Home Blog Page 2061

Chiranjeevi’s Indra producers confirm the re-release

0

It’s raining re-releases in Tollywood. After Mahesh Babu’s Pokiri, Pawan Kalyan’s Jalsa, the next in line is Megastar Chiranjeevi’s Indra. Incidentally, there are even plans of screening Chiranjeevi’s Blockbuster Gharana Mogudu as well.

The news about Chiranjeevi’s Indra re-release was shared by film producers Vyjayanthi Makers on social media much to fans’ ecstasy.

While the exact date of the film’s screening has not been revealed yet, the news of the release has surely sent a wave of excitement among film lovers. Indra is an extremely special film not just for Megastar fans but for all sections of the audience.

Directed by B. Gopal, Indra featured Chiranjeevi, Sonali Bendra and Aarti Agarwal in the lead roles. On its release, this action entertainer became the highest grossing south Indian film of the time and ran for 175 days in over 30 centers and 100 days in 122 centers.

Aswini Dutt bankrolled this film under Vyjayanthi Movies. Chiranjeevi’s intense and massy performance, stylish dances, and Mani Sharma’s chartbuster music made fans go gaga back in 2002. Now, after 20 years, the celebrations will surely be a few levels bigger!

Nikhil’s Karthikeya 2 Heading towards Huge blockbuster, Day2 Box-office Update

0

Nikhil’s Karthikeya has got off to a great start and garnering applause from all the regions. Despite a limited release, the film hit the Rs 5 crores mark on Day 1. This figure is only going to increase on Day 2 and Day 3.

The film is holding excellent on Day 2 and if the current trend goes on, Nikhil’s Karthikeya 2 will actually cross the Rs 30 crores mark. Even for the Hindi version, the response has been tremendous and many shows are being added in the north belt.

Nikhil’s performance, Chandoo Mondeti’s gripping narration, and Kaala Bhairava’s terrific BGM were the main highlights of the film.

A sequel to the 2014 film, Nikhil’s Karthikeya 2 also stars Anupama Parameswaran, Srinivas Reddy, and Anupam Kher in key roles.

కార్తికేయ-2 విజయం నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం – అభిషేక్ అగ‌ర్వాల్

0

యువ హీరో నిఖిల్ మరియు చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన కార్తికేయ (2014) చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన చిత్రం కార్తికేయ‌ 2. ఈ శనివారం అంటే ఆగస్ట్ 13న ఈ చిత్రం విడుదల అయింది. ఇక ప్రేక్షకులు కార్తికేయ -2 సినిమాకి ఏకంగా బ్రహ్మరథం పట్టారు అని చెప్పవచ్చు. ఓవర్సీస్, నార్త్ ఇండియా, ఆంధ్రా, తెలంగాణ ఇలా అన్ని చోట్ల నుండి ఈ సినిమా అద్భుతమైన స్పందనను రాబట్టుకుని ఘనవిజయం సాధించే దిశగా దూసుకు పోతుంది. ఈ సంధర్బంగా కార్తికేయ- 2 చిత్ర బృందం థాంక్స్ మీట్ ను నిర్వహించారు.

ఆ క్రమంలో చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడారు. దర్శకుడు చందు మొండేటి తనకు కథ చెప్పిన దానికంటే తెర పైన ఇంకా అద్భుతంగా సినిమాను తీశారని చెప్తూ, తనకు ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించినందుకు దర్శకుడు చందూ మొండేటికు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ సినిమాకి అని చోట్లా ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తుందని చెబుతూ.. కార్తికేయ 2 ఇతర సాంకేతిక నిపుణలకు కూడా అనుపమ పరమేశ్వరన్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆ పైన దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ.. కరోనా పాండమిక్ తాలూకు రెండు వేవ్ లను, మరియు ఇతర అనుకోని సమస్యలను ఎదుర్కుని ఈ సినిమా విడుదల అయిందని చెప్పారు. ఈ సినిమా విజయం సాధించడంతో విడుదలకు ముందు పడ్డ కష్టాలన్నిటినీ మర్చిపోయామని అన్నారు. కాగా ఈ సినిమాకి వస్తున్న విశేషమైన స్పందన చూసి ఆయన ఎంతో భావోద్వేగానికి గురైనట్లు చెప్పారు. చివరిగా ఈ సినిమా విజయం సాధించడం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్తూ కార్తీకేయ 2 చిత్రానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు చందూ మొండేటి.

