Home Blog Page 2228

Manchu Vishnu’s Ginna Releasing With Chiranjeevi’s Godfather

0

Manchu Vishnu has been in the news for all the wrong reasons lately. From quarreling with Prakash Raj during the MAA elections to the fights with the media. He has been the perfect meme material for meme pages.

But when we take a look at his movie career, it is at an all-time low. His last few ventures have failed miserably at the box office and no one seems to care about his upcoming project Ginna either. His last film to hit the big screens, Mosagallu was a disaster at the box office.

The first look of his next film Ginna was released a few weeks ago, where Vishnu was seen in a rugged avatar. He seems to be playing a more rough character in this film. It is being reported that Ginna will release along with Chiranjeevi’s Godfather.

The makers of Godfather have planned for a Dasara release and Vishnu is also looking at a potential Dasara release. This is a very bold decision, to say the least as Godfather is a highly anticipated film whereas Ginna is probably the least anticipated film. It is also being said that Nagarjuna’s Ghost is also releasing this Dasara.

Only time will tell whether this move will pay off or cause further damage to Vishnu’s film career. Ginna also stars Payal Rajput, Sunny Leonne, and Vennela Kishore in lead roles. Suryaah is the director of the movie.

Bhoothaddam Bhaskar Narayana First Glimpse: An intriguing concept

0

The first glimpse of Bhoothaddam Bhaskar Narayana was released a while ago and it has raised the audience’s curiosity. Just like its quirky name, the first look is also quite interesting and featured actor Shiva Kandukuri.

The film appears to be an investigative thriller and there were many interesting elements in the first look that caught attention. The film appears to have several mythological connotations and the BGM by Sricharan Pakala, and Vijay Bulganin sounded great.

Raj Purushottam is directing this film while Snehal Jangala , Shashidhar Kasi and Karthik Mudumbi are bankrolling it.

Bhoothaddam Bhaskar Narayana will star Rashi Singh as the female lead and it also co-stars Venkatesh Kakumanu, Devi, and Shafi among others. Further details about the project will be revealed soon.

Ravi Teja promises the compensation to Ramarao On Duty producer for losses

0

Ravi Teja’s Ramarao On Duty was a disappointing fare for both him as well as fans. Fans were eager to see Mass Maharaja in a fresh avatar but the movie totally disappointed them. After making a superb comeback with Krack in 2021, the star actor delivered 2 back to back duds in the form of Khiladi and Ramarao On Duty.

Post the failure of Khiladi, the actor himself was looking for a hit which unfortunately didn’t happen, and the movie incurred heavy losses.

Ramarao On Duty is the biggest disaster in Ravi Tejas’s career and the producer, Sudhakar Cherukuri suffered terribly because of this. The actor promised the producer that he will another film on his banner without taking the remuneration. This has come as a huge relief for the producer for the moment.

Meanwhile, all eyes are set on the actor’s next releases Ravanasura, Dhamaka, and Tiger Nageswara Rao. Ravi Teja is hoping to break his flop streak with these films now. He will also be seen in Megastar Chiranjeevi’s Waltair Veerayya which will be directed by KS Ravindra.

Bimbisara and Sita Ramam will decide the fate of the Telugu cinema industry

0

The last few weeks have been absolutely disappointing for Telugu cinema fans as well as filmmakers. Due to continuous disasters producers had a meeting and stopped the shootings to reduce the budget of the film.

Owing to this decision to stop the shooting of movies, over 30+ films are being stopped. Chiranjeevi’s Godfather, Ravi Teja’s Ravanasura, Ram Charan’s RC15, and Prabhas’ Project K to just name a few. The Guild has assured the makers that the shooting can be commenced in one to two weeks at the least.

No one knows when everything will get back on track but TFI needs a huge blockbuster now to prove the producer’s decision wrong. Most of the industry people are still feeling the content of the recent Telugu releases is bad hence the audience are not interested to watch the movie in theatres.

