రంగస్థలం తర్వాత సుకుమార్ , మహేష్ ఇద్దరు కలయిక లో సినిమా చేయాలనుకున్నారు , కానీ అనేక కారణాల వల్ల పట్టాలెక్కలేదు . ఐతే ఇప్పుడు వున్నా పరిస్థితి లో ఇది మహేష్ కి మంచి చేసింది అనే చెప్పొచ్చు. మహర్షి తర్వాత మహేష్ బాబు , సుకుమార్ తో సినిమా కి కమిట్ అయ్యాడు . సుకుమార్ ఒక సంవత్సరం అంత ఏ సినిమా కి కమిట్ అవ్వకుండా ఏ స్క్రిప్ట్ మీదే వర్క్ చేసాడు . కానీ మహేష్ కి స్క్రిప్ట్ అంతగా నచ్చలేదు ఇంకా మార్పులు చెయ్యమని చెప్పాడు , అలాగే మహేష్ కి ఇంకో ఆలోచన కూడా వచ్చింది వరుసగా సీరియస్ సబ్జక్ట్స్ చేస్తున్నాను , ఒక ఎంటర్టైనర్ చేస్తే బాగుంటుంది అనిపించింది . దీనితో వెంటనే అనిల్ రావిపూడి ని పిలిపించి కథ విన్నాడు , ఆ కథ వెంటనే నచ్చడం తో అనిల్ రావిపూడి కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు , విషయం తెలిసిన సుకుమార్ వెంటనే బన్నీ ని కలిసి సినిమా అనౌన్స్ చేసేసాడు . ఇలా ఇద్దరు వేరు వేరు ప్రాజెక్ట్స్ చేసుకోవాల్సి వచ్చింది .
ఐతే డెసిషన్ మహేష్ కి చాల ప్లస్ అయ్యింది. రావిపూడి కాబట్టే సినిమా ని సంక్రాతి కి రిలీజ్ చేసుకోగలిగారు , అదే సుకుమార్ లేదా ఇంకా ఏ డైరెక్టర్ ఐన ఏప్రిల్ లేదా మే లో రిలీజ్ ప్లాన్ చేసుకునే వాళ్ళు , ఇప్పుడు వున్నా పరిస్థితి లో సినిమా రిలీజ్ చేసే అవకాశం లేదు అలాగే థియేటర్స్ ఓపెన్ అయ్యాక జనాలు ఇంతకముందు ల వచ్చే అవకాశం కూడా లేదు . అనిల్ రావిపూడి తొందరగా సినిమా తీయడమే కాకుండా మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద హిట్ ఇచ్చి అందరికి లాభాలు చేకూర్చాడు . ఇప్పుడు మహేష్ ఏ సినిమా ఇంకా మొదలు పెట్టలేదు , ఇప్పుడు వున్నా పరిస్థితి ల ప్రకారం బడ్జెట్ ని తగ్గించడానికి ముందే ప్లాన్ చేసుకొని షూటింగ్ కి వెళ్ళవచ్చు . మహేష్ తీసుకున్న డెసిషన్ ఏ మహేష్ కి చాల మేలు చేసింది అని చెప్పడం లో ఎలాంటి ఆతిశయోక్తి లేదు