Home Blog Page 2063

విజయ్ వారిసులో కేవలం 1/3 వంతుకు అమ్ముడయిన అజిత్ తునివు ఓవర్సీస్ హక్కులు

0

తమిళ పరిశ్రమలో బాక్సాఫీస్ వద్ద ప్రత్యర్థులుగా ఎన్నో ఏళ్ల నుంచి విజయ్ – అజిత్ లకు పోటీ ఉన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ ఇద్దరూ ఒకే సమయంలో నటులుగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు మరియు భారీ అభిమానులను ఆస్వాదించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, విజయ్ అజిత్ పై పై చేయి సాధించారు మరియు హీరోగా అయన యూనివర్సల్ అప్పీల్ రోజురోజుకు పెరుగుతోంది.

అజిత్ ఇప్పటికీ తమిళనాడులో విజయ్ తో సమానంగా మంచి అభిమానులను కలిగి ఉన్నప్పటికీ, మిగతా భారతదేశం మరియు ఓవర్సీస్‌లో ఆయన బాక్సాఫీస్ స్టామినా మాత్రం విజయ్ తో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి.

విజయ్ మరియు అజిత్‌లు తాజాగా 2023 పొంగల్‌/సంక్రాంతికి పోటీ పడుతున్నారు. ఇరువురి సినిమాలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది, డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాలకు ఫ్యాన్సీ ధరలను అందజేస్తున్నారు. తమిళనాడులో ఇద్దరూ సరిగ్గా పోల్చదగిన వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉన్నారు, అయితే ఓవర్సీస్‌లో మాత్రం విజయ్ ముందున్నారు, అజిత్ యొక్క తునివు ఓవర్సీస్ తాలూకు ఒప్పందం చాలా తక్కువ స్థాయిలో జరిగింది.

వారిసు ఓవర్సీస్ హక్కులు 35 కోట్లకు అమ్ముడయ్యాయి, అయితే అజిత్ నటించిన తునివు కేవలం 13 కోట్ల డీల్ మాత్రమే పొందింది. అజిత్ సినిమాలు తెలుగు రాష్ట్రాలు, కేరళ, యుఎస్ఎ మొదలైన కొత్త ప్రేక్షకులలో తమిళం దాటి తన ప్రభావాన్ని విస్తరిస్తున్న విజయ్ లాగా పెద్దగా ప్రభావం చూపడం లేదు.

ఈ ఇద్దరి హీరోల మధ్య పెరుగుతున్న ఈ వ్యత్యాసానికి చాలా కారణాలు ఉన్నాయి. స్క్రిప్ట్ ఎంపిక, దర్శకులు, సంగీతం, కళా ప్రక్రియలు మొదలైనవి కొత్త ప్రాంతాలలో సినిమా కోసం బాక్సాఫీస్ అప్పీల్‌గా పనికి వస్తాయి.విజయ్ చాలా మంది దర్శకులతో పని చేస్తున్నారు. ఆయన సినిమాల ఆడియోలు మంచి చార్ట్ బస్టర్‌లను కలిగి ఉంటాయి. స్క్రిప్ట్‌లు తమిళ్ సెన్సిబిలిటీస్‌తో తమిళనాడులో వచ్చిన విశ్వాసం, వీరం వంటి సినిమాల మాదిరిగా కాకుండా యూనివర్సల్ అప్పీల్ కలిగి ఉండేలా ఆయన చూసుకుంటున్నారు.

తమిళనాడు వెలుపల ఉన్న ప్రాంతాల్లో కోల్పోయిన వైభవాన్ని తిరిగి పొందేలా అజిత్ ఇకనైనా కొన్ని మార్పులు చేస్తే తప్ప ఆయన మార్కెట్ పెరగదు అనే చెప్పాలి. నిజానికి వాలి, ప్రియురాలు పిలిచింది తదితర చిత్రాలతో ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అజిత్ కు మంచి ఆదరణ లభించినా ఆ తర్వాత ఆయన ఇక్కడ డబ్బింగ్ సినిమాలని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల తెలుగులో మార్కెట్‌ను కోల్పోయారు.

