Home Blog Page 2249

అరుదైన గౌరవం దక్కించుకున్న కార్తీకేయ -2 టీమ్

0

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా న‌టించి..విడుదలకు సిద్ధంగా ఉన్న తాజా చిత్రం “కార్తికేయ 2”. చందూ మొండేటి దర్శకత్వంలో వ‌స్తున్న ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

కార్తికేయ 2 టీం జూలై 19న ప్ర‌పంచ‌ ప్ర‌ఖ్యాత ISKCON ఆర్గ‌నైజేష‌న్‌ను సంద‌ర్శించ‌నుంది. యూపీలోని ఆర్గ‌నైజేష‌న్‌ను సంద‌ర్శించి.. అక్కడి భక్తులతో శ్రీ కృష్ణుని మహిమలు, జీవిత విశేషాలను ఏ రకంగా సినిమాలో స్పూర్తిగా తీసుకున్నారు అనే అంశాలపై చర్చలో పాల్గొనడానికి కోల్‌క‌తా ISKCON వైస్ ప్రెసిడెంట్ రాధారామ్ దాస్ కార్తికేయ 2 టీంను ఆహ్వానించటం విశేషం. ఈ విష‌యాన్ని నిఖిల్ ట్విట‌ర్ ద్వారా షేర్ చేశారు. హిందీ, తమిళ్, మలయాళ మరియు కన్నడ వెర్షన్ల టీజర్లను అక్కడ విడుదల చేయ‌నున్న‌ట్టు చెప్పారు నిఖిల్‌.

కార్తికేయ 2 లో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ ఖేర్ తో పాటు ఆదిత్యా మీన‌న్‌, హ‌ర్ష చెముడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. కార్తీక్‌ ఘట్టమనేని కెమెరామెన్‌. కార్తికేయ 2 ను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి కథ – స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం ప్రేక్షకులకి సినిమా అంటే అయితే భారీ బడ్జెట్ చిత్రం అయినా అయి ఉండాలి లేదా ఏదో ఒక ఆసక్తికరమైన విషయం ఉంటేనే సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఆ రకంగా చూసుకుంటే కార్తీకేయ 2 సినిమాకి సీక్వెల్ అనే అంశంతో పాటు ద్వారకా నేపథ్యంలో శ్రీ కృష్ణుని జీవితం గురించిన రహస్యాన్ని కథగా ఎంచుకోవడం వల్ల చక్కని హైప్ మరియు భారీ అంచనాలు నెలకొన్నాయి.

Prakash Raj Plans on Directing a Political Film

0

Prakash Raj is not just an actor, he is a good director too. He has done a few films which were critically acclaimed by the audience. He is planning to do another movie which revolves entirely around politics. Prakash Raj is active in politics and we can see him questioning the central government about different schemes, etc.

Now, he is in plans to direct and act in a film that reflects the political situation in India. There is no denial that this movie will surely focus on Central Government. We have to wait and see how this movie is going to pan out.

Prakash Raj has always chosen those topics that are unique and will be thought provoking when he is directing any movie. Right now he is busy as an actor with his upcoming movies Ponniyan Selvan, Varisu and various other films.

He has given an interview recently and discussed about various things starting from his upcoming works to the movies that he regret doing and many more.

RRR Movie: ఇప్పటికీ తగ్గని ఆర్ ఆర్ ఆర్ హవా

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా.. తెలుగు సినీ దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ అత్యంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం మన దేశంలోనే కాక అంత‌ర్జాతీయం గానూ ఎంతో ఖ్యాతిని సంపాదించింది ఆర్ ఆర్ ఆర్ చిత్రం.

పాన్ ఇండియా సినిమాగా ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరును చాటుతోంది ఈ సినిమా. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కులుగా డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుద‌లై దాదాపు పన్నెండు కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డులు క్రియేట్ చేసింది.

థియేట‌ర్ల‌లోనే కాకుండా ఓటీటీలో విడుదలైన తరువాత కూడా ఆర్ ఆర్ ఆర్ తన జోరును కొనసాగించింది. తెలుగుతో పాటు ఇతర దక్షిణ భాషల హక్కులను జీ5 (Zee 5) సొంతం చేసుకోగా.. హిందీ మరియు అంతర్జాతీయ వెర్షన్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ (Netflix) దక్కించుకుంది. ఇక నెట్ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ సరికొత్త రికార్డులని సాధించింది. నెట్‌ఫ్లిక్స్‌లో నాన్ ఇంగ్లీష్ సినిమాల కేటగిరీలో వరుస‌గా మూడు వారాల పాటు ఎక్కువ వీక్షకులు చూసిన సినిమాగా రికార్డు సృష్టించింది.

అలాగే ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతి ఏడాది ఎంపిక చేసే ఉత్తమ సినిమాల జాబితాలో నిలిచి చరిత్ర సృష్టించింది ఆర్ ఆర్ ఆర్. నెట్ ఫ్లిక్స్‌లో విడుదలైన రోజు నుంచి ఈ సినిమాపై హాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు టెక్నీషియన్స్‌ కూడా పొగడ్తలు కురిపిస్తున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్కాట్ డెర్రిక్‌స‌న్ ఈ వరుసలో చేరాడు.

మార్వెల్‌ కామిక్స్‌లో ‘డాక్టర్‌‌ స్ట్రేంజ్’ దర్శకుడు అయిన స్కాట్ సోషల్‌ మీడియాలో ‘ఆర్ఆర్ఆర్’ ను పొగుడుతూ పోస్ట్ పెట్టారు. ‘నా బర్త్ డే సందర్భంగా భార్యపిల్లలతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూశాను. చాలా నచ్చింది. ఇదో అద్భుతమైన రోలర్‌‌ కోస్టర్’ అంటూ ట్వీట్ చేశారు.

మరోవైపు చాలామంది విదేశీ ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ సినిమాపై ఇప్పటికీ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో ఇంటర్వల్ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ పులులతో బ్రిటీష్ ప్యాలెస్ లోకి చొరబడి దాడి చేసే సన్నివేశం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసినదే. తాజాగా ట్విట్టర్ లో ఆ విడియోను ఒక హాలీవుడ్ నెటిజన్ షేర్ చేస్తూ “నేను ఇంతవరకూ 29 మార్వెల్ సినిమాలు చూసాను.. కానీ ఆర్ అర్ ఆర్ లో ఎన్టీఆర్ ట్రక్ లో పులులతో దాడి చెసే అంత అద్భుతమైన షాట్ జీవితంలో చూడలేదు” అని పోస్ట్ చేశారు. ఆ వీడియో ఏకంగా 1 Million వ్యూలు సంపాదించుకోవడం విశేషం.

Expected 30 Cr Profit, Ended up with 3-4 Cr Losses: Dil Raju

0

Jersey was one such movie that attracted audience of all ages in Telugu. The movie was one of the best performances of Nani’s career and has been a favorite for everyone. At box office also, the movie did at its best. This has intrigued the Bollywood hero Shahid Kapoor. He wanted to remake the movie in Hindi. Producer Dil Raju along with Geetha Arts produced this movie and Jersey original director Gautham Tinnanuri directed it in Hindi too.

Mrunal Thakur played as the lead actress opposite Shahid Kapoor. The movie had lot of expectations. However, with COVID and various other factors, it kept on postponing. It finally hit theatres in April, 2022.

However, due to wrong time release and other issues, the movie didn’t perform well at box office. Producers expected a profit of 30 crores but ended up with 3-4 crore losses. This is something that has made Dil Raju rethink about his movies. He understood that the COVID pandemic, OTT access has changed the mindset of audience a lot and it is not that easy to attract the audience to theaters right now.

He also added that the pandemic has huge impact on the movie industry.

Dil Raju says Tollywood Heros are Gold, They will understand any situation

0

Dil Raju gave an interview to the media. As his next movie, Thank You, the film is going to hit theatres soon; he wanted to interact with the media. In this interaction he discussed about various things. One of those things was about Tollywood heroes.

He praised them a lot. He told that our star heroes despite the stardom are quite down to earth and are very reliable. Dil Raju mentioned that hero Ram Charan called him to know about how the industry is doing and what is the reception of audience now.

As he explained all of this, Ram Charan understood the situation and was quite emphatetic about it too. He claims that the star heroes, tier-2 heroes, everyone are very good at understanding things and are ready to get compromised a bit when needed.

Dil Raju referred to our heroes as Gold. This came right from the heart of Dil Raju and there is no doubt about that.

డీజే టిల్లుకి డైరెక్టర్ తో లొల్లి

0

ఈ ఏడాది తెలుగు సినిమా పరిశ్రమ నుండి వచ్చిన సూపర్ హిట్ చిత్రాలలో “డీజే టిల్లు”సినిమా ఒకటి. చిన్న సినిమాగా విడుదలైనా, ‘డీజే టిల్లు’ బాక్సాఫీస్‌ వద్ద అందరికీ లాభాలు తెచ్చి పెట్టింది. సిద్ద జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 12న రిలీజ్‌ అయి భారీ విజయం సాధించింది.

లైఫ్‌ బిఫోర్ వెడ్డింగ్‌, గుంటూరు టాకీస్‌, మా వింత గాధ వినుమా, కృష్ణ అండ్‌ హిజ్‌ లీల వంటి చిత్రాలలో నటించిన సిద్ధు జొన్నల గడ్డ.. నిజానికి పదమూడేళ్ళ క్రితం విడుదలైన నాగ చైతన్య తొలి చిత్రం అయిన “జోష్” చిత్రంలో ఒక పాత్రలో తెరంగేట్రం చేశారు.ఆ తరువాత రామ్ చరణ్ హీరోగా చేసిన “ఆరెంజ్” సినిమాలో సహాయక పాత్రలో నటించారు. అలా అడపాదడపా చిన్న పాత్రలు, అలాగే హీరోగా నటిస్తూ వచ్చిన సిద్ధు గత ఏడాది ఓటీటీలో విడుదలైన “కృష్ణ అండ్ హిజ్ లీల” చిత్రంతో చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇక ఈ యువ హీరోకు ‘డీజే టిల్లు’ సినిమాతో ఇన్నేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో పేరొచ్చింది. ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే సినిమాకి మంచి హైప్ ఉన్నప్పుడే సీక్వెల్‌ కూడా ప్రకటించి ప్రేక్షకులను ఆనంద పరిచారు దర్శక నిర్మాతలు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘డీజే టిల్లు’ దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ ‍ప్రారంభమైన తర్వాత దర్శకుడు విమల్, హీరో సిద్ధు మధ్య స్క్రిప్ట్ విషయంలో అభిప్రాయ భేదాలు చోటు చేసుకున్నాయట. అందువల్ల దర్శకుడు విమల్‌ కృష్ణ ఈ సీక్వెల్‌ నుంచి తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇప్పుడు ఈ సీక్వెల్‌కు హీరో సిద్ధు నే స్క్రిప్ట్ సరిదిద్దే భాద్యతలు చూసుకుంటున్నారట. ఇదివరకు “కృష్ణ అండ్ హిజ్ లీల” “మా వింత గాథ వినుమా” సినిమాలకు కూడా స్క్రిప్ట్ వర్క్ లో సిద్ధు పాల్గొన్నారు. ఇప్పుడు దర్శకుడు విమల్‌ స్థానంలో కొత్త దర్శకుడు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో డీజే టిల్లు చిత్ర యూనిట్ నుండి ఈ విషయం పై ప్రకటన ఇవ్వనున్నట్లు సమాచారం.

Telugu Producers Council meeting: నిర్మాతల మండలి కీలక సమావేశం ప్రకటన

0

కరోనా తరువాత తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటూ వస్తుంది. ఒక వైపు నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. మరో వైపు సినిమాల నిర్మాణం నెలల తరబడి వాయిదా పడటం వంటి కారణాలతో నిర్మాతలకు పలు రకాల సమస్యలు ఎదురయ్యాయి. అయితే ఈ ఏడాది వేసవిలో ఆర్ ఆర్ ఆర్ , కేజీఫ్ 2 వంటి పాన్ ఇండియా సినిమాలతో పాటు సర్కారు వారి పాట వంటి అగ్ర హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు నమోదు చేసి కాస్త ఊపిరి పోయడంతో మెల్లగా ఒక క్రమంలో పునరుద్ధరణ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

ఆ రకంగా పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ సంచలనం సృష్టించాయి. ఆ తరువాత అగ్ర హీరోలు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు తీయాలనే ఆలోచనతో ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా పెరగడం మొదలు పెట్టింది.

దీనికి తోడు ఇదివరకే చెప్పుకున్నట్లు ప్రేక్షకులు టాక్ చాలా బాగుంటేనే థియేటర్లకు వస్తున్నారు.ఇందుకు పెరిగిన టికెట్ ధరలు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. వాటి ప్రభావం వల్ల సినిమాలు కేవలం తొలి మూడు రోజులు మాత్రమే సరైన విధంగా కలెక్షన్లు రాబడుతున్నాయి. ఆ తరువాత ఎంతో హైప్ ఉన్న సినిమాలు తప్ప మిగతా రోజులలో కలెక్షన్లు రావడం లేదు.

ఇక పెరిగిన నిర్మాణ వ్యయం, ఆర్టిస్ట్ ల రికార్డు స్థాయి రెమ్యూనరేషన్లు మరియు టెక్నీషియన్ల పారితోషికాలు, ఓటీటీ ప్రభావం, వీపీఫ్ ఛార్జీలు వంటి అనేక సమస్యలు నిర్మాతలను చుట్టు ముట్టాయి.

దీనిపై నిర్మాతలంతా ప్రత్యేకంగా ఓ భేటీని ఏర్పాటు చేసుకుని కూలంకషంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలనే ఆలోచనలో వున్నారట.ఈ మేరకు జూలై 21న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ప్రత్యేకంగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించ బోతోంది.

ఈ విషయాన్ని వెల్లడిస్తూ అధికారిక ప్రకటన కూడా చేశారు. ఈ భేటీలో పైన చెప్పుకున్న సమస్యలతో పాటు ఫైటర్స్ యూనియన్ ఫెడరేషన్ సమస్యలు.. నటీనటుల రెమ్యూనరేషన్ లపై కూడా చర్చ జరపనున్నారట. మరి ఈ నెల 21న జరగనున్న నిర్మాతల మండలి కీలక సమావేశంలో ఎలాంటి నిర్ణయాల్ని తీసుకుంటారో చూడాలి.

Telugu Film Producers Council Conducting A Meeting To Revive The Theatrical Market

0

It is common news now that the theatrical market has suffered a lot in the recent few years due to COVID-19. The concerned members have been actively trying to solve this problem but nothing seems to be helping.

The Telugu Film Producers Council has conducted several meetings to tackle this issue but no conclusive solution has been obtained. The council is now planning to conduct another meeting to tackle a lot of issues surrounding the theatrical market.

In a press note that was released today, the members of the council have been asked to meet on 21st July 2022 to discuss the following agenda. A special general body meeting will take place at Hyderabad in the Filmnagar Housing Complex.

The agenda of the special general body meeting will be to discuss the various aspects surrounding the theatrical business. The council will discuss the role of OTT in the theatrical revenue model, VPF charges, Role of Managers, Artists/Technician issues.

They will also be discussing the ticket rates being imposed on big and medium-budgeted movies. Working conditions, rates as well as the cost of production will also be given special emphasis. It is also mentioned that the meeting will involve the matters of Fighters Union and Federation issues.

New Trend in Tollywood: టికెట్ రేట్లు తక్కువ చేసిన థాంక్యూ టీమ్

0

యువ సామ్రాట్ అక్కికేని నాగ చైత‌న్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దిల్‌రాజు ప్రొడ‌క్షన్ అసోసియేష‌న్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేష‌న్‌తో శ్రీమ‌తి అనిత స‌మ‌ర్పణ‌లో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. జూలై 22న సినిమా విడుదలవుతుంది. ఈ సంద‌ర్భంగా శ‌నివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది.

అయితే ఇటీవలే తెలుగు సినిమా ప్రచార పద్ధతుల్లో ఒక కొత్త ఒరవడి మొదలుపెట్టారు సినీ వర్గాలు. అదేంటంటే మా సినిమా టికెట్ రేట్లు తగ్గించాం.. దయచేసి సినిమా చూడండి అని ప్రచారం చేయడం. కరోనా దాడుల తరవాత సినిమాలు మళ్ళీ యధావిధిగా విడుదల అవుతున్న నేపథ్యంలో అత్యాశకు పోయి టికెట్ రేట్లు అమాంతం పెంచేశారు.. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరీ ఎక్కువగా రేట్లు పెంచారు.

ఇప్పుడు చేసిన తప్పుకు పరిహారంగా, సినిమా విడుదలకు ముందు టికెట్ రేట్లను తగ్గించిన విషయాన్ని ప్రచార సాధనంగా ఉపయోగించు కుంటున్నారు.

ఈ నెలలోనే విడుదలైన పక్కా కమర్షియల్ మరియు హ్యాపీ బర్త్ డే చిత్రాలకు కూడా ఈ విధంగా ప్రకటించారు. అయితే పక్కా కమర్షియల్ సినిమా పేరుకే టికెట్ రేట్లు తగ్గించారు అని చెప్పారు కానీ కేవలం 50 రూపాయల వరకే తగ్గించారు.

ఇప్పుడు “థాంక్యూ” సినిమాకి కూడా ఇదే తరహా ప్రచారం చేస్తున్నారు. చిత్ర యూనిట్ చెప్పిన సమాచారం ప్రకారం సింగిల్ స్క్రీన్ – 100(ఎక్సీఎల్ GST) గానూ మల్టీప్లెక్స్ – 150( excl GST) గానూ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ రేట్లు నిజంగా అమలు అవడం కష్టమే. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని సినిమాలకు సింగిల్ స్క్రీన్ లకు దాదాపు 150/- .. మల్టీప్లెక్స్ లకు 180/- ఫిక్స్డ్ రేట్లు అమలులో ఉంటున్నాయి. అంతకంటే అవసరం అయితే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎటొచ్చీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం చిన్న పిల్లల ఆటకు మాదిరి ఒక్కో సినిమాకి ఎక్కువ తక్కువ అంటూ సిల్లీగా వ్యవహరిస్తున్నారు.

Jai Bhim: హీరో సూర్య పై కేసు కొట్టివేసిన మద్రాస్ హై కోర్టు

0

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్. గత ఏడాది అమెజాన్ లో నేరుగా ఓటీటీ రిలీజ్ గా వచ్చిన ఈ చిత్రం భారీ స్థాయిలో ప్రాచుర్యం పొందింది. కేవలం సూర్య అభిమానులనే కాదు భాషలకు అతీతంగా ప్రేక్షకులను మెప్పించింది. గిరిజ‌నుల‌కు అండ‌గా నిలుచున్న లాయ‌ర్ చంద్రు పాత్ర‌లో హీరో సూర్య న‌టించారు. న‌టుడి గానే కాదు నిర్మాత‌గానూ ఆయ‌న ఎప్పుడూ కొత్త కథలను, సినిమాలని ప్రోత్సహిస్తూ ఉంటారు.

ఆ కోవలోనే 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వంలో ‘జై భీమ్‌’ సినిమాను రూపొందించారు. పోలీసులు, కేసులు, అంటూ సాగే ఈ సినిమా సామాజిక అస‌మాన‌త‌లు, ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం త‌క్కువ‌గా చూడటం అనే అంశాల నేపథ్యంలో రూపొందించబడింది. రాజ్యాంగం కల్పించిన హ‌క్కులు అంద‌రికీ అందుబాటులో ఉండ‌టం లేదనే అంశంతో, వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా జై భీమ్. అయితే ఈ సినిమాకు ఎన్నో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఆ విమర్శల్లో భాగంగానే హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక పై గతంలో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. జై భీమ్ సినిమాలో తమ కులాన్ని, మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ కోర్ట్ ని ఆశ్రయించారు రుద్ర వన్నియార్ కుల చత్రియార్ సంఘం అధ్యక్షుడు సంతోష్ నాయక్. సినీ నిర్మాతలు, హీరో సూర్య, నటి జ్యోతికపై సంతోష్ నాయక్ సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ వెంటనే ఇరువురి పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

అయితే ఈ కేసు విషయంలో సూర్యనే గెలిచారు.సూర్య – జ్యోతిక పై పెట్టిన కేసును మద్రాసు హై కోర్టు కొట్టివేసింది. హీరో సూర్య పై ఎలాంటి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదని ఈ మేరకు హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు ఖచ్చితంగా హీరో సూర్యకు, ఆయన అభిమానులకు సంతోషాన్ని ఇస్తుంది.