Home Blog Page 540

‘హరి హర వీర మల్లు’ : ‘అసుర హననం’ సాంగ్ రెస్పాన్స్ ఎలా ఉందంటే ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడిల దర్శకత్వంలో రూపొందుతున్న తాజా సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల కొన్నాళ్లుగా చిత్రీకరణ ఆగిపోయిన ఈ సినిమా చివరి దశకు షూటింగ్ ఇటీవల పూర్తయింది. జూన్ 12 న మూవీని గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకురానున్న విషయం తెలిసిందే.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ప్రముఖ సీనియర్ నిర్మాత  ఏఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్నారు. ఇక నిన్న ఉదయం ఈ సినిమా నుంచి మూడవ సాంగ్ ని ఒక ఈవెంట్ లో భాగంగా రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత రత్నం మాట్లాడుతూ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర అదిరిపోతుందని జ్యోతి కృష్ణ, క్రిష్ ఇద్దరు కూడా అద్భుతంగా దీనిని తెరకెక్కించారని అన్నారు. మొత్తంగా మరొక మూడు పాటలతో పాటు రెండు బిట్ సాంగ్స్ థియేటర్స్ లో అందర్నీ ఆకట్టుకుంటాయని అన్నారు.

దర్శకుడు జ్యోతి కృష్ణ మాట్లాడుతూ మూడేళ్ల గ్యాప్ అనంతరం పవర్ స్టార్ నుంచి వస్తున్న హరిహర వీరమల్లు రిలీజ్ అనంతరం పెద్ద బ్లాక్ బస్టర్ ఖాయమని అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా విడుదలైన మూడవ సాంగ్ అసుర హననం అందర్నీ ఆకట్టుకుంటోంది. కాలభైరవతో సహా మరి కొంతమంది సింగర్స్ పాడిన ఈ సాంగ్ ని రాంబాబు గోసాల రచించారు. ప్రస్తుతం ఈ సాంగ్ కి యూట్యూబ్ లో బాగానే రెస్పాన్స్ లభిస్తోంది. త్వరలో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. 

‘జైలర్ 2’ పవర్ఫుల్ పోలీస్ గా బాలయ్య ?

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ సినిమా జైలర్ 2. ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకు పైగా గ్రాస్ కాలేచ్ట్ చేసిన సినిమా జైలర్. దానికి సీక్వెల్ గా ప్రస్తుతం తెరకెక్కుతున్న ఈ మూవీపై రజనీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విశేషమైన అంచునాలున్నాయి.

ఈ సినిమా యొక్క షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతుంది. అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒక ముఖ్యమైన కీలక పాత్రలో కనిపించనున్నట్లు కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

లేటెస్ట్ రిపోర్ట్స్ ను బట్టి బాలకృష్ణ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని ఆయన పాత్ర యొక్క నిడివి 10 నుంచి 15 నిమిషాలు ఉంటుందని చెప్తున్నారు. ఓవరాల్ గా ఈ పాత్ర థియేటర్స్ లో అదిరిపోతుందని టాక్ మరోవైపు రజినీకాంత్ కూడా ఇందులో జైలర్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మరి బాలకృష్ణ ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర చేస్తుంది కనుక నిజమే అయితే అది జైలర్ 2 మూవీకి మరింత ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పటంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ కూడా అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. మరి త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేరా విజయవంతంగా చూడాలి

Dhanush Teams Up with Adipurush Director

0

Dhanush, who is all set to appear before Telugu/Tamil audiences with Kuberaa, directed by Sekhar Kammula, announced a new project. The latest and surprising news is that Dhanush teams up with the Adipurush director for the Kalam biopic.

Yes, Director Om Raut, who faced a lot of criticism for bad VFX and content in Adipurush, has announced his new film, Kalam: The Missile Man of India, starring Dhanush. This biopic focuses on APJ Abdul Kalam, the former president of India and aerospace scientist, following the disappointment of Adipurush.

Adipurush Fame Om Raut and Dhanush Team Up for Kalam Biopic

Om Raut shared an official poster of Kalam on Instagram. He captioned the post as, “From Rameswaram to Rashtrapati Bhavan, the journey of a legend begins… India’s Missile Man is coming to the silver screen. Dream big. Rise higher. #KALAM—The Missile Man of India.” 

