Home Blog Page 2043

‘Why would producers pay me if I don’t have market?’ asks Sharwanand

0

Sharwanand has been having a rough streak at the box office for some time. His last few films Aadavallu Meeku Joharlu, Mahasamudram, Sreekaram etc. have failed to create magic at the box office. While his performance was appreciated in these films, their collections were not encouraging at all.

Speaking about his movie’s performance, Sharwanand said he demands his remuneration according to his market. “Why producers will offer me the remuneration if I don’t have a market?”, he questioned.  Sharwanand also stated that when he takes up a project, he ensures to fulfill his commitment and then only asks for his remuneration.

There are heroes who don’t even conclude dubbing if the remuneration isn’t paid entirely and compared to that Sharwanand’s strategy seems to be fair enough. He will be next seen in Oke Oka Jeevitham directed by debutant Shree Karthick. The film is a science fiction drama and will co-star Ritu Varma. Dream Warriors pictures is bankrolling this bilingual which would release in Tamil as ‘Kanam’

Liger holds well in Hindi and crosses the double-digit mark

0

Vijay Deverakonda’s Liger might have been a washout in the Telugu states, but it has been holding slightly better in Hindi. The film opened to negative reviews and poor word of mouth all over and the occupancy rates also were not encouraging for the makers.

Despite the negative talk, Liger opened well enough in the Hindi market with Rs 5.75Cr nett including premiers. On Day 2, the movie held good and collected Rs 4.5Cr nett. The 2 days nett has crossed the double-digit mark which has been a pleasant surprise for Puri Jagannadh and co.

The Liger team might be disappointed with missing a massive opportunity at the Hindi market. If only the movie was slightly better in quality, this movie also could have been a big blockbuster in Hindi. The Hindi market has brought better returns than Telugu for movies like Sahoo and Pushpa. And something similar could have happened for Liger if only the execution was gripping enough.

The sports action drama also stars Ananya Pandey and Ramya Krishnan in key roles. Karan Johar and Puri are jointly producing the film. This much anticipated pan-India project was released in Telugu, Tamil, Kannada, Hindi as well as in Malayalam. 

లైగర్ చూసి ఏడ్చిన విజయ్ దేవరకొండ

0

గత కొన్ని రోజులుగా తెలుగు సినీ ప్రేక్షకులకు ఎక్కువగా వినిపించిన సినిమా లైగర్. పూరి జగన్నాధ్ రచయితగా మరియు దర్శకుడిగా కూడా వ్యవహరించిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో హీరో విజయ్ దేవరకొండ నత్తిగా సమస్యలతో బాధ పడే MMA ఫైటర్ గా నటించగా, అనన్య పాండే అతని ప్రియురాలి పాత్రలో నటించారు. రమ్య కృష్ణన్, బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్, విష్ రెడ్డి మరియు చంకి పాండే తదితరులు ఇతర తారాగణంలో భాగంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ మరియు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మించారు.

విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే జంటగా నిన్న ఆగస్టు 25న తమ సినిమా లైగర్‌ను ప్రమోట్ చేయడానికి దేశవ్యాప్తంగా 17 నగరాలను సందర్శించారు. ఆ రకంగా సినిమా ప్రదర్శింపబడుతున్న థియేటర్‌ల వద్దకు కూడా వెళ్లారు. రిలీజ్ డే రోజున, తమ అభిమానులతో కలిసి మొదటి షోను వీక్షించేందుకు హైదరాబాద్‌లోని సుదర్శన్35 MM థియేటర్‌కి చేరుకున్నారు.

అయితే ధియేటర్లో సినిమాను చూడలేక పోవటం వల్లనో, లేదా సినిమా చూసిన ప్రేక్షకుల స్పందన వల్లనో తెలియదు కానీ.. హీరో విజయ్ దేవరకొండ చాలా నిరాశాజనకంగా కనిపించారు. బహుశా ఇంత దారుణంగా సినిమా ఫలితం ఉంటుందని కలలో కూడా విజయ్ ఊహించి ఉండరు.. అందుకే సినిమా చూస్తున్నపుడు ఆయన ఏడిచినంత పని చేశారు. పాపం నిజంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా ఇలా తిరస్కారానికి గురైతే ఎవరికైనా బాధ ఉంటుంది కదా.

విస్తృత స్థాయిలో ప్రచారం జరుపుకుని భారీ ఎత్తున విడుదలైన ‘లైగర్’ సినిమా ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ దారుణమైన పరాజయంతో అటు హీరో విజయ్ దేవరకొండతో పాటు ఆయన అభిమానులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ పరాజయానికి పూరి జగన్నాథ్ పై చాలా కోపంతో ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ఆయన పై ట్రోలింగ్ చేస్తున్నారు.

అయితే విజయ్ దేవరకొండ పై కూడా బాగానే ట్రోల్స్ జరుగుతున్నాయి. సినిమా మీద ఉన్న నమ్మకంతో విజయ్ ప్రచార కార్యక్రమాలలో భారీ స్టేట్మెంట్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న ఇండియా మొత్తం షేక్ అవుతుందని విజయ్ గట్టిగా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. ఆగ్ హైన్ అందర్…వాట్ లగా దేంగే అంటూ సినిమాలోని డైలాగులు వల్లించి ప్రేక్షకులను ఉత్తేజ పరిచారు.

ఇలా సినిమా ప్రమోషన్స్ లో లైగర్ గురించి విజయ్ అంత భారీగా మాట్లాడి తీరా ఇప్పుడు సినిమా విడుదలయ్యాక చూస్తే.. ఏమాత్రం విషయం లేని సినిమాలా లైగర్ నిలిచింది. సినిమా చూసిన తరువాత ప్రేక్షకులు ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం జరిపి దేశాన్నే షేక్ చేద్దాం అనుకున్నాడా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

NTR30: కథను పూర్తిగా మార్చేసిన కొరటాల శివ

0

జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివల కాంబినేషన్లో ఎన్టీఆర్ తన 30వ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త విన్న ఎన్టీఆర్ అభిమానులలో ఎంతో ఉత్సాహంతో నింపింది. సినిమా ఎప్పుడెప్పుడా అని వారు వెయ్యి కళ్ళతో ఎదురుచూడటం మొదలు పెట్టారు. ఈ సక్సెస్ ఫుల్ కాంబో త్వరలో తన మ్యాజిక్‌ను మరోసారి ప్రదర్శిస్తుంది అని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కాగా ఈ చిత్రాన్ని తారక్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తారని గత సంవత్సరం ప్రకటించారు.

ఎన్టీఆర్ తన 30వ చిత్రానికి ఏ దర్శకుడిని ఎంచుకుంటారు అనే విషయం పై చాలా కాలంగా అనేక ఊహాగానాలు వినిపించాయి. నిజానికి ఎన్టీఆర్ తన 30వ సినిమాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయాల్సి ఉండగా, స్క్రిప్ట్ మరియు షూటింగ్ షెడ్యూల్ లలో మార్పుల కారణంగా ఆ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. ఉప్పెన లాంటి భారీ విజయం తర్వాత, కొత్త దర్శకుడు బుచ్చి బాబు సానా కూడా ఎన్టీఆర్ 30కి దర్శకత్వం వహించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అయితే అటువంటి పుకార్లు అన్నిటికీ ముగింపు పలుకుతూ ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా చక్కగా రూపుదిద్దుకుంటోంది. ఇటీవలే మేలో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన స్పెషల్ టీజర్ కూడా విడుదలైంది. ఆ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.

ఆచార్య పరాజయం తర్వాత, దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ 30 సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. కొరటాల శివ ఈ చిత్రం కోసం ఇంతకు ముందు రాసుకున్న కథ కాకుండా మొత్తం కొత్త స్క్రిప్ట్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో భారీ విజయం సాధించి కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన స్క్రిప్ట్ వర్క్ కోసం చాలా సమయం కేటాయిస్తున్నట్లు వినికిడి. అందువల్ల ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఎంత లేదన్నా మరో 2-3 నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ 30 సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుంది.

ఇతరుల కథతో సినిమా తీస్తెనే పూరికి హిట్ వస్తుందా?

0

లైగర్ సినిమా అత్యంత హైప్ మరియు భారీ హైప్ తో ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 25న విడుదలై ఎవరూ ఊహించని విధంగా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా వైఫల్యం యొక్క పూర్తి భాధ్యత పూరి జగన్నాధ్ దే అన్న అభిప్రాయం అంతటా వెలువడుతుంది. ఆయన రచనా నైపుణ్యం, దర్శకత్వ ప్రతిభ పై అనేక ప్రశ్నలను లేవనెత్తింది లైగర్ చిత్ర ఫలితం. దాదాపు పదేళ్ల నుంచీ ప్రేక్షకులకి తన స్థాయికి తగ్గ సినిమాల్ని అందించడంలో పూరీ జగన్నాధ్ విఫలమవుతూ వస్తున్నారు. ఆయన దర్శకత్వం వహించిన చివరి మూడు సినిమాలు చూస్తే, ఇస్మార్ట్ శంకర్, మెహబూబా మరియు పైసా వసూల్, ఈ మూడు సినిమాల్లో కేవలం రామ్ పోతినేని నటించిన ఇస్నార్ట్ శంకర్ మాత్రమే హిట్ అయ్యింది. ఇస్మార్ట్ శంకర్ విజయానికి ప్రధాన కారణం మణిశర్మ పాటలు మరియు రామ్ నటన అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఈ దశాబ్దంలో హిట్ అయిన మూడు చిత్రాలను పరిశీలిస్తే, ఇస్మార్ట్ శంకర్ (2019), టెంపర్ (2015), మరియు బిజినెస్మేన్ (2012). ఈ సినిమాలన్నీ కేవలం పూరి వల్లే కాకుండా ఇతర కారణాల వల్ల విజయం సాధించాయనడంలో సందేహం లేదు. ఇస్మార్ట్ శంకర్‌ విజయంలో మణిశర్మ సంగీతం, రామ్ ఆ టైటిల్ రోల్ కు కొత్తగా అనిపించడం వల్ల ఆ సినిమా విజయం సాధించింది. ఇక టెంపర్ విషయానికి వస్తే ఆ చిత్రానికి కథ పూరిది కాదు.. వక్కంతం వంశీ కథ మరియు జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటన వల్లే ఆ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందింది. పైగా అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం టెంపర్ కథనంలోనూ వక్కంతం వంశీ చేయి ఉందని వినికిడి. సరే ఆ సంగతి అలా ఉంచితే .. అదే విధంగా బిజినెస్‌మెన్ సినిమా విజయంలోనూ పూర్తిగా పూరి జగన్నాథ్ పాత్ర ఉందని చెప్పలేం. మహేష్ బాబు డైలాగ్ లను పలికిన తీరు, అలాగే సూర్య భాయ్ పాత్రను రక్తి కట్టించిన తీరు వల్ల ఆ సినిమా హిట్ అయింది. అయితే దర్శకుడిగా కన్నా బిజినెస్‌మెన్ సినిమాలో రచయితగా పూరీ తన మార్క్ ను చూపించారు అని చెప్పొచ్చు.

పూరి ఒకప్పటిలా బలమైన కథ, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుని దశాబ్దానికి పైగా అయిందనడానికి ఆయన పని చేసిన సినిమాలు ఫలితాలే నిదర్శనం. ప్రస్తుతం ఆయన సొంత కథలను ఏమాత్రం ఆసక్తికరంగా మలచలేక పోతున్నారు. కావున ప్రస్తుతం ఆయనకు ఒక బలమైన కథా రచయిత అవసరం. విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా పూరి తదుపరి చేయబోతున్న చిత్రం. మరి ఈ సినిమాతో విమర్శలకు ఆయన సమాధానం చెబుతారా లేదా చూడాలి.

Box-Office: ఇంకా జోరు తగ్గని సీతా రామం.. కార్తీకేయ-2

0

సీతా రామం మరియు కార్తికేయ 2 సినిమాలు విడుదలై దాదాపు 2-3 వారాలైంది, అయినప్పటికీ ఈ రెండు చిత్రాల బాక్సాఫీస్ వద్ద తమ విజయ ఢంకాను మోగిస్తూనే ఉన్నాయి. ఇతర చిత్రాల విడుదలలు కూడా ఈ సినిమాల హవాను ఆపలేకపోయాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి.

సీతా రామం చిత్రం దేశ వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్‌లో కూడా చాలా మంచి విజయాన్ని సాధించింది. కార్తికేయ 2 హిందీ బెల్ట్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ 20 కోట్లకు పైగా నెట్ కలెక్షన్‌లను వసూలు చేసింది. సీతా రామం సినిమా మొత్తంగా 60 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే కార్తికేయ 2 గ్రాస్‌లో 100 కోట్లకు పైగా సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇది నిజంగానే అపూర్వమైన, అసాధారణమైన విజయం అని చెప్పాలి.

దానికి తోడు, ఈ వారం భారీ హైప్ తో విడుదలైన విజయ్ దేవరకొండ లైగర్ చిత్రం అత్యంత పేలవమైన సమీక్షలకు తోడు చాలా బ్యాడ్ టాక్ తెచ్చుకోవడంతో .. సీతా రామం, కార్తీకేయ 2 చిత్రాలకు కలిసి వచ్చి వాటి కలెక్షన్స్ లో భారీ పెరుగుదల సాధ్య పడింది. వీకెండ్‌లో హౌస్‌ఫుల్ బోర్డులను నమోదు చేస్తూ ఈ రెండు సినిమాలు తమ జోరును కొనసాగిస్తున్నాయి.

చాలా ఏరియాలలో లైగర్ సినిమా స్థానంలో కార్తికేయ 2 మరియు సీతా రామం చిత్రాల కోసం అదనపు షోలు జోడించబడుతున్నాయి. లైగర్ సినిమా భారీ ప్రమోషన్స్ తో భారతదేశాన్ని షేక్ చేయడానికి బయలుదేరి అనూహ్యంగా చతికిల పడింది. కానీ సీతా రామం మరియు కార్తికేయ 2 సినిమాలు మాత్రం ప్రి రిలీజ్ పెద్దగా హడావిడి చేయకుండానే బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ లుగా ఉన్నాయి. సరైన కంటెంట్ ఉంటే ఎప్పుడూ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారు అనే విషయం మరోసారి ఈ రెండు సినిమాలు నిరూపించాయి. సినిమాలో స్టార్ హీరో ఉన్నాడా లేదా అన్నది ముఖ్యం కాదు, సినిమాను ఎంత చక్కగా తీసి అది ప్రేక్షకులలో వెళ్లేలా చేశారన్నది ముఖ్యం. ముందు సినిమాలో సరైన విషయం ఉంటే మిగతావి వాటంతట అవే దక్కుతాయి.

సీత కావాలంటే కోటి ఇవ్వాల్సిందే అంటున్న మృణాల్

0

సీతారామం… ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. యుద్ధం రాసిన ప్రేమకథ అంటూ ఒక మిలిటరీ అధికారికి.. యువరాణికి మధ్య సాగే ఓ అద్భుతమైన ప్రేమ కావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ రామ్ గా బాలీవుడ్ నటి/మోడల్ మృణాల్ ఠాకూర్ సీతగా నటించారు. వారి నటనకు మరియు జోడీకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో వారి పాత్రలకు వారు తప్ప మరే నటీనటుల్ని ఊహించుకొలేని స్థాయిలో దుల్కర్ మృణాల్ ప్రేక్షకులను మెప్పించారు.

ప్రస్తుతం సీతకి అదే మృణాల్ కు తెలుగులో వరుస ఆఫర్లు పలకరిస్తున్నాయి. మరి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క బెట్టుకోవాలి అనే సామెత చెప్పినట్లు.. హీరోయిన్ మృణాల్ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేసారని సమాచారం. సాధారణంగానే తెలుగులో హీరోయిన్లకు డిమాండ్ అధిక స్థాయిలో ఉంటుంది.. అందువల్లే ఏదైనా కొత్త సినిమా భారీ హిట్ సాధిస్తే, ఆ హీరోయిన్ కు మంచి పేరు వస్తే దాన్ని సద్వినియోగం చేసుకుని ఆయా హీరోయిన్లు తమ పారితోషికాన్ని పెంచేస్తుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో హీరోయిన్లకి కెరీర్ వ్యవధి తక్కువ కాబట్టి.. ఎన్ని రోజులు వాళ్ళు కొనసాగుతారో తెలియదు కాబట్టి హీరోయిన్లు తమ పారితోషికాన్ని క్రేజ్ ఉన్నప్పుడు పెంచుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలోనే ‘సీతారామం’ వంటి హిట్ తర్వాత హీరోయిన్ మృణాల్ సైతం తన రెమ్యునరేషన్ ను పెంచేసారని తెలుస్తుంది.. ప్రస్తుతం ఒక సినిమాలో తను నటించాలి అంటే కోటి రూపాయలు కావాల్సిందే అని మృణాల్ డిమాండ్ చేస్తున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆమె అలా అడిగింది నిజమే అయితే.. నిర్మాతలకు కళ్ళు తిరగడం ఖాయం అనే చెప్పాలి.ప్రస్తుతం సీతా రామం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మృణాల్ .. అధికారికంగా మరే తెలుగు సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించలేదు.. అయితే తనకు తొలి చిత్రంతోనే అద్భుతమైన సినిమాని నిర్మించిన వైజయంతి బ్యానర్ లోనే ఆమె మరో సినిమా చేయబోతున్నారని సమాచారం. ఆ సినిమాకు నందిని దర్శకత్వం వహించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్ నిర్ణయంపై అసంతృప్తితో ఉన్న అభిమానులు

0

తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వించ దగ్గ నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. అలాగే ఆయన అభిమాన గణం కూడా అత్యంత ప్రభావితం చేయగల అభిమాన వర్గాల్లో ఒకరు. తమ హీరోకు జరిగే మంచైనా చెడైనా ఎలాంటి ప్రతికూల సమయాలు ఎదురైనా ఎన్టీఆర్ అభిమానుల ఆయనకు అన్నివేళలా మద్దతు ఇచ్చారు అనేది వాస్తవం. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమా విషయంలో మాత్రం .. ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయంపై అభిమానులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.

ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివతో చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల ఇటీవల ఆచార్య సినిమా ఫలితం, తద్వారా ఉద్భవించిన సమస్యల కారణంగా చాలా ఇబ్బందుల్లో పడ్డారు. కాగా ఆచార్య సినిమా తాలూకు నష్టాలను భర్తీ చేయడానికి ఆయన చాలా కాలం శ్రమ పడాల్సి వచ్చింది . దీంతో ఎన్టీఆర్‌తో ఆయన చేయాల్సిన సినిమా ప్రారంభం అలా వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో కొరటాల శివ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసేందుకు అదనపు సమయం కోరడంతో సినిమా మరింత ఆలస్యమైంది. తాజాగా అభిమానులను నిరాశ పరుస్తూ మరో వార్త బయటకు వచ్చింది.

అదేంటంటే ఇప్పుడు ఎన్టీఆర్ 30 సినిమాకు సంబందించిన మొత్తం స్క్రిప్ట్‌ను మార్చేస్తున్నారని సమాచారం. కొరటాల శివ ఎన్టీఆర్ సినిమా కోసం కొత్త స్క్రిప్ట్‌ని ఎంచుకోవాలని నిర్ణయించుకున్నారట. అంతే కాకుండా స్క్రిప్ట్ వర్క్ లో ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు, మొత్తం కథను సమకూర్చుకునే వరకు దాదాపు 3 నెలలు సమయం కావాలని అభ్యర్థిస్తున్నారట.

