Home Blog Page 2000

A leading star is trolling me and my family: Manchu Vishnu

0

Manchu Vishnu has made a stunning accusation on a ‘noted leading star’ in Tollywood. The MAA President has stated that this particular person is behind the targeted trolls through YouTube and social media against him and his family.

Vishnu stated that an IT Company has been set up in Jubilee Hills with 21 employees. The primary target for this company is trolling Manchu family.

“I have taken the help of Cyber police and shared the list of all these IP addresses. Incidentally one of these IP addresses is of a leading Tollywood actor,” he said. Manchu Vishnu also said that his team has identified 18 YouTube channels whose only job is harassing actors and their families and he promised that strict action will be taken against them.

Vishnu’s allegations come on the heels of his upcoming film Ginna. The film stars Payal Rajput and Sunny Leone alongside him and is a comedy entertainer.

Many changes made in Chiranjeevi’s Godfather script

0

Godfather is a week away from its release and after the debacle of Acharya, Megastar Chiranjeevi is in no mood to take things for granted. He has been taking no half measures to ensure that this time a proper commercial entertainer is delivered in form of Godfather.

Satyadev, who is playing a vital role in the film revealed that certain last-minute changes were made for this film to enhance the output. He added that the changes made in the script along with the interval block are going to be loved by the audience and it will be a treat to watch Megastar on screen for sure.

Mohan Raja has directed this remake of the Malayalam blockbuster ‘Lucifer’. The original starred Mohanlal and Prithviraj played a cameo. Nayantara will be seen in a key role alongside Satyadev and Malayalam actor Indrajith Sukumaran. Salman Khan is playing an extended cameo in this project.

Godfather will release on 5th October and it has done a good pre-release business so far. The digital rights have also been picked up for Rs 57 crores by Netflix. This film will release in dubbed versions in Malayalam and Hindi as well.

Super Star Mahesh Babu’s mother passes away

0

Superstar Mahesh Babu’s mother, Indira Devi, passed away in Hyderabad due to ill health. She breathed her last at 4 am on Wednesday. The actor’s mother had been suffering from age-related health issues for the past few days and was admitted to AIG Hospital in Hyderabad, according to multiple media reports.

Indira Devi’s mortal remains will be held at Padmalaya Studios from 9 am to 12 pm to pay last respects. Her funeral will take place at Maha Prasthanam later in the day.

“Smt. Ghattamaneni Indira Devi, wife of veteran actor Krishna and mother of Mahesh Babu passed away a short while ago. She had been suffering from illness for quite some time now. Her mortal remains will be kept at Padmalaya Studios for fans to visit at 9 am today and later the last rites will be performed at Maha Prasthanam,” read a statement from Mahesh Babu’s family.

Fans and well-wishers have extended support to Mahesh Babu and his family during what has been an extremely tough year for him personally. Earlier in January, he lost his elder brother Ramesh Babu and now with his mother passing away, condolences are pouring in from all sides.

తెలుగు సినిమా పరిశ్రమలో మరో విషాదం.. మహేష్ బాబుకు మాతృ వియోగం

0

గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020లో కరోనా ప్యాన్డేమిక్ దాడి చేసినప్పటి నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు మరణించారు. కరోనా మహమ్మారి ప్రభావం కారణంగా కొంత మంది మరణిస్తే.. మరి కొంత మంది ఇతర ఆరోగ్య సమస్యల వల్ల మరణించారు.అయితే.. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్‌ స్టార్‌ కృష్ణ భార్య ఇందిరా దేవి గారు మరణించారు.

ఆవిడ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఈ నేపథ్యంలోనే ఆమె ఈరోజు తెల్లవారు జామున నాలుగు గంటలకు మరణించారని సమాచారం.

సెప్టెంబర్ 26న ఇందిరా దేవి గారి ఆరోగ్యం విషమించడంతో AIG హాస్పిటల్స్ లో చేర్చారు.. ఆవిడకి ఎమెర్జెనీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స చేసిన తరువాత ఆమె ఆరోగ్య పరిస్థితి పర్వాలేదని వైద్యలు చెప్పారు.. ఆమె పరిస్థితిని అబ్జర్వేషన్ లో ఉంచామని, త్వరలోనే పూర్తి వివరాలను తెలుపుతామని డాక్టర్లు చెప్పారు. అయితే ఇంత తొందరలోనే ఆవిడ ప్రాణాలు కోల్పోతారని ఎవరూ ఊహించి ఉండరు.

ఇందిరమ్మ, కృష్ణ గారిని 1961 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.. మహేష్ బాబు తో పాటు రమేష్ బాబు మరియు మంజుల కి జన్మనిచ్చారు ఇందిరమ్మ గారు.. ఇక ఆ తర్వాత కృష్ణ గారు 1969 సంవత్సరం లో విజయ నిర్మల గారిని రెండవ పెళ్లి చేసుకున్నారు.. విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇందిరమ్మ గారితో దాంపత్య జీవితం కొనసాగించారు కృష్ణ గారు.. విజయ నిర్మల గారు కృష్ణ గారి సినిమాల వ్యవహారాలు మరియు కృష్ణ గారికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునేవారు.. విజయ నిర్మల గారు 2019 వ సంవత్సరంలో చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.

ఇక మహేష్ బాబుకు తన తల్లి అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలుసు.. తన తల్లి గురించి ఎప్పుడు మాట్లాడినా మహేష్ బాబు కళ్ళలో నీళ్లు తిరగడం చూస్తూ ఉంటాము..ఆయనకి తన తల్లి గారితో ఉన్న అనుబంధం అలాంటిది. ప్రస్తుతం ఆయన తల్లి గారి మరణ వార్త విని అభిమానులే తట్టుకోలేకపోతున్నారంటే ఇక స్వయంగా కన్న కొడుకైన మహేష్ ఎంత బాధలో ఉంటారో అంచనా వేయడం చాలా కష్టం.

ఇందిరమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ.. ఈ విషాద సమయంలో మహేష్ బాబు, కృష్ణ, మరియు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ తొందరలోనే వారు ఈ బాధలో నుంచి కోలుకోవాలని కోరుకుందాం.

నా పై, నా కుటుంబం పై ట్రోలింగ్ చేయిస్తుంది ఒక ప్రముఖ హీరో : మంచు విష్ణు

0

తెలుగు సినీ నటుడు మంచు విష్ణు సంచలన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలు జరిగిన సందర్భంగా తన పై దారుణంగా ట్రోల్స్ చేశారని ఆయన అన్నారు. తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోల్స్ చేశారని తీవ్రంగా ఆవేశాన్ని వెళ్లగక్కారు. అయితే ఈ ట్రోల్స్ వెనకాల ఒక స్టార్ హీరో ఉన్నారని మంచు విష్ణు ఆరోపించడం గమనార్హం. కేవలం తన కుటుంబం పై ట్రోల్స్ చేసేందుకు ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ స్థాపించడం జరిగిందని ఆయన అన్నారు.

మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా. ఆ చిత్రం తాలూకు ప్రచార కార్యక్రమాలలో బాగంగా విష్ణు.. ‘మా’ ఎన్నికల సంఘటన జరిగినప్పటి నుంచి మా కుటుంబం పై ట్రోల్స్ ఎక్కువయ్యాయని వాపోయారు. అంతే కాకుండా తనని, తన కుటుంబాన్ని ట్రోల్స్ చేయడమే కాక తిట్టారని.. అలా చేసిన వారి పై సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మంచు విష్ణు తెలిపారు.

ఇన్ని రోజులు ఈ ట్రోల్స్ దాడులను భరించానని, కానీ ఇక పై మాత్రం సహించేది లేదని ఈ క్రమంలో అలా చేస్తున్న వారికి ఆయన హెచ్చరికలు కూడా జారీ చేశారు. తన పై ట్రోల్స్ చేయడానికి 18 యూట్యూబ్ ఛానళ్ళు పని చేస్తున్నాయని, అవన్నీ మూత పడేలా చేస్తానని హెచ్చరించారు.

ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు విష్ణు సరసన సన్నీలియోన్ మరియు పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించారు. ఐతే, తాజాగా ఈ చిత్రం విడుదల తేదీ వాయిదా పడిందని వార్తలు వచ్చాయి. మొదట అక్టోబర్ 5, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు. అయితే, తాజాగా అక్టోబర్ 21, 2022కి ఈ చిత్రం విడుదల వాయిదా పడిందని పుకార్లు రాగా.. ఇదే విషయం పై మంచు విష్ణు ను ప్రశ్నించగా, దసరా అయినా దీపావళి అయినా ఖచ్చితంగా అక్టోబరులోనే సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.

కాగా ఓ ప్రముఖ స్టార్ హీరోకి చెందిన కంపెనీ నుంచే తన కుటుంబం పై ట్రోలింగ్ జరుగుతుందని మంచు విష్ణు అన్నారు. జూబ్లీహిల్స్‌లోని ఒక కంపెనీలో కేవలం త‌న కుటుంబం పై ట్రోలింగ్ చేసేందుకు ఏకంగా 21 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నట్లు చెప్పడం అందరినీ విస్మయపరిచింది. ఆ ఆఫీస్ చిరునామాతో పాటు ఐపీ అడ్రస్‌ల‌ను కూడా సేక‌రించానని విష్ణు చెప్పారు.

త్వ‌ర‌లోనే తన ఆరోపణలకు సంబంధించిన సమగ్ర ఆధారాలను, ఐపీ అడ్రస్‌లతో సహా పోలీసులకు అందజేస్తానని మంచు విష్ణు వెల్లడించారు. మరి ఈ వివాదం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

ఓటీటీలో విడుదలయిన విక్రమ్ కోబ్రా సినిమా

0

ఇటీవలే తమిళ సూపర్‌స్టార్‌ చియాన్‌ విక్రమ్‌ నటించిన సినిమా కోబ్రా. ఆగస్ట్‌ 31న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అటు విమర్శకుల నుంచి, ఇటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విక్రమ్‌ రకరకాల లుక్స్‌లో కనిపించే ప్రోమోలను చూసిన ప్రేక్షకులు కోబ్రా సినిమా పై భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. 

అయితే సినిమా మాత్రం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ఇక తాజాగా ఈ చిత్రం డిజిటల్‌ ప్రీమియర్‌కు సిద్దమవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లివ్‌ సొంతం చేసుకోగా.. డిజిటల్‌ రిలీజ్‌ తేదిను కూడా ప్రకటించారు. సెప్టెంబర్‌ 28 నుంచి అంటే రేపటి నుంచే కోబ్రా స్ట్రీమింగ్‌ కు అందుబాటులో ఉండనున్నట్లు సోనీ లివ్‌ వెల్లడించింది.

అయితే విడుదలయ్యేది రేపే అయినా కొన్ని గంటల ముందు నుంచే కోబ్రా సినిమా తమ యాప్ లో స్ట్రీమింగ్ అవుతున్నట్లు అధికారికంగా ట్వీట్ ద్వారా ప్రకటించింది.

బాక్సాఫీస్‌ దగ్గర భారీ పరాజయం పాలైన ఈ సినిమా ఊహించినట్టు గానే త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మధ్య కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయిన సినిమాలు తొందరగా ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కోబ్రా చిత్రం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ప్రసారం అవుతోంది.

