Home Blog Page 539

Shocking demand in Jayam Ravi’s divorce case

0

Kollywood Actor Jayam Ravi, aka Ravi Mohan, made news parting ways with his wife, Aarti, recently. The duo has been married for nearly 18 years, and their divorce sparked a big surprise on social media platforms. Following this, the duo has accused each other with open letters. They have also filed for the official divorce, which is now before the court.

It is learnt that Aarti has demanded an alimony of 40 Lakhs per month from the Actor. This news has gone viral instantly. Aarti has also released an open letter debunking the version of Jayam Ravi, who blamed her for not allowing him to visit his children. She alleged that their relationship broke down not because of his attitude but with the arrival of a third person.

Aarti has also reportedly requested the court to direct Jayam Ravi to take custody and responsibility of their two minor kids. The next hearing of the case is scheduled on June 2nd. The Court also requested the Actor to present his explanation.

Kantara: Chapter 1 postponed again

0

Kantara, starring Rishab Shetty became a sensational blockbuster in 2022. The film grossed nearly 400 crores worldwide, also becoming a Pan Indian euphoria. The team announced the sequel of the film, Kantara: Chapter 1, later and the shoot is also progressing currently.

Kantara: Chapter 1 was scheduled for release on October 2nd this year. But, as per sources, the film is likely to get postponed from this date and may release in the first half of next year. This is surely disappointing for the fans and audience. The film has already seen multiple delays in the shoot and this is also one of the reasons for the postponement.

There are huge expectations on the film. Makers expect the film to become a Pan India sensation just like its prequel. Written and directed by Rishab Shetty, the film is being made on a large-scale budget produced by Vijay Kirangadur and Chaluve Gowda under their Hombale Films.

‘వార్ 1’ స్థాయిలో ఆకట్టుకోని ‘వార్ 2’ టీజర్

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యక్షన్ సినిమా వార్ 2. ఈ మూవీపై భారతీయ ఆడియన్స్ అందరిలో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.

యష్ రాజ్ ఫిలింస్ సంస్థపై ఆదిత్య చోప్రా భారీస్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని మొన్న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ చాలా వరకు మిక్స్డ్ రెస్పాన్స్ అయితే అందుకుంటుంది.

ముఖ్యంగా ఆరేళ్ల క్రితం రిలీజ్ అయిన వార్ 1 మూవీ పెద్ద విజయం అందుకోవటంతో పాటు దాని యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని దీనిత్ పలువురు ఆడియన్స్ కంపేర్ చేస్తున్నారు. వార్ 1 టీజర్ లో ఫేస్ ఆఫ్ సన్నివేశాలతో పాటు అటు హృతిక్ ఇటు టైగర్ ష్రాఫ్ లకు సంబంధించిన సీన్స్ ని కూడా అద్భుతంగా చూపించారని అలానే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వంటివి కూడా అదిరిపోయాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే విజవాల్ ఎఫెక్ట్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తాజాగా వాట్ 2 టీజర్ లో బాలేదని పలువురు పెదవి విరుస్తున్నారు. ఆ విధంగా రెండు టీజర్ల కంపేర్ చేస్తున్న నెటిజెన్స్ వార్ 1 టీజర్ బాగుందని ఫైనల్ గా చెప్తున్నారు. మరి ఆగస్టు 14న అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన వార్ 2 మూవీ ఏ స్థాయి విజయం అందుకుంటుందో చూడాలి.

హిందీలో రీమేక్ కి సిద్దమైన ‘సత్యం సుందరం’ ?

96 వంటి హృద్యమైన ప్రేమకథా చిత్రం తెరకెక్కించి పెద్ద విజయం అందుకున్న దర్శకుడు ప్రేమ్ కుమార్ ఇటీవల ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా సత్యం సుందరం ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు. కోలీవుడ్ నటులు కార్తీ, అరవిందస్వామి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా ప్రతి ఒక్క ఆడియన్ మదిని తాకింది.

2డి ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై సూర్య, జ్యోతిక ఈ మూవీని నిర్మించారు. ముఖ్యంగా అందులోని ఎమోషన్స్ ఆకట్టుకునే సన్నివేశాలు డైలాగ్స్ వంటివి అటు తమిళ్ తో పాటు తెలుగు ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకున్నాయి. అయితే సత్యం సుందరం సినిమాకి మంచి పేరు అయితే లభించింది కానీ, బాక్సాఫీస్ పరంగా ఇది పెద్దగా పెద్ద అందుకోలేకపోయింది.

