Home Blog Page 2145

ఇండియన్-2 బడ్జెట్ లెక్కింపుల వలన కోట్లు నష్టపోయిన దిల్ రాజు

0

మినిమమ్ గ్యారంటీ సినిమాలను రూపొందిస్తూ.. బడ్జెట్ విషయంలో ఖచ్చితమైన లెక్కలతో సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేలా చూసుకున్న నిర్మాత దిల్ రాజు. ఆయనతో కలిసి పని చేసిన వారయినా.. లేదా ఇండస్ట్రీలోని ఇతర సభ్యులకయినా ఖర్చుల విషయంలో ఆయన ఎంత పక్కాగా ఉంటారు అనేది స్పష్టంగా తెలుసు.

అలా ప్రతి విషయంలోనూ జాగర్తగా ఉంటారు కాబట్టే కెరీర్లో ఆయన నిర్మించిన సినిమాలలో ఎక్కువ శాతం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే కెరీర్ ప్రారంభించిన కొత్తలో నూతన దర్శకులను ఎక్కువగా పరిచయం చేసిన దిల్ రాజు క్రమంగా ఆ పద్ధతి మానుకుని స్టార్ దర్శకులు మరియు స్టార్ హీరోల కాంబినేషన్లో భారీ కమర్షియల్ చిత్రాలను తీస్తూ వస్తున్నారు.

అయితే క్రికెట్ లో బ్యాట్స్మెన్ తన ఫేవరెట్ షాట్ కే ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయినట్టు, ఏ బడ్జెట్ లెక్కింపుల కారణంగా దిల్ రాజు తన కెరీర్లో దీర్ఘకాలం విజయవంతమైన సినిమాలు అందించారో.. అవే లెక్కింపుల వల్ల ప్రస్తుతం కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ – కమల్ హాసన్ కలయికలో 1996లో వచ్చిన భారతీయుడు సినిమా సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో కూడా ఆ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. ఈ భారీ కాంబోను తన బ్యానర్ లో మళ్లీ రిపీట్ చేయాలని ప్రయత్నించిన దిల్ రాజు.. ఐదేళ్ల క్రితం భారీ స్థాయిలో ఈ సినిమాని లాంచ్ చేసారు. అయితే సినిమాని అధికారికంగా ప్రకటించిన నెల లోపే ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వల్ల దిల్ రాజు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చి పెట్టుకున్నట్లు అయింది. కమల్ హాసన్ స్టార్‌డమ్‌కు, శంకర్ పెట్టించే బడ్జెట్ కు సినిమా నుండి లాభాలు ఆర్జించడం కష్టమని భావించారు దిల్ రాజు. ఆ తర్వాత దిల్ రాజు స్థానంలో వచ్చిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఇదే కారణాన్ని సూచించి షూటింగ్ మధ్యలోనే సినిమాని ఆపేశారు. అయితే కమల్ హాసన్ ఇటీవలే నటించిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో దిల్ రాజు మరియు లైకా ప్రొడక్షన్స్ నిర్ణయం తప్పు అని నిరూపించబడింది.

విక్రమ్ ఘన విజయంతో కమల్ హాసన్ తన స్టార్ స్టేటస్ ను తిరిగి అంది పుచ్చుకున్నారు. ఆయన స్టార్డం ఎప్పుడు కూడా కోల్పోలేదు, కేవలం సరైన సినిమాలు తీయకపోవడం వల్లే విజయాలు దక్కలేదు కానీ సినిమాలో కంటెంట్ బాగుంటే విజయం సాధించడం పక్కా అని విక్రమ్ సినిమా ఫలితంతో ఆయన నిరూపించారు.

కాగా ఇటీవలే ఇండియన్ 2 షూటింగ్ పునఃప్రారంభమైంది. అంతే కాక ఈ చిత్రానికి ట్రేడ్ వర్గాల నుంచి భారీ ఆఫర్లు వస్తున్నాయి, ఈ చిత్ర నిర్మాతలయిన లైకా ప్రొడక్షన్స్, ఉదయనిధి స్టాలిన్ ఖచ్చితంగా భారీ లాభాలను తన ఖాతాలో జమ చేసుకుంటారని అందరూ భావిస్తున్నారు. ఆ రకంగా దిల్‌ రాజు వేసిన తప్పుడు లెక్కల వలన పెద్ద అవకాశాన్ని వదులుకోవడం మాత్రమే కాకుండా కోట్లల్లో డబ్బును కూడా పోగొట్టుకున్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు.

ఓటీటీ విడుదలకు సిద్ధమైన కార్తీకేయ-2

0

చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం అందుకున్న తాజా చిత్రం ‘కార్తికేయ 2’. యువ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్ట్‌ 13న తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. రిలీజైన తొలి షో నుంచే ఈ సినిమా చక్కని స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైన నేపథ్యంలో తెలుగులోనే చిన్న సినిమా అయిన కార్తికేయ 2.. తొలి రోజు చాలా తక్కువ థియేటర్లలో విడుదలైనా.. క్రమక్రమంగా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన టాక్ వల్ల థియేటర్ల సంఖ్య పెంచుకుని బాక్సాఫీసు వద్ద బ్రహ్మాండమైన కలెక్షన్స్‌ రాబట్టింది.

అంతే కాకుండా.. విడుదలై ఆరు వారాలు కావస్తున్నా ఇంకా థియేటర్లలో కార్తీకేయ 2 సందడి చేస్తుండటం విశేషం. 2014లో చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ కలెక్ట్‌ చేసి రికార్డు సృష్టించింది. ఇంతవరకూ నిఖిల్ కెరీర్ లో యాభై కోట్ల కలెక్ట్ చేసిన సినిమానే లేదు. కానీ కార్తీకేయ 2 చిత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్‌ సాధించింది. ఈ విజయం తర్వాత హీరో నిఖిల్ హిందీ మార్కెట్ పై దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది.

ఇక బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం అవుతోంది. ఈ మధ్య ఏ సినిమా అయినా థియేట్రికల్‌ రిలీజ్‌ అనంతరం నెల రోజుల లోపే ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా నిర్మాతల గిల్డ్ ఓటిటి విడుదల విషయంలో కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు చెప్పినా.. ఎవరూ ఆ నిభందనలు పాటించలేదు.

అయితే కార్తికేయ 2 విడుదలైన దాదాపు 2 నెలల తర్వాత అంటే ఎనిమిది వారాల నిబంధనను పాటిస్తూ త్వరలోనే ఓటీటీలో అందుబాటులో ఉండబోతుంది. కాగా కార్తికేయ 2 ZEE5 ప్లాట్‌ఫారమ్‌లో అక్టోబర్ 5వ తేదీ నుండి తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషలలో పాటు మలయాళంలో కూడా ప్రసారం కానుంది.

టి.జి విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించగా, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష సహాయక పాత్రల్లో కనిపించారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఒక కీలక అతిథి పాత్రలో నటించారు. కాల భైరవ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.

Nikhil’s Karthikeya 2 OTT Release Date And Streaming Partner

0

Nikhil’s Karthikeya 2 was released in theatres on August 13th and took the box office by storm. The film started on a slow note and gradually picked up the pace in the coming days. Karthikeya 2 posted great opening weekend numbers and emerged as a huge success.

While the success of the Telugu version was expected, the massive reach of the Hindi version came as a shock to everyone, including the team of Karthikeya 2. The North audiences thoroughly enjoyed the film and pushed the movie to the sky.

The movie enjoyed a tremendous theatrical run at the global box office, ending with 100+ crores. This is a highly impressive feat for Nikhil who has struggled to even cross 50 crores in the past. Karthikeya 2 has massively helped the actor and will aid in the smooth release of his next movies. He is reportedly setting out to target the Hindi market with his next few movies as well.

Karthikeya 2 is finally hitting the OTT route after nearly 2 months since its release. Karthikeya 2 will be streaming on the ZEE5 platform in Telugu, Tamil, Kannada, Hindi as well as Malayalam. It will premiere on 5th October 2022.

నవంబర్లో ఆది రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గట్టి సవాలే

0

గతంలో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాలను ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ చేస్తున్న ట్రెండ్ టాలీవుడ్ లో బాగా పెరిగింది. ముందుగా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఒక్కడు, పోకిరి లాంటి సినిమాలను రీ రిలీజ్ అవగా.. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంధర్భంగా జల్సా, తమ్ముడు, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సంధర్భంగా ఘరానా మొగుడు, ఇటీవల నందమూరి బాలకృష్ణ చెన్నకేశవరెడ్డి సినిమా విడుదల 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాను రిలీజ్ చేశారు.

