Home Blog Page 2283

Much awaited Pelli SandaD OTT streaming date and details

0

There is certain set of audience who are waiting for few films to release in OTT. Pelli SandaD is one such movie OTT audience are waiting for long time. Finally the day has arrived. 

Pelli SandaD is a rom com directed by the debutante Gowri Ronanki under the supervision of K. Raghavendra Rao. Hero Srikanth’s son Roshan Meka and Sree Leela are the lead pair. The film released on October 15, 2021 in theatres. The performances of the lead pair got good applause from the audience. Especially Sree Leela bagged too many offers after the release.

The film despite receiving the mixed response, the film registered super hit at box office. The movie made on a small budget went on to collect profits for all those involved. Pelli SandaD is set for its OTT release on Zee5 today i.e. on Friday, June 24, 2022 after a period of 8 months post theatrical release.

Telugu light men doing strike about the daily wages

0

Cassette Srinu, Narayana Goud and Eswar Reddy that are President, General Secretary and Treasurer respects for the Telugu Cinema and a outdoor lightmen union has called for strike from yesterday. All most all the daily wage workers of Tollywood are participating in the strike. The production of at least 10 films stopped as the workers did not attend the studios and outdoor schedules.

The workers participated in the strike in large numbers. “We will not resume work till the industry concedes to our demands, which include at least 30% increase in wages of different workers” said association leader Vallabhaneni Anil.

He said that the cine workers get paltry wages, ranging from ₹500 to ₹1800 per day without any specific timings. “The wages are decided as per the rate cards which were finalised almost three years ago. Though the wages are supposed to be revised every year, it has not been done on the pretext of Covid-19 pandemic,” he said.

In view of this producers council conducted an emergency meeting yesterday. So After the meeting the producers council president C. Kalyan said that “We need to take a collective decision, as it pertains to the entire industry. It is not proper to stop shootings”. The president continued “The previous agreement signed with the cine workers was valid up to May 2023. Yet, they have gone on strike. We want them to resume shootings from Thursday, if they are really sincere about their wage revision”. 

Akash puri’s chor bazaar releasing in Huge number of theatres

0

Puri Jagannadh’s son Akash Puri is coming to theatres this Friday to shine at box office. His latest outing Chor Bazaar with director Jeevan Reddy is releasing tomorrow in huge number of theatres. Prime Show films is releasing the movie in entire Telugu states. The distribution house planned a huge release.

Six movies are releasing this weekend. But Chor Bazaar is the biggest of them all in terms of release. Akash Puri starrer Chor Bazaar is releasing in more than 450 theatres across Telugu states. Kiran Abbavaram’s Sammathame is also releasing tomorrow and got decent number of theatres. These two heroes have to prove themselves with these movies. Kiran Abbavaram has already created his mark with decent movies. Akash Puri has to get a solid hit. 

Below is the count of theatres in Nizam for both the movies.

Sammathame- 73 theatres in Nizam

10 city single screens

23 district theaters

40 Multiplex

Chor bazaar – 163 theatres – Nizam

34 city theatres

91 district theatres

38 multiplex

ఆకట్టుకున్న “విక్రాంత్ రోనా” ట్రైలర్

0

ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు కన్నడ స్టార్ హీరో సుదీప్. కన్నడ అభిమానులు ఆయనను ముద్దుగా కిచ్చా సుదీప్‌ అని పిలుచుకుంటారు. ఈగ సినిమాలో నెగెటివ్‌ పాత్రలో నటించి మెప్పించిన సుదీప్ ఆ తర్వాత బాహుబలి, సైరా సినిమాల్లోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు.

ఈ స్టార్ హీరో ఇప్పుడు పాన్‌ ఇండియా చిత్రంతో మన ముందుకు వస్తున్నాడు. అదే “విక్రాంత్‌ రోనా” అనూప్‌ భండారీ దర్శకత్వం వహిస్తోన్న ఈ అడ్వెంచరస్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సుదీప్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనుంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు దర్శక నిర్మాతలు. జూలై 28న కన్నడతో సహా మొత్తం నాలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.ఉగాదికి విడుదలైన ఈ చిత్రం తాలూకు టీజర్‌ అద్భుతమైన స్పందనను రాబట్టింది

ఇక ఈరోజు విడుదల అయిన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే విధంగా ఉంది. తెలుగు ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేయగా,హిందీ వెర్షన్ ను సల్మాన్ ఖాన్, మలయాళ వెర్షన్ ను దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.ఊహజనితనమైన ఒక ఊరిలో ఒక రహస్యం, ఆ రహస్యాన్ని ఛేదించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చే పాత్రలో కిచ్చ సుదీప్ లుక్ ఆకట్టుకొగా, కళ్ళు చెదిరే యాక్షన్ సీన్ లతో పాటు అడవి నేపథ్యంలో ఉత్కంఠభరితమైన చేజ్ సన్నివేశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ట్రైలర్ చూస్తే.

