Home Blog Page 2065

నిర్మాతల పై మండి పడ్డ నందమూరి బాలకృష్ణ

0

అఖండ వంటి భారీ విజయం తర్వాత బాలకృష్ణ ఆ తరువాత వెంటనే గోపీచంద్ మలినేనితో పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని ప్రారంభించారు. NBK107 గా వర్కింగ్ టైటిల్ తో ప్రచారం జరుగుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంభందించిన కొత్త షెడ్యూల్ ను ఆగస్ట్ 15 నుండి టర్కీలో భారీగా ప్లాన్ చేసారని తెలుస్తుంది.

అయితే ఇటీవల తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న సినిమా షూటింగ్‌ల బంద్ నేపథ్యంలో ఈ షెడ్యూల్ కాస్తా వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఈ విషయం పై చిత్ర హీరో అయిన నందమూరి బాలకృష్ణ కోపంగా ఉన్నారట.. అంతే కాక మొత్తం వ్యవహారం పై నిర్మాతలకు తన మాటలతో గట్టిగా విరుచుకు పడ్డట్టు సమాచారం.

మామూలుగానే సినిమా షూటింగ్ అంటే బోలెడు ఖర్చుతో కూడుకున్న పని.. అలాంటిది ఇంక విదేశాల్లో షూటింగ్ షెడ్యూల్ అంటే నిజంగానే చాలా ఖర్చులు పెట్టాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆయా షెడ్యూల్ లలో చాలా మంది ఆర్టిస్టుల కాంబినేషన్ డేట్స్ కూడా పరిగణలోకి తీసుకుని చేస్తారు.. అలాంటి షెడ్యూల్ వాయిదా ప‌డితే మ‌ళ్లీ ఆ కాంబినేష‌న్ డేట్లు సంపాదించడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. పైగా ఈ వ్యవహారం అంతటికీ మళ్ళీ అదనపు డబ్బు ఖర్చు అవడం ఖాయం.

ఈ పరిస్థితి పై బాలయ్య చాలా సీరియస్ అయ్యి మైత్రీ మూవీస్ నిర్మాతలతో ఘాటుగా స్పందించారట. అయితే మైత్రీ బృందం అసలు తెలుగు సినీ నిర్మాతల మండలి ఈ నిర్ణయం తీసుకున్న పరిస్థితిని వివరించడానికి ప్రయత్నించారట. అంతే కాక షెడ్యూల్‌ను వాయిదా వేసే విషయంలో బాలకృష్ణను ఒప్పించారట కూడా.

చాలా సేపు చర్చలు జరిపిన తరువాత కానీ బాలకృష్ణ షూటింగ్ వాయిదా అంగీకరించినా.. అసంబద్ధ షూటింగ్ల బంద్ తో ఆయన ఇంకా చాలా కోపంగా ఉన్నారని సమాచారం. కారణం ఏదైనా కావచ్చు కానీ సినిమా షూటింగులు ఆపేయాలనే ఆలోచనతో మాత్రం బాలకృష్ణ ఏకీభవించక పోవడమే కాకుండా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట.

మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి మధ్య గొడవకు దారి తీసిన అల్లు అర్జున్ ట్వీట్

0

ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. దాని ద్వారా ఎంత మంచి జరుగుతుందో అంత చెడు జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ విషయంలో సెలబ్రిటీలకు, సినిమా ఇండస్ట్రీ లో ఉన్న వ్యక్తులకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి.. అలాగే ఏదో హీరో లేదా పాపులర్ వ్యక్తులు ఒక సాధారణ ట్వీట్ లేదా పోస్ట్ వేసినా కూడా వాటి పై నెటిజన్లు రాద్ధాంతం చేయడం కూడా చాలా సందర్భాల్లో జరిగింది. నటీనటుల అభిమానులు తమ పిచ్చి ఆలోచనలతో అనవసర తగాదాలకు పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా అల్లు అర్జున్ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు అభిమానుల మధ్య గొడవకు దారి తీసింది.

ఇటీవల, అల్లు అర్జున్ ట్విట్టర్‌ లోని తన అకౌంట్ లో తన తాతగారైన స్వర్గీయ శ్రీ అల్లూరి రామలింగయ్య గారిని గుర్తు చేసుకుంటూ.. ” మా పునాది” అని ట్వీట్ చేశారు. అమాయకంగా మరియు హృదయాలకు హత్తుకునే విధంగా ఉన్న ఈ పోస్ట్ ను చాలా మంది చక్కని ప్రేమకు చిహ్నంగా భావించారు. అయితే అదే ట్వీట్ ఒక వర్గం వారికి మాత్రం సుతరామూ నచ్చలేదు.

ఈ ట్వీట్ పై మెగా ఫ్యామిలీ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ట్విట్టర్‌లో వాగ్వాదానికి దిగుతున్నారు. ఒకవైపు అల్లు అర్జున్ అభిమానులు సదరు ట్వీట్ కు చాలా ఆనందంగా ఉన్నారు. అంతే కాకుండా ‘మెగా’ ట్యాగ్‌కు బదులుగా ‘అల్లు’ ట్యాగ్‌ ను వేయడం పై ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు, మెగా ఫ్యామిలీ మరియు మెగా అభిమానులు వెన్నంటి ఇచ్చిన ప్రోత్సాహం వల్లే అల్లు అర్జున్ స్టార్‌డమ్ సాధించారని, ఇప్పుడు ఒక స్టార్ స్టేటస్ అంటూ వచ్చేశాక వారి నుండి విడిపోయి తన ‘అల్లు’ బ్రాండ్‌ను కృత్రిమంగా సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మెగా అభిమానులు వాదించారు. ఆయన ఇటీవల మెగా ఫ్యామిలీ ఫంక్షన్లకు కూడా హాజరు కావడం లేదని కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ వాదనలలో భాగంగానే ఒక ట్విట్టర్ మెగా ఫ్యాన్ చిరంజీవి చిత్రాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఆయనే పిల్లర్ అని అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. ఆ ట్వీట్‌కి కౌంటర్‌గా అల్లు అర్జున్ అభిమాని ఒకరు పునాది వేసిన తర్వాతే స్తంభాన్ని నిర్మిస్తారు అంటూ బదులు ఇవ్వడం గమనార్హం.

ఫ్యాన్స్ వార్ అనేది సోషల్ మీడియాలో మామూలే కానీ ఇలా ఓకే కుటుంబ సభ్యుల మధ్య ఫ్యాన్స్ వార్ తారాస్థాయికి చేరుకోవడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. అయినా కేవలం ఒకరు సహాయం చేస్తేనే  ఎవరూ పైకి వచ్చేయరు. స్వతహాగా తమలో ప్రతిభ ఉంటేనే అభివృద్ధి చెందుతారు. ఆ విషయాన్ని గ్రహించి ఇరువురి అభిమానులు ఇలాంటి పనికిమాలిన గొడవలు మానేస్తే మంచిది. 

ఈ వారం సినిమాలు ఇండస్ట్రీ ఆశలు నిలబెడతాయా?

0

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ చక్కని దశలో ఉంది. బింబిసార మరియు సీతా రామం రెండు సినిమాలు భారీ విజయంతో పరిశ్రమకు ఎంతో కాలం తరువాత సంతోషాన్ని ఇచ్చాయి. వరుస ఫ్లాపులతో తీవ్ర భాధలో ఉన్న అందరికీ నిట్టూర్పుని అందించాయి. ఈ రెండు చిత్రాలు విజయం సాధించిన కారణంగా, ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గం, మరియు నిఖిల్ నటించిన కార్తికేయ 2 చుట్టూ కూడా మంచి అంచనాలే నెలకొన్నాయి.

మాచర్ల నియోజకవర్గం రేపు థియేటర్లలో విడుదలవుతుండగా, కార్తికేయ 2 ఎల్లుండి అంటే ఆగస్టు 13న విడుదలవుతోంది. మాచర్ల నియోజకవర్గం సినిమాకు హీరో నితిన్ మరియు చిత్ర యూనిట్ చాలా ప్రచారం చేశారు. అందుకు వారు ప్రచార కార్యక్రమాలలో వ్యవహరించిన తీరే కారణం.. అద్భుతమైన ప్రచార వ్యూహాలతో పాటు సినిమాలోని పాటలు, విడియో ప్రోమోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ సినిమాని ప్రేక్షకులకు చేరువగా ఉండేలా చేసుకున్నారు. ముఖ్యంగా రారా రెడ్డి పాట విపరీతంగా ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ పాటలో హీరోయిన్ అంజలి నర్తించడం మరో విశేషం.

