Home Blog Page 2079

డీజే టిల్లు సీక్వెల్ కు ఎందుకు పని చేయటం లేదో తెలియజెప్పిన దర్శకుడు

0

ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సినిమాల్లో డీజే టిల్లు ఒకటి. ఇందులో ప్రేక్షకులను అలరించే కామెడీ, ఆసక్తికరమైన కథాంశం, డీజే టిల్లుగా సిద్ధు జొన్నలగడ్డ నటన మరియు యాటిట్యూడ్ అందరినీ మెప్పించాయి. ఈ అంశాలు అన్నీ కలిసి సినిమాని క్లీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచేలా చేశాయి.

సినిమాకి లభించిన భారీ ఆదరణ చూసిన డీజే టిల్లు నిర్మాతలు.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రానికి సీక్వెల్‌ను ప్రారంభించారు. ఇటీవలే విడుదలైన టిల్లు స్క్వేర్ టీజర్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వచ్చింది.

అయితే డీజే టిల్లు సినిమాకి దర్శకుడైన విమల్ కృష్ణ.. సీక్వెల్ కోసం పనిచేయడం లేదు. మొదట్లో సిద్ధు, దర్శకుడు విమల్‌ల మధ్య విభేదాలు వచ్చి దర్శకుడిని మార్చేశారని వార్తలు వచ్చాయి.

అయితే దర్శకుడు విమల్ కృష్ణ డీజే టిల్లు 2లో తాను లేకపోవడానికి గల కారణాన్ని స్పష్టం చేయడం ద్వారా గాలి వార్తలు అన్నిటినీ క్లియర్ చేసారు. కాగా ఈ యువ దర్శకుడు ఒకసారి పని చేసిన పాత్ర పై మళ్ళీ చేయడానికి ఇష్టపడనని తెలిపారు. అందుకే సీక్వెల్ లో తను బాగం అవలేదని, అయితే సిద్ధూతో తన తదుపరి కలయిక తప్పకుండా కొత్త పాత్ర మరియు ఊహించని కథాంశంగా ఉంటుందని విమల్ చెప్పారు.

అలాగే ప్రస్తుతం తాను ఇతర నటీనటులు మరియు ప్రొడక్షన్ హౌస్‌లతో బిజీగా ఉన్నానని విమల్ చెప్పారు. అందుకే ఈ దర్శకుడు సిద్ధూతో కలిసి పనిచేయడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది. డీజే టిల్లు అందించిన వినోదాన్ని విమల్ – సిద్ధుల తదుపరి చిత్రం అధిగమిస్తుందని ఆశిద్దాం.

ఇక డీజే టిల్లు యొక్క సీక్వెల్‌కు టిల్లు స్క్వేర్ అని టైటిల్ పెట్టారు. ఇటీవలే విడుదలైన టీజర్‌ను ఒరిజినల్‌తో పోల్చినప్పుడు చాలా ఎక్కువ ఆహ్లాదకరమైన మరియు వినోదాన్ని అందించేలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. మొదటి భాగం కంటే మించిన పంచ్‌లు, జోకులు మరియు వినోదంతో నిండి ఉండేలా ఉందని అందరూ భావించారు. అనుపమ పరమేశ్వరన్ సీక్వెల్‌లో కథానాయికగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని మార్చి 2023లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

DJ Tillu director explains why he is not directing the sequel

0

Dj Tillu is one of the sensational movies of Tollywood in the recent past. It’s comedy, plot twists, Siddharth Jonnalagadda’s acting and attitude as DJ Tillu were praiseworthy. These elements made it a clean blockbuster.

After seeing this huge reception, makers of DJ Tillu, Sitara Entertainments have started a sequel for the movie. The teaser of Tillu Square was released recently and it got a positive response from netizens.

However the director of DJ Tillu isn’t working for the sequel. Initially there were rumours that conflicts have arised between Siddhu and Director Vimal Krishna which led to the change of Director.

Director Vimal Krishna cleared the air by clarifying the reason for his absence in DJ Tillu 2. Apparently this new age director doesn’t like to rework on the same character once again. He said that his next collaboration with Siddhu must be a new character and an unexpected storyline.

Vimal also said that he is currently busy with other actors and production houses. Hence it may take some more time for him to work with Siddhu. Hope their next film together surpasses the entertainment given by DJ Tillu.

The sequel of DJ Tillu is titled Tillu square, and the teaser has most certainly promised a lot more fun and entertainment when compared to the original, which was packed with punches, jokes, entertainment, and a lot of fun. Anupama Parameswaran is the leading lady of the sequel. The film is set to be released in March 2023.

లైగర్ ఫెయిల్ అయినా తగ్గని విజయ్ దేవరకొండ యాటిట్యూడ్

0

విజయ్ దేవరకొండ తన కెరీర్‌లోనే అత్యంత దారుణమైన డిజాస్టర్‌ను లైగర్‌తో చవి చూశారు. భారత దేశం అంతటా భారీ స్థాయిలో ప్రచారం జరిపి ఎంతో గొప్ప సినిమా అని చెప్పుకోగా.. తీరా విడుదలైన తర్వాత ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే లైగర్ పరాజయం విజయ్ ప్రయాణాన్ని అతని ఆత్మ విశ్వాసాన్ని మాత్రం ప్రభావించలేకపోయింది. ఫలితం ఏదైనా సరే ఈ లైగర్ గర్జన ఆగదు అంటున్నారు విజయ్ దేవరకొండ.

సాధారణంగా స్టార్ హీరోలు సినిమాలు ఫ్లాప్ అయినపుడు మీడియాకు దూరంగా ఉంటారు. మరియు వైఫల్యం తర్వాత వీలయినంత వరకూ సౌమ్యంగా ఉంటారు. ఇక కొందరు ఐతే విదేశాలకు వెళ్లి సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. తమ సినిమాలు ఫ్లాప్ అయితే రోజుల తరబడి బయటకు రాలేమని మహేష్ బాబు, రామ్ చరణ్ గతంలో మీడియాతో చెప్పారు.

అయితే ఇతరులకు భిన్నంగా విజయ్ దేవరకొండ ఎప్పుడూ ఆఫ్‌స్క్రీన్‌ తనదైన ప్రత్యేక వైఖరిని కలిగి ఉంటారు. అలాంటి మనస్తత్వం మరియు ప్రవర్తన అతనికి అభిమానులతో పాటు ద్వేషించేవారిని కూడా తీసుకువచ్చింది. ఈ నిర్భయ వైఖరి మెచ్చుకోదగ్గదే అని అభిమానులు భావిస్తుంటే.. ఆ ప్రవర్తన అతి అని విజయ్ మరీ ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటారని మరి కొందరు భావిస్తున్నారు.

తాజాగా ఓ మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రకారం, అతని పునరాగమనం గురించి చాలా మంది అతనిని అడిగారు. అయితే విజయ్ అందుకే తనదైన శైలిలో వారికి ప్రతిస్పందించారు. అసలు కమ్ బ్యాక్ అంటున్నారు.. నేను ఎక్కడికి వెళ్ళలేదు.. ఇక్కడే ఉన్నాను అమి అన్నారు. మొత్తంగా తాను కమ్ బ్యాక్ ఇవ్వాల్సిన అవకాశం కూడా తలెత్తదని చెప్పారు.

పైన చెప్పినట్లుగా, ఈ ప్రకటన మరియు విజయ్ మాటల్లోని ఆత్మ విశ్వాడం అతని అభిమానులచే ఆనందించబడింది. అయితే ఎన్ని దెబ్బలు తిన్నారు కూడా ఇంకా విజయ్ దేవరకొండ ఇప్పటికీ మర్యాదగా ప్రవర్తించడం నేర్చుకోలేదని ఒక వర్గం ప్రేకకులు అంటున్నారు. విజయ్ వీలయితే ముందు ఒక హిట్ కొట్టి ఆ తర్వాత మాట్లాడాలి అని వారు అభిప్రాయ పడ్డారు.

ఈ విలక్షణమైన, దూకుడు గల వైఖరిని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా మెచ్చుకున్నారు. అయినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్, చరణ్ మొదలైన వినయపూర్వకమైన స్వభావం ఉన్న తారలతో పోల్చితే హిందీ ప్రేక్షకులు. విజయ్ వైఖరిని ఇష్టపడకపోయి ఉండవచ్చని కూడా ఆయన భావించారు.

లైగర్ ఫ్లాప్ కావడానికి కూడా ఇదే కారణమని రామ్ గోపాల్ వర్మ భావించారు. కానీ తమ సినిమాల బాక్సాఫీస్ పనితీరుతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోలు ఎప్పుడూ నమ్మకంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిదనే చెప్పాలి.

