Home Blog Page 1905

సాహోను దాటేసి సౌత్ ఇండియన్ సినిమాలలో ఆల్ టైం టాప్-8 గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించిన కాంతార

0

మ్యాజికల్ బ్లాక్ బస్టర్ కాంతార చిత్రం భారతీయ బాక్సాఫీస్ వద్ద డ్రీమ్ రన్ పొందింది. ఈ చిత్రం దాదాపు 15-16 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడగా.. ఇప్పుడు ఇది ఏకంగా ప్రభాస్ యొక్క సాహోను అధిగమించి 8వ అత్యధిక సౌత్ ఇండియన్ గ్రాసర్‌గా నిలిచింది.

కాంతార కంటే ముందున్న 7 సినిమాలు బాహుబలి2, కేజీఎఫ్, 2పాయింట్0, బాహుబలి, పొన్నియిన్ సెల్వన్, విక్రమ్. భారీ బడ్జెట్‌, గ్రాండ్‌ విజువల్స్‌, పెద్ద స్టార్‌ కాస్ట్‌ లేకుండా రూపొందిన కాంతార సినిమా 410 కోట్లకు పైగా కలెక్ట్‌ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

సాహో పూర్తి రన్‌లో 405 కోట్లు వసూలు చేసింది, ఇక కాంతార దానిని అధిగమించి దక్షిణ భారత చలనచిత్రాలలో 8వ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ రోజుల్లో సౌత్ సినిమాలకు మంచి వసూళ్లు రావడానికి నార్త్ ఇండియా కూడా మంచి మార్గంగా మారింది.

నార్త్ ఇండియన్స్ కూడా రీజనల్ సినిమా అంటే ముఖ్యంగా ప్రాంతీయతత్వంతో నిండిన పల్లెటూరి యాక్షన్ సినిమాలంటే ఇష్టపడుతున్నారు. ఈ తరహా సినిమాలు బాలీవుడ్‌లో అన్వేషించబడలేదు మరియు తెలుగు, తమిళం మరియు కన్నడ సినిమాలు ఈ శూన్యతను తమ సినిమాల ద్వారా నింపుతున్నాయి. సౌత్ ఇండియన్ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ని కొత్త కాన్సెప్ట్‌లతో కలపడంలో నిష్ణాతులు కావడం కూడా మన సినిమాలకు ఉత్తరాది మార్కెట్‌లో మంచి గుర్తింపు రావడానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు.

కాంతార సినిమాని రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో కూడా నటించారు. కాగా ఈ చిత్రం దైవిక అంశాలతో కూడిన జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఇందులో వినోదాన్ని మరియు దైవత్వాన్ని సమంగా చూపించారు.

అలాగే హీరో భూతకోల అనే జానపద కళను ప్రదర్శించే పాత్రలో కనిపిస్తారు, ఇది ప్రేక్షకులకు కొత్త థ్రిల్ ఇచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ ప్రభావం ఎలా ఉందంటే సినిమా చూసిన కొన్ని గంటల వరకూ ఆ ముద్ర నుండి ప్రేక్షకులు బయటికి రాలేక పోలేని స్థాయిలో ఉండటం విశేషం. ఈ సినిమా లో ఈ అంశమే ఎక్కువగా చర్చనీయాంశమైంది.

Kriti Sanon denies rumours about her and Prabhas, terms them baseless

0

The rumours of Kriti Sanon and Prabhas dating went viral last week after her Bhediya co-star Varun Dhawan hinted about the same. Fans of Prabhas and Kriti Sanon went into a frenzy online and even started speculating about their wedding.

During a reality show, Varun Dhawan and Kriti Sanon were promoting Bhediya where Karan Johar asked them a few questions. Varun answering a question said, “Kriti’s name is in someone else’s heart. He commented that the person is not in Mumbai. He is shooting somewhere else with Deepika Padukone.”

This directly led to speculations of the person being Prabhas as he is working with Deepika Padukone for Project K. Kriti Sanon has now clarified on the issue and in an Instagram story said that her co-star Varun Dhawan went ‘too wild’ and exaggerated the bit.

The actress will be next seen in Shehzada alongside Kartik Aryan. This film is a remake of Allu Arjun’s blockbuster Ala Vaikunthapurramulo. After this, she has Adipurush lined up as well.

Shriya Saran Hot Photos that melts our hearts

0

Shriya Saran looks hot in the latest pictures she posted on Instagram. She still melts our hearts with eternal beauty.