ఈ సినిమాలో విక్రమ్‌ మ్యాథ్స్ లో జీనియస్ అవడంతో పాటు కాంట్రాక్ట్ మర్డర్లు చేసే పాత్రలో నటించారు. అంతే కాకుండా ఏడు భిన్నమైన గేటప్పుల్లో కనిపించారు. అయితే ఇలా డిఫరెంట్ గెటప్లలో కనిపించడం అనేది అపరిచితుడు రోజుల్లో ప్రేక్షకులని ఆకర్షించేది కానీ ఇప్పుడు అది అంతగా ఆకట్టుకునే విషయం కాదనేది విక్రమ్‌ తెలుసుకోవాలి.

కోబ్రా సినిమాలో విక్రమ్‌ సరసన కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి నటించరు. ఇక మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విలన్‌గా నటించడం విశేషం. తొలి రోజు కోబ్రా సినిమా నిడివి మరీ ఎక్కువగా ఉందన్న విమర్శలు రావడంతో తర్వాతి రోజే 20 నిమిషాల పాటు తగ్గించినా ఫలితం దక్కకుండా పోయింది.

ఇక విక్రమ్ మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌ సెల్వన్‌ -1తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం భారీ విజయం సాధించి విక్రమ్ తో పాటు చిత్ర బృందానికి కూడా ఆనందాన్ని ఇస్తుంది అని ఆశిద్దాం.

SSMB28 – త్వరలోనే రెండో షెడ్యుల్ ప్రారంభం

0

మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో వస్తున్న SSMB28 చిత్రం ఇటీవలే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో ఈ నెల ప్రారంభంలో సెట్స్‌ పైకి వెళ్ళింది. కాగా ఈ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించారు, ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌కు తేదీ కూడా ఖరారు చేయబడిందని సమాచారం. ఇక SSMB28 సినిమా టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కనుంది.

12 ఏళ్ల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. తెలుగు సినిమా అభిమానుల హృదయాల్లో ఈ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే సినిమాని ఎక్కడా రాజీ పడకుండా అన్ని అంశాలూ అత్యుత్తమ ప్రమాణాలతో ఉండేలా.. సినిమా కంటెంట్ బాగా వచ్చేలా చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కాగా ఈ నెల ప్రారంభంలో, ముందుగా చిత్ర బృందం ఒక నెల రోజుల షెడ్యూల్ కోసం ప్లాన్ చేయటం జరిగింది.

అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకి యాక్షన్ సన్నివేశాలు వచ్చిన తీరు నచ్చకపోవటం వల్ల ఫైట్ మాస్టర్ అన్‌బరీవ్‌ను సినిమా నుంచి పూర్తిగా మార్చాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం పై అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అని అంటున్నారు. త్రివిక్రమ్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రంలో ఎక్కువ ఫైట్స్ ఉంటాయని సమాచారం.

ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్‌ని అక్టోబర్ 10వ తేదీ నుంచి కొనసాగించాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట. ఈ షెడ్యుల్ లో భాగంగా మహేష్, పూజా హెగ్డే మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ భారీ సినిమాను నిర్మిస్తున్నారు.

కాగా గత సంవత్సరం ఈ సినిమాను ప్రకటించినప్పటి నుండీ మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

OTT డీల్స్ తో దుమ్మురేపుతున్న మెగాస్టార్ చిరంజీవి

0

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న స్థానం.. జీరో నుంచి మొదలై నంబర్ వన్ గా ఎదిగిన ఆయన ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను తనదైన శైలిలో రక్తి కట్టించడంతో పాటు, బాక్స్ ఆఫీసు వద్ద కూడా ఎన్నో రికార్డులను తిరగరాసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

దాదాపు ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలం సినిమా పరిశ్రమలో ఉన్న చిరంజీవి , 2007లో శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత ఇండస్ట్రీని వదిలి రాజకీయాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పదేళ్ల గ్యాప్ తరువాత 2017లో ఖైదీ నంబర్ 150 సినిమాతో తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టి, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి బాస్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నారు.

ఆ తర్వాత సై రా నరసింహా రెడ్డి చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోయినా.. ఆయన స్టార్డంను ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఈ ఏడాది వేసవి కాలంలో వచ్చి డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య సినిమాతో ఆయన మీద విమర్శలు వచ్చాయి. ఇక ఆయన టైం అయిపోయింది అని.. మళ్ళీ ఆయన మునుపటిలా సూపర్ హిట్ సినిమాలను అందించలేరని కొంచెం ఘాటుగా వ్యాఖ్యానించారు. అయితే ఆ విమర్శలు అన్నీ తప్పని, మెగాస్టార్ ఇమేజ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని ఇటీవలే రెండు ఉదాంతాలతో రుజువైంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా గాడ్ ఫాదర్. ఇటివలే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ హక్కులని నెట్ ఫ్లిక్స్ సంస్థ 57 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక ఇది ఇలా ఉంటే చిరంజీవి తన 154వ చిత్రాన్ని యువ దర్శకుడు బాబీ డైరెక్షన్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా నెట్‌ఫ్లిక్స్ 50 కోట్ల మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. రెండు సినిమాలు కూడా అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతాయట.

ఇలా వరుసగా భారీ ఆఫర్లతో మెగాస్టార్ చిరంజీవి సినిమాలను కొనడం చూస్తుంటే ఆయన మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ క్రేజీ సినిమాలతో మళ్ళీ బాక్స్ ఆఫీస్ రేసులో దూసుకుపోతున్నారనే అర్థం అవుతుంది. ఇక రెండు చిత్రాలు సరైన కంటెంట్ అందిస్తే కలెక్షన్లు కూడా రికార్డులు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Dates locked for second schedule of Superstar Mahesh Babu’s upcoming film

0

Mahesh Babu’s SSMB 28 got on floors earlier this month with a fight sequence. The schedule was shot in Hyderabad and now the dates for the next schedule have been finalized as well. SSMB 28 is one of the most prestigious projects in Tollywood. The film will see the return of Mahesh and Trivikram after 12 years.

The combination holds a special place in the hearts of Tollywood fans. This is why the entire unit is taking extra care of ensuring all the elements of the film come up with top-notch quality. Earlier this month, the team had planned for a month-long schedule but the Superstar, looking at the output of action sequences decided to change the fight masters Anbariv altogether.

Trivikram has decided to resume the next schedule on October 10th. This part will have some romantic scenes shot between Mahesh and Pooja Hegde.

The filmmakers, Haarika and Haasine Creations announced this project last year much to the delight of fans of Mahesh Babu. SS Thaman will compose the music for this film while Navin Nooli will handle the editing duties.

Megastar Chiranjeevi’s blockbuster deals with Netflix for OTT rights of his next films

0

Megastar Chiranjeevi has a series of exciting releases lined up next. The first of these will be ‘Godfather’ which is scheduled to release on October 5th. Mohan Raja has directed this remake of the Malayalam blockbuster ‘Lucifer’. The original starred Mohanlal and Prithviraj played a cameo. In this remake, Salman Khan will play a cameo.

Megastar Chiranjeevi’s next release will be Mega 154 ‘Waltair Veerayya’ directed by KS Ravindra. The film will also co-star Mass Maharaja Ravi Teja in a key role. After this project, the Mega Star has Mehr Ramesh’s Bhola Shankar lined up in April 2023. Bhola Shankar is a remake of the 2015 Tamil superhit Vedalam that starred Ajith and Shruti Haasan.

He will have 3 movies after every 3 months between October ’22 and April ’23 and this update has got the fans very excited.

These films have created great excitement in the market and digital rights have fetched the makers a great amount. Netflix has acquired the rights of Godfather and Waltair Veerayya for fancy sums. While Godfather digital rights have gone for Rs 57 crores, Waltair Veerayya has fetched the makers a solid Rs 50 crores.