Home Blog Page 2071

SSMB28: షూటింగ్ కు వరుస ఆటంకాలతో అసహనానికి గురవుతున్న మహేష్ ఫ్యాన్స్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో 12 ఏళ్ల తర్వాత రానున్న సినిమా ప్రస్తుతం SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది. 2019 లో వచ్చిన మహర్షి తర్వాత మహేష్ బాబు సరసన పూజా హెగ్డే మరోసారి కనిపించనున్నారు.

ఈ సినిమా మొదటి షెడ్యూల్ సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో భారీ స్థాయిలో ప్రారంభమైంది. అక్కడ చిత్ర బృందం ఒక వారం పాటు జరిగిన షెడ్యూల్‌లో కొన్ని హై-ఆక్టేన్ ఎపిక్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి. రెండో షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుందని నిర్మాత నాగ వంశీ ఇటీవల తెలిపారు.

అయితే త్రివిక్రమ్‌తో మహేష్‌బాబు తలపెట్టిన ఈ ప్రతిష్టాత్మక సినిమా విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. టీమ్ ప్లానింగ్ సరిగా లేదని, ప్రొడక్షన్ హౌస్‌ దే తప్పిదమని మహేష్ అభిమానులు విసుగు చెందుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా విడుదలై ఇప్పటికీ 6 నెలలు గడుస్తున్నా .. మహేష్ బాబు నుండి పెద్దగా సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ రావడం లేదు. ముందుగా SSMB28 స్క్రిప్ట్‌ని ఓకే చేయడానికి మహేష్ కొంత సమయం తీసుకున్నారు.

పైన చెప్పిన విధంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర బృందం మొదటి షెడ్యూల్‌ని ప్లాన్ చేసింది. కానీ అది మధ్యలోనే రద్దు చేయబడింది. అందుకు కారణం మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ఇద్దరికీ అవుట్‌పుట్ నచ్చకపోవడమే.. అందువల్ల సినిమాకి ముందుగా అనుకున్నా ఫైట్ మాస్టర్‌ను మార్చారు.

ఇక ఆ తర్వాత మహేష్ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయమని త్రివిక్రమ్ ను కోరారట. అందుకు అనుగుణంగా త్రివిక్రమ్ చేసిన మార్పులు సంతృప్తికరంగానే ఉన్నాయని అంతర్గత వర్గాల సమాచారం అందుతోంది. అయినప్పటికీ రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లడం లేదు. ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణుల తేదీలు ఈ నెలలో అందుబాటులో లేవట. కాబట్టి షూటింగ్ షెడ్యూల్ ఇప్పుడు డిసెంబర్‌కి వాయిదా పడిందట.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూజా హెగ్డే కథానాయిక అవగా, నవీన్ నూలి ఎడిటర్‌గా పని చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Mahesh fans frustrated with continuos shooting delays of SSMB28

0

Superstar Mahesh Babu and Trivikram Srinivas combination is coming after 12 years with SSMB28. While Mahesh Babu will be seen opposite actress Pooja Hegde yet again after 2019’s Maharshi.

The first schedule of this movie started on a grand scale at Annapurna Studios in Hyderabad in September, where they shot for a week. Some high-octane epic action sequences were shot in this schedule. Producer Naga Vamshi recently said that the second schedule would start soon.

But there is hardly any progress in this Mahesh Babu ‘s prestigious movie with Trivikram. Ever since the movie started, it is facing too many roadblocks. Fans are getting frustrated about the team’s planning and criticizing the production house.

It’s been 6 months since Sarkaru Vaari Paata released. There has been no much movie related activity from Mahesh Babu. He took some time in okaying the script. The team planned first schedule to film a fight as said above, but it got cancelled midway, and the fight master was changed because both Mahesh Babu and Trivikram didn’t like the output.

The team was asked to make script changes from Mahesh. According to sources, the changes made by Trivikram were satisfactory. However, the movie isn’t going to sets anytime soon. The dates of artists and technicians aren’t available in the month, so the shooting is now postponed to December.

Pooja Hegde is the leading lady, Naveen Nooli is the editor and Thaman is scoring the music for this action entertainer. Harika Hasini creations is producing the movie.

