Home Blog Page 2168

లైగర్ దెబ్బతో పూరి కనెక్ట్స్ కథ ముగిసినట్లేనా?

0

బాక్సాఫీస్ వద్ద లైగర్ దారుణమైన ఫలితం చవిచూసిన తర్వాత, పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్‌ల మధ్య సంబంధం చెడినట్లుగా తెలుస్తోంది. ఇక పై ఛార్మీ కౌర్‌తో కలిసి పని చేయడం జగన్‌కు ఇష్టం లేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రస్తుతం బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. తమకు బాగా నచ్చే, తాము బాగా మెచ్చే సినిమాలు మరియు కాన్సెప్ట్ లను స్వతంత్రంగా తెరకెక్కించాలనే ఉద్దేశ్యంతో.. తమకంటూ ఒక హోమ్ బ్యానర్‌లో సినిమాలను నిర్మించాలనే ఆలోచనతో ఇద్దరూ కలిసి తమ ప్రొడక్షన్ హౌస్ పూరి కనెక్ట్స్‌ని స్థాపించారు.

అయితే ఇప్పుడు లైగర్ సినిమా అనూహ్యంగా భారీ డిజాస్టర్ గా నిలిచిన నేపథ్యంలో.. పూరి ఈ బ్యానర్ నుంచి విడిపోవాలనుకుంటున్నారని సమాచారం. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, పూరి ఇక పై సినిమాల నిర్మాణ వ్యవహారాలలో భాగం కావడానికి ఇష్టపడటం లేదట. కేవలం తన సినిమాల స్క్రిప్ట్ వర్క్ మరియు కథా విస్తరణ పై మాత్రమే పూరి దృష్టి పెట్టాలనుకుంటున్నారట. ప్రొడక్షన్ వర్క్ పనుల వల్ల తన టైం బాగా తగ్గిపోతూ.. దాని ప్రభావం స్క్రిప్ట్ వర్క్ పై పడుతున్నట్లు ఆయన భావిస్తున్నారు.

అయితే, ఛార్మీ కౌర్ మాత్రం ఇప్పటికీ పూరి కనెక్ట్స్‌ని కొనసాగించాలని కోరుకుంటున్నారు. కాగా ఇటీవలే సోషల్ మీడియాలో.. పూరి కనెక్ట్స్‌ని మరింత మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తున్నానని ఆవిడ పేర్కొన్నారు. కానీ దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఇక పై సినిమాలు నిర్మించే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ఒకవేళ ఇదే గనక నిజం అయితే.. పూరి లేకుండా ఛార్మీ ప్రొడక్షన్ హౌస్‌ని కొనసాగిస్తారా లేక తను కూడా శాశ్వతంగా ప్రొడక్షన్ వర్క్ నుండి తప్పుకుంటారా అనేది చూడాలి.

ఇదిలా ఉండగా, లైగర్ భారీ పరాజయం మరియు దాని ఫలితం వల్ల మార్కెట్ లో తన ఇమేజ్ పై పడ్డ ప్రభావం కారణంగా పూరి జగన్నాథ్, ఎప్పటి నుంచో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కించాలని అనుకుంటున్న జనగణమన సినిమా గందరగోళంలో పడింది. ఇప్పుడు జనగణమన సినిమా తీయాలంటే పూరికి బడ్జెట్ కు సరిపడా డబ్బు కావాలి.

ఆ రకంగా చూసుకుంటే పూరికి లైగర్ సినిమా తాలూకు నష్టాలు చాలవన్నట్లు ఇప్పుడు జనగణమన సినిమా విషయంలో ఒక అనిశ్చితి నెలకొంది. దానికి తోడు విజయ్ దేవరకొండ జనగణమన సినిమాని వదిలేసి తన పని తాను చూసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది, ఇల రకరకాల సమస్యలు చుట్టూ చేరి పూరిని కలవరపెడుతున్నాయి

సూర్య – శంకర్ కాంబినేషన్లో 1000 కోట్ల భారీ బడ్జెట్ సినిమా

0

తమిళ హీరో సూర్య మరియు దక్షిణ భారత దిగ్గజ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్లో ఒక భారీ సినిమా ఉంటుందనే వార్త ఒకటి కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం గట్టిగా వినిపిస్తుంది. తమిళ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ నవలల్లో ఒకటైన వేల్పారి ఆధారంగా తెరకెక్కించే సినిమాను వీరిద్దరూ కలిసి నిర్వహించనున్నట్లు సమాచారం.

తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి విడుదలకు సిద్ధంగా ఉన్న పొన్నియిన్ సెల్వన్‌ సినిమా, తమిళ నాట భారీ ప్రాచుర్యం పొందిన కల్కి నవల ఆధారంగా రూపొందించారు. ఇప్పుడు అదే కోవలో, వేల్పారి అనే నవల ఈనాటికీ తమిళ ప్రజలు ఎంతగానో ఇష్టపడే ఒక ఐకానిక్ నవల. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పొన్నియిన్ సెల్వన్‌ నవలతో పోలిస్తే వేల్పారి నవలకే అభిమానుల సంఖ్య ఎక్కువగా ఉంది.

వేల్పారి నవల సంగం యుగానికి చెందినది. మరియు వేలిర్ వంశానికి పాలకుడైన వేల్పారి కథను ఈ నవల చెబుతుంది. వేల్పారి ప్రాచీన తమిళకంలోని పరంబు నాడు మరియు ఇతర పరిసర ప్రాంతాలను పాలించాడు. ఈ నవలను అకాడమీ అవార్డు గ్రహీత రచయిత సు వెంకటేశన్ రాశారు. ఈ నవల తమిళ ప్రజలకు ఎంతగానో ప్రీతి పాత్రమైనది, వారి హృదయాలలో ఎప్పుడూ ఈ నవలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ పీరియాడికల్ డ్రామాను తమిళ స్టార్ హీరో సూర్య, భారీ బడ్జెట్ మరియు హంగామా గల చిత్రాలను అందించడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న దర్శకుడు శంకర్‌లు కలిసి తెరకెక్కించనున్నారు. కాగా వేల్పారి నవల చాలా వైవిధ్యమైన తరహాలో ఉంటూ అద్భుతంగా వ్రాసిన పాత్రలతో నిండి ఉన్న నవల.

అందువల్ల నిజంగా ఆ నవలను సినిమాగా తీస్తే మాత్రం ఈ చిత్రానికి భారీ స్థాయిలో స్టార్ తారాగణం అవసరం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. పొన్నియిన్ సెల్వన్ లాగానే, వేల్పారి ప్రపంచంలో కూడా కథలో చాలా ముఖ్యమైన స్త్రీ పాత్రలు కూడా ఉన్నాయి. మరి నిజంగా ఈ సినిమా రూపు దాల్చితే మరో భారీ మల్టీస్టారర్ సినిమా చూసే అవకాశం అటు తమిళ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకలకు కూడా దక్కుతుంది.

కాగా ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు అని ట్రేడ్ వర్గాల ద్వారా అంచనా వేయబడింది, ఇది నిజంగానే భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధికం. ఇక ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శంకర్ ఇప్పటికే నటీనటులు మరియు ఇతర సిబ్బందిని వెతకడం ప్రారంభించారట.

స్టార్ డైరెక్టర్లు మాత్రమే కావాలి అంటున్న తెలుగు హీరోలు

0

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రస్తుతం సరిహద్దులు దాటి తన ఖ్యాతిని మరియు స్థాయిని ప్రపంచ వ్యాప్తంగా ఆదరణను పొందుతుంది. ఈ క్రమంలో తెలుగు హీరోలకు తమ స్టార్ డం ను పెంచుకునే అవకాశం లభించింది. ఈ దశలో ప్యాన్ ఇండియా స్టార్ హోదాను సాధించిన ప్రస్తుత హీరోలలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు జూ.ఎన్టీఆర్ మొదటి వరుసలో ఉంటారు.

