Home Blog Page 2051

Mahesh Babu Fans Are Unhappy With The Release Date Of SSMB28

0

Just yesterday, the release date of Mahesh Babu’s much-anticipated film with Trivikram untitled SSMB28 was announced. It is fair to say that this got a lot of heads turning. While most fans were excited about a new update from the makers, a large group of fans were unhappy with the release date of Mahesh Babu’s SSMB28.

The team announced the release date of the film as April 28th, 2023 but some fans are not too pleased to hear this. This is largely due to the fact that there are some very good release windows available. Therefore, it is confusing as to why the makers decided to go forward with this date.

Keeping all of that aside, the shooting of the film is likely to commence very soon. As soon as the ban on shootings is lifted, the team will go on floors. Mahesh and Trivikram share a great rapport together and have created some gems in the past like Khaleja and Athadu. There is no doubt that this will also be added to that list of gems.

SSMB28 also stars Pooja Hegde as the female lead opposite Mahesh Babu. The remaining cast and crew of the film are yet to be announced. Thaman S is the music director of the film.

Nikhil’s Karthikeya 2 6 Days Bollywood Box Office Collection

0

Nikhil’s Karthikeya 2 is having a magical run at the box office. Ever since its release in theatres, it has been the talk of the town everywhere. While the success of the Telugu version is understandable, the massive success of the Hindi version is unbelievable.

Karthikeya 2 opened to a meager 7 Lakhs on Day 1. This was expected going by the trade reports and the promotions in the North belt. But, owing to the positive buzz around the film, the film jumped on day 2 to a promising 28 Lakhs.

It only got better from here with Day 3 posting 1.10 crores, followed by Day 4 with 1.28 crores. Normally, the collections drop as the days go by but Karthikeya 2 has achieved the exact opposite. With each passing day, the collections are only showing signs of an increase.

In fact, Day 5 also showed an increase with 1.38 crores, followed by Day 6 with 1.68 crores. In total, Karthikeya 2 stands at 5.75 crores nett collections after 6 days.

The Day 7 advance bookings are highly promising as well with the most number of pre-bookings compared to all the other days. Due to the Janmashtami festival and the Holiday advantage, Karthikeya 2 has put itself in the best possible situation. The film is expected to take a massive jump today and the second weekend is expected to achieve 4-5 times more than the first.

రామ్ చరణ్ సినిమాని పక్కన పెట్టి భారతీయుడు 2 పై దృష్టి పెట్టిన శంకర్

0

దక్షిణ భారతీయ సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడు శంకర్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ సినిమా కాగా.. మరొకటి కమల్ హాసన్ నటించబోయే భారతీయుడు 2.రామ్ చరణ్ నటిస్తున్న RC15 షూటింగ్ చాలా వరకు సాఫీగానే సాగినా, ఇండియన్ 2 మాత్రం శంకర్‌కి చాలా ఇబ్బందులను తెచ్చిపెట్టింది.

రామ్ చరణ్ తో తెరకెక్కిస్తున్న RC15 షూటింగ్ శరవేగంగా ముందుకు సాగుతోంది మరియు దాదాపు యాభై శాతం పూర్తయింది.ఇక ఇండియన్ 2 షూటింగ్ 2019లో కొద్ది రోజులు జరిగింది కానీ కొన్ని అనుకోని సమస్యల వల్ల అనేక జాప్యాలను ఎదుర్కొంటోంది.

మొదట్లో అంతా సజావుగానే సాగింది. అయితే దురద్రుష్టవశాత్తూ షూటింగ్ సమయంలో క్రేన్‌ ముగ్గురు సిబ్బందిపై పడటంతో ఘోర ప్రమాదం జరిగింది, ఈ క్రమంలో వారు మరణించారు. అలాంటి దుర్ఘటన జరిగినందుకు షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది.ఆ తరువాత షూటింగ్ కొనసాగింపు విషయమై చిత్ర నిర్మాతలు అయిన లైకా ప్రొడక్షన్స్ మరియు శంకర్‌కు మధ్య చాలా విభేదాలు వచ్చాయి. కమల్ హాసన్ బాక్సాఫీస్ స్టేటస్ కారణంగా ఆయన కోసం ఇంత బడ్జెట్ భరించగలరో లేదో అనే విషయాన్ని లైకా సంస్థ కూడా ఖచ్చితంగా చెప్పలేదు. కానీ విక్రమ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత కమల్ బాక్సాఫీస్ స్టామినాపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవనే చెప్పాలి.

