HomeMovie Newsవైరల్ అవుతున్న ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు 

వైరల్ అవుతున్న ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు 

- Advertisement -

విప్లవ సినిమాల నటుడు ఆర్ నారాయణ మూర్తి నేడు మీడియాతో ప్రత్యేకంగా ఒక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల థియేటర్స్ రెంటల్ వర్సెస్ పర్శంట్జ్ అంశంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు మూవీ రిలీజ్ అంశం లింక్ కావడం చర్చనీయాంశం అయింది. కాగా నేడు అదే అంశం పై ఆర్ నారాయణ మూర్తి వ్యాఖ్యానించారు.

వాస్తవానికి థియేటర్స్ ఓనర్స్ కి పర్సెంటేజ్ అనే అంశం నాడు దాసరి మొదలుకుని చిరంజీవి వరకు కొనసాగుతోనే వచ్చిందని అన్నారు. ప్రత్యేకంగా పెద్ద సినిమాలకు టికెట్ రేట్స్ పెంచుకునే విధానం కరెక్ట్ కాదని, అప్పట్లో కూడా పెద్ద సినిమాలు రిలీజ్ అయినపుడు ఈ విధానం లేదని గుర్తు చేసారు.

ఒకవేళ పర్సెంటేజ్ విధానం కనుక అమలైతే తన వంటి అనేకమంది నిర్మాతలకు లాభం జరుగుతుందన్నారు. దయచేసి కార్పొరేట్ సిస్టం ని సమర్ధిస్తూ ఈ సమస్యని ప్రక్కదారి పట్టించవద్దని, సీఎం చంద్రబాబుని కలిస్తే మంచిదే అన్నారు. ముఖ్యంగా సింగిల్ థియేటర్స్ అనేవి ఆలయాలవంటివి వాటిని మనం అందరం కాపాడుకోవాలని కోరారు.

నిజానికి పవన్ కళ్యాణ్ పై కుట్ర చేసి సాహసం ఎవరూ చేయరని, ఆయన కార్యాలయం నుండి వచ్చిన లేఖ సమర్ధనీయం కాదన్నారు. తెలుగు సినిమా పరిశ్రమ సమస్యలు గురించి చర్చించడానికి ఇండస్ట్రీ పెద్దలని పిలిచి ఉంటె బాగుండేదన్నారు. మొత్తంగా ఆర్ నారాయణ మూర్తి ప్రెస్ మీట్ పర్ఫెక్ట్ గా సాగింది. ఇక తాజాగా గద్దర్ అవార్డులు గెలుచుకున్న వారికి ఆయన ప్రత్యేకంగా శుభాభినందనలు తెలిపారు. మొత్తంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories