Home Blog Page 2092

Massive Crowds at Nandamuri Balakrishna Shooting Spot

0

Nandamuri Balakrishna got recovered from COVID and has been shooting non stop for his next movie with Gopi Chand Malineni. The shooting is now being done at Budidhapadu premises in Undavalli, Alampur.

Various scenes were shot during this schedule. As their favourite hero came to the local area for shooting, a lot of fans flocked from various locations. In this schedule, there were so many scenes that were shot. We can see Balakrishna running along with some animals on the fields on one side, later we can see him using a tractor.

A song was also shot near to Alampur Navabrahma temple. Nandamuri Balakrishna fans were quite happy to see their favorite hero come to their own village. Earlier some decades back, Balakrish a visited this location for some scenes in Samara Simha Reddy. Now, after a long gap he visited this location. Balakrishna interacted with his fans and greeted them with love.

Actress Nitya Menon Denied her Marriage Rumours

0

Nitya Menon is one of the most popular and talented actress from South India. This Malayali beauty keep on doing movies that gives her career a boost and has great performance in it. She has become one of the most familiar faces in Telugu, Tamil and Malayalam industries.

Lately, there were rumors that Nitya Menon is in love with a star hero from Malayalam industry and they both are going to tie the knot. These rumors have been circulated online and in social media a lot. Nitya has been very calm about them for a long time now.

But, I guess it is time to respond and give clarity to the audience. She has stated that there are no marriage plans as of now. She took a dig at the media who has spread this false news. In her words, “it is not right to publish anything without a clear idea. You just cannot go and put things without fact checking them.”

We recently saw Nitya beside Powerstar Pawan Kalyan in Bheemla Nayak. We can also see her in Modern Love Hyderabad web series, streaming on Amazon Prime Video.

Raviteja: సహజమైన సెట్లతో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ

0

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. నూతన దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 29న భారీ స్థాయిలో విడుదల కాబోతుంది. నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ – రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే వారం విడుదలకు ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం చాలా బాగా నిర్వహించారు.

ఈ క్రమంలో విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. అలాగే తాజాగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ రెవిన్యూ అధికారిగా కనిపించనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. రవితేజ నుండి ప్రేక్షకులు ఆశించే మాస్, యాక్షన్ అంశాలు ఉంటూనే థ్రిల్లర్ మరియు సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఈ చిత్రంలో ఉండేలా అనిపిస్తుంది. తొలి సినిమా అయినప్పటికీ శరత్ మండవ చాలా సమర్థవంతంగా తెరకెక్కించారని సమాచారం.

హత్యలు, మిస్సింగ్ కేసుల నేపథ్యంలో నడిచే కథగా ఉన్న ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తుండగా.. తమిళ దర్శకుడు సామ్ సీ ఎస్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ కెమెరా భాద్యతను చేపట్టారు. ఆర్ట్ వర్క్ విభాగాన్ని సాహి సురేష్ కు అప్పగించారు.

అయితే ఈ సినిమాలో ఆర్ట్ వర్క్ కు సంబందించిన కొన్ని ఆసక్తికర విషయాలు సాహి సురేష్ మీడియాతో చెప్పడం జరిగింది. ఈ సినిమా తొంభైల (1995) నేపథ్యంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందుకోసం నిజంగా అప్పటి వాతావరణాన్ని సృష్టించడానికి చిత్ర యూనిట్ కష్టపడిందని ఆయన తెలిపారు. అప్పటి గ్రామం, వీధులు, ఎమ్మార్వో ఆఫీస్ ల సెట్స్ ను అద్భుతంగా వేశామని, అలాగే పాటల కోసం కూడా భారీ సెట్స్ వేశారని, అంతే కాకుండా ఎమ్మార్వో ఆఫీస్ సెట్ హీరో రవితేజకు చాలా బాగా నచ్చింది అని ఆయన చెప్పడం విశేషం.

పాన్ ఇండియా మల్టీ స్టారర్ సిద్ధం చేస్తున్న సుధా కొంగర

0

కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చుకుంది కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ పతాకంపై యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలు భారీ విజయం సాధించడంతో పాటు యావత్ భారతీయ సినీ రంగాలను, ప్రేక్షకులను ఆకర్షించాయి.