దీంతో మళ్లీ ఇండియన్ 2 షూటింగ్ తిరిగి ప్రారంభం అయ్యే స్థితికి వచ్చింది. అందువల్ల రామ్ చరణ్ సినిమాని కొద్ది రోజులు పక్కన పెట్టి శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పై శంకర్ దృష్టి పెట్టనున్నారు. తన దర్శకుడు శంకర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన కమల్ కూడా అదే విషయాన్ని ధృవీకరించారు. ఇండియన్ 2 షూటింగ్ ఆగస్టు 24న చెన్నైలో పునఃప్రారంభం కానుంది. కొద్దిరోజుల తర్వాత ఈ సినిమా షూటింగ్‌లో కమల్ కూడా భాగం అవుతారు. ఈ చిత్రాన్ని 2023 దీపావళికి విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ హారి హర వీర మల్లు షూటింగ్ ఈసారైనా మొదలవుతుందా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలైంది. అయితే అనూహ్యంగా షూటింగ్ దశలో రకరకాల ఎదురు దెబ్బలు తినాల్సి వచ్చింది. వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ లెక్కలేనన్ని సార్లు వాయిదా పడింది. షూటింగ్ ఆలస్యం కావడంతో నిర్మాత ఏఎం రత్నం కూడా చాలా నష్టపోయారు. హరి హర వీర మల్లు సెట్స్ కోసం తీసుకున్న అప్పులకు కూడా నష్టపోయారని పలు వార్తలు వచ్చాయి.

నిజానికి పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా హరి హర వీర మల్లు. పవన్ కళ్యాణ్ ఇంత వరకూ పోషించని విభిన్నమైన పాత్రను ఎంచుకోవడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తేనే గత పవన్ కళ్యాణ్ సినిమాలకు భిన్నంగా ఉండబోతోందని స్పష్టంగా అర్ధం అవుతుంది.

అయితే ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ ఈ సినిమా షూటింగ్ దశలో అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఏప్రిల్‌లో ఈ సినిమా షూటింగ్‌ మరోసారి ప్రారంభం కావాల్సి ఉండగా అదీ వాయిదా పడింది. తర్వాత మళ్లీ మరో తేదీకి వాయిదా పడింది. ఒకానొక సమయంలో, అసలు ఈ సినిమా ఆగిపోతుందని కూడా పుకార్లు వచ్చాయి. కానీ తాజాగా ఆగస్టు రెండో వారం నుండి షూటింగ్ ప్రారంభించాలని చిత్ర బృందం నిర్ణయించిందని సమాచారం వచ్చింది.

అయితే ఇప్పుడు ఆగస్టు మూడో వారం కూడా వచ్చేసింది కానీ చిత్ర బృందం నుండి షూటింగ్ గూర్చి కానీ ఎప్పుడు మొదలవుతుందనీ ఏ రకమైన సంకేతాలు రాలేదు. సెప్టెంబర్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని ఇప్పుడు మరోసారి వార్తలు వస్తున్నాయి, మరి ఈసారి అయినా ఆ వార్తలు నిజం అవుతాయో లేదో చూడాలి.

ఈ షెడ్యూల్ సరిగా అమలు జరిగేలా దర్శకుడు క్రిష్ తన శక్తి మేరకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన పోర్షన్‌ మొత్తం పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఒక రకంగా చూసుకుంటే మొత్తం చిత్ర బృందానికి చావో రేవో తేలే షెడ్యూల్ గా మారిందని చెప్పచ్చు. వారి ఆశలు, ప్రయత్నాలు అన్నీ సరిగ్గా కుదిరి సినిమా షూటింగ్ ఏ అడ్డంకులు లేకుండా జరగాలని కోరుకుందాం.

