Home Blog Page 2112

అంతర్జాతీయ స్ధాయిలో తెరకెక్కనున్న మహేష్ – రాజమౌళి సినిమా

0

ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతటి ఘన విజయం సాధించింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు మార్లు రిలీజ్ వాయిదా పడిన ఆర్ ఆర్ ఆర్ ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25న విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆర్ ఆర్ ఆర్ సినిమా సృష్టించిన సంచలనం.. సంపాదించిన పేరు అంతా ఇంతా కాదు. భారత దేశ చలన చిత్ర చరిత్రలోనే ఏ సినిమాకీ దక్కనటువంటి అంతర్జాతీయ ఆదరణ ఆర్ ఆర్ ఆర్ కు లభించింది అంటే అది ఎంత మాత్రం అతిశయోక్తి కానే కాదు.

ఆర్ ఆర్ ఆర్ విజయంతో రాజమౌళి భారతీయ సినిమాకు ఒక ముఖచిత్రంలా మారిపోయారు. ఇంతటి భారీ స్పందనను మార్కెట్ గా మార్చే పనిలో నిమగ్నమై ఉన్నారు రాజమౌళి. ఆయన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఖరారు ఆయిన సంగతి తెలిసిందే.మహేష్ తో చేయబోయే సినిమాను అత్యంత భారీ స్ధాయిలో తెరకెక్కించనున్నారట. సాంకేతికంగా ఎక్కడా అత్యున్నత ప్రమాణాలు కలిగిన సినిమాగా మలిచే ప్రయత్నంలో అన్ని జాగ్రత్తలు తీసుకొనున్నారట.

దాదాపు సినిమా అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ అవసరం అవుతుందని, భారతీయ చలన చిత్ర చరిత్రలో ఏ సినిమాకీ ఇంత వరకూ ఉపయోగించని స్థాయిలో ఈ సినిమాకి గ్రాఫిక్స్ హంగులు అద్దబోతున్నారని తెలుస్తుంది.ఆర్ ఆర్ ఆర్ తరువాత రాజమౌళి తెరకెక్కించే సినిమా కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రానికి ఆకాశాన్ని తాకే అంచనాలు ఉంటాయి. అటు మహేష్ బాబు కి ఉండే అల్ రౌండర్ ఇమేజ్ మరియు టాలెంట్ కు, ఇటు రాజమౌళి కి ఉన్న కష్టపడే తత్వం.. ప్రతి సినిమాకూ తనని తాను మెరుగు పరుచుకుంటూ వెళ్ళే ఆయన తపన అన్నీ కలిసి, ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడానికి కూడా వీలు లేనంతగా వారిద్దరి కలయికలో వచ్చే ఈ సినిమా ఉండబోతుంది.

ఇప్పటికైతే ఈ చిత్రానికి సంబంధించి కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు ఎంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ తో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఆ తరువాత రాజమౌళి తో సినిమా ఉంటుంది.ఈ చిత్రం తెరకెక్కించడానికి ఖచ్చితంగా కాస్త ఎక్కువ సమయం తీసుకున్నా, యావత్ భారత దేశంలో ఉన్న సినీ ప్రేక్షకులనే కాక అంతర్జాతీయ ప్రేక్షకులనూ రంజింపచేసేలా ఒక అద్భుతమైన సినిమా రాబోతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.

సూర్య సరసన నటించనున్న పూజా హెగ్డే

0

ప్రస్తుతం భాషలకు అతీతంగా సౌత్ నుంచి నార్త్ వరకు సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో పూజా హెగ్డే హవా నడుస్తోంది. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పూజా వరసగా ఆఫర్స్ కొట్టేస్తూ బిజీగా ఉంటున్నారు. ఇటీవలే  విజయ్ సరసన నటించిన బీస్ట్ ఫ్లాప్ అయినా, మరో తమిళ స్టార్ సూర్య ఈ బుట్టబొమ్మతో రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట.

