Home Blog Page 1847

Nani and Ravi Teja together for Dasara and Ravanausara promotions

0

Nani’s Dasara and Ravi Teja’s Ravanasura are two projects that are releasing amidst massive expectations in the coming days. Both films will release in a week’s gap and the promotions are in full swing. For the promotions of the two movies, a chit-chat session between the two stars has been planned.

While Dasara will release on 30th March, Ravanasura is scheduled for release on the 7th of April. The video of this session will be released soon and looking at the approaching release dates and overall positive buzz about both films, this seems like a great strategy.

Ravi Teja’s RT Teamworks and Abhishek Nama are bankrolling Ravanasura directed by Sudheer Verma. Harshavardhan Rameswar and Bheems Ceciroleo are composing music for this action thriller while Vijay Kartik Kannan handles the cinematography.

Nani’s Dasara on the other hand is directed by Srikanth Odela and also stars Keerthy Suresh, Samuthirakani and Sai Kumar in key roles. The music for the movie has been composed by Santosh Narayanan and produced by Sudhakar Cherukuri of Sri Lakshmi Venkateswara Creations. The film is set to be released worldwide on March 30, 2023.

Kabzaa: ఇండియన్ సినిమాల్లో మునుపెన్నడూ లేని విధంగా నకిలీ కలెక్షన్ల ప్రకటన – 100 కోట్ల పోస్టర్ రిలీజ్ చేసిన కబ్జా టీం

0

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర ప్రధాన పాత్రలో.. మరో కన్నడ స్టార్ హీరో సుదీప్ ముఖ్య అతిథి పాత్రలో నటించిన కబ్జా చిత్రం పేలవమైన సమీక్షలు, బలహీనమైన అడ్వాన్స్ బుకింగ్స్ మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. కాగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు ప్రేక్షకుల నుండి విరుద్ధమైన స్పందన వచ్చింది మరియు అన్ని చోట్లా బలహీనమైన ఆక్యుపెన్సీ కనిపించింది.

అలా ఒక పక్క ఈ సినిమా అన్ని చోట్లా తిరస్కరణకు గురై థియేటర్లు ఖాళీగా దర్శనం ఇస్తుండగా.. నిర్మాతలు మాత్రం ఈ సినిమాను ఎలాగైనా విజయవంతమైన సినిమా అని రుజువు చేయాలని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

పబ్లిసిటీ కోసం, రికార్డుల కోసం కలెక్షన్లను వచ్చిన వాటి కంటే ఎక్కువగా చూపించడం ప్రతి ఇండస్ట్రీలోనూ సర్వసాధారణం. కలెక్షన్ లెక్కలను 20%-30% పెంచడం సాధారణంగా కొంతమంది నిర్మాతలు చేస్తారు. కానీ ఇప్పుడు కబ్జా టీం ఏకంగా దాదాపు 500 శాతం కలెక్షన్లు ఎక్కువ చూపించి అందరినీ షాక్ కి గురి చేసింది! అంతే కాకుండా ఆ పోస్టర్లపై ‘కన్నడ పరిశ్రమకు మరో గర్వకారణం’ అని చిత్ర బృందం ముద్రించటం విడ్డూరం.

రెండు రోజులకు కబ్జా సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 20 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. అయితే అందరికీ షాక్ ఇచ్చిన చిత్ర బృందం ఏకంగా100 కోట్ల పోస్టర్ ను విడుదల చేసింది. ఇతర భాషల నుంచి కబ్జా వసూళ్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా చూడటం కోసం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో స్టార్ కాస్ట్ కూడా విఫలమైంది. శ్రియ, శివరాజ్ కుమార్ వంటి స్టార్లు నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయిలో కూడా ప్రభావం చూపలేకపోయింది.

Never before fake in Indian cinema, Kabzaa team releases a 100Cr poster

0

Sudeep and Upendra starrer Kabzaa was released this Friday amidst poor reviews and weak advance bookings. The pan-India project received unfavourable feedback from the audience and saw weak occupancies all over. While the film has been rejected all over and is running to empty houses, the producers are trying their best to make the movie sound like a success.

Bloating the numbers for publicity purposes or records purposes is very common in the industry. Hiking the collection figures by 20%-30% is usually done by some producers. But now, the Kabzaa team has bloated the collection by almost 500% which has shocked many! The team has even printed “Another pride of Kannada industry” on the posters.

The movie had a sub-par performance for both days movies and it merely collected a gross of 20Cr in 2 days. The team, however, has shocked everyone and released a 100Cr poster as well. The collection of Kabzaa from other languages is negligible. The movie has been shot on a massive budget with top stars and even the star cast failed to attract the audience to the theatres. The pan-India film also starred Shriya and Shivarajkumar in key roles and their presence also couldn’t manage to make any impact at the box office.

Balagam: నైజాంలో మైలురాయిని అందుకుని సంచలనం సృష్టించిన బలగం

0

ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించిన బలగం చిత్రం మార్చి 3న విడుదలై అప్పటి నుంచి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ చిత్రం ఇప్పుడు ఒక అరుదైన మైలురాయిని దాటింది.

ఏ రకంగా చూసినా సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ అనదగ్గ స్థాయిలో కేవలం నైజాం ఏరియాలోనే మ్యాజికల్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్కును క్రాస్ చేసి నిర్మాతలకు ఊహించని వసూళ్లు తెచ్చిపెట్టింది. తెలంగాణలోని పల్లెల్లో వేళ్లూనుకున్న భావోద్వేగాలను, ఆత్మను పట్టుకున్న ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలు సొంతం చేసుకున్నారు.

చిన్నప్పటి ఎన్నో సంఘటనలను గుర్తు చేసుకునేలా ప్రేక్షకులను తమ నోస్టాల్జియాలోకి లాక్కు వెళ్ళింది ఈ సినిమా. పెళ్లి, చావు సమయంలో లోతుగా పాతుకుపోయిన ఆచారాలను దర్శకుడు వేణు యెల్దండి చక్కగా తెరకెక్కించారు. ఈ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాను రియలిస్టిక్ గా చిత్రీకరించడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది, మరియు అన్ని వర్గాల నుండి వచ్చిన విశేషమైన ఆదరణ వల్ల బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రయాణం ఎవరూ ఊహించని రీతిలో ముందుకు సాగింది.

మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు బలగం చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించారు. అలాగే దర్శకుడు వేణు కూడా ఇక చిన్న పాత్రలో కనిపిస్తారు. హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకూర్చారు.

Sensational Balagam reaches a milestone in Nizam

0

Priyadarshi and Kavya Kalyanram starrer Balagam was released on March 3 and since then, the movie has been getting a fantastic response from the audience and critics. The film has been doing well at the box office too, and it has crossed a milestone figure now.

The film has crossed the magical double-digit gross mark in the Nizam region itself, which is a sensational performance by any means, and it is an unexpected revenue for the producers. The Telangana people have owned this film because it carried the rooted emotions and soul of the villages of Telangana.

The film drew the audience into their nostalgia by remembering many incidents from childhood. The deep-rooted customs during the marriage and death were well conceived by the director Venu Yeldandi. The realistic portrayal of this slice-of-life drama strongly appealed to the viewers, and the result has been quite overwhelming with the applause coming from all the corners.

Muralidhar Goud, Jayaram, Roopa, Racha Ravi, and others played important roles in this content-driven film. Produced by Harshith Reddy and Hanshitha Reddy, the film has tunes composed by Bheems Ceciroleo.

Kantara: రెండు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలవుతున్న కాంతార.. వర్కవుట్ అవుతుందా?

0

రిషబ్ శెట్టి నటించిన కాంతార ఆయన కెరీర్ లో ఒక మైలురాయి ప్రాజెక్ట్ గా నిలిచి మంచి ప్రశంసలు మరియు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందించింది. ఇప్పుడు ఈ సినిమాను రెండు ఇంటర్నేషనల్ మార్కెట్లలో విడుదల చేయడానికి దర్శకుడు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని త్వరలో ఇటాలియన్, స్పానిష్ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు హోంబలే ఫిలిమ్స్ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది.

ఇటలీ, స్పెయిన్ లు అనేవి పూర్తి భిన్నమైన మార్కెట్లు. మరి అలాంటి చోట్ల వద్ద ఈ చిత్రం ఎలా రాణిస్తుందో చూడాలి. ప్రధాన పాత్రలో నటించిన రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిన్న చిత్రం అనూహ్యమైన అసాధారణ సమీక్షలు, బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకుంది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ రెండింటినీ సాధించాయి.

కర్ణాటక తర్వాత ఈ యాక్షన్ థ్రిల్లర్ కు తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక కలెక్షన్లు వచ్చాయి. ఏ ప్రాజెక్ట్ అయినా విజయం సాధించడం వెనుక కంటెంట్ అనేది అతి పెద్ద ఫ్యాక్టర్ అని ఈ సినిమా విజయం మరోసారి రుజువు చేసింది.

ఇప్పుడు శాండల్ వుడ్ లో ఆల్ టైమ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది కాంతార. కర్ణాటకలో టాప్ షేర్, టాప్ ఫాలోయింగ్ వంటి రికార్డులన్నీ ఈ యాక్షన్ థ్రిల్లర్ తోనే ఉండడం విశేషం. ఈ చిత్రం కర్ణాటకలో కేజీఎఫ్ 2 గ్రాస్ కలెక్షన్లు, షేర్స్ ను క్రాస్ చేసింది. మరి ఇటాలియన్, స్పానిష్ భాషల్లో విడుదలయ్యే థియేట్రికల్ రిలీజ్ కు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో కిశోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. ఇంతటి ఘన విజయం తర్వాత కాంతార 2 గురించి అందరిలోనూ చర్చలు మొదలయ్యాయి. ఇక రిషబ్ శెట్టి కూడా ఈ చిత్రానికి భారీ స్థాయిలో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చారు.

Kabzaa: ఘోర పరాజయంతో వాయిదా పడ్డ కబ్జా సీక్వెల్ ప్లాన్స్

0

ఉపేంద్ర ప్రధాన పాత్రలో కిచ్చా సుదీప్ ముఖ్య అతిథ పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం కబ్జా ఈ వారం విడుదలై దారుణమైన కలెక్షన్లు, పేలవమైన సమీక్షలతో ప్రారంభమైంది. శ్రియ హీరోయిన్ గా, శివరాజ్ కుమార్ మరో అతిథి పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.

కేజీఎఫ్ తరహా ఇతివృత్తాన్ని ప్లాన్ చేసిన కబ్జా టీమ్ సీక్వెల్ ను ముందే ప్రకటించింది. సినిమాలో కూడా కథా రచయితలు సీక్వెల్ కు కావాల్సినంత స్కోప్ క్రియేట్ చేశారు కానీ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోయింది. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ దిశగా దూసుకు పోతోంది.

రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇతర భాషల నుండి కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. టాప్ స్టార్స్ తో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో స్టార్ కాస్ట్ కూడా విఫలమైంది అనే చెప్పాలి.

ఇక మొదటి భాగానికి ఇంతటి పేలవమైన ఆదరణ లభించడం అంటే రెండో భాగాన్ని పక్కన పెట్టడమే శ్రేయస్కరం అవుతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లాక్ బాహుబలి, కేజీఎఫ్, పుష్ప విషయంలో చూసినట్లుగా పార్ట్ 1 సక్సెస్ కావడం చాలా ముఖ్యం. కానీ కబ్జా ఎలాంటి ఆసక్తిని క్రియేట్ చేయకపోవడంతో సీక్వెల్ కోసం ఉత్సాహం చూపే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు.

Ram Charan: తన మార్కెటింగ్ స్కిల్స్ తో ఆర్ ఆర్ ఆర్ క్రేజ్ ని సరిగ్గా క్యాష్ చేసుకుంటున్న రామ్ చరణ్

0

ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అనేక అంశాల కలయికగా ఉంటుంది. స్టార్ డమ్ కోసం కేవలం హిట్ కొడితే సరిపోయే రోజులు పోయాయి. కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాదు మార్కెటింగ్ కూడా చాలా ముఖ్యం, అందుకు అల్లు అర్జున్, చిరంజీవిలే మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. బన్నీ, చిరంజీవి ఇద్దరూ ఖచ్చితంగా కెరీర్ లో ఎంతో కష్టపడ్డ వారే అయినా అందుకు అదునుగా స్మార్ట్ మార్కెటింగ్, పబ్లిసిటీ టెక్నిక్స్ ను కూడా మేళవించి తమ బ్రాండ్ ను పెంచుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇదే పద్ధతి ప్రకారం వెళ్తున్నారు.

రామ్ చరణ్ కు ఇండియా అంతటా తన బ్రాండ్ అప్పీల్ ను పెంచుకోవాలనే లక్ష్యంతో ఆయన యొక్క మార్కెటింగ్ అండ్ పీఆర్ టీం పని చేస్తోంది. సినిమాల ఎంపిక పరంగా, ఆఫ్ స్క్రీన్ పరంగా కూడా వ్యూహాత్మకంగా అన్ని పనులు చేస్తున్నారు.

