Home Blog Page 2042

Charmee loses crores of money because of Puri’s decision

0

Liger’s disastrous performance has given rise to several comments from film lovers and industry insiders. Some feel Vijay shouldn’t have wasted so much time on the film while others feel Puri should have not gone for a pan-India release with such a weak script. While this post-failure analysis is pretty common, Liger for sure has been a bitter pill for Puri and Charmee.

Charmee who is one of the co-producer for Liger has just suffered a massive loss due to Puri’s overconfidence. During the Covid times, many movies got very good offers from OTT platforms and producers happily encashed the opportunity.

Liger also received a sensational offer from an OTT platform the amount could have easily recovered the total budget. Apart from just recovering, it would also have given huge profits to Charmee and Puri. While she was interested to take the offer, Puri had other plans and wanted the film to release in theatres only. Now this decision has left nothing but crores of losses for them.

The theatrical rights of Liger are valued at close to 90Cr and the movie is on its way to becoming the biggest disaster of Puri and Vijay Deverakonda’s career.

Producer Suresh Babu in other plans? Sells his theatre in Vizag

0

Suresh Babu is a name that needs no introduction in Tollywood. Apart from being a leading producer in the industry, he also owns several movie theatres across Andhra Pradesh. These theatres have been in the Daggubati family for several decades and have screened several iconic Suresh Productions films during their blockbuster runs of 100 Days and above.

One such theatre is Jyothi Theatre in Visakhapatnam which is one of the iconic landmarks in the beach city. Suresh Babu has reportedly sold the theatre to a Vizianagaram-based businessman for an undisclosed amount. Reportedly, there are plans to construct a multi-story residential complex by demolishing the theatres.

The theatre has not been running well for quite some time. Adding to it, the Covid lockdowns and ticket pricing issues brought up by the government pushed Suresh Babu to take this step. The ace producer was quite vocal about the ticket pricing issues and choose to release two of his films Narappa and Drushyam 2 directly on OTTs last year.

The sudden sale of this iconic Jyothi Theatre has given rise to many speculations. While some say, this is in direct dissent to YS Jaganmohan Reddy, others believe it is just a business move and selling the theatre made more sense. Suresh Babu is currently producing Regina and Nivetha Thomas starter ‘Sakini Dakini’ and Sivakarthikeyan starter Prince.

వైజాగ్ లోని సొంత థియేటర్ అమ్మేసిన ప్రముఖ నిర్మాత సురేష్ బాబు

0

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతలలో ఒకరైన సురేష్ బాబు గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ రంగంలో సేవలు అందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. సురేష్ బాబు తాజాగా వైజాగ్‌లోని తన అధీనంలో ఉన్న ప్రముఖ సినిమా థియేటర్ అమ్మేసినట్లు తెలుస్తోంది.

ఇదేమి కొత్త విషయం కాదు. ఏదైనా ధియేటర్ ఏళ్ళ తరబడి కొనసాగిన తరువాత పాతబడిన తరుణంలో ఆ ధియేటర్ ను అమ్మేసి కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం సర్వ సాధారణంగా జరిగేదే. మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో థియేటర్లు జనంతో కిటకిటలాడేవి. కొత్త సినిమా రిలీజ్ అయితే చాలు ఒక పండుగ వాతావరణం ఏర్పడేది. థియేటర్ల చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఆ సందడి కనిపిస్తూ.. ఓహో కొత్త సినిమా విడుదల అయింది అనేలా సంబరాలు జరిగేవి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితి లేతు. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది.

చాలా కాలం నుంచి థియేటర్లు మూతపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయని సినీ పరిశ్రమలో అనేక మంది నిర్మాతలు మొర పెట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ఫ్లాట్ ఫారం ల ఎదుగుదల, పెరిగిన సినిమా థియేటర్ల టికెట్ రేట్లు మరియు తినుబండారాల ధరలు ఇలాంటి రకరకాల కారణాల వల్ల ఏదో అద్భుతమైన లేదా ప్రత్యేకమైన సినిమా వస్తే తప్ప ప్రేక్షకులు ఇళ్ల నుంచి బయటకి కదలట్లేదు.

కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలా థియేటర్లు మూసి వేయబడ్డాయి. కొన్ని థియేటర్లు మరమ్మతులు చేపటట్టిన తర్వాత తెరుచుకంటే.. మరికొన్ని మాత్రం శాశ్వతంగా మూతపడిపోయాయి. ఈ క్రమంలో కొందరు యజమానులు థియేటర్లను నడిపించే స్థోమత లేక మంచి ధరకు బేరం దొరికితే అమ్మేస్తున్నారు.

ఈ దశలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఆయన ఓ థియేటర్‌ను తాజాగా అమ్మేసినట్లు సమాచారం. థియేటర్లు గత కొంతకాలంగా సరిగా నడవలేని పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సురేష్ బాబు థియేటర్ అమ్మేసినట్లు తెలుస్తోంది.

సురేష్ బాబు అమ్మిన థియేటర్ మరేదో కాదు..విశాఖపట్నం లోని జ్యోతి థియేటర్ . ఈ థియేటర్ యజమాని అయిన సురేష్ బాబు.. విజయనగరానికి చెందిన కొందరు వ్యాపారులకు ధియేటర్ ను విక్రయించారు అని ప్రచారం జరుగుతోంది. జ్యోతి థియేటర్ కూల్చి వేసి అక్కడ పది అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మించడానికి ఆ ప్రాపర్టీని కొనుక్కున్న వ్యాపారుల సిద్ధమవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ధియేటర్ స్థానంలో హౌసింగ్ అపార్ట్మెంట్లతో పాటు సాఫ్ట్వేర్ ఆఫీస్ స్పేస్, కమర్షియల్ షాపులు వచ్చేలా ఆ కాంప్లెక్స్ డిజైన్ చేయబోతున్నారని తెలుస్తోంది.

Box-Office: కార్తీకేయ-2 16 డేస్ కలెక్షన్స్

0

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయత్నాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుని.. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు వెళ్తోన్న హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ మొదట్లో కాలక్షేపంతో కూడిన మాస్ సినిమాలు మాత్రమే చేసిన నిఖిల్.. స్వామి రా రా చిత్రంతో తన శైలిని మార్చుకుని ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త రకమైన అనుభూతిని ప్రేక్షకులకు అందజేస్తూ వచ్చారు. అందువల్ల ఆయన కెరీర్ లో ఎక్కువ విజయాలను కూడా సొంతం చేసుకున్నారు.

కరోనాకు ముందు నిఖిల్ నటించిన అర్జున్ సురవరం సినిమా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆ తరువాత కాస్త గ్యాప్ తరువాత తన కెరీర్ లోనే పెద్ద హిట్ అయిన కార్తీకేయ (2014) చిత్రానికి సీక్వెల్ సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో కూడా చక్కని ఆసక్తి ఏర్పడింది. విడుదల తేదీ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా.. ఎట్టకేలకు ఈ ఆగస్ట్ 13న ‘కార్తికేయ 2’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. అద్భుతమైన టాక్ కు తగ్గట్లే కలెక్షన్లు కూడా నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక స్థాయిలో వస్తున్నాయి. విడుదలై రెండు వారాలు అవుతున్నా ఇంకా తన జోరును కొనసాగిస్తూ వస్తుంది. ‘కార్తికేయ 2’ 16 రోజుల వరకు ఎంత వసూలు చేసిందంటే..

కార్తికేయ-2 మూడవ వారాంతంలో అద్భుతమయిన వసూళ్లు రాబట్టింది. ఈ వారం విడుదలైన లైగర్ భారీ డిజాస్టర్ కావడంతో, శని ఆదివారాల్లో బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యం నిరాటంకంగా చెలాయించింది, 16 రోజుల వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 95 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి 100 కోట్ల మ్యాజికల్ నంబర్ వైపు దూసుకుపోతోంది. ఇక షేర్ విషయానికి వస్తే షేర్ 48.5 కోట్ల వరకూ సాధించింది. అందులో తెలుగు వెర్షన్ షేర్ మాత్రమే దాదాపు 37 కోట్లు వసూలు చేసిందంటే ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఇది నిఖిల్‌కి తొలి 100 కోట్ల గ్రాసర్ తో పాటు తొలి 50 కోట్ల షేర్ సాధించిన సినిమాగా నిలుస్తుంది.

నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటించిన కార్తీకేయ-2 చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించారు. కాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రను చేశారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో విడుదలైంది.

కొత్త ఇల్లు కొన్న తమిళ హీరో విజయ్

0

తమిళ ఇండస్ట్రీలో హీరో విజయ్ కి ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళ పరిశ్రమకి మాత్రమే పరిమితం కాకుండా తెలుగు సినిమా పరిశ్రమలోనూ తన సినిమాలు డబ్బింగ్ చేస్తూ తనకంటూ ఒక మార్కెట్ ను సృష్టించుకున్నారు. దక్షిణాది సినిమా పరిశ్రమలలో సూపర్ స్టార్ లలో ఒకరిగా చలామణి అవుతున్నారు. ఇక పారితోషికం విషయంలోనూ విజయ్ కి భారీ పైకం ముడుతుంది. తమిళ పరిశ్రమలో ప్రస్తుతం ఆయనే నంబర్ వన్ స్థానంలో ఉన్న హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

విజయ్ ఎలాంటి సినిమా చేసినా తమిళ నాట కలెక్షన్లకు ఏమాత్రం కొదవ ఉండదు. ఓవర్సీస్ మార్కెట్ లోనూ రజినీకాంత్ తరువాత తమిళ హీరోల్లో విజయ్ రెండవ స్థానంలో ఉంటారు. ప్రస్తుతం ఆయన వారసుడు/వరిసు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో అయన తెలుగులో భారీ విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ చిత్రానికి దర్శకుడు మరియు నిర్మాతలు మన తెలుగు వారైన దిల్ రాజు, వంశీ పైడిపల్లి కాబట్టి.

తెలుగు.. తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయ్ చెన్నైలో మరో కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. చెన్నై నగరంలోని ఖరీదైన ప్రాంతాల్లో లగ్జరీ అపార్ట్మంట్ ఒకటి కొనుగోలు చేశాడట. దాదాపు 35 కోట్ల ఖరీదైన ధరకు విజయ్ కొత్త ఇల్లు కొన్నారట.

ప్రస్తుతం విజయ్ చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్ గల సొంత ఇంటిలో ఉంటున్నారు. కుటుంబంతో కలిసి ఈ ఇంట్లో ఉంటున్న విజయ్ ఇల్లు మారడానికి కారణం మరేమిటో కాదు. ఆయన ప్రస్తుతం ఉంటున్న వీధిలో రద్దీ బాగా పెరిగిపోవడంతో కాస్త తక్కువ జన సంచారం ఉండే చోటుకి మారాలని నిర్ణయించికున్నట్లు సమాచారం.

పాత ఇల్లు లాగే కొత్త ఇంటిలో కూడా ఆఫీస్ సౌకర్యం కూడా ఉంటుందట. స్టోరీ డిస్కషన్స్ కి సంబంధించి ప్రత్యేకంగా ఓ సపరేట్ రూమ్ సైతం ఉన్నట్లు సమాచారం. ఇక తన పాత ఇంటిని తన రాజకీయ పార్టీకి సంభందించిన కార్యాలయంగా మార్చనున్నట్లు తెలుస్తోంది.

Nikhil’s Karthikeya 2 16 days worldwide box office collections

0

Nikhil’s Karthikeya 2 has been one of the biggest success stories of the year in Tollywood. Especially in the Hindi market, the film has performed exceedingly well and surpassed many expectations. The film was released in limited screens and has expanded to thousand screens by the end of the first week.

Nikhil’s Karthikeya had a terrific hold in the 3rd weekend and on Saturday and Sunday, it even dominated the new release Liger. The 16 Days worldwide gross has crossed Rs 95Cr mark and the action-adventure drama is now heading towards the 100Cr mark.