వీరు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా తమకంటూ ఓ ఇమేజ్‌ని సంపాదించుకున్నారు.ఇక ఇంతటి భారీ పాన్-ఇండియా స్థాయి బ్లాక్‌బస్టర్‌లను సాధించిన తర్వాత, ఇక పై చేసే సినిమాల విషయంలో చాలా జాగర్తగా ఉండాలి అని ఏ నటుడైనా అనుకోవడం సహజమే కదా. తమ ప్రతిభను అద్భుతంగా చూపించేందుకు విపరీతమైన మార్కెట్ సిద్ధంగా ఉండగా, కేవలం తెలుగు సినిమాల వరకే కట్టుబడి ఉండడం అంత తెలివైన నిర్ణయం అనిపించుకోదు. అందుకే ప్రస్తుతం మన ప్యాన్ -ఇండియన్ స్టార్స్ అందరూ పరిశ్రమలో అంతగా స్థిరపడని, లేదా కొత్తగా అనుభవం లేని దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపటం లేదు. తమకంటూ ఒక స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులతో మాత్రమే పని చేయాలని అనుకుంటున్నారు.

నిజానికి, అల్లు అర్జున్, రామ్ చరణ్ మరియు జూ.ఎన్టీఆర్ ఇదే కారణంగా తాము ఇంతకుముందే ఓకే చేసిన సినిమాలను రద్దు చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమా విడుదలకు ముందే వేణు శ్రీరామ్‌తో ఐకాన్ అనే చిత్రానికి కమిట్ అయ్యారు. అయితే పుష్ప సినిమా భారీ స్థాయిలో ప్యాన్ – ఇండియా విజయం సాధించిన తర్వాత, అల్లు అర్జున్ ఐకాన్ సినిమా నుండి తప్పుకున్నారు. కాగా ప్రస్తుతం ఆయన విస్తృతమైన రీచ్ తో పాటు అన్ని విధాలుగా బలమైన మార్కెట్ మరియు ఇమేజ్ ఉన్న దర్శకుడితోనే పనిచేయాలని ఆయన అనుకుంటున్నారు.

ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఒక భారీ బడ్జెట్ యాక్షన్ సినిమాను చేయాల్సి ఉంది. అయితే రామ్ చరణ్ కూడా అవే కారణాల వల్ల గౌతమ్ తో సినిమాను రద్దు చేసుకున్నట్లు సమాచారం. చరణ్ ఇప్పటికే శంకర్ తో RC15 షూటింగ్‌లో ఉన్నారు. తర్వాత సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలి అన్న ఆలోచనలో ఉన్నారట. ఆ విధంగా ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో బాగా పేరు తెచ్చుకున్న దర్శకులతో మాత్రమే పనిచేయాలనుకుంటున్నారు.

అదే విధంగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా కంటే ముందు బుచ్చి బాబు సనాతో ఒక చిత్రాన్ని చేయాల్సి ఉంది, అయితే ఆర్ ఆర్ ఆర్ సినిమాకు లభించిన గ్లోబల్ రీచ్ తర్వాత బుచ్చిబాబుతో సినిమాను ఎన్టీఆర్ రద్దు చేసినట్లు తెలుస్తోంది.

Kollywood Buzz: Suriya And Shankar Joining Hands For A 1000 Crores Budget Film; Never Before In Indian Cinema

0

There is a strong buzz among the Kollywood circles regarding a possible massive collaboration between Suriya and director Shankar. The duo will reportedly be handling the adaptation of one of the most iconic novels in Tamil history, titled Velpari.

We have also recently seen Mani Ratnam’s Ponniyin Selvan, which is an adaptation of Kalki’s novel Ponniyin Selvan. Along the same lines, Velpari is an iconic novel that is celebrated to this day. In fact, Velpari seems to have a stronger fanbase as compared to Ponniyin Selvan.

Velpari is set in the Sangam era and tells us the story of Velpari, who was a ruler of the Velir lineage. Velpari ruled Parambu Nadu and other surrounding regions in ancient Tamilakam. The novel has been written by academy award-winning writer Su Venkatesan. It is a celebrated subject and is very close to the hearts of Tamilians also.

According to trade circles, Suriya and Shankar will collaborate on this period drama. The film will need a lot of star cast as the novel is filled with a wide variety of superbly written characters. Just like Ponniyin Selvan, the world of Velpari also has a lot of significant female characters that have a lot of importance in the story. The budget of the film is supposedly 1000 crores which is the highest ever for any Indian film. Shankar has already started scouting for the cast and crew.

పాజిటివ్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద పుంజుకున్న ఓకే ఒక జీవితం

0

శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’. అయితే విడుదలకు ముందు చాలా తక్కువ బజ్ మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదలైంది. ఆకట్టుకునే ట్రైలర్ తో పాటుగా.. విడుదల దగ్గరయ్యే కొద్దీ సినిమాకు ప్రచారం కూడా బాగా చేశారు. అయినప్పటికీ, ఈ చిత్రానికి మార్నింగ్ మరియు మ్యాట్నీ షోల వరకు ధియేటర్ల వద్ద ప్రేక్షకుల సంఖ్య చాలా తక్కువగా నమోదయింది.

అయితే సాయంత్రం షోల నుండి ఈ చిత్రం కలెక్షన్లను పెంచుకోవడం పట్ల ఒకే ఒక జీవితం చిత్ర బృందం చాలా సంతోషం ఉంది. ఈ చిత్రం ఫస్ట్ షోల నుంచి ఎదుగుదలను సాధించింది. ఇక సెకండ షోల వద్ద అయితే మరింత అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. సెకండ్ షోలు చాలా ఏరియాల్లో హౌస్‌ఫుల్ గా నమోదు చేయటం విశేషం.

బ్రహ్మాస్త్ర సినిమా వల్ల నిజానికి గట్టి పోటీ ఎదురైనప్పటికీ, ఒకే ఒక జీవితం కంటెంట్ లో ఉన్న బలం వల్ల నిలవగలిగింది. ఆరంభంలో చిన్నపాటి ఎదురుదెబ్బ తిన్నా, తిరిగి మళ్లీ పైకి లేచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పుంజుకుంది. సినిమాకి ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ టాక్ కారణంగానే ఇది సాధ్య పడిందని చెప్పాలి. అటు విమర్శకులు ఇటు సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏకగ్రీవంగా ఇష్టపడ్డారు. కాగా ఈ సినిమాని మెచ్చిన ప్రేక్షకులు ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అనే టాగ్ తో పిలుస్తున్నారు. టైమ్ ట్రావెల్ వంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ కు తోడు తల్లి కొడుకుల మధ్య భావోద్వేగ అనుబంధం చాలా చక్కగా మిళితం చేయబడిన ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అని చెప్పాలి. దాదాపు సినిమా చూసిన వారందరూ కూడా చాలా బాగుందనే టాక్ చెప్తున్నారు.

ఈ స్పందన చూస్తుంటే, ఓకే ఒక జీవితం క్రమంగా తన కలెక్షన్లను ఇదే స్థాయిలో పెంచుకుని మూడు రోజులకే బాక్సాఫీస్ వద్ద చాలా సునాయాసంగా బ్రేక్ ఈవెన్‌ సాధించవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా. సాధారణంగా చిన్న సినిమాలకు విడుదలకు ముందు పెద్దగా హైప్ ఉండదు కాబట్టి, వాటి ఫలితం ఎక్కువగా ప్రేక్షకులు చెప్పే టాక్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే అలాంటి సినిమాలకు మొదటి రోజు కన్నా తర్వాత రోజులలో కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఓకే ఒక జీవితం సినిమా కూడా మొదటి రోజు కంటే రెండవ రోజు మరిన్ని కలెక్షన్లను రాబట్టి, మూడవ రోజు అంతకన్నా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ తో పాటు ప్రియదర్శి, వెన్నెల కిషోర్, రీతూ వర్మ మరియు అద్భుతమైన తల్లి పాత్రలో అమల అక్కినేని నటించారు. శ్రీ కార్తీక్ ఈ చిత్రానికి రచయితతో పాటు దర్శకుడిగా కూడా వ్యవహరించారు. కాగా వర్ధమాన నటుడు మరియు దర్శకుడు అయిన తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాయగా, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించారు.

Telugu Heroes Only Looking For Star Directors After Pan-Indian Blockbusters

0

The current stars in the Telugu Film Industry who have achieved true Pan-Indian status are Prabhas, Allu Arjun, Ram Charan, and JR.NTR. They have made an image for themselves not only in the two Telugu states but also in the North and some, even overseas.

After scoring such huge Pan-Indian blockbusters, no actor wants to do regional movies anymore. When they have a huge market to play with, it does not make sense for the actor to stick to only making Telugu films. As a result, all the Pan-Indian stars are not looking to collaborate with unestablished directors in the industry. They only want to work with directors with a certain brand value.

In fact, Allu Arjun, Ram Charan and JR.NTR have canceled some of their projects due to this reason. Allu Arjun had committed to a film called ICON with Venu Sriram before the release of Pushpa. After the humungous Pan-Indian success of Pushpa, Allu Arjun has backed out of ICON. He wants to work with a director who has a huge reach and a strong market.

Even Ram Charan had signed a script with Jersey director Goutam Tinnanuri but he has canceled the project due to the same reasons. He is already shooting for Shankar’s RC15 and does not want to scale down from there. He only wants to work with more established directors in the Indian film industry. Similarly, JR.NTR had signed a film with Buchi Babu Sana but he canceled that project after RRR’s global reach.

బాక్సాఫీస్ వద్ద ఆల్-టైమ్ నాన్-హాలిడే రికార్డ్ ఓపెనింగ్‌ను నమోదు చేసిన బ్రహ్మాస్త్ర

0

రణబీర్ కపూర్ హీరోగా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర తొలి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ మరియు పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు, ఓపెనింగ్ ను సాధిస్తుంది అన్న అంచనాలు విడుదలకు ముందే ఏర్పరచుకుంది. ఆ క్రమంలో హిందీ సినిమాల్లో ఆల్ టైమ్ నాన్-హాలిడే రికార్డ్ ఓపెనింగ్‌ను నమోదు చేసింది.

బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్‌తో సతమతమవుతున్న బాలీవుడ్‌ ఇండస్ట్రీ, బ్రహ్మాస్త్ర సినిమాతో పుంజుకుంటుంది అని ట్రేడ్ వర్గాల్లో చాలా అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకొని ఈ సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ ను సాధించడం బాలీవుడ్ వర్గాలకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయం. కాగా ఈ చిత్రానికి ఓవర్సీస్ మరియు ఇతర భాషలలో కూడా అద్భుతంగా ఓపెనింగ్స్ వచ్చాయి, ముఖ్యంగా తెలుగులో చాలా మంది టైర్-2 తెలుగు హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ సాధించడం విశేషం.

బాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర చాలా ఏళ్ళ పాటు దర్శకుడు అయాన్ ముఖర్జీ పడిన కష్టానికి ప్రతిఫలంగా రూపొందింది. ఈ చిత్రంలో అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున కూడా కీలక పాత్రల్లో నటించారు. ఫాంటసీ అడ్వెంచర్ జానర్ లో తెరకెక్కిన చిత్రం ప్యాన్-ఇండియా స్థాయిలో విడుదలైంది. ఇక దర్శకుడు అయాన్ ముఖర్జీ మరియు నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ చిత్రాన్ని మరింతగా ప్రచారం చేయడంలో నిమగ్నమై ఉన్నారు.

రణబీర్ కపూర్ నటించగా ఇటీవలే విడుదలైన షంషేరా సినిమా దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. అలాంటి ఫలితం తర్వాత భారీ హిట్ సాధించే దిశగా బ్రహ్మాస్త్రకు మంచి ఓపెనింగ్స్ రావడం అయననే కాకుండా మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఎంతో సంతోషపరిచే విషయం.

