Home Blog Page 2059

Karthikeya 2 Is Another Example Of The Craze For Sequels At Box Office

0

Karthikeya 2 was released in theatres on 13th August and opened to good first-day collections at the box office. The positive word of mouth further helped the film to post extraordinary collections on Day 2 and Day 2 subsequently.

The prequel to Karthikeya 2 was also a massive success and is partly responsible for the hype for Karthikeya 2 today. This is not a very uncommon trend for sequels to generate a lot of buzz among the audiences.

We have seen in this the past with movies like Baahubali: The Conclusion and KGF Chapter 2. Both the films have posted tremendous collections just because of franchise value. These two are huge blockbusters in both languages. In fact, KGF Chapter 2 being a Kannada film, did 100 crores in share for the Telugu version alone.

Now Karthikeya 2 is also doing excellent revenues with just decent ratings and reviews. The movie is performing on par with some tier 2 range heroes. In fact, it is also outshining some tier 2 heroes movies. This is also the highest ever revenue for a Nikhil film.

If a small franchise like Karthikeya can amass such audiences then the range of Pushpa will be astounding. Karthikeya 2 also stars Anupama Parameswaran, Srinivas Reddy, and Viva Harsha. Chandoo Mondeti is the director of the film and Kaala Bhairava is the music director.

మాచర్ల నియోజకవర్గం ఓటిటి రిలీజ్ డేట్

0

యువ హీరో నితిన్..ఎడిటర్ నుండి దర్శకుడిగా మారిన ఎం ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వంలో నటించిన మాచర్ల నియోజకవర్గం ఈ శుక్రవారం అంటే ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజునే డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజు వరకూ బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదు అనిపించినా.. రెండవ రోజు నుంచి మరీ దారుణంగా పడిపోయింది. విడుదలకు ముందు సినిమా పై మంచి హైప్ ఉన్నప్పటికీ, ప్రేక్షకులను సినిమా హాళ్ల వద్దకు రప్పించడంలో విఫలమైంది.

అందుకు ప్రధాన కారణం సినిమా మరీ మూస ఫార్ములాతో తెరకెక్కించడమే. దశాబ్ద కాలం నాటి సినిమాల తరహాలో పరమ రొటీన్ సన్నివేశాలు.. ఓవర్ ది టాప్ ఫైట్లు, త్రాసులో కొలిచినట్లు ఉండే పాటలు, కొన్ని కామెడీ సన్నివేశాలు మరియు పవర్ ఫుల్ మాస్ డైలాగ్స్ ఇలా ఎప్పుడో అరిగిపోయిన రికార్డు స్థాయిలో సినిమా రూపొందటం వలన ప్రేక్షకులు ఈ చిత్రాన్ని తిప్పికొట్టారు.

ఈ ఫార్ములా ఒకప్పుడు పని చేసేది ఏమో కానీ ప్రస్తుతం ప్రేక్షకులు అలాంటి ఫార్ములా కంటెంట్ చూడటానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. సినిమాలో ఏదో ఒక కొత్తదనం లేదా ఆసక్తికరమైన విధంగా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ల వద్దకు పోటెత్తుతారు అనడానికి సీతా రామం, బింబిసార చిత్రాల విజయమే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా మరో నాలుగు వారాల్లో ఓటిటి విడుదలకు సిద్ధంగా ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సెప్టెంబర్ 9న అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్‌ఫామ్‌లో ఈ చిత్రం విడుదల కానుందట. అంటే 4 వారాల గ్యాప్ తర్వాత ఓటీటీలో సినిమాను విడుదల అవుతుంది అన్నమాట. ఇటీవల తెలుగు సినిమా నిర్మాతల మండలి సూచనల మేరకు ఆరు వారాల తరువాత సినిమాని విడుదల చేయాలనే నిబంధనకు విరుద్ధంగా విడుదల అవుతుంది. అదేంటని అడిగితే చాలా సింపుల్ గా జూలై నెల కంటే ముందే ఓటిటి ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్తారు కావచ్చు.

మాచర్ల నియోజకవర్గం సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలు గా నటించగా, సముద్రఖని విలన్ పాత్రను పోషించారు. ఈ చిత్రానికి రాజశేఖర్ రెడ్డి దర్శకుడు కాగా మహతి స్వర సాగర్ సంగీత దర్శకుడుగా పని చేశారు.

నన్ను సూపర్ స్టార్ అని పిలవద్దు – విజయ్ దేవరకొండ

0

హీరోగా విజయ్ దేవరకొండ పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. అర్జున్ రెడ్డి చిత్రంతో వెలుగులోకి వచ్చిన విజయ్, పరిశ్రమలోకి వచ్చి దాదాపు దశాబ్దం కాలం నుండి ఉన్నారు, అయితే ఎట్టకేలకు 2017 లో బ్రేక్ సాధించిన విజయ్ ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల లోనే కాకుండా ఇతర పరిశ్రమలో కూడా క్రేజ్ ను సంపాదించుకుని ప్యాన్-ఇండియా ఫాలోయింగ్‌ను సాధించారు, అంతే కాకుండా పలు ప్రఖ్యాత జాతీయ టీవీ షోలు మరియు ప్రకటనలలో కనిపించారు.

ఒక స్టార్ గా ఆయన బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు చాలా మంచి స్థాయిలో ఉండడంతో, చాలా మంది విజయ్‌ దేవరకొండను టాలీవుడ్‌లోని సూపర్ స్టార్‌లలో ఒకరిగా లెక్కించడం ప్రారంభించారు. అయితే, ఆ స్థానం దక్కాలంటే తను చాలా దూరం ముందుకు వెళ్లాల్సి ఉందని, ఇంకా స్టార్ అని పిలిపించుకునే అర్హత తనకు లేదని ఎంతో వినయంగా నిరాకరించారు విజయ్.

నిన్న వరంగల్‌లో జరిగిన లైగర్ ఫ్యాండమ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ తనను సూపర్ స్టార్ అని పిలవవద్దని అభిమానులు మరియు మీడియాతో ప్రస్తావించారు, ఈ సందర్భంలో.. “నేను సూపర్ స్టార్‌ని కాదు, నన్ను అలా పిలవద్దు.. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ స్థానంలో రావడానికి తగిన పనులు నేను ఇంకా చేయలేదు.. చేయాలి. ,” అని విజయ్ వివరించారు.

ఇక ఇదే క్రమంలో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, పూరి తన కెరీర్‌కు గొప్ప మార్గదర్శక శక్తి అని చెప్పారు. అలాగే పూరి డైలాగులు పలకాలంటే ఏ నటుడికైనా అదృష్టంతో పాటు దేవుడి ఆశీస్సులు ఉండాలని, అవి తన పై ఉండడం వల్లే ఆ అవకాశం దక్కిందని చెప్పారు. ఇక పూరి మార్క్ మాస్ డైలాగ్‌లతో లైగర్ అలరిస్తుందని విజయ్ దేవరకొండ తెలిపారు. అనన్య పాండే మరియు రమ్యకృష్ణ కూడా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కానుంది.

2011 లో విడుదలైన నువ్విలా చిత్రంలో చిన్న పాత్రలో కనిపించి తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టారు విజయ్ దేవరకొండ. ఆ పై లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో కూడా ఒక సహాయక పాత్రలో నటించారు. 2015 లో నాని నటించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాలో రిషిగా అద్భుతమైన నటనను ప్రదర్శించి అందరి దృష్టిలో పడ్డారు. ఆ పై పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్, అర్జున్ రెడ్డి వంటి కెరీర్ దశాదిశలు మార్చేసే బ్లాక్ బస్టర్ కొట్టిన తరువాత విజయ్ కి వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

Salaar release date poster is stunning, Prabhas at his best

0

The makers of Salaar earlier today gave a massive update that the fans have been eagerly waiting for Salaar will release on September 28th, 2023. This massive announcement was made through a poster featuring Prabhas in all his macho glory.

Prabhas can be seen holding two swords standing victoriously in a sea of bodies all around him. His screen presence and look are terrific and so is his ripped physique in the poster which has got fans completely satisfied.

https://twitter.com/hombalefilms/status/1559079443196411904

The only disappointing thing about the update is that the movie lovers will have to wait for more than a year to catch the glimpse of their ‘Darling’. However, one thing can be said for sure since it’s Prashanth Neel handling the project, the action sequences are going to be completely mind-blowing, and waiting for 1 year is totally going to be worth it!