నందమూరి బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా రీ రిలీజ్ చేస్తున్న సందర్భంగా సినిమా నిర్మాత బెల్లంకొండ సురేష్.. కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఆది సినిమా కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

అయితే ఆది సినిమాని ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పకపోయినా.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోగా ప్రవేశించి నవంబర్ నెలకు 22 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ నెలలో ఆది సినిమాని రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆది సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కీర్తి చావ్లా హీరోయిన్ గా నటించగా అలీ, ఎల్బీ శ్రీరామ్, చలపతిరావు వంటి వారు ఇతర కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు వివి వినాయక్ దర్శకత్వం వహించారు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాక జూనియర్ ఎన్టీఆర్ కి సూపర్ స్టార్డం తెచ్చి పెట్టింది.

అయితే ఆది సినిమా రీ రిలీజ్ ను భారీ స్థాయిలో జరిపించడం అనేది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఒక అగ్ని పరీక్ష వంటిదేనని అనిపిస్తుంది. అందుకు కారణం జూనియర్ ఎన్టీఆర్ మరియు తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఇటీవలే వచ్చిన విభేదాలే. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు పై ఆయన ఇచ్చిన ప్రకటనలో ఏమాత్రం పస లేదని భావించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బాలకృష్ణ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ ను లక్ష్యంగా చేసుకుని ఆయనని వేరు చేసినట్టుగా వ్యాఖ్యలు చేశారు.

ఇలాంటి నేపథ్యంలో ఆది సినిమా రీ రిలీజ్ చేస్తే టీడీపీ వర్గాలు, బాలకృష్ణ అభిమానులు ఇదివరకటిలా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని చూడడానికి థియేటర్లకు వస్తారా లేదా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది. మరి ఇలాంటి అనుమానాలు పటా పంచలు చేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కలసికట్టుగా నిలిచి తమ బలాన్ని చూపించే స్థాయిలో ఆది సినిమా రీ రిలీజ్ తో రికార్డులు బద్దలు కొట్టాలి. అప్పుడే ఎన్టీఆర్ పై అనవసర వ్యాఖ్యలు చేసిన వారిని తిప్పికొట్టినట్లు ఉంటుంది.

Allu Sirish and Anu Immanuel’s Upcoming film “Urvashivo Rakshashivo” teaser releasing on Sep 29th

0

Renowned Producer Allu Aravind’s own production house Geetha Arts is one of the reputed banners of Tollywood of all time. It is a common practice Geetha Arts producing rich content movies with all the heroes.

The banner that has given us memorable blockbusters is now bringing us a film starring talented actor Allu Sirish. After a short break, Allu Sirish returns with the romantic drama Urvashivo Rakshashivo, which is produced by GA 2 Pictures.

The exciting update on Allu Sirish’s latest project, which is yet to be released. The actor shared screen space with Anu Emmanuel for a romantic drama directed by Rakesh Sashii. The film previously titled Prema Kadhanta, remained under wraps until now.

Today, makers surprised the audience by releasing a magical poster of Allu Sirish’s upcoming film, along with a new title and teaser release date. The title of the film was changed from “Prema Kadhanta” to “Urvashivo Rakshashivo.” The teaser release date also surprised the audience. The teaser for this romantic drama will be released on September 29th.

The makers of the film are now planning to release the film on November 4. Renowned Producer Allu Aravind presenting the film while Dheeraj Mogilineni producing it. GA 2 pictures bankrolled the film in association with Shri Tirumala Production Private Ltd banner. Achu Rajamani composed the music. Tanveer handling the cinematography while editing is done by Karthika Srinivas.

విజయ్ – అట్లీ కాంబినేషన్లో భారీ ప్యాన్ ఇండియా సినిమా

0

కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ వరుస సినిమాలని ఒప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో వరిసు అనే సినిమా చేస్తున్నారు. అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కాగా దిల్ రాజు చెప్తున్న దాని ప్రకారం ఈ కథ విని విజయ్ ఆశ్చర్యపోయారట.. అందుకే వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నారట.

