Home Blog Page 2195

Vijay Deverakonda Is No More A Tier 2 Hero; Enters Tier 1 With Liger

0

With just a day left for the release of Vijay Deverakonda’s much anticipated Pan-Indian project Liger, the advance bookings are highly promising. The bookings are not only phenomenal in the two Telugu states but also in the North belt as well.

Over the last few months, Vijay Deverakonda and the team of Liger have been the subject of trolls and meme pages. There has been heavy trolling on the budget of Liger, the pre-release business of the film, and so on.

Just recently as well, Vijay openly stated that he would only start counting the box office numbers after the 200-crore mark. While some saw this as a sign of confidence, some were trolling Vijay, calling him “arrogant” and “overconfident”.

But now, looking at the advance bookings of Liger, especially the Hindi version, it just proves the social media trollers wrong. The bookings are beyond everyone’s expectations and yet again are proof of Vijay’s stardom and craze.

It looks like this wild combination of Puri Jagannadh and Vijay Deverakonda has worked out really well. The film also stars Ramya Krishnan, Ananya Pandey, and Mike Tyson in a cameo appearances. Karan Johar has produced the film under the Dharma Productions banner.

Everything you need to know about Bigg Boss 6 Telugu

0

Bigg Boss Telugu debuted on OTT recently and the Telugu audience is already looking for contestants to appear on Bigg Boss Telugu. Fans of the Telugu version of Bigg Boss are actively guessing the identities of the contestants. The following are some of the potential contestants for Bigg Boss 6 in Telugu.

Bigg Boss 6 Telugu

The fifth season of Bigg Boss Telugu has concluded, and as everyone knows, the most popular show in the world is about to return for a sixth season.

The promo for Bigg Boss Season 6 has just been released, and Nagarjuna will be hosting the new season just as he did the previous five. As usual, the promo has generated twice as much interest as the previous one did, and many Bigg Boss fans have been waiting to learn when the show will air and who will be competing.

Bigg Boss Telugu Premeire Date

Bigg Boss Telugu 6 is scheduled to air on September 4, 2022, barring any unforeseen delays. The show is currently in its pre-production stage.

Bigg Boss 6 Telugu Contestants List (Expected)

As the premiere date of Season 6 of Bigg Boss Telugu approaches (September 4, 2022) viewers have been wondering who will be competing on the show. No official contestant list has been released as of yet, but there has been much speculation based on who is expected to participate.


Bigg Boss Season 6 will feature a total of 15 contestants, and it’s interesting to note that Anchor Shiva will likely host a Bigg Boss Buzz. We present the anticipated Bigg Boss contestant list, as the official cast has not yet been revealed.

  1. Anchor Udaya Bhanu
  2. Neha Chowdary
  3. Chalaki Chanti
  4. RJ Surya
  5. Anchor Pratyusha
  6. Nikhil
  7. Sirhan
  8. Singer Mohana Bhogaraju
  9. Nandu
  10. Varshini
  11. Bharath(Child Artist)
  12. Sravanthi Chokkarapu
  13. Ajay
  14. Poppy master
  15. Sanjana Chowdary

Nagarjuna Remuneration for Bigg Boss Telugu 6

Nagarjuna reportedly made Rs 12 lakhs per episode in his first season (reason No. 3). During the fourth season, he was paid between Rs 12 and 14 lakh per episode. According to reports, he charged a whopping Rs 12cr for the entire season of Bigg Boss Telugu 5.
Nagarjuna’s upcoming brand new season will likely cost more than Rs 12 crore, given the aforementioned figures. His salary details are currently unknown.

Bigg Boss 6 Telugu Voting Process

Bigg Boss Telugu polls viewers weekly. In this game, competitors nominate new candidates each week. Each of these contestants will be up for grabs in the voting. As part of the Process, the Bigg Boss contestant who received the fewest votes this week will be booted off the show. Therefore, every week there will be a winner and a loser.

How to Vote Online

Fan pages held public opinion polls about for bigg boss 6 telugu voting. One can vote for the Telugu version of Bigg Boss 6 using the Google Chrome web browser. That can be done without downloading the Hot Star app. You’re good to go as long as you can get online.

  • Open your preferred web browser on your phone, tablet, or computer.
  • Simply type “Bigg Boss Telugu Vote” into the “google.co.in” search engine to see the results.
  • Every week, Google now mechanically displays a list of all the nominees for the relevant awards show.
  • Cast your ballot this weekend to save your favorite contestant from elimination.
  • The deadline for ballots to be counted is Friday at midnight.

Bigg Boss 6 Telugu Elimination List

The sixth season of Bigg Boss Telugu is scheduled to premiere on September 4, 2022.2 Everyone who watches Bigg Boss regularly knows that a housemate is eliminated each week based on viewer votes.

Bigg Boss 6 Telugu Voting Process

In this show, you have the opportunity to vote for your favourite contestant in two different ways officially conducted by the show makers.

Hotstar Method

  • Before you do anything else, make sure you have the Hotstar app downloaded on your mobile device.
  • Put in your phone number to set up a profile.
  • The sixth season of Bigg Boss in Telugu can be accessed by typing the title into the site’s search bar.
  • If you click the logo for Bigg Boss Telugu Season 6, a voting button will appear below it. To vote, select your preferred contestants by clicking on them, then tapping their image ten times.

Missed Call  Method

  • Each participant will be assigned a separate mobile phone number.
  • You only need to call your participant’s mobile number.
  • After missing the call and getting yourself cut, you have ten votes to cast.

Bigg Boss 6 Telugu TRP Ratings

Even though Bigg Boss 5 has generated strong TRP so far in comparison to previous seasons, its Telugu TRP of around 18.5 was among the highest of any Telugu television program ever. Bigg Non-Stop was a smashing success, so this season of Bigg Boss is likely to have the highest TRP ever.

నిర్మాతలకు ఇబ్బందులు తెచ్చిన OTT సంస్థల కొత్త నిర్ణయం

0

కొన్ని వారాల క్రితం టాలీవుడ్ నిర్మాతల గిల్డ్ ప్రస్తుతం జరుగుతున్న సినిమా షూటింగ్‌లను కొద్ది రోజులు నిలిపివేసి మళ్ళీ బంద్ ను విరమించుకున్నారు. కరోనా తరువాత పరిశ్రమలో నెలకొన్న సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. అందుకు పరిష్కారంగా క్యారెక్టర్ ఆర్టిస్టుల పారితోషికం తగ్గింపు, మరియు ఓటిటి విడుదల పరిధి పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా చెప్పారు. అలాగే అన్ని సినిమాలు బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేయడానికి తెలుగు సినిమా నిర్మాతలు అందరూ సమిష్టిగా బడ్జెట్‌ను తగ్గించాలని నిర్మాతల సంఘం భావించింది. స్టార్ హీరోలు, దర్శకుల పారితోషికాన్ని తగ్గించడం ఒక్కటే మార్గమని యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ దిల్ రాజు పేర్కొన్నారు. అయితే ఈ విషయం పై ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వటం జరగలేదు.

ఇటీవలే సమ్మె విరమిస్తూ నిర్మాతల సంఘం కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. ఓటిటి విడుదల యొక్క వ్యవధిని ఎనిమిది వారాలకు పొడిగించాలని మేము నిర్ణయించుకున్నాము. ఇకపై, చిత్ర నిర్మాతలు అందరూ ఈ నియమానికి కట్టుబడి ఉంటారు. అంతే కాక ఎవరూ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించే ప్రశ్నే లేదని దిల్ రాజు తెలిపారు. అలాగే ఇప్పటికే ఉన్న సినిమా తాలూకు ఒప్పందాలను మాత్రం కొనసాగిస్తున్నామని, అంతగా అవసరమైతే, కొత్త నిభందనలు వెంటనే అమలులోకి వచ్చే విధంగా ఒప్పందం తాలూకు షరతులను మారుస్తామని దిల్ రాజు అన్నారు.