ఇలాంటి కాన్సెప్ట్ అయితే భాషలకు అతీతంగా ప్రేక్షకులు ఆసక్తి చూపుతారు, ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్ లో సక్సెస్ అయ్యే అన్ని అవకాశాలు ఉన్నాయి “విక్రాంత్ రోనా”లో.ఈ చిత్రానికి నిర్మాతలు జాన్‌ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్. సుదీప్‌ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అజనీశ్‌ లోక్‌నాథ్‌ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.

ఫస్ట్ టైం ఇన్ టాలీవుడ్ అంటున్న పక్కా కమర్షియల్ ప్రొడ్యూసర్

0

గోపీచంద్ – రాశి ఖన్నా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘పక్కా కమర్షియల్’ గీతా ఆర్ట్స్ 2 – యూవీ క్రియేషన్స్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా నటిస్తుండగా,తండ్రి పాత్రలో సత్యరాజ్ కనిపించబోతున్నారు. అలాగే హీరోయిన్ రాశి ఖన్నా ఇందులో సీరియల్ హీరోయిన్ తో పాటు లాయర్ గా కూడా కనిపిస్తుండటం విశేషం.మారుతి మార్కు కామెడీ తో పాటు గోపీచంద్ నుండి ఆశించే యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదని ట్రైలర్ లు చూస్తేనే తెలుస్తుంది.

జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ఇటివలే విడుదల అయిన ‘అందాల రాశి’ పాట మంచి స్పందన వచ్చింది. వచ్చేనెల 1వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంభందించిన పబ్లిసిటీ గురించి చర్చించడానికి నిర్మాత బన్నీ వాసు, దర్శకుడు మారుతి మరియు పీఆర్వో టీమ్ తో కలిశారు.

ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా ఏదో ఒక కొత్త పద్ధతిలో సినిమాను ప్రచారం చేయాలి అని చెప్పగా, ఆయన టీమ్ అందుకు రకరకాల ఐడియాలు ఇచ్చారు,అవేవీ వాసుకి,మారుతికి నచ్చకపోవడం వాళ్ళు ఆ ఐడియాల మీద సెటైర్ లు వేయడం కాస్త సరదాగానే గడిచింది మొత్తం వ్యవహారం.

అయితే మొత్తానికి తేలింది ఎంటి అంటే ఈ నెల 26న టాలీవుడ్ చరిత్రలోనే మొట్ట మొదటిసారి అంటే ఫస్ట్ టైం అనే టాగ్ తో “పక్కా కమర్షియల్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.అంటే అర్ధం అయింది కదా, ఆల్రెడీ ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించేసాక ఇప్పుడు అందరూ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నే కేవలం “ఫస్ట్ టైం” అన్న టాగ్ తో చేయబోతున్నారు అన్నమాట. ఏమైనా సినిమాకి తగ్గట్టే ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న ఈ ఈవెంట్ తో పాటు సినిమా కూడా సక్సెస్ అయి గోపీచంద్ ఆశిస్తున్న హిట్ దక్కుతుంది అని కోరుకుందాం.

హీరోల రేట్లు తగ్గించే పనిలో నిర్మాతలు

0

తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదురుకుంటుంది.నిజానికి ఇతర చిత్ర పరిశ్రమ లతో పోలిస్తే మన తెలుగు సినీ పరిశ్రమ తొందరగా కోలుకుని పనులు ప్రారంభించింది అన్నది నిజం. అయితే సక్సెస్ రేట్ మాత్రం పెరగటం లేదు. ఇప్పటికీ పది శాతం సక్సెస్ రేట్ ఉంటే గొప్పగా చెప్పుకునే పరిస్తితి. అంటే సుందరానికి సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది కానీ ప్రేక్షకులు థియేటర్ ల వైపు కదలలేదు. అశోకవనంలో అర్జునకల్యాణం సినిమా బాగుందని అంతా ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు. కానీ ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు లేవు.F3 వంటి సీక్వెల్ క్రేజ్ ఉన్న సినిమా కూడా తొలి మూడు రోజుల తరువాత కలెక్షన్ లు తగ్గుతూ పోయాయి.తాజాగా విడుదలైన విరాటపర్వం సినిమా కూడా బాగుందన్నారు కానీ ఆ సినిమాకివచ్చిన మొదటి రోజు వసూళ్లు కనీస స్థాయిలో కూడా రాకపోవడం విచిత్రం.

థియేటర్లలో కనిపిస్తున్న ఈ అవస్థను అందరూ నిశితంగా గమనించాల్సిన అవసరం ఎంతైనాఉంది.ఒక వైపు టికెట్ రేట్లు తగ్గించినప్పటికీ, ప్రేక్షకులు థియేటర్ల వైపు రావడం లేదనే విషయాన్ని అర్థం చేసుకుని అందుకు తగిన నిర్ణయాలు కానీ ప్రణాళికలు కానీ అమలు చేయాలి. 

అందుకే ఇప్పుడు నిర్మాతలు అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా సినిమాలు పరాజయం చవి చూశాయి ఈ సంవత్సరంలో, కొన్ని సినిమాలు ఓటిటి డీల్స్ వల్ల నష్టాన్ని కాస్త భర్తీ చేయగలిగాయి.అందుకే ఇక మీదట హీరోలకు ఇచ్చే రేమ్యునరేషన్ తగ్గించాలి అని,ముఖ్యంగా చిన్న హీరోలకు వాళ్ళ స్థాయిని మించిన అమౌంట్ ఇవ్వకూడదు అని నిర్ణయించినట్టు సమాచారం.

నిజానికి ఇప్పుడు కనిపిస్తున్న ఈ విపరీత పోకడకు ఓ విధంగా పరిశ్రమే కారణం అని చెప్పవచ్చుకరోనా మరియు లాక్ డౌన్ వల్ల తీవ్రంగా నష్టపోయామని చెప్తూ పెద్ద సినిమాల కోసం రేట్లు విపరీతంగాపెంచుకున్నారు. తీరా పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ అయి చిన్న సినిమాలు లేదా మీడియం బడ్జెట్ సినిమాలు వచ్చే సమయానికి ఎడ తెరిపి లేకుండా సినిమాలు చూసాము అన్న భావన ప్రేక్షకులకు కలిగి థియేటర్ ల వైపు రావటం మానేశారు. కేవలం టికెట్ రేట్లు తగ్గిస్తే మాత్రమే చాలదని,ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది అన్న విషయం గమనించాలి.ఇప్పుడు ఒక సినిమాకి విపరీతమైన క్రేజ్ ఉంటే తప్ప ఓపెనింగ్స్ ఆ పైన లాంగ్ రన్ ఉండటం లేదు.

విజిల్ వేయిస్తున్న “ది వారియర్” కొత్త పాట

0

తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో రామ్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “ది వారియర్” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో హీరో రామ్ నటిస్తున్నారు.లేటెస్ట్ సెన్షేశన్ బేబమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఇది వరకే విడుదలైన బుల్లెట్ సాంగ్ సూపర్ హిట్ అయి తెగ వైరల్ అయిపొయింది.ఆ పాటను తమిళ స్టార్ హీరో శింబు పాట పాడటం విశేషం.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో పాట రిలీజ్ అయింది. Whistle అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది.ఉర్రూతలూగించే బీట్ తో పాటు మంచి డాన్స్ కి స్కోప్ కూడా ఉంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు బుల్లెట్టు సాంగ్ లో అలరించిన రామ్ – కృతి శెట్టి ల జోడీ డాన్స్ మరోమారు ఈ పాటలోనూ ఆకట్టుకుంది. సాహితి లిరిక్స్ అందించిన ఈ పాటను అంతోనీ దాసన్, శ్రీనిష జయశీలన్ పాడారు.పైగా రామ్ – దేవిశ్రీప్రసాద్ ల కాంబో హిట్ కాంబో అని మరోసారి రుజువు అయింది. చక్కని బీట్ తో పాటు క్యాఛీ లిరిక్స్ ఉండేలా చూసుకోవడం దేవిశ్రీప్రసాద్ కు తిరుగే లేదు. అందుకే తన కెరీర్ ఇన్ని ఏళ్ల పాటు విజయవంతంగా సాగుతుంది.