తొలి రోజు బాక్స్ ఆఫీసు వద్ద ఘనంగా ఆరంభమైన ఈ చిత్రం వీకెండ్ వరకూ 100 కోట్ల మ్యాజికల్ నంబర్ ను దాటుతుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. మరి వారి అంచనాలకు మించి బ్రహ్మాస్త్ర సినిమా తన లాంగ్ రన్ ను కొనసాగించాలి అని కోరుకుందాం.

Liger- The End Of Puri Connects? Disputes Between Puri Jagan And Charmee Kaur

0

After the disastrous result of Liger at the box office, Puri Jagan and Charmee Kaur’s relationship is not that great. There has been strong news in the industry circles now that Puri Jagan does not want to work with Charmee Kaur anymore. The duo jointly founded their production house Puri Connects with the idea of producing films under the home banner. But now, after Liger, Puri wants to separate himself from Puri Connects.

According to inside information, Puri does not want to involve himself in the production aspects of films anymore. He wants to solely focus on the script work and the writing of his films. He feels that the production work is letting down his writing and script work.

However, Charmee Kaur still wants to continue Puri Connects. Puri Jagan has made it clear that he is not interested in producing films anymore. It is to be seen whether Charmee will continue the production house without Puri or back out from the production work.

Because of this debacle, Puri Jagan’s dream project Jana Gana Mana seems to be in turmoil. There is a lot of uncertainty about the project as there are many losses that need to be compensated, which means that Puri will need funds to make Jana Gana Mana. In addition to that, it looks like Vijay has canceled Jana Gana Mana, which has added to Puri’s worries.

Shruti Haasan surprises the fans with a sudden visit to 3 screening

0

It’s raining re-releases in Tollywood. Along with Pokiri and Jalsa, now Dhanush and Shruti Haasan starter 3 has also been released in theatres across Telugu states. Surprisingly, the film has registered terrific occupancies and the response has been overwhelming.

Meanwhile, the audience at the screening of the film was in for a pleasant surprise at the film’s screening AMB Cinemas. Shruti Haasan walked into the theatre towards the movie’s end. The actress even sang a song from the movie much to the audience’s delight.

When the special shows for 3 were announced, everyone thought that nobody will be interested. But in reality, most of the shows are almost full and some are even sold out. The advance bookings alone collected more than 12 Lakhs in gross with 30% occupancy before the release.

Released in 2012, 3 was Aishwarya Rajinikanth’s directorial debut and also featured Prabhu and Rohini in key roles. Music composed by Anirudh Ravichander was one of the biggest assets of the film and the movie was critical success and fetched Dhanush several awards.

After Poor Start, Oke Oka Jeevitham Witnesses A Huge Jump Due To Positive Talk

0

Sharwanand’s Oke Oka Jeevitham was released in theatres on 9th September amidst a low buzz for the movie. Despite the impressive trailer and the promotions of the film, the morning and matinee show opened to low numbers.

But there is a lot to be happy about for the team of Oke Oka Jeevitham as the film saw a massive jump in collections after the opening slump. The film witnessed a spike for the 1st shows and registered decent numbers. This was followed by an extraordinary display for the 2nd show where it registered houseful shows in most areas.

Despite the stiff competition from Brahmastra, Oke Oka Jeevitham has managed to stay strong. After a minor setback, the film has taken off at the box office. This is largely due to the positive talk that the film has generated. Both critics as well as the general audience have loved the film and are calling it an emotional blockbuster. The concept of time travel and the emotional connection between a mother and her son have been blended in beautifully.

At this rate, Oke Oka Jeevitham is on track to easily break even at the box office by the opening weekend itself. The film is expected to post more collections on Day 2, followed by a bigger jump on Day 3 also.

Oke Oka Jeevitham also stars Priyadarsi Pulikonda, Vennela Kishore, Ritu Varma, and a fantastic Amala Akkineni in the lead roles. Shree Karthick is the writer as well as the director of the film. Dialogues have been written by Tharun Bhascker and the music is by Jakes Bejoy.