Home Blog Page 1879

Pushpa 2: పుష్ప 2 టీజర్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న సుకుమార్ అండ్ టీం

0

ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రేక్షకులు కూడా అత్యధిక స్థాయిలో అందరూ ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రాలలో పుష్ప 2 ఒకటి. మొదటి భాగం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది మార్కెట్‌లో కూడా భారీ విజయాన్ని సాధించింది మరియు ఈ జోరును సద్వినియోగం చేసుకోవాలని నిర్మాతలు అనుకుంటున్నారు సుకుమార్ అండ్ టీమ్ మిగతా ఇండియా మరియు ఓవర్సీస్‌లో రికార్డ్ నంబర్‌లు సృష్టించడం పై దృష్టి సారించారు. అందుకోసం యూనిట్ స్క్రిప్ట్‌లో పలు మార్పులు చేర్పులు చేస్తూ, షూట్ చేయడానికి చాలా సమయం తీసుకుంటుంది.

ప్రస్తుతం ఇండియన్ సినిమాలో మోస్ట్ ఎవైటెడ్ మూవీ పుష్ప2 అనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా కాలం క్రితం ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ అందించాలని టీమ్ ప్లాన్ చేసింది, అయితే ఫైనల్ అవుట్‌పుట్‌ దర్శకుడు సుకుమార్ కి నచ్చకపోవడంతో చివరి నిమిషంలో వారు అనుకున్న ప్లాన్‌ను నిలిపివేశారు. ఐతే తాజా నివేదికల ప్రకారం, ఈ మావెరిక్ దర్శకుడు ఇప్పుడు టీజర్‌కు సంబంధించి కొత్త ప్లాన్‌తో వస్తున్నారట.

అల్లు అర్జున్ పుట్టిన రోజు [ఏప్రిల్ 8] సందర్భంగా ఫస్ట్ లుక్ మరియు టీజర్‌ను విడుదల చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని, ఈ టీజర్ సంచలనం సృష్టించి అంచనాలను మరో స్థాయికి పెంచాలని సుకుమార్ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. కాబట్టి, ఆయన మరియు ఆయన సహాయక బృందం ఉత్తమ అవుట్‌పుట్ ఇవ్వడానికి టీజర్ యొక్క పనుల పై వారి ప్రయత్నాలన్నింటినీ మరియు భారీ డబ్బును కూడా వెచ్చిస్తున్నారు.

పుష్ప 2 కథా పరంగా ఎన్నో ఆసక్తికర మలుపులని కలిగి ఉంటుంది మరియు అల్లు అర్జున్ పాత్ర రకరకాల అసమానతలకు వ్యతిరేకంగా పోరాడే అంతర్జాతీయ నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. రష్మిక మందన మొదటి భాగం లోని శ్రీ వల్లి పాత్రలోనే నటిస్తుండగా, ఇక భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో ఫాహద్ ఫాసిల్ కూడా అదే పాత్రను కొనసాగిస్తూ ఈసారి ఎక్కువ సమయం ఉండే పాత్రలో కనిపిస్తారు. ఆయన పాత్ర అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అని అంటున్నారు. ఈ పాన్-ఇండియా సినిమా కోసం జగపతి బాబు కూడా ఒక కీలక పాత్ర కోసం ఎంపికయ్యారు.

గ్లోబల్ లెవెల్లో పుష్పరాజ్ చేసే విన్యాసాలు చూడలం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, మరి సినిమాలో టీమ్ ఏం అద్భుతాలు చేసిందో చూడాలి. ఈ చిత్రం 2024 సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అది గనక నిజమైతే ఎన్టీఆర్ 30తో ఈ సినిమా క్లాష్ అవుతుంది.

RRR Fan Wars: హాలీవుడ్‌కు చేరుకున్న ఎన్టీఆర్ – మెగా ఫ్యాన్స్ వార్

0

గత వారం హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఫిల్మ్ అవార్డ్స్‌లో టీమ్ RRR ఎన్నో అవార్డులను గెలుచుకున్న విషయం అందరికీ తెలిసిందే. రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్, సెంథిల్ కుమార్ మరియు కార్తికేయ హెచ్‌సిఎ అవార్డులతో పోజులిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే, ఈ వ్యవహారం ఎన్టీఆర్ అభిమానులలో ఒక వర్గానికి బాగా నచ్చలేదు మరియు వారి వేదన హాలీవుడ్‌కు చేరుకుంది. వారు HCA యొక్క ట్విట్టర్ హ్యాండిల్‌ను వెంబడించారు మరియు ఎన్టీఆర్‌ను మెచ్చుకోనందుకు నిందించారు. ఇక పరిస్థితులు మరింత అధ్వాన్నంగా జరుగుతున్న సమయంలో, HCA అవార్డ్స్ నైట్‌లో ఎన్టీఆర్ గైర్హాజరు కావడం పై HCA క్లారిటీ ఇచ్చింది.