అయితే ఆ మూవీ బాగా పేరు తీసుకురావడంతో సూర్య, కార్తీ కలిసి ఇటీవల దర్శకుడు ప్రేమ్ కుమార్ కి ఒక ఖరీదైన కారు బహుమతిగా అందించారు. అయితే అసలు విషయం ఏమిటంటే లేటెస్ట్ బాలీవుడ్ అప్డేట్ ప్రకారం త్వరలో ఈ సినిమా హిందీలో రీమేక్ కానున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాలో అరవింద స్వామి పాత్రని షాహిద్ కపూర్ అలానే కార్తి పాత్రని ఇషాన్ కట్టర్ పోషించనునట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతుండగా అతి త్వరలో సత్యం సుందరం రీమేక్ యొక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ తో కూడిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ ని బాలీవుడ్ కలిసిన సందర్భం : విఎఫ్ఎక్స్ మిస్ ఫైర్

గత కొన్నేళ్లుగా మన తెలుగు సినిమా భారతీయ సినీ చరిత్రను దాటి వరల్డ్ సినిమా స్థాయికి చేరుకుంటూ దూసుకెళుతోంది. ముందుగా కొన్నేళ్ల క్రితం రాజమౌళి తరకెక్కించిన బాహుబలి అనంతరం ఇటీవల వచ్చిన పుష్ప 2 వరకు ప్రతి ఒక్క పాన్ ఇండియన్ సినిమా అత్యద్భుత విజయాలు అందుకుంటూ మన తెలుగువారి కీర్తిని విశ్వవ్యాప్తం చేస్తూ వెళ్తున్నాయి.

ముఖ్యంగా రాజమౌళి తీసిన బాహుబలి సినిమాల్లో కథ కథనాలు బలమైన ఎమోషన్స్ తో పాటు ఆకట్టుకునేటువంటి విజువల్ ఎఫెక్ట్స్ కూడా హాలీవుడ్ వారిని సైతం ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ ఇక ఇటీవల వచ్చినటువంటి సలార్ అలానే కల్కి 2898 ఏడి, పుష్ప 2 వంటి సినిమాలు కూడా గ్రాండియర్ విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కి అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఆ విజువల్ ఎఫెక్ట్స్ విషయమై టాలీవుడ్ నటులు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేస్తున్నపుడు ఒక విషయమై తప్పు మాత్రం దొర్లుతోంది. అదే విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేకపోవడం. ముఖ్యంగా ఇటీవల మన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించి, ఆ మూవీ పూర్ విజువల్ ఎఫెక్ట్స్ విషయమై తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు.

ఇక తాజాగా రిలీజ్ అయిన వార్ 2 మూవీ టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ విషయమై దర్శకుడు అయాన్ ముఖర్జీ ని ఆడియన్స్ తప్పుపడుతున్నారు. టాలీవుడ్ నటులు తెలుగులో భారీ సినిమాలు చేస్తే ఇక్కడి దర్శకులు ఆ విషయమై ఎంతో శ్రద్ధతో పని చేస్తుంటే అదే నటులు అక్కడి దర్శకులతో సినిమాలు చేస్తున్నప్పుడే విజువల్ ఎఫెక్ట్స్ విషయమై సమస్యలు తలెత్తుతున్నాయి.

టాలీవుడ్ కంటే బాలీవుడ్ మార్కెట్ ఎంతో పెద్దది అనే విషయం తెలిసిందే. మరి ఇకనైనా మన స్టార్స్ తో సినిమాలు తీసే అక్కడి దర్శకులు అన్ని అంశాలతో పాటు కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ విషయమై గట్టి జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు నెటిజన్స్ సోషల్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

‘మిరాయ్’ రిలీజ్ డేట్ కి రానున్న ‘విశ్వంభర’ ?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సోషియా ప్యాంటసి యాక్షన్ సినిమా విశ్వంభర. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువి క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ గా నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విశ్వంభర రిలీజ్ నుండి అయిన ఫస్ట్ సాంగ్ రామ రామ బాగానే రెస్పాన్స్ అందుకుంది.

వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ అవుతుందనుకున్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఇతర వర్కుల పెండింగ్ కారణంగా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ కొనసాగుతోంది. అయితే అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ మిరాయ్.

ఈ సినిమా వాస్తవానికి ఏప్రిల్ లో రిలీజ్ అవుతుందని ప్రకటించారు, అయితే సినిమా షూటింగ్ తో పాటు ఇతర వర్కుల ఆలస్యం కారణంగా దీన్ని ఆగస్టు 1 కి పోస్ట్ పోన్ చేసినట్టు తాజాగా టీం అయితే అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇక లేటెస్ట్ టాలీవుడ్ భాజ్ ప్రకారం ఆ రోజున మెగాస్టార్ విశ్వంభర మూవీ రిలీజ్ కానుందని చెప్తున్నారు.

వాస్తవానికి అదే రోజున తేజ సజ్జ మిరాయ్ రిలీజ్ కూడా ఉండటంతో ఇప్పుడు మెగాస్టార్ విశ్వంభర ప్రకటించడంతో ఆ మూవీ కొన్నాళ్లు వాయిదా పడేటువంటి అవకాశం కనబడుతోంది.

అయితే ఆ డేట్ పర్ఫెక్ట్ అని సరిగ్గా అక్కడికి రెండు వారాల అనంతరం వార్ 2 మరియు కూలీ సినిమాలు రిలీజ్ అవుతుండటంతో విశ్వంభర టీం కూడా ఆగస్టు 1 నే ఫిక్స్ చేసి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని టాక్.

అయితే వాస్తవానికి విశ్వంభర అఫీషియల్ డేట్ ఇప్పటివరకు ఫిక్స్ కాకపోవడానికి కారణం దాని యొక్క ఓటిటి డీల్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం త్వరలోనే అది కూడా పూర్తి చేసి అఫీషియల్ రిలీజ్ డౌట్ ని అనౌన్స్ చేస్తారట. 

రూ. 225 కోట్లు కొల్లగొట్టిన ‘తుడరుమ్’

మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ ఇటీవల ఎంపురాన్ సినిమాతో పెద్ద విజయం అందుకున్న విషయం తెలిసిందే. పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకుంది.

దాని అనంతరం తాజాగా యువ దర్శకుడు తరుణ్ మూర్తి దర్శకత్వంలో శోభనాతో కలిసి మోహన్ లాల్ నటించినటువంటి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తుడరుమ్.

ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయి ప్రస్తుతం బాక్సాఫీస్ పరంగా భారీ విజయం దిశగా కొనసాగుతోంది. కేవలం కేరళలోనే రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తంగా గడిచిన 26 రోజుల్లో రూ. 225 కోట్ల బాక్సాఫీస్ కలెక్షన్ దక్కించుకొని మోహన్ లాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

ఇక ఈ సినిమా ఓవర్సీస్ లో 10.9 మిలియన్లను అందుకుంది. అంతకుముందు మంజుమ్మేల్ బాయ్స్ సినిమా ఓవరాల్ గా రూ. 242 కోట్లతో అత్యధిక కలెక్షన్ అందుకున్న మలయాళ మూవీగా టాప్ స్థానంలో నిలవగా దాని అనంతరం తుడరుమ్ సినిమా ప్రస్తుతం రూ. 225 కోట్ల వద్ద ఉంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ యొక్క బాక్సాఫీస్ రన్ ని బట్టి చూస్తే ఇది త్వరలోనే మంజుమ్మేల్ బాయ్స్ ని దాటేసే అవకాశం ఎక్కువగా కూడా కనపడుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భారీ ధరకు అమ్ముడైన ‘భైరవం’ నాన్ థియేట్రికల్ రైట్స్

ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్నటువంటి యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గరుడన్. కాగా ఈ సినిమాకి తాజాగా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది భైరవం. ఈ సినిమాలో యువ నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ గ్రాండ్ లెవెల్ లో రూ. 45 కోట్లతో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ప్రచార చిత్రాలన్నీ కూడా అందరిని ఆకట్టుకుని సినిమాపై బాగానే అంచనాలు అయితే ఏర్పరిచాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ప్రకారం నాన్ థియెట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో జరిగిందని తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఓవరాల్ గా ఈ సినిమాకి నాన్ థియేటర్ రైట్స్ రూ. 30 కోట్లకు సేల్స్ జరుగగా తప్పకుండా ఇది రిలీజ్ అనంతరం బాగా రాబడుతుందని హీరోలతో పాటు టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ మాద్యమంలో వందల మిలియన్స్ తో పాటు టీవీల్లో మంచి రేటింగ్స్ అందుకోవడంతో అది ఈ సినిమా బిజినెస్ కి కొంత ప్లస్ అయిందని తెలుస్తోంది.