Many believe if the content is good then the audience will definitely come to theatres. Industry insiders, as well as fans, are hoping this weekend’s releases will change the situation. Both Sita Ramam and Bimbisara are carrying positive reports and if they get positive word of mouth, then Tollywood will certainly get that elusive hit.

Senior NTR’s daughter committed suicide shocks entire Telugu people

0

Kanthamaneni Uma Maheshwari, Sr. NTR’s daughter, was found hanging on Monday at her home in Jubilee Hills, Hyderabad. This morning, brother Nandamuri Balakrishna and nephew, actor Kalyan Ram were seen at her residence for the final rites. 

According to media reports, she allegedly died by suicide on Monday due to health issues. However, the exact reason behind this decision is unknown. A case has been registered under section 174 of The Code of Criminal Procedure, 1973.

Uma Maheswari went to her room at lunchtime and didn’t come out for a while, according to her daughter. Dikshitha contacted the police, who arrived at her Jubilee Hills home around 2:30 in the afternoon. Uma was hanging from the ceiling fan in her room when the police arrived. 

Uma Maheswari is survived by her daughter Dikshitha. Film industry. Senior NTR had four daughters and eight sons. The youngest of the four girls was Uma Maheswari. 

మెగాస్టార్ తో తలపడనున్న మంచు విష్ణు

0

మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన విజయం సాధించి చాలా కాలం అయింది. అయితే బాక్స్ ఆఫీసు వద్ద గట్టి హిట్ కోసం విష్ణు కష్టపడుతూనే ఉన్నారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా మధ్యలో కొన్ని ప్రయోగాలు చేసినప్పటికీ అవి పెద్దగా సత్ఫలితాలు అందించలేదు. ఇక ప్రస్తుతం అయన పూర్తి దృష్టి జిన్నా అనే సినిమా పైనే ఉంది. మాస్ కమర్షియల్ కామెడీ సినిమాగా తెరపైకి రాబోతున్న ఈ సినిమా పై మంచి విష్ణు గట్టి నమ్మకమే పెట్టుకున్నట్లు అర్థమవుతుంది.

ఇక ఈ సినిమాను విష్ణు తన సొంత బ్యానర్ లోనే నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ మళయాళం మరియు హిందీలో విడుదల చేయనున్నట్లు కొన్ని పోస్టర్లతో బాగానే అసక్తి ఏర్పడేలా చేశారు. ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా పాయల్ రాజ్ పూత్ నటిస్తుండగా సన్నీ లియోన్ మరొక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కూడా ఇటీవల విడుదల చేసారు.

ఇదే క్రమంలో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ అనుకుంటున్నారు. ఇక విడుదల తేదీ విషయంలో కూడా తాజాగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. సినిమాను దసరా కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట.

అయితే అదే దసరా సీజన్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా, అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా విడుదల కాబోతున్నాయి. అంతే కాకుండా అదే వారంలో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం “పొన్నియన్ సెల్వన్” సినిమా కూడా విడుదల అవుతుంది. ఈ క్రమంలో మంచు విష్ణు పెద్ద చిత్రాలతో పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నారు అంటే సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారో అర్థం అవుతుంది.

దసరా పండుగ సందర్భంగా సినిమాని విడుదల చేస్తే సెలవుల వల్ల లాభం పొందే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి సినిమా విడుదలైనా, మంచి కలెక్షన్స్ వస్తాయి అని ఆ సమయంలో సినిమాలను విడుదల చేస్తూ ఉంటారు. అదే తరహాలో ఆలోచించి మంచు వారసుడు విష్ణు, అక్కినేని నాగార్జున మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి అగ్ర హీరోల సినిమాలకి పోటీగా తన సినిమాని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన కామెడీ సినిమా “దేనికైనా రెడీ” దసరా పండుగ సందర్భంగా విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. మరి ఆ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అయి జిన్నా సినిమా విజయం సాధిస్తుందో.. లేక పెద్ద సినిమాల మధ్య ఇమడలేక పోతుందో చూడాలి.