కన్నడ చిత్ర పరిశ్రమ వైపు అందరూ దృష్టి సారించెలా చేశాయి. అందువల్ల ఇప్పుడు కన్నడ పరిశ్రమలో రూపొందుతున్న సినిమాల పై కూడా అన్ని రకాల ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. మరోవైపు ‘గురు’, ‘ఆకాశం నీ హద్దురా’, ‘పావ కథైగళ్'(వెబ్​సిరీస్​)​ చిత్రాలతో ఒక్కసారిగా దక్షిణాది సినిమా పరిశ్రమ మరియు ప్రేక్షకుల ముందుకు దూసుకు వచ్చారు దర్శకురాలు సుధా కొంగర. తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు సుధ కొంగర. దాంతో ఆమె తదుపరి తీయబోయే కొత్త చిత్రాలు ఎమై ఉంటాయా అని ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తి ఏర్పడింది.

అయితే ఇటీవలే తెలిసిన విషయం ఏమిటంటే హోంబాలే నిర్మాణ సంస్థ, దర్శకురాలు సుధ కొంగర కలిసి ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతి పంచేందుకు ఏకమయ్యారు. తమ కలయికలో ఓ కొత్త సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్​ సోషల్​ మీడియా లో ఇది వరకే ప్రకటించడం జరిగింది.

అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబందించిన మరో ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేంటంటే అద్భుతంగా వచ్చిన ఈ సినిమా స్క్రిప్ట్ లో నలుగురు హీరోలకి ప్రాధాన్యత ఉందట. అందువల్ల ఈ సినిమాలో ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో హీరోలను ఈ ప్రాజెక్ట్ లో భాగం చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ హీరోలు ఎవరూ అంటే.. ప్రస్తుతానికి తమిళ స్టార్ హీరో సూర్య, మలయాళ యువ కెరటం దుల్కర్ సల్మాన్ మరియు మన తెలుగు నుంచి నాచురల్ స్టార్ నాని ఈ సినిమాలో కలిసి ప్రేక్షకులను అలరించిననున్నారు అని సమాచారం.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఈ చిత్రానికి కూడా మంచి క్రేజ్ వస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ నాలుగో హీరో ఎవరో కూడా చిత్ర యూనిట్ ఎంపిక చేసి తొందరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ నాలుగో హీరోగా ఎవరు ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం అవుతారో చూడాలి.

Balakrishna continues the Akhanda sentiment in NBK107

0

Nandamuri Balakrishna is a man of sentiments. He is known for repeating successful combinations and even repeats the character artists in several of his movies. A deeply religious person, Balayya is also known for his Narasimha Swamy sentiment.

Along with these sentiments, Balakrishna is repeating another sentiment in his upcoming film NBK107. This film will also have a Jai Balayya song just like his previous film Akhanda. The film’s shoot is currently in progress and Gopichand Malineni is directing this action entertainer.

The director has clarified that this is going to be an action entertainer with mass elements to suit Balayya’s image. Gopichand Mallineni has done extensive research for the script and spent a large part of last year in libraries.

Shruti Haasan will star opposite Balakrishna in this project. This will be her third film with the director after Balupu and Krack. Varalaxmi Sarathkumar will also star in this project which will be backed by Mythri Movie Makers.

ప్రేక్షకులతో నాన్నా పులి ఆట ఆడుతున్న దిల్ రాజు

0

లాక్ డౌన్ వల్ల తెలుగు సినిమా పరిశ్రమకు కోట్ల రూపాయల వరకూ నష్టం జరిగింది. అందువల్ల పెరిగిన అప్పుల బాధతో, సినిమాలు మళ్ళీ యధావిధిగా విడుదల అవుతున్న నేపథ్యంలో ఇండస్ట్రీ వర్గాలు తెలంగాణ రాష్ట్రంలో టికెట్ రేట్లు పెంచడం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన రేట్లకు అవసరం అయితే ఎక్కువ రేట్లు అనుమతి తీసుకుని అమలు చేయడం మొదలు పెట్టారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రేక్షకుల పరిస్థితి బాగానే ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్దేశ్యం ఏదైనా ఆయన టికెట్ రేట్లను బాగా తగ్గించేయడంతో పరిశ్రమ వర్గాలు మరియు థియేటర్ యాజమాన్యాలు ఒక మోస్తరు రేట్లను అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం పరుస్తితి అలా లేదు.

