Home Blog Page 2163

ఓకే ఒక జీవితం 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్లు

0

శర్వానంద్, రీతూ వర్మ మరియు అమల అక్కినేని నటించగా . కొత్త దర్శకుడు శ్రీ కార్తిక్ తెరకెక్కించిన టైమ్ ట్రావెల్ ఎమోషనల్ డ్రామా ఒకే ఒక జీవితం సెప్టెంబర్ 9 న విడుదలైంది. మరియు సినీ ప్రేమికుల నుండి మంచి స్పందనను అందుకుంది. తాజా నివేదిక ప్రకారం కలెక్షన్లు ఏ మేరకు వచ్చాయో చూద్దాం.

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్ సినిమా ఒకే ఒక జీవితం సినిమా గత వారం విడుదలై అటు ప్రేక్షకులు ఇటు విమర్శకుల నుండి అద్బుతమైన స్పందనను సొంతం చేసుకోగా.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వీకెండ్ వరకూ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత క్లిష్టమైన సాధారణ రోజులలోకి ప్రవేశించింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉందని ఏకగ్రీవంగా టాక్ చెప్పినప్పటికీ సోమవారం కలెక్షన్లలో కాస్త డ్రాప్ వచ్చిన మాట వాస్తవమే.

సోమవారం మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలలో పెద్దగా కలెక్షన్లు లేని ఈ సినిమా, తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షోలలో స్పాట్ బుకింగ్స్ వల్ల మళ్ళీ నిలదొక్కుకుంది. మొత్తం మీద నాలుగవ రోజు బాక్స్ ఆఫీసు వద్ద ట్రేడ్ వర్గాలు ఆశించిన హోల్డ్ ఉన్నప్పటికీ.. సినిమాకు వచ్చిన టాక్ దృశ్యా సినిమా రన్ ఇంకొంచెం బాగా ఉండాల్సిందని అంటున్నారు.

మొత్తానికి తొలిరోజు చాలా స్లో ఓపెనింగ్ తర్వాత ఓకే ఒక జీవితం రెండవ రోజు మరియు మూడవ రోజు నుంచి బాక్స్ ఆఫీసు వద్ద దూసుకుపోయింది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు రోజుల తొలి వారాంతంలో మంచి నంబర్‌లను నమోదు చేసింది. ఇక ముందుగానే చెప్పుకున్నట్లు ఈ సినిమా సోమవారం రోజు కూడా బాగానే ఉంది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులకు సుమారుగా 10 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన ఈ చిత్రం దాదాపు 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , తమిళనాడులో దాదాపు 2.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది , మిగిలిన ఏరియాల గ్రాస్ దాదాపు 1 కోటి వరకూ ఉంటుంది . మొత్తంగా ఒకే ఒక జీవితం సినిమా ఐదు రోజులకు దాదాపు 17 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆకట్టుకుంది.

ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం, శ్రీకారం వంటి వరుస పరాజయాలతో ఎలాంటి సినిమా చేయాలో తెలియక సతమతమవుతున్న హీరో శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’పెద్ద రిలీఫ్ ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌తో శర్వా చాలా సంతోషంగా ఉన్నారు.

అల్లు అర్జున్ కోసం అయిదేళ్ళైనా ఎదురు చూస్తా – ఒకే ఒక జీవితం దర్శకుడు శ్రీ కార్తీక్

0

శర్వానంద్ కు ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో చక్కని ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీసు వద్ద హిట్ ఇచ్చారు దర్శకుడు శ్రీ కార్తిక్. ఈ సినిమాకి వచ్చిన టాక్ కు కాస్త తక్కువ కలెక్షన్లు వస్తున్నాయి అనే మాట అటుంచితే.. ఒక మంచి సినిమాగా దాదాపు సినిమా చూసిన వారందరి చేతా ప్రశంసింపబడింది. అమ్మ సెంటిమెంట్ కు సైన్స్ ఫిక్షన్ యాంగిల్ ను జత చేసి ఎక్కడా అనవసరమైన హంగూ ఆర్భాటాలకి పోకుండా ఒక హృద్యమైన అనుభవంలా తీర్చిదిద్దినందుకు దర్శకుడు శ్రీ కార్తిక్ కి మంచి మార్పులు పడ్డాయి.

