HomeMovie News'తుడరుమ్' ఓవరాల్ కలెక్షన్స్ : బిగ్ బ్లాక్ బస్టర్

‘తుడరుమ్’ ఓవరాల్ కలెక్షన్స్ : బిగ్ బ్లాక్ బస్టర్

- Advertisement -

మలయాళ స్టార్ నటుడు మోహన్లాల్ హీరోగా శోభన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా తుడరుమ్. ఈ సినిమా ఇటీవల థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ ని భారీ కలెక్షన్ ని అందుకుంది.

అంతకు ముందు పృథ్విరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఎంపురాన్ మూవీతో పెద్ద విజయం అందుకొని మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు మోహన్ లాల్.

ఇక తాజాగా తుడరుమ్ మూవీ కూడా భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఆయన ఖాతాలో మరొక విజయం నమోదయింది. యువ దర్శకుడు తరుణ్ మూర్తి తెరకెక్కించిన ఈ సినిమా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద రూ. 230 కోట్లు కొల్లగొట్టి అటు కేరళలో రూ. 119 కోట్ల గ్రాస్ ని అనగా రూ. 50 కోట్ల షేర్ ని అందుకున్న తొలి మూవీగా నిలిచింది.

మరోవైపు ఓవర్సీస్ లో ఈ సినిమా 11 మిలియన్ల డాలర్లు అనగా రూ. 93. 5 కోట్ల కలెక్షన్ అందుకొని సెన్సేషనల్ గా దూసుకెళ్లింది. ఆ విధంగా ఓవరాల్ గా మలయాళ సినిమా చరిత్రలో మంజుమ్మేల్ బాయ్స్, ఎంపురాన్ మూవీస్ అనంతరం అత్యధిక కలెక్షన్ అందుకున్న మూవీగా తుడరుమ్ బ్లాక్ బస్టర్ రికార్డుని నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories