Home Blog Page 2008

కార్తికేయ-2 విజయం తరువాత హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టిన హీరో నిఖిల్

0

కార్తికేయ-2.. గత నెలలో విడుదలైన ఈ చిత్రం అనూహ్యంగా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సాధించిన చిత్రం. నిఖిల్ సిద్ధార్థ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఆధ్యాత్మిక అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమాకి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ద్వారకా నగరం శ్రీకృష్ణుడి చుట్టూ తిరుగుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ -అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఈ చిత్రంలో ఒక కీలకమైన సన్నివేశంలో కనిపించే అతిథి పాత్రలో నటించారు. శ్రీనివాస రెడ్డి- వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు.

ఇక ఈ సినిమా రేపిన బాక్సాఫీస్ దుమారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలు ఎవరు కూడా ఏమాత్రం ఊహించని విధంగా బాలీవుడ్ లో సైతం ఈ సినిమా విజయ కేతనం ఎగరవేసింది. హిందీ వెర్షన్ తొలి రోజు కేవలం 50 థియేటర్లలో రిలీజ్ అయినా.. సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో థియేటర్ల సంఖ్య వేయికి, ఆ పైన రెండు వేల థియేటర్ల వరకు పాకడం విశేషం. దాన్ని బట్టే కార్తికేయ-2 హిందీ బెల్ట్ లో ఏ స్థాయిలో విజయాన్ని నమోదు చేసిందో అర్థం అవుతుంది.

అయితే హిందీ మార్కెట్లలో కార్తికేయ2 సాధించిన ఘనవిజయంతో నిఖిల్ చాలా ఉత్సాహంగా ఉన్నారు . కాగా అనుకోకుండా వచ్చిన ఈ మార్కెట్ ను కోల్పోకుండా ఉండాలని నిఖిల్ ఆశిస్తున్నారని తెలుస్తోంది. అందుకే తన రాబోయే సినిమాలను హిందీలో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. నిఖిల్ తదుపరి చేయబోయే సినిమాలు 18 పేజీస్ మరియు స్పై.

ప్రస్తుతం నిఖిల్ ఈ రెండు సినిమాల బృందంతో ఇదే విషయమై చర్చలు జరుపుతున్నారు అని తెలియవచ్చింది. ఇక పై తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించడానికి తను నటించే సినిమాల్లో అవసరమైన మార్పులను చర్చిస్తున్నారట.

అయితే హిందీ మార్కెట్ పై పట్టు సాధించడం అంత సులభం కాదనే చెప్పాలి. అక్కడ హీరో ఇమేజ్ కన్నా కూడా సినిమా కంటెంట్ పైనే ప్రేక్షకులు దృష్టి పెడతారు. మరీ ముఖ్యంగా కరోనా పాండెమిక్ తర్వాత వారు సినిమాలు చూసే విధానంలో మార్పు వచ్చింది.

కార్తికేయ-2 సినిమా అంతా కృష్ణతత్వం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి ఉత్తరాది ప్రేక్షకులని ఆ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ అక్కడ కార్తికేయ-2 థియేటర్లు హౌస్ ఫుల్ అవుతున్నాయంటే అది ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అంత అనూహ్యమైన స్పందన రాబట్టే.. హిందీ డబ్బింగ్ వెర్షన్ తెలుగు చిత్రాల్లో ‘కార్తికేయ-2’ టాప్ 10 లో స్థానం దక్కించుకుంది.

నిఖిల్ తదుపరి చేయబోయే సినిమా పై కొంతవరకు ఉత్తరాది ప్రేక్షకులు దృష్టి పెడతారు అనేది అయితే వాస్తవం. ఆ చిత్రంతో గనక వాళ్ళను నిఖిల్ ఆకట్టుకోగలిగితే తను అనుకున్నట్లు నిజంగానే హిందీ మార్కెట్లో జెండా పాతేయచ్చు. మన తెలుగు హీరో హిందీలో కూడా నిలదొక్కుకుంటే అది అందరూ ఆనందించే విషయమే కదా. మరి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న యువ హీరో నిఖిల్ ఆశలు ఫలించాలని ఆశిద్దాం.

