Home Blog Page 2166

Ranbir Kapoor’s Brahmastra 2 Days India Total Collections

0

Ranbir Kapoor’s Brahmastra is setting the box office on fire and drawing the audience to the theatres quite impressively. The film opened to mixed reviews and great occupancy on Day 1 and managed to better the numbers on Day 2.

On Day 2, the film collected Rs 40 crores nett (all versions). The two-day all versions nett has now added up to Rs 75 crores. The overall nett collection from just the Hindi version has brought up Rs 67 crores while the other languages have brought Rs 8 crores. Ranbir Kapoor’s Brahmastra is looking solid on Day 3 as well and the advances are Rs 25 crores as of now which is great news for the makers as well as trade circles.

Bollywood’s most ambitious project Brahmastra has been in the making for quite some time. The film also stars Alia Bhatt, Amitabh Bachchan, and Nagarjuna in key roles. This fantasy adventure film is a pan-India release and the lead cast along with director Ayan Mukherjee and producer Karan Johar have been extremely busy promoting the film all over.

Ranbir Kapoor was in serious need of a massive hit after the disaster of his earlier project Shamshera and the good opening weekend collection to Brahmastra has come as a huge relief for him.

అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డ నెటిజన్లు

0

ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. సీనియర్ నటుడు మరియు అనేక సంవత్సరాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ప్రాముఖ్యత కలిగిన కృష్ణంరాజు గారు కేవలం కళాసేవ మాత్రమే కాకుండా అనేక స్వచ్ఛంద కార్యకలాపాలు మరియు సినీ కళాకారుల సంక్షేమంలో కూడా ఆయన ఎల్లప్పుడూ ముందంజలో ఉన్నారు. అలాంటి మహా మనిషి ఆకస్మిక మరణం నేపథ్యంలో.. అనుకోని విధంగా హీరో అల్లు అర్జున్‌ నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

అల్లు అర్జున్ SIIMA 2022 అవార్డులతో పుష్ప: ది రైజ్ చిత్రానికి గానూ తెలుగు ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. కాగా అవార్డును అందుకున్న ఆనందాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ వేదికలలో పంచుకున్నారు.

అయితే అవే పోస్ట్ లు ఇప్పుడు అల్లు అర్జున్ కొంప ముంచాయి. సమయం సందర్భం లేకుండా ఆయన వేసిన అనాలోచిత పోస్ట్‌లు ఇప్పుడు వివాదానికి కారణం అయ్యాయి. ఒక పక్క తెలుగు సినిమా పరిశ్రమలో లెజెండరీ స్టేటస్ ఉన్న కృష్ణంరాజు గారు చనిపోతే ఆయన పట్ల కనీస గౌరవం లేకుండా అవార్డు గెలుచుకున్న సంతోషాన్ని తెలపడం నెటిజన్లకు ఏ మాత్రం మింగుడు పడలేదు. ఐకాన్ స్టార్ అని ఊరికే ట్యాగ్ పెట్టుకోవడం కాదు అందుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తన కూడా ఉండాలని సోషల్ మీడియా యూజర్లు మండి పడుతున్నారు.

కాగా కృష్ణంరాజు హఠాన్మరణం యావత్ తెలుగు సినీ పరిశ్రమను విషాదంలోకి నెట్టింది, ఆయన మృతికి భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగు సినీ దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఇండ‌స్ట్రీ సీనియ‌ర్ ప‌ట్ల ఆ మాత్రం గౌర‌వం కూడా చూపకుండా అల్లు అర్జున్ ప్రవర్తన ఉందని నెటిజ‌న్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కృష్ణంరాజుని తన కెరీర్‌లో ఒక మార్గదర్శక శక్తిగా మరియు బలమైన ప్రభావం చూపిన వ్యక్తిగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో, అల్లు అర్జున్ ఇలా పోస్ట్‌లు పెట్టడం చాలా మందికి నచ్చలేదు.

Netizens lash out at Allu Arjun’s ill-timed social media celebrations

0

Veteran actor Krishnam Raju’s death has sent shockwaves across the industry. The senior actor has been the leading light of Tollywood for several years and has been at the forefront of several charitable activities and movie artists’ welfare. Amidst his sudden demise, netizens are now targeting Allu Arjun for his untimely celebrations.

Allu Arjun won the SIIMA 2022, Best Actor award in Tollywood for Pushpa: The Rise and posted celebratory posts on both Instagram and Twitter.

However, these ill-timed posts have not gone down well with netizens who are lashing out at the Icon Star for his lack of respect for Krishnam Raju. Krishnam Raju’s demise has left the industry in a state of gloom with prominent personalities like PM Modi, former CM Chandrababu Naidu, and Megastar Chiranjeevi expressing their condolences.

