Home Blog Page 1959

పక్కా మాస్ సాంగ్ లో కలిసి చిందులేయనున్న మెగాస్టార్ చిరంజీవి – మాస్ మహారాజా రవితేజ

0

మెగాస్టార్ చిరంజీవి తాజాగా బాబీ (కెఎస్ రవీంద్ర) దర్శకత్వంలో “వాల్తేరు వీరయ్య” అనే మాస్ మరియు కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటమే. మరియు అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం రవితేజ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని వినిపిస్తోంది.

ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలియగానే మెగా అభిమానులు ఎంతగానో సంతోషించారు, ఇక ఈ వార్త విన్నప్పుడు మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందానికి కూడా అవధులు లేకుండా పోయాయి. తాజాగా వాల్తేరు వీరయ్య సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి మరియు మాస్ మహారాజ్ రవితేజ పై ఒక పక్కా మాస్ నంబర్ చిత్రీకరించబడింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సందర్భంలో స్వచ్ఛమైన మాస్ డ్యాన్స్ నంబర్‌ను ట్యూన్ చేసారు. కాగా దీనికి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇద్దరూ హీరోల కోసం అదిరిపోయే స్టెప్స్ కంపోజ్ చేశారని సమాచారం. ఈ పాటను ఇటీవలే అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు.

ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని, ఇటు హీరోల అభిమానులకు, అటు ఇతర ప్రేక్షకులకు కూడా మాస్ ఫీస్ట్‌గా ఉంటుందని అంటున్నారు. అలాగే, చిరంజీవి మరియు రవితేజ కనిపించే ఈ పాట.. వెంకీ చిత్రంలోని సిలకేమో సీకాకుళం మరియు శంకర్ దాదా టైటిల్ సాంగ్ యొక్క రీమిక్స్ పాటగా ఉంటుందని చెబుతున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది, టీజర్‌లో చిరంజీవి పక్కా మాస్ అవతార్‌లో కనిపించారు. ఆయన స్టైల్ మరియు మాస్ మ్యానరిజం టీజర్ చూసిన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. దీపావళి సందర్భంగా విడుదలైన ఈ టీజర్ కు విశేష స్పందన లభించింది. యూట్యూబులో నంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అయి 10 మిలియన్ల వ్యూస్ సంపాదించింది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Megastar Chiranjeevi – Mass Maharaja Raviteja combo song is a feast for audience and fans

0

Megastar Chiranjeevi is acting in the latest mass and commercial entertainer titled “Waltair Veerayya”, directed by Bobby (KS Ravindra). The interesting thing is Ravi Teja is playing an important role in this movie and according to the sources it is going to be a powerful one.

Mega fans felt happy when they got to know that Raviteja is playing an important role in the movie and the same goes with the Mass Maharaja fans too. Now an exciting news came about Waltair Veerayya.

A Joint Mass Number was shooted on Megastar Chiranjeevi and Mass Maharaj Ravi Teja, with rockstar Devi Sri Prasad tuning a pure mass dance number for which Ace choreographer Sekhar Master has composed rocking steps for the star duo. The song was canned very recently in Aluminum Factory.

The song is said to come out superbly and it will be a mass feast for the fans of both the heroes and the audience. Also, it’s being said that the song in which Chiranjeevi and Raviteja appear will be a combined remix song of Mass tho Pettukunte Madathadipoddi and Shankar Dada title song.

The film’s title teaser which was released recently has received a tremendous response, in the teaser we can see Chiranjeevi in a vintage mass avatar which has been liked by everyone who has watched the teaser.

Shruti Haasan is playing the female lead role opposite Chiranjeevi in the film, produced by Naveen Yerneni and Y Ravi Shankar on the Mythri Movie Makers banner, while GK Mohan is the co-producer.

పూరి జగన్నాధ్‌ను బహిష్కరించిన ఫైనాన్షియర్లు

0

లైగర్ సినిమా భారీ పరాజయం పాలవడం ఆ సినిమా యూనిట్ మొత్తానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ముఖ్యంగా దర్శకుడు పూరి జగన్నాధ్ కి చాలా సమస్యలు వచ్చి పడ్డాయి. డిస్ట్రిబ్యూటర్లు మరియు ఫైనాన్షియర్లు నష్టపరిహారం కోరడం ఆ వ్యవహారం అంతా ఒక వివాదంగా మారడం వంటి అంశాలు ఆయనను మానసికంగా ప్రభావితం చేశాయి.

పూరి జగన్నాధ్ గతంలో కొనుగోలుదారులకు లైగర్ సినిమా వల్ల వచ్చిన నష్టాన్ని భర్తీ చేస్తానని హామీ ఇచ్చారట. కానీ అసలు సమస్య ఏమిటంటే, అలా మాటిచ్చిన తర్వాత పూరి.. డిస్ట్రిబ్యూటర్ సర్కిల్ నుండి ఎవరు కాల్ చేసినా లేదా మెసేజ్‌ చేసినా స్పందించలేదట. పూరి నుంచి అలాంటి స్పందన చూసిన తరువాత, బయ్యర్లు అందరూ కలిసి ఆయన ఇంటి ముందు సమ్మె చేయాలని ప్లాన్ చేశారు.

అయితే ఈ సమ్మెను ఒక బ్లాక్‌మెయిల్‌గా పేర్కొంటూ, వారి పై పోలీసు కేసు నమోదు చేయాలని పూరి నిర్ణయించుకున్నారు. ఇటీవలే కేసు నమోదు కూడా చేశారు. తనకి తన కుటుంబానికి వరంగల్ శ్రీను మరియు జి శోబన్ బాబు మరియు ఇతర పంపిణీదారులు నుండి రక్షణ కల్పించవల్సిందిగా పోలీసు వారిని పూరి అభ్యర్థించిన విషయం తెలిసిందే.

తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా ఇలా తమ మీదే ఆరోపణలు చేయడంతో.. భవిష్యత్తులో పూరి తరపు నుంచి వచ్చే ఏ సినిమాకి కూడా ఫైనాన్స్ చేయకూడదని ఫైనాన్షియర్లు నిర్ణయించుకున్నారని సమాచారం. పూరికి కష్టకాలంలో తాము సహాయం చేశామని ఫైనాన్షియర్‌లు అంటున్నారు.

కానీ ఇప్పుడు పూరి నష్టాల నుండి తప్పించుకోవడానికి తను ప్రణాళికలు రచిస్తూ తిరిగి తమను నిందిస్తున్నాడని చెప్తూ.. పూరిని ఒక మోసగాడిగా అభివర్ణించారు. ఏదేమైనా పూరి ఇలాంటి వివాదాలు అన్నిటికీ దూరంగా జరిగి ఒక బ్లాక్ బస్టర్ విజయంతో మరోసారి తన సత్తా ఏంటో అందరికీ చూపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

పూరీ జగన్నాథ్ సైతం ‘లైగర్’ ప్లాప్ నుంచి బయటకు వచ్చి తదుపరి చేయాల్సిన సినిమాల పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోసారి పూరి ఇలాంటి వివాదాలతో కాకుండా మంచి సినిమా ఓకే అయింది అన్న వార్త బయటకి రావాలని ఆశిద్దాం.

Financiers boycott Puri Jagannadh and term him the biggest cheater

0

Liger’s failure has been a huge setback for the entire movie unit. Puri Jagannadh in particular has been affected massively by its failure with distributors and financiers seeking compensation.

Puri Jagannadh had earlier promised the buyers that he will compensate them the amount for Liger’s losses. But the problem is after this statement he has not responded to calls or messages of anyone from the distributor circle. Seeing inactivity on Puri’s side, the buyers planned to go on strike and start a demonstration in front of the director’s house.

Terming this strike as total blackmail, the director has decided to file a police case on them. Now the financiers have decided not to finance any of the films from Puri’s side in the future. The financiers also added that they helped Puri out in his tough time and termed him a cheater for his plans to escape from the losses and blaming the trade circles instead.

రెంటల్ పద్ధతిలో OTTలో స్ట్రీమింగ్ అవుతున్న పొన్నియిన్ సెల్వన్

0

మణిరత్నం కెరీర్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రసిద్ధి చెందిన మాగ్నమ్ ఓపస్ పొన్నియిన్ సెల్వన్ చిత్రం ఇప్పుడు OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదలయింది. ప్రస్తుతానికి, ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె ప్రాతిపదికన తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళంలో అందుబాటులో ఉంది. హిందీ వెర్షన్ మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేదు.

విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష మరియు జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నవంబర్ 4న అమెజాన్ ప్రైమ్‌లో నాన్‌రెంటల్ ప్రాతిపదికన అందరికీ అందుబాటులో ఉండేలా విడుదల కానుంది.

ప్రస్తుతానికి, వీక్షకులు పొన్నియిన్ సెల్వన్‌ని చూడాలంటే 199 చెల్లించి వీక్షించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కి OTT ప్రతిస్పందన చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే OTT లో బాగా పాపులర్ అయితే త్వరలో విడుదల కానున్న సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంలో సహాయపడుతుంది.

రిలీజ్ కు ముందు నుంచే తమిళ సినీ ప్రేక్షకులు మరియు విశ్లేషకులు పొన్నియిన్ సెల్వన్ సినిమా పై ఎంతో ఆసక్తిని, ఇష్టాన్ని ఏర్పరచుకున్నారు. అందుకు తగ్గట్టే ఈ సినిమా తమిళ మార్కెట్‌లో అనూహ్యమైన బిజినెస్ చేసి అక్కడ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

అయితే సీక్వెల్ అన్ని భాషల్లో సరైన విధంగా ప్రభావం చూపించాలంటే మాత్రం OTT లో ప్రేక్షకుల స్పందన అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. గతంలో కేజీఎఫ్ మొదటి భాగం అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయిన తర్వాత విశేష స్థాయిలో వీక్షకుల నుండి స్పందన తెచ్చుకుంది.

పొన్నియిన్ సెల్వన్ 2 భాగాలుగా రూపొందిన విషయం తెలిసిందే. కాగా ఈ రెండు భాగాలకు కలగలిపి 500 కోట్ల బడ్జెట్‌ వెచ్చించడం జరిగింది. మణిరత్నం కి ఉన్న మార్కెట్ ఇమేజ్ దృష్ట్యా ఇది చాలా భారీ బడ్జెట్ అని, అంతే కాకుండా సినిమా అటు ఇటు ఐతే పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతుంది అని అందరూ బలంగా విశ్వసించారు.

అయితే తమిళనాట మరియు ఓవర్సీస్‌లో పొన్నియిన్ సెల్వన్ చిత్రం అసాధారణ రీతిలో ప్రదర్శింపబడి అద్భుత విజయం సాధించడంతో నిర్మాతలకు లాభాల పంట పండింది. ఇక పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం పై అంతటా భారీ ఆసక్తి నెలకొంది.

అస్త్రావర్స్ లో అడుగు పెట్టనున్న రాకీ భాయ్

0

KGF 2 యొక్క భారీ విజయం తర్వాత, హీరో యష్ ఇప్పటివరకు కొత్త సినిమా ఏదీ ప్రారంభించలేదు. కానీ ఆయన తదుపరి చిత్రం గురించి చాలా పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆ పుకార్లలో ఒకటి రాకీ భాయ్‌కి బాలీవుడ్ నుండి భారీ ఆఫర్లు వస్తున్నాయి అనేది అయితే, మరో వైపు ఇటీవల వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో యష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంతే కాకుండా బాలీవుడ్‌లో హీరో యష్‌కి ఒక భారీ బడ్జెట్‌ పౌరాణిక సినిమాలో నటించే అవకాశం వచ్చిందని మరో ప్రచారం జరుగుతోంది. KGF-2 చిత్రంతో యష్ పాన్-ఇండియన్ స్టార్ అయ్యారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 1200 కోట్లకు పైగా వసూలు చేసి 2022లో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద గ్రాసర్‌గా నిలిచింది. ప్రతి యొక్క వెర్షన్ లోనూ ఈ చిత్రం అద్భుతంగా ప్రదర్శింపబడింది.

అలాగే బ్రహ్మాస్త్ర సీక్వెల్‌లో దేవ్ అనే కీలక పాత్రలో యష్ కనిపించే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలో రణబీర్‌ కపూర్‌తో సమానంగా యష్‌ పాత్ర కనిపిస్తుందని అంటున్నారు.

బ్రహ్మాస్త్ర పార్ట్1 ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం ద్వారా బాక్సాఫీస్ వద్ద చక్కని ప్రదర్శన ఇచ్చింది. అంతే కాక వరుస పరాజయాలతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు ఊపిరి పోస్తూ పోస్ట్ కోవిడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిచింది. కాగా బ్రహ్మస్త్ర మొదటి భాగం దేవ్ పాత్ర పరిచయంతో అత్యద్భుతంగా ముగుస్తుంది.

అప్పటి నుంచి దేవ్ పాత్రలో ఎవరు నటించబోతున్నారు అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంతర్గత వర్గాల నివేదికల ప్రకారం, బ్రహ్మాస్త్ర నిర్మాతలు ఆ పాత్ర కోసం యష్ ను ఎంపిక చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

కాగా వారు ఇప్పటికే యష్‌ని సంప్రదించారని, మరియు ఏ నిర్ణయం తీసుకోవాలనేది యష్‌ పై ఆధారపడి ఉందని సమాచారం. ఈ వార్త నిజం అయితే మటుకు ఒక్కసారిగా బ్రహ్మాస్త్ర సీక్వెల్ కు హైప్ పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక KGF 2 విడుదలైనప్పటి నుండి, KGF-3 గురించి చాలా పుకార్లు వస్తున్నాయి. ఈ చిత్రం ఫారిన్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోందని, అంతే కాకుండా వచ్చే ఏడాది సెట్స్‌ పైకి కూడా వెళ్తుందని కొందరు అంటున్నారు.

అలాగే దర్శకుడు నార్తన్ తో యష్ సినిమా చేయబోతున్నారని కూడా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. తన తదుపరి సినిమా గురించి యష్ నుండి అధికారిక ధృవీకరణ వచ్చినప్పుడు మాత్రమే ఈ పుకార్లన్నీ ఆగిపోతాయి. లేదంటే ఈలోపు ప్రతి కొత్త సినిమాకి యష్ పేరు జోడించేలా ఉన్నారు సినీ ఔత్సాహికులు.

Ponniyin Selvan is now Streaming in OTT on rental basis

0

Mani Ratnam’s magnum opus Ponniyin Selvan has now made it to OTT platform. The film, for now, is available on Amazon Prime on a rental basis in Tamil, Telugu, Kannada and Malayalam.

Starring Vikram, Karthi, Aishwarya Rai, Trisha, and Jayam Ravi in key roles, this historical action drama will release on a nonrental basis on Amazon Prime on 4th November.

For now, viewers can watch Ponniyin Selvan for Rs 199. The OTT response is very crucial for this project as it will help create a buzz for the sequel which will release soon. The film has done extraordinary business in the Tamil market. However for the sequel to do equally well in all areas, the OTT release will play a vital role.

Ponniyin Selvan is a story made in 2 parts. The 2 parts are reported to be made on a 500 cr budget spread across 2 films and everyone initially believed it to be a risky move by Mani Ratnam. However, the resounding success of the film at the Tamil Nadu box office and overseas has created massive interest for the second part.

Makers approached KGF hero Yash for the Brahmastra sequel

0

After the humongous success of KGF 2, hero Yash hasn’t started any new movies till now but there are a lot of rumors doing the rounds about his next movie. One among those rumors is that Rocky Bhai is receiving huge offers from Bollywood and recently there are reports that Yash is going to act in Bollywood’s most prestigious project Brahmastra sequel.

There is also another rumor that hero Yash has got an opportunity to act in a mythological movie with a huge budget in Bollywood. Yash became a Pan-Indian star with the movie KGF-2. An action galore directed by Prashant Neel, the film collected more than 1200 crores at the box office and became the biggest grosser of the Indian film industry in 2022.

Also, Bollywood circles are saying that there is a possibility that Yash will be seen in the crucial role of Dev in the Brahmastra sequel. It is said that Yash’s character will be seen in the second part on par with Ranbir Kapoor.

Brahmastra part1 did well at the box office by collecting more than 400Cr gross worldwide and it is the highest grosser of Bollywood post covid. The movie ends on a high note with the Dev character’s introduction.

Since then the audience are very eager to know who is going to act in the role of dev. According to the reports, the Makers of brahmastra are interested to rope Yash for that role. It is being reported that they have already approached Yash, and it all depends on Yash to take the decision.

Meanwhile, since the release of KGF 2, there have been so many rumors appeared about KGF-3. Some even said that it will be made in a foreign backdrop and will go on to the sets next year.

Also, there have been reports for many days that Yash is going to make a film with director Nathan. All these rumors would only stop when the official confirmation comes from Yash about his next movie.

The two biggest stars of Mollywood have faced the biggest disasters at the same time

0

Mohanlal starrer Malayalam action film Monster was released in cinema halls on October 21. It was set against Nivin Pauly’s Padavettu at the box office. While both movies were foreseen to do good business on the first weekend, paving the way for a decent box office pull post-Diwali, the numbers tell a different story altogether.

Surprisingly, both Monster and Padavettu, featuring the industry’s most loved stars, have fallen flat to draw the audience to the cinema halls and the business in the domestic market has been very insufficient.

Huge expectations were relying on Monster because of the hit combination of Puli Murugan, but the reviews of fans and critics for the film were very disappointing.

Even though Mohan Lal is the biggest star of Kerala cinema, His film Monster had a disastrous number at the box office, The film just collected around 5Cr gross in Kerala and the worldwide gross is around 6.5 Cr in 1st week which is a very shocking number for a big star. These 1st week’s numbers are lower than Mohan Lal’s stardom and opening day numbers of his earlier movies.

Meanwhile, Nivin Pauly’s Padavettu, which was released alongside Monster has also done unsatisfactory numbers in the opening weekend.

Padavettu has just collected 3Cr gross in 1st week which is a disastrous number. The film did receive decent reviews and opened to positive responses from the audience but still, it became a huge box office failure. This came as a shocker for fans of both heroes and the trade circles are also wondering what is the reason for the low openings of these films.

Looks like Monster is going to be another flop for Mohanlal. In 2022, Mohanlal’s Bro Daddy and 12th Man were released directly into OTT. Aaraattu was released in cinema halls but was a disaster. And the Marakkar movie which was released with huge hype last December was also a flop.

మొత్తం నలుపు రంగులో మెరిసిపోతున్న మౌని రాయ్

0

మౌని రాయ్ నలుపు రంగు దుస్తులు ధరించి మెరుస్తున్న దృశ్యం.