HomeMovie Newsట్విట్టర్ సాక్షిగా అనసూయ - నెటిజన్ల మధ్య వార్

ట్విట్టర్ సాక్షిగా అనసూయ – నెటిజన్ల మధ్య వార్

- Advertisement -

సోషల్ మీడియాలో యాంకర్ మరియు నటి అనసూయ మరో సారి హాట్ టాపిక్ గా మారారు. ఒక టివి యాంకర్ తో పాటు క్షణం, రంగస్థలం వంటి సినిమాల్లోనూ నటించిన అనసూయ.. వివాదలకు కూడా పలు సార్లు కేంద్రబిందువుగా ఉన్నారు. ఐదేళ్ల క్రితం అర్జున్ రెడ్డి చిత్రం సినిమాలోని ఒక డైలాగ్ గురించి పరోక్షంగా అనసూయ ట్వీట్ వేయగా ఆ సమయంలో పెద్ద దుమారమే చెలరేగింది. తాజాగా సరిగ్గా అదే అర్జున్ రెడ్డి విడుదలైన రోజు విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం విడుదలయింది. ఆ సినిమా ప్రేక్షకుల నుంచి తిరస్కారానికి గురైన నేపథ్యంలో అనసూయ మరోసారి వివాదాస్పదమైన ట్వీట్ చేయడం జరిగింది.

అమ్మను అంటే ఇలాగే ఉంటుంది. ఉసురు తగులుతుంది అంటూ అనసూయ పరోక్షంగా విజయ్ దేవరకొండ మరియు అర్జున్ రెడ్డి సినిమా పై ట్వీట్ వేశారు. ఆ తరువాత విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఇతర ట్విట్టర్ యూజర్లు అనసూయ పై మండి పడ్డారు. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక సినిమా ఫ్లాప్ అయితే ఇలా పైశాచిక ఆనందం పొందడం ఏంటని ఆమెతో వాదిస్తూ ట్రోల్ కూడా చేశారు. ఆ క్రమంలో కొందరు హద్దు దాటి అనసూయ వస్త్ర ధారణతో పాటు ఆమె కుటుంబ సభ్యులని గేలి చేస్తూ ట్వీట్స్ చేశారు. ఇక ఆ ట్వీట్స్ లో చాలా వాటికి అనసూయ తిరిగి సమాధానంగా వరుస ట్వీట్స్ చేస్తూ వచ్చారు. గతంలో ఒక చిన్నారి ఫోటో అడిగిన సందర్భంలో అనసూయ దురుసుగా ప్రవర్తించిన ఉదంతాన్ని గుర్తు చేసి ఆమెను తిట్టారు. ఆ క్రమంలో ఆమె వయసు గురించి మాట్లాడుతూ… ఆంటీ అంటూ సంబోధిస్తూ.. బాడీ షేమింగ్ చేస్తూ ట్వీట్స్ మరియు ట్రోల్స్ చేసిన వారి స్క్రీన్ షాట్స్ ని షేర్ చేయడమే కాకుండా వాటన్నింటి మీద కంప్లైంట్ కూడా చేస్తానని, ఇలాంటి చర్యలను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అనసూయ హెచ్చరించారు.

See also  విక్రాంత్ రోణ ఫస్ట్ డే ఫస్ట్ షో టాక్
https://twitter.com/nnagaraz/status/1563124276776972290?t=7zSE0uWqseKNOdK7hrl2TA&s=19

అయితే అనసూయ బెదిరింపు పోస్ట్ తరువాత ఆమె మీద ట్రోల్స్ మరింత విస్తృతం చేశారు ట్విట్టర్ లోని ప్రేక్షకులు. ఆంటీ అని పిలిస్తే తప్పేముంది.. లేదా అక్కా అని పిలవాలా అంటూ రకరకాలుగా కామెడీ చేస్తూ ట్వీట్స్ వేశారు. జయసుధ గతంలో నటించిన ఆంటీ సినిమా పాటని షేర్ చేస్తూ ఎగతాళి చేశారు. అనసూయ ఫలానా టైం అంటూ లేకుండా చాలా సేపు సమయం కేటాయించి రిప్లైలు ఇస్తూ.. నన్ను అక్కా అని కూడా పిలిచే హక్కు మీకు లేదు. అందుకు నా చెల్లెలు ఉంది. వేరే వాళ్ళు అలా పిలిపించుకున్నంత మాత్రాన నేను అలా పిలిపించుకోను అని చెప్తూ.. నాకు ఒక పేరు ఉంది పేరు పెట్టి పిలవండి చాలు అని పేర్కొన్నారు.

Follow on Google News Follow on Whatsapp

See also  రిలీజ్ ట్రైలర్లతో ఆకట్టుకున్న రవితేజ - కల్యాణ్ రామ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories