కరోనా వల్ల సినిమా వాళ్ళు ఎంత నష్టపోయారా అందరికి తెలిసిందే , థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు , షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో తెలీదు . ఈ పరిస్థితులకి భయపడి కొంత మంది నిర్మాతలు ఇంకా ఎక్కువ కాలం ఎదురు చూడకుండ OTT ప్లాటుఫార్మ్స్ కి అమ్మేయాలని చూస్తున్నారు . ఆలస్యం అయ్యే కొద్దీ తెచ్చిన అప్పులకి వడ్డీలు పెరగడం తప్ప ఎం లాభం లేదని ఎంత వస్తే అంత తొందరగా బయట పడాలని చూస్తున్నారు , ఈ విషయం గురించే థియేటర్ ఓనర్స్ వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పటికే సినిమా బిజినెస్ లేక లాస్ లో వున్నా థియేటర్స్, OTT రిలీజ్ అనేది భయానికి గురి చేస్తుంది . లొక్డౌన్ తర్వాత థియేటర్స్ ఓపెన్ చేసిన ఇంతకముందుల జనాలు వస్తారో రారో తెలీదు , ఇప్పటికే OTT కి చాల క్రేజ్ వచ్చేసింది , ఇంకా సినిమాలు OTT రిలీజ్ చేస్తే జనాలు థియేటర్స్ కి రావడమే మానేస్తారు . ఇప్పుడు వున్నా పరిస్తతి లో అసలు OTT కి సినిమాలు అమ్మకూడదు అనే రూల్ పెడితే తప్ప థియేటర్స్ లో సినిమాలు రన్ అయ్యే పరిస్థితి లేదు . జనాలకి సినిమాలు చూడాలంటే థియేటర్స్ కాకుండా ఇంకో ఆప్షన్ ఇవ్వకూడదు , అప్పుడే థియేటర్స్ నిలబడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే థియేటర్స్ లో రిలీజ్ చెయ్యాలనుకుంటే OTT లో రిలీజ్ చేయొద్దు లేదా డైరెక్ట్ గ OTT లోనే రిలీజ్ చేసుకోండి . నా సినిమా , నేను బాగుంటే చాలు అనుకుంటే మీరే జనాలని థియేటర్స్ కి దూరం చేసిన వాళ్ళు అవుతారు .
కరోనా ముందు కూడా మనం చూసాం OTT వాళ్ళ సినిమాలు ఎంత ఎఫెక్ట్ అయ్యాయో , మంచి టాక్ తో కూడా వీకెండ్ తర్వాత నిలబడని సినిమాలు ఎన్నో వున్నాయి . ఇంకా ఇప్పుడు వున్నా పరిస్థితి లో డిజిటల్ కి సినిమాలు అమ్మేస్తే జనాలు థియేటర్స్ కి ఎందుకు వస్తారో అని ఒకసారి ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించాలి . దీనికి హీరోస్ , డైరెక్టర్స్ ,ఆర్టిస్ట్స్ , టెక్నిషన్స్ సహకారం ఎంతో అవసరం , తమ రెమ్యూనరేషన్స్ తగ్గించుకుంటే నిర్మాత కి ఎంతో మేలు జరుగుతుంది , లాభాల్లో షేర్ లు తీసుకునేలా ఉండాలి కానీ ఎవరు ఎలాపోయిన మా డబ్బులు మాకు కావాలి అనుకుంటే మీ సినిమాలు చూడడానికి థియేటర్స్ లో ఎవరు జనాలు లేని పరిస్థితి వస్తుంది . బడ్జెట్ తగ్గిస్తే ప్రొడ్యూసర్ కి డిజిటల్ రైట్స్ అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు అప్పుడు జనాలకి సినిమాలు చూడాలంటే థియేటర్స్ తప్ప ఇంకో ఆప్షన్ ఉండదు , సినిమాలు కూడా ఎక్కువ రోజులు థియేటర్స్ లో నడిచే అవకాశాలు ఉంటాయి అలాగే జనాలని కూడా థియేటర్స్ కి దూరం చెయ్యకుండా వుంటారు . ఈ పరిస్థితి మారే వరకు అయిన ఇది చెయ్యక తప్పదు . అలాగే థియేటర్స్ వాళ్ళు కూడా జనాలకి ఎలాంటి ఇబ్బంది భయం లేకుండా తగిన జాగ్రత్త లు తీసుకోవాలి , అప్పుడే జనాలు థియేటర్స్ కి వస్తారు దీనిలో థియేటర్స్ వాళ్ళు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ఇండస్ట్రీ అంత బాధ పడాల్సి వస్తుంది , సినిమా మార్కెట్ పడిపోతుంది .
థియేటర్స్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్స్ వుంటారు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటేనే ప్రొడ్యూసర్స్ వుంటారు , ప్రొడ్యూసర్స్ ఉంటేనే హీరోస్ , టెక్నిషన్స్ , డైరెక్టర్స్ , సినిమా ఉంటుంది . ఈ పరిస్థితి లో లాభం అయిన నష్టం అయిన అందరు కలిసి పంచుకుంటేనే ఇండస్ట్రీ నిలబడుతుంది . OTT కోసమే సినిమాలు చేసుకుంటే అక్కడే రిలీజ్ చేసుకోండి , లేదు థియేటర్స్ లో జనాలు సినిమాలు చూడాలనుకుంటే థియేటర్స్ లోనే రిలీజ్ చెయ్యండి ఆన్లైన్ ప్లాటుఫార్మ్స్ లో కాదు , ఈ కరోనా నుండి బయట పడేవరకు అయిన సినిమా ని డిజిటల్ రైట్స్ అమ్మకుండా ఉంటే అందరికి మంచిది . ఆన్లైన్ ప్లాటుఫార్మ్స్ థియేట్రికల్ షేర్స్ ని , థియేటర్స్ ని తినేస్తాయి. ఇప్పుడు వున్నా పరిస్తతి లో ఇంకా ప్రభావం ఎక్కువ ఉంటుంది , మీరే జనాల్ని థియేటర్స్ కి దూరం చేయొద్దు .