బుల్లితెర పై RRR Vs KGF 2

0

ఈ ఏడాది భారతీయ సినిమా చరిత్ర లోనే ఎప్పుడూ కనీవినీ ఎరుగని రికార్డులు నమోదయ్యాయి. ఖచ్చితంగా ఇది మన దేశ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే సంవత్సరం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలు వచ్చాయి.. ఆ రెండు కూడా దక్షిణ సినీ పరిశ్రమకి చెందిన సినిమాలవ్వడం మరింత గర్వ కారణంగా చెప్పుకోవచ్చు. ఓ పక్క బాలీవుడ్ సినిమాలు వంద కోట్ల వసూలు చేయాలి అంటే కిందా మీద పడుతున్న సమయంలో వెయ్యి కోట్లకు పైగా సాధించిన సినిమాలు గా కేజీఎఫ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు చరిత్ర సృష్టించాయి.

ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇక ఓటీటీలో విడుదలైన తరువాత కూడా అంతే స్థాయిలో ఈ రెండు సినిమాలు సందడి చేశాయి. కేజీఎఫ్ మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా లు ఇప్పటికి కూడా పలు దేశాల్లో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆర్ ఆర్ ఆర్ ఓటీటీ ద్వారా సాధించిన ఖ్యాతి గురించి మాటల్లో చెప్పలేం.

హాలీవుడ్ స్థాయిలో మన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు విశేష స్పందన లభించింది. థియేట్రికల్ రన్ పరంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా కలెక్షన్లను కేజీఎఫ్ 2 దాటిన విషయం తెలిసిందే. కేజీఎఫ్ 2 అన్ని భాషల్లో అద్భుతంగా ప్రదర్శింపబడి భారీ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద ఈ ఏడాది నెం.1 సినిమా గా నిలిచింది. అయితే ఓటీటీ లో మాత్రం ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించడంతో ఎక్కడికో వెళ్లిపోయింది.

ఇప్పుడు ఈ రెండు సినిమాలు మరోసారి ఒకటితో ఒకటి తలపడేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ మరియు ఓటీటీ సందడి పూర్తి అయిన తర్వాత శాటిలైట్ టెలికాస్ట్ కు సిద్ధం అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు కేజీఎఫ్ 2 కూడా బుల్లి తెరలో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు సమాచారం.

ఆర్ ఆర్ ఆర్ సినిమాను హిందీ లో జీ సినిమా టెలికాస్ట్ చేయనుండగా.. తెలుగు తో పాటు ఇతర దక్షిణ భాషల్లో స్టార్ సంస్థ టెలికాస్ట్ చేయబోతున్నారు. తెలుగులో స్టార్ మా ఛానల్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా త్వరలో ప్రసారం కాబోతుంది. ఇప్పటికే అందుకు సంభందించిన ప్రచారం స్టార్ మా ఛానల్ మొదలు పెట్టింది.ఇక కేజీఎఫ్ 2 ను అన్ని భాషల హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. ఈ మేరకు తెలుగు లో జీ తెలుగు వారు అతి త్వరలోనే కేజీఎఫ్ 2ను టివిలో ప్రసారం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇక టీఆర్పీ రేసులో ఆర్ ఆర్ ఆర్ గెలుస్తుందా లేక కెజీఫ్ 2 గెలుస్తుందా అనేది చూడాలి.

దయ చేసి నా సినిమాని బహిష్కరించద్దు – Amir Khan

0

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా` ఈ నెల 11న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు- తమిళం- హిందీలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ప్యాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని అమీర్ ఖాన్ ఎంతో తపనతో ఉన్నారు. అంతే కాకుండా తెలుగులో కూడా ఎన్నో రకాల ప్రచారాలు చేస్తూ తన వంతు కృషి చేస్తున్నారు. అయితే రకరకాల కారణాల వల్ల సినిమా పై ప్రేక్షకుల్లో రావాల్సిన క్రేజ్ అయితే రాలేదు అనే చెప్పాలి. ఈ చిత్రానికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున స్వయంగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొని తమ వంతు సహాయం చేస్తున్నారు.ఇన్ని రకాలుగా సినిమాని ప్రజల్లోకి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నా.. లాల్ సింగ్ చడ్డాకు పరిస్థితులు ఏమాత్రం సహకరించట్లేదు.

