Home Blog Page 2033

పవన్ కళ్యాణ్ తో మా సినిమా తప్పకుండా ఉంటుంది – నిర్మాత రామ్ తాళ్లూరి

0

ఏడాది క్రితమే దర్శకుడు సురేందర్ రెడ్డి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. సురేందర్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ తొలిసారి చేయబోతున్న సినిమా కావడంతో ఈ వార్త చాలా మంది అభిమానులను ఎంతగానో ఉత్సాహపరిచింది. కానీ నెమ్మదిగా, ఈ ప్రాజెక్ట్ గురించి e రకమైన వార్తలు రాకపోవడంతో సినిమా నిలిపివేయబడిందని అందరూ అనుకున్నారు. సురేందర్ రెడ్డి మరియు పవన్ కళ్యాణ్ మధ్య సృజనాత్మక విభేదాల కారణంగా.. చాలా మంది పరిశ్రమ సభ్యులు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు కూడా పేర్కొన్నారు.

అయితే తాజాగా ఈ సినిమా పై చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి ఒక స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుందని, సినిమా ఏమీ ఆగిపోలేదు అని ఆయన తెలిపారు. పవన్ కళ్యాణ్ షెడ్యూల్ చాలా బిజీగా కారణంగా దీనిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.

ప్రస్తుతం సురేందర్ రెడ్డి తన తదుపరి అఖిల్ తో తీస్తున్న చిత్రం ఏజెంట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారని నిర్మాత రామ్ పేర్కొన్నారు. ఏజెంట్ సినిమా పూర్తి చేసిన తర్వాత సురేందర్ రెడ్డి తన దృష్టిని పవన్ కళ్యాణ్ తో చేసే సినిమా వైపు మళ్లించనున్నారు అని సమాచారం.

ఇదిలా ఉంటే, పవన్ కళ్యాణ్ కూడా సురేందర్ రెడ్డితో తన సినిమాకి ముందు పలు చిత్రాలు పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన దర్శకుడు క్రిష్ తో కలిసి హరి హర వీర మల్లు సినిమాను ప్యాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కించి భారీ విజయం సాధించాలనే పట్టుదలతో ఆ చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్‌తో కూడా భవదీయుడు భగత్ సింగ్ అనే ఒక సినిమాని చేయాల్సి ఉంది. ఇక తమిళ నటుడు మరియు దర్శకుడు తెలుగులోనూ సుపరిచితుడు అయిన సముద్రఖని తో వినోదాయ సితం రీమేక్ ను కూడా ఓకే చేశారు. కాగా ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన మేనల్లుడు సాయి తేజ్ కూడా కనిపిస్తారు. త్వరలోనే ఈ చిత్రం కూడా షూటింగ్ ప్రారంభించనుంది.

ఇవే కాకుండా పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం కూడా సన్నద్ధం అవ్వాలి. అటు రాజకీయం ఇటు సినిమాలతో పవర్ స్టార్ షెడ్యూల్ చాలా టైట్ గా ఉంది. మరి ఆయన అన్ని పనులను సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగి అన్నిట్లోనూ విజయం సాధించాలని కోరుకుందాం.

Box-Office: మరో అరుదైన మైలురాయిని చేరుకున్న కార్తీకేయ-2

0

కార్తికేయ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక దాని తర్వాత ఒక్కో రికార్డులను బద్దలు కొడుతూ వెళుతుంది. నిఖిల్ నటించిన ఈ చిత్రం ఇటీవలే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఇక మరి కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు ఈచిత్రం మరో అరుదైన మైలురాయిని సాధించింది. కార్తికేయ 2 ఇప్పుడు US బాక్సాఫీస్ వద్ద $1.5 మిలియన్ల మార్కును తాకింది, ఇది నిజంగా అత్యద్భుత ప్రదర్శన అని చెప్పాలి.

అసలు చిన్న సినిమాలకు $1 మిలియన్ మార్క్ దాటడం అనేది ఒక భారీ లక్ష్యం. అంతే కాదు యుఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్లను సాధించడం చిన్న సినిమాలకు కలగా చెప్పచ్చు. అలాంటిది కార్తికేయ 2 కోన్ని రోజుల క్రితం $1 మిలియన్ మార్కును దాటి ఈ శనివారంతో ఏకంగా 1.5 మిలియన్లను దాటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా డే సందర్భంగా పెట్టిన 3$ ఆఫర్ ఈ సినిమాకు చాలా బాగా ఉపయోగ పడింది.

