Home Blog Page 1994

Why Tamil Stars Maintaining Their Silence On Ponniyin Selvan; Mani Ratnam Fails To Impress?

0

Like how Rajamouli and Baahubali are the pride of the Telugu Film Industry, Mani Ratnam and Ponniyin Selvan are the pride of the Tamil Film Industry. Before the release of Baahubali, there was a lot of hype and excitement in the industry and this was maintained even after the release.

But with Ponniyin Selvan, there was a lot of hype in the industry before the release. The actors called it their pride and supported the film. But after the release, none of the star heroes, directors, or industry members have come forward in support of the film.

Barring a few members, most of the industry persons have not responded to anything about the film. When Baahubali was released, the whole of India was showering praises on the film. Not only the Telugu Film Industry but the entire Film Industry showed its support.

This is not the case with Ponniyin Selvan. Even the Tamil Industry is not posting anything about the movie after its release. The movie collections are sensational in the Tamil territories and it is heading towards an all-time industry blockbuster. But it looks like Mani Ratnam has failed to impress the Tamil industry. We are hoping that he will be able to make a bigger impact with Part 2 of Ponniyin Selvan.

గాడ్ ఫాదర్ – ది ఘోస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్

0

ఈ ద‌స‌రా పండ‌గకి తెలుగు సినీ ప్రేక్షకులకు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ దక్కబోతుంది. టాలీవుడ్ సీనియ‌ర్ స్టార్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ ఈసారి బాక్సాఫీస్ వ‌ద్ద పోటీ ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. కాగా మొదటగా దసరా పండుగకు సినిమాను విడుదల చేస్తామని చిరంజీవి `గాడ్ ఫాద‌ర్‌` చిత్ర నిర్మాతలు ప్రకటించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై ఆర్. బి.చౌదరి, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

అంతే కాక ఈ సినిమాలో లేడీ సూప‌ర్ స్టార్ నయనతార ఒక ముఖ్య పాత్ర పోషించారు. బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇతర ముఖ్య పాత్రలను సత్యదేవ్, పూరీ జ‌గ‌న్నాథ్‌, సునీల్, మురళి శర్మ తదితరులు పోషించారు. మలయాళంలో మోహన్ లాల్ నటించగా సూప‌ర్ హిట్ అయిన `లూసిఫర్` సినిమాకు రీమేక్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుద‌ల కాబోతోంది.

మ‌రో వైపు నాగార్జున `ది ఘోస్ట్‌` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వ‌స్తున్నారు. ప్రవీణ్‌ సత్తారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా న‌టించారు. బాలీవుడ్ న‌టి గుల్ ప‌నాగ్‌, అనిఖా సురేంద్రన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా సైతం అక్టోబ‌ర్ 5వ తేదీనే రిలీజ్ కాబోతోంది.

పండగ సీజన్ అంటే ఒకటికి రెండు సినిమాలు పోటీ పడడం సహజం. ఇక మెగాస్టార్ చిరంజీవి మరియు కింగ్ నాగార్జున ఒకరంటే ఒకరు ఎంతో గౌరవం ఇచ్చుకుంటారు. కాగా ఇద్దరు కూడా తమ సినిమాల ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఒకరికి ఒకరు అల్ ది బెస్ట్ చెప్పుకున్నారు. మరి ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతున్నప్పుడు ఒకరి సినిమాకి ఒకరు నష్టం కలిగించే ప్రమాదం కూడా ఉంటుంది కదా.. మరి ఈ రెండు సినిమాల బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

తొలుత గాడ్ ఫాదర్ సినిమాని భారీ రేట్లకు అమ్మాలని చూసినా మళ్ళీ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. చాలా ఏరియాలలో ఈ చిత్రాన్ని స్వంతంగా విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతే కాక చాలా ప్రాంతాలలో బిజినెస్ తాలూకు రేషియోను సవరించడం విశేషం. ఇక నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా కొన్ని ప్రాంతాలలో ఓన్ రిలీజ్ చేస్తూ మరి కొన్ని ప్రాంతాలలో ఇతర పార్టీలకు సరసమైన ధరలకు అమ్మడం జరిగింది.

ఇక బెల్లంకొండ గణేష్, వర్ష బోల్లమ్మ జంటగా నటిస్తున్న స్వాతి ముత్యం సినిమాని ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన సితార బ్యానర్ తో రెగ్యులర్ గా బిజినెస్ చేసేవారు కొనుగోలు చేశారు.

మొత్తంగా గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే – 80 కోట్ల షేర్ కలెక్ట్ చేయాలి. అలానే ది ఘోస్ట్ సినిమా 20 కోట్లు సంపాదించాలి. ఇంక చిన్న సినిమా అయిన స్వాతి ముత్యం 4 కోట్ల షేర్ ను దాటితే హిట్ అనిపించుకుంటుంది.

త్రివిక్రమ్ ని తిట్టింది నేనే – బండ్ల గణేష్

0

తెలుగు సినీ హాస్య నటుడు మరియు నిర్మాత అయిన బండ్ల గణేష్ తన వృత్తి పరంగా అనుకున్నంత స్థాయిలో ఎదగలేదు ఏమో కానీ వ్యక్తిగతంగా మాత్రం చాలా పాపులర్ అయ్యారు. సినిమా ఆడియో ఫంక్షన్ కావచ్చు, లేదా యూట్యూబ్ లో ఇచ్చే ఇంటర్వ్యూ కావచ్చు.. రాజకీయాలలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు. బండ్ల గణేష్ ఏం మాట్లాడినా అది సంచలనం అవుతుంది.

ఆ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్, ఎలక్షన్ల ప్రచార నిమిత్తం మీడియా కు కొన్ని ఇంటర్వ్యూలు మరియు న్యూస్ ఛానళ్లలో చర్చలలో పాల్గొన్నారు. అయితే ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఇచ్చిన స్టేట్మెంట్ లు సీరియస్ గా కాక ప్రజలందరినీ కడుపుబ్బా నవ్వించాయి.

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే సెవెనో క్లాక్ బ్లేడ్ తో పీక కోసుకుంటా అంటూ బండ్ల గణేష్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత అదే విషయమై సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పై సెవెనో క్లాక్ బ్లేడ్ పేరు మీద ట్రోల్స్ విపరీతంగా పుట్టుకొచ్చాయి.

తాజాగా మరోసారి బండ్ల గణేష్ ఒక మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విధానం చర్చనీయాంశం అవుతుంది. నోటికి ఎది వస్తే అది మాట్లాడి ఇబ్బందుల్లో చిక్కుకునే అలవాటు ఉన్న బండ్ల గణేష్.. ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచారు. ఇటీవలే చోర్ బజార్ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాథ్ పై కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ గతంలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు.

‘భీమ్లానాయక్’ సినిమా సమయంలో త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిడుతున్న ఆడియో ఒకటి బయటికి రావడం, అంతే కాక ఆ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. దీని పై తాజాగా వివరణ ఇచ్చారు బండ్ల గణేష్. తాను త్రివిక్రమ్ ను తిట్టిన మాట వాస్తమేనని అయితే అలా మాట్లాడినందుకు తాను త్రివిక్రమ్ కు క్షమాపణలు కూడా చెప్పానని అన్నారు.

ఇలాంటి విషయాల్లో ఇంత తేలిగ్గా, అపరిపక్వతతో బండ్ల గణేష్ మాట్లాడడం చూసిన నెటిజన్లు మరియు ఇండస్ట్రీ వర్గాలు.. బండ్ల గణేష్ ఇలాంటి ప్రవర్తన వల్ల తన గౌరవం కొలోతున్నారని అంటున్నారు. అయితే సోషల్ మీడియాలో ఒక వర్గం ప్రేక్షకులు మాత్రం బండ్ల గణేష్ ఇలానే ఉండాలని అప్పుడే తమకు ఎంటర్టైన్మెంట్ అందిస్తారని అంటున్నారు. మరి బండ్ల గణేష్ తన వైఖరిని మార్చుకుంటారా లేదా అనేది చూడాలి.

