అలా వైకుంఠపురం లో విజయం తరువాత బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రం లో నటిస్తున్న సంగతి అందరకీ తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన చిత్రీకరణను తిరిగి ప్రారంభించటానికి ఇప్పటికే టీం ప్రణాళిక సిద్దం చేస్తుంది, అక్టోబర్ లో మొదలుపెట్టి నలభై రోజులు విరామం లేకుండా చిత్రీకరణ సాగేలా అన్ని ప్రణాళికలు సిద్దం చేస్తున్న సమయంలో, ఈ చిత్ర కథను తను రచించిన “తమిళ కూలీ” నుంచి కాపీ కొట్టారని ప్రముఖ రచయిత వేంపల్లి గంగాధర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
తెలుగు చిత్ర పరిశ్రమకు సాహిత్య కారుల శ్రమను దోచుకొడం కొత్తేం కాదు అని, మా అక్షరాలను మీ దృశ్యాలు గా మార్చుకొని బతుక్కొండి అంటూ ఘాటుగా స్పందించాడు.మీరు తీసే సినిమా పై అనేక చర్చలు జరిపి, విస్తృత పరిశోధనలు చేసి పుస్తకాలు రచించిన ఒక కథకుడని భుజం తట్టి ప్రోత్సహిస్తే మీ విలువ ఏమీ ఐన పడిపోతుందా, మీకు కరోనా వచ్చిన చెప్పండి మా తెలుగు సాహిత్య కారులు ప్లాస్మా దానం చేస్తాం అని తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
దీని పై చిత్ర నిర్మాతలు, దర్శకుడు ఇంకా స్పందించాల్సి ఉంది. పుష్ప చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది.