Home Blog Page 1892

Tollywood: సీరియస్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మరో యువ జంట?

0

టాలీవుడ్ లో ఆన్‌స్క్రీన్ రిలేషన్ లు అక్కడితో ఆగకుండా నిజ జీవితంలో కూడా కొనసాగడం చాలా సాధారణమైన విషయం. తెర పై అద్భుతమైన జోడీగా నిలిచిన చాలా మంది హీరో హీరోయిన్లు వైవాహిక జీవితాన్ని పంచుకోవడం కొత్తేమీ కాదు. కొన్ని ఆన్-స్క్రీన్ పెయిర్ లు అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించగా, మరి కొన్ని జంటలు ఆఫ్-స్క్రీన్‌లో కూడా మరింత విజయవంతమయ్యాయి.

టాలీవుడ్‌లో నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహా మరియు మహేష్ బాబు – నమ్రత వంటి జంటలు తెర పై తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లారు. తెలుగు పరిశ్రమలో తెర పై పేరు తెచ్చుకున్న ఒక జంట నిజమైన అనుబంధంగా అభివృద్ధి చెందడం అనేది చాలా కాలంగా ఉంది. అలాంటి మరో జంట తెలుగు సినీ పరిశ్రమలో గాఢమైన బంధంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ టాలీవుడ్ జంట కరోనా సమయంలో నేరుగా OTTలో విడుదలై విజయవంతమైన చిత్రంలో కలిసి నటించారు. ఆ తర్వాత కొత్త సంవత్సర వేడుకలు కూడా కలిసి జరుపుకున్నారట. అంతే కాకుండా తరచూ కలిసి కనిపించారని కూడా సమాచారం అందుతోంది. వీరు ఇద్దరూ కేవలం 3-4 సినిమాలలో కనిపించిన యువ నటులు కాగా కెరీర్ పరంగా ఇప్పటికీ కష్ట దశలో ఉన్నారు మరియు మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నారు.

Tollywood: Another young onscreen pair in a serious relationship?

0

Tollywood onscreen relationships are quite a common sight with many ending up in marriages. While some on-screen relationships have given several blockbusters other couples have been more successful off-screen.

Tollywood has seen couples like Nagarjuna- Amala, Srikanth–Ooha, and Mahesh Babu- Namratha who took their on-screen relationship to next level. It has been a while since the Telugu industry witnessed an on-screen pairing developing into a relationship. But, looks like here we have the latest one.

This Tollywood pair has acted in a successful film that was released directly on OTT during the Corona time. This onscreen pair even celebrated the new year together and have been frequently spotted together. Both are young actors with just 3-4 films under their belt and are still in struggling stage and waiting for a big break.

Samyuktha Menon: సార్ సినిమా సక్సెస్ మీట్‌లో ఓ న్యూస్ యాంకర్‌ పై కౌంటర్ ఇచ్చిన నటి సంయుక్త మీనన్

0

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ నటించిన తాజా ద్విభాషా చిత్రం సార్ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. కాగా సార్ యొక్క కలెక్షన్లు, వాస్తవానికి, వాతి (తమిళ వెర్షన్)ని అనేక ప్రాంతాలలో అధిగమించాయి. ఈ సినిమా విడుదలైన రెండవ రోజు వసూళ్లు మొదటి రోజు కలెక్షన్‌తో సమానంగా ఉన్నాయి, అలాగే ఇప్పటికే అనేక ప్రాంతాలలో బ్రేక్‌ ఈవెన్‌ను సాధించింది.

ధనుష్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ మరియు జివి ప్రకాష్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకర్షించడంలో సినిమాకు బాగా సహాయపడ్డాయి. ఒక చక్కని సందేశానికి భావోద్వేగ సన్నివేశాలతో పాటు చక్కని డైలాగులు, నటీనటుల నటన రంగరించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విజయవంతం అయింది.

ఈ చిత్రం ధనుష్‌ నటనకి ప్రత్యేక ప్రశంసలను తెచ్చిపెట్టింది మరియు హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఉపాధ్యాయురాలిగా ఆమె పాత్రకు ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్‌లో తన పాత్ర గురించి నటి మాట్లాడుతూ, సినిమా విడుదలకు ముందు, ఒక జర్నలిస్ట్ తన పాత్ర ఎంపికను ప్రశ్నించారని మరియు గ్లామర్, కమర్షియల్ ఎలిమెంట్స్‌కు స్కోప్ లేనప్పుడు ఈ చిత్రాన్ని ఎందుకు ఎంచుకున్నారని అడిగారని తెలిపారు.

కాగా సక్సెస్ మీట్ లో ఆ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు సమాధానం లభించిందని తాను ఇప్పుడు ఆశిస్తున్నాను అని సంయుక్త చెప్పారు. తన పాత్ర డి-గ్లామ్‌గా ఉన్నప్పటికీ, ఈ చిత్రం మాత్రం ఖచ్చితంగా మంచి కమర్షియల్ ఎలిమెంట్‌లను కలిగి ఉందని ఆమె పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్ మార్క్ దాదాపు రూ.18 కోట్లు కాగా ఇప్పటికే ఆ మార్కును అందుకుని దాదాపు అన్ని ఏరియాల్లో లాభాలను సంపాదిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంయుక్త మీనన్, సముద్రఖని, హైపర్ ఆది, సాయి కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించారు.

Pathaan: బాలీవుడ్‌లో మరో మైలురాయిని సాధించిన షారుఖ్ ఖాన్ పఠాన్

0

దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా మరియు కింగ్ ఖాన్ గా పిలవబడే షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించగా తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ పఠాన్. థియేటర్లలో విడుదలైనప్పటి నుండి, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి డ్రాప్ లేకుండా దూసుకుపోతుంది మరియు భారీ కలెక్షన్లను వసూలు చేస్తునే ఉంది. ఈ చిత్రం సోమవారం మరో 1.2 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. ఈరోజు ఇండియాలో 500 కోట్ల మైలురాయిని చేరుకుంది.

కాగా 500 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి హిందీ చిత్రంగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా బాహుబలి 2 (హిందీ వెర్షన్) తర్వాత నార్త్ లో 500 కోట్ల క్లబ్ లో చేరిన రెండో సినిమా ఇదే. కాగా పఠాన్ కేవలం సెలవు రోజుల్లోనే బాగా ఆడిన సినిమా కాదు. సాధారణ వారం రోజులలో కూడా మంచి వసూళ్లను కలిగి ఉంది మరియు అలాంటి రోజుల్లో కూడా కొన్ని ప్రాంతాలలో హౌస్‌ఫుల్‌లను నమోదు చేసింది.

బాలీవుడ్ యువ హీరో కార్తిక్ ఆర్యన్ యొక్క షెహజాదా వంటి అనేక బాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పఠాన్ యొక్క అద్భుతమైన లాంగ్ రన్ చూసి తమ విడుదలలను వాయిదా వేసుకున్నాయి. ఇక ఈ శుక్రవారం విడుదలైన షెహజాదా పరాజయం పాలవడంతో పఠాన్ కు మరింత లబ్ది పొందేందుకు అవకాశం లభించింది.

పఠాన్‌తో షారుక్ ఖాన్ చాలా రోజుల తరువాత భారీ విజయం సాధించారు. ఆయన సాధించిన ఘనత ఒక స్టార్ హీరోకి దక్కిన అత్యుత్తమ పునరాగమనంలో ఒకటిగా గుర్తించబడింది. ఆయన నటించిన చివరి చిత్రం జీరో (2018). ఈ సినిమా ఇప్పటికే ఎన్నో రికార్డులను క్రియేట్ చేయగా, ఇప్పుడు ఈ యాక్షన్ థ్రిల్లర్ భారతదేశంలో 500 కోట్లు వసూలు చేసి మరో మైలురాయిని సాధించింది.

