Home Blog Page 2125

Suriya joins hands with Sai Pallavi for her upcoming project

0

Sai Pallavi’s upcoming multilingual project Gargi has just got more exciting. The film will be presented in Tamil by none other than Suriya and Jyothika. The Kollywood star couple has been backing quite a lot of interesting projects for the last few years. Now with Gargi, they have once again proved that their production house ‘2D Productions’ is always game for quality cinema.

The film Gargi will be released in Telugu, Tamil, and Kannada. Taking to Twitter, Suriya announced about this development to his followers.

Suriya and Sai Pallavi had earlier worked together in 2019 political action drama NGK. While the film failed to impress the audience, their chemistry was well appreciated by many. While this time they won’t be seen together on screen, it will be interesting to see how Gargi is received.

The movie’s first look and behind-the-scenes footage were released on the occasion of the actress’s 30th birthday last month. The video looked interesting and was released in Tamil, Telugu, and Kannada. Gargi is written and directed by Gautham Ramachandra, and produced by Ravichandran Ramachandran.

Pawan Kalyan planning to return the advances to producers

0

For the last couple of years, Pawan Kalyan has adopted a strategy that’s focused on finishing projects in quick time. He is doing safe projects and remakes with proven stories that can be a profitable venture for everyone. After Vakeel Saab and Bheemla Nayak, his next film will also be a remake of Tamil film Vinodhaya Seetham.

After this project, he has Hari Hara Veera Mallu with Krish and Bhavadeeyudu Bhagat Singh. Along with these projects, there are also a few that has committed. However, Pawan Kalyan wants to take a break from movies to spend full-time on politics for the 2024 elections.

With a couple of years to go for the next AP Assembly Elections, Pawan Kalyan wants to finish maximum projects and fulfill all his further commitments. According to reports, the Janasena Chief wants to focus on the 2024 elections so there is a long break or even a possibility of quitting the movies depending on the election results.

There are a few movies which already been committed by the Pawan Kalyan by taking the advance remuneration. Now he is planning to return the remuneration as he has no clarity as of now whether the movies will happen or not. He doesn’t want to put any burden on the producer and himself with these commitments.

రాకీీ భాయ్ తో అపరిచితుడు

0

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఎలా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడో, కేజీఎఫ్ సినిమాతో యశ్ కూడా సూపర్ స్టార్ అయిపోయాడు. మ‌రీ ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన‌ కేజీఎఫ్ రెండవ భాగానికి దేశవ్యాప్తంగాఅద్భుత‌మైన స్పందన వచ్చింది.అసలు కన్నడ సినిమా ఇండస్ట్రీని రెండేళ్ల కిందటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. అలాంటి ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో ఏకంగా మొదటిరోజే 170 కోట్ల వసూళ్లు కొల్లగొట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.హిందీ బాక్స్ ఆఫీస్ వద్దకేజీఎఫ్ చాప్టర్ 2 బద్దలు కొడుతున్న రికార్డులు చూసి ట్రేడ్ పండితులు సైతం అవాక్కయ్యారు అంటే అది అతిశయోక్తి కాదు. హిందీ వెర్షన్ లోబాహుబలి2 తరువాత ఇండియా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లను నమోదు చేసిన చిత్రంగా కేజీఫ్ 2 నిలిచింది.

ఇంతటి ఘవిజయం సాధించిన యష్ తరువాత చిత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమా అని ఇది వరకు ప్రచారం జరిగినా, అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు. రాకీ భాయ్ బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సంచలనాలు చూసిన తర్వాత ఆయనతో నేరుగా తెలుగు సినిమా చేయాలని నిర్మాతలు ఆశపడటంలో తప్పు లేదు.ఈ క్రమంలోనే ఒకరిద్దరు అగ్ర దర్శకులు యష్ ను కలిసి తమ ఐడియాలను వినిపించినట్లు వార్తలు వచ్చాయి.ఆ మధ్య ఒకసారి పూరి జగన్నాథ్ జనగణమన సినిమా యశ్ తోనే అనే ప్రచారం కూడా గట్టిగా జరిగింది. కానీ అది కుదరలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ఆ సినిమా రాబోతుంది.

అయితే ఈ ఊహాగానాల్లో భాగంగా మరో భారీ కాంబినేషన్ తెర పైకి వచ్చింది. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో యశ్ సినిమా చేయబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కేజీఫ్2 తరువాత ఈ కాంబో అంటే ఇంక పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ రావడం పక్కా. ఇదే గనక నిజం అయితే యశ్ పాన్ ఇండియా స్టార్ గా సెటిల్ అయిపోవడం ఖాయం.మరి ఈ అరుదైన కలయిక నిజం అవుతుందో లేదో చూద్దాం.

