The Multiplex Association of India (MAI) has postponed the National Cinema Day celebrations from 16 September and announced that it will now be observed across India on 23 September.
Previously, the MAI had announced that the ticket pricing at the biggest cinema chains for moviegoers would be ₹75 on 16 September. However, the stakeholders requested the MAI postpone the celebrations for a week to maximize the participation of the audience.
It is being speculated that the event has been postponed in order to give Brahmastra a clear space at the box office as Rs 75/- ticket price would hurt its collections. Taking to Twitter, the Multiplex Association of India released a press note citing their decision to postpone the celebrations.
The National Cinema Day was previously announced to be held on 16th September, however, on request from various stake holders and in order to maximize participation, it would now be held on 23rd September #NationalCinemaDay2022#Sep23pic.twitter.com/c5DeDCYaMD
The National Cinema Day will be held at more than 4000 participating screens and will include cinema screens of PVR, INOX, Cinepolis, Carnival, Miraj, Citypride, Asian, Mukta A2, MovieTime, Wave, M2k, Delite and many others.
RC 15 and Vijay’s Varisu are among the most awaited south -Indian films at the moment. While RC 15 is helmed by Shankar, Varisu is a bilingual directed by Vamsi Paidipally. The common string between these two films is Dil Raju, who is producing both.
Dil Raju is quoting the prices for two movies combined and even distributors are also very interested in these deals and are ready to offer quoted price. In the overseas market, RC 15 and Varisu are being quoted for a combined price of Rs 65Cr. Individually, the rights of both films are in the same range of 32Cr – 33Cr.
Dil Raju is following the same concept in other areas too quoting the business for two movies and distributors are likely to buy these two movies in all territories.
RC 15 is a political drama with a powerful message and will star Kiara Advani opposite Ram Charan. This film is going to be on an anti-corruption theme and Shankar is shooting it on a grand scale. Varisu on the other hand stars Vijay and Rashmika Mandanna. Both these films will have music composed by SS Thaman.
While Varisu will release in January 2023, the release date of RC 15 has not been specified yet and the shoot is going on at a rapid pace in Hyderabad.
Ranbir Kapoor and Alia Bhatt starrer Brahmastra registered sensational openings last week and continued its victory run over the weekend. The film collected 125Cr nett over the first weekend and has set a new benchmark for Hindi films. The previous record for direct Hindi films was Sanju which collected Rs 120 crores.
However, the movie tanked on the first weekday i.e. Monday. The film saw significant drops much to the disappointment of the makers. Brahmastra has made on close to 500Cr budget, The comparison will be always there with big pan India blockbusters like RRR, KGF2, and Baahubali2.
All these three movies collected more than 1000Cr gross and looking at the start it had, it appeared Brahmastra might also join this club. However, looking at the drops now, it’s not possible for Brahmastra to come close to these films.
Considering the budget and expectations the film dropped on Monday and it has a more than 60% drop on Monday from Sunday which is unexpected.
గత కొంత కాలంగా బాలీవుడ్ కి సరైన హిట్టు పడలేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రేక్షకులని థియేటర్ల వద్దకు రప్పించడం వారికి తలకు మించిన భారంగా మారింది. అగ్ర హీరోల సినిమాలు కూడా బలమైన హిట్ కొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే వచ్చిన అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా భారీ పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్ అయితే ఆయన నటించిన చివరి నాలుగు సినిమాలలో కేవలం ఒక్క సినిమానే హిట్టు కొట్టింది. ఇక ఈ ఏడాది భూల్ భులయ్య-2, ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే భారీ విజయాలు సాధించాయి.
ఇక మన తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్, కన్నడ చిత్రం కేజీఫ్-2 హిందీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో బాలీవుడ్ దృష్టంతా ఓకే సినిమా పై పడింది. అదే గత వారం విడుదలైన బాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమా బ్రహ్మస్త్ర.
రణ్ బీర్ కపూర్ అలియా భట్ కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. మన భారతీయ పురాణాల ఆధారంగా ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ తో కలిసి మరికొంత మంది ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందు నుంచి భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే నెగటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే సినిమాపై వున్న బజ్ కారణంగా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో తొలి మూడు రోజులు భారీ స్థాయిలోనే ఈ సినిమా భారీ వసూళ్లని రాబట్టింది.
నిజానికి బాలీవుడ్ లో ఉన్న పరిస్థితిలో, అదీ తాజాగా బాగా ప్రబలుతున్న బాయ్కాట్ ట్రెండ్ నేపథ్యంలో బ్రహ్మస్త్ర ఓపెనింగ్స్ అయినా దక్కించుకుంటుందా అనే అనుమానం వ్యక్తం అయినా.. భారీ పబ్లిసిటీ వల్ల సినిమా తొలి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడగా రాణించి ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక సాధారణంగా అన్ని సినిమాలకు చూసినట్టే ఈ చిత్రానికి కూడా సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో నిర్ణయం తీసుకుందాం అని ట్రేడ్ వర్గాలు భావించాయి.
ఇక అత్యంత కీలకమైన సోమవారం పరీక్షలో బ్రహ్మస్త్ర అత్తెసరు మార్కులు తెచ్చుకుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కలెక్షన్లలో 60% కంటే ఎక్కువ డ్రాప్ వచ్చింది, ఇది ఎవరూ ఊహించనిది. మొత్తంగా నాలుగవ రోజు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 16.5 నెట్ వసూలు చేసింది. నాలుగు రోజులకు కలుపుకుని చూసుకుంటే 140 కోట్లకు పైగా వసూలు చేసింది.
బ్రహ్మాస్త్ర చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, RRR, KGF2, బాహుబలి2 వంటి పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో ఈ చిత్రానికి పోలిక అనివార్యం అవుతుంది. ఈ మూడు సినిమాలు కలెక్షన్స్‌ని చూస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేశాయి, ట్రెండ్ చూస్తుంటే బ్రహ్మస్త్ర ఈ చిత్రాలకు దగ్గరగా రావడం సాధ్యం అయేలా కనిపించట్లేదు, బడ్జెట్ మరియు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే బ్రహ్మస్త్ర కలెక్షన్లు డ్రాప్ అవటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ అయినా వసూలు చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద గౌరవప్రదమైన స్థానం సంపాదించుకుంటుంది.
రామ్ చరణ్.. శంకర్ ల కాంబినేషన్లో సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో లాంచనంగా ప్రారంభం అయ్యింది. ఇక ఈ ప్రాజెక్టు (RC-15) అనౌన్స్ అయిన రోజు నుండి అటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు, ట్రేడ్ వర్గాలలో కూడా భారీ క్రేజ్ ను సృష్టించడంలో విజయవంతం అయింది. టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్ నుండి మహమహులు హాజరైన భారీ పూజా కార్యక్రమం తర్వాత ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. అప్పటి నుంచి రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతూనే ఉంది.
ఇప్పటికే పూణె, అమృత్‌సర్, తూర్పు గోదావరిలో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని మేజర్ షెడ్యూల్స్ చిత్రీకరించారు. ఇప్పుడు తదుపరి షెడ్యూల్ కోసం, శంకర్ హైదరాబాద్ లోని శంషాబాద్‌లో 12 కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్ ను వేసి అందులో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.
అంతే కాక ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్ కూడా భాగం అవుతారట. ఈ సినిమాని కేవలం ప్రేక్షకులకు కాక పరిశ్రమలకు అతీతంగా అందరూ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమాలకి ఒకటి, ఇక శంకర్ ఈ చిత్రంలో తన శైలికి అనుగుణంగా భారీ సెట్ డిజైన్‌లు మరియు విలాసవంతమైన షూటింగ్ షెడ్యూల్స్ ఇలా ఎక్కడా ఎటువంటి ఖర్చులకి వెనుకాడటం లేదు.
ఇప్పటికే హీరోయిన్ కియారా అద్వానీ నటించిన ఒక పాటను భారీ సెట్‌లో చిత్రీకరించారు. సోషల్ డ్రామా రూపంలో సమాజంలోని పరిస్థితులను చక్కగా చూసిస్తూ.. ఫైట్లు మరియు పాటలను భారీ స్థాయిలో విజువల్స్ తో తెరకెక్కించటంలో శంకర్ తనదైన ముద్ర వేశారు. ఇక RC-15 సినిమా చిత్రీకరణ జరుగుతున్న తీరు, ఆ సినిమా గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే. శంకర్ ఈ సినిమాతో తన బలమైన దారిలోకి తిరిగి వచ్చినట్లే కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటిస్తుండగా, ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్టార్ రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తున్నారు.
ఈ యాక్షన్ డ్రామాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి కూడా కీలక పాత్రలు పోషించనున్నారు. ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తుండగా, దిల్ రాజు నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌కి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు.
ఇక రామ్ చరణ్ – శంకర్ ల సినిమా కథ విజయానికి వస్తే.. ఈ చిత్రం ఒక పవర్ ఫుల్ మెసేజ్ తో కూడిన పొలిటికల్ డ్రామా అని తెలుస్తోంది. అవినీతిని నిర్మూలించే నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోంది. ఈ సోషల్ డ్రామాలో రామ్ చరణ్ పాత్ర అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తిగా కనిపించనున్నారు. అలాగే ఆయన ఒక ఐఎస్ అధికారి పాత్రను పోషిస్తున్నారని కూడా అంటున్నారు. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శంకర్ సినిమాలలో సాధారణంగా కనిపించే భారీ విఎఫ్ఎక్స్ దృశ్యాలు, ఖరీదైన సెట్లు RC15లో కనిపించవట.
Ram Charan- Shankar’s RC15 is has been creating waves from the day it was announced. The film went on floors after a grand Pooja ceremony that was attended by bigwigs from Tollywood, Kollywood, and Bollywood.
Already some major schedules have been shot in Pune, Amritsar, and East Godavari. Now for the next schedule, Shankar has decided to shoot in a massive set that will cost a whopping Rs 12 crores at Shamshabad and Ram Charan will be joining this schedule. The project is one of the most anticipated ones across industries, and Shankar, true to his style is leaving no expenses in set designs and lavish shoots.
Already a song was shot featuring Kiara Advani on a massive scale and a huge set. It looks like Shankar is back to his strong zone where the story is bigger than visuals with a native drama. Kiara Advani will be seen opposite the ‘RRR’ star while SJ Suryah is slated to play the villain in this film.
Srikanth, Jayaram, and Anjal will also be playing key roles in this action drama. SS Thaman is composing the tunes and Dil Raju is backing this project.
This Ram Charan – Shankar’s film is a political drama with a powerful message. This film is going to be on an anti-corruption theme. Ram Charan’s character is going to play an anti-corruption crusader in this social drama. This film is going to be unlike any of the other Shankar films. Reportedly, heavy usage of VFX and costly sets that are a part of Shankar’s films will be missing in RC15.
మల్టీప్లెక్స్‌లో సినిమా చూసి ఆనందించాలి అని చాలా మంది ప్రేక్షకులకు కోరికగా ఉంటుంది. కానీ, ప్రస్తుతం ఉన్న సినిమా టికెట్ రేట్లకు భయపడి మల్టీప్లెక్స్ అంటేనే ప్రేక్షకులు రావడానికి ధైర్యం చేయడం లేదు. ముఖ్యంగా కరోనా తరువాత టికెట్ రేట్లను అమాంతం పెంచేయడంతో ప్రేక్షకులు మరింత దూరమయ్యారు. అయితే అలాంటి వారందరికీ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(MIA) ఇటీవలే ఒక శుభవార్త అందించింది. నేషనల్ సినిమా డే(National Cinema Day) అయిన సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులు సినిమా చూసేందుకు వీలును కలిపిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.
ఈ మేరకు సెప్టెంబర్ 16న మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్ రేటును రూ.75కే అందించాలని MIA నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశంలోని అన్ని నగరాలలో ఉన్న పీవీఆర్, ఐనాక్స్, ఏషియన్ వంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో ఈ డిస్కౌంట్ రేటును అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని కూడా తెలిపారు. మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) థియేటర్ వ్యాపారాన్ని నిలబెట్టిన సినీ ప్రేక్షకులకు కృతజ్ఞతగా ఈ ఆఫర్ ప్రకటించటంతో అందరూ ఎంతో ఆనందించారు.
ఏదేమైనా మల్టీప్లెక్స్‌లకు ఎక్కవ ప్రాధాన్యతనిచ్చే నేటి యువతరానికి ఇది ఖచ్చితంగా మంచి వార్తేనని అందరూ భావించారు అని చెప్పాలి. అయితే తక్కువ ధరకే సినిమాని చూడగలం అనే ప్రేక్షకుల ఆనందాన్ని దూరం చేస్తూ మల్టీప్లెక్స్ థియేటర్ల యాజమాన్యం వారు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తాజాగా అందించిన సమాచారం.
తక్కువ టికెట్ రేట్ల వల్ల వ్యాపారానికి ఏమాత్రం అనుకూలించని పరిస్థితులు వస్తాయని డిస్ట్రిబ్యూటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అందుకే మళ్ళీ టికెట్లు విషయంలో సరికొత్త ట్విస్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
తగ్గించిన ధరల వల్ల ఒకరోజు వచ్చే ఆదాయం పైన ప్రభావం చూపినా కూడా చాలా వరకు నష్టాలు చూడాల్సి వస్తుంది అని.. అందుకే ఈ ఈనెల సెప్టెంబర్ 16వ తేదీన ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్న రోజున కాకుండా 23వ తేదీన జాతీయ సినిమా దినోత్సవ కానుకగా మల్టీప్లెక్స్ లలో 75 రూపాయల టికెట్ల ధరకు అమ్మనున్నారు. ఈ మేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MIA) అధికారిక ప్రకటన చేసింది.
అసోసియేషన్ చేసిన ప్రకటనలో, భారతదేశం అంతటా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) మరియు సినిమాస్, జాతీయ సినిమా దినోత్సవాన్ని పురస్కరించుకుని ₹75 సెలబ్రేటరీ అడ్మిషన్ ధరతో సినిమాల్లో ఒక రోజు గడపాలని సినీ ప్రేక్షకులను స్వాగతిస్తున్నాయి. జాతీయ సినిమా దినోత్సవాన్ని గతంలోనే ప్రకటించారు. అయితే, వివిధ ‘స్టేక్ హోల్డర్‌ల’ అభ్యర్థన మేరకు మరియు ప్రేక్షకుల భాగస్వామ్యాన్ని మరింత పెంచడానికి, జాతీయ సినిమా దినోత్సవం సెప్టెంబర్ 23న నిర్వహించబడుతుందని తెలిపింది.
PVR, INOX, Cinepolis, Carnival, MIRA, Citypride, ASIAN, Mukta A2, Movie Time, Wave, M2K మరియు Delite సహా 4000 కంటే ఎక్కువ స్క్రీన్‌లు ఈ వేడుకలో పాల్గొంటున్నాయని ప్రకటన పేర్కొంది.
విక్రమ్ సినిమా సాధించిన అద్భుతమైన విజయం వల్ల ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఒక్కసారిగా అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయారు. ఈ యువ దర్శకుడు ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న దక్షిణ భారత దర్శకులలో ఒకడు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే ఆయన నుంచి తదుపరి రానున్న సినిమాలు కూడా ఎంతో ఆసక్తికరమైన విదంగా ఉన్నాయి.
ఇక దక్షిణాది రాష్ట్రాల్లో అద్భుతమైన మార్కెట్‌ను సంపాదించుకున్నారు గనక ఇప్పుడు హిందీ మార్కెట్‌లో కూడా తన మార్కెట్ ను సృష్టించుకొవాలి అని చూస్తున్నారు లోకేష్. అందుకే తాను తదుపరి విజయ్‌తో చేయబోయే సినిమా కోసం సంజయ్ దత్‌ని విలన్‌గా తీసుకున్నారని సమాచారం. ఈ చిత్రం 2023లో విడుదల కానుంది. అంతే కాక ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమలో అత్యంత చర్చనీయాంశమైన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
సంజయ్ దత్ తాజాగా ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయిన కేజీఫ్-2 లో అధిరా పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇక ఓకే సినిమాలో ఇద్దరు స్టార్లను హ్యాండిల్ చేయడం దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు. మాస్టర్ సినిమాలో తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు విజయ్ సేతుపతి కాంబినేషన్ ను సమర్థవంతంగా నిర్వర్తించిన లోకేష్, విక్రమ్ లో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ వంటి మేటి తారలను కూడా చక్కని ఆసక్తికరమైన పాత్రలలో చూపించారు.కాగా దళపతి67 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం పిలవబడుతున్న ఈ చిత్రంలో సమంత, ప్రియాంక అరుల్ మోహన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దళపతి67 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. కాగా విశ్వసనీయ వర్గాల నివేదికల ప్రకారం, ఈ సినిమాలో విలన్‌గా నటించేందుకు గానూ సంజయ్ దత్‌కు 10 కోట్ల రూపాయల భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా హీరో విజయ్ కు, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.
సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధిర ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ ప్యాన్ ఇండియా ఘనవిజయం తర్వాత, రాజమౌళి పేరు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మారు మ్రోగిపోయింది.
ఇక మహేష్ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్యాన్-ఇండియా సినిమా చేయనప్పటికీ, దేశవ్యాప్తంగా ఆయనకు ఉన్న ప్రజాదరణ మరియు స్టార్డం ఏ ప్యాన్-ఇండియా స్టార్‌ల కంటే కూడా తక్కువ కాదనే చెప్పాలి. ఇక ప్రేక్షకులు మాత్రం మహేష్ – రాజమౌళి సినిమా ప్రకటించిన రోజునుండి ఈ సినిమా మీద చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే రాజమౌళి-మహేష్ బాబు ప్రాజెక్ట్ ప్రారంభం కావడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఇక ఇలాంటి భారీ మరియు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పై పుకార్లు పుట్టడం మామూలే. ఇప్పటికే ఈ చిత్రం పై అనేక రూమర్లు మరియు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.