The fans and movie lovers are surprised as Dhanush teams up with the Adipurush director for the Kalam biopic. The film will share the story of Dr. APJ Abdul Kalam, known as the ‘Missile Man of India,’ highlighting his journey from Rameswaram to Rashtrapati Bhavan, blending rocket science with his unstoppable spirit.

Dhanush to Star in the Kalam Biopic

Produced by Abhishek Agarwal, Anil Sunkara, Bhushan Kumar, and Krishan Kumar, this film’s title poster was unveiled at the Cannes Film Festival.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ని వదిలేదు లేదు : పూనమ్ కౌర్

టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరొకసారి తన సోషల్ మీడియా వేదికగా విమర్శలు ఎక్కుపెట్టారు నటి పూనం కౌర్. గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పై రెండుసార్లు ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ గా విమర్శలు చేసిన పూనమ్ కౌర్, ఆయనకు సంబంధించి తాజాగా మరొక పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచారు.

తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో పూనంకౌర్ పెట్టిన స్టోరీలో త్రివిక్రమ్ పేరు మెన్షన్ చేసి ఉండటం అలానే ఆయనకు సంబంధించి నటి ఝాన్సీ కి కూడా ఒక కంప్లైంట్ ఇచ్చానని దాని తాలూకు స్క్రీన్ షాట్స్ ని కూడా జత చేయడం చూడవచ్చు. అయితే తన కంప్లైంట్ ని ఝాన్సీ పట్టించుకోలేదని అన్నారు.

త్వరలోనే ఈ విషయమై మహిళా సంఘంతో మాట్లాడనున్నట్లు ఆమె తెలిపారు. కాగా టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ని సినీ ప్రముఖులు అలానే పొలిటికల్ గా కొందరు రక్షణ కవచంగా నిలిచి కాపాడుతున్నారని అతనిపై తాను చేసిన ఆరోపణలకు సంబంధించి త్వరలోనే పూర్తి నిజానిజాలు బయటకు వస్తాయని పూనం కౌర్ పోస్ట్ ద్వారా తెలిపారు.

ఆ విధంగా మరొకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్, పూనంకౌర్ వివాదం తెరపైకి వచ్చింది. మరి ఇకపై రానున్న రోజుల్లో ఇది ఏ విధంగా ముందుకు సాగుతుందో, దీనిపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Distributor Defends HIT 3: It’s in Profits

0

Nani’s HIT 3 released in theaters this month and emerged as a super hit at the box office. The film, also known as HIT: The Third Case, is all set to arrive on OTT in the next few weeks. Meanwhile, a distributor from Andhra Pradesh defends HIT 3 and says it brought profits for him.

Recently in an interview an East Godavari Exhibitor/Distributor mentioned that the HIT: The Third Case did not achieve breakeven, and he lost 50L loss as a buyer. 

Nani’s HIT 3 Achieved Breakeven: Says Andhra Pradesh Distributor

Now the official distributor from Andhra Pradesh (East Godavari) defends HIT 3 and says it brought profits for him. He took to social media and officially declared that the film had recovered the NRA amount, including expenses.

So, all in all, HIT 3 is a successful film at the box office with more than 100 Cr gross worldwide, and it is the second-biggest grosser in Nani’s career. The film will soon be available for streaming on Netflix from the first week of June.

‘థగ్ లైఫ్’ ఓవర్సీస్ బ్రేకీవెన్ 18 మిలియన్ డాలర్స్

లోక నాయకుడు కమలహాసన్ యువ నటుడు శింబు కలయికలో మణిరత్నం తెరకెక్కిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా థగ్ లైఫ్. ప్రారంభం నుంచి కూడా ఈ క్రేజీ ప్రాజెక్టు పై అందరిలో విశేషమైన అంచనాలు ఉన్నాయి. విక్రమ్ సక్సెస్ తరువాత కమల్ చేస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఫస్ట్ లుక్ గ్లింప్స్ టీజర్ తోనే మంచి అంచనాల ఏర్పరిచిన థగ్ లైఫ్ సినిమా నుంచి లేటెస్ట్ గా రిలీజ్ అయిన థియేటర్ ట్రైలర్ అంచనాలు అమాంతంగా పెంచేసింది. తమిళ్ తో పాటు ఇటు తెలుగు ఆడియన్స్ లో కూడా ఈ సినిమాపై భారీ స్థాయి క్రేజ్ ఉంది.

అయితే అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా ఓవర్సీస్ బ్రేకీవెన్ సాధించాలంటే మొత్తం 18 మిలియన్ల యుఎస్ డాలర్లు అందుకోవాలి. ఈ మూవీ యొక్క యొక్క ఓవర్సీస్ రైట్స్ రూ. 63 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఒకరకంగా ఇది కోలీవుడ్ లోబెస్ట్ డీల్ అని చెప్పాలి.

మరోవైపు కమలహాసన్ కి కూడా ఓవర్సీస్ లో మంచి క్రేజ్ ఉండటం, ఇక శింబు వంటి నటుడు ఉండటం అలానే మణిరత్నం కాంబినేషన్ కావడంతో టాక్ గనక బాగా ఉంటే ఈ కలెక్షన్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి జూన్ 5న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఏ స్థాయి విజయవంతం అవుతుందో చూడాలి. 

అట్లీ మూవీలో అల్లు అర్జున్ డేరింగ్ స్టెప్ ?

ఇటీవల పుష్ప 2 మూవీతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి అతిపెద్ద విజయం అందుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈమూవీని సుకుమార్ తెరకెక్కించారు. దాని అనంతరం త్రివిక్రమ్ తో ఒక మైథలాజికల్ మూవీ అనౌన్స్ చేసిన అల్లు అర్జున్, ప్రస్తుతం అది కొన్నాళ్ళు ప్రక్కన పెట్టి అట్లీతో సినిమా చేస్తున్నారు.

భారీ స్థాయిలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈమూవీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో సాగనున్నట్లు తెలుస్తోంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు విభిన్న పాత్రలను పోషించబోతున్నాడు, దీనికి తాత్కాలికంగా AA22 x A6 అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.

అయితే మూడు పాత్రల్లో ఒకటి.అత్యంత సంచలనాత్మకమైనదని, అలానే అది పూర్తిగా యానిమేటెడ్ పాత్రని టాక్. కాగా భారతీయ సినిమా చరిత్రలో ఒక ప్రముఖ నటుడు ఒక మూవీలో పూర్తిగా యానిమేటెడ్ పాత్రను పోషించడం ఇదే మొదటిసారి. ఒకరకంగా ఇది డేరింగ్ స్టెప్ అని అంటున్నాయి సినీ వర్గాలు.

ఆపాత్రని ఎంతో బాగా డిజైన చేసారని, తప్పకుండా అది అందరినీ ఆకట్టుకుంటుందని చెప్తున్నారు. తన కెరీర్ లో ఒక్కొక్కటిగా సక్సెస్ మెట్లు ఎక్కుతూ మంచి క్రేజ్ అందుకుంటున్న అల్లు అర్జున్ ఈ మూవీతో ఎంతమేర విజయం అందుకుంటారో చూడాలి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ మూవీ వచ్చే ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

‘థగ్ లైఫ్’ సెన్సార్ అండ్ రన్ టైం డీటెయిల్స్

మణిరత్నం దర్శికత్వంలో తాజాగా లోకనాయకుడు కమలహాసన్, శింబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా థగ్ లైఫ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ ట్రైలర్ రిలీజ్ అయి భారీ మాస్ యాక్షన్ సన్నివేశాలతో అందరినీ ఆకట్టుకుని సినిమాపై మంచి అంచనాలు అయితే ఏర్పరిచింది.

ఆస్కార్ విజేత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ లెవెల్ లో పలుభాషల ఆడియన్స్ ముందుకు రానుంది. అయితే విషయం ఏమిటంటే తాజాగా ఈ సినిమా యొక్క సెన్సార్  కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి యు / ఏ  సర్టిఫికెట్ ని సెన్సార్ సభ్యులు అందించారు.

ఓవరాల్ గా 165 నిమిషాల నిడివి గల థగ్ లైఫ్ సినిమా ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని అలానే దర్శకుడుగా మణిరత్నంకి ఇది మరొక సక్సెస్ ని అందిస్తుందని చెప్తున్నారు. మరోవైపు పొన్నియన్ సెల్వం రెండు సినిమాలు బాగానే ఆడినప్పటికీ మణిరత్నం మార్క్ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.

