Home Blog Page 2121

పక్కా కమర్షియల్ ప్రి రిలీజ్ బిజినెస్ డీటైల్స్

0

హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. అలాగే జేక్స్ బిజాయ్ అందించిన పాటలు కూడా పరవాలేదు అనిపించాయి.ఈ సినిమాలో నేరస్థుల తరపున వాదించే లాయర్ గాహీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని అంటున్నారు. దీంతో పాటు రాశీ ఖన్నా రోల్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.
ఇక రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌ కూడా సూపర్ సక్సెస్ అనిపించుకుంది.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఆ ఈవెంట్ అందరినీ అలరించింది.

ఈ సినిమా విడుదల విషయంలో అనేక సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్, యూవీ క్రియేష‌న్స్ క‌లిసి, బ‌న్నీ వాసు నిర్మాత‌గా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో హీరో తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నారు.

హీరోగా గోపీచంద్ ప్రస్తుతం అంత ఫామ్ లో లేకపోయినా, ఓన్ రిలీజ్ గా విడుదల అవుతున్న ఈ సినిమాను మారుతి మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్ బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ 20 కోట్లకు (valued) సెటిల్ అయిందని తెలుస్తుంది.సినిమాకు మంచి బజ్ ఉన్నందున సరైన టాక్ వస్తే ఇక కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం.

ఆ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రం ఆర్ ఆర్ ఆర్

0

జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సెన్సెషనల్​ చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్’. ఈ తరం మాస్ హీరోలు ఇద్దరు కలిసి నటించడం అనే అంశం వల్ల అందరి కళ్ళూ ఈ సినిమా మీద మొదటి నుంచి ఉన్నాయి, అందులోనూ బాహుబలి సీరీస్ తరువాత రాజమౌళి తీస్తున్న సినిమా అవడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం ఆసక్తిని పెంచింది.

కరోనా వల్ల పలు మార్లు విడుదల వాయిదా అవడం మూలాన ప్రేక్షకులు కాస్త నిరాశ పడిన మాట వాస్తవమే అయినా సినిమా థియేటర్లలోకి వచ్చాక రాజమౌళి హీరోలతో చేయించిన అద్భుత విన్యాసాలకు ఔరా అన్నారు. థియేట్రికల్ రన్ లో రికార్డుల మోత మోగించిన ఆర్ ఆర్ ఆర్, ఆ తరువాత ఓటీటీలో కొత్త రికార్డును సృష్టించింది.నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతున్న ఈ సినిమా హిందీ వెర్షన్​,భారత్​ నుంచి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన చిత్రంగా నిలిచినట్లు నెట్​ఫ్లిక్స్​ ఇటీవలే ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 25న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.థియేటర్లలో రిలీజ్​ అయిన రెండు నెలల తర్వాత అంటే మే 20 నుంచి ఆర్​ఆర్​ఆర్​ మూవీ నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్​ అవుతోంది. కేవలం నెలరోజుల్లోనే మూడు గంటల రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను ప్రేక్షకులు 45 మిలియన్ గంటల పాటు వీక్షించారు. ఇది అరుదైన ఘనతగా నెట్​ఫ్లిక్స్​ పేర్కొంది. అందుకే ఆర్​ఆర్​ఆర్​ సినిమా భారత్​ నుంచి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సినిమాగా నిలిచినట్లు ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది నెట్​ప్లిక్స్.

తాజాగా మరో అరుదైన రికార్డును మరియు గౌరవాన్ని దక్కించుకుంది.HCA (Hollywood critics association) అనే సంస్థ ఉత్తమ చిత్రాలకు అవార్డ్ లు ఇచ్చే కార్యక్రమంలో ఆర్ ఆర్ ఆర్ కూడా నామినేట్ అయింది.ఖచ్చితంగా ఇది ఆనందించదగ్గ విషయమే,కేవలం పోటీలో పాల్గొనడమే కాకుండా అవార్డ్ కొట్టి మరింత ఖ్యాతిని గడిస్తే ఆనందం మరింత రెట్టింపు అనడంలో ఎలాంటి సందేహం లేదు.డీవీవీ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్ ​పై దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

ఆర్​ఆర్​ఆర్​ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు12 వందల కోట్లు రూపాయలు కలెక్షన్స్​ రాబట్టి బిగ్గెస్ట్​ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. జూనియర్​ ఎన్టీఆర్​, రామ్​చరణ్​ సరసన హీరోయిన్లుగా ఆలియా భట్​, ఒలీవియా మోరిస్ నటించారు.