అలానే తారకరత్న మృతి కారణంగా ఎన్టీఆర్ ఈ అవార్డులకు హాజరు కాలేకపోయాడని ఒక అభిమాని సూచించినప్పుడు, HCA బదులిస్తూ, “ఆయన వాస్తవానికి ఒక సినిమా షూటింగ్ చేస్తున్నారు, అందుకే ఆయన హాజరు కాలేకపోయారు. ఆయన సోదరుడు మరణించిన తర్వాత ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. ఇది ఆయన ప్రచారకర్త మాకు చెప్పారు. కాగా ఎన్టీఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం USA వచ్చిన తర్వాత ఆయనకి HCA అవార్డు ఇవ్వనున్నారు.

ఈ సినిమా కోసం అభిమానులు ఇంకా ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ దాదాపు ఏడాది కావస్తోంది. తాజాగా హెచ్‌సీఏ అవార్డుల నేపథ్యంలో ఫ్యాన్స్ వార్ హాలీవుడ్‌కు చేరుకుంది, ఎన్టీఆర్ అభిమానులు హెచ్‌సీఏ అవార్డ్స్ టీమ్‌ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు, తమ అభిమాన హీరోకి మరింత పేరు వచ్చిందని చూపించడానికి రెండు అభిమానులు ఎన్టీఆర్ గోస్ గ్లోబల్ మరియు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేస్తున్నారు. ఈ తతంగం ఎప్పుడు ముగుస్తుందో దేవుడికే తెలియాలి.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఆర్ ఆర్ ఆర్ 2022లో భారీ బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులచే ఈ సినిమా విపరీతమైన ఆదరణ పొందిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ చిత్రంలోని నాటు నాటు అనే పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌గా గోల్డెన్ గ్లోబ్‌లో అవార్డును కూడా అందుకుంది.

రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన ఈ యాక్షన్ ఎపిక్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను గెలుచుకోవడంతో దేశాన్ని మరోసారి సంతోషపరిచింది. ఈ చిత్రం ఉత్తమ యాక్షన్ చిత్రం, ఉత్తమ స్టంట్స్, ఉత్తమ పాట (నాటు నాటు), స్పాట్‌లైట్ అవార్డు మరియు ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగాలలో అవార్డులను అందుకుంది. నాటు నాటు ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ అవార్డుకు ఎంపికైనందున, ఆ అవార్డులకు ముందు ఈ చిత్రానికి HCA అవార్డులు రావడం ఒక ముఖ్యమైన విజయంగా చెప్పుకోవచ్చు.

Sukumar and Team putting crores of money for Pushpa 2 teaser

0

Pushpa 2 is one of the highly anticipated pan-India films from Tollywood. The first part was a humongous success not only in the Telugu States but also in the northern market, and the makers want to capitalize on this momentum. Sukumar and the team are focussing on creating record numbers in the rest of India and overseas. Therefore the unit is making several modifications to the script and taking extreme time to shoot.

There is no doubt that Pushpa2 is the most awaited movie in Indian cinema at present. The team had planned to deliver a glimpse of the film long back, but they halted the plan at the last minute because Sukumar was not impressed with the final output. According to the reports, the maverick director is now coming up with a new plan regarding the teaser.

It is being said that Sukumar is planning to drop the first look and teaser on the occasion of Allu Arjun’s birthday [8th April] Sukumar wants this teaser to create a sensation and raise the expectations to another level. So, he and his team are putting all their efforts and massive money on the works of the teaser to give the best output.

Pushpa 2 will transcend the boundaries and will have an international backdrop where Allu Arjun will be pitted against all odds. Rashmika Mandana will be back as Sri Valli while Fahadh Faasil will have a meatier role in Pushpa 2 as Bhanwar Singh Shekhawat and his character will surprise one and all. Jagapathi Babu has also been roped in for this pan-India biggie.

Everyone is eager to catch the exploits of Pushparaj on a global level, and it needs to be seen what the team has packed in the movie. The film will reportedly hit the screens in Summer 2024, and it will clash with NTR30 if it is true.

NTR and Mega fan wars reach Hollywood

0

It is very well known to everyone that team RRR won multiple awards at the Hollywood Critics Association film awards last week. Pictures of Rajamouli, Keeravani, Ram Charan, Senthil Kumar and Karthikeya posing with the HCA Awards went viral on social media.

However, this didn’t go down well with a section of NTR fans, and their anguish reached Hollywood. They chased the HCA’s Twitter handle and blamed it for not appreciating the NTR. Just when events were going worse, the HCA has published clarification on NTR’s absence at the HCA Awards night.

And when a fan pointed out that NTR couldn’t attend the awards due to Tarakaratna’s passing, the HCA replied, saying, “He was originally shooting a movie which is why he couldn’t attend. His brother passing happened afterwards and is why he stepped away from the movie. This is what his publicist told us (in the original).” NTR will be given his HCA statuette upon his arrival in the US for the Oscar promotions.

It’s almost one year since RRR release and the fans are still battling with each other because of this film. The latest HCA awards had the fan war reach Hollywood, with NTR fans criticizing the HCA Awards team. Now, both fandoms are trending the hashtags NTR Goes Global and Global Star Ram Charan to show that their favorite hero received more name. God knows when this drama ends.

SS Rajamouli’s film RRR, marking Ram Charan and Jr NTR, turned up as one of the massive blockbusters in 2022. The global film community acknowledged the film after winning raving reviews from its audience and quickly becoming a worldwide sensation. The film’s song Naatu Naatu also bagged an award at The Golden Globe for Best Original Song.

This Action Epic starring Ram Charan and NTR has once again made the country glad as it has won multiple of the Hollywood Critics Association Awards. The film nailed awards for Best Action Film, Best Stunts, Best Song (Naatu Naatu), Spotlight Award, and Best International Film categories. This is an important achievement for the film before the Oscars in 2023, as Naatu Naatu is up for Best Original Song.

Leo: ఓవర్సీస్ లో మునుపెన్నడూ లేని ఆఫర్స్ తెచ్చుకుంటున్న లోకేష్ – విజయ్ ల లియో

0

విక్రమ్‌తో యువ దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ భారీ బ్రాండ్‌ క్రియేట్‌ చేసుకున్నారు. సహజంగానే, విక్రమ్ ఘనవిజయం తర్వాత, దర్శకుడు ఎల్‌సియుని (LCU) ఎలా ముందుకు తీసుకువెళతారనే దాని పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తమిళ సినిమా నంబర్ వన్ హీరో అయిన విజయ్ తో యాక్షన్ థ్రిల్లర్ ‘లియో’ కోసం జతకట్టారు.

కాగా ఈ కాంబో వల్ల సినిమాకి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తూ ఇప్పటికే రికార్డులు సృష్టించింది. ఇప్పుడు థియేట్రికల్ రైట్స్ కోసం నిర్మాతలు భారీ ఆఫర్లను పొందడం ప్రారంభించారు. ఇటీవలే విడుదల అయిన ఫస్ట్ లుక్ సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేయడంతో విజయ్ అభిమానులు ఈ సినిమా విక్రమ్ స్థాయిలో ఉంటుందని ఆశిస్తున్నారు.

కాగా ఈ లియో సినిమాకి ఓవర్సీస్ ప్రాంతాలలో.. డిస్ట్రిబ్యూటర్లు 70 – 75 కోట్లకి స్థాయిలో బిజినెస్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇది భారీ సంఖ్య అనే చెప్పాలి. తమిళ సినిమాలకి మార్కెట్ ఓవర్సీస్‌లో విపరీతంగా ఉంది మరియు అన్నీ సవ్యంగా సాగితే తమిళ సినిమాలు $15 మిలియన్ కంటే ఎక్కువ వసూలు చేయగలవు. ఇటీవల, మణిరత్నం యొక్క PS1 $ 20 మిలియన్లకు పైగా వసూలు చేసింది కాబట్టి ఈ సినిమాకి మంచి టాక్ వస్తే రికార్డు స్థాయిలో వసూళ్లు ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న లియోలో విజయ్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, సంజయ్ దత్, మాథ్యూ థామస్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ మరియు శాండీ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.