అయితే, ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతల నిర్ణయాలతో పూర్తిగా ఏకీభవించినట్లు కనిపించడం లేదు. దాంతో వారు తమ వైపు నుంచి ప్రత్యామ్నాయ దారిని కూడా ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు నిర్మాతలను సినిమాకు నేరుగా ఓటిటిలో కాకుండా ఖచ్చితంగా ముందుగా థియేటర్‌లలోనే విడుదల చేయాలని కోరినట్లు సమాచారం. ఆ తరువాత ఆయా సినిమాల ఫలితం ఆధారంగా వారు ఒప్పందం రేటును సర్దుబాటు చేయబోతున్నారట. ఓటిటి సంస్థల ఈ కొత్త ప్రతిపాదనతో నిర్మాతలు ఏమాత్రం సుముఖంగా లేరని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇక్కడ ఓటిటి సంస్థలను తప్పు బట్టడానికి ఏమీ లేదు. కరోనా నేపథ్యంలో నేరుగా వారి ప్లాట్ఫారం లలో సినిమాలు విడుదలయిన కారణంగా అప్పుడు అధిక ధరకు సినిమాలను కొన్నా బాగానే గిట్టుబాటు అయ్యాయి. అంతే కాకుండా మూడు, నాలుగు వారాల్లోనే సినిమాలు ఓటిటి లోకి వచ్చేయడం కూడా వారికి కలిసి వచ్చింది. ఇప్పుడు నిర్మాతలు ఖచ్చితంగా ఎనిమిది వారాల గడువు నిబంధన విధించడంతో ఓటిటి సంస్థలు కూడా తమ రేట్లు తగ్గించడంలో న్యాయం లేకపోలేదు.

Tollywood Producers upset with OTT Platforms decision

0

A few weeks ago Tollywood producers’ collective decided to bring a halt to ongoing film shoots. The producers’ association felt TFI collectively needs to reduce the budget to register box-office success. Dil Raju, the president of the Active Telugu Film Producers Guild claimed that the only way to cut down on the budget is by slashing the remunerations of star heroes and directors.

Recently, the strike was called off and certain orders were passed by the producer’s association. “We have decided to extend the window period of OTT release to eight weeks. Hereafter, all the filmmakers will adhere to this rule and there is absolutely no question of flouting the agreement. We are also pursuing the existing agreements and if need be, we will change the terms and conditions with immediate effect,” said Dil Raju.

However, the OTT platforms don’t seem to be in complete agreement with this declaration and they have proposed an alternative. OTT Platforms are asking the Producers to have a theatrical release and based on the movie result they are going to adjust the final digital rate. This plan hasn’t gone down well with the Tollywood producers and it now needs to be seen what final decision is now taken.

హరిహర వీరమల్లు – ఈసారైనా చెప్పిన డేట్ కు వస్తుందా?

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఎనర్జీకి పెట్టింది పేరు. హీరోయిన్ తో రొమాన్స్, కామెడీ, డాన్స్, ఫిట్స్ ఇలా అన్నిట్లో తనదైన స్టైల్ మరియు ఎనర్జీని అందిస్తుంటారు పవన్. అయన నుంచి అభిమానులైనా, ప్రేక్షకులైనా ఆశించేవి అలాంటి పాత్రలు, సినిమాలే. అలాంటి పవన కళ్యాణ్, తన కెరీర్ లోనే మొట్ట మొదటిసారి ఒక చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన హరిహర వీరమల్లు సినిమా చేయబోతున్నారు అని తెలిసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక అభిమానులు అయితే ఇందులో హీరో ఒక దొంగ పాత్రలో, అలాంటిచారిత్రాత్మక నేపథ్యం లో నటిస్తున్నారు అనగానే పైరేట్స్ ఆఫ్ కారెబ్బీయన్ లోని జాక్ స్పారో తరహాలో ఒక ప్రత్యేకమైన పాత్రగా ఉంటుందని భారీ అంచనాలు పెట్టేసుకున్నారు.

ఇక దర్శకుడు క్రిష్ ఇది వరకే ఇలాంటి నేపథ్యంలోనే గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాను తెరకెక్కించిన అనుభవం ఉండటంతో.. ఖచ్చితంగా తమ హీరోతో కూడా అద్భుతమైన సినిమా తీస్తాడని పవర్ స్టార్ అభిమానులు ముందస్తు సంబరాలు చేసుకున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా అసలు అనుకున్నట్లుగా తెరపైకి వస్తుందా లేదా అనేది ప్రస్తుతం అందరిలోనూ ఉన్న అనుమానం. షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా సినిమా అని ప్రకటించారు. కానీ అందుకు తగ్గట్టుగా షూటింగ్ కానీ, చిత్ర ప్రచార కార్యక్రమాలు కానీ జరగటం లేదు.