ఇక హీరో నిఖిల్ మాట్లాడుతూ… సినిమా విడుదలకు ముందు నుంచీ మద్దతుగా నిలిచినమీడియా వారికి థాంక్స్ చెప్పారు, అలాగే ఈ చిత్రానికి మొదటి షోలు పడిన యూఎస్ దగ్గర నుంచి పాజిటివ్ టాక్ వచ్చినా.. తుది ఫలితం కోసం ఎదురు చూసినట్లు తెలిపారు. కాగా సినిమా షో పూర్తవగానే ఫోన్ కాల్స్ ద్వారా అభినందనలు వచ్చాయని చెప్పారు.అన్నీ ఏరియాలలో కూడా కార్తీకేయ 2 హౌస్ ఫుల్ లను నమోదు చేసినట్లు తెలియగానే ఎంతో సంతోషించామని. తమ సినిమా హిట్ అవ్వాలని చాలామంది కోరుకున్నట్లు కూడా నిఖిల్ తెలిపారు. రేపు ఎల్లుండి కూడా బుకింగ్స్ బాగున్నాయని. ఇది ఇలానే కొనసాగుతుంది అని తను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక చందూ మొండేటి చక్కని కథను రాసుకోవడమే కాకుండా దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారని చెబుతూ.. కార్తికేయ 2 చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన అభిషేక్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, కార్తికేయ-2 చిత్ర ఘన విజ‌యం ఇటీవలే స్వర్గస్తులైన ప్రముఖ నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారికి అంకితం ఇస్తున్న‌ట్లు పేర్కొన్నారు. అటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవ‌ర్‌సీస్‌లోనూ సినిమా మంచి ఆద‌ర‌ణ పొందుతోంద‌ని తెలిపారు.

“నేను మీకు బాగా కావాల్సిన‌వాడిని” చిత్రం నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదల

0

యంగ్ సెన్సేషన్ కిరణ్ అబ్బవరం హీరోగా కోడి రామ‌కృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాత‌గా త‌న ప్రొడ‌క్ష‌న్ నెం 1 గా కోడి దివ్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ లో చేస్తున్న సినిమా నేను మీకు బాగా కావాల్సినవాడిని. S R కళ్యాణమండపం లాంటి సూపర్ హిట్ చిత్రం తర్వాత.. అదే కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాజావారి రాణిగారు, ఎస్ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం లాంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బ‌వ‌రం.. ఇందులో చాలా కొత్తగా కమర్షియల్ గా కనిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి “నచ్చావ్ అబ్బాయి” పాట విడుదలైంది.

ఇదివరకే విడుదలైన ఈ సినిమా పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ చిత్రం నుండి ఒక మాస్ బీట్ ను రిలీజ్ చేసారు. “నచ్చావ్ అబ్బాయి” పాటలో కిరణ్ అబ్బవరం వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ అద్బుత‌మైన సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఆడియోని ల‌హ‌రి ద్వారా మార్కెట్ లోకి తీసుకు వస్తున్నారు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా వస్తోంది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మాస్ లుక్ లో అంద‌ర్ని ఆక‌ట్టుకుంటున్నాడు. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

OTT లో కూడా చక్కని స్పందన పొందుతున్న సాయి పల్లవి గార్గి

0

సాయి పల్లవి నటించిన గార్గి సినిమా ఈ వారం ఓటిటి లో విడుదలైన సంగతి తెలిసిందే. సోనీ లివ్‌ యాప్ లో ఈ చిత్రం ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటిటిలో విడుదలైనప్పటి నుండీ గార్గి చిత్రం అన్ని వర్గాల నుండి ప్రశంసలు అందుకుంటుంది. కాగా ఈ సినిమా జూలై 15న థియేటర్లలో విడుదలై చక్కని స్పందనను తెచ్చుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ గా కూడా ఈ చిత్రం హిట్ అయింది. ఇక ఎప్పటిలానే నటిగా సాయి పల్లవికి గొప్పగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

గార్గి సినిమా తమిళం, తెలుగు మరియు కన్నడ భాషలలో విడుదలైన బహుభాషా చిత్రం. కోర్టు రూం డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో విశేషం ఏమిటంటే అన్ని వెర్షన్లలోనూ సాయి పల్లవి తన పాత్రకి తానే స్వంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇక ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకులు ఫిదా అయిపోయారు. అంతే కాకుండా ఖచ్చితంగా ఇది ఆమె కెరీర్ లోనే ఉత్తమ నటనగా పేర్కొన్నారు.

గౌతం రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమిళ నటుడు కాళీ వెంకట్ ఒక కీలక పాత్రలో నటించారు. సాయి పల్లవి గార్గి సినిమాని బ్లాక్కీ, జెనీ & మై లెఫ్ట్ ఫుట్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. స్టార్ హీరో సూర్య ఈ చిత్రాన్ని తమిళంలో సమర్పించారు. ఇక ఈ సినిమాని చూసి మెచ్చిన ప్రేక్షకులు మరియు పలు విమర్శకులు ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

ఇక సాయి పల్లవి తన తదుపరి చిత్రంలో తమిళ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రం కమల్ హాసన్ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాని గత సంవత్సరం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం స్టార్ హీరోగా శివ కార్తీకేయన్ ఎదుగుతున్నారు. కావున ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సినిమా ఫలితం పై ప్రభావం చూపుతున్న దర్శకుల వ్యాఖ్యలు

0

ఒక సినిమా విజయాన్ని అందులో ఉన్న కంటెంట్ మాత్రమే నిర్ణయించే రోజులు ఇప్పుడు లేవు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కంటెంట్‌తో పాటు, ఆ సినిమాని ఎలా ప్రచారం చేశారు? సోషల్ మీడియాలో ఆ చిత్రానికి సంబంధించిన వారు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు లేదా గతంలో చేసి ఉన్నారు వంటి అంశాలు కూడా సినిమా కలెక్షన్‌ల పై ప్రభావం చూపుతున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ వారం బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా పరాజయం అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అమీర్ ఖాన్ చిత్రం విడుదలకు కొన్ని వారాల ముందు నుంచి సినిమాను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు. అందుకు ఆయన గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం.

ఇక తెలుగు సినిమా పరిశ్రమకు కూడా అలాంటి ప్రతికూల పరిస్థితుల ప్రభావం ఈ మధ్యనే అనుభవం లోకి వచ్చింది. ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ, మాచర్ల నియోజకవర్గం అనే రెండు సినిమాలకు అలాంటి అనుభవం ఎదురయింది.

రామారావు ఆన్ డ్యూటీ దర్శకుడు శరత్ మండవ.. ట్విట్టర్ రివ్యూలను నమ్మడం గురించీ, మరియు సినిమా చూస్తూ లైవ్ లో వ్యాఖ్యానించేప్రేక్షకులపై వ్యంగ్యంగా మాట్లాడారు. ఆ ప్రభావం వల్ల చిత్రం విడుదలకు ముందే నెగటివ్ టాక్ దిశగా పయనించింది. ఆ సినిమాలో సరైన సరుకు లేనందువల్లనే సినిమా ఫ్లాప్ అయిన మాట వాస్తవమే అయినప్పటికీ.. దర్శకుడి అనవసర వ్యాఖ్యల ప్రభావం సినిమాపై ఖచ్చితంగా ఉండిందని ఒక వాదన బలంగా వినిపిస్తుంది.

నిన్న విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమాకి కూడా అదే విధంగా జరిగింది. ఆ చిత్ర దర్శకుడు M.S రాజశేఖర్ రెడ్డి, గతంలో చేసిన ట్వీట్‌లను లక్ష్యంగా చేసుకుని.. ఆయన లోగడ చేసిన కుల వ్యతిరేక వ్యాఖ్యలను విస్తృత ప్రచారం చేసి ఆయా ట్వీట్లను కొందరు సోషల్ మీడియాలో ట్రెండ్ చేసారు. ఆ వ్యవహారం వల్ల వైసీపీఎతర అభిమానుల్లో మాచర్ల నియోజకవర్గం సినిమా పై తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఆ ట్వీట్లు తనవి కావని ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి సైబర్ క్రైమ్ కేసు కూడా నమోదు చేసినా జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోయింది.

ఈ రెండు సంఘటనలు సినిమా ఇండస్ట్రీ వర్గాలకి ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. ఎప్పుడైనా సరే పబ్లిక్ లో మాట్లాడేటపుడు లేదా ఫలానా విషయం మీద ఏమైనా స్టేట్‌మెంట్‌ లను ఇచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని.. ఎందుకంటే ఏ సమయంలో ఏ విషయాన్ని బయటకు తీసి అవి వివాదానికి కారణం అవుతాయి అనేది తెలియదు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవకుండా తెలుగు సినీ పరిశ్రమ సభ్యులు అందరూ జాగర్త పాటిస్తారని ఆశిద్దాం.