పూజాహెగ్డే తెలుగుతో పాటు హిందీ సినిమాలతో ఫుల్ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. అయినా తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ఆఫర్స్ ని వదులుకోవడం లేదు. తమిళ డైరెక్టర్ శివ సూర్య 40వ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో పూజాహెగ్డేనే హీరోయిన్ గా నటించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం సూర్య 41వ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు బాలా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి సూర్య సరసన నటిస్తుండగా, నిర్మాతగా కూడా వ్యవహరించనున్న సూర్య, ఆల్రెడీ భారీ బడ్జెట్ తో మొదలు పెట్టి ఆగిపోయిన శివ కాంబినేషన్లో 40వ సినిమాను మళ్లీ పట్టాలెక్కిస్తున్నారు. ఆ సినిమా కోసం హీరోయిన్ గా పూజా హెగ్డేను సంప్రదించారు.

ఈ ఏడాది ఇదివరకే వేసవిలో విడుదలైన బీస్ట్ తో పాటు “ఆచార్య” లో రామ్ చరణ్ సరసన నటించిన పూజా హెగ్డే, విజయ్ దేవరకొండ – పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న “జనగణమన” లోనూ నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా చేస్తున్న ” కభీ ఈద్ కభీ దీవాలీ” లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా మరో ముఖ్య పాత్ర లో కనిపిస్తుండటం విశేషం.

తమిళ దర్శకుడు హారి తో గోపిచంద్ కొత్త సినిమా

0

ఇండస్ట్రీలో హీరోగా పరిచయమై, విజయాలు లేక విలన్ గా మారిన గోపిచంద్, విలన్ గా చేసింది మూడు సినిమాలలోనే అయినా ఆ పాత్రలను ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుంచుకునే విధంగా ముద్ర వేశారు. జయం, వర్షం, నిజం లో గోపిచంద్ పోషించిన పాత్రల ప్రభావం అలాంటిది.ఆ తరువాత మళ్ళీ హీరోగా మారి విజయాల బాట పట్టారు. ప్రముఖ దర్శకుడైన తండ్రి టి. కృష్ణ బాటలో కాకుండా నటుడుగా మారిన గోపీచంద్ కెరీర్ ఇప్పుడు కాస్త కష్టాల్లో ఉందనే చెప్పాలి.

తాజాగా విడుదలైన గోపీచంద్ సినిమా ‘పక్కా కమర్షియల్’ అటు కంటెంట్,ఇటు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నిరాశ పరచటంతో తరువాత చేయబోయే సినిమాల పై ఆలోచనలో పడ్డట్టు సమాచారం. ఇక పై కేవలం మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేయాలని, కామెడీ చిత్రాలు తనకి నప్పవని గోపిచంద్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఇప్పుడు గోపిచంద్ ఆశలు రాబోయే శ్రీవాస్ సినిమాపైనే ఉన్నాయి. 2014లో వచ్చిన ‘లౌక్యం’ తర్వాత ఆ స్థాయి హిట్ మళ్ళీ గోపీకి దక్కలేదు. మధ్యలో ‘జిల్, సీటీమార్’ వంటి యావరేజ్ సినిమాలు ఉన్నా మిగిలినవి అన్నీ పరాజయం పాలయ్యాయి.

తాజాగా తమిళ దర్శకుడు హరి తో గోపిచంద్ ఓ సినిమా చేస్తున్నట్టు సమాచారం. హరి మాస్ మసాలా డైరెక్టర్. గతంలో హీరో ఎన్టీఆర్ కి హరి ఓ కథను వినిపించారని వార్తలు వచ్చినా, ఆ సినిమా రూపుదాల్చలేదు. ఇప్పుడు ఆ కథనే గోపీచంద్ కి వినిపించారనీ, కథ నచ్చడంతో గోపి ఓకే అన్నారని తెలియవచ్చింది.

తాజాగా విడుదలైన గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’తో పాటు హరి దర్శకత్వంలో వచ్చిన ‘ఏనుగు’ కూడా పూర్తిగా నిరాశ పరిచాయి. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న శ్రీవాస్ సినిమా తరువాత హరి తో సినిమా మొదలు అవుతుంది అంటున్నారు అయితే గోపీచంద్ కి ఊరట లభించాలి అంటే ముందుగా శ్రీవాస్ తో చేస్తున్న సినిమా హిట్ అవ్వాలి. ఆ తరువాత సక్సెస్ మీద ఉన్న ఊపుతో హరి సినిమా మరింత క్రేజ్ ను మూట గట్టుకుంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గోపిచంద్ – శ్రీవాస్ కలయికలో వచ్చిన ‘లౌక్యం’ చక్కని కామెడీ ఎంటర్ టైనర్ గా అలరించిన నేపథ్యంలో రాబోయే సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. మరి గోపీచంద్ కు కావాల్సిన విజయాన్ని దర్శకుడు శ్రీవాస్ ఇస్తారా లేదా హారి ఇస్తారో చూడాలి.

Aishwarya Rai’s PS1 Poster Grabbed Everyone’s Attention

0

Aishwarya Rai looked etheral in the first look poster of movie PS1. Ponniyin Selvan is a periodic drama shot under Mani Ratnam’s direction. This is the fourth film of Aishwarya Rai under movie maverick Mani’s direction.

https://twitter.com/LycaProductions/status/1544569333128511488?cxt=HHwWgICygYDotO8qAAAA

She debuted with his film Irruvar and later went on to do two more films with him- Guru and Ravvanan. The actress looks surreal in this new poster where we can see her as Queen of Pazhuvoor.

PS1 team has released posters of Vikram and Karthi earlier this week but none of these posters grabbed as many eye balls as Aishwarya’s did. This poster is the talk of the town now. As per the reports, Aishwarya is doing a dual role in this movie. We can see her as the queen of Pazhuvoor and another character is Mandakini Devi.

Ponniyin Selvan is the first Tamil movie that is going to be released across India. The movie is going to release in five languages- Tamil, Telugu, Kannada, Malayalam and Hindi. It will have two parts and the first part will hit screens on September 30, 2022.

PS1 is a star-studded film with Vikram, Karthi, Jayam Ravi, Aishwarya Rai, Trisha, Rahman, Jayaram, Shobhitha Dhulipala and Aishwarya Lekshmi. Madras Talkies and Lyca Productions are producing this movie and the budget is around 500 crores.

Ponniyan Selvan First Look: అదిరిపోయిన ఐశ్వర్యా రాయ్ ఫస్ట్ లుక్

0

ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ‘పొన్నియిన్ సెల్వన్’ (PS-1) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.చోళ సామ్రాజ్యం నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా మణిరత్నం ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దాదాపు రూ.500 కోట్లతో రూపొందుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమాలో విక్రమ్‌, జ‌యం ర‌వి, కార్తి, ఐశ్వర్య రాయ్‌, త్రిష నటిస్తున్నారు.

సెప్టెంబర్ 30న ఈ సినిమా విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించారు. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా నటీనటుల ఒక్కొక్కరి లుక్ రిలీజ్ చేస్తున్నారు. ఇటీవలే విక్రమ్, జయం రవి, కార్తి లుక్ విడుదల చేయగా.. వాటికి కాస్త మిశ్రమ స్పందన లభించింది.

అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మాజీ విశ్వ సుందరి అదరగొట్టేసిందని ప్రేక్షకులు అంటున్నారు. ప్రతీకారానికి అందమైన రూపం పజూహూర్ రాణి నందిని క్యారెక్టర్‌‌లో ఐశ్వర్య రాయ్ నటిస్తున్నట్లు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

https://twitter.com/LycaProductions/status/1544569333128511488?t=Zo5Kc5S_fO7k10a6K3naug&s=19

తమిళం, హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. కెమెరామెన్‌ ర‌వి వ‌ర్మన్‌, ఎడిట‌ర్ శ్రీక‌ర్ ప్రసాద్ వంటి నిష్ణాతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పని చేస్తున్నారుప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, దాదాపు నాలుగేళ్ల తరువాత మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో “పొన్నియన్ సెల్వన్” గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు భారీ తారాగణం కూడా నటిస్తుండడం, రెండు భాగాలుగా సినిమా తెరకెక్కడం వల్ల సినిమా పై అంచనాలు కూడా భారీ స్ధాయిలో ఉన్నాయి.