గత ఏడాది డిసెంబర్లో తెలంగాణ ప్రభుత్వం అవసరమైతే థియేటర్లకు అత్యధిక రేట్లను నిర్ణయించే హక్కులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు సింగిల్ స్క్రీన్ లకు 175/- వరకూ.. మల్టీప్లెక్స్ లకు 295/- వరకూ పెంచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఐతే సినీ పరిశ్రమ మరియు డిస్త్రీబ్యూటర్లు అత్యాశకు పోయి ఆ రేట్లను ఫిక్స్డ్ రేట్లుగా (fixed rates) పెట్టేసి.. మళ్ళీ వాటి పైన మరో 50 లేదా 100 రూపాయలు పెంచేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవడం మొదలు పెట్టారు. ఈ వ్యవహారం భారీ హైప్ తో వచ్చే పాన్ ఇండియా సినిమాలకు సరిపోతుంది కానీ సాధారణ కమర్షియల్ చిత్రాలైన ఆచార్య, సర్కారు వారి పాటకు కలిసి రాలేదు. అలాగే మీడియం బడ్జెట్ సినిమాకు పైన చెప్పుకున్న 175/295 రేట్లు మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రేక్షకులు భావించారు. అందుకే ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు.

ప్రేక్షకులు థియేటర్లకు రావడమే మానేసి ఓటీటీ బాట పట్టడంతో.. నిర్మాతలు దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే మా సినిమాకు తక్కువ అంటే మా సినిమాకి తక్కువ అంటూ ప్రచారం చేస్తున్నారు. అదైనా న్యాయంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన “F3” సినిమాకి టికెట్ రేట్లు తగ్గించాము అంటూ ప్రచారం చేసారు. కానీ అలా జరగలేదు.. ఫ్3 సినిమాకి పైన ఉదాహరించిన 175/295 రేట్లు అమలులో ఉన్నాయి. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన “పక్కా కమర్షియల్” కు అయితే టికెట్ రేట్లు దాదాపు 100 నుంచి 150 రూపాయలు తగ్గించాము అని బాగా ప్రచారం చేశారు. తీరా చూస్తే సింగిల్ స్క్రీన్ లకు ఒక 25 రూపాయలు, మల్టిప్లెక్స్ లకు ఒక యాభై రూపాయల వరకు మాత్రమే తగ్గించారు.

ఇప్పుడు దిల్ రాజు నిర్మిస్తున్న.. నాగ చైతన్య హీరోగా నటిస్తున్న “థాంక్యూ” చిత్రానికి కూడా అదే ప్రచారం జరిపారు. ఈ చిత్రానికి కూడా సింగిల్ స్క్రీన్ లకు 100 (excl GST) రూపాయలు, మల్టీ ప్లెక్స్ లకు 150 (excl GST) ఆని ప్రచారం చేశారు. వాటికి GST యాడ్ చేసినా కూడా 112/175 అవుతాయి. కానీ నిన్ననే ఆన్లైన్ బుకింగ్ లు ప్రారంభించిన “థాంక్యూ” చిత్రానికి మాత్రం బుక్ మై షో లో టికెట్ రేట్లు చూస్తే సింగిల్ స్క్రీన్ కు 150/175, మల్టీ ప్లేక్స్ కు 250 రూపాయలుగా నిర్ధారించినట్టు తెలిసింది. అసలు టికెట్ రేట్లు తగ్గించే ఉద్దేశ్యం లేనప్పుడు ప్రచారం చేయడం, ఇలా ప్రేక్షకులను మోసం చేయడం ఎందుకు? ఈ నాన్నా పులి మల్లె ఆటను దిల్ రాజు ఇకనైనా ఇలాంటి చవకబారు వ్యవహారాలు మానేస్తే మంచిది.

Distributors are stepping back because of continuous failures at the box office

0

The box office performance of recently released Tollywood films has been quite disappointing. Films such as Ante Sundaraniki, Pakka Commercial, and The Warrior released in June and July so far have all brought great losses to the producers.

The continuous failure of back-to-back films including even much-anticipated big projects has now brought great worry to the trade circle. Now the distributors are stepping back for upcoming movies as producers quoting prices are not working for them.