Liger debacle doesn’t affect the Vijay Devarakonda ‘s off-screen attitude

0

Vijay Devarakonda has seen the worst disaster in his career with Liger. But the debacle hasn’t stopped him. The Tollywood Liger Vijay hasn’t stopped roaring.

Generally stars tend to avoid media and become meek after a failure. Some go off to foreign countries and stay away from social media. Mahesh Babu and Ram Charan said that they won’t come out of room for days if their movies are flopped.

Unlike others, Vijay Devarakonda has always maintained a special attitude off-screen. Such mindset and behavior brought him fans as well as haters. Fans feel that this fearless attitude is admirable but others feel that he is overconfident.

In a recent media outing, Vijay Devarakonda made an interesting comment. According to Vijay, many asked him about his comeback but he responded to them saying that he has always been there, hence the possibility of comeback doesn’t even arise.

As said above, this statement and tone of it is being enjoyed by his fans and haters are saying that still he hasn’t learned to behave politely. Vijay should score a hit first and talk then, they said.

This typical flamboyant attitude was appreciated by maverick director Rgv also. However he also felt that hindi audiences might not have liked this attitude in comparison to humble stars like Jr Ntr, Charan etc.

Rgv also felt that this might be the reason for Liger flop. But it is always good to see stars being confident no matter their box office performance.

సంక్రాంతి – 2023: రిలీజ్ డేట్ల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ను టెన్షన్ పెడుతున్న బాలయ్య – చిరంజీవి.

0

2023 సంక్రాంతి అత్యంత ఆసక్తికరంగా మారబోతోంది. దానికి కారణం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకేసారి విడుదల అవుతూ ఉండటమే. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించడం.

తొలుత రెండు సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది కాబట్టి రెండిట్లో ఒకే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని భావించారు. అయితే బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు ఇద్దరూ సంక్రాంతికి విడుదల చేయాలని పట్టు బట్టినప్పటి నుండి మైత్రి మూవీ మేకర్స్‌కి కష్టాలు మొదలయ్యాయి.

ఈ ఇద్దరు సీనియర్ హీరోలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ సినిమాలను సంక్రాంతి సీజన్‌లో విడుదల చేయాలని పట్టుబట్టారు. సాధారణంగా తెలుగు సినిమా మార్కెట్‌కి సంక్రాంతి సీజన్ అత్యంత గౌరవనీయమైన సీజన్ కాబట్టి ఈ సీజన్లో సినిమాలు రిలీజ్ చేయడం కోసం డిమాండ్ ఉంటూనే ఉంటుంది.

ఆదిపురుష్ ను మొదట సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు. కానీ సాంకేతిక కారణాల వల్ల వెనక్కి తగ్గారు. మైత్రీ బ్యానర్‌కి ఇది విశ్రాంతినిచ్చే విషయంగా అందరూ భావించారు. ఎందుకంటే వారు బాలయ్య మరియు చిరు నటించిన తమ రెండు సినిమాలను ఒకే సీజన్‌కు తీసుకు రావడానికి మార్గం సులువైంది.

అయితే వారికి ఇంకా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సినిమాల కోసం రెండు తాత్కాలిక విడుదల తేదీలుగా జనవరి 11 మరియు 13 ప్రస్తుతం వినిపిస్తున్నాయి. రెండు సినిమాలు మరియు ఆయా హీరోలు తమకు ప్రయోజనం చేకూర్చే విధంగా ముందు తమ సినిమానే విడుదల చేయాలనుకుంటున్నారు.

జనవరి 11న అత్యంత ముఖ్యమైన తేదీ ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ముందుగా చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా రాబోతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇంకా ఏదీ అధికారికంగా ధృవీకరించబడలేదు.

ఇదే జరిగితే బాలయ్యకు చికాకును కలిగించవచ్చు. మైత్రి బ్యానర్ తమ హీరోను రెండవ స్థానంలో విడుదల చేస్తే బాలయ్య అభిమానుల నుండి కోపంతో కూడిన ప్రతిచర్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మరి ఈ సమస్య ఎలా సర్దుకుంటుందో వేచి చూడాలి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు.

Release date tensions for Mythri movies with Balakrishna and Chiranjeevi

0

Ever since Balakrishna and Chiranjeevi movies are approaching towards a Sankranthi release, troubles have started for Mythri Movie Makers. Both the veteran heroes have insisted their movies Waltair Veerayya & Veera Simha Reddy to get released in Sankranthi season.

