి సినిమాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

బాబా కోసం ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకులకి ఆకర్షణీయంగా ఉంటుంది. ముఖ్యంగా బాబా టైటిల్ ర్యాప్ యొక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నేటికీ ప్రేక్షకులచే విశేషమైన ఆదరణ పొందుతుంది.

కేవలం నాలుగు రోజుల్లోనే 100 కోట్లు రాబట్టి బ్లాక్ బస్టర్ వైపు అడుగులు వేస్తున్న దృశ్యం 2

0

ఎట్టకేలకు బాలీవుడ్ కి అజయ్ దేవగన్ యొక్క దృశ్యం 2 రూపంలో ఒక నికార్సైన హిట్ సినిమా లభించింది. కరోనా మహమ్మారి తర్వాత, స్టార్ హీరోల సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ లేదా రెస్పాన్స్‌ను పొందలేక.. హిందీ పరిశ్రమ ఇబ్బందుల్లో పడ్డదని మనందరికీ తెలుసు.

బాలీవుడ్ బాక్సాఫీస్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ప్రకారం, శుక్రవారం 15.38 కోట్లతో మొదలైన దృశ్యం 2.. శనివారం 21.59 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ చిత్రం యొక్క ఆదివారం కలెక్షన్‌లను పంచుకుంటూ, సోమవారం ఆయన ట్విట్టర్‌లో దృశ్యం2 వీకెండ్ ని భారీ బ్యాంగ్‌తో ముగించింది. 3వ రోజు సంచలనం సృష్టించింది అని చెప్తూ, బాలీవుడ్ బిజ్‌ని తిరిగి పునరుద్ధరిస్తుంది అని అలాగే ఆనందం, ఆశ, విశ్వాసం, ఆశావాదాన్ని తిరిగి తెస్తుంది అని కొనియాడారు.

https://twitter.com/taran_adarsh/status/1594922150271619079?t=5eG6UhXf7DQSRpvhuwYebg&s=19

ఇక కలెక్షన్ల ట్రెండ్ చూస్తుంటే మొదటి వారంలోనే 100 కోట్ల టార్గెట్ చేస్తుందని, ఇది స్మాష్-హిట్ అని తెలిపారు. మొత్తంగా మూడు రోజుల దృశ్యం 2 ఇండియా బిజ్ చూసుకుంటే.. శుక్రవారం 15.38 కోట్లు, శనివారం 21.59 కోట్లు, ఆదివారం 27.17 కోట్లు, సోమవారం 11.87 కోట్లు ఇలా మొత్తంగా 76.01 కోట్ల నెట్ వసూలు చేసింది.

అద్భుతమైన మొదటి వారాంతం తర్వాత, ఈ చిత్రం సోమవారం అద్భుతమైన హోల్డ్‌ను కొనసాగించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం 12 కోట్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తే.. 11 కోట్లు కలెక్ట్ చేసి అంచనాలకి తగ్గట్టుగా నిలిచింది అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా 4 రోజుల పాటు దృశ్యం 2 గ్రాస్ దాదాపు 110 కోట్లకు పైనే చేరుకుంటుంది మరియు ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

కొత్త OTT యుగంలో రీమేక్‌లు సాధ్యం కాదనే బలమైన భావన అన్ని సినీ పరిశ్రమలలో ఉంది. అయితే రీమేక్‌లు బాక్సాఫీస్ వద్ద హిట్ కావనే అపోహను దృశ్యం 2 చిత్రం బద్దలు కొట్టింది.ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రదర్శింపబడుతుంది.

కొంత మంది ఇప్పటికీ అన్ని రీమేక్‌లు పనిచేయవని చెబుతున్నారు. ఎందుకంటే దృశ్యం 2 ఇప్పటికే హిందీలో మొదటి భాగాన్ని రూపొందించింది. దృశ్యం రెండవ భాగం OTTలో మలయాళం మరియు తెలుగు వెర్షన్‌లలో విడుదలైంది, హిందీ వెర్షన్ అందుబాటులో లేదు కాబట్టి చాలా మంది ప్రేక్షకులు దృశ్యం 2 యొక్క అసలు వెర్షన్‌ను చూడలేదు. అది సినిమా యొక్క విజయానికి అతిపెద్ద కారణంగా పరిగణించబడుతుంది.

ఏది ఏమైనప్పటికీ, అన్ని వాదనలు మరియు చర్చలను పక్కన పెడితే, దృశ్యం 2 సినిమా నంబర్లు మొత్తం బాలీవుడ్ ట్రేడ్‌ను సంతోషపరుస్తున్నాయి. వరుణ్ ధావన్ యొక్క భేదియా ఈ వారం విడుదల కానుంది. ఆ సినిమా కూడా విజయం సాధించి ఈ ట్రెండ్ఇ లాగే కొనసాగుతుందని వారు ఆశిస్తున్నారు, భేదియా చిత్రం భారతీయ సినిమా చరిత్రలో మొట్ట మొదటి క్రియేచర్ కామెడీ అనే ప్రత్యేకమైన అంశాన్ని కలిగి ఉంది.

అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన దృశ్యం 2లో టబు, అక్షయ్ ఖన్నా, ఇషితా దత్తా, శ్రియా శరణ్ మరియు సౌరభ్ శుక్లా కూడా నటించారు. విజయ్ సల్గౌంకర్ కుటుంబం తమను వెంటాడుతున్న ఒక హత్య కేసును తిరిగి తెరవగా.. ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటుంది అనే దాని చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమా లైఫ్‌టైమ్‌లో ఇండియాలో 200 కోట్ల నెట్‌ని వసూలు చేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Superstar Rajinikanth’s cult film is planning to re-release in theaters

0

Baba is one of the most important movies in Superstar Rajinikanth’s life, though it was a massive flop. The movie was written by Rajinikanth, and it’s his brain child, as he tried to tell his philosophy about life in the movie.

The movie is now getting re released for Thalaiva’s birthday on December 12th. Fans are excited to watch Rajini in Baba and experience this spiritual movie in theaters. The current generation who had missed it in the theaters would find an opportunity to see it again.

The film was directed by Suresh Krishna who delivered massive blockbusters like Basha, Annamalai etc. Baba created gigantic buzz before the release as it was the movie done by Rajinikanth after taking a long break. Many were doubtful whether Rajinikanth would do movies again. In that context, the movie came with huge expectations.

The movie doesn’t have mass masala elements but certainly has few whistle worthy moments with Philosophical Dialogues mixed with heroism as well. Baba is like a life journey of a man who has a Good knowledge of life but is not serious with his life and indulges in street wars and is an alcoholic too. How he changes his mind and becomes a pure man is the story of the film.

Acting of Rajinikanth and his real self comes out in the movie. It’s good to see superstars putting out their heart and soul for a movie without box office calculations. Movies like these stay forever in the hearts of fans.

AR Rahman’s music for Baba is meditative and deeply engaging. The background score of the title rap is fondly recalled by the audience even today.

Drishyam 2 is heading towards Huge blockbuster and crosses 100Cr mark in 4 days

0

Finally Bollywood has found a sureshot hit film with Ajay Devgn’s Drishyam 2. We all know that after the corona pandemic, the Hindi industry didn’t had a good time with films if Star Heroes not able to get good openings or response at the box office.

The film had opened with 15.38 crores net on Friday and collected 21.59 crores net on Saturday. Sharing the Sunday collections of the film, film trade analyst Taran Adarsh wrote on Twitter on Monday, “#Drishyam2 ends *Weekend 1* with a big bang… Creates havoc on Day 3… Reboots and revives biz… Brings joy, hope, confidence, optimism back… Targets ₹ 100 cr in *Week 1*… This one’s a SMASH-HIT… Fri 15.38 cr, Sat 21.59 cr, Sun 27.17 cr. Total: ₹ 64.14 cr. #India biz.

https://twitter.com/taran_adarsh/status/1594560685463072769?t=9FEhl7sfJSim5hABli-QKQ&s=19

After excellent 1st weekend, The film maintained terrific hold on Monday. The early estimates are more than 12Cr range which is very huge . For 4 days worldwide gross of Drishyam 2 will be around 110 Crores and the film is heading towards Huge Blockbuster.

There was a strong feeling in all the movie industries that remakes are not feasible in the New OTT era. But Drishyam 2 movie broke the myth of remakes will not perform at box office.The film is performing the way which no one expected.

While some people are still saying that all remakes won’t work, because Drishyam 2 has already made its first part in Hindi. The second part of Drishyam was released in Malayalam and Telugu versions in OTT, there was no Hindi version available so most of the audience didn’t watched the original version of Drishyam 2. That can be considered as one of the biggest reason for the movie’s success.

Anyways, putting all the arguments and discussions aside, Drishyam 2 movie numbers are making entire Bollywood trade happy. They are hoping that the good trend will continue with the next release of Varun Dhawan’s Bhediya which has a unique plotline being a first Indian creature comedy.

Directed by Abhishek Pathak, Drishyam 2 also stars Tabu, Akshaye Khanna, Ishita Dutta, Shriya Saran and Saurabh Shukla. It revolves around how Vijay Salgaunkar ‘s family copes with the reopening of a murder case which refuses to stop haunting them. The Bollywood trade circles are expecting the film to collect a 200 crore net in India in lifetime.

రీమేక్‌లు చేయడం వల్ల చాలా మంది ప్రేక్షకులను కోల్పోతాం అంటున్న రామ్ చరణ్

0

ఇటీవల హిందూస్థాన్ టైమ్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను అనేక ప్రశ్నలు అడిగారు. అయితే అందులో ఒక ప్రశ్న మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. రీమేక్‌ సినిమాలు సాధారణంగా సినిమాకు చూసే కొంత మంది ప్రేక్షకుల శాతాన్ని కోల్పోతున్నాయని ఇంటర్వ్యూ హోస్ట్ చరణ్‌ ను అడిగారు. అందుకు మెగా పవర్ స్టార్ ఇచ్చిన స్పందనే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

OTT యుగంలో రీమేక్‌లు ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కొంటాయని చరణ్ అంగీకరించారు. ఆయన ప్రకారం, ఒకసారి OTTలో సినిమా చూసిన ప్రేక్షకులు మళ్ళీ థియేటర్లలోకి అదే సినిమా వస్తే చూడటానికి ఆసక్తి చూపకపోవచ్చు. అయితే, సూపర్‌స్టార్ వంటి ఇమేజ్ ఇన్న హీరోలు రీమేక్‌లు చేయడం వల్ల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చని తన వాదనను సమర్ధించుకునెందుకు ఆయన పేర్కొన్నారు.

నిజానికి రీమేక్‌లు ఎక్కువ చేస్తారని మెగా ఫ్యామిలీకి పేరుంది. చిరంజీవి గత నాలుగు సినిమాల్లో రెండు రీమేక్‌లు చేశారు. పవన్ కళ్యాణ్ ఒరిజినల్ స్క్రిప్ట్‌ని చాలా అరుదుగా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో రీమేక్‌ల పై అడిగిన ప్రశ్నకు చరణ్‌ స్పందించడం ఆసక్తికరంగా మారింది. నిజానికి లూసిఫర్‌ రీమేక్‌ని చిరంజీవికి సూచించింది ఆయనే.

అభిమానులు కూడా రీమేక్‌లకు వ్యతిరేకంగా ఉన్నారు మరియు వారు రీమేక్‌లకు తక్కువ ఓపెనింగ్స్‌ని ఆపాదిస్తున్నారు. పేలవమైన బజ్ కారణంగా గాడ్ ఫాదర్ స్టార్ హీరో స్థాయి ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది. లూసిఫర్‌ను చాలా మంది తెలుగు యువత OTTలో వీక్షించడమే అందుకు కారణం. ఇక పింక్, అయ్యప్పనుమ్ కోషియం సినిమాలకు కూడా ఇదే వర్తిస్తుంది.

ఇంట్లో తీరిగ్గా సెల్ ఫోన్ లోనే ఒరిజినల్‌ని చూసే అవకాశం ఉన్నప్పుడు, రీమేక్‌లు చేయడం ఇప్పుడు పాత కాన్సెప్ట్‌గా మారాయి. అయితే రీమేక్‌లో చాలా వరకు ఒరిజినల్‌లోని సారాంశం పోతుందని.. ఒరిజినల్‌ కంటే రీమేక్‌లు బెటర్‌గా ఉంటాయని, రిస్క్‌తో కూడుకున్నవి అని చిరంజీవి ఈ వాదనలను సమర్థించారు.

కానీ, ఒరిజినల్ ఉచితంగా అందుబాటులో ఉన్నప్పుడు, రీమేక్ చూడటానికి ఎవరికి ఆసక్తి ఉంటుంది? మెగా హీరోలు రీమేక్‌లు చేయడాన్ని అభిమానులు కూడా వ్యతిరేకిస్తున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి వారు లోతుగా ఆలోచించాలి.

We miss a large chunk of audience by doing remakes, says Ram Charan

0

In a recent interview with Hindustan Times, Ram Charan was asked several questions, but one question had caught everyone’s attention. The host of the interview complained Charan regarding remakes losing a section of audience. Mega Power star’s response is the hot topic now.

Charan accepted that remakes in OTT era definitely will face issues. According to him, audiences who already watched the movie may not be interested to watch the movie coming to theaters. However, in his defense he added that Superstars doing remakes might bring audiences to theaters.

Mega family is known for doing remakes. Chiranjeevi has done two remakes in last four movies. Pawan Kalyan is rarely doing original script. In this scenario, Charan responding to a question on remakes is interesting. In fact, he was the one who suggested Lucifer remake to Chiranjeevi.

Fans are also against remakes, and they are attributing fewer openings to remakes. Godfather hasn’t garnered star hero level openings due to poor buzz. Lucifer was watched by lot of Telugu youth on OTT, so as Pink Or Ayyapanum Koshiyum.

Remakes are an outdated concept, when there is a chance for watching original with subtitles. Most of the time, the essence of the original is lost in the remake. Chiranjeevi defended these arguments by saying that remakes can be better than original and are more risky.

Still, when the original is freely available what is the point of watching a remake? These questions have to be deeply thought about when fans are against the idea of mega heroes doing remakes.

Rishab Shetty’s remarks on Rashmika surprise fans

0

Post the massive success of Kantara, Rishab Shetty is being hounded by media houses from all over India for his special bytes or interviews. A large section of Bollywood media and national news channels eagerly awaits an exclusive spot with Rishab Shetty to know more about Kantara.

Meanwhile, during one such interview, Rishab Shetty’s statement made some news and surprised many fans. Answering a question about who he would like to work with for his next film among Rashmika, Samantha, Sai Pallavi, and Keerthy Suresh, Rishab Shetty made his choice abundantly clear.

He said, ‘I don’t want to work with a “certain type of actresses”. However, out of the list that you have given, I really like Sai Pallavi and Samantha’s work.’ This response in a sarcastic manner is being perceived by many as an indirect dig towards Rashmika. He added that he doesn’t choose actors before finishing the script. In fact, it is only after completing the script work does he think of casting.

Th actor/ director added that he always prefers working with newcomers as they come without baggage or image.

మసూదా మొదటి వారాంతం తెలుగు రాష్ట్రాల బాక్సాఫీస్ కలెక్షన్లు

0

టాలీవుడ్ లో లేటెస్ట్ సెన్సేషన్ గా మసూదా చిన్న సినిమా నిలుస్తుంది. ఈ హారర్ మూవీకి విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం అద్భుతమైన సమీక్షలను అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లను సాధించింది. మొదటి మూడు రోజుల వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి మరియు బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ఈ చిత్రం నిజానికి తక్కువ స్క్రీన్‌లతో బాక్సాఫీస్ వద్ద సాధారణ ఓపెనింగ్స్ తో ప్రారంభమైంది. అయితే పాజిటివ్ టాక్ కారణంగా సినిమా మొదటి రోజు కంటే రెండవ రోజు.. రెండవ రోజు కంటే మూడవ రోజు ఎక్కువ కలెక్షన్లతో ట్రెండ్ అయింది. మూడవ రోజు ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్ల కంటే మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసింది. హైదరాబాద్ నగరం మసూదాకు అతిపెద్ద ఆదాయ ప్రాంతంగా నిలిచింది. నైజాంలో ఈ చిత్రం మొదటి వారాంతంలో దాదాపు 1.3 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ చిత్రం 1 కోటి రూపాయల గ్రాస్‌ను వసూలు చేసింది.

ఒకప్పటి హీరోయిన్ సంగీత తన యుక్తవయస్సులో ఉన్న కుమార్తెను దుష్టశక్తుల నుండి రక్షించే లక్ష్యంతో తల్లి పాత్రను ఈ చిత్రంలో పోషించారు. ఆమె నటిగా ఎప్పుడూ మంచి ఇమేజ్‌ని కలిగి ఉండగా.. ఈ పాత్రలో ఆమె అద్భుతమైన నటనతో మరోసారి తన సామర్థ్యాన్ని చూపించారు.

ఇక వర్ధమాన నటుడు తిరువీర్ కూడా తన సహజమైన నటనతో మెప్పించారు, బాంధవి శ్రీధర్ దెయ్యం చేత భాదింపబడే అమ్మాయి పాత్రలో మెప్పించారు. అలాగే ముఖ్య పాత్రల్లో సీనీయర్ నటుడు శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ సినిమాకి మరో బలంగా నిలిచారు.

సెకండాఫ్‌లో ప్రేక్షకులను అయోమయంలో ఉంచే ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లేను డీల్ చేయడంలో తొలి దర్శకుడు సాయి కిరణ్ అద్భుతంగా పని చేశారు. కొన్ని సంవత్సరాల నుండి హార్రర్ శైలిని కామెడీతో మిళితం చేసి చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ నూతన దర్శకుడు చాలా కాలం తర్వాత నిజమైన హారర్ జానర్ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకువచ్చారు.

ఫలితంగా మౌత్ టాక్ బలంగా పెరగడంతో కలెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. మూడో రోజు మొదటి రోజు కంటే మూడు రెట్లు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. ఎప్పటికైనా కంటెంట్‌ యే కింగ్ అని మసూదా చిత్రం మరోసారి నిరూపించింది.

హారర్ జానర్‌కు తెలుగులో మంచి టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు కానీ ఆ మార్కెట్‌ను ఎందుకో ఎవరూ పెద్దగా అన్వేషించలేదు. ఇంతకుముందు అరుంధతి వంటి సినిమాలు ఆ కాలంలో అద్భుతమైన వసూళ్లను సాధించాయి. మసూదా విజయంతో హారర్ సినిమాల ట్రెండ్ మరోసారి మొదలవుతుందని ఆశిద్దాం.

Masooda 1st weekend Telugu States Box office collections

0

Masooda a small movie is the latest sensation in Tollywood. Critics and audiences are getting glued to this horror movie. The movie has received excellent reviews and also doing well at box office. The first three days have been terrific and the returns at the boxoffice are only growing day by day.

The film started with less screens and ordinary start at Box office. But with positive WOM the movie has jumped over day2 and trended like Day1 << Day2 << Day3 . On Day3 the film has collected more than triple of 1st day collections. Hyderabad city is the biggest revenue territory for Masooda. In nizam the film has collected around 1.3Cr gross for the 1st weekend , in Andhra pradesh the film has collected around 1Cr gross for the weekend.

Yesteryear actress Sangeetha has played a mother role in the movie who is on a mission to save her adolescent daughter from evil forces. She had always a good image as an actor and with this role she showed her potential once at again with a terrific performance.

Upcoming Actor Thiruveer also has impressed with his natural act while Bandhavi Sridhar was convincing in the role of a possessed girl.

The debut director Sai Kiran had did a fantastic job in dealing an interesting screenplay that keeps audience puzzled in second half. Horror genre was mixed with comedy from few years and its glory has been brought back by this debutant director.

As a result the collections are increasing as word of mouth is strongly growing. The third day has seen collections that are thrice that of day 1. This shows that content is the king any day.

Horror genre has good target audience in Telugu but the market hasn’t been explored much. Previously movies like Arundhati went on to become one of the leading grossers of that time. Hope the trend begins once again with the success of Masooda.

బాక్సాఫీస్ వద్ద యశోద ను డామినేట్ చేసిన సుడిగాలి సుధీర్ గాలోడు

0

జబర్దస్త్ ఫేం సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన గాలోడు సినిమా ఈ వారం విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం అనూహ్యంగా ఇప్పటివరకూ 4 కోట్ల గ్రాస్‌ వసూలు చేసి సంచలనం సృష్టించింది. బ్రేక్ ఈవెన్ మార్కును దాటసి లాభాల దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో గాలోడు సినిమా బాక్సాఫీస్ వద్ద ఈ వారాంతంలో యశోదను మించిపోయింది.

ఈ చిత్రం 2.5 కోట్లకి బిజినెస్ జరుపుకోగా.. ఇప్పటికే 80% థియేట్రికల్ హక్కులను రికవరీ చేసింది. జీరో హైప్‌తో విడుదలైన ఈ చిత్రం సుధీర్‌కు గణనీయమైన ఫాలోయింగ్‌ను కలిగి ఉందని ఇది చూపిస్తుంది. ప్రమోషన్‌లు ఏమీ పెద్దగా లేకుండానే ఇంతటి ఘన విజయం సాధించడం విశేషం. సూపర్ హిట్ అయిన నీ కళ్లే దీపావళి పాట ఈ సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మరోవైపు, సమంత నటించిన యశోద ప్రారంభ వారాంతంలో మంచి కలెక్షన్లు తెచ్చుకున్నా, ఆ తర్వాత వారం రోజులలో అకస్మాత్తుగా పడిపోయింది. యశోద వదిలిన ఖాళీని గాలోడు వాడుకుంటున్నాడు. టాలీవుడ్‌లో మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. అలాంటి కంటెంట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

సుడిగాలి సుధీర్ ఈ ఇమేజ్ ను పొందడానికి చాలా కష్టపడ్డారు మరియు జబర్దస్త్ షో వరకూ తను ఎల్లప్పుడూ బలమైన అభిమానులను ఆస్వాదించారు. అయితే ఆ పాపులారిటీని సినిమాల్లోకి అనువదించలేదు, తన మొదటి రెండు సినిమాలకు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కాలేకపోయారు.

సుధీర్ నటించిన తొలి సినిమా సాఫ్ట్‌వేర్ సుధీర్, తర్వాత కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించిన వాంటెడ్ పండుగాడ్.. ఈ రెండు సినిమాలను అందరూ ఏకగ్రీవంగా పూర్తిగా కొట్టిపారేశారు. కానీ గాలోడు సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో సఫలం అయింది.

‘గాలోడు’ సినిమాతో సుధీర్ మాస్ ఆడియన్స్‌లో బలమైన మార్కెట్‌ని ఏర్పరచుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ అతను తన రాబోయే సినిమాల ఎంపికలలో చాలా తెలివిగా ఉండాలి కాని ఏదో సినిమాలు చేయాలి కాబట్టి కొంతమందిని సంతోషపెట్టడానికి సాధారణ స్క్రిప్ట్‌లను ఎంచుకోకూడదు. అందివచ్చిన ఈ మార్కెట్‌ను సుడిగాలి సుధీర్ తెలివిగా ఉపయోగించుకుంటారని మరియు రాబోయే రోజుల్లో ప్రత్యేకమైన కథలతో సినిమాలు చేస్తారని ఆశిద్దాం.