అలాగే సినిమా విడుదలై నాలుగు వారాలు దాటిన తరువాత కూడా 30K కంటే ఎక్కువ ఫుట్‌ఫాల్‌లను సాధించింది అంటే ఇది అసాధారణమైన విజయం అనే చెప్పాలి. కార్తీకేయ 2 చిత్రం కలెక్షన్లు ఇప్పటికీ క్రమంగా నిలకడగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఆఫర్ వల్ల ఓవర్ సీస్ లో వసూళ్లు ఊపందుకున్నాయి. అందువల్ల గత వారంలో లాగా ఈ వారాంతంలో కూడా కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఇది ఒక చిన్న చాలా అరుదైన రికార్డు.

కార్తికేయ 2 సినిమా బాక్స్ ఆఫీసు వద్ద కనబర్చిన అసాధారణ ప్రదర్శన ట్రేడ్ సర్కిల్‌లకు ఆశ్చర్యంతో చాలా కాలం తరువాత ఇంత లాంగ్ రన్ ఉన్న సినిమా రావడం వారికి భారీ ఉపశమనం కలిగించింది. 2014 చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ కార్తికేయ 2 లో సినిమాలో అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి మరియు అనుపమ్ ఖేర్ కూడా ఇతర కీలక పాత్రల్లో నటించారు.టైటిల్ రోల్ లో నిఖిల్ నటన, చందూ మొండేటి పకడ్బందీ కథనంకు తోడు కాల భైరవ అందించిన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.

ఈ చిత్రం హిందీలో కూడా అనూహ్యంగా భారీ విజయాన్ని అందుకుంది. అంతే కాకుండా ఇప్పటి వరకూ బాలీవుడ్ మార్కెట్లో 25 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లను సాధించింది.

ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం కోసమే బ్రహ్మాస్త్ర ఈవెంట్ ను రద్దు చేశారా?

0

బాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాబ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న భారీ స్థాయిలో ప్లాన్ చేసారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి నిమిషంలో ఒక ఇండోర్ ప్రెస్ మీట్ గా మార్చారు. ఈ ఇండోర్ ఈవెంట్ చాలా బాగా జరిగింది. అయితే, అసలు ప్రి రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేయడం వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

భారీగా ప్లాన్ చేసిన బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు అవుతున్న కారణంగానే అనుమతులు నిరాకరించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్లే.. ముందుగా అనుమతించిన కార్యక్రమాన్ని రద్దు చేశారని ఒక గట్టి వార్త ఇపుడు ప్రచారంలో ఉంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఎన్టీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశం వల్ల ప్రభుత్వం ఇప్పుడు ఎన్టీఆర్‌ను వ్యతిరేకిస్తోందని అంటున్నారు.

తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం బాగా వేడిగా ఉంది. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. కాగా అమిత్ షాతో ఎన్టీఆర్‌ కలవడం కేవలం ఒక స్నేహపూర్వక మరియు అభినందన తెలిపేందుకు జరిగిన ఒక సాధారణ సమావేశం అయితే, దానికి ఇప్పుడు రాజకీయ రంగు పులుముతున్నారు.

ఇక నిన్న రాత్రి జరిగిన బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్ కుప్రత్యేక అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈవెంట్ కేన్సిల్ అయినందుకు బాధ పడుతున్న అభిమానులను శాంతింపజేయడానికి ప్రయత్నించారు, ఈ ఈవెంట్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్న నా అభిమానులకు మరియు మీడియా మిత్రులకు నేను క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఈ వేడుకకు ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, బ్రహ్మాస్త్ర సినిమాలో హీరో – హీరోయిన్లు.. నిజ జీవితంలో దంపతులు అయిన రణ్బీర్ కపూర్, అలియా భట్, మరియు నిర్మాత కరణ్ జోహార్ కూడా హాజరయ్యారు.

