Home Blog Page 2113

నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న మహేష్ – రాజమౌళి సినిమా

0

RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించారు రాజమౌళి. ఈ తరంలో అతి పెద్ద మాస్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లని ఒకే సినిమాలో అద్భుతమైన కాంబినేషన్ సీన్స్ లో చూపించి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిన రాజమౌళి ప్రస్తుతం హాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. లాస్ ఏంజిల్స్‌లో వచ్చే ఏడాది జరగనున్న ఆస్కార్ అవార్డు వేడుకలో ‘RRR’కి అనేక విభాగాల్లో నామినేషన్లు వచ్చేలా దర్శకుడిగా తన పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి చెందెలా రాజమౌళి ప్రయత్నిస్తున్నారు.

RRR వంటి భారీ ప్యాన్ ఇండియా విజయం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు మరియు అతని అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ పై కె.ఎల్. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. యాక్షన్‌-అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కథను లాక్ చేసిన రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందనుంది. అయితే యదార్థ సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపొందనుందని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగానే తెరకెక్కనుందని రచయిత విజయేంద్ర ప్రసాద్ కూడా ధృవీకరించారు. ఈ వార్త విన్న తర్వాత అటు మహేష్ బాబు అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేమికులు ఈ సినిమా పై భారీ స్థాయిలో అంచనాలు పెంచేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రం 2023లో సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాల్లో కూడా విడుదల చేయడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

అంతే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ హాలీవుడ్ హీరోల రేంజ్ లో సరికొత్త మేకోవర్ లుక్స్ తో కనిపించనున్నారు.

రాజమౌళి సినిమాల్లో హీరోలు ఎప్పుడూ శారీరకంగా బలంగా ఉంటారు. అందుకే వారి పై వీరోచిత పోరాట సన్నివేశాలు చిత్రీకరించడం అనేది సులభం అవుతుంది. అదే బాటలో మహేష్ కూడా ఫిజికల్ గా కొత్త మేకోవర్ తో కనిపిస్తారని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది భారీ ఎత్తున ప్రారంభం కానుంది.

ప్రమోషన్స్ కోసం జపాన్ బయలుదేరిన RRR చిత్ర బృందం

0

RRR చిత్రం అక్టోబర్ 21న జపాన్‌లో విడుదల కానుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తంగా ఇండియా, రెగ్యులర్ ఓవర్సీస్ ఏరియాలలో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా ఇప్పుడు జపాన్‌కు వెళ్తోంది. జపాన్‌లో మంచి వసూళ్లు సాధిస్తే ప్రపంచవ్యాప్తంగా KGF2 కలెక్షన్స్‌ను క్రాస్ చేస్తుంది. ప్రస్తుతానికి, KGF2 ప్రపంచవ్యాప్త కలెక్షన్లలో RRR కంటే ముందుంది.

ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘RRR’ విడుదల మరియు ప్రమోషన్స్ కోసం జపాన్ చేరుకున్నారు. కాగా చరణ్ తన భార్య ఉపాసన కొణిదెల మరియు వారి పెంపుడు కుక్క రైమ్‌తో విమానాశ్రయంలో కనిపించారు. ఈ జంట క్యాజువల్ వేర్ ధరించి ఎయిర్‌పోర్ట్‌లో పోజులు ఇస్తున్న ఫోటోలు మంగళవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యాయి. సెల్ఫీలు మరియు ఆటోగ్రాఫ్‌ల కోసం తన అభిమానుల అభ్యర్థనలను రామ్ చరణ్ ఆనందంగా అంగీకరించారు. ఆ తర్వాత జూ.ఎన్టీఆర్ కూడా జపాన్‌కు వెళ్లబోతుండగా ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు.