Netizens are questioning him for his lack of respect for his industry senior. Even Megastar Chiranjeevi considers Krishnam Raju as a guiding force and a strong influence in his career. In such a situation, Allu Arjun’s posts have not gone down well with many.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూటింగ్ తాజా షెడ్యుల్ వివరాలు

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా పై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని చిత్ర బృందం చాలా గట్టి నమ్మకంతో ఇదివరకే చాలా సార్లు చెప్పటం జరిగింది. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన పోస్టర్స్ మరియు తొలుత వచ్చిన టీజర్ తో సినిమా పై అంచనాలను భారీగా పెరిగాయి.

సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందా.. ఎప్పుడు విడుదల అవుతుందా అన్న ప్రశ్నలతో ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మరియు అభిమానులకి ఎట్టకేలకు ఆనందం కలిగించే విధంగా పవన్ కళ్యాణ్ తొందర్లోనే ఈ సినిమా షూటింగ్ లో భాగం అవ్వబోతున్నారని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి వరకు సినిమా షూటింగ్ ను తొందరగా ముగించి.. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.

ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ చిత్రానికి హైప్ ఇటీవలే ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ ఒక భారీ యాక్షన్ సన్నివేశంలో కనిపించే చిన్న గ్లింప్స్ తో ఇటీవల విడుదలైన టీజర్ తో అభిమానుల నిరీక్షణకు తెర పడినట్లే అనిపించింది. ఇక దర్శకుడు క్రిష్ మరియు చిత్ర బృందం ఇక్కడ నుండి సినిమాను భారీ స్థాయిలో ముందుకు తీసుకు వెళ్లగలమని ఎంతో నమ్మకంగా ఉన్నారు.

కాగా హరి హర వీరమల్లు చిత్ర బృందానికి ఇప్పటికే ట్రేడ్ సర్కిల్స్ నుండి మంచి ఆఫర్లను అందుకుంటున్నారు. అందుకే ఎలాంటి ఆలస్యం లేకుండా షూటింగ్‌ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉంది. కాగా జనసేన పార్టీ పనులలో తొందరగా భాగం అవ్వాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.

అక్టోబర్ 17న షూటింగ్ ప్రారంభం కానుందని, క్రిష్ ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసి అందులో చాలా వరకు చిత్రీకరణను పూర్తి చేస్తున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ పై చాలా అంచనాలు ఉండటంతో పవన్ మరియు క్రిష్ తమ ఉత్తమ పనితనం చూపించాలని తీవ్రంగా దృష్టి పెట్టారు. అంతే కాక ఫలానా తేది లోపు షూటింగును పూర్తి చేయాలనే తొందరపాటుతో పని చేయకూడదని దర్శకుడు క్రిష్ భావిస్తున్నారు.

మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించనున్నారు. హరి హర వీర మల్లు సినిమా ప్యాన్-ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు తమిళం, మలయాళం మరియు హిందీలో కూడా విడుదల కానుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో పవన్‌ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్‌ కనిపించనున్నారు.

Pawan Kalyan’s Hari Hara Veera Mallu shooting updates

0

The hype for Pawan Kalyan’s Hari Hara Veera Mallu has picked the steam. The fan’s anticipation and the industry’s attention both increased after the recently released teaser that featured Pawan Kalyan in an action-packed avatar.

Krish and team are confident that they can get the movie rolling in a grand manner from here onwards and the makers are already receiving great offers from trade circles for the film. The team is in plans to complete the shooting without any delay and Pawan Kalyan is also looking forward to completing the film at the earliest.

The shoot is expected to start on the 17th of October and Krish is planning for a long schedule and finishing the majority of filming. There are a lot of expectations on this project and Pawan and Krish are focussed on the best output. Krish feels they should not rush and give an unfinished product just for the same of sticking to deadlines.

The music will be composed by MM Keeravani under Mega Surya Productions. Hari Hara Veera Mallu is a pan-India project and apart from Telugu will also release in Tamil, Malayalam, and Hindi. Nidhi Agerwal will be seen alongside Pawan Kalyan in this prestigious project.

Life of Muthu teaser: Simbu’s journey is both intense and beautiful

0

After the massive success of Maanadu last year, Kollywood star Simbu is coming up with his next film ‘Life of Muthu’. The film is a gangster drama directed by Gautham Menon and with music by AR Rahman. The film is slated to release on 15th September.

The teaser featured Simbu in a never-before look and portrays the start of Simbu’s journey into the world of crime. The most unique thing about the teaser is the picturization where music and visuals are beautifully blended to give a different output.

The natural fights and deglamorized look of the actors have added to the rawness of the teaser and increased anticipation for the film.

Simbu will be seen in multiple looks portraying different stages of his life in this film. Radhika Sarthkumar, Sidhi Idani, Siddique and Niraj Madhav will be seen in key roles in this film. Sravanthi Movies will be releasing Life of Muthu in the Telugu states.

SIIMA 2022 తెలుగు సినిమా అవార్డు విజేతల లిస్ట్

0

దక్షిణాది చిత్ర పరిశ్రమలో ‘సైమా’ అవార్డులను (SIIMA – సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) చాలా ప్రతిష్ఠాత్మకంగా మరియు గౌరవంగా భావిస్తుంటారు. 2012 నుండి ప్రతీ ఏడాది అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ భాషల్లో నుంచి ఉత్తమ ప్రదర్శన కనబర్చిన నటీనటుల్ని సినిమాలను గుర్తించి వారికి వివిధ విభాగాల్లో అవార్డులు SIIMA వారు ప్రధానం చేస్తూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా.. సైమా-2022 అవార్డుల కార్యక్రమం ఈ ఏడాది బెంగళూరులో జరుగుతోంది. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వేడుకను ఎప్పటిలాగే కళ్ళు చెదిరే విధంగా భారీ స్థాయిలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా ఈ ఈవెంట్ లో దక్షిణ భారత సినీ రంగంలోని దాదాపు స్టార్స్ అందరూ హాజరయ్యారు.

లోకనాయకుడు కమల్ హసన్ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – కన్నడ రాకింగ్ స్టార్ యష్ – రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మరియు బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ‘సైమా’ అవార్డ్స్ కార్యక్రమంలో విచ్చేసి ఈ ఈవెంట్ ను భారీ స్థాయిలో విజయవంతం చేశారు.

సైమా వారు 10వ ఎడిషన్ అవార్డ్స్ 2021లో విడుదలైన చిత్రాలకు ప్రదానం చేయనున్న సంగతి తెలిసిందే. నామినేషన్స్ విషయానికి వస్తే.. తెలుగులో ‘పుష్ప: ది రైజ్’ చిత్రం అత్యధిక నామినేషన్లు సాధించగా.. మొత్తం ఎవరెవరికి ఏ అవార్డులు వచ్చాయో చూద్దాం.

ఉత్తమ చిత్రం – పుష్ప

ఉత్తమ నటుడు (ప్రేక్షకులు) – అల్లు అర్జున్

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – బాలకృష్ణ

ఉత్తమ నటుడు (డెబ్యూట్) – వైష్ణవ్ తేజ్

ఉత్తమ నటి (ప్రేక్షకుల చాయిస్) – సాయి పల్లవి

ఉత్తమ నటి (డెబ్యూట్) – కృతి శెట్టి

ఉత్తమ దర్శకుడు – సుకుమార్ మరియు బుచ్చిబాబు

2021లో అల వైకుంఠపురములో సినిమాకి ఇదే అవార్డు సాధించిన తర్వాత పుష్ప సినిమాతో వరుసగా రెండోసారి ఈ అవార్డును అల్లు అర్జున్ ఈ అవార్డును గెలుచుకున్నారు. కాగా ఈ అవార్డు అందుకున్నందుకు అల్లు అర్జున్ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలుపుతూ తన పై ప్రేమను కురిపించినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

#SIIMA2022 కు ధన్యవాదాలు తెలుపుతూ.. మరోసారి ఉత్తమ నటుడిగా ప్రజల ఆశీర్వాదం అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డును ఒకసారి పొందడమే ఒక కల అనుకుంటే అది రెండోసారి కూడా రావడం వల్ల నన్ను నేను నిజంగా చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. అందరి ప్రేమకు ధన్యవాదాలు అని అల్లు అర్జున్ రాశారు.

https://twitter.com/alluarjun/status/1568809132786073602?t=dV3GHHfkHCIcCO_pa_HiOQ&s=19

సైమా అవార్డులను ఆన్ లైన్ ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. దీని కోసం www.siima.in వెబ్ సైట్ లేదా సైమా అఫిషియల్ ఫేస్ బుక్ పేజీలో ఓటింగ్ నిర్వహిస్తారు.

SIIMA 2022 Telugu award winners; List for best actor, actress, and director

0

SIIMA 2022( South Indian International Movie Awards) were held in a glittering ceremony in Banglore on Saturday night. The event was attended by top stars from all four South Indian industries attended this massive event and made it a grand success.

Here’s the SIIMA 2022 list of winners for Telugu best actor, actress, and director:

Best Film – Pushpa
Best Actor (Audience) – Allu Arjun
Best Actor (Critics) – Naveen Polishetty
Best Actor (Debutant) – Vaishnav Tej
Best Actress (Audience) – Poja Hegde
Best Actress (Debutant) – Krithi Shetty
Best Director – Sukumar
Best Director (Debut)- Buchibabu

The event is scheduled over two days and top talents from Telugu, Tamil, Malayalam, and Kannada industries will be awarded here.

Allu Arjun won this award for Pushpa has done it for the second time in a row after winning it for Ala Vaikunthapurramuloo in 2021. Taking to Twitter, Allu Arjun expressed gratitude and thanked his fans for showering love on him.

“Thank you #SIIMA2022! Soo Blessed by the people to the best actor once again. It’s soo rare that getting it once itself is a dream & when it happens twice I truly feel very fortunate. Thank you for all the love. Gratitude 🙏” he wrote.

Rebel star Krishnam Raju passes away, A big shock to Telugu cinema

0

Veteran Tollywood star Krishnam Raju passed away in the early hours of Sunday. Popularly known as ‘Rebel Star’ among fans and industry, Krishnam Raju was battling health issues for some time and was getting treated at a private hospital where the 83-year-old breathed his last.

The actor-turned-politician was expected to get discharged from the hospital in a few days’ time. However, the former Bharatiya Janata Party (BJP) leader’s health could not improve. Notably, he was the first actor to have served as a Union Minister in the cabinet of India’s former Prime Minister Atal Bihari Vajpayee.

The news of Krishnam Raju’s death has shocked the entire industry and condolences are pouring in from all film as well as political circles.

https://twitter.com/KTRTRS/status/1568790646001115136

In a career spanning more than five decades, Krishnam Raju featured in more than 180 films. He established himself as the most dynamic and ferocious actor in Tollywood and was particularly known for his great screen presence and intense roles. The ‘Rebel Star’ made his debut in 1966 in Chilaka Gorinka. He was last seen on the big screen in Prabhas’ Radhe Shyam earlier this year.

రెబెల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూత .. షాక్ లో తెలుగు సినీ పరిశ్రమ

0

ప్రముఖ తెలుగు నటుడు.. మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు(83) కన్నుమూశారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్ల వారు జామున ఆయన తుది శ్వాస విడించారు. ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కృష్ణంరాజు తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూసినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

తెలుగు చిత్రసీమలో రెబెల్‌ స్టార్‌గా పేరొందిన కృష్ణంరాజు1940 జనవరి 20న ప.గో.జిల్లా మొగల్తూరులో జన్మించారు. హీరోగా సినీరంగ ప్రవేశం చేసి విలన్‌గానూ అలరించిన కృష్ణంరాజు గారు.. చదువు పూర్తి కాగానే కొన్నాళ్లు జర్నలిస్టుగా పని చేసారు. కొన్ని దశాబ్దాల కాలం ఆయన తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా రాణించారు. మొత్తంగా ఆయన 183 సినిమాల్లో నటించారు. 1966లో చిలకా గోరింక సినిమా ద్వారా చిత్ర రంగం ప్రవేశం చేశారు. 1991 లో కాంగ్రెస్ నుంచి నర్సాపురం లోక్ సభకు పోటీ చేసారు. 1998లో బీజేపీలో చేరిన ఆయన 1999 ఎన్నికల్లో కాకినాడ నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. వాజ్ పేయి హయాంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రిగా కూడా పని చేసారు.

చివరిగా 2004 ఎన్నికల్లో ఓడిపోయారు. రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు స్వల్ప అస్వస్థతకు గురవ్వడంతో హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని నిన్న అర్ధరాత్రి సమాచారం వచ్చింది. ఆస్పత్రి నుంచి తనయుడు ప్రభాస్ అతడి స్నేహితులు వెళుతూ కనిపించిన ఓ వీడియో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యింది.

కృష్ణం రాజుకు ఆరోగ్య పరంగా ప్రమాదం ఏమీ లేదని, ఆయన మరో రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారని కూడా అన్నారు. వయసు పైబడుతున్న తరుణంలో ఆయన కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. దానివల్ల ఆయన సినిమాల్లో నటించడం కూడా బాగా తగ్గించేశారు. ఇటీవలే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన కృష్ణంరాజుకు అదే చివరి సినిమాగా ఉంటుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.

గతంలో కోవిడ్ సమయంలో కూడా ఒకటి రెండు సార్లు కృష్ణంరాజుకు ఆస్పత్రిలో చికిత్స జరిగింది. తాజాగా మరోసారి అస్వస్థతకు గురవ్వడంతో మళ్ళీ చికిత్స అందిస్తున్నారని తెలిసింది. ఆయన ఆరోగ్యం పై నిరంతరం శ్రద్ధ వహిస్తూ.. ప్రభాస్ అతడి స్నేహితుల బృందం అనుక్షణం ఆయనని కనిపెట్టుకుని ఉంటున్నారని, మళ్ళీ మామూలు మనిషిగా బయటకి వస్తారని అందరూ ఆశించగా.. అనూహ్యంగా కృష్ణంరాజు గారు అందరినీ తీవ్ర విషాదంలో మునిగేలా చేస్తూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం ఎంతో బాధాకరం. ఆయనకు ఆత్మశాంతి కలగాలని కోరుకుందాం. ఓం శాంతి.