ఐతే తనకి తన సినిమాకి వస్తున్న ఆదరణకు శ్రీ కార్తిక్ ఖచ్చితంగా అర్హులే. ఎందుకంటే ఇదేదో అషామాషిగా తెరకెక్కిన సినిమా కాదు. ఈ కథని రాయడానికే కార్తిక్ కి రెండేళ్ళు పట్టింది. ఇక కథకు తగ్గ హీరో కుదరడానికి మరో ఏడాదిన్నర పట్టింది. తర్వాత కోవిడ్ వలన అదనంగా రెండేళ్ళ జాప్యం.. ఇలా అన్ని అవాంతరాలు దాటుకుని సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి దాదాపు ఐదేళ్ళు పట్టింది. అయితే ఇన్ని కష్టాలు మరియు ఇన్ని రోజుల నిరీక్షణకు తెరపడిన తర్వాత దర్శకుడు శ్రీ కార్తిక్ కు తగిన ఫలితం దక్కిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సినిమా చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమాలోని పాత్రలతో మమేకం అయిపోయి, వాటి తాలూకు భావోద్వేగాలను కూడా తమవే అనుకునే స్థాయిలో సినిమా వాళ్లకు నచ్చింది.

అయితే ఇప్పుడు శ్రీకార్తిక్ గురి ఒక పెద్ద సినిమా మీదకు వెళ్ళింది. తన రెండో సినిమాని అల్లు అర్జున్ తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు కార్తిక్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. నా కొత్త సినిమా తెలుగులో ఉండబోతుంది. పెద్ద స్కేల్ లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా చేయాలనే ఆలోచన వుంది. ఒక ఫాంటసీ స్క్రిప్ట్ వుంది. రియలిజం ఫాంటసీ కాన్సెప్ట్ తో ఆ సినిమా చాలా క్రేజీగా వుంటుంది. నా రెండో సినిమా అల్లు అర్జున్ గారితో చేయాలని వుంది. ఆయనకి వెళ్లి కథ చెప్పాలి. చెన్నైలో తెలుగు సినిమా అంటే అల్లు అర్జున్ సినిమానే. మా ఫ్యామిలీలో అంతా అల్లు అర్జున్ అభిమానులమే. ఆయనతో సినిమా కోసం ఐదేళ్ళు వెయిట్ చేయడానికి కూడా ఓకే అని చెప్పుకొచ్చారు దర్శకుడు శ్రీకార్తిక్.

అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యే వరకు ఎంత లేదన్నా మరో రెండేళ్లు పడుతుంది. మరి దర్శకుడు శ్రీ కార్తిక్.. అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి నిజంగానే ఐదేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందో లేక ఈలోపే ఆయనకు అల్లు అర్జున్ నుంచి పిలుపు వస్తుందో చూడాలి.

Oke Oka Jeevitham 5 Days Worldwide Box Office Collections

0

Sharawanand’s Oke Oka Jeevitham was released in theatres on 9th September and opened to low numbers at the box office on the opening day. Despite the decent promotions and the special screenings of the film, it failed to make an impact on the opening day.

But the film saw a huge jump on Day 2 and Day 3, posting decent numbers during the weekend. Due to the positive word of mouth from the audience, the film witnessed a surge in numbers at the box office. Oke Oka Jeevitham has proved that as long as the content is good, audiences will come to the theatres.

After a decent opening weekend, the film is holding up well on the weekdays too. Here are the 5 days worldwide box office collections of Oke Oka Jeevitham. The film has collected approximately 10 crores in gross in the Telugu states. The next best performer is the overseas region where the film garnered about 3.5 crores in gross. In Tamil Nadu, the film collected close to 2.5 crores in gross. The Rest Of India’s collections stands at 1 crore. In total, the 5 days worldwide collections of Oke Oka Jeevitham are 17 crores.

Oke Oka Jeevitham has been directed by Shree Karthick. It stars Sharwanad, Priyadarsi, Vennela Kishore, and Amala Akkineni in the lead roles. Jakes Bejoy is the music director and Drewm Warrior Pictures has produced the film.