Sankranthi season is the most coveted season for movie market hence there is a demand for these release dates. Every year there will be fierce competition for Sankranthi releases.

Adipurush was initially supposed to be releasing for Sankranthi backed out due to technical reasons. This is a respite for mythri banner as they can bring two of their movies starring Balayya and Chiru for the same season.

But the troubles continue for them. Two tentative release dates for these movies are 11th and 13th january. Both the movies and respective heroes want early release as it will be advantage to them.

It will be interesting to see who gets the most important date which is 11th january. Sources say that Chiranjeevi’s Waltair Veerayya will be the first to come. But nothing has been confirmed yet.

If this happens then this might irk balayya, Mythri banner might have to face angry reactions from balayya fans too if their hero comes second. We have to wait how this roadblock will be settled. Time alone can answer all the questions.

సీడెడ్ బిజినెస్ లో బాలయ్యను వెనక్కి నెట్టేసిన చిరంజీవి

0

2023 సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీనియర్ నటులు సంక్రాంతి సీజన్‌లో ఇంతకు ముందే చాలా సార్లు పోటీ పడ్డారు. తమ అభిమాన హీరోల మధ్య జరిగే ఈ పోటీని చూసేందుకు ఇరు వర్గాల అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చూసుకుంటే మటుకు వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య ముందున్నాడు అనే చెప్పాలి. ఈ ఇద్దరు సూపర్‌స్టార్‌లకు బలమైనదిగా చెప్పుకునే సీడెడ్ ప్రాంతంలో బాలయ్య గత చిత్రం అఖండ ఏకంగా 15 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గతంలో చిరంజీవి నటించిన డజన్ల కొద్దీ సినిమాలు ఇదే ప్రాంతంలో ఘన విజయం సాధించాయి.

ఇక వాల్తేరు వీరయ్య.. వీరసింహారెడ్డి సినిమాలకు సీడెడ్ లో తాజాగా ఒప్పందాలు జరిగాయి. అందులో మెగాస్టార్ సినిమాకు 16 కోట్లు ఆఫర్ చేయగా, బాలయ్య ఫ్యాక్షన్ సినిమా 12 కోట్ల డీల్ మాత్రమే రాబట్టగలిగింది.

రాయలసీమ/సీడెడ్‌ ప్రాంతం బాలయ్య బలమైన స్థానంగా చెబుతుంటారు. అయినా కూడా వీరసింహారెడ్డి కంటే వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ ధరకి కొనుగోలు అవడం చిరంజీవి ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

ఇక ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక ముఖ్యమైన అతిథి పాత్ర చేయడం అలాగే చిరంజీవి మునుపటి తరహాలో కామెడీ మరియు మాస్ లుక్ వంటి అంశాలు కలగలిపి ఒక మాస్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉండటం బిజినెస్ బాగా జరగడానికి సహాయ పడ్డాయి అని చెప్పవచ్చు.

మొత్తంగా చిరు డామినేషన్‌ ఉన్నప్పటికీ బాలయ్య సినిమాను కూడా కొనుగోలు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం చూపుతున్నారు. అందుకే సగటు బాక్సాఫీస్ కలెక్షన్ల కంటే ధరలు భారీగా పెరుగుతున్నాయి.

సంక్రాంతి పండగ ప్రయోజనం అనేది కొనుగోలుదారులు తమ పెట్టుబడులను తిరిగి పొందడంలో సహాయపడవచ్చు. రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవుతాయని మరియు డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబిటర్లను సంతోషపెట్టాలని ఆశిద్దాం. ఎందుకంటే వారు దసరా నుండి నీరసమైన దశను చూస్తున్నారు కదా.

హరి హర వీర మల్లు సినిమా కోసం తీవ్రంగా కష్ట పడుతున్న పవన్ కళ్యాణ్

0

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే సినిమాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా హరి హర వీర మల్లును చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పీరియడ్ యాక్షన్ ఎపిక్ తాలూకు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో తాజా షెడ్యూల్ జరుగుతోంది.

అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. కాగా సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం పగలు మరియు రాత్రి నిరంతరం కష్టపడుతోంది. అంతే కాకుండా ఈ షెడ్యూల్‌లో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. మరియు షెడ్యూల్‌ను సకాలంలో త్వరితగతిన పూర్తి చేయడానికి ఆయన అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు.

2024 ఎన్నికల నేపథ్యంలో సినిమాలన తగ్గించి రాజకీయాల పై ఎక్కువ సమయం వెచ్చించాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్‌ను వీలైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నారట. అందుకే చిత్ర బృందం కూడా హడావుడిగా పని చేస్తూనే తగు జాగర్తలు కూడా తీసుకుంటున్నారు.

రాజకీయ కారణాల వలన ఇక పై పవన్ కళ్యాణ్ మరే కొత్త సినిమానీ అంగీకరించడం లేదు. అందువల్ల హరి హర వీర మల్లును త్వరగా పూర్తి చేసి, ఆ తర్వాత రాజకీయాలకు మాత్రమే సమయం కేటాయించడం పై ఆయన ప్రధాన దృష్టి నెలకొంది.

హరి హర వీర మల్లు నిర్మాతలు ఈ చిత్రాన్ని 2023 వేసవికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పిల్లలు మరియు కుటుంబ ప్రేక్షకులు చారిత్రక నేపథ్యం మరియు పీరియాడికల్ సినిమాల పై ఆసక్తిని కనబరుస్తారు కాబట్టి ఈ జానర్ వేసవికి సీజన్ కు సరిగ్గా సరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ రోజుల్లో ప్రేక్షకులు చారిత్రాత్మక సంఘటనల ఆధారంగా తెరకెక్కే సినిమాల పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అనుకున్న సమయానికి సినిమా విడుదలవుతుందని మరియు 17వ శతాబ్దపు భారతదేశం లో జరిగిన సంఘటనల పై ఈ చిత్రం కొంత వెలుగునిస్తుందని ఆశిద్దాం. అలా జరిగితే గనక హరి హర వీర మల్లు చిత్రం మరింత మంది ప్రేక్షకులను మరియు ప్రశంసలను పొందటం ఖాయం.

Pawan Kalyan is working so hard for Hari Hara Veera Mallu

0

Hari Hara Veera Mallu is probably the most prestigious among the upcoming movies of Powerstar Pawan Kalyan. This period action epic is being shot at brisk pace. It’s current schedule is happening at Ramoji Film City.

According to sources, a massive action episode is currently being filmed. A long schedule is underway for which the team is relentlessly striving day and night. Pawan Kalyan also involved in this hectic schedule and is toiling to get the schedule done in time.

Pawan Kalyan who is keen to spend more time on politics for 2024 elections wants to wrap up the shooting for this movie at the earliest. Hence there is a rush in the team as well. For the political reason this mega hero isn’t accepting any new movies.

Hence his primary focus is Hari Hara Veera Mallu getting done at the earliest and then solely dedicating time to politics. Obviously it is a big task to manage and balance the shooting and political meetings so he’s working very hard to meet the ends.

The production house of Hari Hara Veera Mallu is planning to release this movie for summer 2023. The genre is also ideally suited for summer as kids and families will show interest in period movies with historical background.

Nowadays people are more excited to historic events based movies. Hope the movie releases on time as planned and throw some light on 17th century India, which eventually makes it reach more audience and appreciation.

The business race for Sankranthi 2023 begins, Chiranjeevi is leading over Balakrishna in Ceeded

0

It is already know that Megastar Chiranjeevi and Nandamuri Balakrishna are locking horns for 2023 Sankranthi race. These veteran actors have competed many times during Sankranthi season. Fans and movie lovers are eagerly waiting to see this contest between their favourite heroes.

So far, Waltair Veerayya is ahead of Veera Simha Reddy in pre-release business. Ceeded is the strong area for both these superstars. Balayya’s last movie Akhanda had a massive run in Ceeded collecting more than 15 crores share. There are dozens of Chiranjeevi movies in the past that made fabulous numbers.

Deals for Waltair Veerayya & Veera Simha Reddy’s ceded territory were recently completed. Megastar movie was offered 16 crores and Balayya’s faction movie could only garner 12 crores deal.

This shows clear domination of Chiranjeevi even in the strongest zone of Balayya which is Rayalaseema – Ceeded. Waltair also being a mass entertainer with additional advantages like Raviteja doing a guest role and Chiranjeevi being in his elements like comedy and massy look.

Despite Chiru’s domination, distributors are eager to buy these movies and test their luck. Hence the prices are soaring much above than the average box office collections.

The festival advantage might help the buyers recover their investments. Hope both movies become blockbusters and make the distributors and exhibitors happy since they are seeing a dull phase since dusserah.