Home Blog Page 2034

విజయ్ దేవరకొండ పరిస్థితిని మార్చేసిన ఒక్క తప్పుడు నిర్ణయం

0

అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు విజయ్ దేవరకొండ. అంతకు ముందు, అతను కొన్ని మంచి పాత్రలు చేసినా, అర్జున్ రెడ్డి సినిమా ఈ నటుడికి స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టింది. అయితే, లైగర్ అనే ఓకే ఒక్క సినిమా ఈ స్టార్‌ హీరోని అమాంతం కిందకు లాగేసింది.

ఈ ఎమర్జింగ్ స్టార్ నుండి భారీ అంచనాల మధ్య విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కాగా ఈ చిత్ర ఫలితం తాలూకు పరిణామాలు ఇప్పటికీ విజయ్ దేవరకొండను బాధపెడుతున్నాయి. బహుశా విజయ్ తదుపరి చిత్రంతో ఆయన ఒక భారీ హిట్ స్కోర్ చేసే వరకూ లైగర్ ఫలితం ఆయన పై ప్రభావాలను చూపుతూనే ఉంటుంది.

ఈ చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రచారం చేయబడింది మరియు విజయ్ దేవరకొండ సినిమా గురించి విడుదలకి ముందు చాలా ఖచ్చితమైన, భారీ ప్రకటనలు కూడా చేశారు. పూరీ జగన్నాథ్‌ తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సీక్వెల్ చేయమని కూడా అడిగారు. అంతే కాకుండా పూరీ కాంబినేషన్లో జనగణమన అనే కొత్త సినిమా కూడా ప్రారంభించారు.

అయితే లైగర్ సినిమ భారీ పరాజయం వల్ల విజయ్ ప్రపంచమే తలకిందులైంది. అంతే కాకుండా, సినిమాలోని పెట్టుబడులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి విజయ్ ఎన్నో ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇది నిజంగా విజయ్ కు దారుణ ప‌రిస్థితి అనే చెప్పాలి.

విజయ్ ఎంతో కష్టపడి తన విలువైన సమయంతో పాటు శక్తి, ప్రయత్నాలను లైగర్ కోసం పెట్టుబడి పెట్టారు, కానీ ప్రతిఫలంగా, ఒక హీరోగా తన ప్రతిష్టను కోల్పోయారు, అతని ఇమేజ్‌ పూర్తిగా దెబ్బతీనడమే కాకుండా ఇప్పుడప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించటం లేదు.

విజయ్ దేవరకొండ ఉన్న పరిస్తితిలో ఒక్కసారి మనల్ని ఊహించుకుంటేనే భయపడాల్సి వస్తుంది. పరిశ్రమలోని సన్నిహితుల అభిప్రాయం ప్రకారం అతనికి ఎంతో దృడ సంకల్పం ఉందని తెలిసింది. జీవితం పట్ల విజయ్ దేవరకొండ వైఖరి మరియు దృఢత్వం ఎంతో స్ఫూర్తిదాయకం.

ఆ స్ఫూర్తి మరియు పోరాట పటిమ సహాయంతో తను తిరిగి మళ్ళీ స్టార్ హీరోగా ఉద్భవించి, అతను అర్హత కలిగిన స్థానానికి చేరుకుంటారని కోరుకుందాం.

One wrong decision changed everything for Vijay Devarakonda

0

Vijay Devarakonda became an overnight star with Arjun Reddy. Before that, he did few roles, but it was Arjun Reddy that has put this actor into star status. However, if one movie could pull down a star as much as it can, it was liger.

The movie, amidst huge expectations and a lot of effort from this emerging star, has bombed at the box office. The aftereffects of this movie are still hurting Vijay Devarakonda and probably will continue to show its effects until he scores a big hit.

The film was promoted on a pan India scale and Vijay Devarakonda was so sure about the movie. He was so confident that he asked for a sequel of this film in an interview with Puri Jagannath. He also launched a movie called Janaganamana with the same director.

However, the world has turned upside down for him with just one movie. Moreover, he has to face grilling questions from Enforcement Directorate regarding the investments that went into the movie.

This is a terrible situation for a movie star. He invested time, energy, efforts but in return, he lost reputation, damaged his image and then these investigations.

It must be hard to be in the shoes of Vijay Devarakonda. He is known to have an iron will according to his close friends in the industry. His attitude and resilience is inspiring. We hope he emerges and becomes the star which he deserves to be.

దర్శకుడి అహంకారం వల్లే 2 స్టేట్స్ రీమేక్ ను రద్దు చేశాం అని చెప్పిన అడివి శేష్

0

ప్రఖ్యాత రచయిత చేతన్ భగత్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ప్రముఖ బాలీవుడ్ చిత్రం 2 స్టేట్స్. అర్జున్ కపూర్ మరియు అలియా భట్‌లు జంటగా నటించిన ఈ చిత్రం హిందీలో భారీ విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో అడివి శేష్‌, శివాని రాజశేఖర్‌లతో రీమేక్‌ చేసేందుకు అప్పట్లో సన్నాహాలు చేశారు.

అయితే కొన్ని అంతర్గత సమస్యల కారణంగా ఈ రీమేక్‌కు తెరపడిపోయింది. ఈ ఆలస్యం పై నిర్మాత ఫిర్యాదు చేసినప్పటికీ, హీరోని తప్పుపట్టినప్పటికీ, శేష్ ఈ చిత్రానికి సంబంధించిన వివాదం పట్ల మౌనంగా ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఆయన ఈ విషయం పై మాట్లాడారు.

Idlebrain Jeeviకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, అడివి శేష్ ఈ విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. అతనికి స్క్రిప్ట్ నచ్చకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే షూటింగ్ సమయంలో దర్శకుడి ప్రవర్తన కూడా నచ్చలేదని, అతను చాలా అహంకారం ప్రదర్శించటం జరిగిందని, అందుకే సినిమాని ఆపేసామని శేష్ చెప్పారు.

https://twitter.com/idlebraindotcom/status/1597851471764107265?t=jkErEldUZoObZKucye2NsQ&s=19

అయితే, గూడచారి 2లో నిర్మాతకు వాటాతో నష్టపరిహారం ఇవ్వనున్నానని అడివి శేష్ తెలిపారు. ఇది అతనికి, నిర్మాతతో పాటు ప్రేక్షకులకు కూడా విన్-విన్ సిట్యుయేషన్ అవుతుంది.

శేష్ లాజిక్ ఇక్కడ మంచిదని చెప్పవచ్చు, ఎందుకంటే ఒక చెడ్డ సినిమా చేసి విడుదల చేస్తే అతని ఇమేజ్‌ను అనుకున్న దానికంటే ఎక్కువగా నాశనం చేస్తుంది. నిర్మాతల పట్ల ఆయనకున్న ఆరాటం కూడా తెల్సిందే. అందరు నటీనటులు ఈ విధంగా ప్రయత్నించినట్లయితే, ఎలాంటి అపార్థాలు జరగవు.

టూ స్టేట్స్ తెలుగు రీమేక్ 2019లో అడివి శేష్ మరియు శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలలో ప్రారంభించబడింది. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు వెంకట్ రెడ్డి దర్శకత్వం వహించాల్సి ఉంది. దీన్ని నిర్మాత ఎంఎల్‌వి సత్యనారాయణ అట్టహాసంగా ప్రారంభించారు.

కానీ సినిమా మధ్యలో రద్దు చేయబడింది. అసలు సినిమా ఎందుకు ఆగిపోయిందో.. నిజంగా లోలోపల ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. అడివి శేష్ ఇచ్చిన తాజా సమాచారం తరువాత మాత్రమే ఈ ప్రాజెక్ట్ రద్దు వెనుక అసలు కారణం అందరికీ తెలిసింది.

We scrapped the remake film because of directors arrogance says Adivi Sesh

0

2 states is a famous Bollywood movie based on Chetan Bhagat novel. The movie in Hindi was a massive success, starting Arjun Kapoor and Alia Bhatt. Remake of this movie in Telugu was planned with adivi sesh and Shivani Rajasekhar.

However, the remake has never taken off due to some internal issues. Sesh has been silent regarding this movie, though producer has been complaining about this delay and blamed The Hero. However, the actor has finally spoken about it.

In an interview with Idlebrain Jeevi, Sesh said interesting things about the issue. He didn’t like the script, so he had to junk the project. Also, he said that director didn’t know what he was doing. He even yelled at the actors on the sets, that’s why they scrapped the remake film because of the director’s arrogance, Sesh said.

However, he will be compensating the producer with a share in Goodachari 2. This will be a win-win situation for him, the producer and also the audiences.

https://twitter.com/idlebraindotcom/status/1597851471764107265?t=2s1A24uvNeqE-0ZiQhuatw&s=19

The logic of Sesh is perfect here, since a bad movie would’ve ruined his image more than anything. His concern for the producers is also telling. If actors try to take this way, no misunderstandings will happen.

The Telugu remake of Two States was launched in 2019 with Adivi Sesh and Shivani Rajashekar in the lead roles. The film was to be directed by newcomer Venkat Reddy. It was launched with a lot of fanfare by producer MLV Satyanarayana.

But the movie was scrapped in between, and no one really knew what had gone wrong. Only after the latest information given by Adivi Sesh everyone came to know the actual reason behind the cancellation of the project.

తొలగిన వివాదం: సమంత యశోద OTT రిలీజ్ కు లైన్ క్లియర్

0

సమంత నటించిన యశోద నవంబర్ 11న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కాలేకపోయినా ఈ చిత్రం మంచి కలెక్షన్లనే అందుకుంది. తొలి రోజు మంచి ఓపెనింగ్ అందుకున్నా, ఆ తర్వాత ఈ సినిమా పబ్లిక్‌ టాక్‌ తగ్గిపోయింది. ఒక మీడియం రేంజ్ సినిమాకి, పబ్లిక్ టాక్ చాలా కీలకం మరియు అది నెమ్మదించిన ఫలితంగా, యశోద సినిమా చెప్పుకోదగ్గ కలెక్షన్లను నమోదు చేయలేకపోయింది.

ఈ చిత్రం థియేట్రికల్ రన్ అయిన త్వరగానే OTTలో విడుదల చేయడానికి సన్నాహాలు చేయబడ్డాయి, అయితే EVA IVF హాస్పిటల్‌తో న్యాయపరమైన సమస్యల కారణంగా యశోద ఓటిటి రిలీజ్ వాయిదా పడింది.

ఎందుకంటే యశోద సినిమాలో ఉపయోగించిన ఆసుపత్రి పేరు కూడా EVA అవడంతో.. సినిమాలో ఆసుపత్రిని హీనంగా చూపించి ఆసుపత్రి మనోభావాలను దెబ్బతీశారని వివాదం చెలరేగింది. దీంతో EVA సంస్థ వారు కోర్టు మెట్లెక్కారు.

అయితే ఈ గందరగోళం ఇప్పుడు సద్దుమణిగినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం అపార్థం మరియు యాదృచ్చికం వల్ల ఉద్భవించిన సాధారణ సందర్భం అని ఇరు వర్గాలూ రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు సమస్య పరిష్కరించబడింది కనుక యశోద సినిమా డిసెంబర్ 9 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది.

యశోదలో టైటిల్ పాత్రలో అద్భుతమైన నటనను కనబర్చిన సమంతతో పాటు.. వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, మరియు దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలు పోషించారు. కాగా ఈ చిత్రానికి హరి-హరీష్ ద్వయం రచన మరియు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రానికి శివలెంక కె ప్రసాద్ నిర్మాతగా వ్యవహారించారు.

Few Telugu States Exhibitors Are Interested In Screening Vijay’s Varisu Over Balakrishna And Chiranjeevi’s Film

0

Sankranthi is a time for joy, celebration, and festivities and one of the most enjoyed festivities are the movies of star heroes. Especially in the Telugu states and Tamil Nadu, the heroes are celebrated to great extents during Sankranthi. And there is no exception this time as well.

There is tight competition between the releases of this Sankranthi and everyone is eager to see who will emerge as the Sankranthi winner. Will it be the in-form Balayya, the Megastar Chiranjeevi or will Vijay’s Varisu steal the show? Ajith’s Thunivu is also scheduled to release this Sankranthi.

There have been some controversies lately regarding the release of Varisu in the Telugu states. Many are questioning producer Dil Raju’s intentions of releasing a Tamil dubbed film in competition with straight Telugu releases. Amidst all of this, some Telugu exhibitors are also showing keen interest in Varisu over NBK and Chiru’s films.

As the asking prices are very high for Chiru and Balayya’s movies, exhibitors are interested in taking Vijay’s film. This is mainly because of the guaranteed family audience and also the reasonable prices.

Vijay has always enjoyed a strong market in the Telugu belts and director Vamsi Paidipally knows the beats of the Telugu audience. Hence, theatre owners are compelled to believe that there is no risk in buying this film. There are also high chances of the film turning out to become a jackpot for the buyers.

Samantha’s Yashoda OTT Release Hurdles Cleared; Streaming Date Locked

0

Samantha’s Yashoda was released in theatres on 11th November and was received with mixed responses and decent collections at the box office. The film took a good start and then slowed down after the public talk. For a medium-range film, public talk is crucial and as a result, Yashoda could not post significant collections.

The film was planned to release on OTT immediately after the theatrical run but due to a legal issue with Eva IVF hospital, it was postponed. For some context, Eva was also the name of the hospital used in Yashoda. In the movie, the hospital is shown in a bad light and this has hurt the sentiments of the hospital. As a result, Eva took the matters to the court.

But it looks like this mess has now been sorted out. It seems to have been a simple case of misunderstanding and coincidence. The issue has now been resolved and Yashoda is all set to stream on Amazon Prime from 9th December.

Yashoda stars a fantastic Samantha, Varalaxmi Sarathkumar, Unni Mukundan, and Divya Sripada in prominent roles. It has been written and directed by the duo of Hari-Harish. Sivalenka K Prasad is the producer of the movie and the music is by iconic music director Mani Sharma.

లైగర్ బడ్జెట్‌ పై విజయ్ దేవరకొండను 9 గంటలకు పైగా ప్రశ్నించిన ఈడీ

0

భారీ హైప్ తో ఆగస్టులో విడుదలై, ఆ తర్వాత బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన కొన్ని నెలల తర్వాత కూడా.. లైగర్ సినిమా ఆ చిత్ర యూనిట్‌ను వెంటాడుతూనే ఉంది. పూరీ జగన్నాధ్ మరియు ఛార్మి తర్వాత, ఇప్పుడు ED ముందు విచారణ కోసం హాజరు కావడం విజయ్ దేవరకొండ వంతు అయింది.

ED బృందం సినిమాకు సంబంధించిన ఫైనాన్సింగ్ విషయంలో విజయ్‌ని దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారట. విజయ్ దేవరకొండ ఉదయం ఈడీ కార్యాలయంలో కనిపించారు మరియు దాదాపు రోజంతా అక్కడే గడిపారు. ED బృందం విజయ్‌ని అతని రెమ్యూనరేషన్ వివరాలు మరియు బడ్జెట్ మరియు సినిమా పెట్టుబడిదారుల గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌లో రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టారని, ప్రొడక్షన్ హౌస్ పైన ఉన్న ఆరోపణల పై ఈడీ దర్యాప్తు చేస్తోంది. కొన్ని వారాల క్రితం పూరీ, ఛార్మిలను వారు ఇదే విషయమై విచారించారు. తదుపరి ప్రశ్నించబడే వ్యక్తుల గురించి పెద్దగా తెలియనప్పటికీ, లైగర్‌తో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడప్పుడే చిత్ర యూనిట్‌ను విడిచిపెట్టే పరిస్థితులు కనిపించడం లేదు.

పూరి జగన్నాధ్ మరియు విజయ్ దేవరకొండ కెరీర్‌లలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో లైగర్ ఒకటి. పూరి మరియు విజయ్ ప్రకారం, ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘భారతదేశాన్ని షేక్ చేస్తుంది’ అని భావించారు.

అయితే, ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరగకపోవడం వల్ల ఈ చిత్రం విమర్శకులచే తీవ్రంగా నిషేధించబడింది మరియు భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం పూరీకి భారీ నష్టాలను మిగిల్చింది మరియు విజయ్ తన ఫిల్మోగ్రఫీలో ఒక భారీ ఫ్లాప్‌ను చేర్చుకున్నారు.

మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్ దిశగా వెళ్తున్న హిట్-2

0

తెలుగులో ఓ పెద్ద సినిమా విడుదలై చాలా రోజులైంది. కొంతకాలం గ్యాప్ తర్వాత చక్కని క్రేజ్ తో హిట్-2 చిత్రం డిసెంబర్ 2న విడుదలవుతోంది. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించగా తెరకెక్కిన ఈ సినిమా విజయవంతమైన హిట్: ది ఫస్ట్ కేస్ సినిమాకి సీక్వెల్.