రామ్ చరణ్ – ప్రభాస్ ల కోసం ఒకే ఒక జీవితం సినిమా స్పెషల్ షో వేయనున్న శర్వానంద్

0

రెండు రోజుల క్రితమే శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ ట్రైలర్ విడుదలైనది. అప్పటివరకు ఈ సినిమా పై ఉన్న అంచనాలని ట్రైలర్ బాగా వచ్చి సినిమా మీద ఆసక్తిని మరింత పెంచేసింది. ఇంతకుముందు ఈ సినిమా టీజర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇప్పుడు ట్రైల‌ర్ కూడా అదే కోవలో వెళ్ళింది.

మంచి కంటెంట్‌ని తప్పకుండా ఆదరించే ప్రేక్షకుల్లో ఈ సినిమా ట్రైలర్‌ విపరీతమైన బజ్‌ని క్రియేట్ చేసిందనే చెప్పాలి. కార్తికేయ 2 తరువాత తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైన దాదాపు అన్ని చిత్రాలు పరాజయం పాలైన దశలో ఓకే ఒక జీవితం బాక్సాఫీస్ వద్ద మళ్ళీ ఆశలను కలిగిస్తుంది. ట్రైలర్ ఖచ్చితంగా సినిమా బిజినెస్ కి బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఇక హీరో శర్వానంద్.. ఈ సినిమా బజ్‌ని మరింత పెంచేందుకు తనకి సన్నిహితులు మేటియి స్నేహితులైన హీరో ప్రభాస్, రామ్ చరణ్‌ల కోసం ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారట . శర్వానంద్, ప్రభాస్ ఎల్లప్పుడూ సన్నిహిత బంధాన్ని పంచుకుంటారు అన్న విషయం తెలిసిందే . పైగా బాహుబలి స్టార్ ఈ సినిమాను చూసి బాగుందని చెబితే, ఈ చిత్రానికి అది గొప్పగా సహాయపడుతుంది. రామ్ చరణ్, శర్వానంద్ చిన్ననాటి స్నేహితులు అవడం వల్ల శర్వా కోసం చరణ్ సినిమాను ప్రమోట్ చేయడానికి ఎలాగూ ముందుకు వస్తారు. సోషల్ మీడియాలో రామ్ చరణ్ ఈ సినిమా గురించి పాజిటివ్ గా చెబితే ఆయనకున్న ఫాలోయింగ్ వల్ల ఎక్కువ మంది ప్రేక్షకులు ఓకే ఒక జీవితం సినిమా చూడటానికి దోహదపడుతుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే శర్వానంద్ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. మహానుభావుడు సినిమా తరువాత సరైన విజయం లేని శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో హిట్ కొట్టడం ఆయన కెరీర్ కు చాలా అవసరమైన విషయం. ఈ సినిమాతో హిట్ సాధించి ఆయన మార్కెట్ లో తిరిగి మళ్ళీ ఒక గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

ఒకే ఒక జీవితం సినిమాలో ప్రధాన పాత్రలో శర్వానంద్, హీరోయిన్ గా రితు వర్మ, వెన్నెల కిషోర్, ప్రియదర్శి పులికొండ, అమల అక్కినేని ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడుగా కూడా వ్యవహరించగా.. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

లైగర్ ఫలితం తరువాత సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన ఛార్మీ

0

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన లైగర్ భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందు విస్తృతంగా ప్రచారం జరిపిన చిత్ర యూనిట్ పై సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ పడుతున్నాయి. 


విజయ్ దేవరకొండ నటించిన `లైగర్` ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద  ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడం పూరి, విజయ్ మరియు ఛార్మి బృందాన్ని తీవ్రంగా నిరాశపరిచింది. ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడం అనేది సాధారణంగా పరిశ్రమలో జరిగేదే.. కానీ లైగర్ చిత్రం తొలిరోజు మినహా.. కనీస స్థాయిలో కూడా ధియేటర్లలో ప్రేక్షకుల సంఖ్యను నమోదు చేయడంలో విఫలం అయింది.