ఇక 2014లో వచ్చిన సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్ కార్తికేయకు సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ 2 పై కూడా ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. సెకండ్ పార్ట్ లో కథ ఎలా ఉంటుందో . ఈసారి హీరో ఏ రహస్యాన్ని చేదిస్తాడో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే ట్రైలర్ ఉండి సినిమా పై ఆశలు పెంచింది. నిఖిల్ కెరీర్‌ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన తెరకెక్కిన ఈ సినిమా మొత్తం 5 భాషల్లో విడుదలవుతోంది.

ఇక ఈ రెండు చిత్రాలు చూడటానికి ప్రేక్షకులు ఏ రకంగా అయితే ఎదురు చూస్తున్నారో.. వాటి పై ఏర్పడిన హైప్ కారణంగా, ఎగ్జిబిటర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు కూడా గత వారం లానే ఈ వారంలో కూడా విడుదలైన రెండు సినిమాలు కూడా విజయం సాధించాలని, సాధిస్తాయనే ఆశతో ఉన్నారు. ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న ఈ జోరు ఇలాగే కొనసాగి, ఈ వారం కూడా రెండు సినిమాల ద్వారా లాభాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ రెండు సినిమాలు అన్ని ప్రాంతాలలో మంచి వసూళ్లను రాబడతాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఆ అంచనాలు నిజం అవుతాయా లేదా రేపటితో తేలిపోతుంది.

అదిరిపోయిన NBK-108 అనౌన్స్మెంట్ విడియో

0

నందమూరి నటసింహం బాలకృష్ణ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. #NBK108 అనే వర్కింగ్ టైటిల్‌ తో బాలకృష్ణ పుట్టినరోజున ఈ ఆసక్తికరమైన సినిమాని అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా నిర్మాతలు ఎవరు అనే విషయం పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. దాంతో ఇదే విషయమై పలు రకాల పుకార్లు షికారు చేసాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాతలు మరియు సంగీత దర్శకుడి వివరాలు అధికారికంగా ప్రకటించారు.

బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్‌ తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందించడం విశేషం. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అనౌన్స్ మెంట్ వీడియోని విడుదల చేశారు.

ఈ మేరకు’మజిలీ’ నిర్మాతలు షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ – అనిల్ రావిపూడి – థమన్ వంటి శక్తివంతమైన బృందం కలిసి చరిత్ర సృష్టించడం ఖాయమని పేర్కొన్నారు.తమన్ గతంలో బాలయ్య నటించిన ‘డిక్టేటర్’ సినిమాకు సంగీతం అందించారు.. ఇక గత ఏడాది బాలయ్య నటించిన ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రానికి అద్భుతమైన పాటలు, మరియు రోమాలు నిక్కబొడుచుకొనే సంగీతం అందించి, ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అంతే కాదు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న NBK107 సినిమాకి కూడా ఆయనే సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక అనిల్ రావిపూడి – తమన్‌ ల కాంబినేషన్లోలో సినిమా రావడం ఇదే తొలిసారి కావడం మరో విశేషం.“త్వరలో బాంబార్డింగ్…” అంటూ ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని చిత్ర బృందం ప్రకటించారు. ఇందులో బాలకృష్ణ ను ఇంతకుముందు ఎప్పుడూ చూడని పాత్రలో చూడబోతున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్మెంట్ వీడియోకి తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అనే చెప్పాలి.

మాస్‌ అంశాలు మరియు కామెడీ పండించడంలో దిట్ట అయిన అనిల్‌ రావిపూడి ఒక వైపు.. మాస్ ప్రేక్షకులను అలరించేలా డైలాగులు చెప్పడంలో .. లార్జర్ దాన్ లైఫ్ పాత్రలను తనదైన శైలిలో పోషించే బాలకృష్ణ ఒక వైపు.. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం కోసం విభిన్నమైన, అద్భుతమైన మాస్‌ స్క్రిప్ట్‌ ని సిద్ధం చేశారని తెలుస్తోంది. అంటే ప్రేక్షకులు నటసింహ బాలయ్యను సరికొత్త పాత్రలో ఆవిష్కరించనున్నారన్నమాట. ఇందులో లేటెస్ట్ సెన్సేషన్ అయిన శ్రీలీలా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇక సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే బయటకి రానున్నాయి. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి సినిమాని బాలయ్య ప్రారంభించనున్నారు.

