Home Blog Page 2002

ABN, Mahaa, TV5 ఛానెల్‌ల పై బాయ్కాట్ ట్రెండ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

0

ఎన్టీఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీగా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయం పై టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ పరిస్థితుల వేడి తారాస్థాయికి చేరుకుంది.

ఇరు పక్షాల మధ్య ఇలా మాటల యుద్ధం నడుస్తుండగా, ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన కూడా అనుకోని విధంగా వివాదానికి కేంద్రంగా మారింది. ఆ తర్వాత అన్ని వైపుల నుండి ఎన్టీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు వ్యక్తం అవుతుండడంతో.. ఇక లాభం లేదని తమ హీరో వైపు నిలబడటానికి ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగారు. ఇంతకీ అంతలా దుమారం రేపేలా ఎన్టీఆర్ ఎం ట్వీట్ చేశారు అనేది చూద్దాం.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్‌లో, “ఎన్టీఆర్ మరియు వైఎస్ఆర్ ఇద్దరూ అపారమైన ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఒకరి పేరును మరొకరితో భర్తీ చేయడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, అలాగని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. యూనివర్శిటీ పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ సంపాదించిన కీర్తిని, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆయన ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేము” అన్నారు.

అయితే టీడీపీ ముఖ్య నాయకులు మరియు ఇతర పార్టీ సభ్యులు ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే టీడీపీ మద్దతుదారులైన కొన్ని మీడియా వర్గాలు ఇది దౌత్యపరంగా చేసిన చాలా చప్పని ప్రకటనగా పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌లను పోలుస్తూ చేసిన ఈ ప్రకటన టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ గారిని అవమానించడమే కాక మరేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు.

ABN, Mahaa News మరియు TV5 వంటి న్యూస్ ఛానెల్‌లు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా సరైన ప్రకటన చేయని కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ కార్యక్రమాలు జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రధాన లక్ష్యంగా చేసుకోవడమే కాక హద్దులు దాటి వ్యక్తిగత ప్రకటనలు చేయడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

ఈ మొత్తం వివాదం వల్ల ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా ఇప్పుడు రెండుగా చీలిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీవీ ఛానెల్‌ల పై BoycottABNandMahaaNews అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు.

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సూర్య – సిరుతై శివ సినిమా

0

తమిళ స్టార్ సూర్య – దర్శకుడు శివల కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తోంది. ఈ సినిమా అటు దర్శకుడు శివతో పాటు సూర్యకు కూడా చాలా కీలకం. శివ ఇటివలే “అన్నత్తె” (తెలుగులో పెద్దన్న) సినిమాతో భారీ డిజాస్టర్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అలాగే హీరో సూర్య కూడా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక తన స్టార్డం పై అనుమానాలు వచ్చే దశలో ఉన్నారు.

సూర్య ఇటీవల జై భీమ్, సూరరై పొట్రు చిత్రాలలో తన నటనకు చక్కని ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా, “సూరరై పొట్రు” చిత్రానికి గానూ సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. “తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్” సినిమాలో నటనకు అజయ్ దేవగణ్ తో కలిసి సూర్య ఈ గౌరవాన్ని పంచుకున్నారు.

అయితే, నటన విషయంలో సూర్య ప్రతిభను ఎప్పుడూ తక్కువ చేసే అవకాశం ఆయన ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఆయనకు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక భారీ కమర్షియల్ సక్సెస్ ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఉంది. అయన చివరిగా హీరోగా నటించిన ET సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశించారు కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాంటి సమయంలో సూర్య – శివ కలిసి ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.

కాగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, మరియు అన్ని భాషలలో 3D వెర్షన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇది కేవలం సినిమా ప్రారంభ దశలోనే ఉన్న వార్త.

ఇక ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ మరియు బిజినెస్ ఎంత వరకు అవుతుందో చూడాలి. ప్రస్తుతం ప్రేక్షకులకి చాలా సాంకేతిక విప్లవం అందుబాటులో ఉంది. మరి వారిని ఆకట్టుకోవాలి అంటే చిత్ర బృందం సంచలనాన్ని సృష్టించే, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో ముందుకు రావాలి.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని గట్టిగా చెబుతున్నారు. ఇక ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . దిశా పటానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారనే వార్తను దాదాపు ఖరారు చేసుకోవచ్చు.

స్టూడియో గ్రీన్ మరియు UV క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సూర్య 42వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. కాగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Vijay and Atlee are in talks for their biggest pan-India film

0

Kollywood star Vijay is on a signing spree. The actor is currently shooting for Varisu with Tollywood director Vamsi Paidipally. Dil Raju will be bankrolling this project and according to the ace producer, the Tamil star was simply stunned by the story.

Thalapathy’s lineup after Vamsi Paidipally also looks quite interesting. He will team up with his ‘Master’ director Lokesh Kanagaraj for another movie #Thalapathy67. Lokesh is currently busy with Kamal Haasan starrer Vikram.

Once this project is done there is another Vijay-Atlee movie on cards. Vijay-Atlee is a super successful combination. The duo has delivered superhits like Theri, Mersal, and Bigil and is looking to repeat the same success fourth time as well. Atlee is currently busy with the Shahrukh Khan project and it will take some time for him to regroup with Vijay.

The film is planned on a Rs 300Cr budget and will release in all Indian languages. Thendal Studios is producing the film. Both Vijay and Atlee are busy with their commitments till the first half of 2023. And this project will go on floors sometime next year’s second half.

NTR fans trending to boycott ABN, Mahaa and TV5 channels

0

The recent decision of AP Government to rename NTR Medical University into YSR Medical University has snowballed into a massive controversy. While the political war of words is on between TDP and YCP, Jr NTR’s statement on this issue has also become a center of controversy and NTR fans have jumped into the fray.

In a tweet, Jr NTR said, “Both NTR and YSR are great leaders who have gained immense popularity. The respect brought by replacing one’s name with another’s does not raise the stature of YSR, nor does it lower the stature of NTR. Renaming the university cannot erase the fame NTR earned, his stature in the history of the Telugu states, and his memories in the hearts of the Telugu people.”

TDP cadre and certain sections of media felt that this was a pretty cold statement made diplomatically. They felt this statement of comparing NTR and YSR was insulting to the TDP founder. News channels like ABN, Mahaa News and TV5 ran special programs on this issue and cornered Jr. NTR for his weak statement. These programs even made some personal statements targeting Jr. NTR which has angered his fans.

Even Nandamuri fans are now divided into two. Jr. NTR fans started trending to counter-attack the TV channels with the hashtag BoycottABNandMahaaNews

రష్యాలో రిలీజ్ కానున్న పుష్ప – ది రైజ్

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశ వ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా పుష్ప ది రైజ్ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ నటనకు దేశం మొత్తం దాసోహం అయిపోయింది. తగ్గేదేలే అంటూ అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ మరియు మ్యానరిజం సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం విడుదలై దాదాపు సంవత్సరం పూర్తి కావస్తున్నా.. ప్రేక్షకులలో ఈ సినిమాకున్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ సోషల్ మీడియా వేదికగా పుష్ప సినిమా ఏదో రకంగా వైరల్‌ అవుతూనే ఉంది. ముందుగానే చెప్పుకున్నట్లు తగ్గేదేలే వంటి డైలాగులు మరియు సామీ సామీ, ఊ అంటావా మామా పాటలు ఇన్స్టా రీల్స్ ద్వారా నిరంతరం ప్రచారంలో ఉంటున్నాయి.

తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. ఇటీవల ఈ చిత్రాన్ని మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్‌బాస్టర్‌ హిట్లుగా నిలిచిన చిత్రాల కేటగిరిలో పుష్ప తెలుగు వర్షన్‌ సినిమాను ఇంగ్లిష్, రష్యన్‌ సబ్‌ టైటిల్స్‌తో ప్రదర్శించడం విశేషం.

అంతే కాకుండా తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం త్వరలోనే పుష్ప ది రైజ్ చిత్రం తాలూకు రష్యన్‌ డబ్బింగ్‌ వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారట. పుష్ప చిత్ర బృందం అందుకు తగిన సన్నాహాలు చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పుష్ప ది రూల్‌ షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. మొదటి భాగం అనూహ్యంగా భారీ విజయం సాధించడంతో దర్శకుడు సుకుమార్‌ సీక్వెల్‌ పై చాలా జాగర్తలు తీసుకుని.. స్క్రిప్ట్ వర్క్ తో మొదలు పెట్టి అన్ని అంశాలూ తనకి అనుగుణంగా ఉండేలా దృష్టి సారించారు. బడ్జెట్‌, క్యాస్టింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ అత్యంత క్రేజీ సీక్వెల్ ను తెరకెక్కించనున్నారు.

వచ్చే ఏడాది విడుదల కానున్న ఈ సినిమా పై ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు మరియు ట్రేడ్ వర్గాలు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నాయి. మరి అందరి అంచనాలను గనక ఈ సీక్వెల్‌ అందుకుంటే మరెన్ని సంచనాలను సృష్టిస్తుందో చూడాలి.

ఎట్టకేలకు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది పురుష్

0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి రానున్న తదుపరి చిత్రం ‘ఆదిపురుష్’ ప్యాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రం. కాగా ఈ చిత్రం విజయం సాధించడం అనేది ఈ బాహుబలి స్టార్‌కి చాలా అవసరం. ప్రభాస్ నటించిన గత రెండు చిత్రాలు రాధే శ్యామ్, సాహో అందరూ ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పరాజయం పాలయ్యాయి. అందుకే ఆది పురుష్ సినిమా పై ప్రభాస్ చాలా జాగర్తలు తీసుకుంటున్నారు. అంతే కాక ఈ సినిమాని తెరకెక్కించే విషయంలో దర్శకుడు ఓం రౌత్ కూడా ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వకుండా చూసుకుంటున్నారు.

పౌరాణిక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం గురించి మాట్లాడుతూ, ప్రభాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించడం జరిగింది. ఇది తనకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పిన ప్రభాస్, అలాగే ఈ సినిమా తన హృదయానికి చాలా దగ్గరగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

ఆదిపురుష్ సినిమా తనకు సెంటిమెంట్‌ పరంగా కూడా చాలా ముఖ్యమైన సినిమా అని చెప్పిన ప్రభాస్.. ఓం రౌత్ లాంటి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించడం తన అదృష్టంగా భావిస్తానని చెప్పారు. కాగా ఈ సినిమాలో నటించేందుకు మొదట్లో ప్రభాస్ భయపడ్డారట. షూటింగ్ మొదలైన మూడు రోజుల తర్వాత ఓం రౌత్ కు ఫోన్ చేసి ఈ సినిమా నేను చేయాలా? అని అడిగినట్లు ప్రభాస్ తెలిపారు. ఎందుకంటే ఇలాంటి సినిమాలో తాను ఏదైనా పొరపాటు చేస్తే అది చాలా తప్పు అవుతుందని అన్నారాయన.

కాగా అక్టోబర్ 2న అయోధ్యలో భారీ ఈవెంట్‌లో ఆది పురుష్ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. టీజర్ విడుదల చేయడంతో ఈ సినిమా తాలూకు భారీ ప్రచార కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ చాలా పెద్ద ఈవెంట్‌లను ప్లాన్ చేస్తోంది అని కూడా అంటున్నారు. ఈ చిత్రం జనవరి 2023లో విడుదల కానుంది.

రామాయణం ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఆదిపురుష్ (రాముడు)గా ప్రభాస్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ మరియు సన్నీ సింగ్ కూడా ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో విడుదల కానుంది.

200Cr budget and Pan India release for Suriya – Siva film, will it work at box office?

0

Suryia and Siva’s upcoming project has already made a lot of noise in Kollywood circles. This film is an extremely crucial one for both the director as well as the actor. Siva has scored a big disaster with Annaththe and Suriya is also in a very low phase with no big hits at the box office.

Suriya received a lot of acclaim for his recent performances in Jai Bheem and Soorarai Pottru. However, he needs massive commercial success now. He was hoping that ET would be a massive success but that didn’t happen as well. Now both are coming together for a pan-India film. The movie budget is said to be around Rs 200Cr and the makers are planning to release it in 3D version in all languages.

We have to see what will be the final budget and business of the film. They need to come up with massive promotional content to create the buzz.

The big ticket film will reportedly have the Tamil star appear in the dual role, and the sources hint that it could be billed as a pan-Indian project. Disha Patni is rumoured to be playing the female lead and it will go on floors pretty soon.

Pushpa makers planning to release the film in Russia

0

After the success of Pushpa: The Rise, all eyes are now on the second installment of the film. Allu Arjun’s popularity in the north belt has soared after the massive success of the film. This is why the makers want to capitalise on the momentum and are taking extra care about the execution of Pushpa 2.

The part2 shoot is expected to start on October 1st and the makers are now focusing on other international markets and making the arrangements for releasing the part1 to create the hype. The makers are feeling if part1 clicks then part2 will have an immense buzz in the global markets. Now the makers planning to release the film in Russia.

Sukumar is in no hurry to finish the project and wants to start shooting once he is satisfied with every aspect. This is why he has decided to take the film on sets two months from now which is in August.

Coming to the plot of the film, as the title suggests, this film will showcase the ascent of Pushpa to greater heights. The movie will transcend the boundaries and will have an international backdrop where Allu Arjun will be pitted against all odds. Fahadh Faasil will have a meaty role in Pushpa 2 and his character will surprise one and all.

