Home Blog Page 1995

Mani Ratnam’s Ponniyin Selvan Crosses 200 Crore Mark At Box Office; Sensational Weekend

0

Mani Ratnam’s dream project Ponniyin Selvan has finally hit the theatres and the response is overwhelming. Although the film opened to mixed reactions from the audience, it had a record-breaking opening day at the box office. This trend continued through on Saturday and Sunday and the film has managed to cross the 200 crore mark as of Sunday.

At this rate, Ponniyin Selvan is expected to do 300 crores in the first week itself. In addition, the holiday advantage due to the festival will play a vital role in the film’s massive success. With a great first weekend, it is marching towards its second innings. The weekday collections will determine whether the movie can be considered a hit or a flop.

This is also the first 200+ crore grosser for Mani Ratnam and is a well-deserved achievement for one of our greatest directors. If the current trend continues, the movie will easily become an industry hit in the Tamil markets.

Ponniyin Selvan comprises of a star cast of Aishwarya Rai, Trisha, Karthi, Chiyaan Vikram, Jayam Ravi, and Jayaram among others. AR Rahman is the music director of the film and Ravi Varman is the cinematographer. Lyca Productions have produced the project.

బాక్స్ ఆఫీస్ వద్ద మూడు రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించిన పొన్నియిన్ సెల్వన్

0

సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ గా ఎంతో ఘన కీర్తిని సొంతం చేసుకున్న దర్శకుడు మణిరత్నం. ఆయన 30 ఏళ్ల కల ‘పొన్నియిన్ సెల్వన్’. ఎంజీ ఆర్ నుంచి కమల్ హాసన్ రజనీకాంత్.. ఆ తరువాత దళపతి విజయ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ఎన్నో రకాలుగా మణిరత్నం ప్రయత్నాలు చేశారు. అయితే అవేవీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ముందుకు రావడంతో ఈ సినిమా రూపు దాల్చింది.

రెండు భాగాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1′ పొన్నియిన్ సెల్వన్ 1′ సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆకట్టుకుంది. తొలి మూడు రోజుల వరకే కాకుండా రేపు, ఎల్లుండి కూడా తమిళ నాట అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా ఉన్నాయి. ఇక తెలుగు, హిందీ ప్రేక్షకుల నుంచి తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీ పై డివైడ్ టాక్ వచ్చినా.. క్రమంగా టాక్ మెరుగై కలెక్షన్లు కూడా నిలకడగా రావడం విశేషం.

కాగా పొన్నియిన్ సెల్వన్ చిత్రం తొలి రెండు రోజుల వరకు ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్‌ను రాబట్టడం విశేషం. అంతే కాకుండా మూడవ రోజు నాటికి 200 కోట్ల క్లబ్‌లో చోటు దక్కుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు. వారి అంచనా నిజం అయింది.

మూడు రోజులు పూర్తయ్యే నాటికి ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటింది. ఇక రానున్న రోజులు పండుగ సెలవులవడం వలన, వాటిని ఉపయోగించుకుని మొదటి వారంలోనే 300 కోట్ల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ చిత్రం మొదటి వారాంతంలో భారీ స్థాయిలో వసూళ్లు సాధించడమే కాకుండా కలెక్షన్లలో ఎక్కడా డ్రాప్ లేకుండా నిలకడగా ఉంది. కాగా మణిరత్నంకి ఇది మొట్ట మొదటి 200 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఇక తమిళ మార్కెట్‌లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

కల్కి నవల యొక్క అనుసరణగా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్‌ సినిమాకి జయమోహన్ రచయితగా పని చేశారు. మరియు మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ భారీ ప్రాజెక్ట్ లో ఐశ్వర్యరాయ్, చియాన్ విక్రమ్, కార్తీ, త్రిష, జయం రవి, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ తదితరులు నటించారు. రవి వర్మన్ కెమెరా బాధ్యతను తీసుకోగా, ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

బాలీవుడ్ ప్రేక్షకులకు 50 శాతానికే టికెట్ ధర ఆఫర్ చేస్తున్న స్టార్ హీరో

0

2022లో బాలీవుడ్ చాలా దిగువ స్థాయిలో ఉంది. భూల్ భులయ్యా 2, జగ్ జగ్ జియో మొదలైన కొన్ని సినిమాలు మంచి వసూళ్లు రాబట్టి బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని ప్రదర్శన కనబరిచినప్పటికీ, లాల్ సింగ్ చద్దా, సామ్రాట్ పృథ్వీరాజ్, ఎటాక్, రక్షా బంధన్ వంటి స్టార్ హీరోలు నటించిన చిత్రాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం వంటి బాలీవుడ్ స్టార్స్ అందరూ అనూహ్యంగా భారీ పరాజయాలను ఎదుర్కొన్నారు.