ఈ చిత్రానికి బుకింగ్‌లు చాలా బాగున్నాయి మరియు సినిమా మొదటి రోజు కలెక్షన్లు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ట్రైలర్ కారణంగా సినిమా పై మంచి బజ్ ఉంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌లో ప్రేక్షకులు కోరుకునే ప్రతి అంశం ఈ చిత్రంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

మానసిక లక్షణాలతో కూడిన తెలివైన నేరస్థుడితో పాటు అతన్ని సవాలు చేసే కఠినమైన, ఆత్మవిశ్వాసం గల పోలీసు కూడా ఈ చిత్రంలో ఉన్నారు. ట్రైలర్ మరియు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ లో చిత్ర బృందం చూపిన కాన్ఫిడెన్స్ ప్రేక్షకులను థియేటర్‌ల వైపు కదిలించాయి.

వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని సమర్పణలో శైలేష్ కొలను దర్శకత్వం ఈ చిత్రానికి వహిస్తున్నారు. అడివి శేష్ తన రచనలో కాకుండా బయటి స్క్రిప్ట్ తో సినిమా చేయడం చాలా అరుదుగా జరుగుతుంది.

ఈ చిత్రానికి మరిన్ని సీక్వెల్ లు కూడా రాబోతున్నాయి. దర్శకుడు చెప్పిన మాటలని బట్టి ఈ యూనివర్స్ పెరుగుతూనే ఉంటుంది. ఈ సిరీస్‌లో ఈ రెండవ చిత్రం భారీ హిట్ అవుతుందని మరియు తదుపరి చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందని ఆశిద్దాం.

ప్రధాన తారాగణంతో పాటు, ఈ చిత్రంలో కె. విశ్వనాథ్‌గా భాను చందర్, రావు రమేష్, పోసాని క్రిషన్ మురళి, తనికెళ్ల భరణి, కోమల్ ప్రసాద్ మరియు అభిలాష్ పాత్రలో మాగంటి శ్రీనాథ్ కూడా నటిస్తున్నారు.

SSMB28: షూటింగ్ తొందరగా ముగించాలనే ఆలోచనలో ఉన్న చిత్ర బృందం

0

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడో సినిమా కావడంతో పాటు ఇది మహేష్ కెరీర్‌లో 28వ చిత్రం అవడంతో ఈ సినిమా SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రసిద్ధి చెందింది.

2010లో వచ్చిన ఖలేజా తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై మహేష్ అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. అయితే సినిమా స్క్రిప్ట్ లో మార్పులు జరగడం.. మరియు ఇటీవలే దురదృష్టవశాత్తూ సూపర్ స్టార్ కృష్ణ మరణం వంటి పలు కారణాలతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ని శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా సినిమాని ఆగస్ట్ 2023 నాటికి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో.. వచ్చే ఏడాది జులై నాటికి షూటింగ్‌ను ముగించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తోందట.

త్రివిక్రమ్ తన సినిమాలను త్వరగా పూర్తి చేస్తారనే పేరు తెచ్చుకున్నారు. అయితే ఈ సినిమా కోసం మొదట యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసినా స్క్రిప్ట్‌లో తేడాలు రావడంతో ఆగిపోయింది. ఆ తర్వాత పూర్తిగా కొత్త స్క్రిప్ట్‌ని ఖరారు చేయడం జరిగింది. కొత్త స్క్రిప్ట్‌తో, డిసెంబర్ మొదటి వారంలో సెట్స్‌ పైకి వెళ్లడానికి SSMB28 టీమ్ ప్రయత్నిస్తున్నారు.

మరి అనుకున్న విధంగా డెడ్లైన్ ను చిత్ర బృందం చేరుకుంటుందో లేదో వేచి చూడాలి. హడావుడిగా పనులు చేయడం వల్ల సినిమాకు ఎలాంటి మేలు జరగదు కానీ లాభనష్టాలకు వారే యజమానులు కాబట్టి అది వారి ఇష్టం మరియు నిర్ణయం వారి చేతుల్లోనే ఉంది.

మహేష్ ఒక పర్ఫెక్షనిస్ట్ గా పేరు పొందారు. డెడ్‌లైన్‌లను చేరుకోవడం కోసం అయన నాణ్యత లేని విషయంలో రాజీపడరు. ఈ వైఖరి ఖచ్చితంగా మంచిది, కానీ అదే సమయంలో నిర్మాతల దృక్కోణం నుండి చూస్తే సినిమాని ఆలస్యం చేయడం మరింత వివాదం అవుతుంది. మరి త్రివిక్రమ్ క్వాలిటీ మరియు టైమ్‌ని ఎంతవరకు మేనేజ్ చేస్తారో వేచి చూడాలి.