‘బాహుబలి’తో రాజమౌళి తన సినిమాలకు జపాన్‌లో చెప్పుకోదగ్గ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ కూడా జపాన్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ మార్కెట్‌ని కైవసం చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

అక్టోబర్ 21న జరిగే స్క్రీనింగ్‌కు హాజరవుతానని రాజమౌళి ఇప్పటికే తన జపాన్ అభిమానులకు హామీ ఇచ్చారు. ఆస్కార్‌ నామినేషన్‌ పై కూడా RRR టీమ్ ఆశలు పెట్టుకుంది. For Your Consideration (FYI) క్యాంపెయిన్ ద్వారా వారు ఆస్కార్‌ అవార్డుల నామినేషన్ కు దరఖాస్తు చేసుకున్నారు.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, RRR టీమ్ జపాన్ లోని ప్రచార నిమిత్తం టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలను నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. అదే విధంగా, ఇతర మీడియా సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరో వైపు, RRR స్క్రీనింగ్ కోసం టిక్కెట్లు చాలా త్వరగా మరియు పెద్ద సంఖ్యలో విక్రయించబడే అవకాశం ఉంది.

భారతదేశంలో RRR ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా మహమ్మారి తరువాత బాక్సాఫీస్‌ను షేక్ చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది. కాగా ధియేటర్లలో విడుదల అయిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. మరియు ప్రపంచ స్థాయిలో ప్రసిద్ధ చిత్రంగా మారింది. హాలీవుడ్ మేకర్స్ కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. బాహుబలి వలె RRR ప్రపంచ స్థాయిలో నిలబడగలదా అనే ప్రశ్నలు తలెత్తాయి, అయితే నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్ తర్వాత దాని విజయం పై ఉన్న అన్ని సందేహాలు తొలగిపోయాయి.

ఇక విడుదలైన ప్రతి చోటా విజయం సాధించిన RRR జపాన్‌లో కూడా భారీ కలెక్షన్లను సాధిస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టే RRR జపాన్ లో భారీ విజయం సాధించాలని కోరుకుందాం.

Vijayendra Prasad Says Mahesh – Rajamouli film is based on a real-life incident

0

SS Rajamouli created a worldwide sensation with RRR. Rajamouli who gave an unforgettable treat to the fans of the two heroes by showing the two biggest mass heroes of this generation Mega Power Star Ram Charan Young Tiger NTR in one movie with superb combination scenes has become a hot topic in Hollywood. Rajamouli is trying to make his name global as a director so that ‘RRR’ gets nominations in many categories at the next year’s Oscar award ceremony in Los Angeles.

Rajamouli is going to start a big movie with superstar Mahesh Babu after the huge pan India wonder like RRR. Mahesh Babu and his fans are eagerly waiting for this project for a long time. Shri Durga Arts banner under K.L. Narayana is going to produce this movie.

As an action-adventure, this movie is going to hit the screens on a huge scale by international standards. Rajamouli, who has already locked the storyline for this film, is busy with the pre-production works.

This huge pan-India movie is going to be made as an action-adventure movie in the background of African forests. But recent news is going viral that this movie will be made as a compilation of real events.

Writer Vijayendra Prasad too confirms that it is based on a real-life incident. Now after hearing this news, the expectations will surely mount. The film will go on set in 2023 and makers are planning to release it globally.

Apart from that, Mahesh will be seen with a brand new makeover in the range of Hollywood heroes in this movie which will be released on a huge scale by international standards.

Physically, the heroes in Rajamouli’s films have always been fit. It is said that Mahesh will also be seen with a new makeover physically in the same vein. The pre-production work is in full swing and this movie is going to be launched on a grand scale next year.

Ramcharan, NTR, and SSR fly to Japan for RRR promotions

0

RRR is releasing in Japan on October 21st. The movie became a huge blockbuster in Telugu States, India, and regular overseas countries and now it is heading to Japan. If it does well in Japan then it will cross KGF2 Collections worldwide. As of now, KGF2 is leading over RRR in worldwide collections.

Mega Power Star Ram Charan landed in Japan for the release and promotions of ‘RRR’. The actor was spotted at the airport with his wife Upasana Konidela and their pet dog Rhyme. Pictures of the couple dressed in casual wear and striking a pose at the airport went viral on social media platforms on Tuesday. Ram Charan even did for his fans’ requests for selfies and autographs. Later, even Jr. NTR was snapped at the airport as he was about to rush off to Japan.

Rajamouli has created a sizeable market for his films in Japan with ‘Bahubali’. Even Prabhas became a well-known face in Japan. Now, Ram Charan and NTR have plans to capture this market.

