Home Blog Page 2128

వేేేేతనాల పెంపు కోసం సినీ కార్మికుల సమ్మె

0

సినీ కార్మికులకి తెలుగు సినిమా పరిశ్రమకి మధ్య కొత్త సమస్య వచ్చి పడింది. దీనికి కారణం సినీ కార్మికుల వేతనల సవరణను తెలుగు సినీ పరిశ్రమ పట్టించుకోకపోవడం ఏ అని తెలుస్తుంది.సినిమా కార్మికులతో వేతన సవరణ ఒప్పందం చేసుకోవాల్సి ఉన్నా ఫిల్మ్ ఛాంబర్ ఆ పని చేయలేదు. ఇక తెలుగు నిర్మాత మండలి, ఫెడరేషన్ సూచనలు కానీ సలహాలు కానీ ఏమాత్రం పట్టించుకొలేదు అని కార్మికుల ఆరోపణ.

గతంలో తమతో చేసుకున్న ఒప్పందాలు ఏవీ అమలు చేయని కారణంగా ఫెడరేషన్ నేతల మాటలను గౌరవించబోయేది లేదని ఇటీవల జరిగిన కార్యవర్గ సమావేశంలో నిర్మాతల మండలి తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. ఇటు ఫిల్మ్ ఛాంబర్, అటు నిర్మాతల మండలి మరియు కార్మికుల ఫెడరేషన్ మధ్య కార్మికులు నలిగిపోతున్నారు అనే చెప్పాలి. ఇక ఇలాగే పరిస్థితి కొనసాగితే ప్రమాదం అని, ఫెడరేషన్ పై ఒత్తిడి తీసుకురావాలంటే సమ్మె చేయడమే మార్గమని ఇరవై నాలుగు యూనియన్ ల కార్మికులు నిర్ణయించినట్టు తెలుస్తుంది. 


ఈ మేరకు రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యుల పిలుపునిచ్చారు. రేపటి నుంచి వేతనాలు పెంచే వరకూ 24 క్రాఫ్ట్స్ కి చెందిన వర్కర్లు షూటింగ్ కు హాజరు కాకూడదు అనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. మరి ఈ వివాదం వీలయినంత త్వరగా పరిష్కారం కాకపోతే షూటింగ్ లు అన్నీ ఎక్కడిక్కడ ఆగిపోక తప్పదు. మరి ఈ సమస్యని ఎంత తొందరగా పరిష్కరించుకుంటుందో చూడాలి.

ఏదేమైనా అసలే సినిమాలు సరిగా ఆడక ఇబ్బంది పడుతున్న పరిశ్రమకు ఇది మరో తలనొప్పిగా మారకుండా సంబంధించిన యూనియన్ లు, నిర్మాత మండలి, ఫెడరేషన్ లేదా మా అసోసియేషన్ వారు అయినా కలగజేసుకుంటే మంచిది.

వారసుడిగా వస్తున్న విజయ్

0

తమిళ హీరో విజయ్ తొలిసారి ద్విభాషా(తెలుగు, తమిళ్) చిత్రంలో నటిస్తున్నారు. విజయ్‌కు తెలుగులోనూ మాంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్ రాజు నేతృత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఏప్రిల్ మొదటి వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలై అతి కొద్ది రోజుల్లోనే మేజర్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ పోస్టర్‌ను ఆయన ఇటీవల అభిమానులతో పంచుకున్నారు. విజయ్‌తో వంశీ పైడిపల్లి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విజయ్ అభిమానులు ఆ పోస్టర్ ను తెగ వైరల్ చేసారు.