వచ్చే నెల అంటే జూలై 14 న రిలీజ్ అవబోతున్న ది వారియర్ చిత్రం మీద రామ్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడంతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అసక్తి గా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 తరువాత మాస్ ప్రేక్షకులను అలరించే సినిమా ఏదీ రాలేదు. కాబట్టి పాటలు హిట్ అయి, పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న ది వారియర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వాలి అని కోరుకుందాం.

సినీ కార్మికుల సమ్మె పై స్పందించిన నిర్మాతలు

0

తెలుగు సినీ కార్మికులు చేస్తున్న సమ్మెపై నిర్మాతలు స్పందించారు. వేతనాలు పెంచడానికి తమలో ఎలాంటి అభ్యంతరం లేదంటూనే, కొన్ని షరతులు కూడా పెట్టారు. రేపటి నుంచి యధావిధిగా షూటింగ్ కు వస్తే, ఎల్లుండి నుంచి వేతనాలకు సంబంధించిన చర్చలు జరుపుతామని ప్రకటించారు. అలా జరగకపోతే వారు కూడా షూటింగ్ లు నిలిపి వేస్తామని హెచ్చరించారు.

వేతనాలు పెంచాలనే డిమాండ్ల తో షూటింగ్ల కు రావొద్దని నిర్మాతలు స్పష్టం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా షూటింగ్ కు వస్తే జీతాలపై చర్చిస్తామని చెప్పారు. ఈ ఒక్క రోజు షూటింగ్లు ఆగిపోవడం వలన నిర్మాతలకు రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, ఇకనైనా బెట్టు చేయకుండా షూటింగ్ కు వస్తే మంచిదని చెప్పారు.

రేపటి తో కార్మికులు షూటింగ్ కు రాకపోతే కార్మికుల బండారం మొత్తం బయటపెడతాం అన్నట్లుగా హెచ్చరికనూ జారీ చేశారు నిర్మాతలు. పని చేయకుండా వేరే చోటి నుంచికార్మికులను తీసుకువచ్చి, వాళ్లకు కూడా నిర్మాతలతో డబ్బులు ఇప్పించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయని, అలాంటివి మళ్ళీ జరగకుండా చూడాలని నిర్మాతలు అన్నారు.బయట రోజూ ఇచ్చే వేతనాలతో పోలిస్తే, సినీ కార్మికులకు 150 శాతం అదనంగా వేతనాలు ఇస్తున్నామని తెలిపిన నిర్మాతలు,రెండు పూటలా తిండి పెట్టి వేతనం ఇస్తున్న రంగం వేరేఏదైనా ఉందా అని ప్రశ్నించారు.వేతనాల పెంపుకు సంబంధించి కనీసం రెండు మూడు నెలలైనా చర్చలు జరుగుతాయని, హఠాత్తుగా నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని తెలిపారు.

అసలు సమ్మె చేస్తున్నామంటూ సరైన నోటీసు లేకుండా కేవలం లేఖ ఇచ్చి హటాత్తుగా చేసినట్టు నిర్మాతలు కార్మికులపై ఆరోపణలు చేశారు.ఎక్కువ వేతనాలకు ఇచ్చే నిర్మాతలకు మాత్రమే సినిమాలు చేస్తామని కార్మిక సంఘాలు అనుకుంటే తాము పక్క రాష్ట్రాల నుంచి సినీ కార్మికులని తెచ్చుకొని పని చేయించుకోవడానికిఏమాత్రం వెనకాడమని నిర్మాతలు తెలిపారు.ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనాపని చేయచ్చు, పని చేయుంచుకోవచ్చు అనే నిబంధన కూడా ఉన్నట్టుగా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అన్‌స్టాపబుల్ 2 లో మెగాస్టార్?

0

నందమూరి బాలకృష్ణ గత యేడాది ఆహా ఓటీటీ వేదికగా అన్స్తాపబుల్ షో తో హోస్ట్ గా చేసిన సంగతి తెలిసిందే. “నేను మీకు తెలుసు..నా స్థానం మీ మనసు”అంటూ హోస్ట్‌గా తనదైన శైలిలో అన్‌స్టాపబుల్ షోను రక్తి కట్టించారు. మోహన్ బాబు తో మొదటి ఎపిసోడ్ చేయగా చివరి ఎపిసోడ్ మహేష్ బాబుతో చేయడం జరిగింది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారని కూడా తెలిసింది.

ఈ షో సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం సినిమాల్లో ఎక్కువగా గంభీరంగా,భారీ సంభాషణలు పలికే బాలకృష్ణ షోలో మాత్రం సరదాగా గెస్ట్ లతో జోక్ లు వేస్తూ మధ్యలో తన మీద కూడా జోక్ లు వేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ యాంగిల్ బాలయ్యలో మునుపెన్నడూ చూడలేదే అని ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.

అలాగే తన మీద వచ్చే రూమర్ లు వగైరాల మీద కూడా వివరణ ఇచ్చుకోవడం చేసి బాలకృష్ణ శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా తనకు రవితేజ మధ్య గొడవ అయ్యిందని దశాబ్దం క్రితం నుంచి ఉన్న రూమర్లకు బాలయ్య చెక్ పెట్టారు.స్వయంగా రవితేజతోనే క్లారిటీ ఇప్పించడం ఆయనకే చెల్లింది.

కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా ప్రతి ఎపిసోడ్ లో సమాజంలో కష్టాలు ఎదురీదుతున్న వారిని పరిచయం చేసి వాళ్ళకి చేతనైన సహాయం చేయడం కూడా షోకు మంచి పేరు తీసుకువచ్చింది.సరదాగా మాట్లాడుతూనే గెస్ట్ లను ఎమోషనల్ జర్నీలో తీసుకెళ్లడంలో బాలకృష్ణ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. జనవరిలో అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ చివరి ఎపిసోడ్ ప్రసారం అయింది, అప్పట్నుంచి సీజన్ 2 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు, మొత్తానికి వారి ఎదురుచూపులు ఫలించాయి.

అన్‌స్టాపబుల్ సీజన్ 2 తొందరలోనే మొదలవుతుందని, ఆ సీజన్ మొట్టమొదటి గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదే గనుక నిజం అయితే టీఆర్పిల రికార్డ్ మోగిపోయే ఎపిసోడ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.మెగా – నందమూరి కలయిక ఎలా ఉండబోతుందో త్వరలోనే చూడబోతున్నాం.

మహేష్ బాబు తో సందీప్ రెడ్డి వంగా

0

అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత సందీప్ వంగా ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. అప్పట్లో దాదాపు ప్రముఖ హీరోలందరి నుంచి ఆయనకు కాల్ వచ్చింది. అందులో మహేష్ కూడా ఉన్నాడు.తన కోసం మంచి సబ్జెక్టు రెడీ చేయాలని మహేష్ కోరినట్టు లోగడ ఒకసారి సందీప్ చెప్పడం జరిగింది.

ఈ సంగతులని సందీప్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో జరిగిన స్పేస్ లో చెప్పారుమహేష్ బాబుతో చాలా రోజుల క్రితమే సినిమా చేయాల్సింది. తాను మహేష్ ను బయట నాలుగైదు సార్లు కలిశానని, కోన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ కూడా వినిపించానని సందీప్ చెప్పుకొచ్చారు.

మహేష్ కి ఆ కథలు నచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రూపు దాల్చలేదని సమాచారంఆ తరువాత మహేష్ తో సందీప్ కొన్ని యాడ్ షూట్ కొరకు పనిచేశారు. ఇంతవరకు సినిమాల్లో మహేష్ బాబుని మనం చూసింది 25 శాతం మాత్రమే.75 శాతం మహేష్ బయట పడనేలేదని ముందుగా చెప్పుకున్నట్టు ఫ్యాన్స్ స్పేస్ లో సందీప్ చెప్పారు.

అంటే మహేష్ బాబు సత్తాని ఫిలిం మేకర్స్ ఇప్పటి వరకు 25 శాతం మాత్రమే ఉపయోగించుకున్నారు అని సందీప్ పరోక్షంగా తెలిపారు.ఇక ఆ 75 శాతం మహేష్ ను తెరపై చూపించే అవకాశం వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా ఆ పైన రాజమౌళితో సినిమా అయ్యాక మహేష్ సందీప్ దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహంగా ఉన్నారు అని తెలుస్తుంది. ఇది నిజం అయితే అటు మహేష్ ఫ్యాన్స్ కు ఇటు మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. మోస్ట్ అవెయిటడ్ కాంబో అయిన ఈ కలయిక వీలయినంత త్వరగా ప్రకటిస్తారని ఆశిద్దాం.