మంచి పాజిటివ్ టాక్ కనుక వస్తే భైరవం సినిమా భారీ కలెక్షన్ అందుకునే అవకాశం ఉంటుంది. దివ్య పిళ్ళై, అదితిశంకర్, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

‘థగ్ లైఫ్’ : అందరి అంచనాలు అందుకునేనా ?

కమల్ హాసన్, శింబు ల కలయికలో ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా థగ్ లైఫ్. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా జూన్ 5న గ్రాండ్ గా భారీ స్థాయిలో ఆడియన్స్ ముందుకు రానుంది.

ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా యొక్క థియేటర్ ట్రైలర్ 24 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ అందుకొని విశేషమైన రెస్పాన్స్ సంపాదించింది.

అయితే విషయం ఏమిటంటే ఇటీవల ఈ సినిమా యొక్క సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి వారి నుంచి యు / సర్టిఫికెట్ అందుకున్న ఈ సినిమా మొత్తంగా 2 గంటల 45 నిమిషాలు అనగా 165 నిమిషాల పాటు సాగనుంది. అయితే మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది.

ఆకట్టుకునే కథనాలతో దర్శకుడు మణిరత్నం ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అంటోంది టీమ్. మే 24న సినిమా యొక్క అధికారిక ఆడియో లాంచ్ ఈవెంట్ జరగనుంది.

ఎప్పటినుండో మణిరత్నం నుండి ఆడియన్స్ ఆశిస్తున్నా అన్ని యాక్షన్ అంశాలు ఇందులో ఉంటాయని, కమల్ తో పాటు శింబు యాక్టింగ్ మూవీకి ప్రధాన హైలైట్ అని టాక్. అలానే త్రిష కూడా మంచి పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేస్తున్నట్లు చెప్తున్నారు.

రీ రిలీజ్ కి రెడీ అయిన ‘మాయాబజార్’

భారతీయ సినీచరిత్రలో ప్రస్తుతం పలు భాషల యొక్క హిట్ మరియు ప్లాప్ సినిమాలు అప్పుడప్పుడు రీ రిలీజ్ అవుతూ నేటి ఆడియన్స్ కి మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ ని అందిస్తున్నాయి. ఆ విధంగా ఇటీవల తెలుగులో కూడా పలు సినిమాలు మన ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ఇక కొన్నేళ్ల క్రితం కలర్ వర్షన్ కి మారినటువంటి ఒకప్పటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ మాయాబజార్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, గుమ్మడి, సావిత్రి, ఎస్వీయార్, రుషేంద్రమణి వంటి దిగ్గజ నటీనటులు నటించిన ఈ సినిమాని కె.వి.రెడ్డి తెరకెక్కించారు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించిన ఈమూవీలో అభిమన్యుడిగా ఏఎన్నార్, అలానే ఘటోత్కచుడిగా ఎస్వీఆర్ అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

అప్పట్లో అతిపెద్ద సంచలన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా కలర్ వర్షన్ 2010లో రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది. అయితే అసలు విషయం ఏమిటంటే మే 28న స్వర్గీయ ఎన్టీ రామారావు 102వ జయంతి సందర్భంగా ఈ సినిమాని మళ్లీ థియేటర్స్ లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్.

తప్పకుండా ఈ సినిమా రీరిలీజ్ లో కూడా విజయవంతం అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా తాజాగా దీనికి సంబంధించి ఒక ఈవెంట్ లో రీ రిలీజ్ ని అనౌన్స్ చేశారు. మరి మాయాబజార్ మరొక్కసారి మన ఆడియన్స్ ని ఎంతమేర ఆకట్టుకుంటుందో ఏ స్థాయిలో కలెక్షన్ రాబడుతుందో చూద్దాం.