అది నిజంగా లైగర్ చిత్ర బృందాన్ని నీరుగార్చెలా చేసింది. అటు సమీక్షకులు ఇటు ప్రేక్షకులు ఈ సినిమాని తీవ్రంగా విమర్శించటంతో పాటునిర్మొహమాటంగా తిప్పికొట్టారు. ఇక బాక్స్ ఆఫీసు వద్ద తొలి నాలుగు రోజులకే సినిమా వసూళ్లు రావడం ఆగిపోయిన తరహాలో ఉండి ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. సినిమాలో ప్రేక్షకులను కట్టిపడేసే అంశాలు ఏమీ లేవని అందరి నుంచీ స్పందన వచ్చింది.


కాగా లైగర్ సినిమా అన్ని పార్టీలకు బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను తెచ్చిందని అందరికీ తెలిసిన విషయమే. సినిమా మీద ఉన్న హైప్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్ బాగా ఉండటం వల్ల తొలిరోజు  మంచి వసూళ్లని సాధించినా..  తర్వాత ఢీలా పడిపోయింది.


ఇక లైగర్ సినిమా నిర్మాణ దశలో, ఛార్మీ కౌర్ కీలక పాత్ర పోషించింది. ఆమెను ప్రజలు ఇష్టపడినా, ఇష్టపడకపోయినా, ఆమె లైగర్‌కి ఒక వెన్నెముకలా నిలిచింది. పూరితో కలిసి ఛార్మీ పెట్టిన పూరి కనెక్ట్స్ అనే సంయుక్త బ్యానర్‌లో ఆమె ఒక ప్రధాన పాత్ర పోషించారు. సినిమా ఖర్చు విషయంలో, ప్రచార కార్యక్రమాలలో ఆమె ముందుండి నడిపించారు. 
అలాగే మైక్ టైసన్ లాంటి లెజెండరీ పర్సన్ ను సినిమాలో నటించేందుకు ఒప్పించారు.

మరి ఇంతగా కష్టపడిన తరువాత సినిమా భారీ పరాజయం పొందడమే కాకుండా అంతకు మించి సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ వస్తుండటంతో కొద్ది రోజులు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఛార్మీ నిర్ణయం తీసుకున్నారు.


ఈ నేపథ్యంలో చిత్ర  ఛార్మి సోషల్ మీడియాలో ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఆవిడ ఇచ్చిన సందేశం ఏంటంటే.. “చిల్ గయ్స్! జస్ట్ టేకింగ్ ఏ బ్రేక్ (ఫ్రం సోషల్ మీడియా).. పూరి కనెక్ట్స్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుంది.. ఇంతకంటే బిగ్గర్ గా బెటర్ గా.. అప్పటివరకూ మీరు బతకండి మమ్మల్ని బతకనివ్వండి!“ అన్నారు ఛార్మీ.

https://twitter.com/Charmmeofficial/status/1566301052445806592?t=z0ebZGXVqkJmGvhoiaJwXA&s=19

Box-Office: ఈ వారం తెలుగు సినిమాల రిపోర్ట్

0

గత కొన్ని నెలలుగా గడ్డు కాలాన్ని ఎదురుకున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆగస్ట్ నెల మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చింది. ఆగస్ట్‌లో టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు అద్భుతమైన కలెక్షన్లు సాధించిన తర్వాత, సెప్టెంబర్ నెల కూడా అదే విధంగా మంచి రోజులు కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు చాలా ఆశలు పెట్టుకున్నారు. లైగర్ మినహా, ఆగస్ట్‌లో విడుదలైన తెలుగు చిత్రాలు దాదాపు అన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌ బస్టర్‌లుగా నిలిచాయి, పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్‌లకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి.

కాగా ఈ వారం మూడు కొత్త సినిమాలు విడుదలయ్యాయి. తమిళ హీరో చియాన్ విక్రమ్ నటించిన కోబ్రా చిత్రం గణేశుని పండుగ సందర్భంగా విడుదలైంది. సెలవు రోజున విడుదల అవడం వల్ల బాక్సాఫీస్ వద్ద తొలి రోజు అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. కానీ సినిమాకి టాక్ నెగటివ్ గా రావడంతో తరువాతి రోజుల్లో అదే ఊపును కొనసాగించలేకపోయింది. అయినప్పటికీ, తక్కువ బిజినెస్ జరిగిన కారణంగా బయ్యర్స్ పెద్దగా నష్టపోలేదు.