Vijay – Lokesh’s Leo is getting never-before price offers for overseas

0

Lokesh Kanagaraj has created a huge brand with Vikram. Naturally, after the massive success of Vikram, all eyes are now on how the director would take LCU ahead. Now, Lokesh is tying up with Vijay for the action thriller ‘Leo’ who is undoubtedly no1 leading star of Tamil cinema.

This combo is creating a sensation in terms of business nontheatrical businesses and has already created records. Now the makers have started getting big offers for theatrical rights. The recently released first look has managed to create massive buzz for the film and fans are expecting something in the range of Vikram.

For overseas territories, distributors are offering in the range of 70Cr – 75Cr which is massive. The Tamil market is huge overseas and Tamil films can manage to collect more than $15 Million if everything goes well. Recently, Mani Ratnam’s PS1 has collected more than $20 Million so it’s just a matter of good talk.

The Lokesh Kanagaraj directorial Leo stars Vijay in the titular role, while Sanjay Dutt, Mathew Thomas, Mysskin, Gautham Vasudev Menon, Arjun Sarja, Mansoor Ali Khan, Priya Anand, and Sandy will be seen in other crucial roles. The film will hit theaters on October 19 this year.

Dasara: దసరా కూడా బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ లాగా సంచలనం సృష్టిస్తుందని ఆశిస్తున్న నాని

0

నాని నటించిన దసరా సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది మరియు రోజురోజుకూ ఈ సినిమా పైన అంచనాలు పెరుగుతున్నాయి. అద్భుతమైన పాజిటివ్ బజ్ మధ్య విడుదలవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు. ఓవరాల్‌గా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 34 కోట్ల బిజినెస్ చేయగా, ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల బిజినెస్ చేసింది.

ఇక దసరా పై హీరో నాని చాలా అంచనాలు పెట్టుకున్నారు మరియు సినిమా చూసిన తర్వాత ఆయన చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రం తనకు తెలుగులోనే కాకుండా పాన్-ఇండియా స్థాయిలో కూడా బిగ్గెస్ట్ బ్రేక్ ఇస్తుందని నాని నిజంగా ఆశిస్తున్నారు. అలానే ఈ సినిమాను అన్ని భాషల్లో ప్రమోట్ చేసేందుకు దసరా టీమ్ సన్నాహాలు చేస్తోంది.

ఇక అనుకున్నట్లు ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తే అలా జరిగే అవకాశాలు ఎక్కువే ఉంటాయి. ఎందుకంటే కంటెంట్ బాగుంటే, ఏ సినిమా అయినా పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయగలదు. బాహుబలి, KGF, పుష్ప మరియు ఇటీవల కాంతార అక్షే కార్తికేయ 2 వంటి చాలా ఉదాహరణలు మనం చూశాము, అవి స్టార్ పవర్ లేకపోయినా, అద్భుతమైన వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే.

నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరాలో ప్రధాన పాత్రలో నానితో పాటు ఆయనకి జోడీగా కీర్తి సురేష్ నటించగా, సాయి కుమార్ మరియు షైన్ టామ్ చాకో తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తెలంగాణలోని గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మార్చి 30, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నారు.

Sreeleela: మరో భారీ ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకున్న నటి శ్రీలీల

0

ప్రస్తుతం తెలుగు సినిమాలో అత్యధిక డిమాండ్ ఉన్న నటిగా యువ నటి శ్రీలీల ఒకరని చెప్పొచ్చు. ఆమె తొలి సినిమా పెళ్లి సందడి విజయంతో ఆమెకు మంచి డిమాండ్ ఏర్పడింది మరియు మాస్ మహారాజా రవితేజతో చేసిన ధమాకాలో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డ్యాన్స్‌లు ఆమెను విపరీతమైన స్టార్‌డమ్‌కు నడిపించాయి.

ఇక త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు యొక్క SSMB 28 లో అవకాశం చేజిక్కించుకోవడమే కాకుండా, ఆమె అనేక భారీ ప్రాజెక్ట్‌లకు సంతకం చేస్తున్నారు మరియు ఇతర కథానాయికలను సునాయాసంగా దాటేస్తున్నారు.

శ్రీలీల ఇటీవల బాలకృష్ణతో ఒక చిత్రానికి సంతకం చేసారు. ఇక ఈ ప్రాజెక్ట్ తర్వాత, ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్‌ యొక్క ప్రాజెక్ట్ కు సంతకం చేసినట్లు తెలుస్తొంది. హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబో ఇప్పటికే గొప్ప ప్రభావాన్ని సృష్టించింది మరియు శ్రీలీల ఈ ప్రాజెక్ట్‌లో చేరడంతో, ఈ సినిమా క్రేజ్‌ బాగా పెరిగిపోతుంది అనే చెప్పాలి.

కెరీర్ ప్రారంభ దశలో సూపర్ స్టార్ మరియు పవర్‌స్టార్‌లతో సినిమాలు చేయడం ఖచ్చితంగా శ్రీలీల కెరీర్‌కు గొప్ప ప్రోత్సాహాన్ని ఇవ్వబోతున్నాయి మరియు రాబోయే రోజుల్లో ఈ యువ నటి ఫిల్మోగ్రఫీలో చేరే అనేక ఉత్తేజకరమైన ప్రాజెక్ట్‌ల గురించి మనం ఖచ్చితంగా వింటాము. ఆమె తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు శాండల్‌వుడ్‌లో కూడా పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు మరియు ఈ వ్యూహం ఫలించి ఆమెకు మరిన్ని ఆసక్తికరమైన సినిమాలు రావాలని కోరుకుందాం.

Bichagadu 2: విడుదల తేదీని లాక్ చేసిన సంచలనాత్మక బ్లాక్ బస్టర్ సీక్వెల్ బిచ్చగాడు 2

0

సంచలనాత్మక బ్లాక్ బస్టర్ బిచ్చగాడు 2 విడుదల తేదీ ఖరారు అయింది. బిచ్చగాడు (2006)తో తెలుగు ప్రేక్షకుల విపరీతమైన తెచ్చుకున్న నటుడు మరియు దర్శకుడు విజయ్ ఆంటోనీ, దాని సీక్వెల్ బిచ్చగాడు 2 (తమిళంలో పిచైక్కారన్ 2)తో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్నారు.

https://twitter.com/GskMedia_PR/status/1630187418266763268?t=Ou63G3Cdsace0auFZuDFZg&s=19

ఈ చిత్రం ఏప్రిల్ 14, 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతుందని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అంటే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సమంత యొక్క శాకుంతలంతో ఢీకొంటుంది అన్నమాట. శాకుంతలం సినిమా పీరియాడిక్ జానర్ కారణంగా విపరీతమైన క్రేజ్ కలిగి ఉంది, అయితే విజయ్ ఆంటోని చిత్రం కూడా పోటీలో ఏమాత్రం తక్కువ కాదనే చెప్పాలి.

ఎందుకంటే బిచ్చగాడు మొదటి భాగం తమిళ నాట కంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది మరియు ప్రస్తుతం ప్రేక్షకులు సీక్వెల్ అంటే ఇష్టపడుతున్నందున ఈ సీక్వెల్ ఖచ్చితంగా తెలుగు మరియు తమిళంలో మంచి హైప్ కలిగి ఉంటుంది.

విజయ్ ఆంటోనీ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్‌లో హరీష్ పేరడి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో పాటు ఈ సినిమాకి హీరో అయిన విజయ్ ఆంటోనీ ఈ చిత్రానికి సంగీతం కూడా అందించారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌ పై ఆయన భార్య ఫాతిమా విజయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Sensational Blockbuster Sequel Bichagadu 2 locks the release date

0

The Sensational Blockbuster Bichagadu 2 locks its release date. Actor and director Vijay Antony, who received super craze with Bichagadu (2006), is all set to entertain audiences again with its sequel Bichagadu 2 (Pichaikkaran 2 in Tamil). Kavya Thapar is the female lead in this most awaited film.

https://twitter.com/GskMedia_PR/status/1630187418266763268?t=xZ6qnyYxt71NpoR6GQGYgQ&s=19

The makers of the film have officially announced that the movie will release in the theaters worldwide on April 14, 2023. It means the film will clash with Samantha’s Shaakuntalam at the box office. Shakuntalam has massive craze because of its genre, but Vijay Antony’s film is also not any less in competition.

Because the first part Bichagadu created a sensation in Telugu States by receiving collections more than Tamil and now this sequel will definitely have a good hype in Telugu and Tamil as audience nowadays likes the sequels.

Directed by the actor himself, the sequel has Hareesh Peradi in a key role. Apart from direction, the actor also composed music for the movie. His wife Fathima Vijay produced this film under Vijay Antony Film Corporation banner.