మరో వైపు, విజయ్ తన చిత్రాలను డబ్బింగ్ చేయడానికి రిస్క్ తీసుకొని తుప్పాకి నుండి బలమైన మార్కెట్‌ను ఏర్పరుచుకున్నారు. ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ లాభాలను పొందుతున్నారు. ఇక వారిసు/వారసుడుతో తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమా చేయడం కూడా తెలుగు, ఓవర్సీస్ మార్కెట్‌ను మెరుగుపరుచుకోవడానికి సరైన దిశలో ఒక మంచి అడుగుగా ఉంటుంది.

Ajith’s Thunivu overseas rights sold for just 1/3 of Vijay’s Varisu

0

Ajith is the box office rival of Vijay. Both have started their journey as actors around the same time and enjoy a massive fan base. But the situation has changed, Vijay has gained the upper hand and his universal appeal is growing day by day. Though Ajith still enjoys good fan base in Tamil Nadu, his box office stamina in rest of India and overseas is little compared to Thalapathy.

Vijay and Ajith are locking horns for 2023 Pongal and their movies are high on demand, distributors are offering fancy prices to these movies. In Tamil Nadu both are having comparable trade deals but in overseas, Vijay is way ahead, putting Ajith’s Thanivu overseas deal to shame.

Varisu overseas rights were sold for 35 crores, but Ajith’s Thanivu could only get 13 crores deals. Ajith’s movies aren’t showing much impact in new audiences like Telugu states, Kerala, USA etc. unlike Vijay who is extending his influence beyond Tamil.

There are many reasons for this growing difference between the two. Script selection, directors, music, genres etc. constitute the box office appeal for a movie in new territories.

Vijay is making sure that he is working with most happening directors, his movies have good chart busters in the audio, scripts have universal appeal unlike movies like Viswasam, Veeram etc. which are based in Tamil Nadu with Tamil sensibilities.

Hope some changes are made by Ajith so that he regain the lost glory in territories outside Tamil Nadu. Movies like Vaali, Priyuralu pilichindi etc. had good reception in Telugu states, but later his movies lost the market here in Telugu.

On the other hand, Vijay established strong market since Thuppakki by taking the risk of dubbing his films, now he is reaping the benefits. Doing a movie with Telugu director Vamshi Paidipalli is also a good step in the right direction to improve Telugu and Overseas Market.

అవతార్-2 సినిమా పై ఆసక్తి కనబర్చని భారత డిస్ట్రిబ్యూటర్లు

0

ఒక సినిమా విడుదలకు చాలా రోజుల ముందు అయినా లేదా ఆలస్యంగా అయినా సినిమా ప్రమోషన్‌లో ట్రైలర్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ట్రైలర్‌ని బట్టి సినిమా చూడాలా వద్దా అన్నది ప్రేక్షకులే కాకుండా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా సినిమాను అంచనా వేయడానికి ట్రైలర్‌ పైనే ఆధారపడుతున్నారు. వారి కీలక వ్యాపార నిర్ణయాలు ట్రైలర్ వదిలిన ముద్ర పైనే ఆధారపడి ఉంటాయి. తాజాగా అవతార్2 ట్రైలర్ విషయంలోనూ అదే జరిగింది.

కొద్ది రోజుల క్రితం, అవతార్ 2కి బిజినెస్ సర్క్యూట్‌లలో క్రేజ్ ఆకాశాన్ని తాకింది. అయితే ట్రైలర్ విడుదలైన తరువాత ట్రేడ్ వర్గాల వారు కాస్త నిరాశ చెందారని తెలుస్తోంది. ఈ చిత్రం కు ఇంత భారీ మొత్తాన్ని రిస్క్ చేయాలా వద్దా అని ఇప్పుడు రెండో ఆలోచనలో పడ్డారట. ఇప్పటికే థియేట్రికల్ రైట్స్ కి ఫిక్స్ చేసిన ధర చాలా ఎక్కువ అని వార్తలు వస్తున్నాయి. దీంతో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లలో డైలమా నెలకొంది.

ఈ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్లు వ్యాపార వర్గాలలో సంబంధితంగా ఉండటానికి అధిక ధరలకు పెద్ద చిత్రాలను కొనుగోలు చేయవలసి వస్తుంది. అయితే తమకు భారీ నష్టాలు వస్తున్నాయని, నష్టాల్లో కొంత భాగాన్ని భర్తీ చేసేందుకు నిర్మాతలు తమకు సహాయం చేయడం లేదని వారు తరచూ ఫిర్యాదు చేస్తున్నారు.