లాల్ సింగ్ చడ్డా ఫలితం చిరంజీవికి ముందే తెలుసా?

0

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన తాజా చిత్రం లాల్ సింగ్ చడ్డా నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 5400 స్క్రీన్ లలో భారీ ఎత్తున ప్రచారం చేయబడి విడుదలైంది. అయితే అనూహ్యంగా దారుణమైన ఓపెనింగ్స్ తో పాటు అంతే పేలవమైన సమీక్షలను రాబట్టుకుంది. గత 10 సంవత్సరాలలో ఏ అమీర్ ఖాన్ సినిమాకి కూడా రాని విధంగా చాలా తక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం గమనార్హం.

ఈ సినిమాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడుగా వ్యవహరించారు. తెలుగు వెర్షన్ ప్రచారంలో అమీర్ కు ఎంతగానో సహకరించారు. మీడియాతో ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. దాంతో పాటు కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. చిరంజీవి, అమీర్ ఖాన్, నాగ చైతన్య లతో కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా చేశారు. అక్కినేని నాగ చైతన్య ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

అయితే లాల్ సింగ్ చడ్డా ప్రచారంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి.. ఈ సినిమా స్లోగా ఉంటుందని, కాస్త ఓపికతో చూస్తే తప్ప ఈ సినిమా నచ్చదని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రేక్షకులు తిప్పి కొట్టిన నేపథ్యంలో.. ఈ సినిమా ఫలితం చిరంజీవికి రిలీజ్ కు ముందే తెలిసిపోయిందని, కేవలం అమీర్ ఖాన్ తో ఉన్న స్నేహం దృష్ట్యా ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.

లాల్ సింగ్ చడ్డా సినిమాలో అమీర్ సరసన హీరోయిన్ గా కరీనా కపూర్ నటించారు. మరియు తల్లి పాత్రలో మోనా సింగ్ కూడా నటించారు. ఈ సినిమా హాలీవుడ్ లో టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ కు అధికారిక రీమేక్ గా తెరకెక్కింది. భారతీయ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి రీమేక్ చేయబడిన ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఒక చిన్న పాత్రలో కనిపించడం విశేషం. అయితే ఇన్ని జాగర్తలు తీసుకుని దాదాపు ఐదేళ్లకు పైగా నిర్మించి.. పైగా విస్తృత స్థాయిలో ప్రచారం చేసిన అమీర్ ఖాన్ కు చివరికి చేదు అనుభవం మిగలడం బాధాకరం.

Did Chiranjeevi know the result of Aamir Khan’s film before its release only?

0

Aamir Khan’s Laal Singh Chaddha opened to poor reviews with the film registering disastrous openings worldwide. This biographical drama film had extremely poor occupancies in 5400+ screens and resulted in worst ever opening for an Aamir movie in the last 10 years.

Meanwhile, from the result of the film, it now appears that Megastar Chiranjeevi did forsee this result. Aamir had requested Chiranjeevi to release the film in Telugu states and has set up a show for Chiranjeevi and a few other Tollywood stars.

In an interview, Chiranjeevi mentioned that the film is slow and that people should watch it with a lot of patience. Now everyone is feeling Chiranjeevi knew the result of the movie before only and just for the Aamir khan request he has released the film in Telugu states.

Laal Singh Chaddha also stars Kareena Kapoor and Mona Singh and is an official remake of Tom Hanks’ 1994 Hollywood classic Forrest Gump. The movie has been remade to suit to Indian nativity and also features a came from Bollywood superstar Shahrukh Khan.

Nandamuri Balakrishna Fires On Mythri Movies And Other Producers

0

After the monstrous success of Akhanda, Balakrishna took a short break to cool off for a while. After that, he immediately started shooting for Gopichand Malineni’s untitled mass action entertainer NBK107. The shooting of this movie has been going at a rapid pass and the makers have planned a long schedule in Turkey from 15th August.