Pooja Hedge roped in another Tamil biggie after Beast

0

Pooja Hegde is one of the busiest actresses at the moment. The ‘Beast’ actresses have back-to-back projects lined up in Tollwood, Kollywood, and Bollywood. She has become the first choice for a lot of directors across the industries as the lead star for their big-budget films.

In the first half of the year, she was seen in Beast and Acharya alongside Vijay and Ram Charan respectively. She also starred opposite Prabhas in the pan-India project Radhe Shyam. While none of these films stuck gold at box-office, she is still continuing her craze among filmmakers and fans She also was a part of a special song in Venkatesh’s F3. And now, she has bagged another big project in Kollywood.

She will be seen in director Siva and Kollywood star Suriya’s upcoming action entertainer. This will be the first time she’ll be sharing screen space with Suriya. Apart from this film, she will be also seen in SSMB 28, Salman Khan’s Kabhi Eid Kabhi Diwali and Ranveer Singh’s Cirkus.

With so many big projects opposite top stars of all the industries, Pooja Hegde’s fans are surely in for a treat in 2022 and 2023.

Gopichand is now interested in only doing Mass Entertainers

0

Gopichand is one of the heroes who likes to experiment a lot. He has done various types of movies and roles throughout his career and some of these were a hit while a lot didn’t fare well at the box office. After doing lot of experiments and facing some failures, Gopichand has now decided to focus on mass entertainers only.

His latest movie Pakka commercial was a comedy entertainer that doesn’t fare as expected at the box office. Pakka Commercial has hit screens last Friday and its performance was quite poor and this has made Gopichand rethink about his choices. Despite giving some good films, director Maruthi failed at delivering an all in all entertainer. Rashi Khanna was in the lead role.

He is now planning to focus on mass movies as audience are expecting them from him.

He doesn’t want to experiment or play around different genres now. He want to keep things simple and make movies that audience want from him. His next movie with Director Hari is going to be a mass entertainer.

Let us see what kind of scripts Gopichand is going to select from here onwards. His mass movies like Lakshyam, Souryam were blockbusters at the box office and let us hope that he will see such pinnacle again.

Nagarjuna’s latest Movie planning for direct OTT release

0

Ghost movie Planning for direct Ott release , The makers are quoting big prices for direct OTT release . Praveen Sattaru is the director .

There is no denial in saying that we are living in the OTT era. There are so many movies that are directly getting released in OTT and are attracting people. Most of the small budget movies are planning to go for OTT release rather than a theatrical one. Right now, one such movie that may be get an OTT release is Ghost.

Ghost movie is featuring Nagarjuna as lead actor and is directed by Praveen Sattaru. As it is going to be released in the OTT itself directly, makers are trying to quote more price. We have to wait and see whether the movie will hit theaters or our screens directly.

Ghost is the upcoming movie of Nagarjuna starring Kajal Agarwal and Sonal Chauhan as female leads. As of now, the role of Kajal Agarwal isn’t clear yet so we cannot say anything about it. Although the movie makers haven’t given any more specifications related to the movie. They have released just one poster in which we can see Nagarjuna with a sword in his hand in Europe.

It is an action-packed film. Praveen Sattaru is the story writer and he is directing the movie by himself. The movie was scheduled for a theatrical release in the end of this year, but if it goes to OTT, we may get to see it even sooner.

Tollywood Senior Editor Goutham Raju Passes away due to Health Issues

0

Tollywood senior editor Goutham Raju has demised on Wednesday. He has been suffering from health issues for some days now. He was under treatment in a prominent hospital and yesterday he got discharged. However, the health issue surged again and he lost his life during the midnight.

Goutham Raju has been in the industry for more than 40 years and was the editor for 500+ films. He made his debut with Chiranjeevi’s movie Chattaniki Kallu Levu in 1981. He has been an editor for some quite popular movies like Nari Nari Naduma Murari, Padamati Sandhya Ragam, Karthavyam, Assembly Rowdy, Peda Rayudu and many more. Goutham also won Nandi award for Jr. NTR’s Aadi movie.