అటువంటి ప్రమాదకర పరిస్థితిని నివారించడానికి, పంపిణీదారులు ఎంత పెద్ద సినిమాలైనా సరే వాటి పై పెద్ద పందెం వేయడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. అయితే, అవతార్2 దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇప్పటివరకు ఏ వైఫల్యాన్ని చూడని గ్రేట్ డైరెక్టర్ అనే విషయం తెలిసిందే.

“అవతార్: ది వే ఆఫ్ వాటర్” మొదటి భాగంలో జరిగిన సంఘటనల తర్వాత ఒక దశాబ్దం కంటే ఎక్కువ కాలం తర్వాత హీరో కుటుంబం (జేక్, నేయితిరి మరియు వారి పిల్లలు), వారిని అనుసరించే ఇబ్బందులు, వారు పడే కష్టకాలం గురించి చెప్తూ ప్రారంభమవుతుంది. ఒకరినొకరు సురక్షితంగా ఉంచుకోవడానికి, సజీవంగా ఉండటానికి వారు చేసే పోరాటాలు మరియు వారు అనుభవించే విషాదాల సమాహారంగా ఉండబోతుంది.

సుదీర్ఘ నిరీక్షణ మరియు అనేక వాయిదాల తర్వాత, లాస్ వెగాస్‌లోని సినిమా కాన్ 2022లో జేమ్స్ కామెరూన్ అవతార్ సీక్వెల్ యొక్క అధికారిక టైటిల్‌ను డిస్నీ ప్రకటించింది. ఈ చిత్రానికి అవతార్: ది వే ఆఫ్ వాటర్ అనే టైటిల్ ఖరారు చేశారు. మేకర్స్ ఇటీవల ఒక ఈవెంట్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ చిత్రం యొక్క ట్రైలర్‌ను భారీ స్థాయిలో ఆవిష్కరించారు.

Indian Distributors Exhibitors are now not interested in buying Avatar2

0

Trailer is so important in a movie’s promotion of late. Based on the trailer, not only the audiences are deciding whether to watch the movie, but also the distributors and exhibitors are relying on trailer to get the vibe of the movie. Their key business decisions are based on the impression the trailer leaves. The same happened with Avatar2 trailer.

Just a few days ago, the craze in business circuits for Avatar 2 was sky-high. However, the trailer has bit disappointed the trade circles. They are now having second thought whether to risk such huge sum of money. Already, the prices fixed for the theatrical rights are too much. This is causing a dilemma in exhibitors and distributors.

Distributors these days are forced to buy big films for exorbitant prices to stay relevant in the trade circles. But they are often complaining that they are incurring huge losses and producers aren’t helping them to compensate a portion of losses.

To avoid such risky situation, distributors are thinking twice to bet big. However, James Cameron the director of Avatar2 is a bankable director who has never seen any failure so far.

Set more than a decade after the events of the first film, “Avatar: The Way of Water” begins to tell the story of the Sully family (Jake, Neytiri, and their kids), the trouble that follows them, the lengths they go to keep each other safe, the battles they fight to stay alive, and the tragedies they endure.

After a long wait and several delays, the official title of James Cameron’s Avatar sequel was announced by Disney at Cinema Con 2022 in Las Vegas. Now known as Avatar: The Way of Water, the makers also unveiled the first trailer of the highly anticipated biggie recently at an event.

ఎట్టకేలకు ఖరారైన కాంతార ఓటీటీ రిలీజ్

0

కాంతార చిత్రం ఎలాంటి సంచలనం సృష్టించింది అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ సినిమాగా విడుదలై ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకి తెలుగు మరియు హిందీ బెల్ట్ నుండి అపారమైన ప్రశంసలు లభించాయి. కాగా గత కొన్ని రోజులుగా కాంతార OTT విడుదల కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

కానీ అది ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడింది. ఇక తాజాగా కాంతార చిత్రం నవంబర్ 24 నుండి ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుందని అమెజాన్ ప్రైమ్ సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

కాంతార సినిమా దక్షిణ భారత సంస్కృతిలో లోతుగా పాతుకుపోయిన కథతో కూడిన ఫాంటసీ థ్రిల్లర్. ఈ చిత్రం దైవిక శక్తులచే రక్షించబడిన భూమిని బలపరిచే గిరిజనుల జీవితాలను వర్ణిస్తుంది.

రిషబ్ శెట్టి ఈ మాస్ ఎంటర్‌టైనర్‌కి రచయిత, దర్శకుడు మరియు కథానాయకుడుగా వ్యవహారించారు. ఆయన డబుల్ యాక్షన్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను థ్రిల్ చేసింది మరియు 400 కోట్లకు పైగా వసూలు చేసి భారీ బాక్సాఫీస్ విజయాన్ని సాధించింది.

సప్తమి గౌడ కథానాయికగా నటించిన కాంతార భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన లాభాలు వచ్చాయి. రిషబ్ శెట్టి టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌కు పెద్దగా తెలియని హీరో అయినప్పటికీ, ఈ చిత్రం టైర్ 2 హీరోలతో సమానంగా కలెక్షన్లు రాబట్టింది. ఇక బాలీవుడ్‌లో ఈ సినిమా రన్ చూసి అటు ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి.

కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో పాటు ప్రేక్షకుల హృదయాలను చూరగొంటుంది, హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తనదైన ప్రత్యేక ఆకర్షణను నెలకొల్పింది. ఈ చిత్రం వివిధ పరిశ్రమల ప్రముఖుల నుండి గొప్ప సమీక్షలను అందుకుంటున్నప్పటికీ, సూపర్ స్టార్ రజనీకాంత్ రిషబ్ శెట్టిని తన చెన్నై నివాసంలో వ్యక్తిగత సమావేశానికి పిలిచి, అతని సూపర్ సక్సెస్ కోసం బంగారు గొలుసు మరియు లాకెట్‌ను బహుమతిగా ఇవ్వడంతో రిషబ్ శెట్టికి అతిపెద్ద కాంప్లిమెంట్ వచ్చింది.

అలాగే 50 ఏళ్లకు ఒకసారి వచ్చే సినిమా అంటూ కాంతార పై రజినీకాంత్ ప్రశంసలు కురిపించారు. ఈ ఉదంతం ‘కాంతార’ యొక్క పెరుగుతున్న వైభవానికి అదనపు బలాన్ని జోడించింది

కొత్త హీరో సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతున్న లవ్ టుడే

0

ప్రదీప్ రంగనాథన్! నటుడిగా మారిన ఈ యువ దర్శకుడు తాజా చిత్రం “లవ్ టుడే” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల విడుదలైన ఈ రొమాంటిక్ కామెడీ కోలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తోంది. ఇప్పటికే 40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం.

టైర్ 2 హీరోలకు కూడా ఈ నంబర్ చాలా పెద్దది. ఇటీవల విడుదలైన విక్రమ్, సూర్య, శివ కార్తికేయన్‌ల స్టార్‌డమ్‌ను అధిగమించిన ఈ సినిమా మంచి కంటెంట్ స్టార్ల కంటే ఎక్కువ శక్తివంతమైనదని మరో సారి నిరూపించింది. యూత్ ప్రేక్షకులు క్రేజీగా ఈ సినిమాకి కనెక్ట్ అయిపోతున్నారు.

తమిళ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన టైర్ 2 హీరోల కలెక్షన్లను ఈ సినిమా క్రాస్ చేయబోతోంది. ఇది రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్ లేదా శంకర్ వంటి టైర్ 1 స్టార్ల సినిమాల కంటే కొంచెం తక్కువగా ఉండవచ్చు. అలాంటి ప్రభావం చూపించడం కూడా సినిమాకి గౌరవమే కదా.

ఈ సినిమా టాలీవుడ్ లో గత సంవత్సరం విడుదలై ఘన విజయం సాధించిన ఉప్పెన లాంటిదని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. తొలి చిత్రంతో ఒక హీరో యూత్‌ఫుల్ కంటెంట్‌తో రికార్డులను బద్దలు కొట్టడం చాలా అరుదుగా జరుగుతోంది. ఏ పరిశ్రమలోనైనా ఇది అరుదైన ఘనతే. ఒక సినిమా విజయవంతం అవ్వాలి అంటే కంటెంట్ ఏ కింగ్ అని మరోసారి రుజువు చేసింది.

