Home Blog Page 2094

Ram Pothineni: అతి నమ్మకంతో కోట్లు నష్టపోయిన రామ్

0

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ‘ది వారియర్’.. భారీ అంచనాల మధ్య పోయిన వారం విడుదల అయింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు లింగుస్వామి తెరకెక్కిస్తుండటంతో మంచి మాస్ ఎంటర్టైనర్ గా రూపొందబడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయాన్ని అందుకుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య జూలై 14న రిలీజ్ చేశారు.

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో రామ్ డాక్టర్ గా మరియు పోలీస్ గా రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్య పరిచారు. అదీ కాక కెరీర్‌లో తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన రామ్, తన నటనతో ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు అని చెప్పవచ్చు. అయితే సినిమాలో కథ, తీరుతెన్నులు మాత్రం మూస ధోరణిలో ఉండటం వల్ల ఈ సినిమాకు రిలీజ్ రోజున టాక్ పరంగా మిశ్రమ స్పందన లభించింది. కానీ తొలిరోజున కలెక్షన్లు మాత్రం పరవాలేదనే స్థాయిలో వచ్చాయి.

అయితే కలెక్షన్లు తరువాత పుంజుకుంటాయి అని ట్రేడ్ వర్గాలు ఆశించాయి. అయితే ఆ ఆశలు నిజం కాలేదు. వారాంతంలో కూడా ఈ సినిమా కలెక్షన్లలో జంప్ కనపడలేదు. ఈ సినిమాని చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తిని చూపకపోవటం గమనార్హం. ఆ రకంగా ది వారియర్ సినిమా 4 రోజులు ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది. సినిమాకి జరిగిన బిజినెస్ కు మరో 30 కోట్లు రావాల్సి ఉంది. కానీ అంత కలెక్షన్లు వచ్చే సూచనలు కనపడట్లేదు.

కాగా ఈ సినిమా ఫలితం మీద ఉన్న నమ్మకంతో హీరో రామ్ చిత్ర వ్యాపారంలో కూడా భాగం తీసుకున్నారు. నైజాం మరియు వైజాగ్ ఏరియాల హక్కులను ఆయనే ఉంచుకున్నారు. ఆ రెండు ఏరియాల బిజినెస్ కలిపి 15 కోట్ల వరకూ (valued) అయింది. అయితే కలెక్షన్లు మాత్రం 6 కోట్ల వరకు మాత్రమే వచ్చాయి. ఇక ఇవే క్లోజింగ్ కలెక్షన్లు గా పరిగణించవచ్చు. ఆ రకంగా చూసుకుంటే హీరో రామ్ కు దాదాపు 10 కోట్ల నష్టం వాటిల్లింది.

I did not like my role in Sarileru Neekevvaru: Prakash Raj

0

Prakash Raj says that he is extremely disappointed with some of the roles that he did in his career. One such role he was discussing about is from Sarileru Neekevvaru. Prakash Raj is the main protagonist in this movie. He doned the character of Edhula Nagendra, a corrupted politician in the movie. Mahesh Babu changes him for good and makes him a better person in the movie.

According to Prakash Raj, this character isn’t something that he liked to work on. He is saying that there are times when you just have to perform in a movie without caring about your own opinion. This is one such situation. In his words, “the characters that we done are supposed to be interesting. We have to get more interest to work in those characters. I have always been against the regular characters that we see onscreen but there are certain situations where we can’t do or say anything. This movie and character was one of them. I am quite dissatisfied about Sarileru Neekevvaru.

Hopefully, this interview doesn’t stir into any controversy.

శింబు సినిమా రీమేక్ లో రానా

0

తమిళంలో గత ఏడాది అద్భుత విజయం సాధించిన సినిమా “మానాడు”. దర్శకుడు వెంకట్ ప్రభు – హీరో శింబులకు చాలా కాలం తరువాత మంచి హిట్ సినిమాగా నిలిచిందీ చిత్రం. థియేటర్లలోనే కాదు ఓటీటీలో విడుదలైన తరువాత కూడా “మానాడు” చక్కని స్పందనను రాబట్టుకుంది. ఇదిలా ఉండగా ‘మానాడు’ని తెలుగులో రీమేక్ చేస్తున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన రీమేక్ హక్కులు నిర్మాత సురేష్ బాబు రీమేక్ హక్కులు తీసుకోగా.. తొలుత ఇందులో మాస్ మహరాజ్ రవితేజ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు వార్తలొచ్చాయి. అనంతరం మరో ఇద్దరు, ముగ్గురు హీరోల పేర్లతో పాటు చివరికి నాగ చైతన్య హీరోగా నటిస్తున్న విషయం దాదాపు ఖరారు చేసేసారు.

అయితే.. తాజాగా ‘మానాడు’ రీమేక్‌ లో కాకుండా దర్శకుడు వెంకట్ ప్రభుతో నాగ చైతన్య ఒక స్ట్రెయిట్ తమిళ/తెలుగు ద్విభాషా చిత్రం చేస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. దీంతో మానాడు రీమేక్ లో హీరోగా ఎవరు నటిస్తున్నారు? అసలు ఆ సినిమా రీమేక్ ఉంటుందా లేక అటకెక్కిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్న దశలో ఎట్టకేలకు ఈ విషయం పై ఒక స్పష్టత వచ్చింది.

ఆ హీరో మరెవరో కాదు రానా దగ్గుబాటి నే..ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ రీమేక్ వెర్షన్ లో తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు సబ్జెక్ట్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయనున్నట్టు తెలిసింది.

ఇటీవలే విరాటపర్వం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన రానా, తదుపరి బాబాయి వెంకటేశ్‌తో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరికొన్ని ఓటీటీ ప్రాజెక్ట్స్ లోనూ రానా కనిపించబోతున్నారు అని సమాచారం. ఈ యువ హీరో చేయబోయే తదుపరి చిత్రాలు చక్కని విజయాలు సాధించి ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం.

Now It’s NTR Time; NTR Fans Giving It Back To Mega Fans

0

Ever since the release of RRR in theatres, it has been one of the most talked about movies. Rajamouli’s multistarrer raked in a gorgeous amount at the box office and was also critically appreciated.

On one hand, the movie was being lauded for its excellence. But on the other hand, there were fan wars going on between Ram Charan and Jr.NTR fans. Even before the release, one fanbase tried to prove that their love for their star is bigger than the other.

NTR fans did this by flying an airplane banner in the USA, while Ram Charan fans played a video of the star in New York. This did not end after the release either.

NTR and his fans have been facing a lot of trolls on social media. Most people, mainly Charan fans, have been saying that Ram Charan is the main lead and NTR is a supporting actor. Even when the film was re-released in the USA, it was Ram Charan’s performance that caught most eyes.

But recently, the tide has turned. After the OTT release of RRR, many fans are saying that NTR’s performance was the highlight of the film. NTR is getting a lot of reach mainly among audiences of other languages for his interval bang scene.

Fans of NTR are now very happy with the appreciation for their star hero. They are now giving it back to Ram Charan fans. While healthy competition is always good, it is sad to see such bitter fan wars at a time when the industry is growing rapidly. However, it is a great sign that the actors are great friends and do not care about such silly fan wars.

Thalapathy Vijay Vs Samantha In Lokesh Kanagaraj Film?

0

Ever since the announcement of #Thalapathy67 with Lokesh Kanagaraj, fans have been eagerly waiting for more updates. Their first movie together, Master, was both commercially as well as critically acclaimed but missed the mark somewhere.

But with Vikram, Lokesh Kanagaraj has set the bar very high for himself. With the massive success of Vikram, fans are eager to see how Lokesh’s film with Vijay shapes up.

To add to this excitement, it is being reported that Samantha Ruth Prabhu will act as a villain in #Thalapathy67. There is a strong buzz that Samantha has chosen to play a villain character once again after her role as Raji in Family Man.

We have seen that Samantha is highly capable of pulling off a character with negative shades. Her role as Raji received national acclaim and also bagged her multiple awards. If this news turns out true, it will be very interesting to see the two actors face off against each other.

Priyanka Arul Mohan is also reportedly playing Vijay’s love interest in the movie. She has been on fire lately with back-to-back box office successes in the form of Doctor and Don.

Pushpa Part 3 Is Also On Cards Says Fahadh Faasil

0

When Sukumar first narrated the story of Pushpa to Allu Arjun and Fahadh Faasil, it was only a one-part movie. It was only later that Sukumar decided that one part is not sufficient to show the world of Pushpa.

In fact, it was after Fahadh’s brilliant police station scene in the second half that the movie became a two-part venture. Sukumar decided that there is a lot of scope to create a proper world of Pushpa. In addition to that, he also felt that a phenomenal actor like Fahadh deserved two parts.

Now, Sukumar seems to be extending the Pushpa universe to three parts. During a recent interaction with the media, Fahadh said this, “Recently when he talked to me, he said to be prepared for Pushpa 3. He has enough materials to do it.”

Even with mixed talk, Pushpa: The Rise posted splendid numbers at the box office. Now, with the excitement sky high, there is so much potential to make the Pushpa franchise the biggest franchise in Indian cinema.

Pushpa: The Rule is all set to go on floors in the month of August. The team is looking at a December release.

రీమేకులు మేకులు అయ్యాయి -4 కోట్ల నష్టం వచ్చిందన్న దిల్ రాజు

0

తెలుగు సినిమా పరిశ్రమలో విజయాల శాతం ఎక్కువ‌గా ఉన్న అగ్ర నిర్మాత దిల్ రాజు. ఆయన నిర్మాతగా ఉన్నారంటే హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా కథలో, సినిమాలో ఖచ్చితంగా నాణ్యత ఉంటుంది అనే నమ్మకం ప్రేక్షకులలో నాటుకు పోయింది అంటే అది అతిశయోక్తి కానే కాదు. ఎప్ప‌టిక‌పుడు ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు, అనుగుణంగా సినిమాలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అనిపించుకున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు నిర్మాతగా.. అక్కినేని నాగ చైతన్య హీరోగా, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ” థాంక్యూ” చిత్ర ప్రచార కార్యక్రమాల నిమిత్తం ఆయన ప్రెస్ తో కొన్ని ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది.

అందులో భాగంగా ఆయన మారిన ప్రేక్షకుల అభిరుచులతో పాటు తన హిందీ సినిమా ప్రయాణం గురించి కూడా చర్చించారు.

అంతటి అనుభవం, మార్కెట్ పై మంచి పట్టు ఉన్నా కూడా దిల్ రాజు బాలీవుడ్ లో మాత్రం చేదు అనుభవాలు ఎదురుకున్నారు. తెలుగులో హిట్ సినిమాలు గా నిలిచిన జెర్సీ మరియు హిట్  చిత్రాలను దిల్ రాజు హిందీలో తెర‌కెక్కించారు. జెర్సీ చిత్రానికి హీరో షాహిద్ కపూర్ కాగా, హిట్ హిందీ వెర్షన్ లో రాజ్ కుమార్ రావు హీరోగా నటించారు. అయితే ఈ రెండు సినిమాలు ఆయనకు న‌ష్టాల‌ను మిగిల్చాయ‌ట‌. 

కబీర్ సింగ్ (తెలుగు అర్జున్ రెడ్డి చిత్రానికి రీమేక్) తరువాత షాహిద్ కపూర్ తో జెర్సీ సినిమా తీయడం లాభసాటి బేరంగా అనుకున్నామని, ఆ చిత్రానికి 30 కోట్ల వరకూ లాభాలు వస్తాయని భావిస్తే, కోవిడ్ – 19 ప్రభావం వల్ల ఆ సినిమా చాలా ఆలస్యంగా విడుదల అయిందని, రిలీజ్ టైం కి బాలీవుడ్ ప్రేక్షకులు ఆ తరహా సినిమాలు చూడటం మానేశారని చెప్పిన దిల్ రాజు.. జెర్సీ వల్ల లాభాలు మాట అటుంచి 4-5 కోట్ల దాకా నష్టాలు మిగిలాయని తెలిపారు.

ఇక హిందీలో ఆయన తీసిన రెండో సినిమా హిట్ గురించి చెబుతూ.. సాధార‌ణంగా రాజ్‌కుమార్ రావు సినిమాల‌కు బాక్సాపీస్ వ‌ద్ద తొలి వీకెండ్‌లో దాదాపు 15 కోట్ల వరకూ కలెక్షన్లు వస్తాయని, కానీ ప్రస్తుతం ప్రేక్షకులు ఇంకా థియేటర్లకు రావడం అలవాటు పడని పక్షంలో 6 కోట్లు మాత్రమే వచ్చాయని, టాక్ బాగుంది కాబట్టి కలెక్షన్లు తరువాత పుంజుకుంటాయి అని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరి ఆయన నమ్మకం అవుతుంది లేదో చూద్దాం.

సరిలేరు నీకెవ్వరులో ఆ పాత్ర నచ్చలేదన్న ప్రకాష్ రాజ్

0

ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేయగల సమర్థత ఉన్న నటుడు ప్రకాష్ రాజ్. ఎంతటి క్లిష్టమైన పాత్ర ఇచ్చినా, ఆ పాత్రకు ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అందుకే ఆయనకు తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నేళ్ళు అయినా మంచి డిమాండ్ ఉంది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… మహేష్ బాబు సినిమాపై ఒకింత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ బాబు హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కథలో కొత్తదనం లేకపోయినా.. కామెడీ, యాక్షన్ సన్నివేశాలు సరిగ్గా కుదిరిన పక్కా కమర్షియల్ సినిమాగా ఉండటం వల్ల సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఆ చిత్రం ఘన విజయం సాధించింది.ఆ సినిమాలో ఎన్నో ఏళ్ళ తరువాత ఒకప్పటి స్టార్ హీరోయిన్ విజయశాంతి ఒక ముఖ్య పాత్రలో నటించి సినిమాలకు తిరిగి వచ్చారు. ప్రేక్షకులకు విజయశాంతి – మహేష్ బాబు మధ్యన ఉన్న సెంటిమెంట్ యాంగిల్ బాగా నచ్చింది.

ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో కనిపించారు. మహేష్ – ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. తండ్రీ కొడుకులుగా దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. హీరో – విలన్లుగా ఒక్కడు, పోకిరి మరియు బిజినెస్ మ్యాన్ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను అలరించారు.

అయితే తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో తాను చేసిన పాత్రపై అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రకాష్ రాజ్. తనకు ఆ పాత్ర నచ్చకపోయినా కూడా చేశాను అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. సరిలెరు నీకేవ్వరు సినిమాలో ప్రధాన విలన్ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించిన విషయం తెలిసిందే. ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా ప్రకాష్ రాజ్ కామెడీ మరియు సీరియస్ మిక్స్ చేసిన పాత్రలో నటించారు.

కానీ ప్రకాష్ రాజ్ మాత్రం ఆ పాత్రను తాను అయిష్టంగానే చేసినట్లుగా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా పాత్ర చేయాలంటే ముందుగా అది మనకు నచ్చి, అందులో పూర్తిగా మమేకమయి ఆసక్తితో చేయాలని.. అయితే సరిలేరు నీకెవ్వరు సినిమాలో చేసిన పాత్ర తనకు నచ్చకపోయినా చేయాల్సి వచ్చిందని, ఒక్కోసారి అలా నచ్చని పాత్రను చేయాల్సి వస్తుందని అన్నారు.

ఇటీవలే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఫ్ 2 చిత్రంలో కనిపించిన ప్రకాష్ రాజ్.. ఈ శుక్రవారం విడుదల కానున్న “థాంక్యూ” సినిమాలో కనిపించనున్నారు. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దిల్ రాజు నిర్మించే చిత్రాల్లో ప్రకాష్ రాజ్ రెగ్యులర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తూ ఉంటారు.

Samantha VS Vijay: విజయ్ సినిమాలో సమంత

0

దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సమంత రుత్ ప్రభు. ప్రస్తుతం వరుస చిత్రాలతో తన సత్తా ఏంటో చూపించేందుకు ఉత్సాహంగా ఉన్నారు. హీరోయిన్ గానే కాకుండా ఎలాంటి పాత్ర అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్న సమంతా..విలన్ పాత్రలో అలరించనుందట. తమిళ స్టార్ హీరో సినిమాలో ఆమె ఒక ఆసక్తికరమైన విలన్ పాత్ర చేయనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవలే అక్కినేని నాగచైతన్య – సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వివాదాలతో అనవసర రాద్ధాంతం చేయకుండా సమంత వరుస సినిమాలు చేస్తూ తన కెరీర్ పైనే శ్రద్ధ వహిస్తున్నారు. ‘పుష్ఫ’ సినిమాలో స్పెషల్ హట్ సాంగ్ చేసి తన సత్తా చూపించిన తరువాత మరిన్ని ఆసక్తికరమైన పాత్రలు, సినిమాలు చేయనున్నారు.

పన్నెండేళ్ళ కెరీర్ లో సమంత అటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే కాకుండా గ్లామర్ పరంగా కూడా ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా వస్త్ర ధారణతో పాటు స్టైలింగ్ ను మార్చుకుంటూ వచ్చారు.

ఇక గత కొన్నేళ్లుగా బోల్డ్ క్యారక్టర్స్, హాట్ సీన్ లు లేదా సాంగ్ లు చేయడానికి వెనుకాడని సమంత ఇప్పుడు విలన్ పాత్రకు సై అన్నట్టు సమాచారం.

ఇటీవలే లోకనాయకుడు కమల్ హాసన్ తో “విక్రమ్” వంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని తమిళ సూపర్ స్టార్ విజయ్ తో చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక ఆరుల్ మోహన్ ను అనుకుంటడగా.. విలన్ పాత్రకు సమంత నటించనున్నారని సమాచారం. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

విలన్ పాత్ర సమంతకు కొత్తేమీ కాదు. గతంలో తమిళంలో వచ్చిన చియాన్ విక్రమ్ మూవీ ‘10’లో సమంత ద్విపాత్రాభినయం చేయగా అందులో ఒక పాత్ర మెయిన్ హీరోయిన్ అయితే మరో పాత్ర కరుడుగట్టిన విలన్ తరహాలో ఉంటుంది. ఆ సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ సినిమాలో విలన్ గా నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక సమంత ప్రస్తుతం తను ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘యశోద’, గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ తో పాటు విజయ్ దేవరకొండ తో ‘ఖుషి’ సినిమా చేస్తున్నారు.

Pushpa 3 on cards: పుష్ప 3 కూడా ఉంది అన్న ఫహద్ ఫాజిల్

0

‘పుష్ప: ది రైజ్’ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాన్ ఇండియా ప్రేక్షకుల్ని అద్భుతంగా అలరించారు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ ‘పుష్ప 2’ ఎప్పుడు మొదలవుతుంది అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలో ‘పుష్ప 2’ షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ‘పుష్ప’ ఫ్రాన్చైజీ కు సంబందించి ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.

అంతగా విశేషమైన వార్త ఏమిటంటే.. “పుష్ప -3″ కూడా రాబోతుందట. ఈ విషయాన్ని మరెవరో కాదు, పుష్ప సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ రోల్ చేసిన మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ చెప్పారు. ఆయన నటించిన ” మలయన్ కుంజు” చిత్రం ఈ శుక్రవారం విడుదల కానున్న సందర్భంగా ఆయన మలయాళ మీడియాతో ముచ్చటించారు. ఆ క్రమంలో ఆయన ‘పుష్ప 3’ ప్రిపరేషన్ కోసం ఇటీవల సుకుమార్ తనతో చర్చించారని ఆయన తెలిపారు.

ఫహాద్ ఫాజిల్ చెప్పిన దాని ప్రకారం నిజంగా ‘పుష్ప 3’ ఉంటే అందులో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందో? అసలు పుష్ప 2 లో అల్లు అర్జున్ కి మధ్య అతనికి మధ్య యుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఇక పుష్ప 3 లో కూడా కథానాయికగా రష్మికతో పాటు మిగతా పాత్రధారులు ఎవరై ఉంటారు అనే ప్రశ్నలకు పార్ట్ 2 విడుదలైన తర్వాత గానీ సమాధానం దొరకదు.

పుష్ప 3′ వార్త వింటే అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి హద్దే ఉండదు. పుష్ప సినిమాలో ‘తగ్గేదే లే’ అంటూ పుష్పరాజ్ చూపించిన మేనరిజమ్ ప్రపంచ వ్యాప్తంగా తెగ పాపులర్ అయ్యింది. సినీ రంగాలే కాక క్రీడా రంగాలైన క్రికెట్ వరకూ ఆ మానరిజమ్ పాకింది. ఇక పుష్ప 2 మరియు పుష్ప 3 లో ఇంకెన్ని అంశాలు ఫేమస్ అవుతాయో చూడాలి.