కాగా ఈతరం స్టార్ హీరో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మాత్రం భారీ హైప్ తో వచ్చి చాలా రోజుల తర్వాత బాలీవుడ్ కి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ సంపాదించిన సినిమాగా నిలిచింది. అయితే సినిమా కంటెంట్ విషయంలో కాస్త నిరాశ పరచడంతో విడుదలకు ముందు ఊహించిన స్థాయిలో బ్లాక్‌బస్టర్‌ అవలేదు కానీ డీసెంట్ హిట్ అనిపించుకుంది.

అయితే బాలీవుడ్ ఇలా దీన స్థితిలో ఉండటానికి ఒక రకంగా పెరిగిన టిక్కెట్టు ధర కూడా కారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒక కుటుంబంలోని నలుగురు సభ్యులు కలిసి ఒక సినిమా చూడాలి అనుకుంటే టికెట్ల ధర, తినుబండారాల ధరను కలుపుకుని ఎంత లేదన్నా 3000 పైనే ఖర్చు అవుతుంది. ఇది కూడా కాస్త చూచాయగా ఖర్చు పెడితేనే, ఖర్చు పట్టించుకోకుండా ఉంటే 5000 కూడా దాటచ్చు.

అందుకే ఎక్కువ మంది ప్రేక్షకులను థియేటర్ లకు రప్పించడానికి బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తన రాబోయే `దృశ్యం 2` సినిమాకి PVR చైన్ ఆఫ్ సినిమాస్ తో భాగస్వామ్యమై టిక్కెట్ ధరలపై ఆసక్తికరమైన ఆఫర్ ను ప్రకటించారు. ఈ ఆఫర్ ద్వారా ప్రేక్షకులు తమ టిక్కెట్లను PVR యాప్ లో కేవలం 50 రూపాయలకే బ్లాక్ చేసుకోవచ్చు. సినిమా మొదటి రోజు షోలపై 50 శాతం తగ్గింపు పొందవచ్చు. ఈ ఆఫర్ వల్ల తమ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ నమోదవుతాయని, దృశ్యం 2 చిత్ర బృందం భావిస్తున్నారు.

దృశ్యం 2 చిత్రం మోహన్‌లాల్ 2021లో అదే టైటిల్ తో వచ్చిన బ్లాక్‌బస్టర్‌కి రీమేక్. నవంబర్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దృశ్యం ఫ్రాంఛైజీలో రెండు సినిమాలు ఇప్పటికే తెలుగు-మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. హిందీలో పార్ట్ 1 కూడా మంచి విజయాన్ని సాధించింది.

అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజయ్ దేవగన్- టబు- శ్రియా శరణ్- అక్షయ్ ఖన్నా- ఇషితా దత్తా- మృణాల్ జాదవ్- రజత్ కపూర్ నటించారు.

Rajamouli strongly focussed on the Oscars

0

SS Rajamouli’s RRR was a massive success at the Box office but not a huge blockbuster like Baahubali2. However, the biggest success of RRR was in the cultural impact it created world over. The multistarrer was received well after releasing OTT especially the American audience has taken the movie next level with their appreciation.

Even The big names of Hollywood have also praised the RRR. So this may be the main reason for Rajamouli to feel the movie has high chance to get Oscar. The team behind RRR put great efforts for it to get nominated for Oscars as the official entry from India. However, Indian government felt otherwise and nominated Chello Show- a Gujarati film.

So Rajamouli looking for other options to get the Oscars. Recently, a screening was organized in Los Angels and the movie and Rajamouli received a terrific response. The surprising factor is that even the media mentioned the movie as a frontrunner for the Oscars. It appears that the ace director is leaving no stone unturned and is putting up a solo fight for the prestigious award.