Salaar is bankrolled by KGF makers Hombale Films and just like the Yash starter, music will be composed by Ravi Basrur. Shruti Haasan will feature opposite Prabhas for the first time in this action entertainer and Jagapathy Babu will play the negative role. Malayalam star Prithviraj Sukumaran will also play a key role in this project.

Due to the massive positive buzz for the movie, Hombale Films have decided to extend the budget of the film. The makers have decided to utilize and market Prabhas’s craze and have decided to increase the budget by about 15-20%. 

ఇంద్ర స్పెషల్ షోలు కన్ఫర్మ్ చేసిన వైజయంతి మూవీస్

0

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్‌ల పరంపర నడుస్తుంది. మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా సినిమాల తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వంతు వచ్చింది. ఆయన నటించిన ఇంద్ర సినిమాను ప్రత్యేక షోలు ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్ర రీ-రిలీజ్ గురించి ఆ చిత్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మేకర్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించించి మెగా అభిమానులమి ఆనందానికి గురి చేసారు.

అయితే ఇంద్ర సినిమాల స్పెషల్ షోలను ఏ రోజు లేదా ఏ సందర్భంగా ప్రదర్శిస్తారు అనేది ఇంకా ఖచ్చితమైన తేదీ అంటూ ఏదీ వెల్లడి కానప్పటికీ, ఆ ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి. ఈ విషయం కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాదు సామాన్య సినీ ప్రేమికులలో కూడా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇంద్ర సినిమా కేవలం మెగాస్టార్ అభిమానులకే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులకు కూడా ఎంతగానో ప్రభావితం చేసిన ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది.

బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర చిత్రంలో చిరంజీవి సరసన హీరోయిన్లుగా సోనాలి బేంద్రే, మరియు ఆర్తీ అగర్వాల్ నటించారు. 2002లో విడుదలైన ఇంద్ర సినిమా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మాస్ ఎంటర్‌టైనర్ గా ఆ సమయంలో ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుని అత్యధిక వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతే కాకుండా 30 కేంద్రాలలో 175 రోజులు.. 122 కేంద్రాలలో 100 రోజులు ఆడింది.

వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి అధ్భుతమైన నటనతో పాటు, అలరించే డ్యాన్సులు మరియు మణిశర్మ అందించిన బ్లాక్ బస్టర్ పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మొక్కే కదా అని పీకెస్తే..పీక కోస్తా, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలొంచుకుని వెళుతున్నా.. లేదంటే ఇక్కడి నుంచి తలలే తీసుకు వెళ్ళేవాడిని వంటి డైలాగులు అలాగే దాయి దాయి దామ్మా ఏ స్థాయిలో పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

మరి అలాంటి భారీ బ్లాక్ బస్టర్ అయిన ఇంద్ర సినిమా.. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ స్పెషల్ షోలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. ఖచ్చితంగా మెగా అభిమానుల ఆధ్వర్యంలో సంబరాలు భారీ స్థాయిలో ఉండబోతున్నాయి అని తెలుస్తోంది.

సౌత్ ఇండస్ట్రీల ముందు వెలవెలబోతున్న బాలీవుడ్

0

కరోనా పాండేమిక్ వేవ్ ల తరువాత సినిమా ఇండస్ట్రీ లు కాస్త కుంటు పడిన మాట వాస్తవం. అయితే సౌత్ ఇండియా పరిశ్రమలు త్వరగానే కోలుకున్నాయి. కానీ బాలీవుడ్ పరిస్థితి మాత్రం ఇంకా అయోమయంగానే ఉంది.ఈ వారం బాలీవుడ్ నుండి రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. అందులో ఒకటి అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా కాగా మరొకటి అక్షయ్ కుమార్ నటించిన రక్షా బంధన్. ఈ రెండు చిత్రాలు కూడా దారుణమైన ఓపెనింగ్స్ తెచ్చుకున్నాయి. అంతే కాకుండా కలెక్షన్లు బాగాలేని కారణంగా చాలా చోట్ల నుండి స్క్రీన్‌లను తీసివేయవలసి వచ్చింది. ఇద్దరు స్టార్ హీరోలు నటించిన కూడా లాల్ సింగ్ చడ్డా మరియు రక్షా బంధన్ సినిమాలు ప్రేక్షకులను థియేటర్లలోకి తీసుకురావడంలో తీవ్రంగా విఫలమయ్యాయి.

అందుకు భిన్నంగా తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రం ప్రస్తుతం మంచి రోజులు గడుస్తున్నాయి. బింబిసార, సీతా రామం, కార్తికేయ2 వంటి వరుస విజయాలతో టాలీవుడ్ తన హవాను కొనసాగిస్తోంది.

అటు తమిళ సినీ పరిశ్రమ కూడా బాక్స్ ఆఫీసు వద్ద మంచి హిట్లు సాధిస్తూ ముందుకు వెళుతుంది. మార్చిలో శివ కార్తికేయన్ డాన్, జూన్ లో విడుదలైన లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్ రకంగా తమిళ నాట ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ యేడాది ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ లు గా నిలిచిన ఆర్ ఆర్ ఆర్, కేజీఫ్2 సినిమాల తాలూకు తమిళ వెర్షన్లు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక ఈ వారం హీరో కార్తీ నటించిన విరుమాన్ చిత్రం చక్కని ఓపెనింగ్స్‌ సాధించడంతో ట్రేడ్ వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి.

ఈ చిత్రం కార్తీకి కెరీర్-బెస్ట్ నంబర్‌లను నమోదు చేయడం విశేషం. అదే విధంగా, ఇటీవలే విక్రాంత్ రోనా వంటి ఘన విజయం తర్వాత కన్నడ పరిశ్రమ కూడా ప్రస్తుతం మంచి ఊపు మీద ఉంది. కేజీఫ్ వంటి ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తో పాటు, అటు కలెక్షన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలను ఎంతో గొప్ప స్థాయిలో దక్కించుకున్న చార్లీ 777 వంటి అద్భుతమైన సినిమాని కన్నడ పరిశ్రమ అందించింది.

మలయాళ ఇండస్ట్రీ కూడా చక్కని విజయవంతమైన సినిమాలను అందించింది. హృదయం వంటి ఫీల్ గుడ్ హిట్, జనగణమన, కడువా ఇలా వరుస హిట్లతో చక్కని దశలో ఉంది. కాగా కెజీఫ్ సినిమా అక్కడ కూడా బ్లాక్ బస్టర్ గా నిలవడం విశేషం. ఇదిలా ఉండగా టోవినో థామస్ మరియు కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన తల్లుమాల చిత్రం ఆగస్ట్ 12న విడుదలై అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది.

ఇలా సౌత్ ఇండస్ట్రీలకు చెందిన అన్ని సినిమాలు మంచి వసూళ్లను సాధిస్తూ ట్రేడ్ వర్గాలను ఆనందింపజేస్తుంటే మరో వైపు బాలీవుడ్ సినిమా మార్కెట్ మాత్రం ఇప్పుడు కష్టాల్లో పడింది.

టాలివుడ్: ఈ నెల తెలుగు సినిమాల రిపోర్ట్

0

గత కొన్ని నెలలుగాగా కాస్త అయోమయంలో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకు ఆగస్ట్ నెల తిరిగి మంచి రోజులు తీసుకు వచ్చింది. కాగా ఆగస్టు రెండో వారం..వారాంతంలో స్వాతంత్ర్య దినోత్సవ సెలవుల నుండి వీలయినంత లాభాలను పొందాలనే ఉద్దేశ్యంతో రెండు సినిమాలైన మాచర్ల నియోజకవర్గం, కార్తీకేయ-2, మరియు బాలీవుడ్ డబ్బింగ్ చిత్రాలు విడుదలయ్యాయి. అందులోమొదటగా, అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా విడుదలై ఎవరూ ఊహించని భారీ డిజాస్టర్ గా నిలిచింది. కాగా ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఉన్నప్పటికీ.. సినిమా తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకుల పై ఎలాంటి ఎటువంటి ప్రభావాన్ని సృష్టించలేకపోయింది.

శుక్రవారం విడుదల అయిన మాచర్ల నియోజకవర్గం తొలిరోజు వరకూ బాక్స్ ఆఫీసు వద్ద పర్వాలేదు అనిపించినప్పటికీ.. రెండో రోజు నుండి అనూహ్యంగా క్రాష్ అయ్యి డిజాస్టర్ వైపు పయనిస్తోంది. నితిన్ హీరోగా నటించిన ఈ సినిమాకి ఎం ఎస్ రాజశేఖర రెడ్డి దర్శకత్వం వహించారు. కృతి శెట్టి, కాథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటించారు. ప్రముఖ నటి అంజలి తో ఐటెం సాంగ్ చేయించి విస్తృతంగా ప్రచారం చేసినా లాభం లేకుండా పోయింది.