Rajamouli already promised his Japanese fans that he would be present at the screening. The team is also hopeful of Oscar nominations. They have applied for the Oscars under the For your consideration (FYC) campaign.

As per the inside sources, the makers have lined up big TV channel interviews for the RRR team. Along with the same, other press interactions are likely to take place. On the other hand, the tickets for RRR screening are likely to be sold quickly and in large numbers.

It is needless to say how much success RRR has achieved Pan India. It became the second Indian film to shake the box office. It was released on Netflix including America and became a famous film at the global level. Hollywood makers also appreciated the film. Questions arose about whether can RRR stand on a global scale as Bahubali did but the doubts were put to rest with its success after the premier in Netflix.

Social media users are expressing their belief that RRR will mint huge collections in Japan as it did worldwide. Let’s wish that the RRR movie once again makes headlines with roaring success in Japan.

చిరంజీవి సినిమాతో సమానంగా జరుగుతున్న బాలయ్య సినిమా బిజినెస్

0

వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మించే అగ్ర నిర్మాతలు ఒక్కోసారి ఊహించని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉదాహరణకు, ఎంత నిష్ణాతుడు అయిన నిర్మాత ఉన్నా.. ఒకేసారి రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లను విడుదల చేయాలనుకున్నప్పుడు, విడుదల తేదీ విషయంలో సమస్య వస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు అలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో తాజా సమాచారం అందుతోంది.

అసలు విషయం ఏంటంటే.. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనిల చిత్రం NBK 107, మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో మరో సినిమా MEGA154 రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

NBK107 మరియు MEGA154 రెండు హీరోలు తమ సినిమాలను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మైత్రీ మూవీ మేకర్స్‌ పై ఒత్తిడి చేయడంతో తప్పేది లేక అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారట. విడుదల తేదీలు మారవచ్చు మరియు ఏ సినిమా ఏ తేదీకి వస్తుంది అనేది నిర్ధారణ అవ్వాలంటే చివరి నిమిషం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక రిలీజ్ డేట్ల సంగతి పక్కన పెడితే రెండు సినిమాల బిజినెస్ ఏంటో చూద్దాం.

మైత్రీ రెండు సినిమాలకు బిజినెస్ పనులను మమ్మురం చేసింది. కాగా రెండు సినిమాలను కలిపి బిజినెస్ చేస్తున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లు రెండు సినిమాలకు ఒకే రేంజ్ లో ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా బాలకృష్ణ సినిమా కంటే చిరంజీవి వ్యాపారం మైళ్ల ముందు ఉంటుంది. అయితే ఇప్పుడు అంతా మారిపోయినట్లు కనిపిస్తోంది. మరియు రెండు సినిమాల బిజినెస్ కూడా ఒకే స్థాయిలో జరిగే అవకాశం ఉంది.

ఆచార్యతో చిరంజీవి ఇటీవలే అతిపెద్ద డిజాస్టర్‌ ను అందించటం, మరియు ఇటీవల గాడ్‌ఫాదర్ చిత్రం యొక్క మిశ్రమ ప్రదర్శన ఆయన స్టార్‌డమ్‌ను కొద్దిగా తగ్గించాయి. అఖండ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత బాలకృష్ణ టాప్ ఫామ్ మరియు NBK107కి భారీ క్రేజ్ ఉండటం వల్ల ఈ సమీకరణం ఉద్భవించింది.

ఈ రెండు సినిమాలతో పాటు ప్రభాస్ ఆది పురుష్, దళపతి విజయ్ వారసుడు/వరిసు కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. వీటన్నింటితో పాటు MEGA154లో కూడా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది సినిమా పై అంచనాలను పెంచి సినిమాకు అనుకూలంగా పని చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

For the first time in recent years, Balakrishna’s film business is on par with Chiranjeevi’s film

0

Big producers who produce crazy projects in a row sometimes face unexpected difficulties. For example, when you want to release two crazy projects at the same time, there is a problem with the release date. The latest talk being heard in industry circles is that the famous production company Mythri Movie makers is facing such trouble now.

The real thing is that mythri movie makers are producing Nandamuri Balakrishna, Gopichand Malineni’s movie NBK 107, and another movie MEGA154 in Megastar Chiranjeevi and Bobby combination.

NBK107 and Mega154 Both are planning to release for Sankranthi as both Heros are pressuring the Mythri movie makers. Release dates may change and we have to wait till the last minute for confirmation it seems. Leaving the issue of the date aside let’s look at the business of both movies.

Mythri started the business for both films, they are doing the business combining both films. The distributors are offering the same range of amounts for both movies which is surprising to everyone. Normally Chiranjeevi’s business is miles ahead of Balakrishna’s film. But now looks like everything changed and most likely business both films will be in the same range.

Chiranjeevi’s bad form with acharya being one of the biggest disasters, and the recent underperformance of the Godfather movie have brought down his stardom a bit. And Balakrishna’s top form with Akhanda being a blockbuster and a huge craze for NBK107 made this equation.

Along with these two movies, Prabhas’s Adi Purush and Thalapathy Vijay’s Vaarasudu/Varisu are also in the Sankranthi race.

Apart from all these, Ravi Teja is also playing a pivotal role in Mega154. That will work in favor of the movie as it raises the expectations towards the movie.

ఒరిజినల్ తో పోలిస్తే దృశ్యం-2 లో మార్పులు చేసాం – అజయ్ దేవగణ్

0

అజయ్‌ దేవగణ్, శ్రియ శరణ్‌ జంటగా నటించిన చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషించగా అదే టైటిల్‌తో వచ్చిన మలయాళ చిత్రానికి అధికారిక రీమేక్ గా హిందీలో తెరకెక్కింది.

ఈ చిత్రం 2015 లో విడుదలైంది. ఆ తర్వాత ఈ చిత్రం రెండవ భాగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హిందీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతగానో ఇష్టపడ్డారు. మరియు దాని సీక్వెల్ చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. కొంతమంది సీక్వెల్ ఇంకా విడుదల కావట్లేదు ఏంటని ఆశ్చర్యపోతూ చర్చించుకున్నారు. ఆ చర్చలకు ముగింపు పలికేలా ఈ సినిమా రెండో భాగాన్ని త్వరలో విడుదల చేయనున్నారు.

దృశ్యం 2015లో విడుదలైన తర్వాత, దాని తదుపరి భాగం దృశ్యం-2 2022లో విడుదలవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ను నిన్న అంటే అక్టోబర్ 17, 2022న అధికారికంగా విడుదల చేశారు. ఏడేళ్ల తర్వాత మరోసారి అజయ్ దేవగన్ అంటే సినిమాలో విజయ్ సల్గాంకర్ కేసును తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేసే పోలీస్ అధికారి పాత్రలో అక్షయ్ ఖన్నా కనిపించనున్నారు.

అజయ్ దేవగణ్ ఒరిజినల్ మలయాళ వెర్షన్‌తో దృశ్యం2 పోలికలను గురించి మాట్లాడుతూ.. “మేము మా చిత్రంలో కొత్త పాత్రలను పరిచయం చేసాము,” “కానీ మాతృకలో ఉన్న ఆత్మ అలాగే ఉంటుంది” అని అన్నారు.

ట్రైలర్ చూస్తే ఆయన చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సీక్వెల్ యొక్క అసలు వెర్షన్‌లో కనిపించని కానిస్టేబుల్ కమలేష్ సావంత్ అంటే లక్ష్మీకాంత్ గైతోండే పాత్రను మనం చూడవచ్చు. దృశ్యం మొదటి భాగంలో కూడా,ఒరిజినల్‌ తో పోలిస్తే హిందీ వెర్షన్ విజయానికి అవసరమైన స్వల్ప మార్పులు చేశారు.

దృశ్యం మరియు దృశ్యం 2 రెండు చిత్రాలు కూడా మలయాళం, తెలుగు మరియు కన్నడలో కూడా విజయవంతమయ్యాయి. పైన చెప్పినట్లుగా, మలయాళంలో మోహన్‌లాల్ నటించారు. తెలుగు వెర్షన్‌లో వెంకటేష్ మరియు కన్నడలో రవిచంద్రన్ ప్రధాన పాత్ర పోషించారు.