కాగా ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్‌లో, రాజమౌళి తన సినిమా నుండి ఏమి ఆశించాలో పరోక్షంగా ప్రేక్షకులకు సూచించారు. మహేష్‌తో తను తదుపరి చేయబోయే చిత్రం మొత్తం ప్రపంచాన్ని కదిలించే యాక్షన్ అడ్వెంచర్‌గా ఉంటుందని రాజమౌళి అన్నారు. మామూలుగా ఆయన మహేష్ తో సినిమా చేస్తున్నారు అంటేనే ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. ఇక స్వయంగా రాజమౌళి నుంచి ఇలాంటి భారీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ అంచనాలను మరింతగా పెంచిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ప్రేక్షకులు ఇటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్‌ని చూడటానికి.. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూసి ఆనందించి ఇతర దేశాల సినీ ప్రేమికులు కూడా అమితమైన ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
ఇక హీరో మహేష్ బాబు తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ అయిన SSMB 28 సినిమా షూట్‌ను ప్రారంభించారు. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 28 ఏప్రిల్, 2023న విడుదల కానుంది. షూటింగ్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఒక చిన్న విడియో గ్లింప్స్ ను విడుదల చేసారు చిత్ర బృందం.
రణ్‌బీర్ కపూర్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రల్లో, అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మించిన “బ్రహ్మాస్త్ర” బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచే వైపు పరుగులు తీస్తుంది. ఈ చిత్రం ఓపెనింగ్ వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను సాధించి ప్రపంచవ్యాప్తంగా 225 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
బాలీవుడ్ ట్రేడ్ పండితుల నివేదికల ప్రకారం బ్రహ్మాస్త్ర హిందీ వెర్షన్ తొలి దాదాపు రూ.120 కోట్లు రాబట్టింది. కాగా ఇదివరకు మొదటి వారాంతం అంటే డైరెక్ట్ హిందీ సినిమాల ఓపెనింగ్ వీకెండ్ రికార్డ్ రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజూ సినిమా సాధించింది. దేశ వ్యాప్తంగా సంజు సినిమా120 కోట్ల నెట్‌తో రికార్డు సృష్టించగా.. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 125 కోట్ల నెట్‌ని వసూలు చేసింది. ఈ క్రమంలో రణ్‌బీర్ తన రికార్డును తానే బద్దలు కొట్టారన్నమాట. అంతే కాకుండా హిందీ చిత్రాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేసింది బ్రహ్మస్త్ర.
ఇక తన చిత్రానికి లభించిన భారీ ఓపెనింగ్స్ చూసి దర్శకుడు అయాన్ ముఖర్జీ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కేవలం దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ చాలా రుణపడి ఉన్నట్లు ఆయన తెలిపారు. బ్రహ్మాస్త్ర సినిమాకి లభించిన ప్రేమ, ఆదరణ నిజంగా తమ చిత్ర బృందానికి ఉత్తేజకరమైన భావనతో పాటు భావోద్వేగానికి లోనయ్యేలా చేసిందని.. ఓపెనింగ్ వీకెండ్ కు భారీ స్థాయిలో స్పందన ఇచ్చి తమను ఆశీర్వాదించిన ప్రేక్షకులకు కృతజ్ఞుడిని చేసిందని, ఇక రాబోయే వారాల్లో కూడా ప్రేక్షకులు తమ సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
బ్రహ్మాస్త్ర సినిమా విజయం బాలీవుడ్ పరిశ్రమకు ఎంతో అవసరమైనదిగా చెప్పవచ్చు. అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్ నటించిన లాల్ సింగ్ చద్దా, ఖిలాడి అక్షయ్ కుమార్ చేసిన రక్షా బంధన్, బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ మరియు రణబీర్ కపూర్ హీరోగా చేసి ఇటీవలే విడుదలైన షంషేరాతో సహా హిందీ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అనేక భారీ-బడ్జెట్ ఫ్లాప్‌లను చూసింది. పైగా లాల్ సింగ్ చద్దాతో సహా అనేక పెద్ద సినిమాలకి చాలా ఇబ్బంది కలిగించిన బాయ్కాట్ నినాదాల ప్రభావం గురించి కూడా చాలా చర్చ జరిగింది.
ఏది ఏమైనప్పటికీ, బ్రహ్మాస్త్ర అటువంటి బాయ్కాట్ ట్రెండ్ తో పాటు తొలిరోజు నెగటివ్ సమీక్షలను కూడా ఎదురుకుని బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఇదే తరహాలో లాంగ్ రన్ ను కొనసాగిస్తుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి. కాగా విడుదలకు ముందే బ్రహ్మస్త్ర సినిమాకు దాదాపు లక్ష టిక్కెట్లు అమ్ముడవ్వడం విశేషం.