NMBK’s New Lyrical Nachavabbai Is Catchy!

0

Nenu Miku Baga Kavalsinavadini is the next project of young hero Kiran Abbavaram. The star-in-the-making has already a plethora of movies in his bag. Other than NMBK, he has Vinaro Bhagyamu Vishnu Katha, Meter, Rules Ranjan. Each movie has a different storyline and looks interesting. Now, regarding NMBK, the team announced a while back that the mass song Nachavabbai’s lyrical will be out on the 14th of August. Today, they released the song and kept their word.

The song has a very catchy tune and lyrics provided by Manisharma and Bhaskar Bhatla respectively. Kiran seems to have eased into the mass hero role as he has performed the steps with grace. Alongside the hero, actress Sanajan Anand has heated up the screen with her glamour. With the vocals of Dhanunjay Seepana and Lipsika, the song could become an instant chartbuster. Manisharma once again showed why is one of the best in his field. It’s noteworthy that late legendary director Kodi Ramakrishna’s daughter Kodi Divya Deepthi is producing this film on the banner Kodi Divya Entertainments. Sridhar Gade is directing the flick.

The film is said to be a commercial genre with a very different storyline. The movie team are very confident that the film will have a good time in the theatres. It will hit the silver screens on 9th September.

Nikhil’s Karthikeya 2 Day 1 Worldwide Box-office Collections

0

After multiple release date postponements, Nikhil’s Karthikeya 2 was released yesterday to packed houses and positive reviews. The film has received good word of mouth from the audience and performed well on Day 1 giving huge relief to Karthikeya 2 makers.

Despite the limited release, the adventure thriller has managed to record impressive figures on Day 1. The film collected around Rs 5 crores and looking at its solid performance, many theatres are being added across the territories.

Karthikeya 2 did a good opening in Hindi as well and many theatres are being added in the northern regions as well. Nikhil’s performance, Chandoo Mondeti’s gripping narration, and Kaala Bhairava’s terrific BGM were the main highlights of the film.

Day 2 numbers are expected to be much bigger than Day 1 and with Independence Day coming up on Day 3, the numbers are surely going to bring a smile on the producer’s face.

A sequel to the 2014 film, Nikhil’s Karthikeya 2 also stars Anupama Parameswaran, Srinivas Reddy, and Anupam Kher in key roles.

త్వరలోనే మొదలు కానున్న దృశ్యం-3

0

మోహన్‌లాల్ అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. వారి ఆశలు నిజమయ్యేలా, వారు ఆనందంతో పొంగిపోయే వార్త ఒకటి బయటకి వచ్చింది. దర్శకుడు జీతూ జోసెఫ్ దృశ్యం 3 ప్లాన్‌లో ఉందని, త్వరలో మరిన్ని వివరాలను ప్రకటిస్తామని ప్రకటించారు.

2013లో విడుదలైన దృశ్యం మొదటి భాగం సూపర్ హిట్ గా నిలవడంతో పాటు ఎన్నో ప్రశంసలను అందుకుని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా విజయం సాధించి ఒక అద్భుతమైన సినిమాగా నిలిచింది.

గత ఏడాది ప్రారంభంలో దృశ్యం సీక్వెల్‌ అయిన దృశ్యం 2 సినిమా విడుదల అయింది , కరోనా ప్యాన్డేమిక్ నేపథ్యంలో ఆ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా OTTలో ప్రదర్శించబడింది. దృశ్యం సీరీస్ అంటే కేవలం మలయాళ ప్రేక్షకులకి మాత్రమే కాదు తెలుగు, తమిళ, కన్నడ మరియు హిందీ భాషల్లో కూడా ఆ ఫ్రాంచైజీకు భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు.

తమిళ రీమేక్ అయిన ‘పాపనాశనం’లో కమల్ హాసన్ నటించగా, తెలుగులో వెంకటేష్ హీరోగా ‘దృశ్యం’ సినిమాను తీశారు. హిందీ వెర్షన్‌లో కూడా ‘దృశ్యం’ అనే పేరు తోనే అజయ్ దేవగన్‌ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు, ఇక కన్నడ రీమేక్‌ ను ‘దృశ్య’ అనే టైటిల్‌తో రవిచంద్రన్ హీరోగా చేశారు.