విజయ్ 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “వారిసు” (తెలుగులొ వారసుడు అని అర్థం) అనే టైటిల్ ను ఖరారు చేసారు. ట్విట్టర్ లో హీరో విజయ్ తో పాటు, SVC హ్యాండిల్ ఈ విషయాన్ని ట్వీట్స్ ద్వారా తెలియజేశారు. The Boss Returns అంటూ హీరో విజయ్ పెద్ద వ్యాపార వేత్త అనిపిస్తోంది.ఇందులో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందాన్న, మెహ్రీన్‌లు నటించనున్నారు. స్వతహాగా యాక్షన్ సినిమాలు ఇష్టపడేవిజయ్ ఈసారి కుటుంబ నేపథ్యం కలిగిన కథలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘బృందావనం’ సినిమా తరహాలో ఉండచ్చునని కూడా అంటున్నారు.

వరుసగా యాక్షన్, డ్రామా చిత్రాలకే ఓటు వేసే విజయ్ సినిమాతో కాస్త రూటు మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు అనుకోవచ్చు. ఫస్ట్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్న విజయ్ ను చూసి అభిమానులు ఆనందిస్తున్నారు.దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన ఫ్యామిలీ స్టోరీ విజయ్ కు బాగా నచ్చి వెంటనే విజయ్ ఒకే చెప్పారని తెలుస్తోంది.ఈ చిత్రంలో విజయ్‌తో పాటు ముఖ్య పాత్రల్లో తమిళ నటుడు శరత్ కుమార్,ప్రభు, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, ‘కిక్’ శ్యామ్,జయసుధ, మరియు సంగీతశ్రీకాంత్ నటిస్తున్నట్లు తెలిసింది. ‘బీస్ట్’ పరాజయం నేపథ్యంలో విజయ్ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాను 2023, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

ఎట్టకేలకు OTT లో విడుదల అవుతున్న పెళ్ళి సందD

0

ఈ రోజుల్లో ఏ సినిమా అయినా నాలుగు వారాలలో ఓటిటి లో అందుబాటులోకి వచ్చేస్తుంది. అది పెద్ద హీరో సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే. ఎక్కడో ఒక చోట ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమాలు ఎనిమిది లేదా పది వారాలు గడిచాక స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి.

అయితే సినిమా విడుదల అయి 200 రోజుల వరకు కూడా ఓటిటిలో రిలీజ్ అవని రికార్డ్ “పెళ్ళి సందడి2” కే దక్కుతుంది.ఓటిటిలో సినిమా విడుదల కాకపోవడానికి కారణమేంటి అంటూ అభిమానులు సోషల్ మీడియాలో తెగ వెతికారు. అసలు ఎందుకు పెళ్లి సందడి సినిమా ఓటిటిలోకి రాలేదని ఆరాలు కూడా తీశారు.

సంక్రాంతికి వచ్చేస్తుందనే వార్తలు వచ్చినా కూడా అది జరగలేదు. ఇప్పటి వరకు ఏ ఓటిటి సంస్థ దగ్గర పెళ్లి సందడి రైట్స్ లేవనే విషయం బయట పడింది. అయితే ఈ మధ్యే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయి అని తెలిసింది.ఎట్టకేలకు ఈ 24 తారీఖున పెళ్ళి సందడి చిత్రం జీ5 లో అందుబాటులోకి రానుంది.