మధ్యలో పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ ఆపేసి ఇతర సినిమాలకు ప్రాధాన్యతను ఇవ్వడం.. అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా పలు మార్పులు చేర్పులు చేసినట్లు వార్తలు రావడం.. అభిమానుల్లో సినిమా పట్ల ఒకింత అనిశ్చితికి దారి తీశాయి. అంతే కాక ఈ సినిమా విడుదల తేదీ విషయంలో కూడా చాలా మార్పులు జరిగాయి.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను మూడు సార్లు మార్చారు. గత ఏడాది వేసవికాలంలో రావాల్సిన సినిమా షూటింగ్ ఆలస్యం అవడంతో దసరాకు మార్చారు. ఆ తరువాత అదీ కాదు సంక్రాంతి 2023 అని అనధికారిక సమాచరం అందించారు. ఇక చివరిగా ఈ సినిమాను 2023 మార్చి 30వ తేదీన ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. ఇక ఈ డేట్ కు కూడా సినిమా వస్తుందా రాదా అనే అనుమానం అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో కూడా వ్యక్తం అవుతుంది. కాగా వేసవిలో మొదటి పెద్ద సినిమాగా ఆరోజు విడుదల అయితే ఖచ్చితంగా సినిమాకి బాక్స్ ఆఫీస్ వద్ద హెల్ప్ అవుతుంది అని కొందరు అభిమానులు అంటున్నారు.

2018లో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా సరిగ్గా అదే డేట్ కి వచ్చి, బ్లాక్ బస్టర్ అవడమే కాక మెగా పవర్ స్టార్ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది. హారిహర వీరమల్లు అనుకున్నట్లు మార్చి 30న వస్తే బాక్స్ ఆఫీస్ వద్ద అన్నదమ్ముల సవాల్ చూడచ్చు, ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా భోళా శంకర్ చిత్ర బృందం ఆ చిత్రాన్ని ఏప్రిల్ 14,2023న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

అమిత్ షా – ఎన్టీఆర్ సమావేశం వెనుక అసలు కారణం అదేనా?

0

భారత దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షాతో తెలుగు సినీ నటుడు/హీరో జూనియర్ ఎన్టీఆర్ నిన్న సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ భేటీ పలు పుకార్లకు దారి తీసింది. ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడం కేవలం మర్యాదపూర్వక చర్య మాత్రమేనని అని పరిశ్రమలోని ఒక వర్గం అంటుండగా, మరి కొందరు మాత్రం ఈ విషయం పైకి కనిపించేంత సాధారణ విషయం కాదని, ఏదో గుడార్థం దాగి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రజాకార్ల ఉద్యమాన్ని వీరోచితంగా చూపిస్తూ రజాకార్ ఫైళ్లపై సినిమా చేయడానికి బిజెపి గత కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోందట. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ స్క్రిప్ట్‌ ను సిద్ధం చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. బిజెపి పార్టీ సంభందిత వర్గాల ప్రకారం.. ఈ సినిమాలో నటించమని ఎన్టీఆర్‌ని బీజేపీ అభ్యర్థించినట్లుగా సమాచారం. ఈ చిత్రం ఇతివృత్తం హిందూ మతానికి సంబంధించినది, ఇది బిజెపి పార్టీ ప్రధాన సందేశాన్ని మరింత బలంగా ప్రజల్లోకి, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు తమ ఉనికిని గుర్తించడంలో.. సినిమా ద్వారా తమ ఉద్దేశ్యాలు చేరుకునేందుకు సహాయపడుతుంది.

ఆర్ ఆర్ ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటనను ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో మెచ్చుకున్నారు. అంతే కాకుండా కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీ ఈ పాపులారిటీని ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి నిజంగా ఈ సినిమా కార్యరూపం దాల్చితే గనక ఖచ్చితంగా భారీ స్థాయిలో రూపొందే సినిమా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంగా దర్శకుడు కొరటాల శివతో కలిసి పని చేయనున్నారు. వీరివురూ ఇది వరకు కలిసి పని చేసిన జనతా గారేజ్ సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. కాగా ఎన్టీఆర్ 30వ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో భారీగా తెరకెక్కించనున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో పాటు హారిక & హాసిని క్రియేషన్స్‌ బ్యానర్ల పై ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన మోషన్ పోస్టర్‌ అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకుల ప్రశంసలు అందుకుని సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Box-Office: రెండవ వారంలోనూ అదరగొడుతున్న కార్తీకేయ-2

