Home Blog Page 2057

తప్పు నాది కాదు మీడియాది – దిల్ రాజు

0

తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర నిర్మాతగా దిల్ రాజుకు ఎలాంటి స్టేటస్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక డిస్ట్రిబ్యూటర్ మరియు ఎగ్జిబిటర్ గా ఆయన కష్టపడి నేడు ఈ స్థాయిలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. నిఖిల్ నటించిన తాజా చిత్రం ‘కార్తికేయ 2’ రిలీజ్ పలు మార్లు వాయిదా పడి చివరాఖరికి ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే విడుదలకు ముందు ఎన్ని వివాదాలు, సమస్యలు చుట్టుముట్టినా.. శనివారం విడుదలైన కార్తీకేయ 2 సినిమా ప్రేక్షకులను విశేష స్థాయిలో అలరిస్తూ అద్భుతమైన స్పందనతో పాటు కలెక్షన్లు కొల్లగొడుతూ నిఖిల్ కెరీర్ లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా మూడు రోజుల రన్ మాత్రమే పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా చక్కని హిట్ దిశగా పయనిస్తుంది.

ఈ క్రమంలో కార్తీకేయ 2 చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఆ ఫంక్షన్ కు దిల్ రాజు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కార్తీకేయ 2 రిలీజ్ వాయిదాల వెనక తన ప్రమేయం వుందంటూ వచ్చిన వార్తల పై తాజాగా దిల్ రాజు స్పందించారు.

మీడియా వాళ్ళు వాస్తవాలు తెలుసుకుని రాయాలని, అది చేత కానప్పుడు మూసుకుని కూర్చోవాలి అని ఆయన చాలా ఘాటుగా స్పందించారు. ‘కార్తికేయ 2’ సక్సెస్ మీట్ లో అతిథిగా పాల్గొన్న దిల్ రాజు తనపై వచ్చిన ఆరోపణలపై మీడియాని లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ మండిపడ్డారు.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ మీడియా వారు అడిగితే అసలు నిజం ఎంటో తెలుసుకునేందుకు తాను సమయం ఇస్తానని.. ఆ తరువాతే వాస్తవాలు రాయండి కానీ కేవలం మీ వ్యూస్ లేదా క్లిక్కులు, సబ్స్ క్రైబర్స్ కోసం ఇతరుల పేరును పాడు చేయవద్దని అన్నారు.

సాధారణంగా తాను ఎవరితోనూ గొడవలు పెట్టుకునే మనిషిని కానని దిల్ రాజు చెప్పారు. అయితే ‘కార్తికేయ2’ సినిమాని తానే కావాలని టార్గెట్ చేశానన్న వదంతి తనని తీవ్రంగా బాధ పెట్టిందని వాపోయారు. అంతే కాకుండా ఈ విషయంలో మీడియా తనని ఒక బలిపశువుతో సమానంగా చూసి ప్రవర్తించిందని ఆయన బాధ పడ్డారు.

ఒక పక్క ఐదు సినిమాలు ఆడుతున్నా కార్తికేయ 2 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసిందని దిల్ రాజు చెప్పారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పరిశ్రమలోనే అగ్ర నిర్మాణ సంస్థ అని.. అలాంటిది వారిని ఎవరైనా ఎలా ఇబ్బంది పెట్టగలరు అని ప్రశ్నిస్తూ.. ఇలాంటి అవాస్తవాలు రాయకుండా.. మీడియా వారు ఫలానా వార్తను ప్రచురించే ముందు కాస్తైనా ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలని దిల్ రాజు సూచించారు.

అలాగే కార్తీకేయ 2 నిర్మాత అయిన అభిషేక్ అగర్వాల్ తనకి మంచి మిత్రుడని.. తనను ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు కూడా పిలిచారని దిల్ రాజు తెలిపారు. అలాగే హీరో నిఖిల్ కూడా తనకు చాలా సన్నిహితుడని చెప్తూ.. సినిమాను వాయిదా వేసే విషయంలో అందరినీ సంప్రదించిన తరువాతే నిర్ణయం తీసుకున్నారు తప్ప అసలు మొత్తం వ్యవహారంలో తను ఎవ్వరినీ బలవంతం చేయలేదు అని దిల్ రాజు వివరణ ఇచ్చారు.

అయితే తొలి రోజునే ఫట్ – లేదా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్.. టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్

0

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. గతంలో యూత్ లవ్ స్టోరీలు మాత్రమే హిట్ అయ్యేవి.. ఆ తరువాత ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ నడిచింది. మరికొన్ని రోజులు ఓకే ఒంట్లో హీరో – విలన్ ఉండే కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ల ట్రెండ్ నడిచాయి. అయితే కరోనా వేవ్ ల వరుస దాడి తరువాత ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. ఓటిటి ప్లాట్‌ఫారమ్‌ల ఎదుగుదల కారణంగా, ప్రేక్షకులు తమ ఇంట్లోనే వినోదానికి అలవాటు పడ్డారు. అలాంటిది వారిని ఇళ్లలో నుండి బయటకు వచ్చి థియేటర్‌లకు రావాలి అంటే అందుకు తగిన ఆసక్తికరమైన అంశాలు ఉంటేనే అది సాధ్య పడుతుంది.

భారీ బడ్జెట్ చిత్రాలు లేదా స్టార్ హీరోల సినిమాలు భారీ హైప్ తో విడుదలవుతాయి కాబట్టి ఏదో ఒక విధంగా ఆయా సినిమాలు తమ పెట్టుబడిని కొంచెమైనా ఓపెనింగ్స్ రూపంలో రాబట్టుకుంటాయి. కానీ చిన్న సినిమాలు మీడియం బడ్జెట్ సినిమాలు అయితే సూపర్ డుపర్ హిట్ లేదా డిజాస్టర్లు అవుతున్నాయి. కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు మొదటి రోజునే అట్టర్ ఫ్లాప్ అవుతుంటే, మరి కొన్ని సినిమాలు మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధిస్తున్నాయి.

చిన్న సినిమాలకు బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి, థియేట్రికల్ బిజినెస్ కూడా అందరికీ కాస్త అందుబాటులోనే ఉండేలా జరుపుకుంటారు. అందువల్ల సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించడం సులువే. కానీ, అవే సినిమాలకు టాక్ సరిగా రాకపోతే మాత్రం మొదటి రోజునే చతికిలబడతాయి. ఎందుకంటే ఆ సినిమాల్లో స్టార్‌ హీరోలు ఉండరు కాబట్టి.. ఇలాంటి కారణాల వల్ల మీడియం బడ్జెట్ సినిమాలు ఖచ్చితమైన ఓపెనింగ్స్ ను సాధించడం అన్ని సార్లు జరగదు.

అందుకు ఇటీవల విడుదలైన బింబిసార మరియు సీతా రామం సినిమాల విజయాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 3వ రోజునే బింబిసార సినిమా బ్రేక్ ఈవెన్ కాగా.. సీతా రామం సినిమా తొలి రోజు కాస్త తక్కువ కలెక్షన్లు వచ్చినా.. తరువాత రోజు నుండి బాక్స్ ఆఫీసు వద్ద అలా ఎదుగుతూ ఇప్పుడు వారం రోజుల తరువాత కూడా తన హవాను కొనసాగిస్తోంది. ఇటీవ‌ల విడుద‌లైన కార్తికేయ 2 కూడా అద్భుతమైన వసూళ్లు వసూలు చేస్తోంది. 3 రోజులకే దాదాపు బ్రేక్ ఈవెన్ మార్క్ ను దాటేసిన ఈ సినిమా బాలీవుడ్ లోనూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతోంది.

పైన ఉదాహరించిన సినిమాల ఫలితాలకు పూర్తి భిన్నంగా థ్యాంక్యూ, రామారావు ఆన్ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం వంటి సినిమాలు తొలిరోజే డిజాస్టర్లుగా నిలిచాయి. మాచర్ల మరియు రామారావు ఆన్ డ్యూటీకి కనీసం ఓపెనింగ్ డే కలెక్షన్స్ అయినా కాస్త పరవాలేదు అనేలా వచ్చాయి కానీ థాంక్యూ సినిమా తొలి రోజునే దారుణంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

ఆస్కార్ అవార్డులకు ఆర్ ఆర్ ఆర్ ఎంట్రీ?

0

తెలుగు సినీ దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయాన్ని మరోటి కీర్తిని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక థియేటర్, ఓటీటీలో విజయ ఢంకా మోగించిన తరువాత ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ ఆర్ ఆర్ సత్తా చాటడం ఖాయం అంటూ భారతీయ సినీ వర్గాలు, ప్రేక్షకులు మరియు మీడియా వర్గాల వారు ఎంతో నమ్మకంగా ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ ఆర్ ఆర్ సినిమా పై ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. ఆయన ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.. ఆర్ ఆర్ ఆర్ సినిమా తప్పకుండా ఈసారి ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ లో చోటు దక్కించుకుంటుందని పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు దక్కడం నిజంగా గౌరవమే. అయితే అందుకు అర్హత ఉన్న సినిమాగా బాలీవుడ్ పరిశ్రమ నుంచి ప్రోత్సాహం రావడమే ఆర్ ఆర్ ఆర్ సాధించిన ఒక విజయంగా చెప్పవచ్చు.

ఇక అనురాగ్ కాశ్యప్ ఆర్ ఆర్ ఆర్ సినిమాని పోగొడుతూ.. ఆస్కార్ యందు పలు విభాగాల్లో సినిమాకు నామినేషన్స్ దక్కుతాయనే నమ్మకంను వ్యక్తం చేయడంతో పాటు 99% ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్ ఖచ్చితంగా ఉంటుందని పేర్కొనడం విశేషం.

ఇండియన్ సినిమాలు ఆస్కార్ అవార్డును గెలుచుకోవడం మాట పక్కన పడితే.. కనీసం పోటీదారుల లిస్ట్ లో ఎంపికైనా చాలు అని మన ప్రేక్షకులు మరియు సినీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆర్ ఆర్ ఆర్ సాధించిన అంతర్జాతీయ గుర్తింపు వల్ల ఈసారి ఆ పని కాస్త సులభంగా అవుతుందని పలువురు సినీ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చూసిన హాలీవుడ్ ప్రముఖులు సినిమాని ఆకాశానికి ఎత్తేశారు. కొందరు రామ్ చరణ్ ను జేమ్స్ బాండ్ పాత్రలో చూడాలని ఆశ పడితే.. మరి కొందరు ఎన్టీఆర్ నటనకు గానూ ఉత్తమ నటుడి విభాగంలో చోటు దక్కాలని అభిప్రాయ పడ్డారు.

మొదట ఆర్ ఆర్ ఆర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకోగా, అటు పైన ఇతర దక్షిణాది ప్రేక్షకులు, మరియు హిందీ ప్రేక్షకులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇక ఓటీటీలో విడుదలైన తరువాత ఏకంగా హాలీవుడ్ ప్రేక్షకులు మరియు సెలబ్రిటీల వద్ద నుంచి అత్యంత ప్రజాదరణ పొందడం వల్ల ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకోవడం కూడా దాదాపు ఖరారు అన్నట్లుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు కూడా ఆశావహ దృక్పథంతో ఉన్నారు.

Box-Office: దుమ్ము దులుపుతున్న బింబిసార-సీతారామం-కార్తీకేయ-2

0

నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు సంపాదిస్తూ..ప్రేక్షకుల చేత విశేషమైన స్పందనను సొంతం చేసుకుంటుంది. ఆగష్టు 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ ను దక్కించుకునిప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతం అయింది.ఇక ఆగస్టు పదిహేను లాంగ్ వీకెండ్ కూడా సినిమా కలెక్షన్లకు సహాయపడింది అనే మాట కూడా వాస్తవమే.