తన ఇంటర్వ్యూలు, ఇతర పీఆర్ యాక్టివిటీస్ ద్వారా పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ఆర్ఆర్ఆర్ మార్కెట్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఇది ఆయన తదుపరి సినిమాలకు పెద్ద ప్లస్ అవుతుందని, రాబోయే రోజుల్లో చరణ్ గురించి జాతీయ మీడియాలో మరింత కవరేజ్ చూడటం ఖాయమని అంటున్నారు. చరణ్ కూడా ఇటీవలే తన హాలీవుడ్ ఆకాంక్షలను వ్యక్తం చేశారు మరియు ఇటీవల ఆయన ఇండియా టుడే మరియు ఎబిసి న్యూస్ ఇంటర్వ్యూలను ఇప్పుడు టాలీవుడ్ ను మించిన విషయాల పై దృష్టి పెట్టారనడానికి ఖచ్చితమైన సంకేతంగా చెప్పుకోవచ్చు.

ఇక మెగా అభిమానులు కూడా ఇప్పుడు రామ్ చరణ్ కు ‘గ్లోబల్ స్టార్’ ట్యాగ్ కోసం గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం తనకు ఉన్న పాపులారిటీ, హాలీవుడ్ లో నటించడానికి ఉన్న ఆసక్తి చూస్తుంటే రామ్ చరణ్ తన తదుపరి సినిమాలకు ఈ ట్యాగ్ ను ఉపయోగించినా ఆశ్చర్యపోనవసరం లేదనే చెప్పాలి.

Dasara: అల్లు అర్జున్ ఆర్య 2తో పోలికలు ఉన్న దసరా కథ

0

నాని తాజా చిత్రం దసరా కథ అల్లు అర్జున్ ఆర్య 2 తరహాలోనే ఉంటుందని, ఇద్దరు స్నేహితుల ముక్కోణపు లవ్ ట్రాక్ దసరాలో కూడా ఉంటుందని తాజా సమాచారం. అయితే ఈ ట్రయాంగిల్ కథ పర్యవసానాలు మాత్రం ఆ సినిమాతో పోలిస్తే భిన్నంగా ఉంటాయట.

ఆర్య2 సినిమాలో భావోద్వేగాలతో పాటు పాటలు ఎంటర్టైన్మెంట్ వంటి వాటితో సాగితే.. దసరా మాత్రం హై ఎండ్ మాస్ టోన్, ఎమోషనల్ మూమెంట్స్ తో రూపొందుతుందని అంటున్నారు. హై ఇంటెన్స్ టేకింగ్ తో మునుపెన్నడూ కనిపించని పాత్రలో నానిని ఈ చిత్రంలో చూడబోతున్నామని దసరా ట్రైలర్ ఇప్పటికే స్పష్టమైన హింట్ ఇచ్చింది.

హీరో, హీరో స్నేహితుడు, హీరోయిన్, విలన్ అనే నాలుగు ప్రధాన పాత్రల మధ్య దసరా కథ ముడిపడి ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా హీరో స్నేహితుడి పాత్ర సినిమాకు చాలా కీలకం కానుందని, తన పాత్ర చుట్టూ ఉండే ఎమోషనల్ అంశం సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని సమాచారం.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్ల ప్రొడక్షన్ డిజైనర్ గా, విజయ్ చాగంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వహాబ్, సాయి కుమార్, రాజశేఖర్ అనింగి తదితరులు నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ , మలయాళ భాష ల్లో మార్చి 30న ఈ చిత్రాన్ని విడుద ల చేయ నున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

SSMB28: మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు

0

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ చిత్రాల్లో ఒకటైన మహేష్ త్రివిక్రమ్ ల SSMB28 సినిమాకు టైటిల్ జు ఖరారు చేసినట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా యొక్క టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా సమాచారం అందింది.

అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా టైటిల్ ఒకే చేసే విషయంలో తొందరపడటం లేదని అంటున్నారు. అందుకే ఆయన టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారని, కొన్ని టైటిల్స్ కూడా ఆలోచించారని, అయితే ఇప్పుడు ఆలోచించడానికి మరి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

ఆ రకంగా ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం ఈ సినిమా టైటిల్ ను ఉగాదికి విడుదల చేయరని, ఆ రోజు కేవలం మహేష్ బాబు యొక్క గ్లింప్స్ మాత్రమే విడుదల చేస్తారని తెలుస్తోంది. ఇది మహేష్ అభిమానులను కాస్త బాధ పెట్టే విషయమే అయినా సరైన పనితనం రావాలి అంటే మరీ కొన్ని రోజులు వారు ఆగాల్సిందే.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం SSMB 28. దాదాపు 12 ఏళ్ల తర్వాత త్రివిక్రమ్, మహేష్ కలయికలో వస్తున్న ఈ సినిమా పై అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు థమన్ ఎస్ సంగీతం అందించనున్నారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో చిత్రాల తర్వాత త్రివిక్రమ్ తో చేస్తున్న మూడో సినిమా కావడం విశేషం. ఇక ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.