ఈ సినిమాకి దర్శకుడిగా కూడా పని చేసిన ప్రదీప్ రంగనాథన్ సినిమా సక్సెస్‌లో డబుల్ క్రెడిట్ కొట్టేశారు. ఈ నూతన నటుడు గతంలో జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా కోమలి అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.

తమిళ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తర్వాత, లవ్ టుడే తెలుగులోకి డబ్బింగ్ వెర్షన్‌గా విడుదల కానుంది. అయితే, మహేష్ బాబు తండ్రి, ప్రముఖ నటుడు కృష్ణ దురదృష్టవశాత్తు మరణించిన కారణంగా నవంబర్ 15 న విడుదల కావాల్సిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ట్రైలర్ వాయిదా పడింది. ఈరోజు నవంబర్ 17న ఉదయం 10 గంటలకు తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు.

https://twitter.com/TheDeverakonda/status/1593099118284804097?t=cEV90uvHpIjLvjnqcfXdsg&s=19

తెలుగు వెర్షన్ విడుదల తేదీని నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. మొదట్లో, వారు నవంబర్ 18న ఈ సినిమాని విడుదల చేయాలని చూశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు యొక్క శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లవ్ టుడే తెలుగు వెర్షన్‌ను పంపిణీ చేయనుంది.

Finally Amazon Prime confirms Kantara OTT streaming date

0

Kantara is the latest sensation. It has become a Pan-Indian blockbuster with immense appreciation from Telugu and Hindi belt. It’s OTT release is much awaited, but the date has been postponed a couple of times already. Amazon Prime has confirmed now that movie will be premiered from November 24th.

Kantara is a fantasy thriller with a very rooted story in South Indian culture. The movie depicts the lives of a vulnerable tribal whose land is protected by the divine powers.

Rishab shetty is the writer director and the leading actor of this mass entertainer. His double action has thrilled audiences across the nation and made it a huge box office success, grossing over 400 crores.

Sapthami Gowda is the leading lady. The movie that was shot in a shoestring budget got unbelievable profits. Rishab is a new face for tollywood as well as Bollywood, but it got collections on par with tier 2 heroes. It’s run in Bollywood is even more mind boggling beating pushpa as well.

Be it the box office or the hearts of the audience, Hombale Films ‘Kantara’ has set its distinct charm across the world. While the film has been receiving great reviews from prominent personalities of different industries, the biggest compliment came for Rishab Shetty when superstar Rajinikanth called Rishab Shetty for a personal meet at his Chennai residence and gifted him a gold chain and locket for the super success of his film Kantara.

Also seen praising the film while calling it a film that happens once in 50 years. This has again added an extra feather to the rising glory of ‘Kantara

Raj Tarun’s web series is streaming on OTT now

0

Aha Naa Pellanta is the latest web series of Raj Tharun. Its season 1 is now streaming on OTT platform, ZEE 5. This eight-episode series centers on a bride who escapes with her ex-boyfriend and leaves the groom waiting in the mandap. The story unfolds when this man decides to take revenge.

https://twitter.com/ZEE5Telugu/status/1589568944603795457?t=QrciRx6Rr78OS0tVKwEQHA&s=19

The series is a humorous take on revenge and an irrational oath which changes the protagonist’s fate forever.

Raj Tharun is known for his trademark comedy timing. He has already done a few successful romcoms. This web series also provides ample entertainment ideal for a family to watch on a weekend.

The series is also available in three languages, Telugu, Tamil and Hindi. Shivani Rajashekar is playing the lead actress role. Senior actress Aamani, Harsha Vardhan are doing supporting roles. Get up seenu comedy has been another highlight. The mouth talk about this web series is super positive. Go check it out for clean entertainment.

Raj Tharun rose to a good position in the tier-2 heroes list with continuous super hits at first, but eventually faced back to back flops. Looks like Aha Naa Pellanta has brought the much-needed success to this energetic hero.

Debutant is breaking the records at Tamil Box office with Love Today

0

Pradeep Ranganathan! This young director turned actor has created sensation at box office. The romantic comedy that has released recently by the name ‘Love Today’ is ruling the Kollywood box office. It has already got gross collection of 40 crores.

This is huge even for tier 2 heroes. The recent releases of Vikram, Suriya, Siva Karthikeyan haven’t gone this much showing the power of good content that can surpass stardom. Youth are getting connected to this movie like crazy.