కార్తికేయ-2 కలెక్షన్లు మొదటి రోజు కంటే, రెండో రోజు, మూడవ రోజున ఎక్కువ కలెక్షన్లను నమోదు చేసింది. స్వాతంత్ర్య దినోత్సవ సెలవుదినం అవడం వల్ల సోమవారం కూడా సినిమా హాళ్లకు ప్రేక్షకులు భారీ స్థాయిలో తరలి వచ్చారు. కార్తికేయ 2 తెలుగుతో పాటు హిందీలోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. నిజానికి ఉత్తరాదిన ఈ సినిమాకి తక్కువ ధియేటర్లు దొరికినా, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన టాక్ పెరుగుతూ ఉండటంతో, పైగా హీరో నిఖిల్ తో సహా ఎంతో మంది సోషల్ మీడియా యూజర్లు సినిమాకి ధియేటర్లు పెంచాలని మల్టిప్లేక్స్ హ్యాండిల్ లను ట్యాగ్ చేసి మరీ డిమాండ్ చేయడంతో అలా రోజూ పెంచుకుంటూ పోతున్నారు. కార్తికేయ 2 సినిమా తొలి మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 15 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌ వరకూ నిన్న ఒక్క రోజే కోటి రూపాయలకు పైగా నెట్ కలెక్షన్లు సాధించడం విశేషం. ఈ సినిమా ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇక రేపటితో లాభాల్లోకి అడుగు పెడుతుందని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక గత వారం విడుదలైన సీతా రామం, బింబిసార చిత్రాలు కూడా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతున్నాయి. సీతా రామం తొలి వారాంతంలో మంచి నంబర్స్ రాబట్టడం మాత్రమే కాకుండా తరువాత సాధారణ రోజులలో కూడా ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేస్తుంది. సినిమాలో లీడ్ పెయిర్ అయిన దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీకి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయ్యారు వారి ఆన్-స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకి కన్నుల పండగగా అనిపించింది అంటే అది అతిశయోక్తి కాదు.

రెండో వారంలో అడుగు పెట్టిన సీతా రామం తెలుగు వెర్షన్‌కే 25 కోట్ల షేర్ వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్‌ను మార్కును దాటేసి లాభాల్లోకి ప్రవేశించి లాంగ్ రన్ ద్వారా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం మొదటి రోజు నుంచి మంచి రివ్యూలతో అద్భుతమైన కలెక్షన్లను సంపాదించడమే కాకుండా కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్ మార్క్‌ ను సాధించి ఆ పైన కూడా బాక్స్ ఆఫీసు వద్ద నిలకడగా రాణిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 30 కోట్ల షేర్ ను అందుకునే దిశగా దూసుకు పోతుంది. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ నటనతో పాటు కీరవాణి నేపథ్య సంగీతం, చిరంతన్ భట్, కీరవాణి సంయుక్తంగా అందించిన పాటలు, చైల్డ్ సెంటిమెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

మొత్తానికి కొన్ని నెలలుగా సరైన విజయం లేక సతమతమయిన తెలుగు సినిమా పరిశ్రమకు ఈ ఆగస్టు నెలలో వరుసగా మూడు సినిమాలు బింబిసార, సీతా రామం, కార్తీకేయ 2 ఘన విజయం సాధించి మళ్ళీ పూర్వ వైభవం తీసుకువచ్చాయి.

భారీ బడ్జెట్ మరియు ప్రి రిలీజ్ బిజినెస్ జరుపుకున్న లైగర్

0

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు పూరి జగన్నాథ్ ది ప్రత్యేకమైన స్థానం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరు హీరోలూ హిట్ కోసం అందరూ ఆయన దగ్గరకే వెళ్తుంటారు. ఒకప్పుడు ఉన్న ఫామ్ లేకపోయినా.. ఇప్పటికీ అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాలలో పూరి ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు అనే చెప్పాలి. ప్రస్తుతం స్టార్ హీరోలుగా రాజ్యం ఏలుతున్న చాలా మంది హీరోలకు ఆయన కెరీర్ ను మార్చేసే సినిమాలను అందించారు. మహేష్ బాబు పోకిరి కావచ్చు లేదా జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ కావచ్చు, అల్లు అర్జున్ దేశముదురు ఇలా ఆయా హీరోల కెరీర్ ను మలుపు తిప్పిన సినిమాలుగా నిలిచాయి.

మరో ఆసక్తికరనైన విషయం ఏమిటంటే పూరి జగన్నాధ్ తన సినిమాలను ఎప్పుడూ చాలా రీజనబుల్ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారు. స్టార్ హీరోతో సినిమా చేసినప్పటికీ, ఆయన సినిమా బడ్జెట్‌ను ఎంతో ప్రణాళికా బద్ధంగా ఖర్చు పెడతారు. అంతే కాకుండా నిర్మాతలకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తారు. అందువల్లే నిర్మాతలు కూడా ఆయనతో సినిమా తీసేందుకు ఎప్పుడూ ముందుంటారు.

అయితే లైగర్ తో పూరీ మొదటిసారిగా తన పద్ధతికి విరుద్ధంగా ప్రవర్తించారు. పూరి జగన్నాథ్ కెరీర్ లోనే ఎక్కువ రోజుల పాటు షూటింగ్ జరుపుకున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. మొత్తం సినిమా షూటింగ్ ను పూర్తి చేయడానికి చాలా సమయాన్ని వెచ్చించారు పూరి. దీని కారణంగా, సినిమా బడ్జెట్ వడ్డీలతో కలిపి సుమారు 100 కోట్లకు చేరుకుందని అంటున్నారు.

అందువల్లే లైగర్ చిత్రానికి ఇప్పటి వరకు భారీ స్థాయిలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సినిమాకి సంభందించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. సినిమా వచ్చిన తీరుతో, అలాగే ప్రి రిలీజ్ బిజినెస్ తో కూడా చిత్ర యూనిట్ చాలా సంతోషంగా ఉంది, ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు 100 కోట్లకు జరుపుకుంది. అంతే కాక సినిమాకు ప్రేక్షకుల్లో మంచి బజ్ కూడా నెలకొంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఇది విజయ్‌ దేవరకొండ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా నిలుస్తుంది.

లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా అనన్య పాండే, తల్లి పాత్రలో రమ్య కృష్ణ, బాక్సింగ్ కోచ్ గా రోనిత్ రాయ్ మరియు ప్రఖ్యాత బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కూడా ఒక అతిధి పాత్రలో నటించారు. కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు

చిన్న హీరోల రెమ్యునరేషన్ తగ్గించనున్న తెలుగు సినీ నిర్మాతలు

0

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుత స్థితిగతులను అనుసరించి నిర్మాతలు కొన్ని ముఖ్య నిర్ణయాలు మరియు వ్యవహార కార్యక్రమాల్లో మార్పులు చేస్తున్నారు. అందులో ముఖ్యమైన అంశం హీరోల పారితోషికాలు. వాటిలో మార్పు తెచ్చేందుకు నిర్మాతలు హీరోలు జీతంలో కోత విధించాలని నిర్ణయించారని తెలుస్తోంది.

అయితే ఇక్కడ స్టార్ హీరోలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. వారి రెమ్యూనరేషన్లు ఇప్పటికీ అలాగే ఉంటాయి, కాకపోతే చిన్న హీరోలకే ఇబ్బంది. వారి పారితోషికాలలోనే ఇప్పుడు నిర్మాతలు కోత విధించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

నిర్మాతల మండలి మరియు గిల్డ్ గత కొన్ని నెలలుగా OTT విడుదలలు, రెమ్యూనరేషన్లు, టిక్కెట్ రేట్లు మొదలైన వాటి గురించి వివిధ సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు చిన్న, మీడియం రేంజ్ హీరోలకు ఇచ్చే రెమ్యునరేషన్ గురించి కూడా చర్చించుకున్నారు.

ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమ ఒకరకమైన గందరగోళ పరిస్థితిలో ఉందనే మాట వాస్తవం. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తుంటే, కొన్ని తొలిరోజునే దారుణంగా డిజాస్టర్లు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక పై చిన్న హీరోలకు భారీ అడ్వాన్స్‌లు మరియు రెమ్యునరేషన్‌లను ఇవ్వబోయేది లేదని నిర్మాతలు హీరోలకు తెలియజేస్తున్నారని సమాచారం.

ఒక ఉదాహరణ తీసుకుంటే, నాగ చైతన్య హీరోగా నటించిన థాంక్యూ సినిమా తొలి రోజునే బాక్సాఫీస్ వద్ద దారుణంగా పడిపోయింది. ఇదిలా ఉండగా, కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. దానర్థం మంచి సినిమా తీస్తే, అది ఖచ్చితంగా ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది అనే కదా.

అందువల్ల సినిమాకు జరిగిన బిజినెస్‌ శాతాన్ని బట్టి చిన్న హీరోలకు రెమ్యూనరేషన్‌ ఇవ్వాలని నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చారట. మరి నిర్మాతలు తీసుకున్న నిర్ణయం నిజమే అయితే.. ఇక నుంచీ చిన్న హీరోలకు చిన్న రెమ్యునరేషన్లు ఖరారు చేస్తారన్నమాట. అయితే ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండటం అంత సులువేమీ కాదు. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తారో లేదో చూడాలి.

Big Boss: సీజన్ 6 లో పాల్గొనబోతున్నది ఎవరంటే?

0

తెలుగు టీవి ప్రేక్షకులకు బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ఆరేళ్లుగా బుల్లితెర పై టిఆర్పీ రేటింగ్ల రేసులో నంబర్ వన్ స్థానంలో ఉన్న రియాలిటీ షో ఏది అంటే గుర్తుకు వచ్చే పేరు బిగ్ బాస్. వివిధ భాషల్లో విజయవంతంగా ప్రదర్శింపబడిన బిగ్ బాస్ షో తెలుగులో కూడా టాప్ రేటింగ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.ఇక ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. త్వరలోనే ఆరో సీజన్ తో వీక్షకుల ముందుకు రానుంది.

ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 6 ను అధికారికంగా ప్రకటించారు బిగ్ బాస్ టీమ్. ఇక బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి హోస్ట్ గా అలరిస్తున్న కింగ్ నాగార్జున మరోసారి బిగ్ బాస్ 6ను కూడా హోస్ట్ చేయనున్నారు.ఇదిలా ఉండగా బిగ్ బాస్ 6 ను ప్రకటించిన దగ్గర నుంచి ఈ సారి బిగ్ బాస్ హౌజ్ లోపలికి వెళ్లే పోటీదారులు ఎవరై ఉంటారని ప్రేక్షకులలో ఆసక్తికర చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా పలు రకాల యూట్యూబ్, మరియు ఇన్స్తాగ్రామ్ సెలబ్రిటీల పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారాయి. ఆ పేర్లలో ఒక పేరు మాత్రం చాలా గట్టిగా వినిపించింది.

ఆ పేరు మరెవరిదో కాదు. గతంలో చాలా తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సుధీప పింకీ. సుదీపా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు. వెంకటేష్ నటించిన సూపర్ హిట్ చిత్రం నువ్వు నాకు నచ్చావ్ లో ఆర్తి అగర్వాల్ చెల్లెలిగా అల్లరి పాత్రలో నటించి భలేగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో కనిపించిన తరువాత సినిమాలకు దూరం అయ్యారు సుధీప.

ఐతే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఇప్పుడు సుధీప బిగ్ బాస్ 6 సీజన్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమెను ఒప్పించేందుకు బిగ్ బాస్ యాజమాన్యం ఆమెతో సంప్రదింపులు జరపగా.. అందుకు ఆమె కూడా అంగీకరించారట. మరి ఈ వార్తలు నిజమా కాదా అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వస్తే గానీ తెలియదు.

సుధీపతో పాటు మరో 14 పోటీదారుల పేర్లు కూడా వినిపించాయి. శ్రిహాన్, ఆదిరెడ్డి, గీతూ రాయల్, యాంకర్ ప్రత్యూష, నేహా చౌదరి, జబర్దస్త్ అప్పారావు, శ్రీ సత్య, చలాకి చంటి, దీపిక పిల్లి, ఆర్ జే సూర్య, అమర్దీప్, జబర్దస్త్ తన్మయ్, ఉదట భాను మరిషు ఇనాయా సుల్తానా. ఇందులో ఇన్స్తా సెలబ్రిటీలతో పాటు న్యూస్ యాంకర్ లు మరియు టివి ఆర్టిస్టులు, మాజీ యాంకర్ల పేర్లు ఉన్నాయి. ఇక ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు అందరూ బిగ్ బాస్ సీజన్ 6 లో ఉంటారా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది. మిగతా ఇద్దరు పోటీదారులను సామాన్య ప్రజల నుంచి ఎంపిక చేసుకుంటారు.