సూర్య రిలీజ్ చేసిన సాయి పల్లవి కొత్త సినిమా “గర్గి” ఫస్ట్ లుక్

0

తెలుగుతో పాటు అటు తమిళంలో కూడా ప్రస్తుతం మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న కథానాయిక సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ తో చేసినతొలి చిత్రం ఫిదా సినిమాతో తెలుగులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సాయి పల్లవి, ఆ సినిమాలో భానుమతి పాత్రతో అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత నుండి వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని వాటిని సద్వినియగపరుచుకుని నటిగా చక్కని ఇమేజ్ తో పాటు క్రేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి, ఇటీవల రానా హీరోగా తెరకెక్కిన విరాట పర్వంతో మరోసారి తన నటనకు గాను ప్రశంసలు అందుకుంది.

అయితే లేటెస్ట్ గా ఆమె తమిళంలోచేస్తున్న మూవీ “గర్గి”. డిఫరెంట్ యాక్షన్ డ్రామాగా తెరెక్కుతున్న ఈ సినిమాని2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక సమర్పిస్తున్నారు.గౌతమ్ రామచంద్రన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.కాళీ వెంకట్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కొద్దిసేపటి క్రితం గర్గి మూవీ యూనిట్ సభ్యుల సమక్షంలో సూర్య, జ్యోతిక దంపతులు తమ చేతుల మీదుగా రిలీజ్ చేసారు. సాయి పల్లవితో కలిసి చేస్తున్న ఈ ప్రాజక్ట్ తనకు ఎంతో నచ్చిందని, తప్పకుండా ఈ చిత్రం విజయవంతం అవుతుందని అన్నారు సూర్య,జ్యోతిక.    సూర్య,జ్యోతిక నిర్మాతలుగా ప్రత్యేకమైన అభిరుచి కలవారు అని వాళ్ళు నిర్మించిన సినిమాలు చూస్తేనే అర్ధం అవుతుంది. మంచి ఉద్దేశంతో తీసే సినిమాలకు వారి ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది.

ఈ విషయమై సాయి పల్లవి తన ఇన్స్టాగ్రామ్ లోఅనంతరం వారిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ చేయటం జరిగింది.సాయి పల్లవి చేస్తున్న ప్రయత్నం సఫలమై మరిన్ని మంచి సినిమాలు తను చేయడానికి ఉపయోగపడాలి అని కోరుకుందాం.

ఉత్కంఠ రేపిన “కార్తికేయ 2” ట్రైలర్

0

నిఖిల్  సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా ‘కార్తికేయ 2’. దీనికి చందు మొండేటి దర్శకుడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు.యువ కథానాయకుడు నిఖిల్ మరియు దర్శకుడు చందు మొండేటి ది హిట్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ వస్తోంది. అదే ‘కార్తికేయ 2’. ఇందులో అనుపమా పరమేశ్వరన్ కథానాయిక. 

‘కార్తికేయ 2’ ట్రైలర్ విషయానికి వస్తే… ‘శాంతను! ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధను మాత్రమే, ఆజ్యం మళ్ళీ అక్కడ మొదలైంది. ప్రాణ త్యాగం చేసే తెగింపు ఉంటేనే దానిని పొందగలం’ అని ఒక నటుడు చెప్పే డైలాగుతో ప్రారంభం అయ్యింది. ఆ యాగం ఎంటి ఎవరు ప్రారంభించారు? దాంతో హీరో నిఖిల్ కు ఉన్న సంబంధం ఎంటి? అనే ప్రశ్నలకు సినిమా చూస్తేనే సమాధానం దొరుకుతుంది.భక్తి, సైన్స్ నేపథ్యంలో చందూ మొండేటి ఇది వరకే కార్తికేయ మొదటి భాగాన్ని తీసి ఆకట్టుకున్నారు. ఇప్పుడు రెండో భాగానికి ద్వారక నగరం,కృష్ణుడు కు సంబంధించిన నేపథ్యం అనడం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు.మరి ఆ అంచనాలను కార్తికేయ 2 అందుకుంటుందా లేదా చూద్దాం.

‘సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం ఈ ద్వారకా నగరం’ అంటూ నిఖిల్ డైలాగ్‌తో కూడిన ‘కార్తికేయ 2’ మోషన్ పోస్టర్ తోనే ఈ సినిమా పై ప్రేక్షకులు ఆసక్తి కనబర్చారు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస రెడ్డి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు.