Actor Nikhil Focuses On Hindi Market Now; Reworking On His New Movies

0

After the humungous success of Karthikeya 2, Nikhil is at the tip of everyone’s tongue. While the success of the Telugu version was somewhat expected, the success of the Hindi version was unprecedented and crosses all barriers to become a raging sensation in the North.

Nikhil is now in full josh after the success of the Hindi version and wants to capitalize on that market. Nikhil has always enjoyed a decent market in the Telugu states but he wants to now focus on the Hindi markets.

He has decided to release his upcoming movies in Hindi also to cater to his Pan-Indian market. Nikhil also has two upcoming movies in the form of 18 Pages with Anupama Parameswaran, which is a romantic comedy written by Sukumar. He also has another spy thriller film that can work very well in the North market.

Nikhil is now in discussions with the makers of these two movies to change certain aspects to attract the North audiences as well as the Telugu audiences. He is on a career-high at the moment with Karthikeya 2 and will be looking to release his next films soon and continue the hype.

రీ రిలీజ్ సినిమాలలో అల్ టైం రికార్డు సృష్టించిన చెన్నకేశవరెడ్డి

0

నందమూరి బాలకృష్ణ హీరోగా.. వివి వినాయక్ దర్శకత్వంలో.. బెల్లంకొండ సురేష్ నిర్మించిన మాస్ ఫ్యాక్షన్ డ్రామా ‘చెన్నకేశవ రెడ్డి’ , ఇరవై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 25న మళ్లీ విడుదల కానుంది. కాగా ఆ తేదీన రెగ్యులర్ షోలు ప్రారంభం కావడానికి 24 గంటల ముందే.. అనేక ప్రీమియర్ షోలను సెప్టెంబర్ 24న నిర్వహించనున్నట్లు నిర్మాత గురువారం ప్రకటించారు.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 300కి పైగా స్క్రీన్లలో విడుదల కానుంది. పైగా విశేషం ఏమిటంటే.. ఆయా షోల ద్వారా ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా సాధించిన వసూళ్లలో 75 శాతం బసవతారకం ట్రస్టుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈరోజు తెలిపారు.

ఇది నిజంగా ఎంతో అభినందనీయం. కేవలం అభిమానుల ఆనందం కోసం సినిమాని మళ్ళీ ప్రత్యేకంగా విడుదల చేయడమే కాకుండా.. ఆ ప్రత్యేక ప్రదర్శనల ద్వారా వచ్చిన డబ్బును ఇలా సమాజానికి ఉపయోగపడే విధంగా ఇవ్వడం గొప్ప పని అనే చెప్పాలి.

నటసింహ బాలయ్య బాబు మరియు మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఇరువురి కెరీర్ లో ఈ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. 2002 సంవత్సరంలో విడుదలయిన చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శ్రియ శరణ్ కథానాయికగా నటించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించారు. పాటలతో పాటు ఆయన ఈ సినిమాకి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ కేవలం బాలయ్య అభిమానులనే కాక ఇతర సినీ అభిమానులను కూడా అలరిస్తుంది.

‘పోకిరి’, ‘జల్సా’ చిత్రాల తర్వాత మరో స్టార్ హీరో సినిమా భారీ హైప్‌ మధ్య ఇలా రీ రిలీజ్ కాబడుతొంది. నిజానికి గతేడాది హైదరాబాద్ లోని దేవి థియేటర్లో చెన్నకేశవరెడ్డి ఫ్యాన్స్ స్పెషల్ షో వేశారు. కరోనా పాండమిక్ టైంలోనూ థియేటర్ దద్దరిల్లిపోయే స్థాయిలో నందమూరి అభిమాన గణం రావడం విశేషం.

కాగా వచ్చే నెలలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సంధర్భంగా ‘బిల్లా’, ‘వర్షం’ తదితర సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

ఎన్టీఆర్ కావాలనే కొరటాల శివ సినిమాని ఆలస్యం చేస్తున్నారా?

0

RRR సినిమా తర్వాత హీరో ఎన్టీఆర్.. దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమా పోయిన మే నెలలో లేదా జూన్‌లోనే సెట్స్‌ పైకి వెళ్లాల్సి ఉంది కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. ఆచార్య సినిమా అనూహ్యంగా భారీ డిజాస్టర్ ఫలితాన్ని ఇచ్చినప్పటి నుండి, కొరటాల శివకు పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవనే చెప్పాలి.

ఆచార్య సినిమా కొనుగొలుదార్లకు భారీగా నష్టాలు రావడంతో.. కొరటాల కొద్ది రోజుల వరకు ఆ నష్టాల పూడ్చే పనిలో పడ్డారు. అయితే ఈ వ్యవహారం అంతా చక్కదిద్దేందుకు కాస్త సమయం పడుతుంది అని వార్తల నేపథ్యంలో ఆచార్య చిక్కుల్లోంచి కొరటాల శివ పూర్తిగా బయటపడ్డాకే తన సినిమా మొదలు అవుతుందని ఎన్టీఆర్ స్పష్టం చేశారట. ఇక కొరటాల ఆచార్య నష్టాల వ్యవహారం నుంచి మొత్తంగా బయట పడ్డ తర్వాత, ఆయన తన పూర్తి దృష్టిని ఎన్టీఆర్ చిత్రం వైపు మళ్లించారు.

అదే క్రమంలో స్క్రిప్ట్‌ వర్క్ కు సంభందించిన పనులను ప్రారంభించారు.అయితే ఆ తర్వాత ఎన్టీఆర్ స్క్రిప్ట్‌లో పలు మార్లు మార్పులు చేర్పులు చేయమని కోరారు. అయన సూచనల మేరకు కొరటాల తన స్క్రిప్ట్‌లో చాలా మార్పులు చేసినప్పటికీ, ఎన్టీఆర్ ఇప్పటికీ స్క్రిప్ట్‌ను ఓకే చేయలేదని తెలుస్తోంది. దీంతో అసలు ఈ సినిమాపై ఎన్టీఆర్ ఆసక్తి చూపుతున్నారా లేదా అని నిర్మాతలు ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి ఆందోళన చెందుతున్నారట.

ఈ నేపథ్యంలో కొరటాల శివతో కలిసి నటించేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపడం లేదనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పుడు వేరే దర్శకుల కోసం వెతికే ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రస్తుతానికి ఎవరూ ఖాళీగా లేరు. ఒక్కో డైరెక్టర్ ఒక్కో హీరోతో సినిమాలకు కమిట్ అయి ఉన్నారు. అందువల్లే ఎన్టీఆర్ ఇంకా కొరటాల సినిమాని పూర్తిగా రద్దు చేయలేదు.

ఇదివరకే చెప్పుకున్నట్లు ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ చాలా జాగర్తలు తీసుకుంటున్నారు. అందుకే ఒకటికి రెండుసార్లు దర్శకుడు కొరటాల శివకు మార్పులు చేయమని సూచించారు. మరి కొరటాల శివ నుంచి వచ్చే ఫైనల్ నేరేషన్ అయినా ఎన్టీఆర్‌ని ఒప్పించగలదో లేదో వేచి చూడాలి.

NTR Intentionally Delaying The Film With Koratala Siva?

0

NTR’s film with Koratala Siva was supposed to go on floors in May or June but the shooting has still not been started. Ever since the disastrous result of Acharya, things have not been going in Koratala Siva’s favor.

Due to the heavy losses incurred from Acharya, Koratala was busy compensating for these losses. NTR had made it very clear that the movie will start only when Koratala Siva is fully out of the Acharya mess. After Koratala cleared the losses, he directed his complete attention toward the NTR film and started working on the script.

But later on, NTR asked for changes in the script continuously. Despite many changes in the script, NTR has still not okayed the script. The producers are now worrying about the project as to whether NTR is interested in the film or not.

Even some members of the industry are hearing the news that NTR is no longer interested to work with Koratala Siva. NTR is now looking for other directors but the issue is that no one is free at the moment. This is the reason why NTR is still holding on to the project with Siva. We will have to wait and see if the final narration from Koratala Siva manages to convince NTR.

రీ రిలీజ్ లో రికార్డులు బద్దలు కొడుతున్న చెన్నకేశవరెడ్డి

0

టాలీవుడ్లో ప్రస్తుతం రీ-రిలీజ్‌లు సీజన్‌లో ట్రెండ్‌గా మారాయి. టైం మెషీన్ లో వెనక్కి వెళ్లిన తరహాలో.. తెలుగు సినీ అభిమానులు తమ అభిమాన హీరోల మాస్ బ్లాక్‌బస్టర్‌లను ఆస్వాదించడానికి అవి సరైన మార్గంగా అవతరించాయి. గతంలో సూపర్ హిట్ గా నిలిచిన పలు హీరోల సినిమాలను ఆయా హీరోల పుట్టినరోజు లేదా సినిమా వార్షికోత్సవం సందర్భంగా సినిమా రీ రిలీజ్ చేస్తున్న దాఖలాలు ఈ మధ్యకాలంలో బాగా పెరిగాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా, తమ్ముడు, ఒక్కడు, పోకిరి వంటి సినిమాలను రీ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

మరి మాస్ బ్లాక్‌బస్టర్‌ల గురించి మాట్లాడుతూ.. మాస్ గాడ్ గా పేరు గాంచిన బాలయ్య గురించి చెప్పకపోతే ఎలా.. నందమూరి బాలకృష్ణ ఫిల్మోగ్రఫీలో అలాంటి సినిమాలు చాలా ఉన్నాయి. అందులో ఒక సినిమా చెన్నకేశవరెడ్డి.

చెన్నకేశవ రెడ్డి రీ-రిలీజ్ అవుతుందనే అధికారిక ప్రకటన వెలువడినప్పటి నుంచి నందమూరి అభిమానుల్లో తారాస్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్సాహమే ఈ సినిమా రీ-రిలీజ్‌లలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడానికి దారి తీసింది.

చెన్నకేశవరెడ్డి సినిమా అమెరికాలో మొత్తం 31 చోట్ల విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బుకింగ్‌ల ద్వారా పాతిక వేల డాలర్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. జల్సా సినిమా విషయానికి వస్తే ఈ కలెక్షన్లు 37 వేల డాలర్లతో అత్యధిక వసూళ్ల రికార్డ్ ప్రస్తుతం తన పేరిట ఉంచుకుంది, కానీ ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే చెన్న కేశవ రెడ్డి ఈ రికార్డ్‌ను చాలా సునాయాసంగా బద్దలు కొట్టేలా ఉంది.

2002లో విడుదలైన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. కాగా టబు మరియు శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించి తనదైన శైలిలో మాస్ డైలాగ్స్ వల్లించి ప్రేక్షకులని విపరీతంగా అలరించారు. అలాగే ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా తెరకెక్కించారు.

ముఖ్యంగా సినిమాలో.. బాలకృష్ణ సత్తిరెడ్డి అనే డైలాగ్ చెప్పగానే భూమి లోంచి సుమోలు పైకి లేచే సన్నివేశం మాస్ ప్రేక్షకులను అమితంగా అలరించింది. అలాగే తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలతో పాటు బ్రహ్మానందం పెళ్లికి ముహూర్తం పెట్టే కామెడీ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

నా పని నన్ను చేసుకొనివ్వండి అంటున్న సురేందర్ రెడ్డి

0

అఖిల్ అక్కినేని – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఏజెంట్ సినిమా చాలా కాలంగా తెరకెక్కే పనిలో ఉంది. COVID-19 కారణంగా షూటింగ్ ఆలస్యం అవడంతో సహా ఈ చిత్రం అనేక అడ్డంకులను ఎదుర్కొంది. దర్శకుడు సురేందర్ రెడ్డికి ఏజెంట్ నిర్మాతల మధ్య కూడా నిరంతరం విభేదాలు వచ్చాయని పలు రకాల కథనాలు వచ్చాయి.

ఇక తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలోని ఒక్కో సీన్ కోసం సురేందర్ రెడ్డిని నిర్మాతలు ఇబ్బంది పెడుతున్నారట. ప్రతి షెడ్యూల్ లో కూడా, వారు మార్పులు చేర్పులు చేస్తూ వారు చెప్పినట్టు చేయమని సురెందర్ రెడ్డిని అడుగుతున్నారట. అంతే కాకుండా వివిధ వ్యక్తుల నుండి సలహాలు తీసుకుంటున్నారట. ఇక అఖిల్ తండ్రి అయిన నాగార్జున నుండి కూడా స్క్రిప్ట్ విషయంలో సూచనలు తీసుకొని దానికి అనుగుణంగా కథను మార్చమని సురేందర్ రెడ్డిని కోరుతున్నారని తెలుస్తోంది.