వచ్చే ఏడాది వేసవిలో ఎన్టీఆర్ సినిమా ప్రారంభం – ప్రశాంత్ నీల్

0

ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్యాన్ ఇండియా విజయం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడాప్యాన్ ఇండియా స్టార్ లలో ఒకరయ్యారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ ఎన్నో రికార్డులు సృష్టించిం అద్వితీయమైన విజ‌యాన్ని సొంతం చేసుకుంది. కేవలం ధియేటర్లలోనే కాకుండా ప్రాచుర్యం పొందిన ఓటీటీ సంస్థలైన జీ5, నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయినప్పుడు కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాని హాలీవుడ్ వీక్షకులతో పాటు సెలబ్రిటీలతో కూడా విశేషమైన స్పందనను రానట్టుకుంది. అక్కడితో ఆగకుండా హాలీవుడ్ ప్రఖ్యాత అవార్డులకు ఎంపికై తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వమంతటా వ్యాపించేలా చేసింది. అలాంటి భారీ విజయం త‌రువాత ఎన్టీఆర్ చేయ‌బోయే సినిమాల పై ప్రేక్ష‌కుల్లో, అభిమానుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తి ఉండటం సహజమే కదా.

ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ తదుపరి చేయబోయే సినిమాలను ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అందులో ఎన్టీఆర్ 30 సినిమాని కొర‌టాల శివ‌తో చేయనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా చిన్న టీజర్ విడుదల ద్వారా ప్రకటించారు. అయితే స్క్రిప్ట్ వర్క్ లో జాప్యం మరియు పలు రకాల అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇక ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కావ‌డానికి మ‌రో నెల సమయం పడుతుందని సమాచారం.

ఇక ఎన్టీఆర్ 31వ సినిమా ‘కేజీఎఫ్‌’ సీరీస్ దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తో చేస్తున్న విష‌యం తెలిసిందే.మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ ల‌పై ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగానే అధికారికంగా విడుద‌ల చేసారు. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందని ఎన్టీఆర్ అభిమానులు చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ద‌ర్శ‌కుడు ఎన్టీఆర్ అభిమానులకి చెప్పారు.

ఎన్టీఆర్ తో సినిమా ఎప్పుడు మొదలు పెడతారో అనే విషయం మీద వివరణ ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ లో నీల‌కంఠాపురానికి వ్య‌క్తిగ‌త ప‌ని మీద వెళ్లిన ప్ర‌శాంత్ నీల్ ని అక్క‌డి మీడియా ప్రతినిధులు క‌లిసి ఎన్టీఆర్ సినిమా గురించి ప్రశ్నలు అడిగారు.

అందుకు బదులుగా ” ఏం చెప్పాలి.. కథ చెప్పాల్నా” అంటూ చిత్తూరు యాస తరహాలో మాట్లాడి ఆశ్చర్య పరిచారు. ఇక ప్ర‌శాంత్ నీల్ ఆ త‌రువాత ఎన్టీఆర్ సినిమాకి సంభందించిన రెగ్యుల‌ర్ షూటింగ్ ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో ప్రారంభిస్తున్నట్లు వెల్ల‌డించారు. అంతే కాకుండా ఎన్టీఆర్ కు తాను దాదాపు పాతికేళ్ళ నుంచి అభిమాననినని, ఎన్టీఆర్ తో సినిమా ఖరారు కాక మునుపే ఆయనని చాలా సార్లు క‌లిశాన‌ని చెప్పారు.

షూటింగ్ల కోసం వెయిట్ చేస్తున్న మహేష్

0

సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అత్యద్భుత నటన మరియు బాక్స్ ఆఫీస్ కలెక్షన్లకే కాదు ఒక మంచి ఫ్యామిలీ మ్యాన్ అనే విషయం కూడా గుర్తుకు వస్తుంది. ఒక సంవత్సరంలో ఆయన షూటింగ్ ల నుంచి ప్రణాళిక ప్రకారం విరామం ఇచ్చి కుటుంబంతో విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారనేది అందరికీ తెలిసిన విషయమే.