The movie is going to cross the collections of the highest grosser of tier 2 heroes. It may only be short of the movies of the tier 1 stars like Rajinikanth, Kamal Hassan, Vijay, Ajith or Shankar.

This movie is like Uppena of Tollywood. A debutant hero beating records of established hero with youthful content. It’s a rare feat in any industry, but this once again proves that content is king. Also being the director of the movie he must get the double credit in the success.

This debutant actor directed a movie called Comali in the past starring Jayam Ravi and Kajal Agarwal.

After winning the hearts of Tamil audience, and now it will release as dubbed version of Telugu. However, the trailer for the rom-com drama which was to released on Nov 15 has been postponed due to the unfortunate demise of the veteran actor Krishna, Mahesh Babu’s father. The Telugu trailer has been released by Vijay Devarakonda on today.i.e Nov 17 at 10 AM.

https://twitter.com/TheDeverakonda/status/1593099118284804097?t=NSaCTdieZg-NSbHlRjiUUQ&s=19

The release date of Telugu version is yet to be announced by the makers. Initially, they eyed Nov 18 release. Celebrated producer Dil Raju’s Sri Venkateswara Creations will be distributing the Telugu version of Love Today.

పారితోషికాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితిలో బాలీవుడ్ స్టార్స్

0

బాలీవుడ్ స్టార్ హీరోలు ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. గత కొంత కాలంగా వారు తమ రెమ్యునరేషన్‌ను పెంచేస్తున్నారు. కానీ ఈ రెమ్యునరేషన్‌లో పెరుగుదల ఇటీవల నిలిచిపోయింది. ఎందుకంటే బాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం అంత బాగా లేదు. కరోనా ముందు ఉన్న పటిష్టంగా ఇప్పుడు లేనే లేదు.

బాలీవుడ్ అనేక కారణాల వల్ల ఒత్తిడికి గురవుతోంది. సౌత్ ఇండియన్ సినిమాల డామినేషన్, స్వంత సినిమాల బహిష్కరణ ప్రచారాలు, డిజాస్టర్ సినిమాల పరంపరలు ఇలా అన్నీ బాలీవుడ్‌కి కష్టాలు తెచ్చిపెడుతున్నాయి.

బాలీవుడ్ సినిమాల కంటే సౌత్ సినిమాలే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారతదేశంలోని మల్టీప్లెక్స్‌ల ఆదాయంలో 60% దక్షిణ భారత సినిమాల నుండి వస్తోంది, ఇది బాలీవుడ్‌పై ఆధిపత్యానికి స్పష్టమైన సంకేతంగా చెప్పుకోవచ్చు.

తెలుగు, కన్నడ, తమిళ భాషల డబ్ సినిమాలు బాక్సాఫీస్‌ను శాసిస్తున్నాయి. పుష్ప, RRR, KGF2, చార్లీ, విక్రమ్, కాంతార వంటి భారీ ప్యాన్ ఇండియా విజయాలే ఇందుకు తాజా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ఇది బాలీవుడ్ తారల రెమ్యునరేషన్‌లో కూడా ప్రతిబింబిస్తుంది. గతంలో సూపర్ స్టార్లు ఒక సినిమాకి దాదాపు 100 కోట్ల దాకా వసూలు చేసేవారు, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. పెద్ద సినిమాల కలెక్షన్లు 100 కోట్లకు పైగా వసూలు చేయలేకపోవడం ట్రేడ్‌ను షాక్‌కు గురిచేస్తోంది. బడ్జెట్‌లో ఎక్కువ భాగం వారి జేబుల్లోకి వెళుతుంది కాబట్టి హీరోలు తమ జీతాలను స్థిరంగా తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది.

జనవరిలో షారుఖ్ ఖాన్ యొక్క పఠాన్ మరియు రంజాన్ కి సల్మాన్ యొక్క కిసీ కా భాయ్ కిసీ కా జాన్ వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నందున, బాలీవుడ్ పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని కోరుకుందాం. ఆ తర్వాత మోస్ట్ ఎవైటెడ్ బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కూడా ఉంది. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయితే బాలీవుడ్ కి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకు రావడంలో బాగా పని చేస్తాయి.