ఇలా సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి రకరకాల కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుండటంతో ఎన్టీఆర్ అభిమానులు ఏమాత్రం సంతోషించలేకపోతున్నారు. ఆచార్య సినిమాకి కూడా ఇలాగే షూటింగ్ మొదలయ్యే దగ్గర నుంచి పూర్తయ్యే వరకూ ఇలానే చాలా సార్లు ఆగడం లేదా వాయిదా పడటం స్క్రిప్ట్ మార్చటం వంటి విషయాలు జరిగాయి. అందువల్లే ఆ సినిమా తలా తోకా లేకుండా తయారయింది. ఇక ఆ చిత్ర ఫలితం కూడా మనందరికీ తెలుసు. అలాంటిది అసలు సినిమా అనుకున్నప్పుడు ముందుగా పూర్తి స్క్రిప్ట్ వినకుండా ఎన్టీఆర్ ఎందుకు ఈ సినిమాని ఎందుకు ఒప్పుకున్నారు అన్న విషయాన్ని అభిమానులు అర్ధం చేసుకోలేకపోతున్నారు.

నా మార్కెట్ ఎంటో నాకు తెలుసు – శర్వానంద్

0

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న అద్భుత నటులలో శర్వానంద్ ఒకరు. చిన్న పాత్రలతో తన సినీ ప్రయాణం మొదలుపెట్టి తరువాత ప్రధాన పాత్రల వరకూ ఎదిగి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును పొందారు. కేవలం హీరోగా సాప్ట్ లేదా రొటీన్ లవ్ స్టోరీలు కాకుండా వెన్నెల సినిమాలో విలన్ రోల్.. అలాగే అమ్మ చెప్పింది చిత్రంలో మానసిక ఎదుగుదల పెరగని కుర్రాడి పాత్ర పోషించి ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు.

అయితే 2017 లో వచ్చిన ‘ మహానుభావుడు’ చిత్రం తరువాత శర్వానంద్ కు సరైన విజయం లభించలేదు. హను రాఘవపూడి దర్శకత్వంలో, శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించినపడి పడి లెచే మనసు చిత్రంలో ఆయన నటనకు ప్రశంసలు లభించినా ఆ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద హిట్ అనిపించుకోవడంలో విఫలం అయింది. అలాగే సుధీర్ వర్మ తో చేసిన రణరంగం కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. ఇక కరోనా వెవ్ ల మధ్య విడుదలైన శ్రీకారం చిత్రం కంటెంట్ పరంగా పరవాలేదు అనిపించుకున్నా, ఆ చిత్రం కూడా కలెక్షన్ల వర్షం కురిపించ లేకపోయింది. గత ఏడాది దసరాకి విడుదలైన మహా సముద్రం హోదా ఘోరంగా పరాజయం పొందింది.

కాస్త గ్యాప్ తరువాత శర్వానంద్ హీరోగా ‘ఒకే ఒక జీవితం’ సినిమా చేస్తున్నారు. రీతూ వర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాలో అమల అక్కినేని కీలకమైన పాత్రలో కనుపించనున్నారు. ఇతర ముఖ్యమైన పాత్రలను వెన్నెల కిశోర్ .. ప్రియదర్శి పోషించారు. వచ్చే నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ ఉండటంతో ప్రమోషన్స్ లో శర్వానంద్ పాలు పంచుకున్నారు.

ఆ కార్యక్రమాలలో భాగంగా ఆయన మాట్లాడుతూ .. ‘జాను’ సినిమా సమయంలో జరిగిన ప్రమాదం వలన గ్యాప్ తీసుకోవడం వలన నేను లావు కావడం జరిగింది. వరుసగా ఎదురవుతున్న ఫ్లాపుల కారణంగా ఒక ఆరు నెలల గ్యాప్ తరువాత సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు.కాగా గతంలో నేను మాత్రమే కథలు వినేవాడిని. కానీ ఇప్పుడు నా స్నేహితులు లేదా ఇతర సన్నిహితులకు వినిపించిన తరువాత అన్ని రకాల అభిప్రాయాలు విని అప్పుడు సినిమా చేస్తున్నాను అని శర్వానంద్ చెప్పుకొచ్చారు. అలాగే తన సినిమాలు ఫ్లాప్ అయితే వేరే ఎవరినైనా నిందించటం లాంటి పనులు చేయనని, తన నిర్ణయం వల్లే జయాపజయాలు ఉంటాయని ఆయన అన్నారు.