Some of his recent works are Gabbar Singh, Sardar Gabbar Singh, Katamarayudu, Touch chesi chudu, etc. Vamsi, Shekhar, PROs of Tollywood has took it to twitter to announce the demise of Goutham Raju. Tributes are pouring in from multiple film personalities on Twitter.

Music director M.M. Keeravani tweeted that he is saddened by the demise of Goutham and reminisced the time when he worked with Goutham for the movie Dhammu.

This indeed is a sad time for the industry.

ప్రమాదంలో పవిత్ర లోకేష్ కెరీర్..పుకార్లే కారణం?

0

కన్నడలో సినీ నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన పవిత్ర లోకేష్ అనతికాలంలోనే భాషలకు అతీతంగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడమే కాకుండా మంచి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. ప్రస్తుతం సౌత్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ గా రాణిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంపై పలు రకాల పుకార్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె సినీ కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయని చర్చలు జరుగుతున్నాయి.

పవిత్ర లోకేశ్, తెలుగు సీనియర్ నటుడు నరేష్ లపై గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు అని.. కాదు సహజీవనం అనీ ఇలా రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి.ఎక్కడికైనా ఇద్దరూ కలిసే వెళ్లడం,ఇటీవల మహాబలేశ్వర్ లో ఒక స్వామిజీని దర్శించుకోవడంతో వీరి వ్యవహారం పై పుకార్లు ఎక్కువ అయ్యాయి.

ఈ క్రమంలో ఈ సీనియర్ నటీనటులిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో నరేష్ మూడో భార్య రమ్య అడుగుపెట్టడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

తనకు చెడ్డ పేరు తేవడానికే నరేశ్ మూడో భార్యనని చెప్పుకునే రమ్య రఘుపతి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని పవిత్ర లోకేష్ ఈ విషయం పై బెంగుళూరులో ప్రెస్ మీట్ పెట్టి తన పరువుకి భంగం కలిగించే ప్రయత్నం చేస్తోందని చెప్పగా, ఈ విషయంలో నరేష్ కూడా తన స్పందనను తెలియజేస్తూ వీడియో వదిలి..తమ ఇద్దరినీ సపోర్ట్ చేయాల్సిందిగా అందరినీ కోరారు.

అయితే మైసూర్ లోని ఓ హోటల్ గదిలో నరేశ్ – పవిత్ర కలిసి ఉండటం..అదే సమయంలో మీడియా సమక్షంలో రమ్య రఘుపతి వీరిద్దరితో వాగ్వాదం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. నరేష్ తో పవిత్ర హోటల్ గదిలో కనిపించడంపై ఇండస్ట్రీలో కూడా పలు విధాలుగా మాట్లాడుకుంటున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

తెలుగులో తల్లి, అత్త పాత్రల్లో తనదయిన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయా పాత్రల్లో వేరే ఎవరినీ ఊహించలేని విధంగా ముద్ర వేశారు. తాజాగా రగిలిన వివాదం కారణంగా ఆమెను మళ్ళీ కుటుంబ సభ్యుల పాత్రల్లో ప్రేక్షకులు అదేవిధంగా చూస్తారా లేదా అనే అనుమానాలు ఇండస్ట్రీలో కలుగుతున్నాయట. ఇప్పటికే రెండు పెద్ద సినిమాల్లో తల్లి పాత్రల నుంచి ఆమెను తప్పించారని సమాచారం.

ఈ వివాదం ఇలా జరగడానికి నరేష్, పవిత్రల ఎమరుపాటు కారణం కావచ్చు,లేదా నరేష్ మూడో భార్య స్వార్థం కావచ్చు లేదా మీడియా అత్యుత్సాహం కావచ్చు కారణాలు ఏవైనా ఏదేమైనా వ్యక్తిగత ఖననం అనేది మహా దారుణమైన విషయం. ఇక నుంచైనా ఇలాంటి వ్యక్తిగత విషయాలు రచ్చకి ఈడ్చకుండా అయా వ్యక్తులు అధికారికంగా ధృవీకరించే వరకూ ఆగితే ఎవరి జీవితాలు వాళ్ళు సాఫీగా బతికే వీలుంటుంది.