ఇక శుక్రవారం తక్కువ హైప్‌తో విడుదలైన రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన రంగ రంగ వైభవంగా, మరియు అనుదీప్ కెవి రచించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సెప్టెంబర్ 2న విడుదలయ్యాయి.

రంగ రంగ వైభవంగా చాలా సాధారణ స్థాయిలో తొలి రోజు ఓపెనింగ్స్ ను తెచ్చుకుంది. సినిమాకు బ్యాడ్ టాక్ త్వరగా వ్యాపించడంతో..ఈ చిత్రం రెండవ రోజునే బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా కుప్పకూలింది. డబ్బింగ్ సినిమా అయిన కోబ్రా చిత్రం రంగ రంగ వైభవంగా కంటే ఎక్కువ వసూలు చేయడం గమనార్హం. మొత్తంగా రంగ రంగ వైభవంగా చిత్రం కొనుగోలుదారులకు భారీ నష్టం తెచ్చే వైపు పరుగులు తీస్తుంది. వారు పెట్టిన ఖర్చులో దాదాపు 70 శాతం కంటే ఎక్కువ నష్టపోతారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కథ అందించి మెంటర్ గా వ్యవహరించిన ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తొలిరోజునే అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అసలు తొలిరోజే జీరో షేర్ సాధించి బాక్స్ ఆఫీసు వద్ద వాషౌట్ అయింది.

SSMB28: ఎట్టకేలకు సెట్స్ మీదకు వెళ్లనున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB28 సినిమా ఇటీవలే విడుదల తేదీని ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న విడుదల కానుంది. చిత్ర బృందం ఈ భారీ అప్‌డేట్‌ను కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు. మహేష్ బాబు ఇండస్ట్రీ హిట్ పోకిరి డేట్ కే ఈ సినిమా కూడా రానుందనే వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కు సంబందించిన సమాచారం వచ్చింది. SSMB28 సెప్టెంబర్ 8వ తారీఖు నుండి రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభిస్తుంది. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం 13వ తేదీ నుండి షూటింగ్ లో పాలు పంచుకుంటారట. అలాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా.. మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తాజాగా, ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ భారీ విజయాన్ని అందుకున్నారు. అంతే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే ప్రేక్షకులు ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లనే ఆశిస్తారు. అయితే ఈసారి ఫ్యామిలీ సబ్జెక్ట్ కాదని, ఎంచుకున్న జానర్‌తో పాటు సబ్జెక్ట్‌కి సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా ఎంతో భిన్నంగా ఉంటుందని మహేష్ స్పష్టం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు.

SSMB28 సినిమాతో 12 సంవత్సరాల తర్వాత ఈ మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్‌ల కలయికలో ఇది మూడో సినిమా. చిత్ర నిర్మాతలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు ఈ చిత్రానికి ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతున్న దుల్కర్ సల్మాన్

0

కొన్నేళ్లుగా, హీరో దుల్కర్ సల్మాన్ ఎదుగుదల ప్రశంసనీయం. కేవలం తన సొంత పరిశ్రమ అయినా మలయాళంలో మాత్రమే కాకుండా.. వివిధ భాషలలో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. కేరళలో సూపర్‌స్టార్‌గా మారిన తర్వాత, ఆయన ప్రస్తుతం ఈ ప్యాన్-ఇండియన్ సూపర్‌స్టార్‌గా మారే దిశగా అడుగులు వేస్తున్నారు.

మహానటి సినిమాలో జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. పరభాషా నటుడు అయినప్పటికీ, తెలుగు భాష పై ఆయనకున్న పట్టు అభినందనీయం. అలాగే ఆయన అనేక తమిళ చిత్రాలలో కూడా నటించారు, అందువల్ల తమిళనాడులో కూడా దుల్కర్ సల్మాన్ కు అభిమానులు వచ్చారు. కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితాల్, ఓకే కన్మణి వంటి సినిమాలు ఆయనను తమిళ ప్రేక్షకుల్లో స్టార్‌గా మార్చాయి.

2021లో, తాజాగా ఆయన నటించిన గ్యాంగ్‌స్టర్ డ్రామా కురుప్‌తో ప్యాన్-ఇండియాకు విజయం సాధించి ప్యాన్-ఇండియన్ స్టార్‌గా ఎదగడానికి తొలి మెట్టు ఎక్కారు. ఇక తాజాగా సీతా రామం చిత్రం తర్వాత దుల్కర్‌ దారి మరింత సులువైంది. సీతా రామం చిత్రం అన్ని వెర్షన్లు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా విజయం సాధించాయి. తాజాగా విడుదలైన హిందీ వెర్షన్ చూసిన అక్కడి ప్రేక్షకులు కూడా దుల్కర్‌ను ఆదరిస్తున్నారు. ఆయన ఇదివరకే కారవాన్, ది జోయా ఫ్యాక్టర్ వంటి స్ట్రెయిట్ హిందీ సినిమాల్లో నటించారు.

సీతారామం అద్భుతమైన విజయం తరువాత, చాలా మంది దర్శకనిర్మాతలు దుల్కర్‌ను దృష్టిలో ఉంచుకుని ప్యాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లను చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దుల్కర్‌కి పెరుగుతున్న డిమాండ్‌ను చూస్తుంటే, ఆయన వేగంగా ఎదుగుతున్న ప్యాన్-ఇండియన్ సూపర్‌స్టార్‌గా కనిపిస్తున్నారు. దుల్కర్ నటించిన తాజా బాలీవుడ్ చిత్రం “చుప్” కూడా ప్యాన్ ఇండియా తరహాలో అన్ని భాషల్లో విడుదల కానుంది.

ఇక సీతారామం సినిమా విడుదలకు ముందు పెద్దగా హడావిడి చేయకపోయినా.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమాలో సరైన విషయం ఉంటే ఎప్పుడూ ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరిస్తారు అనే విషయం మరోసారి ఈ సినిమా నిరూపించింది. సినిమాలో ఖచ్చితంగా స్టార్ హీరో ఉన్నాడా లేదా అనేది ప్రేక్షకులు ఎప్పుడు కూడా పట్టించుకోరు. సినిమా ఎంత బాగుందో అనేదే ప్రేక్షకులకి ముఖ్యం.

సరికొత్త టెక్నాలజీతో రి రిలీజ్ కానున్న స్టార్ కృష్ణ బ్లాక్ బస్టర్ సింహాసనం

0

తెలుగు సినిమా పరిశ్రమలో లేటెస్ట్ రి రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మరో సినిమా కొత్తగా తెరపైకి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా సింహాసనం (1986) ఇప్పుడు వచ్చే ఏడాది ఆయన పుట్టినరోజు నాడు తిరిగి విడుదల కానుంది. విశేషమేమిటంటే ఈ చిత్రం మునుపెన్నడూ లేని విధంగా.. అంటే ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా ఏ సినిమాకి రాని విధంగా.. 8k టెక్నాలజీతో విడుదల కానుందట. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, 8K వెర్షన్ ను పునరుద్ధరించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని తెలుస్తుంది. అలాగే ఈ చిత్రం డాల్బీ సౌండ్‌లో కూడా విడుదల కానుంది.

యాదృచ్ఛికంగా, సింహాసనం సినిమా సూపర్ స్టార్ కృష్ణ దర్శకత్వం వహించిన మొట్టమొదటి సినిమా.. అంతే కాకుండా ఆ సినిమాకి రచనతో పాటు నిర్మాణ భాద్యతలు కూడా ఆయనే నిర్వర్తించడం విశేషం. ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కిన సింహాసనం.. తెలుగు సినిమా చరిత్రలో మొదటి 70 mm 4 ట్రాక్ స్టీరియోఫోనిక్ సౌండ్ తో వచ్చిన సినిమా. సింహాసనం చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు జయప్రద, రాధ మరియు మందాకిని కూడా నటించారు. అంతే కాకుండా 1986లోనే హిందీలో ఏకకాలంలో విడుదల అయింది. అంటే అప్పట్లోనే ప్యాన్ ఇండియా రిలీజ్ అన్నమాట. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఖచ్చితంగా సింహాసనం సినిమాకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇలా అభిమానులకు, ప్రేక్షకులకు ఇష్టమైన పాత సినిమాలను ప్రదర్శించే ఈ ట్రెండ్ నిజంగా చాలా మంచిది అనే చెప్పాలి. ఎందుకంటే ఆ సమయంలో ఈ చిత్రాలను చూడలేకపోయిన ప్రేక్షకులకు, అలానే పాత సినిమాలు అంతగా పరిచయం లేని చాలా మంది ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభవాన్ని ఇస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పోకిరి, మెగాస్టార్ చిరంజీవి ఘరానా మొగుడు, పవన్ కళ్యాణ్ జల్సా సినిమాల తర్వాత స్టార్ పుట్టినరోజుల కోసం సినిమాలను ప్రదర్శించే కొత్త ట్రెండ్ మొదలైంది. అలాగే వచ్చే నెల ప్రభాస్ పుట్టిన రోజుకి ‘బిల్లా’, ‘ఛత్రపతి’ సినిమాలను మళ్లీ విడుదల చేసే ఆలోచనలో ప్రభాస్ అభిమానులు ఉన్నారు.