ప్రతి పెద్ద సినిమా తర్వాత, అయన సాధారణంగా తన కుటుంబంతో విహారయాత్రకు వెళ్తారు. ఇటీవలే సర్కారు వారి పాట విడుదలైన తర్వాత, మహేష్ తన భార్య మరియు ఇద్దరు పిల్లలతో విహార యాత్రకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.

ఆయన తదుపరి చిత్రం మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్‌తో చేస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం ప్రస్తుతం SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర షూటింగ్ నిమిత్తమే మహేష్ తన సెలవుల నుండి తిరిగి వచ్చారు. వాస్తవానికి ఈ సినిమా ఈ వారంలోనే సెట్స్‌ పైకి వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు అది వాయిదా పడింది.

మహేష్ బాబు షూటింగ్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ ఇటీవల తెలుగు సినీ నిర్మాతల మండలి ఆదేశాల మేరకు సినిమాల షూటింగ్‌లను అన్ని నిర్మాణ సంస్థలు షూటింగ్ లని తాత్కాలికంగా ఆపేశారు. అందువల్ల మహేష్ ప్రస్తుతం ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.మహేష్ బాబు అలా ఖాళీగా ఉండకుండా తన బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ కోసం కొన్ని ప్రకటనలకి సంభందించిన షూట్‌లలో నిమగ్నమై ఉన్నారు.

ఇటీవ‌ల ప‌రిశ్ర‌మ‌లో వ‌స్తున్న ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్మాత‌ల సంఘం షూటింగ్‌లు కొన్ని రోజులు ఆపేసి, సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకున్న తరువాతే షూటింగ్ లను తిరిగి నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది.

కానీ ఇటీవల విడుదలైన బింబిసార, సీతా రామం మరియు కార్తికేయ 2 వంటి సినిమాల విజయాలు వల్ల తేలిన విషయం ఏంటంటే.. ఆసక్తికరమైన కంటెంట్ ఉంటే సినిమాలు ఖచ్చితంగా విజయం సాధిస్తాయని, కానీ అలాంటి ఆసక్తికర అంశాలు లేని సినిమాలకు మాత్రమే ఫ్లాప్ అవుతాయి అని నిరూపించాయి. సినిమాలో తమని కట్టి పడేసే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు సంతోషంగా థియేటర్లకు తరకి వచ్చి సినిమాలను హిట్ చేస్తారు. కార్తికేయ 3వ రోజు కూడా హౌస్‌ఫుల్ షోలను నమోదు చేస్తుంటే 10వ రోజు కూడా సీతా రామం తన జోరు కొనసాగిస్తుంది. ప్రేక్షకులు మంచి చిత్రాలను ఆదరిస్తారు అనడానికి ఇంత కంటే మరే ఉదాహరణ అవసరం లేదు.

Dulquer Salmaan’s Sita Ramam 11 Days Box Office Collection

0

Dulquer Salmaan and Mrunal Thakur’s Sita Ramam was released in theatres on August 5th and has been receiving love ever since it was released. The film opened to a decent opening day at the box office, followed by even better Day 2 and Day 3 collections.

After a solid opening weekend, it continued to pull audiences to the theatres on the weekdays. It is still posting houseful numbers in many territories. This is largely due to the chemistry shared by the lead pair of Dulquer and Mrunal. Their on-screen romance was a cure for sore eyes.

It has now been more than a week since the release of the film and it still going strong. Sita Ramam has collected an impressive 25 crores in shares for the Telugu version alone. It has crossed the break-even mark by a mile and is running in heavy profits, making it a huge blockbuster.

The film is also doing very well in the Tamil, Malayalam, and Hindi versions. Sita Ramam has been directed by Hanu Raghavapudi and produced by Vyjayanthi Movies. It also stars Rashmika Mandanna, Tharun Bhascker, and Sumanth in important roles. Vishal Chandrashekar is the music director of the movie.