The 16 days share is in the range of Rs 48.5 Cr and just the Telugu version share is approx 37Cr. Karthikeya 2 will be the 1st Rs 100Cr grosser and Rs 50Cr share film for Nikhil.

The collections have been on an upward swing and right the collections have been surpassing the previous weekends. This is an extremely rare feat and the film’s performance has brought a massive relief to the trade circles. A sequel to the 2014 film, Nikhil’s Karthikeya 2 also stars Anupama Parameswaran, Srinivas Reddy, and Anupam Kher in key roles.

Nikhil’s performance, Chandoo Mondeti’s gripping narration, and Kaala Bhairava’s terrific BGM were the main highlights of the film.

Special Shows: పోకిరి రికార్డులకు చెక్ పెట్టనున్న జల్సా

0

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానులు జ‌ల్సా సినిమా స్పెష‌ల్ షోలకు ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. కాగా ఈ సందర్బంగా తమ అభిమాన హీరో పుట్టిన రోజును అంగ రంగ వైభవంగా జరుపుకోవడానికి పవన్ అభిమానులు ఉత్సాహంతో ఉన్నారు. అలాగే జ‌ల్సా సినిమా ఏ ఏరియాలో ఎన్ని షోలు ప్రదర్శిస్తున్నారో అవన్నీ కనుక్కుని అందరికీ సమాచారం అందజేస్తూ బిజీగా ఉన్నారు.

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్తగా పాత హిట్ సినిమాలను తిరిగి విడుదల చేసే ట్రెండ్ మొదలైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా పోకిరి సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించి మహేష్ అభిమానులు భారీ స్థాయిలో సంబరాలు జరుపుకున్నారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఒకప్పటి ఇండస్ట్రీ హిట్ సినిమా ఘరానా మొగుడు చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు నాడు మెగా అభిమానులు పోకిరి అంత భారీ స్థాయిలో లేకున్నా కొన్ని షోలు వేసుకుని ప్రదర్శించుకున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల వంతు వచ్చింది.

కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్ఏ, ఆస్ట్రేలియా వంటి విదేశాల్లో కూడా జ‌ల్సా స్పెష‌ల్ షోలు ప్రదర్శించనున్నారు. అంతే కాదు స్పెష‌ల్ షో వేస్తున్న చాలా ప్రాంతాల్లో ఎక్కువ మొత్తంలో థియేట‌ర్లు హౌస్ ఫుల్ బోర్డులు నమోదు అవుతున్నాయి అన్న వార్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా ఇంకో ఆస‌క్తిక‌ర విష‌యమేంటంటే ప‌వ‌న్ కెరీర్‌లోనే వ‌న్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన త‌మ్ముడు చిత్రానికి కూడా ఆగ‌స్టు 31న ప్రత్యేక ప్రదర్శనలు వేస్తున్నారు. అయితే తమ్ముడు చిత్రాన్ని జల్సా అంత భారీ స్థాయిలో కాకుండా కొన్ని షోలు మాత్రమే ప్రదర్శిస్తున్నారు.

ఇక జల్సా స్పెషల్ షోలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. దాదాపు 500 షోలకు పైగానే ప్రదర్శింపబడనుందని అంటున్నారు. ఎందుకంటే అడ్వాన్స్ బుకింగ్స్ చాలా బాగున్నాయి, అలానే అన్ని షోలకూ టిక్కెట్ల డిమాండ్ కూడా చాలా ఉంది. పోకిరి స్పెషల్ షోల రికార్డులన్నీ చెరిపేసే చేసే దిశగా జల్సా హవా నడుస్తోంది. సెప్టెంబర్ 1న ఈ స్పెషల్ షోలు వేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.

మొత్తానికి ప‌వ‌న్ అభిమానులు భారీ తరహాలో తమ అభిమాన హీరో పుట్టిన రోజు వేడుకలు ముందస్తుగా జరుపుకునేందుకు జల్సా చిత్రం కేంద్రంగా మారింది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన జ‌ల్సా చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కించారు.