The streak of losses started in June 2nd week with Ante Sundaraniki. This Nani and Nazariya starrer was a massive box office dud despite getting positive talk and with an excellent cast and crew. The movie completely collapsed on weekdays and most of the theatres ran into deficits and the movie was quickly removed.

Similarly, Rana and Sai Pallavi starrer Virata Parvam also failed to get the cash registers ringing. The film saw massive drops right from the second day. The other two recent releases Chor Bazaar starring Akash Puri and Sammathame featuring Kiran Abbavaram and Chandini Chowdary also ended up as disappointments.

Now all hopes are on Ramarao On Duty, Thank You and pan India biggie Liger. Distributors are now hoping the trend reverses at least next week.

Rocketry The Nambi Effect – OTT Update మాధవన్ కొత్త సినిమా ఓటీటీ విడుదల ఖరారు

0

భారత దేశం గర్వించదగ్గ దిగ్గజ శాస్త్రవేత్త నంబి నారాయ‌ణ‌న్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌’ (Rocketry: The Nambi Effect). ఈ చిత్రంలో నంబి నారాయ‌ణ‌న్ పాత్రలో హీరో మాధవన్‌ నటించడమే కాక ఆయనే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. జులై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అటు అద్భుతమైన ప్రశంసలతో పాటు బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని కూడా అందుకుంది.

నంబి నారాయ‌ణ‌న్ భార్య పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, నటి సిమ్రాన్ నటించారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హిందీ వెర్షన్ లో, అలాగే తమిళ స్టార్ హీరో సూర్య , తమిళ మరియు తెలుగు డబ్ వెర్షన్ లో అతిథి పాత్రలో నటించి మెప్పించారు. ఇదిలా ఉంటే ఇటీవల థియేటర్ల రిలీజ్ కే కాదు ఓటీటీలో కూడా సినిమాలు ఎప్పుడు విడుదల అవుతాయి అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూడటం ఒక ట్రెండ్ గా మారింది.

తాజాగా అలాంటి ప్రేక్షకులను అలరించే శుభవార్త రానే వచ్చింది. ఈ సినిమా ఓటీటీ అప్‌డేట్ వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌‌లో ఈ నెల 26 నుంచి రాకెట్రీ.. ది నంబి ఎఫెక్ట్‌ సినిమా స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దాదాపు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, థియేటర్ల వద్ద కలెక్షన్లను బాగానే రాబట్టుకుంది. హిందీ వెర్షన్ ఊహించని విధంగా డీసెంట్ సక్సెస్ అయిందని ట్రేడ్ వర్గాల సమాచారం.

ఇక సినిమా విషయానికి వస్తే, ఇస్రో సైంటిస్ట్ నంబి నారాయ‌ణ‌న్ జీవిత కథను అద్భుతంగా ఆవిష్కరించారు మాధవన్. ఆయన నటనకు జాతీయ స్థాయిలో ఎన్నో ప్రశంసలు వచ్చాయి.. అలాగే సైంటిస్టులు, రాకెట్లు అంటూ టెక్నికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో అందుకు తగ్గట్టే సాంకేతిక విభాగాలు అద్భుతంగా పని చేశాయని చెప్పుకోవచ్చు. ఇస్రోలో రాకెట్స్ ఎలా ప‌ని చేస్తాయ‌నే దృశ్యాలు వంటివి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

అబ్దుల్ క‌లామ్‌ తో నంబి నారాయ‌ణ‌న్ స్నేహం వంటివి ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఒక దేశ‌ద్రోహి అనే ముద్ర పడిన వ్యక్తి ఎలా తన నిజాయితీని నిరూపించుకున్నాడు అనే కథను తెలుసుకోవలంటే, ఈ నెల 26 నుంచి ఓటీటీలో (Amazon Prime) లో విడులవుతున్న రాకెట్రీ ద నంబి ఎఫెక్ట్ ను చూసి తెలుసుకోవచ్చు.

Bimbisaara: కళ్యాణ్ రామ్ హిట్ కొట్టేసారా?