కలెక్షన్ల పర్సంటేజీలో సమస్యల కారణంగా అవతార్-2 పై నిషేధం విధించిన కేరళ ఎగ్జిబిటర్లు

0

కేరళ ఎగ్జిబిటర్స్ వర్సెస్ అవతార్2 ఇప్పుడు పెరుగుతున్న వివాదంగా మారింది. ఆదాయ భాగస్వామ్య శాతం ఈ వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. డిస్నీ సంస్థ థియేటర్ యజమానుల నుండి 60% నికర ఆదాయాన్ని ఆశిస్తోంది. అయితే, కేరళ ఎగ్జిబిటర్లు ఎంత క్రేజీ మూవీ అయినా సరే అందుకు ఒప్పుకోకపోగా.. సినిమాని వదిలిపెట్టడానికి అయినా సిద్ధంగా ఉన్నారట.

ఎగ్జిబిటర్ల పై ఈ అధిక శాతం విధించడాన్ని ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ వ్యతిరేకిస్తోంది. వారికి, రాబడి వాటాలో 55% మాత్రమే వారు భరించగలిగే గరిష్టం. అయితే, సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా కనీసం రెండు వారాల పాటు సినిమాను ప్రదర్శించడం వంటి ఇతర షరతులు కూడా ఎగ్జిబిటర్లకు ఆమోదయోగ్యం కాదట.

ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరకపోతే అవతార్ 2 సినిమా కేరళలో విడుదలయ్యే అవకాశం లేదు. ఇద్దరూ తమ సొంత నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు. ఎగ్జిబిటర్‌లతో ఒప్పందం కుదుర్చుకోలేకపోతే అవతార్2 సంభావ్య మార్కెట్‌ను కోల్పోయే అవకాశం ఉంది.

ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది మరియు ఆ కారణం వల్లే డిస్నీని మార్కెట్లో నిబంధనలను నిర్దేశించేలా చేస్తోంది. పర్యవసానంగా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న సామాన్యులకు ధరలు భారంగా మారుతున్నాయి. బెంగళూరు వంటి కొన్ని ప్రాంతాల్లో, మల్టీప్లెక్స్ టిక్కెట్ కనీస ధర 600 రూపాయలు కావడం గమనార్హం.

ఈ సమస్యను డిస్నీ సంస్థ కాస్త పరిగణలోకి తీసుకొని తక్కువ మంది ప్రేక్షకుల నుండి గరిష్టంగా డబ్బులు వసూలు చేయడం కంటే ఎక్కువ మంది ప్రేక్షకులకు అందుబాటులో ఉండేలా ధరలు ఉండేలా నిర్ణయం తీసుకుంటారు అని ఆశిద్దాం.

ఆచార్య వీక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు కారణం కొరటాల శివ అని నిందించిన మణిశర్మ

0

ఈ ఏడాది వేసవిలో విడుదలై అతి పెద్ద డిజాస్టర్‌గా మారినప్పటి నుంచి ఆచార్య సినిమా వివాదాలు సృష్టిస్తూ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ‘విజయానికి చాలా మంది స్నేహితులు ఉంటారు, కానీ అపజయం అనాథగా మిగిలిపోతుంది’ అని ఇండస్ట్రీలో ఒక సామెత ప్రసిద్ధిలో ఉంది. ఆచార్య విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది.

ఆచార్య సంగీతం గురించి మణిశర్మ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు అదే కొటేషన్‌ను పునరుద్ఘాటించిన విధంగా పరిస్థితి ఏర్పడింది.

మెగాస్టార్ చిరంజీవి ఇటివలే ఫిల్మ్ కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆచార్య ఫలితాన్ని పూర్తిగా దర్శకుడి పై ఆపాదించడం కనిపించింది. దర్శకుడు ఏది చెబితే అది తాను, రామ్ చరణ్ చేశామని, అందుకే ఫలితం కొరటాల మీద ఉందన్నట్లుగా ఆయన అన్నారు.

అదే ట్రెండ్‌ను అనుసరించి, హాస్యనటుడు అలీ వ్యాఖ్యాతగా చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైన మణిశర్మ, దర్శకుడి నిర్ణయాన్ని నిందించడం ద్వారా ఆచార్య సినిమాకు తాను ఇచ్చిన బలహీనమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ విషయంలో తన తప్పేమీ లేదని సమర్థించుకున్నారు.

తాను ఎన్నో వైవిధ్యమైన సినిమాలు చేశానని, మెగాస్టార్ సినిమాలకు మ్యూజిక్ పరంగా ఏం అవసరమో తనకు తెలుసునని మణిశర్మ అన్నారు. అయితే కొరటాల మాత్రం కొత్త తరహా సంగీతం ఇవ్వాలని పట్టుబట్టడంతో తన నిర్ణయాన్ని మార్చుకుని దర్శకుడు చెప్పినట్లు చేయాల్సి వచ్చిందని మణిశర్మ తెలిపారు.

సాధారణంగా సినిమా విషయంలో కీలక నిర్ణయాలు దర్శకులే తీసుకుంటారు. కొత్త యుగంలో దర్శకులు 24 క్రాఫ్ట్‌లలోని ప్రతి అంశాన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. కొరటాల కూడా అదే చేసి ఉండవచ్చు, కానీ ఆచార్య చిత్ర బృందం నుండి చాలా మంది అతని పై నిందలు వేస్తుండటంతో అందరికంటే ఎక్కువ విమర్శలు ఆయన మీదే వస్తున్నాయి.

నిజానికి ఆచార్య సినిమా ఇండస్ట్రీలో మొదటి డిజాస్టర్ ఏమీ కాదు. కేవలం ఒక ఫ్లాప్ ఇచ్చినందుకు కొరటాలని అందరూ పంచ్‌బ్యాగ్‌గా మార్చారు. ఇది ఎంత మాత్రం మంచి సంకేతం కాదు, ఎవరికైనా సినిమా తీయడంలో తప్పులు జరుగుతాయి. ఆ మాత్రానికే ఒక్కరిని చేసి అనడం సరి కాదు.

దర్శకుడు కొరటాల శివ పై ఈ నిందల పర్వం త్వరలోనే ఆగిపోతుందని.. మరియు కొరటాల శివ ఎన్టీఆర్ 30తో సాధ్యమైనంత ఉత్తమమైన అవుట్‌పుట్‌ను అందించి తని సామర్థ్యాన్ని నిరూపించుకుంటారని ఆశిద్దాం.

Manisharma blames Koratala Siva for Acharya ‘s weak BGM

0

Acharya has been creating controversy ever since it became a big disaster. As a saying in the industry goes, ‘Success has many friends, but Failure remains an orphan’. The same has been the case for Acharya.

Mani Sharma’s latest remarks about Acharya music have reiterated the same quotation now. It was previously seen that Megastar Chiranjeevi in an interview with Film Companion has attributed the result of Acharya entirely on director. He said that he and Ram charan did whatever director said, hence the result is on Koratala.

Following the same trend, Mani Sharma who attended the Ali tho Saradaga program anchored by comedian Ali, defended the weak background score of the movie by blaming the director’s decision.

He said that he had done various films and knew what Megastar movies need in terms of music. But Koratala insisted on giving new kind of music, so Mani had to junk his decision.

Generally, key decisions about the movie are made by directors. New age directors try to control every aspect of 24 crafts. Koratala might have done the same, but he is getting more criticism than anyone as many from the team Acharya are pointing fingers at him.

This isn’t the first disaster in the industry, just for scoring a flop made Koratala a punch bag. This isn’t a good sign, as mistakes happen for anyone. We hope this stops soon, and Koratala Siva delivers the best possible output with NTR30 which in turn would prove his mettle.

Kerala exhibitors banned Avatar2 due to percentage issues on collections

0

Kerala’s exhibitors vs Avatar2 is the growing controversy now. Revenue sharing percentage is the bone of contention between these two. Disney is expecting 60% of the net income from theater owners.

However, exhibitors aren’t ready for that causing an issue that may lead to abandoning of this crazy movie by Kerala exhibitors. Film exhibitors United organization of Kerala is against this imposition of high percentage on exhibitors. For them, 55% of revenue share is the maximum they can afford.

However, other conditions like screening the movie for minimum of two weeks no matter the response for the movie is also not acceptable for exhibitors.

The movie might not get released if there is no agreement between both the parties. Both are firmly adhering to their own decisions. Avatar2 might be losing a potential market if they can’t strike a deal with the exhibitors.

The movie is on massive demand all over the world and this is making Disney to dictate terms in the market. As a consequence, the prices are becoming a burden for the common man, reeling under inflation. In some areas like Bengaluru, the minimum cost of a multiplex ticket is around 600₹.

We hope the pricing decisions are made in order to make it affordable for more audiences than to squeeze maximum from a small section of audiences.