దిల్ రాజు ఇంట వారసుడు

0

తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర నిర్మాతల్లో ఒకరైననిర్మాత దిల్ రాజు మళ్ళీ తండ్రయ్యారు. దిల్ రాజు భార్య తేజస్విని ఈరోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో దిల్ రాజు ఇంట సంబరాలు జరుగుతున్నాయి. దిల్ రాజు తేజస్వినిలకు శుభాకాంక్షలు తెలుపుతూ పలువురు సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు దిల్ రాజు. పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలనూ నిర్మిస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

దిల్‌ రాజు , తేజ‌స్వినిల వివాహం డిసెంబ‌ర్ 10, 2020లో నిజామాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో పరిమిత సంఖ్య‌లోని అతిథులు, స్నేహితులు, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దిల్‌రాజుకు ఇది రెండో వివాహం ఆయ‌న మొద‌టి భార్య అనిత‌ 2017లో గుండెపోటుతో కాలం చేశారు. దిల్‌రాజు, అనిత‌ల‌కు ఓ కుమార్తె ఉంది. ఆమె హ‌న్షిత‌. ప్ర‌స్తుతం ఆమె దిల్ రాజు రూపొందిస్తోన్న కొన్ని సినిమాల నిర్మాణ ప‌నుల‌ను వ్య‌వ‌హ‌రిస్తూనే తెలుగు డిజిట‌ల్ మాధ‌మ్యం ఆహాలో భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఇక దిల్‌రాజు ఇప్పుడు తెలుగు, త‌మిళంతో పాటు పాన్ ఇండియా సినిమాల‌ను నిర్మిస్తున్నారు. కోలీవుడ్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్‌తో వార‌సుడు (త‌మిళంలో వారిసు) అనే సినిమాను చేస్తోన్న స‌మ‌యంలోనే ఆయ‌నింటికి నిజ‌మైన వార‌సుడు రావడం భలే యాదృచ్ఛికంగా చెప్పుకోవచ్చు. మ‌రో వైపు చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో దిల్‌రాజు, శిరీష్ క‌లిసి పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.ఈ సందర్భంగా దిల్ రాజు కు పుట్టిన బిడ్డకు అంతా మంచే జరగాలని పుత్రోత్సాహంతో దిల్ రాజు మరిన్ని విజయవంతమైన చిత్రాలను తీర్చిదిద్దాలని కోరుకుందాం.

సూర్యకు దక్కిన అరుదైన గౌరవం

0

తమిళ హీరో సూర్య గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. కేవలం కమర్షియల్ అంశాల పై ఆధార పడకుండా వైవిధ్యమైన పాత్రలు చేసే హీరోగా సూర్యకు చక్కని పేరు ఉంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ ఆయ‌న సినిమాల‌కు మంచి మార్కెట్ ఉంది. అందుక‌నే హీరో సూర్య త‌న సినిమాల‌ను ఏక కాలంతో తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల చేస్తుంటారు.కొంత కాలంగా సూర్యకు బాక్స్ ఆఫీసు వద్ద సరైన విజయం సాధించిన సినిమా లేదు.

అయితే రెండేళ్ళ క్రితం ఓటీటిలో విడుదల అయిన సూరరై పొట్రు సినిమాకి ప్రశంసల వర్షం కురిపించారు ప్రేక్షకులు. అలాగే గత ఏడాది విడుదలైన జై భీమ్ కూడా మంచి పేరు తెచ్చుకున్న చిత్రంగా నిలచింది.అయితే ఈ రెండూ ఓటిటిలో విడుదల కావడం,థియేటర్ల విడుదలైన ఈటీ మాత్రం నిరాశ పరిచింది. అయితే ప్రస్తుతం ఆయన తమిళ పరిశ్రమలో మంచి అభిరుచి గల దర్శకులుగా పేరున్న వెట్రిమారన్, బాలాతో పని చేస్తున్నారు అవి తప్పకుండా విజయం సాధిస్తాయని ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉండగా ఒక అరుదైన గౌరవం దక్కింది.

ఇంతకీ సూర్య‌కు ద‌క్కిన స‌ద‌రు అరుదైన గౌరవం ఏంటి అంటే ప్ర‌ముఖ అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (Academy of Motion Picture Arts and Sciences) నుంచి పిలుపు అందుకున్నారు సూర్య‌. గ‌త ఏడాది సూర్య న‌టించిన జై భీమ్ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలై ఘ‌న విజ‌యాన్ని ద‌క్కించుకుంది. ఈ సినిమాకుగానూ ఆయ‌న‌కు అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆహ్వానం అందింది. ఇలా ఈ అకాడ‌మీ నుంచి ఆహ్వానం అందుకున్న తొలి ద‌క్షిణాది న‌టుడు సూర్య మాత్రమే. ఇది ఖచ్చితంగా ఆయన అభిమానులతో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న సినీ ప్రేక్షకుకు గర్వ కారణం అని చెప్పడం అతిశయోక్తి కాదు.

Another milestone in RRR Account

0

Ram Charan and Jr NTR’s film ‘RRR’ is resounding in foreign countries as well. Directed by SS Rajamouli, this film is making the country proud on foreign soil after making a splash in the country. Recently the Hollywood Critics Association announced the nomination list for the 2022 Midseason Awards. Interestingly, India’s ‘RRR’ film has also managed to make a place in this list among many big Hollywood films. The team of ‘RRR’ itself has given this information through its Twitter handle.

The team of the film ‘RRR’ has given this good news to the fans from Tuesday through their official Twitter handle. This Twitter handle retweeted the post of the Hollywood Critics Association, writing, “Glad to see RRR nominated for Best Film.” The Hollywood Critics Association is an association of critics primarily based in California. These midseason awards are given to recognize the best films made in the first half of 2022. This award is for those films which have received good responses from American critics.

People were waiting for this multi-starer film for a long time. After its release, this film made many records of earnings in its name. According to the figures, the film did business of 273 crores only in the Hindi belt. Apart from this, the film had collected 772.1 crores all over the country. At the same time, if we talk about its worldwide collection, the film has earned more than 1100 crores.

Pan India biggie Salaar new schedule begins in Hyderabad

0

The new schedule of pan India biggie Salaar is set to begin in Hyderabad. Prabhas and Shruti Haasan are shooting some exciting scenes in this schedule. Prashanth Neel has planned some high-octane action sequences in this portion in which both the lead stars will be a part.

After the debacle of Radhe Shyam, Prabhas is taking extra care about this project and his look in the film will be a highlight of the film. Fans are eagerly waiting to see Prabhas in an out-and-out action role and if the makers are to be believed, they won’t be disappointed at all.

Even the producers Hombale Films are leaving no expense to ensure the movie looks grand and action sequences look terrific.

Speaking about the movie, producer Vijay Kirgandur has promised that the combination of Neel and Prabhas will deliver an extraordinary output.

“We set the bar very high for Salaar. We have Prabhas, India’s No. 1 film Baahubali Hero along with No.2 film KGF director Prashanth Neel,” said Vijay about the exciting combination.

Due to the massive positive buzz for the movie, Hombale Films have decided to extend the budget of the film. The makers have decided to utilize and market Prabhas’s craze and have decided to increase the budget by about 15-20%. Hence, going for the movie in two parts seems to be a commercially viable option for makers.

The action thriller will also star Prithviraj Sukumaran and Jagapathi Babu in key roles and is slated for a Summer 2023 release.

Vikram’s OTT release date and platform

0

Kamal Haasan’s ‘Vikram’, OTT release date was locked. The film which was released on June 3, is still making money at the box office. The love that the film has received from the audience is commendable. The special thing is that the film’s earnings continue even now. Even after 20 days, the pace of its earnings is not stopping. Now the makers have decided to stream the film on OTT. As soon as this news came to the fore, there was no place for the happiness of the movie lovers.

After making a splash in theatres, it is expected that the film to break some records on the OTT platform. According to reports, the film will stream on Disney+Hotstar in Tamil, Telugu, Kannada and Malayalam languages ​​on July 8. Viewers will be able to watch the film sitting at home from July itself.

We know that this film has become an industry hit in Kollywood in just 21 days. We also know that the digital and satellite rights of this film were acquired by Disney+Hotstar for 200 crores. Since the audience liked everything from the storyline to the action of this film, it’s not slowing down even after 21 days of its release. The fans of Kamal Haasan are raising their heads.

Vijay Sethupathi and Fahad Faasil have done important roles in this film. The director Lokesh Kanagaraj gained immense craze among the audience. They eagerly waiting for his next film. The film is still pulling the audience, so it is expected that the audience will engage the film in theatres for the next two weeks. Happy that Kamal Haasan returns after 4 years with this film.

విడాకులపై క్లారిటీ ఇచ్చిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

0

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువై పోయాయి.ఎప్పుడు ఏ సెలబ్రిటీ జంట విడాకుల వార్త చెబుతుంది అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు ప్రకటించగా ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాళ్ళు ఎవరో కాదు తెలుగు సినిమా పరిశ్రమలో మంచి సింగర్లు గా పేరు తెచ్చుకున్న హేమ చంద్ర, శ్రావణ భార్గవి.

తెలుగులో హేమచంద్ర తన తండ్రి గాన వారసత్వాన్ని అందిపుచ్చుకుని గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో ఇప్పటికే ఎన్నో పాటలు పాడిన ఆయన తెలుగు సంగీత ప్రపంచంలో ఆయనకు అంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. కేవలం గాయకుడు గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఎంతో మందికి గాత్రదానం చేసిన ఆయన తన సహ గాయని శ్రావణ భార్గవిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు.

వీరిద్దరూ 2013వ సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరికి శిఖర చంద్రిక అనే ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప 2016వ సంవత్సరంలో జన్మించింది. అయితే ఈ మధ్య ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలీదు కానీ వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని, మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం జరుగుతూ వచ్చింది.

అయితే ఆ విషయం పై హేమ చంద్ర,శ్రావణ భార్గవి ఇద్దరూ పరోక్షంగా వివరణ ఇచ్చారు. తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ల ద్వారా వారు పుకార్లు పుట్టించే వాళ్లకు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చారు. ఈ మేరకు శ్రావణ భార్గవి మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా తన యూట్యూబ్ విడియోలకి ఆదరణ మరింత పెరిగిందని,అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్లు పెరిగారు అని,గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నాను అని చెప్తూ మీడియా చేసిన అసత్యపు ప్రచారాల వల్ల తనకు మంచే జరిగింది అని చెప్పారు.

ఇక హేమచంద్ర కూడా తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారానే అనవసరమైన,అక్కర్లేని పుకార్లు లేదా బుద్ధి తక్కువ మనుషులు ప్రచారం చేసే పుకార్లే తన పాటల కన్నా ఎక్కువగా వ్యాపిస్తాయి అని చెప్తూ ఒక కొత్త పాట చేశాను చూడండి అంటూ చమక్కులు విసిరాడు.ఈ దంపతులు ఇచ్చిన వివరణ తరువాత అయినా విడాకుల పుకార్లు ఆగితే అందరికీ మంచిది.

నటిి మీనా భర్త హఠాన్మరణం

0

బాలనటిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మీనా తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా పరిశ్రమని ఏలింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లోనూ మదర్ క్యారెక్టర్స్, సీనియర్ హీరోల పక్కన చేస్తూ బిజీ బిజీగా ఉంది. 2009లో మీనాకు బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న విద్యాసాగర్ తో వివాహం జరిగింది. పెళ్లి అయి పాప పుట్టిన తర్వాత కొన్నేళ్లు సినిమాలకి బ్రేక్ తీసుకున్నా ఆ తర్వాత మళ్ళీ సినిమాల్లో బిజీ అయింది. మీనా పాప నైనిక కూడా ఇటీవల తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా చేసిన తేరి మూవీలో నటించింది.

అలాంటి ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె భ‌ర్త విద్యాసాగ‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. కొంత‌కాలంగా పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌,చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో తుది శ్వాస విడిచారు.ఆస్ప‌త్రి వ‌ర్గాలు చెప్పిన దాని ప్ర‌కారం,న‌టి మీనా భ‌ర్త విద్యాసాగ‌ర్ కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మీనా కుటుంబం మొత్తానికి క‌రోనా సోకింది. ఆ స‌మ‌యంలో క‌రోనా నుంచి మిగతా సభ్యుల ఆరోగ్యం కోలుకున్న‌ప్ప‌టికీ, విద్యాసాగ‌ర్ అనారోగ్యం మాత్రం క్షీణించింది. ఊపిరితిత్తుల స‌మ‌స్య తీవ్రం కావ‌డంతో ఊపిరితిత్తుల మార్పిడి అవ‌స‌ర‌మ‌ని వైద్యులు సూచించారు. దీంతో అప్ప‌టి నుంచి ఎంజీఎం ఆస్ప‌త్రితో చికిత్స తీసుకుంటున్నారు. అయితే స‌రైన స‌మ‌యానికి విద్యాసాగ‌ర్‌కు స‌రిపోయే ఊపిరితిత్తులు దొర‌క‌లేదు. దీంతో లంగ్స్ ట్రాన్స్‌ప్లంటేష‌న్ కుద‌ర‌లేదు. ఈ క్ర‌మంలో రోజురోజుకీ ఆరోగ్యం క్షీణించిన విద్యాసాగ‌ర్ బుధ‌వారం తుదిశ్వాస విడిచారు.

విద్యాసాగర్ మృతిపట్ల టాలీవుడ్, కోలీవుడ్, ఇతర చిత్రపరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. నటి మీనా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

రికార్డు స్థాయిలో జరగనున్న అఖిల్ ఏజెంట్ ప్రి రిలీజ్ బిజినెస్

0

అక్కినేని వారసుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అఖిల్. కెరీర్ పరంగా భారీ విజయాలు సాధించి తన మార్క్ చూపించాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్న ఈ యువ హీరో మరికొద్ది రోజుల్లో ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం తన లుక్ పూర్తిగా చేంజ్ చేసుకొని సిక్స్ పాక్ తెచ్చుకున్నారు అఖిల్. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆయన ఈ ఏజెంట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏజెంట్ నుంచి వదిలిన అఖిల్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా అఖిల్ కెరీర్ లోనే స్పెషల్ సినిమా అవుతుందని అటు అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు. సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాకు మేజర్ హైలైట్ కానుందని తెలుస్తోంది.

తొలుత ఆగస్టు 12న ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేసినా షూటింగ్ లో కొంత ఆలస్యం మరియు ఇతర సినిమాల వల్ల ఇప్పుడు దసరాకి విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.విడుదలకు ముందే ఈ సినిమాకు మంచి బజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు కేవలం ఆంధ్ర ఏరియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని, ఈ సినిమా హక్కుల కోసం పలు బడా కంపెనీలు పోటీ పడుతున్నాయని అంటున్నారు.తొలి చిత్రం తోనే అఖిల్ రికార్డు ఓపెనింగ్స్ సాధించినా ఆ సినిమాతో పాటు తరువాత విడుదల అయిన మిస్టర్ మజ్ను, హలో చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యాయి.

ఆ ఫలితాల వల్ల అఖిల్ నిరాశ పడ్డా ఇప్పుడు ఏజెంట్ సినిమాకు మాత్రం మొదలైన దగ్గరనుంచి అన్నీ పక్కాగా కుదిరి ప్రేక్షకులలో మంచి బజ్ తో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ బిజినెస్ పరంగా భారీ అంచనాలు రావడానికి కారణం హీరో అఖిల్ అనే చెప్పాలి. మరే యువ హీరో ఈ సినిమా చేసినా ఈ క్రేజ్ ఏజెంట్ సినిమాకు వచ్చేది కాదు. ఆ క్రేజ్ ను ఈసారైనా సరిగ్గా ఉపయోగించుకుని అఖిల్ భారీ బ్లాక్ బస్టర్ సాధిస్తాడేమో చూద్దాం.