Box-Office: 20 కోట్ల షేర్ మార్కును దాటిన కార్తికేయ-2

0

నిఖిల్ కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద భారీ ప్రభంజనం సృష్టిస్తోంది. ఆగస్టు 13న థియేటర్లలో విడుదలైనప్పటి నుంచీ ఈ చిత్రం విధ్వంసం సృష్టిస్తోంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా అంటే ఉత్తరాదిన కూడా తన హవాను కొనసాగిస్తోంది.

లాల్ సింగ్ చద్దా మరియు రక్షా బంధన్ వంటి బాలీవుడ్ చిత్రాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు సాధించింది. నిజానికి, నాలుగో రోజు కంటే కలెక్షన్లు మూడవ రోజు , మూడవ రోజు కంటే రెండో రోజు కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయి.

ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో కూడా అద్భుతంగా ఆడుతోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కేవలం USAలోనే $600K+ గ్రాస్‌తో ఓవర్సీస్ మార్కెట్‌లలో కూడా చాలా బాగా కలెక్షన్లు నమోదు చేసింది. సరైన ప్రచారం లేకుండా, తెలియని ప్రాంతంలో ఇలాంటి కలెక్షన్లు సాధించడం సినిమాకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పుకోవచ్చు.

మొదటి వారాంతంలో రికార్డు స్థాయిలో అద్భుతమైన కలెక్షన్లు సాధించి చిన్న హీరో చిత్రాలలో ఒక ప్రత్యేక గుర్తింపును పొందింది. అంతే కాక కార్తీకేయ 2 సినిమా డ్రీమ్ రన్ ఇంకా పూర్తి కాలేదు. కేవలం వీకెండ్ లోనే కాకుండా మిగతా రోజుల్లోనూ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా నడుస్తోంది. ఆ క్రమంలో కేవలం 5 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసింది. ఇవి సినిమా యొక్క అన్ని వెర్షన్‌లతో కలుపుకుంటే వచ్చిన టోటల్. నిఖిల్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే.

ఈ ఊపు చూస్తుంటే కార్తికేయ 2 సినిమా ఈ వీకెండ్ నాటికి 30 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసేందుకు రెడీ అవుతుంది. మరి కొన్ని రోజులు ఇలానే లాంగ్ రన్ వస్తే 40 కోట్ల షేర్ క్లబ్‌లో చేరే అవకాశం కూడా ఉంది. ఆగస్ట్ 25న విజయ్ దేవరకొండ లైగర్ సినిమా విడుదలయ్యే వరకు ప్రేక్షకులకు కార్తీకేయ 2 సినిమా ఓకే ఒక్క ఆప్షన్ గా ఉండి ఆనందింపజేస్తుంది అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

రాధికగా కనిపించనున్న శ్రీలీల

0

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కో సమయంలో ఒక్కో హీరోయిన్ హవా నడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆ దశలో నవ సంచలనం యువ నటి శ్రీలీల ఉంది. అందమైన మోముకు తోడు ఆకర్షణీయమైన నవ్వు మరియు శరీర సౌష్టవంతో ప్రస్తుతం అటు ప్రేక్షకులను కట్టి పడేశారు శ్రీలీల. కే రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన పెళ్లి సందడి చిత్రంతో శ్రీ లీల తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు. మరియు తొలి చిత్రంతోనే విశేష ఖ్యాతి పొందారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని పెద్ద సినిమాలలో కనిపించబోతున్నారని సమాచారం.

ఇప్పటికే క్రేజీ లైనప్‌ ను సిద్ధం చేస్తున్న శ్రీలీల, ఆమె మరో భారీ ప్రాజెక్ట్‌కు సంతకం చేసారు. ఈ ఏడాది సూపర్ హిట్లలో ఒకటైన డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ గా కనిపించనున్నారు. సినిమా మొదటి భాగం భారీ హంగామా సృష్టించింది. అందువల్ల సీక్వెల్ కూడా ఖచ్చితంగా అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.

అంతే కాకుండా మాస్ మహారాజా రవితేజ సరసన ధమాకా చిత్రంలో కూడా నటిస్తున్నారు. అలాగే అనిల్ రావిపూడి మరియు నందమూరి బాలకృష్ణ కలిసి చేసే సినిమాలో కూడా ఆమె కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. ఈ సినిమాలో ఆమె బాలయ్య కూతురి పాత్రలో నటిస్తున్నారట.

శ్రీ లీల వయస్సు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కాబోయే బిగ్ స్టార్ గా మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆమె సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని, సరైన సినిమాలు చేసుకుంటే, ఖచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతారు అవడంతో ఎలాంటి సందేహం లేదు.

పెళ్లి సందడి చిత్రంలో హీరో రోషన్ తో జోడీగా కనిపించిన శ్రీలీల చక్కని హావభావాలతో మరియు లయభద్దమైన నృత్య భంగిమలతో ఆకట్టుకున్నారు. ఇక యూత్ ను ఒక ఊపు ఊపేసిన డీజే టిల్లు సినిమాలో హీరోగా సిద్దు జొన్నలగడ్డతో పాటు హీరోయిన్ పాత్రలో రాధికగా నేహా శెట్టికి కూడా చక్కని క్రేజ్ వచ్చింది. మరి సీక్వెల్ లో శ్రీ లీల ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

నా లెక్క 200 కోట్లతో మొదలు – విజయ్ దేవరకొండ

0

విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ఆగస్ట్ 25న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాకి ప్రేక్షకుల్లో భారీ హైప్ ఉండడంతో ట్రేడ్ వర్గాలు కూడా పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ చేశారు. పైగా ఓవర్సీస్ బుకింగ్స్ కూడా చాలా బాగున్నాయి, సినిమాకి ముందు ఇది ఖచ్చితంగా మంచి శకునం అని చెప్పవచ్చు. సాధారణంగా అయితే, దర్శకుడు పూరీ జగన్నాధ్‌ సినిమాలు ఓవర్సీస్ లో అంతగా ప్రభావం చూపవు. కానీ, విజయ్ దేవరకొండ వంటి యూత్ లో భీకరమైన క్రేజ్ ఉన్న హీరోతో సినిమా చేయడంతో, బుకింగ్‌లు చాలా అద్భుతంగా ఉండడం చిత్ర యూనిట్‌ ని ఎంతగానో ఉత్సాహపరిచింది.

ఇక హీరో విజయ్ దేవరకొండను వెండి తెర పై ప్రేక్షకులు చూసి రెండేళ్లు దాటింది. ఆయన నటించిన చివరి చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14, 2020న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా ఘోరంగా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత నుంచి విజయ్ మరో సినిమా కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.’రౌడీ’ స్టార్ గా ఫేమస్ అయి విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా వచ్చిన తీరు పై చాలా నమ్మకంగా ఉన్నారు. సినిమా అద్భుతంగా వచ్చిందన్న ఆత్మ విశ్వాసం అయన మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ ఈ చిత్ర బాక్స్ ఆఫీస్ ఫిగర్ లను కూడా ముందే అంచనా వేసి మరీ చెప్తున్నారు. లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా ఆడుతుంది అన్న ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, తన కౌంటింగ్ రూ. 200 కోట్ల నుండి ప్రారంభమవుతుందని, అప్పటి వరకు ఎంత వచ్చినా తాను అసలు లెక్కించనని కూడా చెప్పడం విశేషం. మరి విజయ్ దేవరకొండ ఇంత గట్టి నమ్మకంతో ఉన్నారు అంటే పూరి సినిమాలో ఏం అద్భుతం చేశారో చూడాలని అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో అనన్య పాండే హీరోయిన్ గా, రమ్య కృష్ణన్ హీరో తల్లి పాత్రలో నటించారు మరియు ఆగస్ట్ 25న విడుదల కానుంది. కరణ్ జోహార్, పూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లైగర్ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీతో పాటు మలయాళంలో కూడా విడుదల కానుంది.

RC15: రామ్ చరణ్ – శంకర్ సినిమా చుట్టూ సమస్యలు

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దిగ్గజ దర్శకుడు శంకర్‌ల కాంబినేషన్లో సినిమా ఎంతో క్రేజ్ తో మొదలయింది. అయితే ప్రస్తుతం ఆ సినిమాకి అన్నీ సమస్యలే వస్తున్నాయి. లోగడ ఒకసారి కొన్ని తెలియని కారణాల వల్ల చిత్రీకరణ ఆగిపోయింది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణను ప్రొడక్షన్ హౌస్ తొలగించింది.

తర్వాత ఆయన స్థానంలో జాతీయ అవార్డు గెలుచుకున్న ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ రెడ్డిని ఎంపిక చేసుకున్నారు.ఈగ, మగధీర వంటి భారీ చిత్రాలతో తనదైన ప్రత్యేక గుర్తింపు పొందిన రవీందర్ రెడ్డి ఆర్‌సి 15 చిత్ర బృందం చేరారు. అయితే ఇప్పుడు నిర్మాత దిల్ రాజుతో విభేదాల కారణంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

రవీందర్ రెడ్డి ప్రొడక్షన్ డిజైనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జూలైలో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో విలాసవంతమైన విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి లొకేషన్‌ల కోసం అన్వేషణ ప్రారంభించారట. కాగా శంషాబాద్‌లో కొంత ఖాళీ స్థలాన్ని గుర్తించి అక్కడ యూనివర్సిటీ సెట్‌ను నిర్మించడం కూడా ప్రారంభించారట.

అయితే, సెట్ల నిర్మాణ సమయంలో, దిల్ రాజు – రవిందర్ కు మధ్య సృజనాత్మక విభేదాలు మరియు లావాదేవీల తేడాలు పెరుగుతూ వచ్చాయట. రవీందర్ టీమ్‌కి, దిల్ రాజు టీమ్‌కి మధ్య అభిప్రాయ బేధాలు తలెట్టాయట. ఇరు పక్షాలకు మధ్య సమస్యలు ఉన్నాయని రవీందర్ అన్నారు. రాజీ కోసం ప్రయత్నించే ఉద్దేశ్యం దిల్ రాజు బృందంలో లేదని, అటు వైపు నుండి ఎవరూ స్పందించలేదని కూడా ఆయన అన్నారు.

ఈ కారణాలన్నింటి కారణంగా, రవీందర్ ప్రొడక్షన్ డిజైనర్ పాత్ర నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. ఈ నిర్ణయానికి దిల్ రాజు కూడా ఒప్పుకున్నట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఒక పక్క యూనివర్శిటీ సెట్ సిద్ధంగా ఉండగా, షూటింగ్ ప్రారంభించాల్సిన దశలో శంకర్ ఈ చిత్రాన్ని వదిలేసి ప్రస్తుతం భారతీయుడు 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారతీయుడు 2 సినిమా షూటింగును ముగించుకుని ఆ తరువాతే RC15 సెట్స్ లోకి తిరిగి అడుగు పెడతారట.

తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ కొత్త నిభందనలు అమలు అవుతాయా?

0

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) మరియు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ (ATFPG) గురువారం సినిమా OTT విడుదలకు సంబందించిన కొత్త నిబంధనలతో పాటు సినిమా నిర్మాణ వ్యయాన్ని నియంత్రించడానికి కార్యాచరణను ప్రకటించింది. ఆగస్టు నెల ప్రారంభంలో నిర్మాతల సంఘం సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో పలు తెలుగు సినిమాల షూటింగ్‌లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.

ఓటిటి విడుదలకి థియేటర్ విడుదలకి మధ్య వ్యవధిని ఎనిమిది వారాలకు పొడిగించాలని నిర్ణయించుకున్నట్లు అగ్ర నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఇక నుంచీ చిత్ర నిర్మాతలు అందరూ ఈ నియమానికి కట్టుబడి ఉంటారనీ, ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదని కూడా చెప్పారు. ఈ మేరకు ఇప్పటికే జరిగిన ఒప్పందాలను కూడా మార్చే ఆలోచనలో కూడా ఉన్నామని, ఒకవేళ అవసరమైతే కొత్త నిబందనలు వెంటనే అమలులోకి వచ్చే విధంగా షరతులను మారుస్తామని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షుడు దిల్ రాజు అన్నారు.