Bollywood star hero offering 50% off on tickets to bring the audience to theatres

0

Bollywood has been going through a lean phase in 2022. While some movies like Bhool Bhulaiyya 2, Jug Jug Jiyo, etc. performed well, the majority of other star films like Laal Singh Chaddha, Samrat Prithviraj, Attack, Raksha Bandhan, etc failed miserably. Bollywood Stars like Aamir Khan, Akshay Kumar, Ajay Devgn, and John Abraham all have faced massive failures.

While Ranbir Kapoor’s Brahmastra opened brilliantly, it couldn’t sustain the momentum and become the absolute blockbuster it was expected to be. This is why Bollywood star Ajay Devgn is taking no chances for his upcoming film Drishyam 2. In order to register a solid opening, Drishyam 2 makers have decided to give 50% off on tickets on an opening day.

Ajay Devgn’s Drishyam 2 is a remake of Mohanlal’s 2021 blockbuster. Mohanlal’s Drishyam 2 was a sequel to his 2014 film and it was released directly on Amazon Prime with terrific reviews. Drishyam 2 stars Tabu, Shriya Saran, and Akshay Khanna in key roles. The film will release on 18th November.

OTT రిలీజ్ కు సిద్ధం అయిన అక్షయ్ కుమార్ రక్షా బంధన్

0

ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో, బాలీవుడ్ స్టార్ హీరో ఖిలాడి అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ నటించిన ఫ్యామిలీ డ్రామా రక్షా బంధన్ ఆగష్టు 11న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా అదేరోజు మరో సూపర్ స్టార్ అమీర్ ఖాన్, కపూర్ ఖాన్ జంటగా నటించిన లాల్ సింగ్ చడ్డా తో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడింది. అయితే ఈ రెండు చిత్రాలకు కూడా ప్రేక్షకుల నుంచి మరియు విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

రక్షా బంధన్ సినిమాకి కాస్త మంచి రివ్యూలు వచ్చినా, బాక్స్ ఆఫీస్ వద్ద ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ట్రైలర్, పాటలు చూసి ప్రేక్షకులు ఒక చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆశించి థియేటర్లకు తరలి వెళ్ళారు. ఐతే ఫస్టాప్ పరవాలేదు అనిపించినా, సెకండాఫ్ లో వేరే సినిమా తీసిన విధంగా కథ పక్కదారి పట్టడం ప్రేక్షకులకి అస్సలు నచ్చలేదు.

ఇక ఈ సినిమా పై బాయ్కాట్ ట్రెండ్ కూడా పని చేసిందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ అంతర్గత వర్గాలు కూడా భావించాయి. కోవిడ్ దాడుల దెబ్బకి దాదాపు రెండేళ్లు ధియేటర్లలో బాలివుడ్ ప్రేక్షకుల సినిమా చూసే అలవాటు తప్పిందని, ఒటిటి ఎదుగుదలకి తోడు సౌత్ సినిమాల రుచి చూసిన ప్రేక్షకులకి బాలీవుడ్ హీరోలు మరీ సాధారణ సినిమాలు అందించడం ఏమాత్రం నచ్చటం లేదని, అందుకే అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరో నటించిన రక్షా బంధన్ సినిమాకు కనీస స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదని ఒక వాదన వినిపిస్తోంది.

ఇక ఈ మధ్య తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ఇలా ఏ భాషలో వచ్చిన సినిమా అయినా, థియేటర్లో ఆ సినిమా ఫలితం ఎలాంటిది అయినా ఆ చిత్రాన్ని ఓటిటి విడుదల కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఏర్పడ్డారు.

అలాంటి ప్రేక్షకులతో పాటు రక్షా బంధన్‌ సినిమాని థియేటర్లలో చూడలేకపోయిన వారి కోసం, ఈ చిత్రం త్వరలో OTT ప్లాట్‌ఫారమ్ ZEE5లో ప్రసారం చేయబడుతుంది. రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 11న విడుదలైన ఈ చిత్రం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 5న OTT ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది.