ప్రిన్స్ సినిమా పై ట్రేడ్ వర్గాలలో తగ్గిన నమ్మకం

0

తమిళ హీరో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా ద్విభాషా చిత్రం “ప్రిన్స్”. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు, జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. ఉక్రెయిన్ నటి ర్యాబోషప్క ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నామని ఇదివరకే చిత్రబృందం ప్రకటించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను రిలీజ్ అయింది. బింబిలికి పిలాపి అంటూ సాగే ఈ పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అయితే ఈ చిత్రం పట్ల ట్రేడ్ వర్గాలు కాస్త నమ్మకం తగ్గినట్లు కనబడుతోంది. అందుకు కారణం ఈ చిత్ర దర్శకుడు అనుదీప్ ఏ అంటున్నారు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు అనుదీప్ కెవి తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తొందరగా స్టార్ దర్శకులుగా చలామణి అయ్యారు. ఈ చిత్రం ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

అనుదీప్ జాతి రత్నాలుతో తనదైన ముద్ర ఏర్పరచుకున్నారు. కొద్ది రోజుల క్రితమే అనుదీప్ రచనా భాద్యతలు వహించిన ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లలో విడుదలైంది. తన ఇమేజ్ కారణంగా, ఆ సినిమాను అనుదీప్ బాగా ప్రచారం చేసి విడుదలకు ముందు సినిమాకు సంభందించిన అన్నీ కార్యక్రమాలకు హాజరయ్యారు. అందువల్ల ప్రేక్షకులు కూడా సినిమాలో మంచి విషయం ఉండే ఉంటుందని అనుకున్నారు.

అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా చాలా దారుణమైన టాక్, కలెక్షన్లను రాబట్టి భారీ డిజాస్టర్ గా నిలిచింది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ.. కనీసం సాధారణ స్థాయిలో కూడా ధియేటర్లలో ప్రదర్శన జరుపుకొలేకపోయింది.

దీంతో.. జాతిరత్నాలు సినిమా విజయంలో అనుదీప్ పాత్ర ఏమీ లేదని, వైజయంతీ బ్యానర్ మరియు మహానటి ఫేం నాగ్ అశ్విన్ వల్లే ఆ సినిమా విజయం సాధించిందని ఇండస్ట్రీ, ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అందువల్ల ముందుగా ఉన్నట్లు ఇప్పుడు ప్రిన్స్ సినిమాకి ట్రేడ్ లో క్రేజ్ లేదు..అందుకే వారు భారీ అఫర్ లు ఏమీ ఇవ్వదలచుకొలేదు అని తెలుస్తోంది. ఫ్లాప్ సినిమాలు వచ్చినపుడు ఇలా హీరోలు లేదా దర్శకులు మీద కాస్త ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అయితే సినిమాలో సరైన కంటెంట్ ఉంటే ప్రిన్స్ సినిమాని బ్లాక్ బస్టర్ అవకుండా ఏ నెగటివ్ పబ్లిసిటీ ఆపలేదు అనేది నిజం.

ప్రిన్స్ సినిమాను సురేష్ బాబు, సునీల్ నారాంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉండగా.. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుని ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. గతేడాది డాక్టర్ చిత్రంతో.. ఇటీవల డాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ యువ హీరో.. స్టార్ హీరో అయ్యే దిశగా వరుస విజయాలతో చే దూసుకెళ్తున్నాడు.