వంశీ పైడిపల్లి సినిమా తర్వాత విజయ్ చేస్తున్న సినిమాలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. అయన తదుపరి చిత్రం తనతో ‘మాస్టర్’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో చేస్తున్నారు. ఇటీవలే కమల్ హాసన్ తో విక్రమ్ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంజయ్ దత్, గౌతమ్ మీనన్ లు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ పూర్తి కాగానే సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అయిన విజయ్-అట్లీ కలయికలో మరో సినిమా పట్టాలెక్కనుంది. వీరిద్దరిదీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. వీరిద్దరూ ఇదివరకు తేరి, మెర్సల్ మరియు బిగిల్ వంటి సూపర్‌హిట్‌లను అందించారు. మరియు ఆ విజయాన్ని నాల్గవసారి కూడా పునరావృతం చేయాలని చూస్తున్నారు. దర్శకుడు అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా పనులు అన్నీ ముగించుకుని విజయ్‌తో తిరిగి జత కట్టడానికి కొంత సమయం పడుతుంది.

కాగా విజయ్ – అట్లీల కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి ఏకంగా 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నారు అని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. తేండాల్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్ మరియు అట్లీ ఇద్దరూ 2023 ప్రథమార్థం వరకు తమ కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

ABN, Mahaa, TV5 ఛానెల్‌ల పై బాయ్కాట్ ట్రెండ్ చేస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్

0

ఎన్టీఆర్‌ మెడికల్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ మెడికల్‌ యూనివర్శిటీగా మారుస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం పెద్ద వివాదానికి దారి తీసింది. ఈ నిర్ణయం పై టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయ పరిస్థితుల వేడి తారాస్థాయికి చేరుకుంది.

ఇరు పక్షాల మధ్య ఇలా మాటల యుద్ధం నడుస్తుండగా, ఈ విషయం పై జూనియర్ ఎన్టీఆర్ చేసిన ప్రకటన కూడా అనుకోని విధంగా వివాదానికి కేంద్రంగా మారింది. ఆ తర్వాత అన్ని వైపుల నుండి ఎన్టీఆర్ ను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన వ్యాఖ్యలు వ్యక్తం అవుతుండడంతో.. ఇక లాభం లేదని తమ హీరో వైపు నిలబడటానికి ఎన్టీఆర్ అభిమానులు రంగంలోకి దిగారు. ఇంతకీ అంతలా దుమారం రేపేలా ఎన్టీఆర్ ఎం ట్వీట్ చేశారు అనేది చూద్దాం.

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఓ ట్వీట్‌లో, “ఎన్టీఆర్ మరియు వైఎస్ఆర్ ఇద్దరూ అపారమైన ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు. ఒకరి పేరును మరొకరితో భర్తీ చేయడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు, అలాగని ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు. యూనివర్శిటీ పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ సంపాదించిన కీర్తిని, తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఆయన ఔన్నత్యాన్ని, తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన జ్ఞాపకాలను చెరిపివేయలేము” అన్నారు.

అయితే టీడీపీ ముఖ్య నాయకులు మరియు ఇతర పార్టీ సభ్యులు ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే టీడీపీ మద్దతుదారులైన కొన్ని మీడియా వర్గాలు ఇది దౌత్యపరంగా చేసిన చాలా చప్పని ప్రకటనగా పేర్కొన్నాయి. ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌లను పోలుస్తూ చేసిన ఈ ప్రకటన టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ గారిని అవమానించడమే కాక మరేమీ కాదని వారు అభిప్రాయపడ్డారు.

ABN, Mahaa News మరియు TV5 వంటి న్యూస్ ఛానెల్‌లు ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా సరైన ప్రకటన చేయని కారణంగా జూనియర్ ఎన్టీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ కార్యక్రమాలు జూనియర్ ఎన్టీఆర్‌ని ప్రధాన లక్ష్యంగా చేసుకోవడమే కాక హద్దులు దాటి వ్యక్తిగత ప్రకటనలు చేయడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.

ఈ మొత్తం వివాదం వల్ల ఇప్పుడు నందమూరి అభిమానులు కూడా ఇప్పుడు రెండుగా చీలిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీవీ ఛానెల్‌ల పై BoycottABNandMahaaNews అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు.

200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సూర్య – సిరుతై శివ సినిమా

0

తమిళ స్టార్ సూర్య – దర్శకుడు శివల కాంబినేషన్లో రాబోయే ప్రాజెక్ట్ ఇప్పటికే కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో సందడి చేస్తోంది. ఈ సినిమా అటు దర్శకుడు శివతో పాటు సూర్యకు కూడా చాలా కీలకం. శివ ఇటివలే “అన్నత్తె” (తెలుగులో పెద్దన్న) సినిమాతో భారీ డిజాస్టర్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. అలాగే హీరో సూర్య కూడా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్ లేక తన స్టార్డం పై అనుమానాలు వచ్చే దశలో ఉన్నారు.