I Want To Do My Dream Project With Allu Arjun Says Oke Oka Jeevitham Director

0

Director Shree Karthick is currently on cloud nine after the massive success of Oke Oka Jeevitham. The film opened to low numbers on the opening day but picked up pace due to positive word of mouth from the audience. This is also Shree Karthick’s first Telugu film. However, the director has made Tamil films previously.

During an interview, Shree Karthick said his dream project is with Allu Arjun. He expresses his interest in making his second film with Allu Arjun. When asked about the waiting time to make a film with Allu Arjun, he replied, “Allu Arjun is like one of our own in Tamil Nadu. I will wait even 5 years if it is necessary for Allu Arjun.”

He also said that film is a fantasy script that has a lot of realism in it. In addition to that, he stated how Allu Arjun gets a lot of love in Tamil Nadu. “When Allu Arjun’s Telugu movies release here, there is no difference. It is like a Tamil movie itself.”

We have to wait and watch whether his combination will materialize. After all, Allu Arjun will be busy with Pushpa: The Rule, and following that he has expressed his interest to work with directors with a strong market only. But, Allu Arjun has always been supportive of young directors and if the script is written on a large scale, it might definitely work out.

RC-15 – వరిసు సినిమాలతో భారీ ఆఫర్లను పొందుతున్న దిల్ రాజు

0

టాలీవుడ్ లో అగ్ర నిర్మాతగా దిల్ రాజు కు మంచి పేరుంది. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ గా ఆయన ఎదుగుదల ఎందరికో ఆదర్శంగా నిలిచింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. పలు రంగాల్లో ఉండి విజయవంతంగా తన ప్రయాణాన్ని సాగిస్తూ వచ్చిన దిల్ రాజు ఇటీవలే పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న నిర్ణయాలు వాటిని అమలు చేసిన తీరు కావచ్చు.. లేదా యువ హీరో నిఖిల్ నటించిన తాజా బ్లాక్ బస్టర్ హిట్ ‘కార్తికేయ 2’ రిలీజ్ విషయంలో ఆయన పై వచ్చిన కొన్ని పుకార్లు కావచ్చు.

ఇలా చాలా అనవసరమైన విషయాలలో సంబంధం ఉన్నా లేకున్నా ఆయనను చాలా మంది ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నిందించారు. అయితే కార్తీకేయ-2 సినిమా సక్సెస్ మీట్ లో ఆయన ఈ పుకార్లన్నటికీ సమాధానం చెప్పారు అనుకోండి. ఇక ఇలాంటి చవకబారు విషయాలను పట్టించుకోకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన ప్రస్తుతం రెండు భారీ సినిమాలను నిర్మిస్తున్నారు.

RC-15 మరియు విజయ్ వరిసు రెండు సినిమాలు కూడా ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలు. ఆర్‌సి 15 చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ద్విభాషా చిత్రం వరిసు (తెలుగులో వారసుడు). ఈ రెండు సినిమాల మధ్య ఉండే కామన్ పాయింట్ ఏంటంటే ఈ రెండింటినీ నిర్మిస్తున్నది నిర్మాత దిల్ రాజు.

దిల్ రాజు బిజినెస్ పరంగా ఈ రెండు సినిమాలకు కలిపి ధరలను కోట్ చేస్తున్నారట. అందుకు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ ఒప్పందాల పై చాలా ఆసక్తి చూపుతున్నారనీ, అలాగే దిల్ రాజు చెప్పిన ధరను అందించడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. ఇక ఓవర్సీస్ మార్కెట్‌లో, ఆర్‌సి 15 మరియు వరిసు కలిపి 65 కోట్ల రూపాయల భారీ ధరకు వ్యాపారం జరుపుకుంటున్నాయి. ఒక్కో సినిమాకీ విడివిడిగా చూసుకుంటే రెండు చిత్రాల హక్కులు 32 కోట్లు – 33 కోట్ల ధరలతో ఓకే స్థాయిలో ఉన్నాయి.