దీనికి తోడు ఇటీవల Boycott Laal Singh Chaddha అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ అవడం అమీర్ కు మరో సమస్యలా మారింది. దీని పై అమీర్ ఖాన్ స్పందించారు. అంతే కాదు తన సినిమాని నిషేధించవద్దని అందరూ సినిమాను చూడాలని ప్రేక్షకులని ఆయన అభ్యర్థించారు. ఇటీవల మీడియాతో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా లాల్ సింగ్ చద్దా ట్విట్టర్ ట్రెండ్ పై స్పందించమని అమీర్ ని మీడియా ప్రతినిధులు కోరగా ఈ మొత్తం వివాదం పై అమీర్ తన ఆలోచనలను పంచుకున్నారు.

ఇలాంటి దుష్ప్రచారం జరగడం పట్ల చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఇలా నేను భారతదేశాన్ని ఇష్టపడను అని కొందరు అనుకుంటున్నారని, అది కూడా చాలా బాధగా ఉందని అన్నారు. కొంతమందికి అలా అనిపించడం చాలా దురదృష్టకరం అని అన్నారు.దయచేసి అలాంటి దుష్ప్రచారాన్ని నమ్మకండి. నా సినిమాని బాయ్కాట్ చేయకండి. దయచేసి నా సినిమా చూడండి అని అమీర్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

#BoycottLaalSinghChaddha ట్రెండ్ అవుతుండగానే చిత్ర కథానాయిక కరీనా కపూర్ కి చెందిన ఒక పాత క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కరీనా నెపోటిజం గురించి మాట్లాడారు. వారసుల సినిమాలు మీకు నచ్చకపోతే చూడొద్దు.. మిమ్మల్ని ఎవరూ ఆ సినిమాలు చూడమని బలవంతం చేయలేదు కదా అంటూ ఆ వీడియోలో కరీనా అంటున్నారు.

అయితే ఈ సినిమా పై నెగటివ్ పబ్లిసిటీ జరగడం ఇదే మొదటిసారి కాదు. `లాల్ సింగ్ చడ్డా` ట్రైలర్ విడుదలయిన రోజు నుంచే వివాదాలు మొదలయ్యాయి అప్పట్లో భారతదేశం పై అమీర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు కారణం. అమీర్ ఖాన్ – కరీనా కపూర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా` ఆగస్టు 11న విడుదల కానుంది.

2015లో భారతదేశంలో పెరుగుతున్న అసహనం గురించి చేసిన ఒక వ్యాఖ్య కారణంగా అమీర్ ఖాన్ వివాదాల్లో చిక్కుకున్నారు. “మన దేశం చాలా సహనంతో ఉంది.. కానీ చెడును వ్యాప్తి చేసే వ్యక్తులు ఉన్నారు“ అని అమీర్ వ్యాఖ్యానించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. అంతటితో ఆగకుండా.. ఆయన మాజీ భార్య కిరణ్రావు గురించి ప్రస్తావిస్తూ.. ఆమె తమ పిల్లల భద్రత కోసం దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందేమో అని అన్నట్లు చెప్పడంతో ప్రజలు తీవ్రంగా స్పందించారు.

కార్తీకేయ – 2 ప్రమోషన్స్ కు రాలేకపోయాను సారీ అంటున్న అనుపమ

0

ఈరోజుల్లో సినిమాను తెరకెక్కించడమే కాదు దాన్ని అంతే సమర్థవంతంగా ప్రచారం జరిపి సరైన విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అనేది ఎంతో శ్రమతో కూడుకున్న పని. అలాగే ప్రస్తుతం ప్రేక్షకులు విడుదలైనఅన్ని సినిమాలూ చూసే మూడ్ లో లేనందున, ఫలానా సినిమాతో క్లాష్‌ అవకుండా సరైన విడుదల తేదీని కూడా చూసుకుని రిలీజ్‌ చేయాల్సి ఉంటుంది.ఇలాంటి ఎన్నో కష్టాలను మరియు సమస్యలను దాటుకుని కార్తికేయ 2 ఎట్టకేలకు ఆగస్టు 12న విడుదల కాబోతోంది.

చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించారు. సినిమా రిలీజ్‌కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రచార కార్యక్రమాల జోరు పెంచింది చిత్ర యూనిట్‌. అయితే ఈ ప్రమోషన్స్‌కు హీరోయిన్‌ అనుపమ హాజరు కాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సడన్‌గా అనుపమ ప్రమోషన్స్‌కు ఎందుకు రాలేదు? హీరో నిఖిల్ తో ఏదైనా గొడవ జరిగిందా లేక పారితోషికం విషయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా? వంటి ప్రశ్నలతో నెటిజన్లు రకరకాలుగా ఆలోచిస్తున్న సమయంలో ఈ వివాదం పై అనుపమ పరమేశ్వరన్ తన వైపు నుంచి వివరణ ఇచ్చారు.

కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నా. నేను కార్తీకేయ 2 కాకుండా మరో రెండు సినిమాల కోసం పగలనకా రాత్రనకా షూటింగులతో బిజీగా ఉన్నాను. ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్‌ సన్నివేశాలను ముందుగానే ఎప్పుడో షెడ్యూల్‌ చేశారు. మరో వైపు కార్తికేయ 2 ప్రమోషన్స్‌ కోసం నేను కూడా చాలా ప్లాన్‌ చేసుకున్నాను కానీ సినిమా విడుదల చాలా సార్లు వాయిదా పడటంతో షెడ్యూల్‌ మొత్తం తారుమారైంది. కాబట్టి ఇక్కడ వేరే సినిమాల షూటింగ్ లకు నేను హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. నా బాధను మీరందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను కార్తికేయ 2 టీమ్‌, మరీ ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్న నిఖిల్‌ గారికి నా ప్రేమాభివందనలు అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో సందేశం ఇచ్చారు అనుపమ పరమేశ్వరన్.

నిజంగానే కార్తీకేయ 2 సినిమాను ప్రచారం చేసే విషయంలో హీరో నిఖిల్ మరియు చిత్ర యూనిట్ చాలా కష్టపడ్డారు. ఇటీవలే ఇస్కాన్ టెంపుల్ లో సందడి చేసిన చిత్ర యూనిట్ సభ్యులు అక్కడ తమ సినిమా యొక్క ట్రైలర్ ను ప్రదర్శించడం ద్వారా మంచి పబ్లిసిటీని దక్కించుకున్నారు. అలాగే సినిమా ప్రమోషన్ నిమిత్తం బాలీవుడ్ వరకు కూడా వెళ్ళారు. మరి వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుందా లేదా తెలియాలి అంటే ఆగస్టు 12 వరకూ ఎదురు చూడక తప్పదు.

గొప్ప లాజిక్ పట్టుకున్న దిల్ రాజు

0

కరోనా తరువాత తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, సినిమాలు నిర్మించడం మరియు వ్యాపారం నిర్మాణ వ్యయంతో పాటు వ్యాపార విషయాల్లో నష్టాలు ఎక్కువయ్యాయని, అంతే కాకుండా చిత్ర నిర్మాణం లో భాగంగా వేస్టేజీ కూడా బాగా పెరిగిపోయిందని, అంతే కాకుండా నటీనటుల పారితోషికాలు కూడా నిర్మాతలకు భారంగా మారాయని ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు పరిశ్రమలో షూటింగ్ల బంద్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 నుంచి షూటింగ్ లన్నీ నిలిపి వేస్తున్నామని.. అందులో భాగంగా నిర్మాణంలో ఉన్న సినిమాలతో పాటు షూటింగ్ ప్రారంభం అవుతున్న సినిమాల షూటింగ్ లు కూడా ఆపెస్తామని, నిర్మాతల గిల్డ్ తరపున దిల్ రాజు ఆదివారం ప్రకటించారు.

ముందు నుంచి గిల్డ్ ప్రతిపాదించిన షూటింగ్ ల బంద్ ని నిర్మాతల మండలిలో ఉన్న చిన్న నిర్మాతలు వ్యతిరేకించినా.. చివరికి అందరూ ఓకే నిర్ణయానికి కట్టుబడ్డారు. దీంతో ఆగస్టు 1 నుంచి తెలుగు సినీ పరిశ్రమలో షూటింగులు అన్నీ ఆగిపోయే పరిస్తితి వచ్చింది.

ఇదిలా ఉండగా పరిశ్రమలో అగ్ర నిర్మాతగా చలామణి అవుతూ, ప్రొడ్యూసర్ గిల్డ్ లో కూడా కీలకంగా వున్న ఒక నిర్మాత మాత్రం చాలా మామూలుగా తన సినిమా షూటింగ్ ని ఆపడం లేదని, అంతే కాకుండా వైజాగ్ లో తాజా షెడ్యూల్ ని ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ వార్త విన్న ఇతర నిర్మాతలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు నిర్ఘాంతపోతున్నారు.

అందుకు కారణం లేకపోలేదు.. అసలు ఈ షూటింగులు ఆపేసే నిర్ణయాన్ని మొదటి నుంచీ సమర్ధిస్తూ అందరికీ పిలుపునిచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన సినిమా షూటింగ్ ని వైజాగ్ లో ప్లాన్ చేసుకోవడమే ఇప్పడు అందరిలోనూ చర్చకు దారి తీసింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ హీరోగా దిల్ రాజు తమిళ తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకుడు. తెలుగులో ‘వారసుడు’ పేరుతో.. తమిళంలో ‘వారీసు’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ ని వైజాగ్ లో ప్లాన్ చేశారట. అదేంటి ఈరోజుతో షూటింగులు అన్నీ ఆపేస్తాము అని చెప్పి ఇలా షూటింగ్ చేయడం ఏంటని చాలా మంది ఇతర నిర్మాతలు ఈ విషయం పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట.

అయితే అందుకు బదులుగా దిల్ రాజు మాత్రం ఆసక్తికరమైన సంజాయిషి వినిపిస్తున్నారని తెలుస్తోంది. అదేంటంటే . తాను విజయ్ తో చేస్తున్న సినిమా తమిళ సినిమా కానీ స్ట్రెయిట్ తెలుగు సినిమా కాదు. తమిళ సినిమాను తెలుగులో డబ్ చేస్తారట. అందువల్ల తమిళ సినిమాకు టాలీవుడ్ బంద్ కు ఎలాంటి సంబంధం లేదన్నది ఆయన మాటగా అంటున్నారు.

మరి అలాంటప్పుడు ధనుష్ – వెంకీ అట్లూరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సార్’, శంకర్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లలో రూపొందుతున్న సినిమాలు కూడా అదే కోవలోకి చెందుతాయా?ఆయా చిత్ర యూనిట్లు కూడా యధావిధిగా షూటింగ్ చేసుకోవచ్చా? అని కొంత మంది నిర్మాతలతో పాటు సోషల్ మీడియాలో ప్రేక్షకులు కూడా సెటైర్ లు వేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

గిల్డ్ ప్రతినిధిగా షూటింగులు ఆపేయడం అనే నిర్ణయాన్ని అంతా తానై ముందుండి నడిపించిన సదరు నిర్మాతే ఆ నియమాన్ని పాటించకపోతే మరి మిగతా వాళ్లు ఎలా పాటిస్తారు? వారు కూడా ఏదో ఒక కారణం లేదా లాజిక్ చెప్పి షూటింగ్లను కొనసాగిస్తే ఇంక ఏ రకమైన బంద్ లు జరగడానికి ఆస్కారం ఉండదు మరి.