But this schedule was postponed due to the ban on shooting of films imposed by the Producers Guild. But, Balakrishna was not taking any of this nonsense and he gave the producers a fiery dose of his words.

He told them that a foreign schedule means a lot of expenses have to be spent. A lot of artist combinations have to be set as well. How much time will it take to get those combinations right again if such a schedule is postponed? How much money is wasted?

Balayya was very serious about this situation and gave a mouthful to the Mythri Movies producers. But the producers tried to explain the present situation in the Telugu Film Industry and convinced him to postpone the schedule.

After a lot of persuasions, he finally agreed but he was still very angry with the outcome. Balakrishna is furious with the idea of stopping film shootings for any reason.

NBK 108 Announced Officially; Crew And Production Details

0

For the last few months, we have been getting little pieces of information about Balakrishna’s next NBK 108 with Anil Ravipudi but there has been no official confirmation. Finally, NBK 108 has been announced officially by director Anil Ravipudi.

Anil took to Twitter to express his gratitude and honor to be working with the ‘NataSimham’ himself. “Super thrilled to show our Natasimham in a never before role” he wrote.

https://twitter.com/anilravipudi/status/1557683367360884742?s=21&t=z1SD4-MJW5VFwIQ8jWvOdg

He also revealed that Thaman S will be the music director of the film. We all know what Thaman did with Akahnda. The beats of Akhanda are still drumming in everyone’s ears. This will surely be another memorable collaboration between the two stars.

It was also revealed that Shine Screens will be producing this venture. There is no information about the budget for the film. Anil has mentioned that he is very excited to show Balayya in a new avatar. He recently finished the complete script of the film where Balayya will reportedly play a 45-year-old man who has come out from a prison sentence.

NBK 108 will go on floors once Balakrishna is done with the shooting and release works of Gopichand Malineni’s untitled NBK 107. It is being reported that NBK 108 will go on floors after the end of September.

Did Bollywood Audience Completely Boycott Aamir Khan

0

Aamir Khan’s Laal Singh Chaddha was released in theatres today amidst all the hate and boycott slogans around the movie. There have been active boycott campaigns against Laal Singh Chaddha and Aamir Khan up until the release today.

Though most of these boycott campaigns have been due to silly reasons, it looks like it has ultimately affected the film’s opening day. Laal Singh Chaddha opened with disastrous numbers on the opening day. Moreover, the reviews have been poor and average, at best.

Now, this begs the question as to whether the Bollywood audiences have boycotted Laal Singh Chaddha or Aamir in general. The reason for boycotting his films is people seem to believe that Aamir is an anti-nationalist. Aamir has been labeled as an anti-nationalist many times In his career, even though there are no indications of the same.

But these boycott campaigns have never tainted his box office stamina before. But for the very first time, it feels like Aamir Khan is in a dangerous position. Aamir’s films usually open to amazing numbers but Laal Singh Chaddha has fallen flat on its face.

It is also not helping that the film has registered poor reviews and breakeven will be a Herculean task at this rate. One can only hope that Aamir comes back stronger the next time.

Naga Chaitanya Speaks About Marriage Tattoo And His Interaction With Samantha

0

Naga Chaitanya has been busy promoting his film Laal Singh Chaddha for the last week or so. Even though he has a very minimal part to play in the film, he has been involved in most of the promotional activities of the film.

He has had to sit through countless interviews to promote the movie and during one such interview, he was asked about his ex-wife Samantha. It has been months since their divorce and yet, both the actors are always pestered with questions about each other.

The interviewer asked Naga Chaitanya, “What would you do if you saw Samantha?”. To which Naga Chaitanya gave a calm and composed reply. This is what he had to say, “I will say Hi, and give her a hug.” It is really admirable to see the patience he possesses despite the odd questioning.

During the interview, he also revealed the meaning of his matching tattoo with Samantha. He said that the tattoo is the Morse code equivalent of their wedding date. When he was asked whether he would be getting it removed, he said that he has no plans to remove the tattoo.

He had earlier made it clear that there will be no questions entertained about Samantha. But now it looks like he is open to answering questions about the actress.