సూర్య ఇటీవల జై భీమ్, సూరరై పొట్రు చిత్రాలలో తన నటనకు చక్కని ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా, “సూరరై పొట్రు” చిత్రానికి గానూ సూర్య ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. “తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్” సినిమాలో నటనకు అజయ్ దేవగణ్ తో కలిసి సూర్య ఈ గౌరవాన్ని పంచుకున్నారు.

అయితే, నటన విషయంలో సూర్య ప్రతిభను ఎప్పుడూ తక్కువ చేసే అవకాశం ఆయన ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం ఆయనకు బాక్స్ ఆఫీస్ వద్ద ఒక భారీ కమర్షియల్ సక్సెస్ ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఉంది. అయన చివరిగా హీరోగా నటించిన ET సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని అందరూ ఆశించారు కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలాంటి సమయంలో సూర్య – శివ కలిసి ప్యాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు.

కాగా ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, మరియు అన్ని భాషలలో 3D వెర్షన్‌లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇది కేవలం సినిమా ప్రారంభ దశలోనే ఉన్న వార్త.

ఇక ఈ సినిమా ఫైనల్ బడ్జెట్ మరియు బిజినెస్ ఎంత వరకు అవుతుందో చూడాలి. ప్రస్తుతం ప్రేక్షకులకి చాలా సాంకేతిక విప్లవం అందుబాటులో ఉంది. మరి వారిని ఆకట్టుకోవాలి అంటే చిత్ర బృందం సంచలనాన్ని సృష్టించే, ఆకట్టుకునే ప్రచార కార్యక్రమాలతో ముందుకు రావాలి.

ఈ భారీ బడ్జెట్ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని గట్టిగా చెబుతున్నారు. ఇక ప్రస్తుత ట్రెండ్ కు అనుగుణంగా ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది . దిశా పటానీ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారనే వార్తను దాదాపు ఖరారు చేసుకోవచ్చు.

స్టూడియో గ్రీన్ మరియు UV క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సూర్య 42వ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతుంది. కాగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Vijay and Atlee are in talks for their biggest pan-India film

0

Kollywood star Vijay is on a signing spree. The actor is currently shooting for Varisu with Tollywood director Vamsi Paidipally. Dil Raju will be bankrolling this project and according to the ace producer, the Tamil star was simply stunned by the story.

Thalapathy’s lineup after Vamsi Paidipally also looks quite interesting. He will team up with his ‘Master’ director Lokesh Kanagaraj for another movie #Thalapathy67. Lokesh is currently busy with Kamal Haasan starrer Vikram.

Once this project is done there is another Vijay-Atlee movie on cards. Vijay-Atlee is a super successful combination. The duo has delivered superhits like Theri, Mersal, and Bigil and is looking to repeat the same success fourth time as well. Atlee is currently busy with the Shahrukh Khan project and it will take some time for him to regroup with Vijay.

The film is planned on a Rs 300Cr budget and will release in all Indian languages. Thendal Studios is producing the film. Both Vijay and Atlee are busy with their commitments till the first half of 2023. And this project will go on floors sometime next year’s second half.

NTR fans trending to boycott ABN, Mahaa and TV5 channels

0

The recent decision of AP Government to rename NTR Medical University into YSR Medical University has snowballed into a massive controversy. While the political war of words is on between TDP and YCP, Jr NTR’s statement on this issue has also become a center of controversy and NTR fans have jumped into the fray.

In a tweet, Jr NTR said, “Both NTR and YSR are great leaders who have gained immense popularity. The respect brought by replacing one’s name with another’s does not raise the stature of YSR, nor does it lower the stature of NTR. Renaming the university cannot erase the fame NTR earned, his stature in the history of the Telugu states, and his memories in the hearts of the Telugu people.”

TDP cadre and certain sections of media felt that this was a pretty cold statement made diplomatically. They felt this statement of comparing NTR and YSR was insulting to the TDP founder. News channels like ABN, Mahaa News and TV5 ran special programs on this issue and cornered Jr. NTR for his weak statement. These programs even made some personal statements targeting Jr. NTR which has angered his fans.

Even Nandamuri fans are now divided into two. Jr. NTR fans started trending to counter-attack the TV channels with the hashtag BoycottABNandMahaaNews