0

యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా అందరి అంచనాలకు మించి అద్భుతంగా ప్రదర్శనను కొనసాగిస్తుంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఒకదాని తర్వాత మరో మైలురాయిని దాటుతూ దూసుకు పోతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ మార్కెట్‌లోనూ భారీ విజయాన్ని అందుకుంది. కార్తికేయ 2 హిందీ మార్కెట్‌లో మొదటి రోజు చాలా తక్కువ స్క్రీన్‌లలో ప్రదర్శించబడింది . కానీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్‌తో, సినిమాను ఎక్కువ మంది చూడాలి అనే డిమాండ్ పెరగడంతో రోజు రోజుకూ స్క్రీన్‌ల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

యాక్షన్‌-అడ్వెంచర్‌ నేపథ్యంలో శ్రీకృష్ణుడి కాలం నాటి ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం తొలి వారం హిందీ మార్కెట్లో 5.75 కోట్ల నెట్ వసూలు చేసింది. కాగా మొదటి వారాంతంలో 9.57 కోట్ల రూపాయల భారీ వసూళ్లు రాబట్టింది. ఇక తొమ్మిదవ రోజు సినిమా ఏకంగా 4.07 కోట్ల రూపాయలను తెచ్చిపెట్టింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటివరకు హిందీలో కార్తీకేయ 2 15 కోట్ల నెట్ ను రాబట్టింది.

కలెక్షన్లు ఇలా ఎక్కడా తగ్గకుండా బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా ఉన్నాయి. అంతే కాకుండా రెండవ వారాంతంలో మొదటి వారం కంటే రెట్టింపు కలెక్షన్లు రావడం విశేషం. ఇది అత్యంత అరుదైన రికార్డు గా చెప్పుకోవచ్చు. 2014 లో వచ్చిన కార్తీకేయ చిత్రానికి సీక్వెల్ అయిన కార్తికేయ 2 లో నిఖిల్ ప్రధాన పాత్రలో నటించగా.. అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి మరియు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

నిఖిల్ నటనతో పాటు, చందూ మొండేటి దర్శకత్వ ప్రతిభ , ఆసక్తికరమైన కథనంతో పాటు కాల భైరవ అద్భుతమైన నేపథ్య సంగీతం మరియు ఆహ్లాదకరమైన విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. విడుదల ముందు చిత్ర బృందం అనేక ఇబ్బందులను ఎదురుకున్నా.. చివరికి ఫలితం మాత్రం వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Pushpa-The Rule: పెద్ద ప్లాన్ లో ఉన్న సుకుమార్

0

అల్లు అర్జున్ పుష్ప ది రూల్ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉంది. నిన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ పై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మరోసారి అలరించనున్న ఈ చిత్రం ప్రధానంగా పుష్ప vs షేకావత్ మధ్య యుద్ధం లా ఉండబోతుంది. షేకావత్ పాత్రలో ఫహద్ ఫాసిల్‌ మొదటి భాగంలో కొంత సేపే ఉన్నప్పటికీ రెండో భాగంలో మాత్రం ఆయన పాత్ర పుష్ప తో పోటీ పడుతుందట. అల్లు అర్జున్ – ఫహద్ ఫాసిల్‌ ల మధ్య అటు సినిమాలో పాత్రధారులుగా ఇటు నటులుగా అద్భుతమైన పోటీని మనం చూడబోతున్నాం అన్నమాట.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పుష్ప: ది రూల్ సినిమాకు ఇప్పుడు సుకుమార్ కేవలం దర్శకుడి గానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారట. ఆయన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి ఈ చిత్రం నిర్మించబడుతుంది. పుష్ప ది రైజ్ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ముత్తంశెట్టి మీడియా సహ నిర్మాతలుగా చేరారు. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న పుష్ప ది రూల్ కు ఇప్పుడు ముతంశెట్టి మీడియా స్థానంలో సుకుమార్ రైటింగ్స్‌ ప్రవేశించింది.

అత్యంత భారీ క్రేజ్ ను ఏర్పరచుకున్న ఈ చిత్రాన్ని ఏదో ఆషామాషిగా తీయడానికి సుకుమార్ ఏ మాత్రం తొందరపడటం లేదు. సినిమాకు సంబందించిన ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అన్నిటితో సంతృప్తి చెందిన తర్వాత మాత్రం షూటింగ్ ప్రారంభించాలనుకుంటున్నారట. అందుకే చాలా విరామం తీసుకుని ఆగస్ట్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

ఇక సినిమా కథాంశం విషయానికి వస్తే, టైటిల్ సూచించినట్లుగా, ఈ చిత్రం పుష్ప ఎదుగుదలను అద్భుతంగా ప్రదర్శించనుందని తెలుస్తోంది. పైగా ఈ చిత్రంలో కేవలం చిత్తూరు, తమిళనాడు కాకుండా ఏకంగా అంతర్జాతీయ నేపథ్యంలో తెరెక్కనుందట. అంటే హీరోగా అల్లు అర్జున్ ఉన్న క్రేజ్ కు తగ్గట్టే పుష్ప ది రూల్ లో పుష్పరాజ్ కు ఎందరో విరోధులు ఉంటారట. అలా పుష్పరాజ్ పాత్ర ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే విధంగా సినిమా ఉంటుందట. ముందుగా చెప్పుకున్నట్లు పుష్ప 2 లో ఫహద్ ఫాసిల్ ఈసారి బలమైన పాత్రను కలిగి ఉంటారని సమాచారం. అంతే కాకుండా ఆయన పాత్ర చిత్రణ అందరినీ ఆశ్చర్యపరుస్తుందని, ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుందని అంటున్నారు.

పుష్ప ది రైజ్ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తాలూకు థియేట్రికల్ రైట్స్ ₹145.5 కోట్లకి జరుపుకుంది. ఇక తన మొత్తం రన్ అయ్యాక వ్యాపారంలో 120% రికవరీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, ఇతర భాషల్లో చక్కని రన్ తెచ్చుకుంది. ముఖ్యంగా హిందీలో ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించి ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్ అయింది. మరి పుష్ప 2 ఏ స్థాయిలో ఆడుతుందో ఎన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఘరానా మొగుడు స్పెషల్ షోలు హిట్టా ఫట్టా?

0

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘ఘరానా మొగుడు’ సినిమాను మెగా అభిమానులు అనేక ప్రదేశాలలో ప్రత్యేక ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ షోలకు స్పందన అనుకున్నంత భారీగా లేకపోవడమే.

టాలీవుడ్‌లో ఇటీవల రీ రిలీజ్ ల వర్షం కురుస్తోంది. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రాన్ని మహేష్ అభిమానులు భారీ స్థాయిలో ప్రత్యేక ప్రదర్శనలను ఒక పండగలా జరుపుకున్నారు. అంతే కాక వారి విశేష స్థాయి సంబరాలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఇక మహేష్ అభిమానుల సంబరాలు చూసి పవర్ స్టార్ అభిమానులు సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా ఘరానా మొగుడు సినిమాని ప్రదర్శించడానికి పూనుకున్నారు.

అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమాకు మెగా ఫ్యాన్స్ స్పెషల్ షోస్ ప్లాన్ చేశారు. అయితే ఇవి పోకిరి లాగా విస్తృత స్థాయిలో అత్యధిక షోలు కాకుండా పరిమితంగానే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, చాలా షోలు అమ్ముడవ్వకపోవడం లేదా హౌస్‌ఫుల్ కావడం కొంత మంది మెగా అభిమానులను నిరుత్సాహపరిచింది.

అయితే ఇక్కడ మెగా అభిమానులు బాధ పడాల్సిన అవసరం లేదు. 1992లో విడుదలైన ఘరానా మొగుడు అప్పట్లో 10 కోట్ల రూపాయల భారీ వసూళ్లను సాధించిన తొలి టాలీవుడ్ చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా చాలా కేంద్రాలలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. కాబట్టి ఘరానా మొగుడు సినిమా సాధించాల్సిన ఘనత 30 ఏళ్ళ క్రితమే సాధించింది. ఇప్పుడు ఏదో అభిమానులు తమ ఆనందం కోసం వేసుకున్న షోలు హౌజ్ ఫుల్ కాలేదని చింతించాల్సిన అవసరం లేదు.

కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఘరానా మొగుడు సినిమా అన్ని వర్గాల వారిని అలరించేలా కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన సినిమా. ఈ చిత్రం మెగా అభిమానులకు ఎంతో ప్రత్యేకం అని చెప్పచ్చు. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో కామెడీ, మాస్ డైలాగ్స్, ఫైట్స్, హీరోయిన్లతో రొమాన్స్ మరియు డాన్స్ ను కనబరిచి ఆకట్టుకున్నారు. అలాగే ఆయనకు ధీటుగా హీరోయిన్ గా నగ్మా కూడా తన పాత్రలో అద్భుతంగా నటించారు. ఇప్పటికీ ఎందరో మెగా అభిమానులతో పాటు ఇతర సాధారణ ప్రేక్షకులకు కూడా ఘరానా మొగుడు సినిమా అలరిస్తుంది.

SSMB28: మార్కెట్లో భారీ క్రేజ్ తెచ్చుకున్న మహేష్ – త్రివిక్రమ్ సినిమా

0

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్‌ల కలయికలో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని 2023 వేసవిలో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రం 28 ఏప్రిల్ 2023న అంటే 16 ఏళ్ళ క్రితం పోకిరి సినిమా విడుదలైన రోజున విడుదలవుతుంది. అంతే కాకుండా దాదాపు 13 సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలిసి పని చేస్తుండటం వల్ల ఈ సినిమా కోసం అభిమానులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు.

అతడు, ఖలేజా తర్వాత మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌లకు ఇది మూడో సినిమా కావడం విశేషం. చిత్ర నిర్మాతలు, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ గత సంవత్సరం ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే అభిమానులు హ్యాట్రిక్ బొమ్మ బ్లాక్ బస్టర్ అవ్వాలని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ SSMB28 షూటింగ్ కూడా మొదలు కాలేదు, కానీ ట్రేడ్ వర్గాల్లో మాత్రం ఈ చిత్రం హాట్ ఫేవరెట్‌గా చలామణి అవుతుంది. నిర్మాతలకు డిస్త్రిబ్యుటర్స్ నుంచి భారీ ఆఫర్ లు ముడుతున్నట్లు సమాచారం.

మరో విశేషం ఏమిటంటే భారీ హైప్ తో రానున్న SSMB28 సినిమాను ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అని తెలియ వచ్చింది. అయితే అందుకు ముందుగా మహేష్ బాబు ఒప్పుకోవాలి. ఆయన తుది నిర్ణయం ఏదైతే అది నిర్మాతలు అమలు పరుస్తారట.

ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కానీ ఇప్పటికే అన్ని ఏరియాల బిజినెస్ తాలూకు ఆఫర్లు మొదలయ్యాయి అని సమాచారం. మరో రెండు నెలల్లో బిజినెస్ ఒప్పందాలు ముగిసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ చిత్రం తాలూకు షూటింగ్ ఆగస్ట్ నెలలోనే మొదలవ్వాలి.. అయితే అనుకోని పరిస్థితుల్లో తెలుగు సినీ నిర్మాతల గిల్డ్ షూటింగులు బంద్ చేయడంతో అది జరగలేదు.

మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మిగిలిన నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఒక ముఖ్య పాత్రకి మలయాళ మరియు హిందీ నటుల పేర్లు వినిపించినా అవేవీ అధికారికంగా ధృవీకరించలేదు.

త్రివిక్రమ్ ఈ సినిమాను తన మునుపటి శైలిలో కాకుండా కొత్త తరహాలో తీయాలని నిర్ణయించుకున్నారట. తన సహజ సిద్ధమైన ఫ్యామిలీ కథలకు దూరంగా ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తోంది.తాజాగా, ‘అల వైకుంఠపురములో’ వంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తరువాత త్రివిక్రమ్ మళ్ళీ అలాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కాకుండా యాక్షన్ నేపధ్యంలో సినిమాని తెరకెక్కించబోతున్నారు. అలాగే జానర్‌తో పాటు సబ్జెక్ట్‌కి సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా భిన్నంగా ఉంటుందని సమాచారం.

ఈ చిత్రానికి ప్రస్తుతం అద్భుతమైన ఫార్మ్ లో ఉన్న ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.