The most awaited Adipurush teaser date and venue locked

0

Prabhas’ Adipurush is undoubtedly an extremely crucial film for the pan-India star. His last two films Radhe Shyam and Saaho have not exactly given the results that he expected. This is why Prabhas and Om Raut are leaving no stone unturned to ensure viewers get the best experience on this one.

Speaking about this upcoming mythological drama, Prabhas revealed some interesting snippets about the film. He admitted that this is an extremely important project to him and something that he holds pretty close to his heart.

“Adipurush is sentimentally an extremely important project for me. I am lucky to have a director like Om Raut handling this film. “I had called him after three days and asked ‘should I do it?’ because if I do make mistake it will be very wrong,” he added.

The film’s teaser will be released in a grand event on October 2nd at Ayodhya. The massive promotional campaign is expected to start with the teaser reveal and the team is planning very big events. The film is slated for a January 2023 release.

The mythological drama is based on Ramayan and is directed by Om Raut. Prabhas will be playing the titular role of Adipurush (Lord Ram). The film also features Kriti Sanon, Saif Ali Khan, and Sunny Singh. The pan India project will release worldwide in Telugu, Tamil, Hindi, Malayalam, and Kannada.

నందమూరి అభిమానుల్లో చీలిక.. బాలయ్య VS ఎన్టీఆర్ ఫ్యాన్స్

0

RRR సినిమా విడుదలైన దగ్గర నుండి, హీరో ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులు కాస్త కఠినమైన, క్లిష్టతరమైన కాలాన్ని ఎదుర్కొంటున్నారని చెప్పాలి. RRR సినిమాలో రామ్ చరణ్‌ పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాజమౌళి ఎన్టీఆర్ ఇమేజ్ తో పాటు కెరీర్‌కు చాలా నష్టం కలిగించాడని ఎన్టీఆర్ అభిమానులు చాలా బలంగా భావించారు. ఈ విషయంలో నిజానిజాలు పక్కన పెడితే ఎన్టీఆర్ అభిమానులకు కాస్త ఆనందాన్ని ఇచ్చే విషయాలు జరిగి చాలా కాలం అయింది.

RRR తర్వాత కొరటాల శివతో చేయబోయే ఎన్టీఆర్30 సినిమాకు సంభందించిన ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదు. కేవలం సినిమాను అధికారికంగా ప్రకటించటం తప్ప సినిమా సెట్స్ పైకి వెళ్ళడం గూర్చి కానీ, ఎప్పుడు మొదలవుతుంది అని కానీ ఎలాంటి సమాచారం రాలేదు.

ఇతర స్టార్ హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్, పవన్ మరియు ప్రభాస్ లు మాత్రం ఎవరి సినిమా షూట్‌లతో వారు బిజీగా ఉండగా, ఎన్టీఆర్ తదుపరి సినిమా మాత్రం RRR విడుదలై 6 నెలలు కావస్తున్నా ఇంకా ప్రారంభం కాలేదు.

ఇక సినీ కెరీర్ లో ఇబ్బందులు, అడ్డంకులు చాలవు అన్నట్టు ఎన్టీఆర్ ను తాజాగా మరో సమస్య చుట్టుముట్టింది. తాజాగా ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు అంశం పై ఆయన స్పందించారు. అయితే ఆయన స్పందించిన విధానం ఇటు టీడీపీ మద్దతుదారులతో పాటు అటు నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.

ఇది దౌత్యపరమైన ప్రకటన అని, ఎన్టీఆర్ లాంటి మహానాయకుడుతో వైఎస్ఆర్‌ను సమంగా పోల్చే తప్పు చేశారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఘాటుగా విమర్శించలేదని నందమూరి బాలకృష్ణ అభిమానులు, టిడిపి వర్గాల వారు భావించారు.

ఇలా చప్పగా స్పందించే కంటే అసలు ప్రకటన విడుదల చేయకుండా ఉండుంటే సరిపోయేదని చాలా మంది అంతర్గత వ్యక్తులు భావిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రకటనతో ఆగ్రహానికి గురై ఆయన నటించే సినిమాలను బహిష్కరించాలని టీడీపీ, ఇతర బాలకృష్ణ అభిమానులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక పై ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోము అని కొందరు అభిమానులు తీవ్రంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇన్ని స‌మ‌స్య‌ల‌లో చిక్కుకున్న ఎన్టీఆర్ మరియు ఆయన అభిమానులకి కాస్త ఉపశమనం కలిగించేలా ఎన్టీఆర్30 సినిమా షూటింగ్ మొద‌ల‌యితే బాగుంటుంది. అదే గనక జరిగితే వివాదాలకు దూరంగా ఎవరి పని వారు చేసుకునే వీలుంటుంది.