RRR సీక్వెల్ కు ఎన్టీఆర్ ఒప్పుకుంటారా?

0

RRR సినిమాకు సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నారు అనే వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా నిలిచింది. రాజమౌళి RRR సినిమా అభిమానులకు ఇటీవలే ఒక ఆశను ఇచ్చారు. తన తండ్రి మరియు రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ రీమేక్ కోసం సంభావ్య ఆలోచనలపై పనిచేస్తున్నట్లు ధృవీకరించారు.

అయితే ఎన్టీఆర్ అభిమానులు ఈ సీక్వెల్‌ని అంగీకరిస్తారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రామ్ చరణ్ ను చూపించిన దానికి తగ్గట్టుగా తమ హీరోని చూపించలేదని ఇప్పటికే సినిమా చూసి వారు నిరాశ పడ్డారు. అందువల్ల, RRR సీక్వెల్ యొక్క ప్రణాళికలను కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆనందంగా స్వీకరించటం లేదు.

సినిమా విడుదలకు ముందు రాజమౌళి చాలాసార్లు చెప్పినట్లు ఆయన మెదడులో సీక్వెల్ ఆలోచన లేదు. అయితే విడుదల తర్వాత విజయేంద్ర ప్రసాద్ సమక్షంలో ఎన్టీఆర్ సీక్వెల్ అడిగారని వార్తలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా.. మరీ ముఖ్యంగా హాలీవుడ్‌లో వస్తున్న రెస్పాన్స్ చూసి రాజమౌళి సీక్వెల్‌ పై పునరాలోచనలో పడ్డారు. ఇక సినిమా ముగింపు కూడా పొడిగింపుకి స్కోప్‌ను ఇస్తుంది.

అయితే RRRలో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ పై ఇప్పటికే ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. హీరోలు ఇద్దరి పాత్రలు కూడా సమంగా ప్రభావం చూపుతాయని రాజమౌళి హామీ ఇచ్చినా.. సెకండాఫ్‌లో సినిమా చరణ్ వైపు మొగ్గు చూపింది.

క్లైమాక్స్‌లో కూడా రామ్‌ కు సహాయకుడిగా భీమ్‌ని చూపించడం, రామరాజును రాముడిగా చూపించడం ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసిందని ఎన్టీఆర్ అభిమానులు భావించారు.

క్లైమాక్స్ ఫైట్‌ సీక్వెన్స్ లో మొత్తం ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ కేవలం ప్రేక్షక పాత్ర వహించినట్లు, జైలు బద్దలు కొట్టే ఫైట్‌లో కూడా ఎన్టీఆర్ పాత్రను తక్కువ చేసినట్లు అభిమానులు ఆరోపించారు. కథ పరంగా చరణ్‌కి మంచి క్యారెక్టర్‌ లభించింది. ఆ పాత్రతో, పాత్ర తాలూకు ఆశయంతో పోలిస్తే ఎన్టీఆర్‌ ఉద్దేశ్యం అంత బలంగా చూపించలేదని కూడా అన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసి ఎన్టీఆర్‌ అభిమానులు గుండెల్లో ఈ గాయాలను అప్పటి నుంచి మోస్తునే ఉన్నారు. ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని సంతోషించినా, భీమ్‌ పాత్రకు జరిగిన అన్యాయాన్ని మాత్రం ఇప్పటికీ మరచిపోలేక పోతున్నారు. కొమరం భీమ్‌ని నిరక్షరాస్యుడిగా చూపించి, అతని ‘జల్ జంగల్ జమీన్’ నినాదాన్ని కూడా సినిమాలో రామరాజు అతనికి ఇచ్చాడని చూపించడం ఆయనను అవమానించినట్లు కొంతమంది ప్రేక్షకులు భావించారు.

ఎన్టీఆర్ క్యారెక్టర్ ను అండర్‌ప్లే చేసిన విషయంలో రాజమౌళి పై ఈ ఆరోపణలు అన్నీ కూడా ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వార్తల ప్రకారం సీక్వెల్ నిజంగా వస్తే మటుకు ఎన్టీఆర్‌ అభిమానుల భావాలను పరిగణలోకి తీసుకొని సినిమా తీస్తే మంచిది.

Telugu producer’s council attacks Dil Raju over Vijay’s Varisu

0

Vijay’s Varisu is one of the biggies scheduled for Sankranti 2023 release. The film will be released alongside Chiranjeevi’s Waltair Veerayya and Balakrishna’s Veera Simha Reddy. Ace producer Dil Raju is bankrolling Varisu which is essentially a Tamil movie also releasing in Telugu.

The Telugu Film Producer’s Council has taken serious objection to Dil Raju’s Tamil film Varisu releasing during the festive season. They are of the opinion that as discussed earlier and agreed by Raju himself, Telugu releases must be given priority during Dusshera and Sankranti. Dil Raju has a sizable power in Nizam region and his decision to release Varisu will obviously mean lesser theatres for Chiru and Balayya’s movies.

The TFPC released a press note in this connection and said that Raju himself agreed to this statement back in 2019 and the producer has stated the exact thing in many interviews in past. The association is of the opinion that Veera Simha Reddy and Waltair Veerayya must be given first priority and Dil Raju can choose to either postpone or prepone Vijay’s Varisu accordingly.

Will NTR says okay to RRR sequel? Fans are not happy with sequel plans!

0

RRR team, planning for a sequel, is the hottest topic in the news. Rajamouli gave a hope for the RRR movie fans, he has confirmed that his father is working on potential ideas for a remake. But will NTR fans accept the sequel? They are already disappointed with the movie, saying that their star was shown as subordinate to Ram Charan’s character. Hence, the plans of RRR sequel are not well received by some JR NTR fans.

Though Rajamouli before the movie released had many times said, sequel wasn’t there in his view. After the release, there was news that NTR asked for sequel in the presence of Vijayendra Prasad.

After seeing the worldwide response, especially in the Hollywood, Rajamouli is rethinking on sequel. The story’s ending also leaves scope for an extension. But NTR fans are already unhappy about NTR’s character portrayal in RRR.

Though Rajamouli promised that both will have equal impact, the movie in the second half tilted towards Charan. The portrayal of Bheem as assistant to Ram in the climax, showing Ram as Lord Rama made NTR’s character as secondary. In the climax fight, NTR was just a bystander in the whole episode, even in the prison break fight NTR took an inferior position.

Story wise, Charan got a good character arc, but NTR’s purpose was shown as inferior compared to Charan’s ambition.

NTR fans have been carrying these wounds in their hearts after seeing RRR movie. Though they were happy that NTR got worldwide recognition, but still feel the injustice done to Bheem.

Some audience also felt that showing Komaram Bheem as illiterate and even his slogan ‘Jal Jangal Jameen’ was given to him by Ram in the movie. These allegations on makers regarding NTR’s underplay are also expressed on social media platforms by NTR fans.

The frustration of NTR fans has to be addressed if there is a sequel, else they may not be happy.

Enchanting Shraddha Das shines in this beautiful photoshoot

0

Enchantingly Hot Shraddha Das shines in the latest photoshoot she posted on her Instagram account.

బాక్సాఫీసు వద్ద రెండవ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న సమంత యశోద

0

ఈ నెల తెలుగు సినిమా బాక్సాఫీస్‌ను సమంత శాసిస్తున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం బాక్సాఫీస్ వద్ద బలంగా ఓపెనింగ్స్ సాధించింది. అలాగే అసాధారణమైన సమీక్షలను అందుకుంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుండి టాక్ కూడా చాలా సానుకూలంగా ఉంది. రెండు రోజుల వరకూ ప్రపంచ వ్యాప్తంగా యశోద కలెక్షన్లు అందరి అంచనాలను మించాయి. మరియు డల్ గా ఉన్న దసరా సీజన్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లను సంతోషపెట్టాయి.

మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 2వ రోజు 6 కోట్లు రాబట్టింది. ఇది అరుదైన ఘనత అనే చెప్పాలి. మొత్తంగా మొదటి రెండు రోజులలో వచ్చిన కలెక్షన్లు కలుపుకుంటే 11 కోట్లు అవుతుంది. తమిళనాడులో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది, అక్కడ కూడా యశోద మొదటి రోజు కంటే 2వ రోజు కలెక్షన్లు చాలా మెరుగ్గా ఉన్నాయి.