ఇప్పుడు హిందీ వెర్షన్ దృశ్యం 2 ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది. అన్ని వైపుల నుండి ట్రైలర్ కు దక్కిన ఆదరణ చూస్తుంటే సినిమా విజయం గ్యారెంటీగా కనిపిస్తోంది.

దృశ్యం 2లో అజయ్ దేవగణ్ పాటు శ్రియా సరన్, అక్షయ్ ఖన్నా, టబు, ఇషితా దత్తా, మృణాల్ జాదవ్ మరియు రజత్ కపూర్ వంటి భారీ తారాగణం ఉంది. దృశ్యం 2 నవంబర్ 18, 2022న థియేటర్లలో విడుదల కానుంది.

Ajay Devgan says we have made the changes for Drishyam sequel

0

The film ‘Drishyam’ in which Ajay Devgn and Shriya Saran played the lead roles, was well received. The film was an official remake of the Malayalam film with the same title in which Mohanlal essayed the main role.

This film was released in 2015, after which everyone was eagerly waiting for the second part of this film. Hindi audience liked it and were eager to see its sequel and few were wondering what happened to the Sequel part. To end those discussions, the second part of this film is going to be released soon.

After Drishyam was released in 2015, the next part of this film Drishyam 2 is being released in 2022. The trailer of this film has been officially launched yesterday i.e. on October 17, 2022.

After seven years, once again the case of Ajay Devgn i.e. Vijay Salgaonkar is opening. Akshaye Khanna is going to investigate this case.

Ajay Devgan talked about the Drishyam2 comparisons with the original Malayalam version and said “We have introduced new characters in our film,” “but the soul remains the same.”

Going by trailer it looks true because we can see Kamlesh Sawant i.e. Laxmikant Gaitonde whose role was not present in the original version of this Sequel. Even in the first part of Drishyam, there were slight changes to the original which were essential for the Hindi version’s success.

Drishyam and Drishyam 2 both were successful in Malayalam, Telugu, and Kannada as well. As said above, Mohanlal played the main role in Malayalam, Venkatesh in the Telugu version, and Ravichandran in Kannada.

Now the trailer of the Hindi version of Drishyam 2 has been receiving a good response, and the film’s success looks guaranteed.

Drishyam 2 consists of a huge cast that includes Shriya Saran, Akshaye Khanna, Tabu, Ishita Dutta, Mrunal Jadhav, and Rajat Kapoor with Ajay Devgn. Drishyam 2 will release in theaters on November 18, 2022.

రంగస్థలం సీక్వెల్ తెరకెక్కించనున్న సుకుమార్ ?

0

దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా కేవలం ఆయన కెరీర్‌లోనే కాకుండా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్‌లో కూడా ఒక చిరస్మరణీయమైన మైలురాయిగా నిలిచింది. విపరీతమైన మాస్ అప్పీల్ ఉన్న హీరోకి ఇక ప్రత్యేకమైన విజన్ ఉన్న దర్శకుడు కలిస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితం వస్తుందో ఈ సినిమా నిరూపించింది.

2018లో విడుదలైన రంగస్థలం ఆ సమయానికి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న అనేక రికార్డులను బద్దలు కొట్టి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కి సీక్వెల్ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద మొదటి వారంలోనే 80 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి నాన్-బాహుబలి రికార్డులను క్రియేట్ చేయడం ద్వారా రంగస్థలం సినిమా తన ప్రీ రిలీజ్ బిజినెస్‌ను రికవరీ చేసింది. రెండవ వారం ముగిసే సమయానికి, ఈ చిత్రం టాలీవుడ్‌లో నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. కాగా ప్రపంచ వ్యాప్తంగా రన్ పూర్తయ్యే సరికి 120 కోట్ల షేర్‌తో ముగిసింది.

ఇక సుకుమార్ ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో రంగస్థలం సీక్వెల్ కోసం తన ఆలోచనను పంచుకున్నట్లు సమాచారం. ఈ ఆలోచనకు మెగాస్టార్ నుంచి స్పందన కూడా సానుకూలంగా వచ్చిందట.

కాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే విజయ్ దేవరకొండతో పాటు యావత్ భారతదేశ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న పుష్ప 2 సినిమాలతో ఇప్పటికే కమిట్‌మెంట్‌లను కలిగి ఉన్నారు.

ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాత రంగస్థలం 2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం RC-15తో బిజీగా ఉన్నారు. ఇక వీరిద్దరూ ఒకసారి ఫ్రీ అయిన తర్వాత, రంగస్థలం 2 కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం నడుస్తున్న ప్యాన్ ఇండియా ట్రెండ్ వల్ల హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా రంగస్థలం 2 అద్భుతమైన స్పందన తెచ్చుకుంటుందనే నమ్మకంతో సుకుమార్ కూడా ఉన్నారట. ఆయన నమ్మకం నిజం కావాలని కోరుకుందాం.

బాక్సాఫీస్ వద్ద సోమవారం పరీక్షలో పాస్ అయి ఎపిక్ బ్లాక్బస్టర్ వైపు పయనిస్తున్న కాంతార

0

చిన్న సినిమాగా విడుదలైన కన్నడ చిత్రం ‘కాంతార’ రోజురోజుకు అనూహ్యంగా రికార్డులు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.

కాంతార ఈ వారాంతంలో హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలైంది. మరియు ఈ చిత్రం సోమవారం అన్ని భాషలలో సూపర్ స్ట్రాంగ్‌గా ఉంది. సాధారణంగా సోమవారం రోజు వచ్చే కలెక్షన్లతో ఒక సినిమా విజయం నిర్ణయించబడుతుంది. అయితే ఈ పరీక్షలో కాంతార డిస్టింక్షన్‌తో పాస్ అయిందని చెప్పవచ్చు.

తెలుగులో ఈ సినిమా తొలి రోజుతో సమానంగా 3.7 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరియు హిందీలో కూడా మొదటి రోజు కంటే ఎక్కువగా ఉంది మరియు దాదాపు 1.5Cr నెట్‌ని వసూలు చేసింది. తమిళ వెర్షన్‌లో కూడా మొదటి రోజు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. ఇతర భాషల్లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది.

కేజీఎఫ్ సినిమా సంచలన విజయం తర్వాత కన్నడ చిత్రాలకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత విడుదలైన కన్నడ సినిమాల్లో రక్షిత్ శెట్టి ‘చార్లీ 777’, కిచ్చా సుదీప్ ‘విక్రాంత్ రోనా’ వంటి సినిమాలు కన్నడ ఇండస్ట్రీని దేశవ్యాప్తంగా పాపులర్ చేశాయి. ఇక ఇటీవలే విడుదలైన ‘కాంతార’ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది.

ఈ చిత్రాన్ని దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి రూపొందించారు. ఇది కన్నడ నేటివిటీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చినప్పటికీ ప్రతి సినీ ప్రియుల చర్చలలో ముఖ్యాంశంగా మారింది. ‘కేజీఎఫ్’ నిర్మాతలయిన హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ సినిమా టాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారుతోంది. ప్రముఖ తారలు సోషల్ మీడియాలో ఈ సినిమాని ప్రశంసిస్తున్నారు. తన తదుపరి చిత్రం సాలార్ కోసం హోంబాలే ఫిల్మ్స్ తో పని చేస్తున్న ప్రభాస్ విడుదల సమయంలో కన్నడ మరియు తెలుగు రెండు వెర్షన్లను చూసి కాంతారను ప్రమోట్ చేశారు. అనుష్క కూడా సినిమాను మెచ్చుకున్నారు.

హోంబాలే ఫిల్మ్స్ 16 కోట్ల బడ్జెట్‌తో చిన్న ఆర్టిస్టులతో ఈ చిత్రాన్ని నిర్మించింది. అలాంటి సినిమా IMDb రేటింగ్స్‌లో RRR ‘KGF 2’ వంటి చిత్రాలను బీట్ చేసింది. IMDb రేటింగ్స్‌లో ‘కాంతారావు’ 9.5 రేటింగ్‌ను కలిగి ఉంది.