గత ఏడాది పెళ్లి సందడి సినిమాతో పూర్తిస్థాయిలో లాంఛ్ అయ్యాడు శ్రీకాంత్ కొడుకు రోషన్.  రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వస్తున్న సినిమా కావడంతో పాటు పాతికేళ్ల క్రితం వచ్చిన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అయినా పెళ్లి సందడి సినిమాకి సీక్వెల్ అవడంతో మంచి అంచనాల మధ్య పోయిన దసరా కి పెళ్లి సందడి రిలీజ్ అయింది.ఇందులో దర్శకేంద్రుడు కూడా నటించాడు. గౌరీ రోనంకీ దర్శకురాలు. ట్రైలర్ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రానికి రివ్యూలు,టాక్ ఆశించిన రీతిలో రాలేదు. అయితే పాటలు సూపర్ హిట్ అవడం,హీరోయిన్ శ్రీ లీల కి యూత్ ఆడియన్స్ ఫ్యాన్స్ గా మారడం,అలాగే హీరో హీరోయిన్ ల జోడీ,పాటల్లో వాళ్ళు అద్భుతంగా లయబద్దంగా చేసిన డాన్స్ ఇవన్నీ సినిమాకు కలిసి వచ్చి కలెక్షన్ లు బాగా వచ్చాయి. నిర్మాతల దగ్గర నుంచి పంపిణీ దారుల వరకు అందరికీ లాభసాటి వ్యాపారం జరిగింది. అయితే ఆ తరువాత సినిమా ఓటిటి లో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే విషయం మీద పలు రకాల పుకార్లు వచ్చినా ఏవీ నిజం కాలేదు. ఎట్టకేలకు ఇన్ని రోజులకు పెళ్ళి సందడి2 ఓటీటిలో విడుదల అవుతుండటం ఆ చిత్ర అభిమానులకు శుభవార్త అనే చెప్పాలి.

No biggie is releasing for the Biggest festival of tamil cinema

0

Diwali is the biggest festival for Tamil people. Especially for Tamil cinema it is an important festival. Star heroes will plan their movie’s release for Diwali. Every year a biggie will release for Diwali.

As like every year this time Ajith has planned to release his next for Diwali. Ajith’s next Thala 61 has started eyeing for 2022 Diwali release. But now the movie has postponed and is looking for 2023 Pongal release.

Rajinikanth’s Jailer, Vijay’s Varasudu will start their shoot soon. Kamal is yet to decide on his next film. And other star heroes films are not ready for Diwali release. So now there is no biggie releasing for Diwali.

In fact this is a golden opportunity for medium and small budget films. Grabbing the opportunity Siva Karthikeyan’s Prince with Anudeep has announced their release for Diwali. Other films that are in post production will definitely join the list.

కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ చిత్రం “విక్రమ్” OTT రిలీజ్ కు రెడీ

0

లోక నాయకుడు కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో భారీ హిట్ సాధించారు. చాలా రోజుల తర్వాత కమల్ కి బిగ్గెస్ట్ హిట్ “విక్రమ్”. ఈ చిత్ర విజయంతో కమల్ ఆనందానికి అవధులు లేవు.ఇప్పటికే విక్రమ్ సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని వసూలు చేయడంతో ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించిన కమల్ కి డబ్బులు బాగానే వచ్చాయి. దీంతో కమల్ మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆనందాన్ని చిత్త బృందానికి గిఫ్ట్స్,పార్టీ ఇచ్చి సంబరాలు జరుపుకున్నారు.

లోకేష్ కనగరాజ్ కేవలం రెండు మూడు సినిమాలతోటే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. గన్స్, డ్రగ్స్,మాఫియా గ్యాంగ్,పోలీస్ అండర్ కవర్ ఆపరేషన్ అంటూ ఒక ప్రపంచంలోకి ప్రేకక్షులని తీసుకు వెళ్ళడం ఆయనకే చెల్లింది. పైగా ఆయన సినిమాలలో కథ ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక రోజు లేదా కొన్ని రోజుల గడువులోపు ఉంటుంది. దాని వల్ల తరువాత ఏం జరగబోతుందో అనే అంశాన్ని ఉత్కంఠభరితంగా చెప్పే వీలు ఉంటుంది.విక్రమ్ లో కమల్ ను ఒక అభిమానిగా తను ఎలా చూడాలి అనుకున్నాడో అలా చూపిస్తూ ప్రేక్షకులను అబ్బురపోయేలా చేసిన లోకేష్ ఆయనతో పాటు ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి పాత్రలను కూడా అంతే ఆసక్తికరంగా చూపించడం వల్లే సినిమా ఇంతటి ఘనవిజయం సాధించింది.కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ కి తోడు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విక్రమ్ కు ఎంతో ఉపయోగపడింది.

ఇక ధియేటర్ లలో ప్రేక్షకులను అలరించిన విక్రమ్ తొందరలోనే ఓటిటి లో విడుదల కానుందని సమాచారం. జూలై 8 నుంచి విక్రమ్ అన్ని భాషల్లోహాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధం అవుతుంది అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మరి థియేటర్లలో సూపర్ హిట్ అయినట్టే విక్రమ్ ఓటిటిలో కూడా ఆదరణ పొందుతుంది అని ఆశిద్దాం.

Revenue officers has taken responsibility of Government online ticket portal

0

Andhra Pradesh government is moving fast in the direction to start the new online ticketing portal. Government issued new guidelines to AP Film Development Corporation regarding the implementation of the portal. All tickets sold either online or in current booking counters will be issued only through the state government ticket portal. Government has directed district collectors to take up the responsibility.

Following the orders revenue officers started meeting the theatre owners. The revenue officers has to make the theatre owners to sign the MOU. In some places the government officials are reportedly threatening the theatre owners. They are warning them that the government will seize the theatre if they don’t sign the MOU. Theatre owners are in dilemma now. And as there is no option in-front of them theatre owners seeking some time from the officers.

The government took this decision to made the system more transparent and to collect the taxes correctly. Though the film industry stood against it initially later the film industry agreed with the state government’s decision to float a single window portal.

మరింత ఆలస్యం అవనున్న ఎన్టీఆర్ – కొరటాల శివ సినిమా

0

ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో సినిమా (NTR 30) రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలోవీరిద్దరూ చేసిన “జనతా గారెజ్” ఘన విజయం సాధించింది.కాబట్టి ఈ కొత్త సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.పైగా ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా తరువాత వస్తున్న సినిమా అందులోనూ పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్న సినిమా కాబట్టి ఖచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి.

అందుకే ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. స్క్రిప్ట్ పట్లా, సన్నివేశాల పట్లా ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని సమాచారం. అందువల్ల అన్నీ పక్కాగా కుదిరి ఓకే అనుకున్న తరువాతే సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందట.ముందుగా షూటింగ్ ఏప్రిల్ లో మొదలవుతుంది అన్నారు ఆ తరువాత మే,జూన్ అని మొన్నటి వరకు ఆగస్ట్ లో షూటింగ్ మొదలవుతుందని అన్నా తాజా వార్తల ప్రకారం సెప్టెంబర్ కు గానీ పనులు ప్రారంభం అవ్వవు అని తెలుస్తుంది.

ఇక ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ స్పెషల్ వీడియోను టీమ్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో నెటిజన్స్‌ నుండి విశేష స్పందన రాబట్టుకుంది. ఈ వీడియోలో డైలాగ్ “అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు అవసరానికి మంచి తను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి తను రావల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా’ కి ఇప్పటికే కథా కమామీషు ఏమయి ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకుల ను ఒక ఊపు ఊపెస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ కు అతను ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది.

ఈ సినిమాలో హీరోయిన్ గా ఆలియా భట్ నటిస్తుంది అన్న ప్రచారం గట్టిగా జరిగింది. అయితే ఇప్పుడు ఆమె ఈ సినిమా నుంచి వైదొలగినట్టు తెలుస్తుంది. ఇటీవలే రణ్ బీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న అలియా ఇతర ప్రాజెక్ట్ ల డేట్స్ క్లాష్ అవ్వడం వలన ntr 30 నుండి తప్పుకున్నట్టు చెప్తున్నారు. మరి యే హీరోయిన్ ను సెలెక్ట్ చేశారో ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

సత్యరాజ్ వల్లే సినిమా పోస్ట్ పోన్ అంటున్న శివ కార్తికేయన్

0

తమిళ హీరో శివ కార్తికేయన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు. డబ్బింగ్ సినిమాలు ‘సీమ రాజా’, ‘రెమో’, ‘శక్తి’, ‘డాక్టర్’తో ఇది వరకే తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిన ఆయన ఇప్పుడు’జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది శివకార్తికేయన్ 20వ సినిమా (SK20) కావడం విశేషం. ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మరియా హీరోయిన్ గా చేస్తుండగా, తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద బ్యానర్ లు అయిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు,పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