కాగా యశోద తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ 14 కోట్లకు అయింది. ఆ రకంగా చూసుకుంటే బ్రేక్‌ ఈవెన్‌కి కావాల్సిన దానిలో 55% పైగా సోమవారం కంటే ముందే ఈ సినిమా కలెక్ట్ చేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సమంత బాక్సాఫీస్ స్టామినాను చూపించిన ఈ థ్రిల్లర్‌కి మొదటి వారాంతం చాలా భారీగా లాభం చేకూర్చనుంది.

యశోద మొదటి రెండు రోజులకు నైజాంలో 3.4 కోట్ల గ్రాస్, సెడెడ్‌లో 60 లక్షలు, ఆంధ్రా ఏరియాలో 2.7 కోట్లు వసూలు చేసింది. ఇక ఈ సినిమాకి బలమైన జోన్ అయిన ఓవర్సీస్‌లో 3.5 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. యశోద సినిమాకు మిగతా ఇండియాలో 70 లక్షల గ్రాస్ వచ్చింది. ఓవరాల్‌గా 11 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసిన యశోద అన్ని ప్రాంతాల వారీగా రాణిస్తూ సూపర్ హిట్ వైపు దూసుకుపోతుంది.

మహిళా ప్రధాన చిత్రంగా తెరకెక్కిన యశోద.. టైర్ 2 హీరోలు మరియు సీనియర్ హీరోల సినిమాల కలెక్షన్లను అధిగమించడం చూసి చాలా మంది బాక్సాఫీస్ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు.

థాంక్యూ, ది ఘోస్ట్ మొదలైన సినిమాల కంటే యశోద ఓపెనింగ్స్ ఎక్కువగా ఉండటం విశేషం. సరైన కథను, మరియు చక్కని కంటెంట్‌తో ఉన్న మహిళా ప్రాధాన్యత సినిమాలకు మంచి మార్కెట్ ఉంటుందని యశోద ఓపెనింగ్స్ నిరూపించాయి.

యశోద బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్ వల్ల తను ఒక సూపర్ స్టార్ అని, ఓవర్సీస్ బాక్సాఫీస్ క్వీన్ అని మరోసారి నిరూపించుకున్నారు సమంత. ఆమె నటించిన సినిమాలలో స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటించిన సినిమాలతో పాటు తను ప్రధాన పాత్రలో నటించిన సినిమాలతో సహా అర డజనుకు పైగా1 మిలియన్ సినిమాలను కలిగి ఉన్నారు.

Samantha’s Yashoda is super strong at the box office – 2 days Worldwide Collections

0

Samantha is ruling this month’s box office. Her new movie has opened strongly at the box office, received extraordinary reviews, and word of mouth from the audience is very positive. The two days worldwide collections have exceeded the expectations and making distributors and exhibitors happy after a slow post Dussehra season.

On day 1 the movie collected 5 crores across the world, the movie did even better on its day 2 getting 6 crores. This is a rare feat. So, the total collection for the first two days are 11 crores. The same trend is continuing in Tamil Nadu as well, day 2 collections are exceedingly better than day 1.

Telugu version theatrical business was closed at 14 crores. Hence, the movie will collect more than 55% of what is needed for breakeven before Monday. The first weekend is so huge for this thriller, showing Samantha’s box office stamina.

Yashoda collected 3.4 crores gross in Nizam for the first two days, in ceded it got 60 lacs, Andhra area received 2.7 crores, overseas has been the strongest zone for the movie collecting over 3.5 crore gross, rest of India got 0.7 crores. Overall the 11 crores was evenly distributed across territories showing that it is a universal hit.

Many box office analysts are surprised seeing the woman centric movie surpassing movies of tier 2 heroes and senior heroes.

Opening of Yashoda is far better than movies like Thank You, Ghost etc. making the industry that content matters and women centric movies have good market provided the story is good.

Samantha once again iterated that she is a superstar and overseas box office queen. She has now over half dozen 1 million movies to her credit, including the movies she acted as a female lead with Star Heroes.

ఈ వారం ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు

0

ఈ వారం కొన్ని ఆసక్తికరమైన సినిమాలు OTT విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులు ప్రతి వారం OTT విడుదలల కోసం వేచి ఉండటం ఆనవాయితీగా మారింది. సాధారణ వెబ్ సిరీస్‌లు మరియు ప్రత్యేకంగా OTTలో విడుదల అయ్యే వాటితో పాటు OTTకి థియేట్రికల్ విడుదలలు కూడా చాలా తొందరగా వచ్చేస్తున్నాయి.

ఈ వారం తెలుగు OTT విడుదలలలో మెగాస్టార్ యొక్క పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ మరియు కార్తి నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ సర్దార్ ఉన్నాయి. వాటితో పాటు కొన్ని సినిమాలు నేరుగా విడుదల అవడానికి సిద్ధంగా ఉన్నాయి.

నెట్‌ఫ్లిక్స్ నవంబర్ 19న గాడ్‌ఫాదర్‌ను విడుదల చేయనుండగా, సర్దార్ నవంబర్ 18న ఆహాలో విడుదల కానుంది. ఇక ఇతర విడుదలలు చూసుకుంటే రాజ్ తరుణ్ యొక్క అహ నా పెళ్లంట నవంబర్ 17న Zee5 లో ప్రసారం చేయబడుతుంది. చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 8 ఎపిసోడ్ సిరీస్ ప్రేక్షకులకి నచ్చుతుంది అని అంచనా వేస్తున్నారు. ఇక ఐరావతం అనే కొత్త సినిమా నవంబర్ 17 నుండి డిస్నీ హాట్ స్టార్‌లో ప్రసారం చేయబడుతుంది. కాగా ఇది ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రం.

మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్‌కి మంచి రివ్యూలు వచ్చినా మంచి కలెక్షన్స్ మాత్రం అనున్న స్థాయిలో రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా పూర్తిగా గ్రిప్పింగ్ డ్రామాతో కూడుకున్నందున OTT ప్లాట్‌ఫారమ్‌ లో మంచి స్పందన వస్తుందని చాలా మంది అభిప్రాయపడ్డారు.

మరో వైపు కార్తీ సర్దార్‌లో ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఎన్నో అంశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా మిస్ అవకూడని చిత్రం అని చెప్పాలి. థియేటర్‌లలో ఈ సినిమా చూడని వారు కార్తీ మరియు దర్శకుడు మిత్రన్‌ల నుండి వచ్చిన ఈ అద్భుతమైన స్పై థ్రిల్లర్‌ని చూసి ఆస్వాదించవచ్చు.

విడుదలైన 4 వారాల్లోనే OTT విడుదల కావడం వివాదం సృష్టిస్తుంది. ఓటీటీలో సినిమాను విడుదల చేయాలంటే కనీసం 6 వారాల గ్యాప్ తప్పదని నిర్మాతల మండలి ఇప్పటికే తీర్పునిచ్చింది. సర్దార్ విడుదలై నెల కూడా కాలేదు అయినా OTT లో వచ్చేస్తుంది. ఇక గాడ్ ఫాదర్ మాత్రం థియేటర్ నుండి OTT విడుదలకు సరిగ్గా 42 రోజుల గ్యాప్ తీసుకుంది.

This week Telugu OTT releases and Streaming Partners

0

There are few exciting OTT releases this week. It has become a norm for the Telugu audience to wait for the OTT releases every week, with theatrical releases making their way on to the OTT along with regular web series and exclusive releases.

This week Telugu OTT releases include Megastar’s Political Thriller Godfather and Karthi’a action entertainer Sardar, also few direct releases accompanying them.

Netflix is going to release Godfather on November 19th whereas Sardar will be released on Aha on November 18th. The other releases are Raj Tarun’s Aha Na Pellanta to be streamed by Zee5 on November 17th, it is an 8 episode series with family content. Iravatham will be streamed in Disney Hot star from November 17th, a fantasy movie.

Though Godfather got good reviews, but it couldn’t get good collections. Many felt that the movie is better for OTT platform as it is full of gripping drama. Sardar, on the other hand, has all the elements to make viewers excited. It’s an unmissable movie, those who hasn’t watched it on theaters can enjoy this slick spy thriller from Karthi and director Mithran.

OTT releases within 4 weeks of release are creating controversy. Producers council has already ruled that at least 6 weeks delay is a must to release a movie on OTT. It’s not even a month since Sardar released, while Godfather has taken exact 42 days for its OTT release.