అలాగే పఠాన్ ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూలు చేసిన ఐదవ భారతీయ చిత్రంగా, బాలీవుడ్ నుండి రెండవ చిత్రంగా నిలిచింది. ఈ ఘనతను సాధించడం ద్వారా, పఠాన్ చిత్రం దంగల్, బాహుబలి2, KGF2 మరియు RRR వంటి ఇతర భారతీయ బ్లాక్‌బస్టర్‌ లను కలిగిన అరుదైన జాబితాలో చేరింది.

పఠాన్ సినిమా YRF స్పై యూనివర్స్‌లో ఒక భాగంగా రూపొందింది. ఇందులో సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ ఫ్రాంచైజీ మరియు హృతిక్ రోషన్‌ యొక్క వార్ ఫ్రాంచైజీ కూడా ఉన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో దీపికా పదుకొనె మరియు జాన్ అబ్రహం కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.

Ram Charan – HCA Awards: హాలీవుడ్ లో అరుదైన ఘనత సాధించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇటీవలే అమెరికా పయనం అయిన సంగతి తెలిసిందే. మార్చి 13న ఆస్కార్ (Oscars 2023) ఫలితాలు వెల్లడించనున్న సందర్భంలో ఆ కార్యక్రమానికి ఆయనతో పాటు ఆర్ ఆర్ ఆర్ చిత్ర బృందం కూడా హాజరు కానున్నారని సమాచారం. అయితే, అంతే కంటే ముందు మరో అవార్డు కార్యక్రమానికి ఆయన వెళ్ళనున్నారు. అయితే అది అతిథిగా కాదు ప్రెజెంటర్ గా వెళ్లనున్నారు.

HCA అనగా హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ సంస్థ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా విడుదలయిన సినిమాల్లో అత్యుత్తమ సినిమాలను గుర్తించి అవార్డులు అందజేస్తుంది. కాగా ఆర్ ఆర్ ఆర్ చిత్రం ఈ ఏడాది హెచ్.సి.ఎ అవార్డులకు నాలుగు విభాగాల్లో నామినేట్ అయ్యింది.

సినిమా, దర్శకత్వం, అంతర్జాతీయ సినిమా, యాక్షన్ ఫిల్మ్ విభాగాల్లో హాలీవుడ్ సినిమాలతో ‘ఆర్ఆర్ఆర్’ పోటీ పడుతోంది. అవార్డులు ఏయే విభాగాల్లో వస్తాయి? అనేది ఈ నెల 24న బెవర్లీ హిల్స్ లో జరుగుతున్న కార్యక్రమంలో తెలుస్తుంది. ఇక ఈ పురస్కారాల కార్యక్రమంలో వేదిక పై రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఆయన్ను ప్రజెంటర్ గా హెచ్.సి.ఎ ఆహ్వానించడం విశేషం.

హెచ్.సి.ఎ అవార్డుల్లోని విజేతలలో ఒకరికి రామ్ చరణ్ అవార్డు ఇవ్వనున్నారు. ఇలా ఒక హాలీవుడ్ సంస్థ నుండి పిలుపు అందుకుని ఆ అరుదైన ఘనత అందుకున్న తొలి హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు అంటూ సాగే ఊర మాస్ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ నామినేషన్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ పాటకు ఆస్కార్ అవార్డు రావడం ఖాయమని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి ఉన్న క్రేజ్ మరియు ట్రెండ్ చూస్తే ఆ అవార్డు మన తెలుగు పాటకు రావడం ఖాయం అనే అనిపిస్తుంది.

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) చిత్రం మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , ప్రపంచ వ్యాప్తంగా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Shahrukh Khan’s Pathaan achieved another milestone for Bollywood

0

Pathaan is a spy action thriller directed by director Siddharth Anand starring Bollywood Badshah, King Khan, Shah Rukh Khan. Since its theatrical release, the film has been showing a stronghold at the box office with no drop and has been collecting massive collections. The film gathered another Rs 1.2 crore net on Monday. Today it has reached the milestone of 500 crore net in India.

The film will be the first straight Hindi to enter the Rs 500 crore club. Overall, after Baahubali 2 (Hindi Version), it will be the second film that has joined the 500 crore club in the North.

It’s not that the film performed well only on holidays. It had an equally impressive run on weekdays as well and has been registering housefuls in some areas on working days as well. Several Bollywood releases like Kartik Aryan’s Shehzada have postponed their releases looking at Pathaan’s phenomenal run at the box office.

Shahrukh Khan with Pathaan has marked one of the best-ever comebacks for a star hero. After a long gap, he scored a big hit with this film. The movie has already carried out many records and now this action thriller has accomplished one more milestone by collecting 500 crores.

Pathaan has also become only the fifth Indian film to gross 1000 crores worldwide and the 2nd Bollywood film to do so. By achieving this feat, Pathaan has joined the elite list of other Indian blockbusters such as Dangal, Baahubali2, KGF2 and RRR.

Pathaan is a part of YRF Spy Universe, which includes the Tiger franchise featuring Salman Khan and the War franchise with Hrithik Roshan. This action thriller also had added star power in the form of Deepika Padukone and John Abraham.

Actress Samyuktha Menon counters a news anchor at Sir movie success meet

0

Venky Atluri’s Sir has received a terrific response from the Telugu states. The collection of Sir have, in fact, surpassed Vaathi (the Tamil version) in several territories. The collection on day two of release was on par with the day one collection enabling it to achieve breakeven in several territories already. Dhanush’s powerful performance and GV Prakash’s solid BGM helped the movie immensely in drawing crowds.

The movie brought in special appreciation for Dhanush and even Samyuktha Menon also received applause for her role as a teacher. Speaking about her role at the movie’s success meet, the actress said that before the release of the film, a journalist questioned her choice of role and asked her why did she pick this movie when there was no scope for glamour as well as commercial elements.

Samyuktha said that she now hopes the journalist has received his answer. She added that while her role was a de-glam one, the film certainly had its own commercial elements.

The movie’s breakeven mark in the Telugu states is around Rs 18 crores and looking at the current form, it will achieve the mark and enter into profits pretty soon. Venky Atluri has directed this film which also stars Samyukta Menon, Samuthirakani, Hyper Aadi, and Sai Kumar among others. Sir has been produced by Sithara Entertainments and the music is scored by GV Prakash.

Mega Power star Ram Charan achieves the rare feat

0

Mega Power Star Ram Charan has achieved a rare feat. At present, he is in the best phase of his career with the magnanimous success of RRR, because of which he has attained a global appreciation. He left for the US on Tuesday, donning an all-black ethnic outfit. He will be one of the presenters at the Hollywood Critics Association Awards ceremony. The prestigious award function will take place in Beverly Hills on Friday.

While Angela Bassett will take the HCA Acting Achievement Award, Rian Johnson will receive the HCA Filmmaking Achievement Award, and the cast and crew of RRR will be presented with the HCA Spotlight Award at the 6th Annual HCA Film Awards.

Along with Ram Charan, Brandon Perea, David Dastmalchian, Madelyn Cline, Trinity Jo-Li Bliss and Violet McGraw, among others, will also act as the presenters of the popular awards.

RRR is nominated for many categories in the HCA Awards. They have nominated this action epic in several categories which include Best Picture, Best Director, Best Action Film, Best International Film, Best Editing, Best Original Song, Best Stunts, and Best Visual Effects. Apart from this, the film is also nominated for Academy Awards in the Best Original Song category. Recently, Naatu Naatu won the Golden Globe in the Best Original Song category.

RRR also made history by becoming the 1st Indian film to achieve JPY 1 billion (62 Crores) in Japan. They released the film in October last year, and its performance at the Japanese box office was consistent and in the recent past, it has seen a significant growth in its numbers incurring to the buzz brought about during the Oscar awards season.

SSMB28: త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమాలో నటించనున్న బాలివుడ్ భామ?