దిల్ రాజు అన్ని ప్రాంతాలలో కూడా ఇదే తరహాలో రెండు సినిమాలకు సంబంధించిన వ్యాపారం జరిగేలా చూసుకుంటున్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ రెండు సినిమాలను అన్ని ప్రాంతాలలో అలానే కొనుగోలు చేసే అవకాశం ఉంది.

RC-15 ఒక సామాజిక సందేశంతో కూడిన రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా.. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించనున్నారు. అవినీతి నిరోధక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. మరోవైపు విజయ్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం వరిసు. ఈ రెండు చిత్రాలకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.

వరిసు జనవరి 2023లో విడుదల కానుండగా, RC 15 వేసవిలో విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నా.. ఇంకా అధికారికంగా విడుదల తేదీని ఖరారు చేయలేదు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది.

Mahesh Babu’s fans on cloud nine now with recent announcements

0

Superstar Mahesh babu’s SSMB 28 and SSMB 29 have grabbed everyone’s attention. Heavy expectations are set on both these films and Mahesh Babu fans are understandably on cloud nine because of this excellent lineup of Trivikram and SS Rajamouli.

In addition to this, the recent updates by SSMB 28 team and SS Rajamouli have given massive energy to Mahesh Babu fans. Directed by Trivikram, SSMB 28 shooting announcement video was released yesterday and gave film lovers a glimpse of what to expect. The much-awaited film will release on 28th April 2023. This film will mark the comeback of Mahesh and Trivikram after 12 years.

The team clearly mentioned it will be a high-octane action entertainer. Fans are also eager to catch Mahesh in this genre. Along with this announcement video, SS Rajamouli’s statement on his project with Mahesh created massive hype among the fans.

At a recent event, the visionary director gave a hint about what to expect from the project. “My next film with Mahesh will be a globetrotting action adventure”, said Rajamouli. Needless to say, this confirmation has now set the expectations even higher! Fans and movie lovers across the world are eager to see this much-awaited combination.

National Cinema Day postponed, multiplex ticket prices available at Rs 75/-

0

The Multiplex Association of India (MAI) has postponed the National Cinema Day celebrations from 16 September and announced that it will now be observed across India on 23 September.

Previously, the MAI had announced that the ticket pricing at the biggest cinema chains for moviegoers would be ₹75 on 16 September. However, the stakeholders requested the MAI postpone the celebrations for a week to maximize the participation of the audience.

It is being speculated that the event has been postponed in order to give Brahmastra a clear space at the box office as Rs 75/- ticket price would hurt its collections. Taking to Twitter, the Multiplex Association of India released a press note citing their decision to postpone the celebrations.

The National Cinema Day will be held at more than 4000 participating screens and will include cinema screens of PVR, INOX, Cinepolis, Carnival, Miraj, Citypride, Asian, Mukta A2, MovieTime, Wave, M2k, Delite and many others.

Dil Raju getting jackpot deals with Varisu and RC15

0

RC 15 and Vijay’s Varisu are among the most awaited south -Indian films at the moment. While RC 15 is helmed by Shankar, Varisu is a bilingual directed by Vamsi Paidipally. The common string between these two films is Dil Raju, who is producing both.

Dil Raju is quoting the prices for two movies combined and even distributors are also very interested in these deals and are ready to offer quoted price. In the overseas market, RC 15 and Varisu are being quoted for a combined price of Rs 65Cr. Individually, the rights of both films are in the same range of 32Cr – 33Cr.

Dil Raju is following the same concept in other areas too quoting the business for two movies and distributors are likely to buy these two movies in all territories.

RC 15 is a political drama with a powerful message and will star Kiara Advani opposite Ram Charan. This film is going to be on an anti-corruption theme and Shankar is shooting it on a grand scale. Varisu on the other hand stars Vijay and Rashmika Mandanna. Both these films will have music composed by SS Thaman.

While Varisu will release in January 2023, the release date of RC 15 has not been specified yet and the shoot is going on at a rapid pace in Hyderabad.

Brahmastra crashes on Monday; nowhere near KGF2, Baahubali2, and RRR

0

Ranbir Kapoor and Alia Bhatt starrer Brahmastra registered sensational openings last week and continued its victory run over the weekend. The film collected 125Cr nett over the first weekend and has set a new benchmark for Hindi films. The previous record for direct Hindi films was Sanju which collected Rs 120 crores.

However, the movie tanked on the first weekday i.e. Monday. The film saw significant drops much to the disappointment of the makers. Brahmastra has made on close to 500Cr budget, The comparison will be always there with big pan India blockbusters like RRR, KGF2, and Baahubali2.

All these three movies collected more than 1000Cr gross and looking at the start it had, it appeared Brahmastra might also join this club. However, looking at the drops now, it’s not possible for Brahmastra to come close to these films.

Considering the budget and expectations the film dropped on Monday and it has a more than 60% drop on Monday from Sunday which is unexpected.

బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగవ రోజు అనూహ్యంగా పడిపోయిన బ్రహ్మాస్త్ర

0

గత కొంత కాలంగా బాలీవుడ్ కి సరైన హిట్టు పడలేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రేక్షకులని థియేటర్ల వద్దకు రప్పించడం వారికి తలకు మించిన భారంగా మారింది. అగ్ర హీరోల సినిమాలు కూడా బలమైన హిట్ కొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే వచ్చిన అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా భారీ పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్ అయితే ఆయన నటించిన చివరి నాలుగు సినిమాలలో కేవలం ఒక్క సినిమానే హిట్టు కొట్టింది. ఇక ఈ ఏడాది భూల్ భులయ్య-2, ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే భారీ విజయాలు సాధించాయి.

ఇక మన తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్, కన్నడ చిత్రం కేజీఫ్-2 హిందీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో బాలీవుడ్ దృష్టంతా ఓకే సినిమా పై పడింది. అదే గత వారం విడుదలైన బాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమా బ్రహ్మస్త్ర.

రణ్ బీర్ కపూర్ అలియా భట్ కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. మన భారతీయ పురాణాల ఆధారంగా ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ తో కలిసి మరికొంత మంది ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందు నుంచి భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే నెగటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే సినిమాపై వున్న బజ్ కారణంగా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో తొలి మూడు రోజులు భారీ స్థాయిలోనే ఈ సినిమా భారీ వసూళ్లని రాబట్టింది.

నిజానికి బాలీవుడ్ లో ఉన్న పరిస్థితిలో, అదీ తాజాగా బాగా ప్రబలుతున్న బాయ్కాట్ ట్రెండ్ నేపథ్యంలో బ్రహ్మస్త్ర ఓపెనింగ్స్ అయినా దక్కించుకుంటుందా అనే అనుమానం వ్యక్తం అయినా.. భారీ పబ్లిసిటీ వల్ల సినిమా తొలి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడగా రాణించి ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక సాధారణంగా అన్ని సినిమాలకు చూసినట్టే ఈ చిత్రానికి కూడా సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో నిర్ణయం తీసుకుందాం అని ట్రేడ్ వర్గాలు భావించాయి.

ఇక అత్యంత కీలకమైన సోమవారం పరీక్షలో బ్రహ్మస్త్ర అత్తెసరు మార్కులు తెచ్చుకుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కలెక్షన్లలో 60% కంటే ఎక్కువ డ్రాప్ వచ్చింది, ఇది ఎవరూ ఊహించనిది. మొత్తంగా నాలుగవ రోజు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 16.5 నెట్ వసూలు చేసింది. నాలుగు రోజులకు కలుపుకుని చూసుకుంటే 140 కోట్లకు పైగా వసూలు చేసింది.

బ్రహ్మాస్త్ర చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, RRR, KGF2, బాహుబలి2 వంటి పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో ఈ చిత్రానికి పోలిక అనివార్యం అవుతుంది. ఈ మూడు సినిమాలు కలెక్షన్స్‌ని చూస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేశాయి, ట్రెండ్ చూస్తుంటే బ్రహ్మస్త్ర ఈ చిత్రాలకు దగ్గరగా రావడం సాధ్యం అయేలా కనిపించట్లేదు, బడ్జెట్ మరియు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే బ్రహ్మస్త్ర కలెక్షన్లు డ్రాప్ అవటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ అయినా వసూలు చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద గౌరవప్రదమైన స్థానం సంపాదించుకుంటుంది.