ఇక సీక్వెల్ విషయానికి వస్తే, తెలుగులో విక్టరీ వెంకటేష్ అదే రాంబాబు పాత్రలో సీక్వెల్ లో నటించారు. ఇక కన్నడలోను మళ్ళీ రవి చంద్రన్ హీరోగా దృశ్యా 2 లో కనిపించారు. అయితే తమిళ వెర్షన్ తెరలెక్కలేదు. పలు నటుల పేర్లు వినిపించాయి కానీ ఏదీ అధికారిక ప్రకటన రాలేదు. ఇక హిందీలో అజయ్ దేవగణ్ మళ్ళీ సీక్వెల్ లోనూ కనిపిస్తారని వార్తలు వచ్చినా, ఆ చిత్రం గురించి కూడా ఎలాంటి వార్తా బయటకి రాలేదు.

మోహన్ లాల్ కు నటుడిగా ఎంతో పేరు తెచ్చి పెట్టిన దృశ్యం చిత్రంలో మీనా, ఆశా శరత్, ఎస్తేర్ అనిల్, సిద్ధిక్ మరియు అన్సిబా హసన్ కీలక పాత్రల్లో నటించారు. దృశ్యం 3కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ సీక్వెల్ కోసం కేవలం మోహన్ లాల్ అభిమానులు మాత్రమే కాకుండా ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. వారికి అంతే ఉత్సాహాన్ని అందించే మరిన్ని అప్‌డేట్‌ లు త్వరలోనే ఉన్నాయి.

టాలీవుడ్ ను చూసి బాలీవుడ్ నేర్చుకోవాలి – అక్షయ్ కుమార్

0

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. చాలా కష్ట కాలంలో నడుస్తున్న ఆ పరిశ్రమకు భూల్ భూలయ్యా 2, ది కాశ్మీర్ ఫైల్స్ మరియు జుగ్ జుగ్ జగ్ జియో వంటి కొన్ని సినిమాలు మినహా, చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా పరాజయం పొందాయి. తద్వారా ట్రేడ్ వర్గాల గందరగోళంలోకి నెట్టేశాయి.తాజాగా ఈ వారం విడుదలైన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా మరియు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన రక్షా బంధన్ రెండు సినిమాలు కూడా ఏవరూ ఊహించని రీతిలో భారీ డిజాస్టర్లుగా మారాయి.

ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కాయి. కాగా హాలిడే వీకెండ్ కు కాస్త మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమాలు భారీ విజయం సాధించి బాలీవుడ్ కి పూర్వ వైభవం తీసుకు వస్తాయని ట్రేడ్ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ రెండు సినిమాల ద్వారా మార్కెట్‌ తిరిగి పుంజుకుంటుంది అని భావించాయి. కానీ వారి ఆశలన్నీ అడియాశలు చేస్తూ లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ సినిమాలు భారీ డిజాస్టర్లు గా నిలిచాయి.

ఈ పరిస్థితి గురించి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మాట్లాడుతూ, బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ ను చూసి నేర్చుకోవాలని, వారి పంథానే అనుసరించాలని సూచించారు. అక్షయ్ కుమార్ నటించిన మూడు సినిమాలు బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షా బంధన్ ఈ ఏడాది విడుదలయి పరాజయం పాలయ్యాయి.

ప్రస్తుతం తెలుగు పరిశ్రమ సరైన రీతిలో తమ పునరుద్ధరణ జరుపుకుంతుందని నేను నమ్ముతున్నాను, సినిమాలు నిర్మించే క్రమంలో ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయి అనే విషయం పై వారు ఆలోచిస్తున్నారు. ఈ సమస్యకి వారు సరైన పరిష్కారంతో ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను. హిందీ పరిశ్రమ కూడా అదే తరహాలో పని చేస్తే, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను అని అక్షయ్ కుమార్ అన్నారు.

మరి అంత అనుభవం కలిగిన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇలా వ్యాఖ్యానించారు అంటే అందులో ఎంతో కొంత నిజం ఉండే ఉంటుంది. మరి ఆయన ఆశించినట్లుగా, ఎక్కడ తప్పు జరుగుతుందో అన్న విషయం బాలీవుడ్ ఇండస్ట్రీ పసిగట్టి తిరిగి మంచి రోజులు వచ్చే దిశగా అడుగులు వేస్తుందని ఆశిద్దాం.