0

మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రంలో నటిస్తున్నారు. తాత్కాలికంగా SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం ఇప్పటికే దాని చుట్టూ భారీ క్రేజ్‌ను సేకరించుకుంది మరియు తాజా నివేదికల ప్రకారం, ఈ చిత్రంలో బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్‌ను ఒక కీలక పాత్ర పోషించడానికి ఎంచుకున్నారని తెలుస్తోంది.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లోని గోవింద నామ్ హై మేరాలో భూమి చివరిగా కనిపించారు మరియు ఆమె మహేష్ త్రివిక్రమ్ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారని మరియు ఈ ప్రాజెక్ట్ యొక్క సెకండ్ హాఫ్ లో ఆమె లేడీ కానిస్టేబుల్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. త్రివిక్రమ్ సినిమాల్లో సాధారణంగా మెయిన్ లీడ్ కాకుండా మరో హీరోయిన్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. ఆయన గత సినిమాలు అరవింద సమేత, అల వైకుంఠపురములో కూడా ఇదే ఫార్ములాను అనుసరించారు.

భూమి పెడ్నేకర్ ఈ చిత్రానికి పని చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని అంతర్గత వర్గాలు తెలిపాయి. అయితే, దీని గురించి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. ఈ చిత్రంలో పూజా హెగ్డే మరియు శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్నారు మరియు జగపతి బాబు ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీత దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు.

SSMB28 అనేది మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూడవ చిత్రం, ఈ సినిమా యొక్క షూటింగ్ మరియు కార్యకలాపాలను వేగవంతమైన విధంగా ప్రారంభించాలి అనుకున్నా, అనుకొని విధంగా షూటింగ్‌లో కొన్ని ఆలస్యాలను ఎదుర్కొంది. ఖలేజా తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మహేష్ అభిమానుల్లోనే కాకుండా ఇతర ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలను పెంచేసింది. కాగా ఈ ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఇంకా నిర్ణయించబడలేదు. ప్రస్తుతం దీనిని SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.

Ram Charan: ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్లిన రామ్ చరణ్

0

ఆస్కార్‌ అవార్డులు దగ్గరలో ఉన్నాయి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చలనచిత్ర ప్రేమికులతో పాటు పరిశ్రమలోని వ్యక్తులు ఈ సంవత్సరం వేడుక కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఎస్ ఎస్ రాజమౌళి యొక్క RRR కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డు కోసం పోటీలో ఉంది. ఎం ఎం కీరవాణి యొక్క నాటు నాటు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ చేయబడింది మరియు ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రచారం యొక్క అంచనాలను పెంచింది.

https://twitter.com/vamsikaka/status/1627870198404612098?t=FcsHQDzIg6qappkEpDe_Cg&s=19

కాగా తాజాగా ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లాస్ ఏంజెల్స్ కి బయలుదేరారు. ఆయనతో పాటు ఎస్ఎస్ రాజమౌళి, ఎంఎం కీరవాణి మరియు ఇతర యూనిట్ సభ్యులు కూడా పాల్గొంటారు. మార్చి 12వ తేదీన LAలో మెరిసే వేడుకలో ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఆర్ సి 15 షూటింగ్‌ని పునఃప్రారంభించేందుకు రామ్ చరణ్ ఈ వేడుక తర్వాత భారతదేశానికి తిరిగి రానున్నారు.

అదే సమయంలో, ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఆర్ ఆర్ ఆర్ అవార్డు గెలిచే అవకాశాలు ఆ చిత్రం నామినేషన్ పొందడంలో విఫలమవడంతో దాదాపు ముగిసిపోయినట్లే. కాగా ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్న నాటు నాటు పైనే చిత్ర బృందం ఆశలన్నీ పెట్టుకున్నారు.

మరో వైపు ఆర్‌సి 15 యొక్క షూటింగ్ వీలయినంత వేగంగా సాగుతోంది మరియు ఇప్పటికే కొన్ని షూటింగ్ షెడ్యూల్‌లను పూర్తి చేసుకుంది. కానీ ఆ చిత్ర దర్శకుడు శంకర్, రెండు భారీ ప్రాజెక్ట్‌లకు (మరొకటి భారతీయుడు 2) ఒకే సారి పని చేస్తుండడం వల్ల రామ్ చరణ్ సినిమా షూటింగ్‌ పై ప్రభావం చూపిందనే చెప్పాలి.