ఇక శనివారం విడుదలైన నిఖిల్ కార్తికేయ 2 అద్భుతమైన టాక్ ను తెచ్చుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్ట్రాంగ్ గా ఉండటమే కాక 3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ మార్కును సాధించే దిశగా దూసుకు పోతుంది. అంతే కాకుండా ఈ చిత్రం హిందీ వెర్షన్ కూడా విశేషమైన స్పందనను తెచ్చుకుని ఉత్తరాది ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. సినిమాకు వస్తున్న ఆదరణ చూసి రోజు రోజుకూ అదనపు స్క్రీన్‌లు జోడించబడుతున్నాయి.

గత వారం విడుదలైన బింబిసార మరియు సీతా రామం సినిమాలు ఈ వారాంతంలో కూడా తమ లాంగ్ రన్ ను కొనసాగిస్తూ మంచు ప్రదర్శన కనబర్చాయి. ఈ రెండు తెలుగు సినిమాలు ఈ వారాంతంలో తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 3 కోట్ల షేర్ వసూలు చేయడం విశేషం. కార్తికేయ 2, బింబిసార, మరియు సీతా రామం మూడు చిత్రాలు ఘన విజయం సాధించి ఎగ్జిబిటర్లకు, మరియు ట్రేడ్ వర్గాలకు సంతోషాన్ని ఇచ్చాయి.

ఇప్పుడు విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో భారీ హైప్ తో వస్తున్న లైగర్ ఆగస్ట్ 25న విడుదల కానుండడంతో, టాలీవుడ్ తన విజయపంథాను కొనసాగించి మరిన్ని లాభాలను అర్హిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.

Box-Office: బింబిసార 10 డేస్ కలేక్షన్స్

0

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు మహర్దశ అయినట్లుగా అన్ని సినిమాలు వరుస పెట్టి విజయాలు సాధిస్తున్నాయి. ఆగస్ట్ 5న విడుదలైన కళ్యాణ్ రామ్ సినిమా బింబిసార.. పది రోజుల తరువాత కూడా బాక్స్ ఆఫీసు వద్ద అద్భుతమైన రన్‌ను కొనసాగిస్తుంది. అంతే కాకుండా పదవ రోజున కోటి రూపాయల పైనే వసూలు చేసింది. ఇంతటి అద్భుతమైన ప్రదర్శనతో పాటు ఎన్నో ప్రశంసలను సంపాదించుకున్న బింబిసార చిత్రం అందుకు నిజంగానే అర్హత ఉన్న సినిమాగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ వారం మాచర్ల నియోజకవర్గం మరియు కార్తికేయ 2 రూపంలో రెండు కొత్త సినిమాలు విడుదల అయ్యాయి. వాటిని తట్టుకుని నిలబడటం అంటే అది ఖచ్చితంగా సామాన్యమైన విషయం కాదు.

ఇక 10 రోజుల తర్వాత, కళ్యాణ్ రామ్ బింబిసార సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి అంటే.. ప్రపంచ వ్యాప్తంగా 28.5 కోట్ల రూపాయల భారీ షేర్ ను వసూలు చేసింది. అంతే కాకుండా ఈ సినిమా వ్యాపారంలో భాగమైన అందరికీ లాభదాయకంగా మారింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ 15 కోట్ల రూపాయలకు జరుపుకుంది. ఆ రకంగా చూసుకుంటే మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించింది.

ఇక బింబిసార సినిమా భారీ విజయం సాధించడంతో.. హీరో నందమూరి కళ్యాణ్ రామ్ పార్ట్ 2ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్ణయించుకున్నారు. 500 BC నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ యాక్షన్ చిత్రం బింబిసారుడి కథను ప్రేక్షకులకి చూపించింది, ఒక క్రూరమైన అధికార దాహంతో ఉన్న రాజు ఎలా ఒక మంచు మనిషిగా మారాడు అనేది ఈ చిత్ర కథ. ఫాంటసీ డ్రామాతో పాటు టైం ట్రావెల్ వంటి ఆసక్తికర అంశాలతో తెరకెక్కిన ఈ సినిమావిమర్శకుల ప్రశంసలతో పాటు అద్భుతమైన ఆదరణను పొందింది.

నూతన దర్శకుడు మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వివాన్ భటేనా కీలక విలన్ పాత్రలో నటించారు. కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

ప్రభాస్ సాలార్ విడుదల తేదీ ఖరారు

0

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన ‘కేజీఎఫ్’ సీరీస్ సినిమాలతో ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించారు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి అలాంటి దర్శకుడితో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా చేస్తున్నారు అంటే అభిమానుల్లోనే కాకుండా ఇతర ప్రేక్షకులని మరియు ట్రేడ్ వర్గాల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ఇద్దరి కలయికలో వస్తున్న ‘ సాలార్’ అద్భుతంగా ఉండబోతుందని ప్రభాస్ అభిమానులు ఈ ప్రాజెక్ట్ పై ఆశలు పెట్టుకున్నారు.

ఇటీవల ప్రభాస్ చేసిన సినిమా ‘రాధేశ్యామ్’ ఆశించిన ఫలితాన్ని సాధించలేక పోయిన విషయం తెలిసిందే. అందువల్ల ఆయన అభిమానుల దృష్టి అంతా ‘ సాలార్’ పైనే ఉంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరో రెండు భారీ సినిమాలలో నటిస్తున్నారు.

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తో ‘ఆది పురుష్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో పాటు గ్రాఫిక్స్ వర్క్ జరుపుకుంటుంది.

ఇక ‘మహానటి’ తో ఎన్నో ప్రశంసలను అందుకున్న నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’ అనే సినిమాని చేస్తున్నారు. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మరియు సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే కథగా తెరకెక్కబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు 50 శాతం వరకు చిత్రీకరణని పూర్తి చేసుకుందని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. ఇక త్వరలో మరి కొన్ని షెడ్యూల్స్ లో మిగతా సినిమాని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

అభిమానుల దృష్టిలో తమ హీరో ప్రభాస్ నుంచి తాము ఆశించే మాస్ అంశాలు, కిక్ ఎక్కించే ఫైట్లు సాలార్ సినిమాలో ఖచ్చితంగా ఉంటాయని గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే ప్రభాస్ అభిమానులు ‘ సాలార్’ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’ ఎలాంటి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సాలార్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

ప్రభాస్ అభిమానులు ఆనందించే వార్తను సాలార్ చిత్ర యూనిట్ 75వ స్వాతంత్య దినోత్సవం సందర్భంగా చెప్పారు. అనూహ్యంగా సాలార్ చిత్ర యూనిట్ ఈరోజు సినిమా విడుదల తేదీని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరిచారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ అద్భుతంగా ఉంది.

దీంతో ప్రభాస్ అభిమానులు ఉత్సాహంతో సోషల్ మీడియా వేదికగా ‘సలార్ ఆగమనం’ అనే హ్యాష్ ట్యాక్ ని వైరల్ ట్రెండ్ సంబరాలు జరుపుకున్నారు. మరి వారి ఆశలు, అంచనాలు అన్నీ నిజం చేసే సత్తా దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఉందా లేదా అనేది చూడాలి.

Exhibitors demanding huge advances for special shows because of Mahesh Babu fans

0

After Superstar Mahesh Babu’s Pokiri and Pawan Kalyan’s upcoming release of Jalsa for his birthday on September 2nd, there are plans of re-releasing Megastar Chiranjeevi’s Indra and Gharana Mogudu as well. However, fans and show organizers are now facing a small issue from exhibitors.

Pokiri special shows got a huge response and the fans are celebrated like never before. Few theatre owners failed to control the audience and the fans in euphoria did a lot of damage. These losses ran into lakhs for many theatres. In many places, chairs and screens were also damaged much to theatre management’s disarray.

Because of this, theatre owners are now being extra cautious. So now for any special shows, the exhibitors are demanding huge advances and the amount will be returned after the show if there is no damage. The exhibitors don’t want to take any risk now.

This trend of screening fan favourites is indeed a great one and is surely giving an experience that many fans who missed watching these films during their initial screenings. However, fans also need to enjoy in a way that causes no loss to property.