ఇక ఆయన పారితోషికం పై వచ్చిన కొన్ని పుకార్లకు కూడా శర్వానంద్ స్పందించారు. ఈ మేరకు శర్వా మాట్లాడుతూ.. నా మార్కెట్‌ను బట్టి నేను నా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తాను, నాకు మార్కెట్ లేకపోతే నిర్మాతలు నాకు ఎందుకు రెమ్యునరేషన్ ఇస్తారని శర్వానంద్ చెప్పారు. రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పని హీరోలు చాలా మంది ఉన్నారు.. కానీ నేను మాత్రం నా పని మొత్తం పూర్తి చేసిన తర్వాత రెమ్యూనరేషన్ అడుగుతాను అని అన్నారు. అలాగే ఒకవేళ ఎవరైనా తనకు ఇవ్వవలసిన పారితోషికంలో తేడా చేస్తే మటుకు ఎంత దూరం అయినా వెళ్తాను అని కూడా చెప్పారు. శర్వానంద్ చెప్పిన మాటల్లో తప్పు లేదు కదా. ఈ వివాదాలు ఏవీ లేకుండా ఆయన నటించిన తాజా చిత్రం “ఓకే ఒక జీవితం” చక్కని విజయం సాధించాలని కోరుకుందాం

విజయ్ దేవరకొండ పై నాని సెటైర్?

0

గత కొంత కాలంగా హీరోలు నాని, విజయ్ దేవరకొండ మధ్య సత్సంబంధాలు లేవని, ఒకప్పుడు వారి మధ్యలో ఉన్న స్నేహబంధం తెగిపోయిందని సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేశాయి. 2015లో విడుదలైన ఎవడే సుభ్రమణ్యంలో వీరిద్దరూ కలిసి నటించారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేచురల్ స్టార్ కథానాయకుడిగా నటించగా, విజయ్ దేవరకొండ నాని చిన్ననాటి స్నేహితుడిగా నటించారు.అప్పటి నుండి, విజయ్ టాలీవుడ్‌లో చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని ఎదుగుదలను చూశారు. అంత కాకుండా తనకంటూ ఒక స్టార్‌డమ్ మరియు మార్కెట్‌ ను సంపాదించుకుని తన కన్నా ముందు వచ్చిన సీనియర్‌ హీరోలను కూడా అధిగమించారు. అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం వంటి భారీ విజయాలు విజయ్‌ ను తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త స్టార్‌గా మార్చాయి. అయితే, వరల్డ్ ఫేమస్ లవర్ వంటి పరాజయం, తాజాగా లైగర్ రూపంలో మరో భారీ డిజాస్టర్ ఇలా వరుస ఫ్లాప్‌లతో, విజయ్ దేవరకొండ స్టార్‌డమ్ తీవ్రంగా దెబ్బతింది.

కాగా తాజాగా సోషల్ మీడియాలో లైగర్ సినిమా కోసం నాని ఇటీవలే శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ పోస్ట్ ల వెనుక ఉద్దేశ్యం నిజంగా మంచిని కోరి చేసినది కాదు అన్నట్లుగా ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. పైగా నాని విజయ్ దేవరకొండ ట్వీట్ కు ఇచ్చిన రిప్లై ట్వీట్ లో మద్దతు కంటే వ్యంగ్యమే కనిపిస్తుందని నెటిజన్లు భావిస్తున్నారు. సినిమా ఫలితం తెలుసుకున్న తర్వాత.. నాని ఉద్దేశ్యపూర్వకంగానే రిప్లై ఇచ్చారని ట్విట్టర్ లో ప్రేక్షకులు భావించారు.

ఇదిలా ఉండగా నాని తదుపరి చేస్తున్న చిత్రం దసరా సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని పాత్రలో, కొత్త శైలిలో కనిపించనున్నారు. శ్రీకాంత్ ఓదెల అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు. నేను లోకల్ వంటి బ్లాక్ బస్టర్ తరువాత మళ్లీ నాని సరసన కీర్తి సురేష్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

మరో వైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన ఆశలన్నీ దర్షకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ‘ఖుషి’ పైనే పెట్టుకున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుని వచ్చే ఏడాది మొదట్లో విడుదలకు సిద్ధమవుతుంది.