కాగా ఆ కోరికని ఈ సినిమా తీరుస్తుందని టాక్. ఇక ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ ప్రకారం ఇది మాఫియా కథాంశంతో సాగుతుందట. మాఫియా ప్రపంచంలో, శక్తివేల్ మరియు అతని సోదరుడు మాణికం పోలీసులతో జరిగిన భయంకరమైన కాల్పుల నుండి అమరన్ అనే యువకుడిని రక్షించి దత్తత తీసుకుంటారు.

తరువాత శక్తివేల్ పై హత్యాయత్నం జరుగుతుంది, దానిపై అతను అమరన్ ను అనుమానిస్తాడు. అతను తన సోదరుడు మరియు తనను మోసం చేసిన తన దత్తపుత్రుడిపై ప్రతీకారం తీర్చుకోవడం అనే ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ మూవీ సాగుతుందట. 

Prabhas Returns to Sets After Long Break

0

Pan-Indian star Prabhas has taken a break from film shooting to take a rest for a few days, and he will be back on the shooting sets from tomorrow, 22nd May. Prabhas returns to the sets after a long break for The Raja Saab.

It is widely known that the Baahubali actor is simultaneously working on Raja Saab and Fauji while juggling between schedules. As said above, the actor took a rest for a few days, and the fans are happy as Prabhas returns to the sets after a long break for The Raja Saab.

The Raja Saab – Prabhas Joins The Sets After Long Break – Teaser Out Soon

Meanwhile, the Raja Saab’s teaser is locked, but the CG work is pending, and the announcement is likely to happen in a week. A lot is expected from the teaser, and everyone is keen to see what Maruthi has done with Prabhas.

After finishing the shoot of Fauji, Prabhas will join Sandeep Reddy Vanga’s Spirit’s shooting sets, which are expected to start this August.

‘ఛత్రపతి’ రీమేక్ ఫ్లాప్ పై బెల్లంకొండ శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ కొన్నేళ్ళ క్రితం సమంత హీరోయిన్ గా వివి వినాయక తెరకెక్కించిన అల్లుడు శీను సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అప్పట్లో బాగా విజయం అందుకుని బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి పేరు తీసుకొచ్చింది.

అయితే ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో బోయపాటి శ్రీను తీసిన జయ జానకి నాయక కూడా బాగా ఆడింది అనంతరం పలు సినిమా అవకాశాలు అందుకున్నప్పటికీ మధ్యలో రాక్షసుడు తప్ప మిగతావేవి ఆయనకి పెద్ద సక్సెస్ అందించలేదు. ఇటీవల హిందీలో వినాయక్ తీసిన చత్రపతి రీమేక్ ద్వారా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు బెల్లంకొండ శ్రీను.

అయితే ఆ సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది. ఇక తాజాగా భైరవం ప్రమోషనల్ ఇంటర్వ్యూ లో భాగంగా ఆ సినిమా గురించి బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమౌళి గారికి అన్ని భాషలు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉందని అన్నారు. ఇక సౌత్ లో ఆయన ప్రభాస్ తో తీసిన చత్రపతి హిందీలో రీమేక్ చేస్తే వర్కౌట్ అవుతుందని తనకనిపించింది అన్నారు.

గతంలో రానా, రాంచరణ్ వంటి వారు బాలీవుడ్లో సినిమాలు చేశారు అయితే రామ్ చరణ్ చేసిన జంజీర్ డైరెక్ట్ హిందీ రీమేక్ కాబట్టి వర్కౌట్ కాలేదన్నారు. కాగా తమ సినిమా బాగానే వర్కౌట్ అవుతుందని తమ టీమ్ భావించినట్టు చెప్పుకొచ్చారు. వీవీ వినాయక తో పాటు అందరం చత్రపతి మూవీ కోసం ఎంతో కష్టపడ్డప్పటికీ ఓవరాల్ గా అది భారీ డిజాస్టర్ గా నిలవడం ఒకింత బాధనిపించిందన్నారు.

ముఖ్యంగా కోవిడ్ తర్వాత సినిమాల పై ప్రేక్షకాభిమానుల యొక్క టేస్ట్ మారిందని ఇప్పుడు పూర్తిగా విభిన్నమైన ఆకట్టుకునే కథ కథనాలతో తెరకెక్కిస్తేనే ఆడియన్స్ చూస్తున్నారని అన్నారు.అందుకే ఇకపై తన నుంచి మూడు నెలలకు ఒక సినిమా వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.