గాడ్ ఫాదర్ సినిమాకి ఫేక్ కలెక్షన్లు ప్రకటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

0

మెగాస్టార్ చిరంజీవి చివరిగా థియేటర్లలో విడుదల చేసిన గాడ్ ఫాదర్ బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలైంది. డీసెంట్ టాక్ వచ్చినా ఫస్ట్ వీకెండ్ మినహా కలెక్షన్లలో ఈ సినిమా పెద్దగా రాణించలేదు.

అయితే మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. మొదటి రోజు నుంచి గాడ్‌ఫాదర్‌ టీమ్‌ ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా నిలిచిందని నిరూపించే ప్రయత్నంలో ఉంది. ఈ వేసవిలో విడుదలైన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచిన సంగతి మనకు తెలిసిందే.

కాబట్టి ఇప్పుడు చిరంజీవి మరియు అతని కోర్ టీమ్ మెగాస్టార్‌కి గాడ్‌ఫాదర్ సినిమా ఒక పునరాగమనం హిట్ అని నిరూపించడానికి తెగ కష్టపడుతున్నారు. ఈ సినిమాను సక్సెస్‌ఫుల్‌ అని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్నదాని కంటే నంబర్లు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. గాడ్‌ఫాదర్ ఫైనల్ గ్రాస్ కలెక్షన్స్ దాదాపు 100 కోట్లు అయితే రామ్ చరణ్ అంతకంటే ఎక్కువ నంబర్ ఇచ్చారు.

ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ నిర్మించిన సంగతి తెలిసిందే. తాజాగా రామ్ చరణ్ సినిమా బాక్సాఫీస్ లెక్కలను బయటపెట్టాడు. OTTలో ఎక్కువ మంది వీక్షించినప్పటికీ సినిమాకు వసూళ్లు చాలా బాగా వచ్చాయని ఆయన అన్నారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.145 కోట్ల నుంచి రూ.150 కోట్లు వసూలు చేసిందని ఆయన తెలిపారు. ఢిల్లీలో హిందుస్థాన్ టైమ్స్‌కి వన్ టు వన్ ఇంటర్వ్యూ సందర్భంగా చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

“అవును, OTTలో అసలు సినిమాను ఇప్పటికే చూసిన ప్రేక్షకులలో పెద్ద భాగాన్ని కోల్పోతాము. ఒక రీమేక్‌ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి ఇష్టపడకపోవచ్చు. బహుశా స్టార్ చరిష్మా, స్టార్ పవర్ వల్ల కొంత మంది ప్రేక్షక వర్గం మాత్రం సినిమా చూసినా మళ్లీ థియేటర్లకు లాగబడవచ్చు. అయితే ఆ ఫార్ములా ఎప్పుడూ పని చేస్తుందా అంటే? నేను కాదు అంటాను. నేను ఇక పై రీమేక్‌లు చేస్తానో లేదో నాకు తెలియదు” అని ఆయన అన్నారు.

చరణ్ ఇంకా మాట్లాడుతూ, “నేను గనక రీమేక్ చేస్తే, బహుశా ఒరిజినల్ నిర్మాతని OTTలో విడుదల చేయవద్దని కోరతాను. ఆ షరతులతో నేను రీమేక్ చేయవచ్చు. అది కూడా నేను థియేటర్లో సినిమా చూసి మరియు అది నాకు నచ్చినట్లయితేనే, OTTలో విడుదల చేయవద్దని నేను సదరు నిర్మాతను అభ్యర్థించవచ్చు. లేకపోతే, ఇక ముందు ముందు మనమందరం ఒరిజినల్ స్క్రిప్ట్‌లను చేయడానికే ఇష్టపడతాము.” అని చరణ్ అన్నారు.

రీమేక్‌లు ఇక పై సురక్షితం కాదని రామ్ చరణ్ తెలుసుకోవడం అభినందనీయం. కానీ సరైన సంఖ్యలతో బాక్సాఫీస్ స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం పై తను కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే బ్లోటెడ్ నంబర్‌లు ఇవ్వడం వల్ల ఆయనకి లేదా ఆయన చిత్రాలకు ఎటువంటి మేలు జరగదు, అది తను నటించే సినిమాలు కావచ్చు లేదా తను నిర్మిస్తున్న తన తండ్రి సినిమాలు అయినా కావచ్చు.

Mega power star Ramcharan again announced bloated and fake numbers for Godfather

0

Megastar Chiranjeevi’s last theatrical release, Godfather, was a Box office failure. Though it got a decent amount of talk, the film didn’t reflect it in the collections except for first weekend.

But what’s more surprising is right from the day1 onwards the Godfather team is trying to prove that the movie is a successful movie. We all know that Acharya movie released in this summer became a terrible disaster at the box office.

So now Chiranjeevi and his core team is hell-bent on proving Godfather movie as a comeback hit for the Megastar. They are even trying to give bloated numbers to project the film as a success. The final gross collections of godfather are around 100 crores, but Ram Charan has given a much more number than that.

As the film is produced by Konidela Production Company, Charan disclosed the film’s Box Office numbers. He said the film did fairly well despite being extensively watched on OTT. It made about Rs 145 Crore to Rs 150 Crore at the box office, according to him. Charan made these comments during his one-to-one interview with Hindustan Times in Delhi.

“ Yes, we will lose a big chunk of the audience who have already seen the original film on OTT. The audiences might not want to come to theaters to watch the remake. Maybe the charisma of the star, star power would also have dragged the people back to theaters even though they have seen. But will that formula always work? I’d say no. I don’t know if I’d continue doing a lot of remakes” he said.

Charan further added, “If I do a remake, I’d probably ask the producer of the original to not release it on OTT. On those conditions, I may do a remake. If I’ve seen a movie in theaters and if I like it, I might request him not release on OTT. Perhaps I’ll be interested. Otherwise, going forward, we’d all prefer to do original scripts.” Charan said.

Well, it is appreciable that he has learned that remakes are not safe anymore. He should also concentrate on giving the box office statements with the correct numbers. Because giving bloated numbers won’t do any good to him or his films, be it his movies or his father’s movies, which he is producing.

పవిత్రా లోకేష్ కంప్లైంట్ పై యాక్షన్ తీసుకున్న పోలీసులు

0

నటి పవిత్రా లోకేష్, సీనియర్ నటుడు నరేష్ వ్యవహారం పై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. తాజాగా పవిత్రా లోకేష్ మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. తన ప్రతిష్టను దెబ్బతీసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

సీనియర్ నటి పవిత్రా లోకేష్ కేసు పై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ తన పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, నరేష్‌తో తనకు లింక్ పెట్టి ట్రోల్ చేస్తున్నాయని పవిత్ర లోకేష్ శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి 15 యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. ఇందుకు బాధ్యులైన వ్యక్తి మూడు రోజుల్లోగా విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

“నరేష్‌ పై కొన్ని యూట్యూబ్ ఛానెల్‌లు, వెబ్‌సైట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పవిత్ర లోకేష్ శనివారం ఫిర్యాదు చేశారు. ఇలాగే మా ఇద్దరిపై ట్రోల్స్ నడుస్తున్నాయి. కొన్ని వెబ్‌సైట్లు ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నాయి. ఈ చర్యలన్నీ మా గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయి’’ అని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పవిత్రా లోకేష్ పేర్కొన్నారు. ఆవిడ ఫిర్యాదు మేరకు కొన్ని ఆధారాలను కూడా జత చేసినట్లు సమాచారం.

ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ట్రోల్‌ చేస్తున్న యూట్యూబ్‌ ఛానెల్స్‌ పైనా, అసత్య ప్రచారం చేస్తున్న వెబ్‌సైట్ల పైనా చర్యలు తీసుకోవాలని పవిత్రా లోకేశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు శనివారం మీడియాకు వెల్లడించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ త్వరితగతిన విచారణ ప్రారంభించారు.

నటి పవిత్రా ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు. నరేష్ భార్య రమ్య రఘుపతి పై కేసు నమోదు చేసిన పోలీసులు రామారావు అనే వ్యక్తికి నోటీసులు అందించారు. రామారావు ఈరోజు విచారణకు హాజరుకానున్నారు. ఇంతమంది పేరుతో రామారావు యూట్యూబ్ లో వీడియోలు అప్ లోడ్ చేశారనే ఆరోపణలున్నాయి.

ఇటీవల మైసూరులోని ఓ హోటల్‌లో నరేష్, పవిత్రా లోకేష్ ఉండగా.. అక్కడికి వెళ్లిన నరేష్ మూడో భార్య రమ్య రఘుపతికి పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత ఓ వీడియో విడుదల చేసిన పవిత్రా లోకేష్.. రమ్య మీడియా ముందుకొచ్చి పరువు తీశారని ఆరోపించారు.

అయితే ఆ గొడవ తర్వాత కూడా నరేష్, పవిత్రా జంటగా కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మరణించారు… ఆయన అంత్యక్రియల సమయంలో వీరు ఇద్దరూ కలుసుకున్నారు. దాంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. ఈ మొత్తం వ్యవహారం పై పవిత్రా లోకేష్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.