Can Ponniyin Selvan join 500Cr club?

0

Mani Ratnam’s Ponniyin Selvan has got off to a great start at the box office and has been doing great business worldwide. Termed the dream project of the ace director, the film features a massive star cast of Vikram, Aishwarya Rai, Trisha, Karthi, Jayam Ravi, and others.

Ponniyin Selvan had a massive weekend at the Box office In India it has collected around 130Cr and overseas it has collected around 100Cr The movie has sensational advance bookings for Monday in Tamil territories. Here are the closing gross estimations at the current trend

Tamil Nadu : 220Cr – 240Cr

Telugu states: 25Cr – 30 Cr

Karnataka: 25 Cr – 30 Cr

Kerala : 20 Cr – 25 Cr

North India: 25 Cr – 30 Cr

Overseas: 160 Cr – 180 Cr

The film has a good chance to cross the 500Cr gross mark at the Box office if the same trend continues. The film has already grossed Rs 200 crores worldwide and will hit the 300 crore mark in the coming couple of days.

Box-Office: పొన్నియిన్ సెల్వన్ 500 కోట్ల మార్కును చేరుతుందా?

0

మణిరర్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వన్` సెప్టెంబర్ 30న భారీ స్థాయిలో ఐదు భాషల్లో విడుదలైంది. చియాన్ విక్రమ్, ఐశ్వర్యారాయ్, కార్తి మరియు త్రిష కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. తొలి రోజున తమిళం మినహా ఇతర భాషల్లో ప్రేక్షకుల్ని అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేక డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా పై కొందరు తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా కొంచెం మితిమీరి ట్రోల్స్ కూడా వ్యక్తం చేశారు. అయితే ఆ డివైడ్ టాక్ వల్ల సినిమాకి పెద్దగా నష్టం లేదనే చెప్పాలి. ఎందుకంటే కేవలం తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు, కేరళ మరియు కర్ణాటక మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా పొన్నియిన్ సెల్వన్ నిలకడగా రాణిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది.

పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద తొలి వీకెండ్ భారీ వసూళ్లను రాబట్టడంలో సఫలమైంది, అంతే కాక భారతదేశంలో దాదాపు 130 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో దాదాపు 100 కోట్లు వసూలు చేయడం విశేషం. తమిళనాట అయితే సోమవారం కూడా ఈ చిత్రానికి సంచలన అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల ట్రెండ్‌ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద రన్ ముగిసే సరికి ఒక్కో ఏరియాలో ఎంత వసూలు చేస్తుందో ట్రేడ్ వర్గాలు వేస్తున్న అంచనాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులో 220 – 240 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాలలో 25 – 30 కోట్ల గ్రాస్, ఇక కర్ణాటకలో 25 – 30 కోట్ల గ్రాస్, కేరళలో 20 – 25 కోట్ల వరకూ.. ఆ పై ఉత్తర భారతదేశంలో 25 – 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తున్న ఓవర్సీస్ వద్ద 160 – 180 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

మొత్తంగా పొన్నియిన్ సెల్వన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకునే అవకాశం ఎంతైనా ఉంది అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. మరి ఆ మ్యాజికల్ నంబర్ ను పొన్నియిన్ సెల్వన్ సాధిస్తుందా లేదా చూడాలి.

RC-15 కంటే ముందు భారతీయుడు-2 విడుదల అవుతుందా?

0

దక్షిణ భారత దిగ్గజ దర్శకుడు శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల కాంబినేషన్లో RC 15 చిత్రం ఈ సంవత్సరం ప్రారంభంలో షూటింగ్ ప్రారంభించబడింది. కాగా షెడ్యూల్ తర్వాత షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తి చేసుకుంటూ వెళ్ళింది. ఇప్పటికే భారతదేశం అంతటా తిరిగి పలు షెడ్యూల్‌ల చిత్రీకరణ పూర్తి చేసుకుంది. అంతే కాక శంకర్ మార్కు ఉట్టిపడేలా ఒక పాటను కూడా భారీ స్థాయిలో చిత్రీకరించారు.

ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే గొప్ప తారాగణంతో పాటు అత్యుత్తమైన సాంకేతిక సిబ్బంది భాగమై ఉన్నారు. RRR లాంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ అభిమానులు.. తమ అభిమాన హీరోని శంకర్ దర్శకత్వంలో చూడడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇక ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి మొదట అనుకున్నారు. కానీ ఆ తర్వాత సంక్రాంతి నుంచి వేసవికి విడుదల తేదీని మార్చారు. అందుకోసమే ఎప్పుడూ లేనిది శంకర్ కెరీర్లోనే అత్యంత వేగంగా ఈ సినిమా కోసం షూటింగుకై యుద్ధ ప్రాతిపదికన చిత్ర బృందం పని చేశారు.

అయితే, ఇటీవలే విక్రమ్ వంటి అనూహ్య భారీ విజయం సాధించడంతో, కమల్ హాసన్ తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. దాంతో భారతీయుడు 2 నిర్మాతలు ఆ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించి షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అందువల్ల శంకర్ ఇప్పుడు ఏకబిగిన రెండు ప్రాజెక్టులను తెరకెక్కించే పనిలో ఉన్నారు. కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమానే తన తన తదుపరి విడుదల కావాలని ఆయన కోరుకుంటున్నారట. అందుకే కమల్ లుక్స్ దగ్గర నుంచి కథ, కథనాల పై ఎక్కువ దృష్టి పెడుతున్నారని సమాచారం.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, భారతీయుడు 2 సినిమా RC 15 కంటే ముందు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ఈ రెండింటిలో ఒక చిత్రం సమ్మర్‌లో, మరో చిత్రం అక్టోబర్/నవంబర్‌లో విడుదల అవుతుందని అంటున్నారు. మరి కొందరు అయితే భారతీయుడు 2 సమ్మర్ 2023 లో, RC15 2024 సంక్రాంతికి విడుదల అవ్వచ్చని అంటున్నారు. మరి ముందు ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి.

RC 15 లో కియారా అద్వానీ, SJ సూర్య, అంజలి, శ్రీకాంత్, జయరామ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరో వైపు ఇండియన్ 2లో కమల్ హాసన్ సరసన కాజల్ అగర్వాల్ కనిపించబోతున్నారు.

ఈ రెండు సినిమాలు కూడా అటు కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక సందేశాలతో కూడిన భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్లుగా తెరకెక్కుతున్నాయి.

మెగా ఫ్యాన్స్ – ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య అప్పుడే మొదలయిన సంక్రాంతి యుద్ధం

0

ఆదిపురుష్ చిత్రం టీజర్ విడుదల తర్వాత, మెగా ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధానికి రంగం సిద్ధం అయింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, అలాగే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమాలు 2023 సంక్రాంతికి విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా ఆది పురుష్ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ట్రోలింగ్‌కి గురైంది. దర్శకుడు ఓం రౌత్‌ విజన్, మరియు గ్రాఫిక్స్ వర్క్ ను రాబట్టుకున్న తీరు ఏమాత్రం బాగోలేదని పలు విమర్శకులు, సినీ ప్రేమికులు విరుచుకుపడ్డారు. ఇక ప్రభాస్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నేళ్లు ఆశగా ఎదురు చూస్తే ఇలాంటి పేలవమైన టీజర్ ఇచ్చాడని వారు సోషల్ మీడియాలో ఓం రౌత్‌పై దాడి చేశారు.