0

ప్రస్తుతం తెలుగు హీరోల్లో జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్త రకమైన ప్రయత్నం చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో క‌ల్యాణ్‌రామ్‌. ఆయన కేవలం హీరోగానే కాకుండా చక్కని అభిరుచి గల నిర్మాతగా కూడా పేరు తెచ్చుకున్నారు. తన స్వంత సినిమాలే కాక రవితేజ తో కిక్ 2 సినిమాని సైతం నిర్మించారు. తాజాగా ఆయన హీరోగా నిర్మిస్తూ నటిస్తున్న చిత్రం ‘బింబిసార’ . ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు.

ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్స్‌గా క్యాథరిన్ తేరేసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. చారిత్రక నేపథ్యం తో పాటు సైన్స్ ఫిక్షన్ జానర్‌లో రూపొందించిన ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. బింబిసార గా కళ్యాణ్ రామ్ ఇందులో కనిపించనున్నారు. ఈ చిత్రం ‘ జగదేకవీరుడు అతిలోక సుందరి’ మరియు ‘మగధీర’ లాగా పునర్జన్మలు మరియు సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. మొత్తంగా కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో మునుపెన్నడూ చేయనటు వంటి చాలెంజింగ్ పాత్రను ‘బింబిసార’లో చేసినట్టు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న సందర్భంగా చిత్ర బృందం మరియు కళ్యాణ్ రామ్ సమక్షంలో కలిసి స్పెషల్ ప్రీమియర్ షో ప్రదర్శించాట. ఈ ప్రీమియర్ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు అగ్ర నిర్మాత, పంపిణీదారుడు అయిన దిల్ రాజు కూడా బింబిసార చిత్రాన్ని తిలకించారట. వారివురికీ సినిమా బాగా నచ్చిందట. అంతే కాక సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారట. ఈ వార్తల్లో నిజం ఉంటే అది అటు ప్రేక్షకులకు ఇటు ఇండస్ట్రీ వర్గాలు అనందమే అని చెప్పాలి.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించనున్నారు. ఇక ఈ మధ్య సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. ‘ ఎంత మంచి వాడవురా’ సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తోన్న సినిమా ‘బింబిసార’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్నారు.

Liger Trailer Launch event: భారీ స్థాయిలో జరగనున్న లైగర్ ఈవెంట్

0

సినిమా హీరోలపై అభిమానులు ఎంత ప్రేమ చూపిస్తారో, ఏ స్థాయిలో వారి పై పిచ్చి ప్రేమను పెంచుకుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరోల సినిమా విడుదలవుతుందంటే చాలు, పండగ వాతావరణంలా సందడి చేస్తారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్‌లు పెట్టి పాలాభిషేకం చేస్తారు. అంతే కాక డప్పులు కొడుతూ డాన్స్ కూడా చేసి తమ ఆనందాన్ని చూపిస్తారు.

అయితే సినిమా విడుదలకు ముందు థియేటర్‌ల వద్ద కటౌట్‌లు పెట్టడం సాధారణమే. ఇటివల కాలంలో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లకు సైతం హీరోల కటౌట్‌లు పెట్టి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో యువతరం ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ మరియు అభిమానాన్ని సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ.అలాగే గీత గోవిందం, డియర్‌ కామ్రెడ్‌ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ని ఎర్పరచుకున్నారు. విజయ్‌ దేవరకొండ తొలి పాన్‌ ఇండియా చిత్రంగా రాబోతుంది ‘లైగర్‌’ సినిమా ఆగస్టు 25న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను రేపు విడుదల చేయటానికి చిత్ర యూనిట్ అన్ని సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. విజయ్‌ దేవరకొండ సరసన హీరోయిన్ గా బాలీవుడ్‌ భామ అనన్య పాండే నటించిన ఈ సినిమా పై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ఈ సినిమా ఆగస్ట్‌ 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, సాంగ్స్‌కు అద్భుతమయిన స్పందన లభించింది.

ఇక ‘లైగర్’ సినిమా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సుదర్శన్‌ 35 ఎమ్‌ఎమ్‌ థియేటర్‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సుమారు 75 అడుగుల విజయ్ దేవరకొండ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేయడం విశేషం. జాతియ జెండాను కప్పుకున్న బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కటౌట్‌ అబ్బురపరిచేలా ఉంది. ఈ సినిమా ట్రైలర్ ను గురువారం (జులై 21) ఉదయం 9:30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.