సారీ ఇప్పుడు కాదు అంటున్న థ్యాంక్ యూ టీమ్

0

ల‌వ్ స్టోరి, బంగార్రాజు హిట్ చిత్రాలతో వరుస హిట్స్‌తో దూకుడు మీదున్న అక్కినేని హీరో నాగ చైతన్య హ్యాట్రిక్ హిట్‌పై కన్నేశాడు. విక్రమ్ కె.కుమార్‌ డైరెక్షన్‌ లో దిల్ రాజు నిర్మించిన తాజా చిత్రం ‘థ్యాంక్ యూ’. రాశీఖన్నా, అవికా గోర్‌, మాళవిక నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్ ఇటివలే విడుదల చేయగా మంచి స్పందనను రాబట్టింది.

ఇందులో నాగ చైతన్య మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్నాడు. యువసామ్రాట్ గా రొమాన్స్ లో మంచి ఇమేజ్ ఉన్న నాగ చైతన్య ఈ సినిమాలోముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయనున్నాడు. స్కూల్,కాలేజీ లుక్ లతో పాటు వ్యాపారవేత్తగా నాగ చైతన్య అలరించబోతున్నాడు. గడ్డం గెటప్‌లో చూస్తే, మజిలీ మూవీలో లుక్ గుర్తుకువచ్చింది అని టీజర్ చూసిన ప్రేక్షకులు అభిప్రాయ పడ్డారు.

కరోనా వేవ్ ల వల్ల ఇతర సినిమాల లాగే థ్యాంక్ యూ కూడా షూటింగ్ తో పాటు రిలీజ్ డేట్ వాయిదా వేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు జూలై 8న ఈ సినిమా విడుదలకు అన్ని సన్నాహాలు చేసినా, తాజాగా అందిన వార్తల ప్రకారం మళ్ళీ రిలీజ్ పోస్ట్ పోన్ అయింది.ముందుగా అనుకున్నట్టు జూలై 8న కాకుండా రెండు వారాల తరువాత అంటే జూలై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

కారణాలు ఎంటి అనేది తెలియరాలేదు కానీ “థ్యాంక్ యూ” వాయిదా వేయడం మంచి నిర్ణయం అనే చెప్పాలి. ఎందుకంటే వారం ముందు “పక్కా కమర్షియల్” వారం తరువాత “ది వారియర్” సినిమాలు ఉండటం వల్ల అంత తక్కువ గ్యాప్ లో మరో సినిమా చూడటానికి ప్రేక్షకులు ముందుకు రాకపోవచ్చు. 


మనం’ సినిమా హిట్ తరువాత నాగ చైతన్య-విక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే. ‘థ్యాంక్ యూ’ మూవీ టీజర్ తరువాత ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగాయి. డిఫరెంట్ గెటప్ లలో నాగ చైతన్య కనిపించడం, అంతే డిఫరెంట్‌గా స్టోరీ ఉంటుంది అనేలా టీజర్ ఉండటంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో సినిమా ఇలా పోస్ట్ పోన్ చేయడం వాళ్ళకి కాస్త నిరాశ కలిగించినా,ఈ నిర్ణయం వల్ల సినిమాకి మంచి జరిగి మంచి విజయం సాధించాలని కోరుకుందాం.

Naga Chaitanya’s Thank You postponed and announces new release date

0

Looks like Akkineni fans will have to wait for some more time to catch Naga Chaitanya on screen. Naga Chaitanya’s Thank You which was earlier scheduled to release on July 8th has now been pushed to a July 22 release date.

While the reason for postponment is not clear, it is presumed that this movie was made to create more space and buzz for the movie. The makers had earlier this month released the first song ‘Maaro Maaro’ from the movie. It failed to evoke any excitement and failed in gaining any interest from general audience.

The teaser of the film was unveiled recently and it featured Chaitu in multiple looks and evoked great interest. Thank You is a coming-of-age story that follows the journey of a young and successful man who is on a path to find himself. BVS Ravi has written the story while SS Thaman will be composing the music for this project.

Naga Chaitanya will be teaming up with Vikram Kumar for the second time in his career with this film. The actor-director duo is also working together on a web-series Dootha. Rashi Khanna has been roped in to play the lead role in the film. The film also stars young actors Avika Gor, Sai Sushant Reddy and Malvika Nair in key roles.

Liger team back on sets for a song shoot

0

Vijay Deverakonda’s much-awaited sports drama Liger is nearing its release and the anticipations on this project are quite high. As witnessed in the Glimpse of Liger, the makers are sparing no expense in the making of this sports action drama.

Meanwhile, a new song is being shot for the film which will be choreographed by Shazia Samji and Piyush Bhagat who are one of the most popular emerging choreographers in Bollywood. The song will be picturized on Vijay and Ananya Pandey and is will be shot on a large scale.

Liger is going to be released in a total of five languages- Telugu, Hindi, Malayalam, Kannada, and Tamil. This is the first pan-Indian film for Vijay Devarakonda and fans are having sky-high expectations of it. This sports drama revolves around Boxing and the famous boxing legend Mike Tyson is also playing a cameo in the movie.

It has been more than two years since we saw Vijay Devarakonda on the big screen. His last movie World Famous Lover got released on February 14, 2020. The movie had a pretty bad run at the box office and fans are waiting for something bigger and much more. Let’s see how Liger is going to satisfy fans.

పవన్ కళ్యాణ్ – సముద్రఖని సినిమా ప్రారంభం

0

తమిళ న‌టుడు,ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని ఓ భారీ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నారు.ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తుండటం విశేషం. త్రివిక్రమ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు సమాచారం. డైరెక్టర్ గా ఎన్నో విజయాలను అందుకున్న సముద్రఖని గతేడాది ‘వినోదయ సీతం’తో మెప్పించారు. తమిళంలో మంచి పేరున్న సహాయక నటుడు తంబి రామయ్య ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమాలో సముద్రఖని కూడా దేవుడు/సమయం పాత్రలో కనిపించాడు.

ఈ సినిమా తెలుగులో రీమేక్ కాబోతుందని ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. అంతే కాకుండాతెలుగు రీమేక్ కూడా సముద్రఖనే డైరెక్ట్ చేస్తారని, తమిళ్ లో సముద్రఖని, తంబి రామయ్య పోషించిన పాత్రలలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తారని ప్రచారం కూడా జరిగింది. కానీ ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు.

అయితే ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వూ లోసముద్రఖని తాను ‘వినోదయ సీతం’ తెలుగు రీమేక్ డైరెక్ట్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ కి పెద్ద అభిమానినని, తనలాంటి అభిమానులందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయనను డైరెక్ట్ చేస్తానన్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని ఆయన చెప్పారు.

ఈరోజు హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.జూలై 2వ వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పై విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.జీ స్టూడియోస్ & ఫార్చ్యూన్4 ప్రొడక్షన్ సహా నిర్మాతలు.

మెగాస్టార్ VS రెబల్ స్టార్

0

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అన్ని సినిమాలకిసంబంధించిన పోస్టర్స్, అప్ డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే ఉన్నారు. అందులోనే బాబీ సినిమా కూడా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే సంచలనం రేపింది. మెగా 154 అంటూ విడుదలైన ఇందులో మెగాస్టార్ లుక్ చూసి అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసారు. 2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాతలైన మైత్రీ మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

అయితే ప్రభాస్ నటిస్తున్న “ఆది పురుష్” కూడా సంక్రాంతికి విడుదల కానుంది. ఇది వరకే ఆ చిత్ర బృందం ఈ విషయాన్ని ప్రకటించింది.ఆదిపురుష్ చిత్రం రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించబడింది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ కనిపిస్తుండగా, సీతాదేవిగా కృతి సనన్,రావణుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ .. లక్ష్మణుడిగా సన్నీ సింగ్,హనుమంతుడిగా దేవ్ దత్త కనిపించనున్నారు. ‘ఆదిపురుష్’ మూవీని పూర్తిగా గ్రీన్‌ మ్యాట్ పైనే చిత్రీకరించారట. 

బాహుబలి తరువాత ప్రభాస్ సినిమా అంటే అన్ని భాషల ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం సహజమే. అందులోనూ రామాయణం అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుంది అని చెప్పారు కనుక బాస్ కి ప్రభాస్ కి మధ్య బాక్స్ ఆఫీస్ వద్ద యుద్ధం తప్పేలా లేదు.

సంక్రాంతి సీజన్ అంటే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవటం మామూలే.ఒకప్పుడు అయితే మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల అయ్యేవి. క్రమంగా అది పెద్ద రెండు సినిమాలు, మరో రెండు చిన్న సినిమాలు విడుదల కావడం అలవాటుగా మారింది. ఆసక్తికరమైన ఈ పోటీలో అనుభవంతో మెగాస్టార్ గెలుస్తాడా లేదా ఆత్మవిశ్వాసంతో ప్రభాస్ గెలుస్తాడా అనేదిచూద్దాం.