ఇక రాబోయే సంక్రాంతి క్లాష్ విషయానికి వస్తే, రెండు వైపుల నుండి ట్రోల్స్ చేయడంలో ఎవరూ తగ్గటం లేదు. నిజానికి ఆదిపురుష్ యొక్క టీజర్లో నాణ్యత తగ్గినప్పటికీ, బాక్స్ ఆఫీస్ వద్ద ఆ చిత్రం విజయవంతం అయ్యే అవకాశాలే ఎక్కువ. అందుకే ఈ రెండు సినిమాల పోటీ తెలుగు మార్కెట్ వరకూ ఖచ్చితంగా అతి పెద్ద క్లాష్‌లలో ఒకటని చెప్పచ్చు. ఈ రెండు చిత్ర యూనిట్లు కూడా తమ సినిమాల విజయం పై నమ్మకంతో ఉన్నారు. ఇక తమ అభిమాన హీరో నటించిన చిత్రం అవతలి హీరో చిత్రాన్ని చిత్తుగా ఒడిస్తుందని ఇరు వర్గాల అభిమానులు గట్టిగా చెబుతున్నారు.

ఆదిపురుష్‌లో ప్రభాస్ తో పాటు కృతి సనన్ మరియు సైఫ్ అలీ ఖాన్ నటించగా, బాబీ దర్శకత్వంలో వస్తున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా, మాస్ మహరాజ్ రవితేజ ఒక ముఖ్య అతిధి పాత్రలో నటిస్తున్నారు.

కాగా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సీజన్ లో భీమ్లా నాయక్, RRR మరియు రాధే శ్యామ్‌ సినిమాలు పోటీ పడాల్సి ఉండింది. అయితే కరోనా వల్ల అన్నీ వాయిదా పడడంతో మంచి సీజన్లో రసవత్తరమైన పోటీని చూసే అవకాశం ప్రేక్షకులు మిస్ అయ్యారు. ఇప్పుడు ఆదిపురుష్ మరియు వాల్తేరు వీరయ్య పోటీతో, 2022 సంక్రాంతికి ఉండాల్సిన భారీ పోటీ మరియు అభిమానుల మధ్య ఉత్సాహాన్ని 2023 సంక్రాంతి పండగ సీజన్ కు మనం తిరిగి చూడబోతున్నాం.

Adipurush Teaser Is Disappointing; Is It Really Made On A 500 Crore Budget?

0

Prabhas’ Adipurush has been one of the most anticipated films of all time. When it was announced that Prabhas will be playing Lord Ram in an adaptation of Ramayana, just the image alone is enough to give you goosebumps.

With the shooting of the film completed months ago, fans were eagerly waiting for updates from the movie. But there was no response from the makers and the VFX and CGI work was going in full swing. And with reports suggesting that the budget was close to 500 crores, the imaginations of fans went wild.

Just yesterday, the teaser of Adipurush was released and it came as a huge surprise for everyone. No one expected that the film will be a live-action animation picture. Moreover, the VFX looks extremely cartoonish and does not feel like a 500-crore movie at all. It looks like a low-budget cartoon show.

This is still not the final product and everyone will be eagerly hoping that the end product comes out better. There is still a lot of time left for the release of the film and if time is spent on the VFX then we can expect a great movie.

Having said that, the film has a high chance of scoring big at the box office. The film will fall into the genre of kids’ movies and families might go in crowds to watch an adaptation of the Ramayana. However, the actors will mostly not get that much credit.

నిరాశ పరిచిన ప్రభాస్ ఆది పురుష్ టీజర్

0

కేవలం ప్రభాస్ అభిమానులే కాక, ఇతర తెలుగు ప్రేక్షకులతో పాటు భారత దేశ సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సినిమా `ఆది పురుష్‌`. బాలీవుడ్‌ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వం ఈ చిత్రానికి వ‌హిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్ర‌భాస్ న‌టిస్తున్న తొలి పౌరాణిక చిత్రంగా రూపొందుతున్న ఆది పురుష్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. షూటింగ్ ఎప్పుడో పూర్తయిన ఈ సినిమా VFX వర్క్ కోసం చాలా సమయం తీసుకుంది. ఇక గత కొన్ని రోజులుగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ విడుదల అవుతుందన్న వార్తలు విని ప్ర‌పంచ వ్యాప్తంగా వున్న ప్ర‌భాస్ అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆనందించారు.