కాగా ఈ చిత్రంలో ఇలియానా, క‌మలినీ ముఖ‌ర్జీ, పార్వ‌తి మెల్ట‌న్ హీరోయిన్లుగా నటించారు. ముఖేశ్ రిషి విల‌న్‌గా న‌టించ‌గా.., ప్ర‌కాశ్ రాజ్‌, అలీ, త‌నికెళ్ల‌ భ‌ర‌ణి,శివాజీ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. దేవీ శ్రీ ప్ర‌సాద్ అద్భుతమైన సంగీతం అందించిన జల్సా సినిమా ఆ సమయానికి బాక్స్ ఆఫీస్ వద్ద టాప్-2 చిత్రంగా నిలిచింది.

Vijay Deverakonda’s Liger 1st weekend worldwide collections

0

Vijay Deverakonda’s Liger opened last week to mainly negative reviews and poor word of mouth. The film has been registering below par occupancies in most areas much to the disappointment of Vijay and Puri Jagannadh.

During 1st weekend the film collected only 13.5Cr share in Telugu states. The sports action drama has crashed after opening day and this share can be considered the closing share. In states like Karnataka, Tamil Nadu, and Kerala the combined share is shockingly low at around 2Cr.

Overall across South India, Liger has collected around 15.5 Cr . From the Hindi version the movie has collected around 13.5Cr nett with a share of around 6.5 Cr which takes total India share to 22Cr and overseas share of around 25Cr. The theatrical rights of Liger are valued at close to 90Cr and the movie is on its way to become the biggest disaster of Puri and Vijay Deverakonda’s career.

The sports action drama also stars Ananya Pandey and Ramya Krishnan in key roles. Karan Johar and Puri are jointly producing the film. This much anticipated pan-India project was released in Telugu, Tamil, Kannada, Hindi as well as in Malayalam. 

నాగార్జున ది ఘోస్ట్ సినిమాపై ఆసక్తి చూపుతున్న ట్రేడ్ సర్కిల్స్

0

కింగ్ నాగార్జున నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ఘోస్ట్’ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. గత వారం ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ట్రైలర్ విడుదల తర్వాత సినిమా మీద ఆసక్తి బాగా పెరిగింది. ట్రైలర్‌లో కొన్ని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్‌లు మరియు కళ్ళు చెదిరే, అబ్బురపరిచే విజువల్స్ ఉండటం వలన.. ఇది ఖచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చే ఫ్రెష్ కాన్సెప్ట్ ఉన్న చిత్రంగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ట్రైలర్‌తో సినిమా పట్ల అటు ప్రేక్షకులలో ఇటు ట్రేడ్‌లో సినిమా చాలా మంచి ప్రభావాన్ని చూపించింది, కాగా ఇప్పుడు ది ఘోస్ట్ టీమ్‌కి బిజినెస్ పరంగా చాలా మంచి ఆఫర్లు వస్తున్నాయి అని తెలుస్తోంది. దాదాపు రూ. 20 కోట్ల కంటే పైనే థియేట్రికల్ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా ఎంతో ఆనందించదగ్గ విషయం. ఇటీవలి టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద చిన్న చిత్రాల జోరును, ప్రదర్శనను చూస్తుంటే, ట్రేడ్ వర్గాలు ‘ది ఘోస్ట్’ సినిమా కూడా విజయవంతం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమాను కొంచెం రిస్క్ చేసైనా అవకాశాన్ని కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి.

ప్రవీణ్ సత్తారు ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి దర్శకత్వం వహిస్తున్నారు, ఇందులో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, అంతే కాకుండా ఆయనని ఈ చిత్రంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మోడ్‌లో చూస్తామని నాగార్జున చెప్పారు. కాగా ఈ చిత్రం తాలూకు టీజర్ మరియు ట్రైలర్ ను చూసి ఒక వర్గం ప్రేక్షకులు.. ఈ చిత్రం కమల్ హాసన్ నటించిన విక్రమ్ తరహాలో ఉందని, ఎలాగైతే కమల్ కి విక్రమ్ భారీ విజయాన్ని అందించిందో.. ది ఘోస్ట్ చిత్రం నాగార్జునకి అలాంటి విజయం తెచ్చి పెడుతుందని భావిస్తున్నారు.

నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ కూడా మరో ప్రధాన పాత్రలో నటించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఇతర ముఖ్య తారాగణంగా కనిపిస్తారు.

ట్విట్టర్ సాక్షిగా అనసూయ – నెటిజన్ల మధ్య వార్

0

సోషల్ మీడియాలో యాంకర్ మరియు నటి అనసూయ మరో సారి హాట్ టాపిక్ గా మారారు. ఒక టివి యాంకర్ తో పాటు క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లోనూ నటించిన అనసూయ.. వివాదలకు కూడా పలు సార్లు కేంద్రబిందువుగా ఉన్నారు. ఐదేళ్ల క్రితం అర్జున్ రెడ్డి చిత్రం సినిమాలోని ఒక డైలాగ్ గురించి పరోక్షంగా అనసూయ ట్వీట్ వేయగా ఆ సమయంలో పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా సరిగ్గా అదే అర్జున్ రెడ్డి విడుదలైన రోజు విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం విడుదలయింది. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి తిరస్కారానికి గురైన నేపథ్యంలో అనసూయ మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ చేయడం జరిగింది.

అమ్మను అంటే ఇలాగే ఉంటుంది. ఉసురు తగులుతుంది అంటూ అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండ మరియు అర్జున్ రెడ్డి సినిమా పై ట్వీట్ వేశారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఇతర ట్విట్టర్ యూజర్లు అనసూయ పై మండి పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇలా పైశాచిక ఆనందం పొందడం ఏంటని ఆమెతో వాదిస్తూ ట్రోల్ కూడా చేశారు. ఆ క్రమంలో కొందరు హద్దు దాటి అనసూయ వస్త్ర ధారణతో పాటు ఆమె కుటుంబ సభ్యులని గేలి చేస్తూ ట్వీట్స్ చేశారు. ఇక ఆ ట్వీట్స్ లో చాలా వాటికి అనసూయ తిరిగి సమాధానంగా వరుస ట్వీట్స్ చేస్తూ వచ్చారు. గతంలో ఒక చిన్నారి ఫోటో అడిగిన సందర్భంలో అనసూయ దురుసుగా ప్రవర్తించిన ఉదంతాన్ని గుర్తు చేసి ఆమెను తిట్టారు. ఆ క్రమంలో ఆమె వయసు గురించి మాట్లాడుతూ… ఆంటీ అంటూ సంబోధిస్తూ.. బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్స్ మరియు ట్రోల్స్ చేసిన వారి స్క్రీన్ షాట్స్ ని షేర్ చేయడమే కాకుండా వాటన్నింటి మీద కంప్లైంట్ కూడా చేస్తానని, ఇలాంటి చర్యలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అనసూయ హెచ్చరించారు.

https://twitter.com/nnagaraz/status/1563124276776972290?t=7zSE0uWqseKNOdK7hrl2TA&s=19

అయితే అనసూయ బెదిరింపు పోస్ట్ తరువాత ఆమె మీద ట్రోల్స్ మరింత విస్తృతం చేశారు ట్విట్టర్ లోని ప్రేక్షకులు. ఆంటీ అని పిలిస్తే తప్పేముంది.. లేదా అక్కా అని పిలవాలా అంటూ రకరకాలుగా కామెడీ చేస్తూ ట్వీట్స్ వేశారు. జయసుధ గతంలో నటించిన ఆంటీ సినిమా పాటని షేర్ చేస్తూ ఎగతాళి చేశారు. అనసూయ ఫలానా టైం అంటూ లేకుండా చాలా సేపు సమయం కేటాయించి రిప్లైలు ఇస్తూ.. నన్ను అక్కా అని కూడా పిలిచే హక్కు మీకు లేదు. అందుకు నా చెల్లెలు ఉంది. వేరే వాళ్ళు అలా పిలిపించుకున్నంత మాత్రాన నేను అలా పిలిపించుకోను అని చెప్తూ.. నాకు ఒక పేరు ఉంది పేరు పెట్టి పిలవండి చాలు అని పేర్కొన్నారు.