ఇలా ప్రతి దశలో ఏజెంట్‌ సినిమాలో మార్పులు చేయమని దర్శకనిర్మాతలు ఒత్తిడి చేయడం వల్ల సురేందర్ రెడ్డి తీవ్రంగా కలవరపడుతున్నారని తెలియవస్తుంది. ఇక నిరంతరం సలహాలు, సూచనలతో విసిగిపోయిన సురేందర్.. సినిమా స్క్రిప్ట్ వర్క్, షూటింగ్‌లో ఎలాంటి జోక్యం అక్కర్లేదని నిర్మాతలకు తెలిపారట. ఈ అంశాలను తనకు పూర్తిగా వదిలేయాలని ఆయన వారిని మర్యాదపూర్వకంగా అభ్యర్థించారట.

తాను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నట్లు, జీవితానికి ఈ సినిమాకి ఒకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు సురేందర్ రెడ్డి తెలిపారట. మరి దీని తర్వాత నిర్మాతకు ఏలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి.

సురేందర్ రెడ్డి గతంలో కొన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సినిమాలను అందించారు. అయితే కెరీర్ లో భారీ హిట్లు ఉన్నా కూడా.. ఇమేజ్ పరంగా చాలా తక్కువ అంచనా వేయబడిన కమర్షియల్ డైరెక్టర్లలో ఒకరని చెప్పవచ్చు. రేసు గుర్రం, కిక్ లాంటి సినిమాల విజయంలో ఆయనే కీలక పాత్ర పోషించారు. ఏజెంట్‌ సినిమాతో కూడా అలాంటి భారీ విజయం సాధించి ప్రేక్షకులని అలరిస్తారని ఆశిద్దాం. ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఏజెంట్‌ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇతర పాత్రల్లో మరికొందరు సుప్రసిద్ధ నటులు నటించారు. సురేందర్ రెడ్డి గత సినిమాలకు రచయితగా పనిచేసిన వక్కంతం వంశీనే ఏజెంట్ సినిమాకు కూడా కూడా రాశారు.

Is Rajamouli Still Jealous Of His Own All-Time Blockbuster Baahubali?

0

There is no denying that Rajamouli is the biggest director in Indian cinema right now. His rise to fame was the Baahubali franchise which created wonders at the box office. Baahubali 2 became the highest-grossing Indian film of all time as well.

After Baahubali, Rajamouli’s next movie RRR has also created massive waves in India and all over the world but Rajamouli seems unsatisfied. Although RRR is a great success, it has failed to create the same waves that Baahubali made. In fact, it has not even come close to Baahubali.

After this, Rajamouli and the team of RRR did their best to push RRR further through publicity campaigns and some paid partnerships. Rajamouli also stated in multiple interviews that Baahubali did not get as much appreciation as RRR. He said that RRR received more international attention than Baahubali and that RRR went to the next level.

Rajamouli also put his best efforts to get RRR nominated for the Oscars but it did not work out. They are still further looking for more options to send RRR to the Oscars and there is a very high chance of an Oscar win from India. Rajamouli seems keen to push RRR as the bigger movie but people still think that Baahubali was the bigger spectacle.

RC-15: దిల్ రాజు తీరుతో సంతోషంగా లేని శంకర్

0

కేవలం తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు యావత్ భారతదేశ సినీ రంగంలోని అగ్ర నిర్మాతలలో దిల్ రాజు ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ తొలినాళ్ళ నుండి ఆయన సినిమాల్లో సక్సెస్ రెట్ ఎక్కువ.. నిరంతరం సూపర్‌హిట్‌లను అందించడంలో ఆయన దిట్ట. ఎందుకంటే కథల ఎంపికలో, జడ్జ్మెంట్లో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉండటం వల్లే అది సాధ్యపడింది.

మరియు పని చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ సినిమాలని క్రమశిక్షణతో తెరకెక్కించే వైఖరికి ప్రసిద్ధి చెందారు దిల్ రాజు. ఇక ఆయన చేతిలో ప్రస్తుతం రెండు భారీ ప్యాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. కాగా ఒకే సమయంలో ఆ రెండు భారీ చిత్రాల నిర్మాణ పనులను నిర్వహిస్తున్నారు.

ఆ రెండు సినిమాలు ఏవంటే.. దక్షిణ భారత సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకుడైన శంకర్‌ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC15.. అలాగే వంశీ పైడిపల్లితో తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న వరిసు (తెలుగులో వారసుడు).

ముందుగా చెప్పుకున్నట్లు.. అగ్ర నిర్మాతల జాబితాలో దిల్ రాజు ఖచ్చితంగా అగ్రస్థానంలో ఉంటారు, కానీ సినిమా నిర్మాణంలో ఆయన చాలే లెక్కలు వేసుకుంటూ ఉంటారు. స్టార్ హీరోలతో సినిమా తీసినా కూడా, అత్యవసరం అయితే తప్ప ఆయన బడ్జెట్ చేయి దాటకుండా పరిమితంగా ఉండేలా చూసుకుంటారు. కానీ దర్శకుడు శంకర్ శైలి అలా కాదు.. ఆయన సినిమా బడ్జెట్ గురించి పెద్దగా ఆలోచించడానికి ఇష్ట పడరు. కేవలం సినిమాలోని కంటెంట్ పైనే దృష్టి పెడతారు.

ఆ రకంగా సినిమాని తెరకెక్కించే ప్రక్రియలో నిర్మాత కంటే శంకర్ దే పై చేయి ఉంటుంది. ఇప్పటి వరకు ఆయనతో సినిమాలు తీసిన నిర్మాతలు అందరూ శంకర్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన వారే. అందుకే బడ్జెట్ విషయంలో ఎలాంటి టెన్షన్ పడకుండా కంటెంట్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా భారీ స్థాయిలో సినిమాలను రూపొందించారు.

అయితే దిల్ రాజు మాత్రం RC-15 సినిమా షూటింగ్లో రోజుకో లెక్కలు వేస్తూ వస్తున్నారట. దీంతో శంకర్ కలత చెందారని సమాచారం . ప్రతి సన్నివేశంలో దిల్ రాజు నిరంతరం పాల్గొనడం వల్ల శంకర్ అసౌకర్యానికి గురవుతున్నారట. ఇక దిల్ రాజు బృందం కూడా ప్రతి సన్నివేశానికి బడ్జెట్ తగ్గించాలని చూస్తుందట.

ఇంతకుముందు కూడా, బడ్జెట్‌కు సంబంధించి ఇలాంటి లెక్కల కారణంగానే దిల్ రాజు భారతీయుడు 2 ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. సాధారణంగా దిల్ రాజు బడ్జెట్‌ విషయంలో లెక్కలు వేసుకోవడం తప్పు లేదు, అయితే సినిమాలను తెరకెక్కించే విషయంలో ఎంతో గొప్ప విజన్‌ ఉందని పేరుగాంచిన శంకర్ వంటి దర్శకులకు మాత్రం స్వేచ్ఛ ఇవ్వాలి. అలాంటప్పుడే సినిమా సరైన ఫలితం రాబట్టే అవకాశాలు ఉంటాయి.

The epic classic blockbuster combo is joining hands for another film

0

Hanu Raghavapudi’s Sita Ramam has given Tollywood what it was yearning for a long – a classic blockbuster love story. The film was a massive success and gained the audience’s love worldwide. Such has been the movie’s theatrical experience that the audience thronged the theatres even after its OTT release.

Dulquer Salmaan’s charming screen presence and debutant Mrunal Thakur’s elegant presence made the movie a great watchable experience. Hanu Raghavapudi is now coming back with another project. This project will star Dulquer Salmaan and Mrunal Thakur and will be backed by Vyjayanthi Movies as well.

While the details of this upcoming movie are not revealed yet, it looks like the film will not be delayed much considering the euphoria of Sita Ramam.

Hanu Raghavapudi has made a strong comeback with this period romantic drama. The movie got great collections for Aswini Dutt who has bankrolled it under Vyjayanthi Movies Banner. This classic blockbuster also starred Rashmika Mandanna, Sumanth, and Tharun Bhascker in key roles.