కృతి స‌న‌న్ సీత పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టించారు. టి. సిరీస్, రెట్రో ఫైల్స్ బ్యాన‌ర్ ల‌పై భార‌తీయ సినీ చరిత్రలోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ , 3డీ ఫార్మాట్ ల‌లో రూపొందించారు. విజువ‌ల్ వండర్ గా ఈ చిత్రం అద్భుతంగా ఉంటుందని అందరూ భావించారు. ఈ నేప‌థ్యంలో అక్టోబ‌ర్ 2 ఆదివారం ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ తో పాటు టీజ‌ర్ ని శ్రీ‌రాముడి జ‌న్మ‌స్థ‌ల‌మైన అయోధ్య‌లో రిలీజ్ చిత్ర బృందం విడుదల చేసింది.

అయితే ఆది పురుష్‌ టీజర్ అందరినీ షాక్ కు గురి చేసింది. ఎవరూ ఊహించని విధంగా చిత్రం పూర్తి యానిమేషన్ తో, పేలవమైన VFX వర్క్ తో ఉండి భారీగా నిరాశపరిచింది. టీజర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి 500 కోట్ల పైన బడ్జెట్ ఖర్చు పెట్టారా అని ఆశ్చర్యపోయారు. అదంతా ఉట్టి హైప్ అని, అసలు ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ చిత్రంగా కనిపిస్తుందని పలు బాలీవుడ్ విమర్శకులతో పాటు నెటిజన్లు కూడా అభిప్రాయ పడ్డారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించేందుకు అన్ని రకాల అంశాలను కలిగి ఉంది, ఎందుకంటే పిల్లలు మరియు ఫ్యామిలీస్ కు ఎంతో ఇష్టమైన జానర్ కాబట్టి వారు ఖచ్చితంగా ఆది పురుష్‌ సినిమా పై ఆసక్తి చూపుతారు. కానీ ఇలాంటి గ్రాఫిక్స్ ప్రధాన సినిమాల వల్ల నటీనటులకు పెద్దగా ఉపయోగం ఉండదనే చెప్పవచ్చు.

ఆది పురుష్‌ సినిమాని ఐమ్యాక్స్ వెర్ష‌న్ తో పాటు 3డీ వెర్ష‌న్ లోనూ రిలీజ్ చేస్తున్నారు. అయితే టీజర్ కు వచ్చిన మిశ్రమ స్పందన నేప‌థ్యంలో.. ప్రేక్ష‌కుల‌కు ఒక స‌రికొత్త అనుభూతిని క‌లిగించాలంటే చిత్ర బృందం మరింత కష్టపడాల్సి ఉంటుంది.

ఆది పురుష్‌ సినిమాని తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో 2023 జ‌న‌వ‌రి 12న సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టి విమర్శలను తిప్పి కొట్టేలా రాబోయే రోజుల్లో చిత్ర బృందం మెరుగైన కంటెంట్ తో వస్తారని ఆశిద్దాం.

Will Indian 2 release in theatres before RC 15?

0

Shankar and Ram Charan’s RC 15 started shooting earlier this year and was completing schedule after schedule at a great pace. Multiple schedules have already been shot all over India and a song was also shot on a massive scale in a typical Shankar style.

The movie features a great cast and crew and Ram Charan fans were excited to see him in a Shankar movie. There were plans to release this film for Sankranti 2023 and this would have been one of the fastest shot movies for Shankar in recent times.

However, with the roaring success of Vikram, Kamal Haasan is back in form and the makers of Indian 2 have decided to revive the project and start shooting. Now, Shankar is simultaneously shooting both projects. Kamal Haasan wants Indian 2 to be his next release and from the looks of it, even Shankar is focussing more on this sequel project.

According to the industry circles, Indian 2 has a chance to release before RC 15. Out of two one film will release in Summer and 2nd film will release in October/November. We have to see which film will takes the place first.

RC 15 stars Kiara Advani, SJ Surya, Anjali, Srikanth, Jayaram and others. Indian 2 on the other hand features Kajal Agarwal opposite Kamal Haasan. Both films are big-budget entertainers with great commercial elements and social messages.