అలానే మల్టీప్లెక్స్‌లలో ఆహార, పానీయాల ధరలతో పాటు టిక్కెట్ ధరలను కూడా నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. గిల్డ్ సభ్యులు మల్టీప్లెక్స్‌లతో వారి ఆహార ధరల పై చర్చలు జరపడానికి ప్రయత్నిస్తుందని, అంతే కాక మల్టీప్లెక్స్‌ల నిర్వహణను అందుబాటు ధరలకు అందించాలని అభ్యర్థించినట్లు దిల్ రాజు చెప్పారు.

మొత్తంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మరియు TFCC పెరుగుతున్న నిర్మాణ వ్యయాలను తగ్గించడానికి అంగీకరించాయి. దాంతో పాటు నిర్ణీత బడ్జెట్‌లో షూటింగ్ కార్యకలాపాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నాయి, అందువల్ల ఇక పై నిధులు లేదా వనరుల వృధా చేసేందుకు అవకాశం లేదని నిర్మాణ వ్యయాలను నియంత్రించే వారి ప్రయత్నాల పై నిర్మాత దిల్ రాజు చెప్పారు.

అయితే ఇంతకు ముందు కూడా ఇలాంటి నిర్ణయాలు, నిభందనలు తెలుగు సినీ నిర్మాతలు తీసుకున్నారు. కానీ అవేవీ కూడా అనుకున్న విధంగా అమలు జరగలేదు. సినిమా ఇండస్ట్రీలో అందరూ ఓకే తాటి పై ఉండాలి అన్నా, ఒకే నిర్ణయాన్ని పాటించాలన్నా అంత సులభం కాదు అయితే కరోనా తరువాత తెలుగు సినీ పరిశ్రమ బాగా ఇబ్బందులు ఎదురుకుని నిలదొక్కుకునే నేపథ్యంలో అందరూ క్రమ పద్ధతిలో కలిసి మెలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ తీసుకున్న కొత్త నిర్ణయాలు అనుకున్నట్లు అమలు చేస్తారని ఆశిద్దాం

SSMB28: పోకిరి డేట్ కు రానున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

0

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న SSMB 28 సినిమా ఎట్టకేలకు విడుదల తేదీని నిర్ణయించుకుంది. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ఈ భారీ అప్‌డేట్‌ను కాసేపటి క్రితం సోషల్ మీడియాలో ప్రకటించారు. అంతే ఇంక ఈ వార్త సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయింది. మహేష్ అభిమానులు ఈ అప్డేట్ తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు.

https://twitter.com/haarikahassine/status/1560228968254414848?t=NT2MUCsJUoPjE0UhzeXCRQ&s=19

SSMB 28 సినిమాతో పన్నెండు సంవత్సరాల తర్వాత దిగ్గజ దర్శకుడు త్రివిక్రం – మహేష్ బాబు కాంబినేషన్లో మళ్ళీ సినిమా రానుంది. అతడు, ఖలేజా తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌లకు ఇది మూడో సినిమా. చిత్ర నిర్మాతలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ సినిమాను ప్రకటించినప్పుడే అభిమానులు ఎంతగానో ఆనందించారు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కొందరు బాలీవుడ్ మరియు మలయాళ స్టార్ ల పేర్లు వినిపించినా ఇంకా ఏదీ అధికారికంగా ఖరారు కాలేదు. తాజాగా, ‘అల వైకుంఠపురములో’ చిత్రం తరువాత దర్శకుడు త్రివిక్రమ్ ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల పై దృష్టి సారిస్తున్నారు.

అయితే మహేష్ తో చేయబోయే సినిమాకు మాత్రం కథా నేపథ్యంతో పాటు అందుకు సంబంధించిన ట్రీట్‌మెంట్ అంటే సినిమాని తెరకెక్కించే విధానం కూడా భిన్నంగా ఉంటుందని మహేష్ స్పష్టం చేశారు. తాజా నివేదికల ప్రకారం, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రొటీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అంటే ఆసక్తి చూపట్లేదు.

ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్నారు అంటేనే అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తిని పెంచే కలయిక అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ చిత్రం అందరి అంచనాలు అందుకోవాలి అని కోరుకుందాం.