స్ట్రీమింగ్ దిగ్గజం అయిన ZEE5, శనివారం అక్టోబర్ 1న తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

https://twitter.com/ZEE5India/status/1576067641361387520?t=TrUs8K7K6Z6oS1qL-3M3AQ&s=19

SSMB28 ప్యాన్ ఇండియా సినిమా కాదు – నిర్మాత నాగ వంశీ

0

సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న SSMB28 సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ కూడా చిత్రీకరించడం జరిగింది. ఇక తదుపరి షెడ్యూల్‌లో మహేష్, పూజా హెగ్డేల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. 12 ఏళ్ల తర్వాత మహేష్‌తో కలిసి సినిమా చేస్తున్న త్రివిక్రమ్, తన గత చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాకు సరికొత్త లుక్ తో పాటు కొత్త ట్రీట్‌మెంట్ కూడా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ నాణ్యతతో నిర్మిస్తుంది. ఈ చిత్రం అధికారికంగా ప్రకటించిన రోజు నుండి, SSMB28 సినిమా టాలీవుడ్‌లో ఒక హాట్ టాపిక్‌గా మారింది. అయితే అదే క్రమంలో ఈ చిత్రం గురించి రకరకాల పుకార్లు కూడా వినిపించాయి. భారీ బడ్జెట్ అని, థియేట్రికల్ రైట్స్ మరియు ఆడియో రైట్స్ కూడా చాలా గొప్ప ధరలకు అమ్ముడయ్యాయి అని, ఇలా చాలా రకాలుగా ఏవేవో వార్తలు వినిపించాయి. అయితే తాజాగా “స్వాతిముత్యం” సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. నిర్మాత నాగ వంశీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో SSMB28 ప్రాజెక్ట్ గురించిన ఈ పుకార్ల పై వివరణ ఇచ్చారు.

ఈ సినిమా బిజినెస్‌ పై మార్కెట్‌లో వస్తున్న లెక్కలు అన్నీ పూర్తిగా తప్పు అని నాగ వంశీ స్పష్టం చేశారు. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమాకు సంబంధించి అసలు ఎలాంటి బిజినెస్ చేయ‌లేదని నాగ వంశీ అన్నారు. ఇక ఆయన మరో ముఖ్యమైన విషయం కూడా తెలియజేశారు. కొన్ని మీడియా వర్గాలు చెప్పిన విధంగా ఇది ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్ కాదని, ఒక ఔట్ అండ్ అవుట్ తెలుగు సినిమా మాత్రమేనని ఈ మేరకు నాగ వంశీ స్పష్టం చేశారు.

ఈ చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించినప్పుడు మహేష్ అభిమానులు ఎంతగానో సంతోషించారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ చిత్రం 2023 వేసవిలో విడుదల కానుంది.

డిజె టిల్లు సీక్వెల్ లో హీరోయిన్ మార్పు

0

డిజె టిల్లు సినిమా ఇప్పటివరకు ఈ సంవత్సరం హిట్ అయిన సినిమాలలో అందరినీ ఆశ్చర్య పరిచిన సినిమాగా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్‌తో చిత్రీకరించబడిన చిన్న చిత్రంగా విడుదలై, ఈ కామెడీ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించిందనే చెప్పాలి. నిజానికి 2022 సంవత్సర ప్రారంభంలో వరుస పరాజయాలతో సతమతవుతున్న తెలుగు సినిమా పరిశ్రమకు ఎంతో హాయిని, ఆనందాన్ని ఇచ్చే సూపర్ హిట్‌ని అందించింది.

ఈ చిత్రంలో టైటిల్ రోల్ లో హీరో సిద్ధు జొన్నలగడ్డ క్యారెక్టరైజేషన్, ఆద్యంతం ఎనర్జీతో నిండిన తన పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి హైలైట్‌గా నిలిచి బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించింది.

ఇక భారీ విజయం సాధించిన ఈ సినిమాకు చాలా తొందరగానే సీక్వెల్ ను కూడా ప్రకటించారు. మొదట్లో డిజె టిల్లు సీక్వెల్, తొలి భాగంలో ఉన్న తారాగణం మరియు అదే చిత్ర బృందంతో చాలా అద్భుతమైన సందడితో ఘనంగా ప్రారంభమైంది. అయితే ఆ తర్వాత కొన్ని సృజనాత్మక విభేదాల కారణంగా దర్శకుడు విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

ఇక తొలుత దర్శకుడు విమల్ కృష్ణ తర్వాత, హీరోయిన్ గా ఎంపికైన లేటెస్ట్ సెన్సేషన్, నటి శ్రీ లీల కూడా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు, ఇలాంటి వరుస ఇబ్బందుల వల్ల ఈ చిత్ర నిర్మాతలతో పాటు హీరో సిద్ధు జొన్నలగడ్డ కూడా కొన్ని రోజుల పాటు కాస్త గందరగోళ స్థితిలో ఉన్నారు. అయితే, ఎట్టకేలకు వారు హీరోయిన్ శ్రీలీలకి ప్రత్యామ్నాయాన్ని కనుగొన్నారని తెలుస్తోంది.

తెలుగు సినీ ప్రేక్షకులు చాలా కాలంగా ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపికైనట్లు తాజా సమాచారం. కాగా ఈ నటి తన చివరి చిత్రం కార్తికేయ 2 విజయంతో మంచి జోరు మీద ఉన్నారు. డిజె టిల్లు సీక్వెల్ తో కూడా అలాంటి భారీ విజయాన్ని అనుపమ తమకు అందిస్తారని చిత్ర నిర్మాతలు ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు నిజమవ్వాలి అనే కోరుకుందాం.

ది ఘోస్ట్ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్

0

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం “ది ఘోస్ట్” ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి గత కొద్ది రోజులుగా ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఈ చిత్రం ఇప్పటివరకు చక్కని ప్రచార కంటెంట్‌తో ప్రేక్షకులలో మంచి బజ్‌ని ఏర్పడేలా చేసింది. టీజర్, ట్రైలర్, మరియు పోస్టర్లు చూస్తుంటే చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. కాగా సినిమాలో నాగార్జున లుక్/ గెటప్ కూడా అద్భుతంగా ఉంది.

ఇక ఘోస్ట్ సినిమా కేవలం ప్రేక్షకుల దృష్టిని మాత్రమే కాకుండా ట్రేడ్ వర్గాల దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ సినిమా యొక్క నాన్-థియేట్రికల్ మరియు థియేట్రికల్ బిజినెస్ చాలా బాగా జరిగింది. ఆంధ్ర ప్రాంతం మొత్తం బిజినెస్ 8 కోట్లకు జరిగింది. ఇక నైజాం 6 కోట్లు, సీడెడ్ 2.5 కోట్లకు జరిగింది.

ఆ రకంగా మొత్తం తెలుగు రాష్ట్రాలలో ఘోస్ట్ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే దాదాపు 16.5 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలి 20 కోట్ల నంబర్ దాటాల్సి ఉంటుంది. కాగా ది ఘోస్ట్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే ఈ సినిమా చుట్టూ ప్రస్తుతం నెలకొన్న హైప్, బజ్ ప్రకారం కాస్త డీసెంట్ వచ్చినా చాలు, సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ నంబర్లను నమోదు చేస్తుంది. అయితే, అదే రోజు విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ నుండి ఈ సినిమాకి ఖచ్చితంగా గట్టి పోటీ ఎదురవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ది ఘోస్ట్‌ చిత్రంలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తుండగా, గుల్ పనాగ్, అనికా మరియు రవివర్మ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా పని చేశారు. మార్క్ రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ది ఘోస్ట్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది.

SSMB 28 is not a pan-India film; producer denies all business rumours

0

Superstar Mahesh Babu’s SSMB 28 went on floors recently and an action episode has also been shot. The next schedule will feature some romantic scenes between Mahesh and Pooja Hegde. Trivikram, who is joining hands with Mahesh after 12 long years is taking all precautions to ensure the project has a fresh look and novel treatment, unlike his previous films.

Harika and Haasinie Creations are backing this prestigious project and right from the day its announcement, SSMB 28 became the hot topic in Tollywood. Producer Naga Vamsi in a recent interview clarified various things about the project.

The producer clarified that the figures floating around in the market about the movie’s business are totally wrong. In fact, the film has not done any business at all till now and it is in its initial stages. Another major clarity given by Naga Vamsi is that it is not a pan-India project as being cited by certain media houses. The film is an out-and-out Telugu film.

The filmmakers, Haarika and Haasine Creations announced this project last year much to the delight of fans. SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties. The film is slated to release in the Summer of 2023.