న్యూ ఇయర్ సందర్భంగా అనౌన్స్ చేసిన ఈ సినిమాకి “ప్రిన్స్” అనే టైటిల్ ను ఖరారు చేసారు. పక్కా ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది.ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అవగా, ముందుగా వినాయక చవితి నాడు (ఆగస్ట్ 31) రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం వచ్చింది. అయితే మళ్ళీ ఆ రిలీజ్ డేట్ మారినట్టు తెలిసింది, ఈ మేరకు హీరో శివ కార్తికేయన్, దర్శకుడు అనుదీప్ ఒక విడియో ద్వారా ఈ విషయాన్ని చెప్పారు.

ఈ వీడియోలో అటు శివ ఇటు అనుదీప్ ఇద్దరూ పంచ్ లతో నవ్వించారు. సినిమా రిలీజ్ కి కారణం ఎంటో చెప్పమని అనుదీప్ అడిగితే అందుకు బదులుగా శివ సత్యరాజ్ వల్లే ఈ సినిమా లేట్ అయిందని,ఇంతకు ముందు ఎంతో సరదాగా ఉండే ఆయన “బాహుబలి” తరువాత బాగా పొగరు ఎక్కింది అంటుండగా వెనుక నుంచి సత్యరాజ్ రావడం అంతా ఒక సినిమాలో సీన్ లాగా ఉండి నవ్వించింది.ఇక హీరోయిన్ మరియా వచ్చి తమిళ భాష సరిగా రాని అనుదీప్ తనకి తమిళ భాష నేర్పిస్తున్నారు అని చెప్పడం ఇలా వీడియో అధ్యంతం వీక్షకులను నవ్వించడం పనిగా పెట్టుకున్నారు. చివరిగా ఈ సినిమా వినాయక చవితి నాడు కాకుండా దీపావళి పండుగ సందర్భంగా విడుదల అవుతుంది అని ప్రకటించారు. తమిళ సినిమాల వరకు దీపావళి పండుగ బిగ్గెస్ట్ సీజన్ అనచ్చ్చు. మరి ఆ సీజన్ ను “ప్రిన్స్” క్యాష్ చేసుకుంటుందనే కోరుకుందాం.

YouTube Link

I don’t connect to lady powerstar tag says Sai Pallavi

0

Lady Powerstar is the new tag for Sai Pallavi. The talented actress is well received by fans in the events. Fans are shouting Lady Powerstar whenever Sai Pallavi holds the mic to speak at an event. But the humble actress don’t want to take it too serious.

Sukumar once called Sai Pallavi Lady Pawan Kalyan while speaking about Sai Pallavi’s humanity. From the fans started calling Sai Pallavi as Lady Powerstar. She has been getting a lot of applause in the public events.

In a recent interview when asked how she is dealing with the tag. The actress responded saying “I don’t connect to such tags”. She told that she will take only the love that has been showered on her. She said taking such tags will put a lot of pressure on her that may impact her performance. So the actress confirms that she prefer being grounded.

Tollywood Weekend (17th June – 19th June) Box office report

0

Two movies got released last Friday in Tollywood. One is Virata Parvam which has stars like Rana Daggubati and Sai Pallavi. And another one is Satyadev starrer Godse. The two movies are content oriented movies and created interest with the trailers.

The two movies got poor openings at box office. Though Virata Parvam has star casting and promoted well at the end. The movie has just collected around 2.5Cr share for the weekend and turns to be a biggest disaster. On the other hand Godse is outright disaster from 1st show itself and there is no share for the film.

While the new movies failed to impress the audience, Ante Sundaraniki got a chance to stand. But Ante sundariniki failed to get decent collections on weekend too. Vikram performs good and major is decent still at the box office.